ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి రూ.6,000 కోట్ల ఐపీఓ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో తొలి సాధారణ బీమా కంపెనీ త్వరలో లిస్ట్‌కానుంది. బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ జాయింట్ వెంచర్ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు తలపెట్టిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) సెప్టెంబర్ 15న మొదలుకానుంది. ఆఫర్ సెప్టెంబర్ 19న ముగుస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపింది.
ఇష్యూ ప్రారంభానికి ఐదు రోజుల ముందుగా ఇష్యూ ప్రైస్‌బ్యాండ్‌ను ప్రకటించనున్నట్లు బ్యాంక్ వివరించింది. ఐసీఐసీఐ బ్యాంక్, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్ ఐపీఓలో 8.62 కోట్ల షేర్లను విక్రయించనున్నది. ఈ ఆఫర్‌కు గతవారమే సెబీ అనుమతి లభించగా, ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూఇండియా అష్యూరెన్స్, జీవితబీమా కంపెనీలైన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్‌లు ఐపీఓల జారీకి సిద్ధంగా వున్నాయి.