breast
-
తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి బ్రెస్ట్ ఇంప్లాంట్..!
ఇంతవరకు మహిళలు తమ అందం కోసం లేదా ఇతర కారణాల వల్ల బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంటుంది. కానీ ఇలా ఓ మనిషి ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఓ వ్యక్తికి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియను నిర్వహించారు. ఇంతకీ ఎందువల్ల ఇలా చేశారు ఏంటీ ? తదితరాల గురించి చూద్దాం! అమెరికాలో సెయింట్ లూయిస్‌కు చెందిన 34 ఏళ్ల డేవీ బాయర్ తనకున్న చెడు అలవాట్ల కారణంగా రెండు ఊపిరితిత్తులు దారుణంగా పాడైపోయాయి. ఎంతలా అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురై చీముతో నిండి ఉన్నాయి. అతడు 21 ఏళ్ల వయసు నుంచే రోజూకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగేసేవాడు. ఆ దురఅలవాటే అతడి ఊపిరితిత్తులను పూర్తిగా హరించేశాయి. చివరికి తీవ్రమైన ఫ్ల్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పలు వైద్య పరీక్షలు చేయగా అతని ఊపిరితిత్తులు దారుణంగా పాడైనట్లు గుర్తించారు. దీంతో ఎంత వరకు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని ఎక్స్‌రే తీసి చూడగా..ఇంకేమి మిగిలి లేదని తేలింది. ఆ ఊపిరితిత్తులు పూర్తిగా ద్రవంలా మారిపోవడం ప్రారంభించాయని గుర్తించారు. దీంతో అతడికి తక్షణమే ఊపిరితిత్తుల మార్పిడి చేయక తప్పదని నిర్ణయించారు వైద్యులు. ఇదొక్కటే మార్గమని లేకపోతే ప్రాణాలతో రక్షించటం అసాధ్యమని అతనికి తెలిపారు. అతని ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేలా రెండు ఊపిరితిత్తులను తొలగించి కృత్రిమ ఊపిరితిత్తులను (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ లేదా ECMO, అవసరమైన వారికి శ్వాసకోశ మద్దతులో భాగంగా) ఉపయోగించారు. అదే టైంలో అతని గుండె పదిలంగా ఉండి సజీవంగా ఉండాలంటే..ఛాతీ కుహరంలో డీడీ బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయక తప్పలేదు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..అతని ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సదుపాయంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
ఏపీలో మొదలైన మొదటి తల్లిపాల బ్యాంక్
-
పాలు ఇవ్వడంలో ఇబ్బంది... ఏం చేయాలి?!
సందేహం నాకు ఈ మధ్యనే బిడ్డ పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. అయితే నాకు పాలివ్వడంలోనే సమస్యగా ఉంటోంది. కుడివైపు ఓకే కానీ ఎడమవైపు స్తనం నుంచి అస్సలు పాలు రావడం లేదు. అలా ఎందుకవుతోంది? ఏదైనా సమస్య ఉందంటారా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? - చంద్రకళ, మెయిల్ సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ములో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ రొమ్ము మొనను (నిపుల్) చీకడం మొదలు పెట్టిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ మరింతగా విడుదలై పాల ఉత్పత్తిని మరింతగా ప్రేరేపించి, వాటిని నిపుల్ ద్వారా బయటకు పంపిస్తుంది. పైన చెప్పిన హార్మోన్స్, బిడ్డ చీకడం, మానసిక, శారీరక ప్రశాంతత అన్నీ సరిపడా ఉన్నప్పుడు, బిడ్డకు సరిపడా పాలు చక్కగా వస్తాయి. మీకు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు రావట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పరిశీ లించాలి. కొంతమందిలో నిపుల్పైన ఉన్న రంధ్రాలపై పొక్కు కట్టి, మూసుకుపోతాయి. అలాంటప్పుడు పొక్కులను తడిబట్టతో మెల్లిగా తీసేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపే పాలు వస్తున్నాయని, అటే బిడ్డకు పాలు ఇస్తూ పోతే, ఇటువైపు ప్రేరేపణ లేకపోవడం వల్ల కూడా రాకపోవచ్చు. కాబట్టి ఈసారి బిడ్డ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మొదట పాలు రాని రొమ్మును శుభ్రం చేసి పట్టిస్తే, బిడ్డ చీకే కొద్దీ, అది ప్రేరేపణకు గురై పాలు మెల్ల మెల్లగా రావడం మొదలవుతుంది. అయినా రాకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. నా వయసు 22. నాకిప్పుడు నాలుగో నెల. నా సమస్య అంతా బరువుతోనే. నా ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 72 కిలోలు. ఇంత బరువు ఉంటే ప్రసవం తేలికగా జరగదని, చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు బరువు ఎలా తగ్గాలి? వ్యాయామాలవీ చేస్తే కడుపులో బిడ్డకు ఇబ్బంది రాదా? చాలా భయంగా ఉంది. సలహా ఇవ్వండి. - వి.మృదుల, విశాఖపట్నం సాధారణంగా అయిదున్నర అడుగుల ఎత్తుకు 50-55 కిలోల బరువు ఉంటే సరిపోతుంది. మీరు 72 కిలోల బరువు ఉన్నారంటే, ఉండాల్సిన దాని కన్నా, అంటే దగ్గర దగ్గరగా 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నారు. బరువు తగ్గి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు నాలుగో నెల కాబట్టి భయపడి చేసేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ, పొట్ట పైకి వచ్చే కొద్దీ.. తినడానికి, కూర్చోడానికి, మాట్లాడటానికి, నడవడానికి ఆయాసం వస్తుంది. గాలి తీసుకోవడానికి ఇబ్బంది. పడుకోవడానికి, ఒకవైపు నుంచి మరోవైపుకు తిరగడానికి ఇబ్బంది. నడుము నొప్పి, కాళ్లవాపులు, తిన్నది గొంతులోనే ఉన్నట్లుండటం వంటి ఇబ్బందులతో పాటు బీపీ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం కూడా జరగొచ్చు. వీటివల్ల తల్లికి, బిడ్డకి రిస్క్ ఎక్కువగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రాణాపాయస్థితికి కూడా చేరవచ్చు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ కాన్పుకు కష్టం అవుతుంది. అంతే కాకుండా పొట్ట మీద కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు చాలా కష్టపడవలసి వస్తుంది. డెలివరీ (ఆపరేషన్) తర్వాత కూడా శరీరంలో రక్తం ఎక్కడైనా గూడుకట్టి, pulmonary embolism, thrombo embolism అనే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. అదీగాక మీరు ఎత్తు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి, పొట్ట పైకి పెరిగే కొద్దీ ఆయాసంగా, ఇబ్బందిగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు డైటింగ్, విపరీతమైన వ్యాయామాలు చేసి బరువు తగ్గాలనే నిర్ణయాన్ని, ఆలోచనను వెంటనే మానెయ్యండి. కాకపోతే సాధారణంగా ప్రెగ్నెన్సీలో 10-11 కేజీల వరకు బరువు పెరగొచ్చు. మీరు ప్రయత్నిస్తే అంత ఎక్కువగా పెరగకుండా 5 కేజీల వరకు నియంత్రించు కోవచ్చు. అంటే ఆహార నియమాల్లో అన్నం తక్కువ తిని, కూరలు, పండ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, పండ్లలో షుగర్ ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సపోటా వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డైటీషియన్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటించవచ్చు. ఇక వ్యాయామం చేయాలను కుంటే, మొట్టమొదటగా చిన్న నడకతో మొదలు పెట్టి, ఆయాసం లేనంత వరకు పొద్దున 15 నిమిషాల నుంచి అరగంట, సాయంత్రం అరగంట చేయవచ్చు. తర్వాత ప్రాణాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు మీ ఆరోగ్యం, బిడ్డ మాయ, గర్భాశయ ముఖ ద్వార పొజిషన్‌ను బట్టి చేయవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు. -
బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు
న్యూయార్క్: ప్రపంచంలో క్యాన్సర్ర్ తో ఏటా చనిపోతున్న స్త్రీలలో ఎక్కువ కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మాలిక్యులర్ మార్కర్ ను పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా స్త్రీలలో ఉండే పునరుత్పాదక కణాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 302 మంది మహిళల బయాప్సీలను చేసిన పరిశోధనల ఫలితాల్లో 'కి 67' లెవల్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరిలో 63 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తర్వాతి పరిశోధనలతో తెలిసింది. 'కి67' కణాలు 'కి 67' మమ్మరీ ఎపీథెలియమ్ కణాలని అంటారు. స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో ఈ కణాలు భిన్న మార్పులు చెందడం వల్ల ఈ కణాల్లో కాన్సర్ కణుతులు తయారవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. 'మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదని మహిళలకు ఊరికే చెప్పేబదులు బయాప్సీ చేయించడం వల్ల భవిష్యత్ అవకాశాలను పూర్తిగా తెలుసుకోవచ్చు' హార్వాడ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన కొర్నెలియా పొల్యాక్ అన్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్న మహిళలను ముందే గుర్తించడం వల్ల ప్రత్యేకమైన మార్గాలను అనుసరించి రిస్క్ ను తగ్గించవచ్చని హార్వాడ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రుల్లా తమిమి తెలిపారు. కి67 లెవల్స్ ను గుర్తించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పరికరాల కంటే మాలిక్యులర్ బేస్డ్ టెస్టింగ్ లో రేడియేషన్ తక్కువగా ఉంటుందని వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ఈ వివరాలను ఆన్ లైన్ జర్నల్ క్యాన్సర్ రిసెర్చ్ లో ప్రచురించారు. -
పుణేలో అంతుబట్టని బ్రెస్ట్ డిసీజ్
ముంబై: మహారాష్ట్రలో అంతుబట్టని రొమ్ము వ్యాధి ప్రబలడం ఆందోళకు గురి చేస్తోంది. పుణె ప్రాంతంలో 20 -30 సంవత్సరాల మధ్య వయసున్న యువతుల్లో మిస్టరీ రొమ్ము వైరస్ విస్తరిస్తుండటం వైద్యవర్గాల్లో ఆలోచన పెంచుతోంది. అచ్చం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను పోలి వున్న ఈ వ్యాధి పుణె యువతుల్లో కనిపిస్తోంది. దీనిపై సీనియర్ డాక్టర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఇలాంటి కేసులు 50 శాతం పెరిగాయంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి లక్షణాలను పాలిచ్చే తల్లుల్లో, టీబీ రోగుల్లో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అదీ 40-50 ఏళ్ల మహిళల్లో మాత్రమే చూసేవారమని, ఇపుడు యువతుల్లో ఇలాంటి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, సరైన సమయంలో గుర్తించి, దీర్ఘకాలం చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని సూచిస్తున్నారు. భోసారికి చెందిన ప్రజక్త జాదవ్(28) (పేరు మార్చాం) గత అక్టోబర్‌లో ఎడమ రొమ్ములో బాధాకరమైన గడ్డను గమనించారు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా గడ్డ పెరగి, రొమ్మునుంచి డిశ్చార్చ్ కూడా మొదలైంది. దీంతో ఆందోళన చెందిన ఆమె లేడీ డాక్టర్‌ను, తర్వాత ఆంకాలజిస్టును కలిశారు. తీవ్రమైన అంటువ్యాధి అని తేల్చిన డాక్టర్లు ఆపరేషన్ చేసి చీమును తొలగించారు. తాను చాలా శుభ్రంగా ఉంటాననీ, తనకు ఎందుకు ఈ వ్యాధి సోకిందో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. పింప్రి కి చెందిన ఆశా శామ్యూల్ (25)ది (పేరు మార్పు) కూడా దాదాపు ఇలాంటి కేసే. ఆమె ఎడమ నిపుల్ బుడగ రూపంలోకి మారి గట్టిపడి గడ్డలాగా ఏర్పడింది. దీంతో ఆమె కేన్సర్ అని భయపడి డాక్టర్లను సంప్రదించారు. గత నాలుగు నెలలుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. ఇలాంటి కేసులు గతంలో నమోదయ్యాయి గానీ ఇంత పెద్దసంఖ్యలో లేవని బ్రెస్ట్ క్యాన్సర్ సీనియర్ వైద్యులు డా. సీబీ కోపికర్ అన్నారు. ప్రతి నెల ఆరు కొత్త కేసులు వస్తుండగా.. 15 - 30 మంది తిరిగి ఈ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని తెలిపారు. చూడ్డానికి రొమ్ము టీబీని పోలి ఉన్నా.. కచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదన్నారు. అయితే ఏడెనిమిది నెలలపాటు మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు వీటిని గుర్తించకుండా, తప్పుడు వ్యాధినిర్ధారణతో, రొమ్ము శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని కోపికర్ పేర్కొన్నారు. పెరుగుతున్న కేసులుసంఖ్య ఆందోళన కలిగిస్తోందని జహంగీర్ ఆసుపత్రి కి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్, మహారాష్ట్ర ఆంకాలజీ సొసైటీ వ్యవస్థాపకుడు డా. షోనా నాగ్ చెప్పారు. కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు బలమైన పరిశోధన జరుగుతోందన్నారు. వ్యాధి కారణాలను నిర్ధారిస్తే చికిత్స సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే వ్యాధి లక్షణాలను బట్టి క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు కూడా ఈ ఇన్ఫక్షన్ పై ఆశ్యర్యం వ్యక్తంచేశారు. దీనిపై రాష్ట్రంలోని ఇతర వైద్యనిపుణులు, ఆంకాలజిస్టులతో చర్చిస్తున్నామని జన్యుశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ రాజీవ్ సారిన్ తెలిపారు. హార్మోన్ పెరుగుదలలో అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల రొమ్ములో గడ్డలు ఏర్పడి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుందన్నారు. అయితే ఈ వ్యాధి నిర్ధారణకు విస్తృతమైన అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించే ఫ్యాటీ యాసిడ్లు
ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు దూరం కావచ్చట. మహిళల్లో రుతుక్రమం ఆగిన దశలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుంచి.. ఒమేగా 3 రక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని పెన్సల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం చేపట్టిన తాజా పరిశోధనలు ఒమేగా-3 ప్రయోజనాలను వెల్లడించాయి. రక్తంలో ఒమేగా-3 స్థాయిని బట్టి రొమ్ము సాంద్రత ఆధారపడి ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఒమేగా-3 కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచి మార్గమని, దాంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మహిళల్లో బాడీ మాస్ ఇండెక్స్ 29 దాటితే ఊబకాయం సమస్యలు ఎదురౌతున్నట్లు పరిశోధక బృదం కనుగొంది. సహజంగా కొవ్వు ఆమ్లాలు కలిగిన ట్యూనా చేపలు, సముద్ర జీవరాశులు, కొన్ని కాయ, గింజ ధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని ఒమేగా 3ఎస్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధనల్లో తెలుసుకున్నారు. కొవ్వు ఆమ్లాలు కలిగిన ఒమేగా-3 నొప్పి, మంట, వాపు నిరోధకానికి ఉపయోగపడుతుందని, కాబట్టి ఊబకాయం కలిగిన మహిళల్లో ఇది సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రియా మన్ని చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కు ఊబకాయం ప్రధాన కారణంగా చెప్తున్నారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వారిలో చాలామంది మహిళల్లో రొమ్ము సాంద్రత అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోందని క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ ఆన్ లైన్ జర్నల్ లో పేర్కొన్నారు. లోవోజా.... కొవ్వు ఆమ్లాలను, డీహెచ్ ఏ, ఇకోసా పెంటాయనోయక్ యాసిడ్ల ను కలిగి ఉన్నప్పటికీ డీహెచ్ఏ రక్తస్థాయిలు మాత్రమే రొమ్ము సాంద్రతను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
రొమ్ములో ఏర్పడే కణతులన్నీ క్యాన్సర్లు కాదు..!
హస్తవాసి ఆంకాలజీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నాను. నేను సొంతంగా నా రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు రెండేళ్ల క్రితం నా కుడి వైపు రొమ్ములో వేరుశనగ కాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గమనించాను. ఆ కణితి చాలా నొప్పిగా ఉంటోంది. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురవుతుండడంతో పాటు చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇది రొమ్ము క్యాన్సరేమో అని చాలా భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన చూపించగలరు. - ఓ సోదరి మీ వయసులో రొమ్ములో కణితి (ఫైబ్రోడినోమా) ఏడ్పడటం సాధారణమైన సమస్య. రొమ్ములో ఏర్పడిన కణుతులు, చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్లు కావు. ఇది ఒక వ్యాధి కాదు. కేవలం బ్రెస్ట్ డెవలప్మెంట్లో జరిగే సాధారణ పరిణామం మాత్రమే. కాబట్టి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ సమస్యకు సరైన చికిత్స అవసరం. కొన్ని సాధారణ పరీక్షల ద్వారా వైద్యులు పూర్తిగా పరీక్షించి, ఆ కణితిని తొలగించాలా, వద్దా అని నిర్ధారిస్తారు. క్రమంగా కణితి పరిమాణం పెరుగుతూ ఉండటం, నొప్పి తగ్గకుండా స్థిరంగా ఉండడం, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ సూచనలు కనిపించడం, రొమ్ము క్యాన్సర్ కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో శస్త్రచికిత్స నిర్వహించి రొమ్ములోని కణితి తొలగించవలసి ఉంటుంది. కణితి పరిమాణాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా, కాదా అని వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైనా మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ గాటుతోనే సురక్షితమైన విధానం ద్వారా ఆపరేషన్ నిర్వహించవచ్చు. ఈ శస్త్ర చికిత్స జరిగిన రోజునే ఇంటికి పంపిస్తారు. రొమ్ము నుంచి కణితి తొలగించిన ప్రాంతంలో మాత్రం చిన్న మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఆ మచ్చను కూడా కనబడకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫైబ్రోడినోమా (రొమ్ములో కణితి లేదా గడ్డ)కు పూర్తి స్థాయి చికిత్స పొందడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు. -డాక్టర్ వి. హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస ్టయశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుంటే బి.పి. 170/120 అని చెప్పారు. బి.పి.కి. మందులు వాడాలి అని చెప్పారు. మందులు వాడకుంటే ఫ్యూచర్లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చా? - సుకుమార్, వెంకటాపురం ఈ వయసులో ఏ కారణం లేకుండా బి.పి. (ఎసెన్షియల్ హైపర్ టెన్షన్) రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బి.పి. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. మీరు యూరిన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్తో పాటు అవసరమైన ఇతర టెస్ట్‌లు చేయించుకొని బి.పి. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బి.పి.కి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడడమే కాకుండా ఉప్పు చాలా తగ్గించి తినాలి. క్రమం తప్పకుండా కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. మీరు ఉండాల్సిన . బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి. నా వయసు 58. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సలీమ్, గుంటూరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇతర పద్ధతులతో (ఫిజియోథెరపీ)తో నొప్పి తగ్గించుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తరచు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సుధ, భద్రాచలం చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. మా పాప వయసు ఐదేళ్లు. ప్రతిసారీ చలికాలంలో పాప ఒళ్లంతా తెల్లటి పొడల్లాంటివి వస్తన్నాయి. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఇది తిరగబెడుతుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మాకు ముందుగానే కొన్ని సూచనలు చెప్పండి. - రవికాంత్, పాడేరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎగ్జిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి, మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయే సమస్య కాదు. ముందుగా మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో సమస్య తగ్గనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 30. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు. మరొకరికి ఐదేళ్లు. రెండూ మామూలు కాన్పులే. పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ చేయించుకున్నాను. పీరియడ్స్ నెలనెలా కరెక్ట్‌గా వస్తాయి. కానీ బ్లీడింగ్ ఒకరోజు మాత్రమే అవుతుంది. నా సమస్య ఏమిటంటే... నాకు నెల రోజుల నుంచి రొమ్ముల నుంచి కొంచెం నీరులాగా వస్తోంది. రొమ్ములో కంతులు, నొప్పి లాంటివి ఏవీ లేవు. ఇది క్యాన్సర్ లక్షణమేమోనని భయంగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి. - సత్యవతి, తెనాలి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. అంతేగానీ క్యాన్సర్ ఒక్కటే కాదు. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంటే, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరా యిడిజమ్ వల్లగానీ, ఎక్కువ మానసిక ఒత్తిడి ఉండటం వల్లగానీ, లోదుస్తులు బాగా బిగుతుగా వేసుకోవడం వల్ల, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రె సెంట్ మందులు వాడటం, మరికొన్ని రకాల మందులు చాలాకాలంగా వాడుతూ ఉండటం, ఆఖరుగా మీరు చెప్పినట్లుగా రొమ్ము క్యాన్సర్‌తో పాటు ఇంకా ఎన్నో ఇతర కారణాల వల్ల కూడా రొమ్ము నుంచి నీరులాగా, పాలలాగా స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. మీరు అనవసరంగా భయపడ కుండా డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకుని, అలా జరగడానికి అసలు కారణం తెలుసుకోండి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్ గానీ ఉన్నాయా అని చూసి, అవసరమైతేనే రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు చేయించు కోండి. మీకు ఉన్న సమస్యకు కారణాన్ని తెలుసుకుని, దాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఏవైనా మందులను దీర్ఘకాలికంగా వాడుతుండటం వల్ల ఇలా జరుగుతు న్నట్లు తేలితే... అవసరమైతే వాటిని ఆపడం లేదా మార్చడం వల్ల కూడా ఉపయోగం ఉండవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లోదుస్తులు కొంచెం వదులుగా వేసుకోవడం కూడా మేలు. మీకు మీరే అన్నీ ఊహించు కోకుండా ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను సంప్రదించండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
మా బాబు వయసు 15 ఏళ్లు. వాడికి ఒకవైపు రొమ్ము పెరిగినట్లుగా ఉంది. మేం ఒకసారి డాక్టర్‌కు చూపించాం. ఆయన హార్మోన్ పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టుల్లో ఏమీ తేడాలేదని చెప్పి దానంతట అదే తగ్గుతుందున్నారు. కానీ తన సమస్య వల్ల మా అబ్బాయి మానసికంగా ఫీలవుతున్నాడు. మా వాడికి ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఉపయోగం ఉంటుందా? - సంతోష్‌కుమార్, కడప మీ అబ్బాయి సమస్యను ప్యూబర్టల్ గైనకోమాజియా అంటారు. కొద్దిమంది అబ్బాయిల్లో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా స్నేహితులు ఏడిపిస్తార నే భయంవల్ల వారితో విముఖత చూపుతారు. గైనకో మాజియాను ప్లాస్టిక్సర్జరీతో సరిచేయవచ్చు. ఇది కేవ లం ‘డే కేర్ ప్రొసిజర్’ మాత్రమే. అంటే దీనికి హాస్పిట ల్లో చేర్చాల్సిన అవసరం కూడా లేదు. దీనికి బెడ్‌రెస్ట్ కూడా అక్కర్లేదు. రొమ్ములో పెరిగిన భాగం తొలగించా క అది మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉండదు. మీ అ బ్బాయి మరీ మానసికంగా ఇబ్బంది పడుతుంటే మీరు ప్లాస్టిక్ సర్జన్‌ని కలిసి తగిన సహాయం పొందవచ్చు. నా వయసు 20. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలి పోతోంది. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకో వాలని అనుకుంటున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - వెంకటరమణ, నిజామాబాద్ మీ వయసు ఇంకా 20 ఏళ్లే అంటున్నారు. మీ జుట్టు కేవ లం ఆర్నెల్ల నుంచే రాలుతుందని అంటున్నారు. మీరు ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అంత తొందరపడాల్సిన అవస రం లేదు. జుట్టు రాలడం ఆపేందుకు కొన్ని మందులు వాడి చూడవచ్చు. మందులతోనే మీ సమస్య పరిష్కా రం కాకపోతే అప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆలోచించవచ్చు. మీరు ముందుగా మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ దీపు సీహెచ్ ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్ -
వ్యక్తిగతం: అలా పెరిగితే గైనకోమాజియా
డాక్టర్! నేను ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఏడాదిగా జిమ్‌కు వెళ్తున్నాను. రెండు వైపులా ఛాతీ పెరిగినట్లుగా అనిపిస్తోంది. జిమ్ చేయడం వల్ల ఛాతీ పెరిగిందో, రొమ్ములు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. చనుమొనల చుట్టూ కండ పెరిగింది. జిమ్‌లో చొక్కా విప్పడానికి సిగ్గుగా ఉంది. సలహా ఇవ్వగలరు. - ఇ.ఎస్.ఆర్., నెల్లూరు ఇలాంటి సమస్యలు సాధారణంగా యౌవనంలో ఉన్నవారిలో చూస్తూవుంటాం. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని, మగవారిలో ఇలా ఛాతీ పెరగడాన్ని గైనకోమాజియా అంటారు. ఇలాంటి కేసుల్లో 50 శాతం మందిలో కారణాలు ఏమీ ఉండవు. చాలా అరుదుగా ప్రోలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల ఇలా కావచ్చు. ఇలాంటివారిలో తలనొప్పి, కంటిచూపు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. రక్తపరీక్షలో ప్రొలాక్టిన్ పాళ్లు ఎక్కువగా ఉంటే గనక అవసరాన్ని బట్టి ఎమ్మారై స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఇలాంటి అవసరం రాదు. ఒకవేళ ప్రొలాక్టిన్ సాధారణంగానే ఉంటే గనక, మీరు లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ లేకుండానే అదనపు కొవ్వును తీయించుకోవచ్చు. నేను వివాహితుణ్ని. కుడిపక్కన వరిబీజం అయ్యింది. డాక్టర్‌ను కలిస్తే, ఆపరేషన్ సూచించారు. కానీ ఆపరేషన్ అయితే, లైంగిక సామర్థ్యం తగ్గుతుందేమో, పిల్లలు పుట్టరేమో అని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - టి.ఎస్., కర్నూలు హైడ్రోసీల్, హెర్నియా సమస్యలు వచ్చినప్పుడు చేసే ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధమూ లేదు. అంగం స్తంభించడానికి ఉపయోగపడే నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. కాబట్టి, దీని వల్ల లైంగిక కార్యానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలు పుట్టకపోవడం కూడా జరగదు. మీది అకారణ భయమే! నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. నేను ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సిన వయసులో ఉన్నాను. అయితే, లైంగిక కోరికలు బాగానే ఉన్నాయి. కానీ శృంగారం తర్వాత వీర్యం చాలా తక్కువగా పడుతోంది. నాలో పటుత్వం తగ్గడం వల్లే ఇలా జరుగుతోందా? మరేదైనా కారణమా? - కె.వై., హైదరాబాద్ దాదాపుగా మీరు అరవైలోకి వచ్చారు. ఈ వయసు వారిలో వీర్యం తక్కువగా రావడం అన్నది సాధారణ విషయమే. దీన్నో సమస్యగా భావించనక్కర్లేదు. వీర్యం ప్రధానంగా సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. లైంగిక సంతృప్తికీ, వీర్యం పరిమాణానికీ సంబంధం లేదు. అలాగే లైంగిక పటుత్వానికీ, వీర్య పరిమాణానికి కూడా సంబంధం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల మీలో ఇలా జరుగుతోంది. కాబట్టి దీని గురించి చింతించనవసరం లేదు. వీర్యం పెరిగేందుకు ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరమూ లేదు. మీరు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, మీ సాధారణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ శృంగార జీవితం కూడా బాగుంటుంది. నా వయుసు 30 ఏళ్లు. పెళ్లికాలేదు. వృషణాల్లో నొప్పిగా ఉంటోంది. లాగుతున్నట్టుగా కూడా ఉంది. దీనివల్ల అవి చిన్నవిగా మారినట్టుగా అనిపిస్తోంది... - వి.సీహెచ్., హైదరాబాద్ మిగతావారితో పోల్చితే తవు వృషణాలు చిన్నగా ఉన్నాయేమోననే అపోహ చాలామందిలో ఉంటుంది. ఇది మినహా మరే సమస్యా లేకపోతే గనక మీరు భయపడాల్సింది ఏమీలేదు. అరుుతే అంతకుముందు నిజంగానే పెద్దవిగా ఉండి, ఇప్పుడు తగ్గిపోయినట్టనిపిస్తే, అందులో నొప్పి కూడా ఉంటే దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చు. ఇది కేవలం అనుమానమే! ఎందుకైనా మంచిది మీరోసారి యుూరాలజిస్టును కలవండి. డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, ఏదైనా సమస్య ఉందో లేదో నిర్ధారిస్తారు. దానికనుగుణంగానే చికిత్స! - డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com