
రొమ్ము ఇన్ఫెక్షన్ అనేది స్త్రీ స్తనములలో చీముతో కూడిన బాధాకరమైన నొప్పిని రొమ్ము అబ్సెస్(Breast Abscesses) అంటారు. రొమ్ము గడ్డలు మాస్టిటిస్ యొక్క సాధారణ పరిణామం. మాస్టిటిస్ అనేది రొమ్ములలో వాపు మరియు నొప్పిని కలిగించే ఇన్ఫెక్షన్. పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఈ పరిస్థితికి గురౌతారు.
రొమ్ము గడ్డలకు కారణం
రొమ్ము గడ్డలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి:
మాస్టిటిస్ అని పిలువబడే రొమ్ము ఇన్ఫెక్షన్లు రొమ్ము చీముకు అత్యంత సాధారణ కారణం. మాస్టిటిస్ అనేది రొమ్ము కణజాలాన్ని, ముఖ్యంగా పాల నాళాలు మరియు గ్రంథులను ప్రభావితం చేసే ఒక తాపజనక పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో సంభవిస్తుంది.
చనుమొన నొప్పి లేదా పగిలిన చనుమొన ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఎక్కువగా తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గడ్డలుఏర్పడతాయి.
ఏదైనా మచ్చల కారణంగా కూడా చనుమొన నాళాలు మూసుకుపోయినప్పుడు రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు.
రొమ్ము అబ్సెసెస్ లక్షణాలు
స్తనముల వాపు, బాధాకరమైన నొప్పి,
వేడిగా ఉన్న రొమ్ము, చనుమొన నుండి చీము లేదా స్రావం కారడం,
తలక్రిందులుగా ఉన్న చనుమొనలు, చలి,
వికారం మరియు వాంతులు,
అధిక శరీర ఉష్ణోగ్రత లేదా జ్వరం మొదలగునవి వుంటాయి.
రొమ్ము అబ్సెసెస్ నిర్ధారణ
రోగి చరిత్ర
వైద్యులను సందర్శించి నపుడు సాధారణంగా లక్షణాలను రొమ్ము నొప్పి, వేడి, ఎరిథెమా (చర్మం ఎర్రగా మారడం) మరియు రొమ్ములలో వాపును కూడా డాక్టరుకు తెలియచేయాలి తల్లిపాలు ఇచ్చే సమాచారాన్ని తెలియచేయాలి.
వైద్యుడు గతంలో ఏవైనా రొమ్ము ఇన్ఫెక్షన్లు మరియు వాటి చికిత్స గురించి కూడా విచారిస్తారు.మధుమేహం వంటి వైద్య చరిత్రను వైద్యుడికి తెలియజేయాలి.
క్లినికల్ పరీక్ష
వైద్యుడు రోగ నిర్ధారణ చేయడానికి శారీరక పరీక్షను చేస్తారు. వైద్యుడు రొమ్ములో చీము ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి గడ్డ యొక్క ఆస్పిరేషన్ నిర్వహించబడుతుంది. అటువంటి సందర్భంలో, రొమ్ము గడ్డలు చీముతో నిండి ఉందో లేదో చూడటానికి వాపు ఉన్న ప్రదేశంలోకి ఒక సూదిని చొప్పించబడుతుంది.
అసౌకర్యం మరియు వాపు చీము వల్ల సంభవిస్తాయో లేదో నిర్ధారించడానికి వైద్యుడు రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్‌ను కూడా సిఫారసు చేయవచ్చు.
రొమ్ము అబ్సెసెస్ చికిత్స
ఇంటి నివారణలు: ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము కణజాలానికి వెచ్చని మరియు తేమతో కూడిన కంప్రెస్‌లను ఇవ్వవచ్చు.
ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము నుండి చీము కారుతున్నట్లయితే, స్త్రీలు బ్రాను ధరించే ముందు చనుమొనను సున్నితంగా కడిగి, గాలికి ఆరనివ్వాలి
వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రొమ్ములపై 10-15 నిమిషాలు ఐస్ లేదా కోల్డ్ ప్యాక్‌ను ఉంచవచ్చు. తల్లి పాలిస్తున్నటువంటి స్త్రీలైతే పాలు ఇచ్చే సమయం లో మధ్య విరామాలలో ఇలా చేయండి : పాలు తాగేటప్పుడు బయటి అంచు నుండి చనుమొన వరకు రొమ్మును మసాజ్ చేయండి, ఇది పాల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు అడ్డుపడే పాల నాళాలను తొలగించడానికి సహాయపడుతుంది.
మందులు
పారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులతో నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ మందులు పాలిచ్చే తల్లులు తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. రొమ్ము గడ్డలు నివారించడానికి ముందు లేదా తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చు.
చికిత్స
రొమ్ము చీముకు ప్రాథమిక చికిత్స ఏమిటంటే, రొమ్మును నుండి చీమును తొలగించడం.
వైద్యుడు చీమును తొలగించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:
సూది ద్వారా చిమును బయటకు తీయడం. ఈ పద్ధతిలో, లక్ష్య ప్రాంతంలోకి ఒక సూదిని చొప్పించి, చీమును బయటకు పీలుస్తారు.
కోత ద్వారా చీమును బయటకు పంపడం: ఇందులో ద్రవంతో నిండిన గడ్డపై చిన్న కోత చేసి దానిని పూర్తిగా బయటకు వచ్చేలా చేయడం జరుగుతుంది.
- L. ఉమాపతి MA PGDHE
(Dr. MGR MU) Chennai
విశ్రాంత డెమో వైద్య ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment