ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్ | Plastic Surgery Counseling | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్

Published Wed, May 13 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

Plastic Surgery Counseling

మా బాబు వయసు 15 ఏళ్లు. వాడికి ఒకవైపు రొమ్ము పెరిగినట్లుగా ఉంది. మేం ఒకసారి డాక్టర్‌కు చూపించాం. ఆయన హార్మోన్ పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టుల్లో ఏమీ తేడాలేదని చెప్పి దానంతట అదే తగ్గుతుందున్నారు. కానీ తన సమస్య వల్ల మా అబ్బాయి మానసికంగా ఫీలవుతున్నాడు. మా వాడికి ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఉపయోగం ఉంటుందా?
 - సంతోష్‌కుమార్, కడప

మీ అబ్బాయి సమస్యను ప్యూబర్టల్ గైనకోమాజియా అంటారు. కొద్దిమంది అబ్బాయిల్లో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా స్నేహితులు ఏడిపిస్తార నే భయంవల్ల వారితో విముఖత చూపుతారు. గైనకో మాజియాను ప్లాస్టిక్‌సర్జరీతో సరిచేయవచ్చు. ఇది కేవ లం ‘డే కేర్ ప్రొసిజర్’ మాత్రమే. అంటే దీనికి హాస్పిట ల్‌లో చేర్చాల్సిన అవసరం కూడా లేదు. దీనికి బెడ్‌రెస్ట్ కూడా అక్కర్లేదు. రొమ్ములో పెరిగిన భాగం తొలగించా క అది మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉండదు. మీ అ బ్బాయి మరీ మానసికంగా ఇబ్బంది పడుతుంటే మీరు ప్లాస్టిక్ సర్జన్‌ని కలిసి తగిన సహాయం పొందవచ్చు.
 నా వయసు 20. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలి పోతోంది. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకో వాలని అనుకుంటున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - వెంకటరమణ, నిజామాబాద్

మీ వయసు ఇంకా 20 ఏళ్లే అంటున్నారు. మీ జుట్టు కేవ లం ఆర్నెల్ల నుంచే రాలుతుందని అంటున్నారు. మీరు ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అంత తొందరపడాల్సిన అవస రం లేదు. జుట్టు రాలడం ఆపేందుకు కొన్ని మందులు వాడి చూడవచ్చు. మందులతోనే మీ సమస్య పరిష్కా రం కాకపోతే అప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆలోచించవచ్చు. మీరు ముందుగా మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ దీపు సీహెచ్
ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement