న్యూయార్క్: ప్రపంచంలో క్యాన్సర్ర్ తో ఏటా చనిపోతున్న స్త్రీలలో ఎక్కువ కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మాలిక్యులర్ మార్కర్ ను పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా స్త్రీలలో ఉండే పునరుత్పాదక కణాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
302 మంది మహిళల బయాప్సీలను చేసిన పరిశోధనల ఫలితాల్లో 'కి 67' లెవల్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరిలో 63 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తర్వాతి పరిశోధనలతో తెలిసింది.
'కి67' కణాలు
'కి 67' మమ్మరీ ఎపీథెలియమ్ కణాలని అంటారు. స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో ఈ కణాలు భిన్న మార్పులు చెందడం వల్ల ఈ కణాల్లో కాన్సర్ కణుతులు తయారవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు.
'మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదని మహిళలకు ఊరికే చెప్పేబదులు బయాప్సీ చేయించడం వల్ల భవిష్యత్ అవకాశాలను పూర్తిగా తెలుసుకోవచ్చు' హార్వాడ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన కొర్నెలియా పొల్యాక్ అన్నారు.
క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్న మహిళలను ముందే గుర్తించడం వల్ల ప్రత్యేకమైన మార్గాలను అనుసరించి రిస్క్ ను తగ్గించవచ్చని హార్వాడ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రుల్లా తమిమి తెలిపారు.
కి67 లెవల్స్ ను గుర్తించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పరికరాల కంటే మాలిక్యులర్ బేస్డ్ టెస్టింగ్ లో రేడియేషన్ తక్కువగా ఉంటుందని వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ఈ వివరాలను ఆన్ లైన్ జర్నల్ క్యాన్సర్ రిసెర్చ్ లో ప్రచురించారు.