
ఇలా అయితే కష్టం కదండీ!
సర్వే
రకరకాల విషయాల్లో, ఉద్యోగ బాధ్యతల్లో స్త్రీలు జాగ్రత్తగా ఉన్నా.. తమ ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐసిఐసిఐ లంబార్డ్ ఆన్‌లైన్ సర్వే చెబుతుంది. కేవలం 39 శాతం మంది మహిళలు మాత్రమే వివిధ హెల్త్‌ఇన్సూరెన్స్ పాలసీలలో కవర్ అవుతున్నారు. కానీ వాళ్లలో 53 శాతం దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. 16 శాతం మంది మహిళలు ఎలాంటి ఆరోగ్యపరీక్షలకు హాజరు కావడం లేదు.
63 శాతం మంది మాత్రం ఆరోగ్యపరిస్థితి బాగ లేనప్పుడు మాత్రమే పరీక్షలకు హాజరవుతున్నారు.