Radiation
-
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్‌కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
ఇక పైకప్పులన్నీ కూల్కూల్గానే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల ఒకటోతేదీ నుంచి అమలులోకి వ చ్చిన కూల్‌రూఫ్ పాలసీని రాబోయే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్ల మేర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పైకప్పుల కంటే కూల్ రూఫ్ సూర్యుడి నుంచి తక్కువ వేడిని తీసుకుంటుంది. ఇది సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, థర్మల్ రేడియేషన్‌ను విడుదల చేసి, వేడిని తగ్గిస్తుంది. సాధారణ పైకప్పులు 20 శాతం సూర్యరశ్మిని మాత్రమే తిరిగి ప్రతిబింబిస్తే, కూల్ రూఫ్‌లు దాదాపు 80 శాతం సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. తద్వారా కూల్రూఫ్లతో భవనాలు గణనీయంగా చల్లబడతాయి. ఈ కూల్‌రూఫ్ విధానాన్ని 2023–24లో జీహెచ్ఎంసీలో 5 చ.కి.మీ మేర... మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 2.675 చ.కిమీల మేర అమలు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాల్లో ఈ సంవత్సరం కూల్‌రూఫ్ పాలసీ అమలుకు సంబంధించిన విధి విధానాలను, విస్తీర్ణం వివరాలతో సీడీఎంఏ ఎన్. సత్యనారాయణ శనివారం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 3,468 వార్డుల్లో తొలి ఏడాది ఇంటి పైకప్పులను చల్లబరిచే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 287.9 లక్షల చదరపు అడుగుల మేర ఇంటి పైకప్పులను కూల్‌రూఫ్ పాలసీ కిందికి తీసుకురానున్నారు. ఏ ఇళ్లకు కూల్‌రూఫ్ విధానం తప్పనిసరంటే... 600 చదరపు గజాలు, అంతకు పైబడిన స్థలాల్లో నిర్మించే గృహ నిర్మాణాల అనుమతులకు ఇక నుంచి కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో కూల్‌రూఫ్ విధానంలో నిర్మించిన వాటికి మాత్రమే పురపాలక శాఖ ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ ఇవ్వనుంది. ఇక అన్ని ప్రభుత్వ భవనాలు కూల్ రూఫ్ విధానంలోనే నిర్మాణం జరగాలి. సైట్ ఏరియా, బిల్డప్ ఏరియాతో సంబంధం లేకుండా అన్ని రకాల నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ ఇదే విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక 600 చదరపు గజాలకన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస గృహాలకు కూల్‌రూఫ్ పాలసీ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే కూల్ రూఫ్ విధానంలో నిర్మించకపోయినా, అనుమతులకు ఇబ్బందులేం ఉండవు. ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న వారు సైతం శీతలీకరణ కోసం కూల్‌రూఫ్ విధానంలోకి మారే ఆప్షన్ ఉంటుంది. వచ్చే మూడేళ్లలో నివాసేతర గృహాలకు రెట్రా ఫిట్టింగ్ చేసుకోవడం కూడా ఆప్షన్‌గా సీడీఎంఏ పేర్కొంది. పాత ఇళ్లకు కూల్‌రూఫ్ ఎలా..? ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న నివాసాలను కూడా కూల్‌రూఫ్ విధానంలోకి తీసుకువచ్చేలా విధివిధానాలను రూపొందించారు. ఇందుకోసం ఆయా మునిసిపాలిటీల్లోని వార్డుల్లో నిర్దేశించిన విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఇళ్లకు కూల్రూఫ్ను తప్పనిసరి చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయనుంది. ఆయా ఇళ్ల పైకప్పులకు సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ చేస్తారు. తెల్లటి టైల్స్‌తో లేదా తెల్లటి పొరతో పైకప్పులను కప్పి పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించాలనేది నిర్ణయం. -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
మిరుమిట్ల మాటున ముప్పు
సాక్షి, అమరావతి: ఏదైనా నగరంలో రాత్రివేళ ఎత్తయిన భవనంపై నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది?!... మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతి వెలుగులతో ఆ నగరం అంతా మెరిసిపోతూ ఉంటుంది. నిశిరాత్రే పట్టపగలు మాదిరిగా గోచరిస్తుంది. అయితే ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఆ మిరుమిట్ల వెలుగుల చాటున పర్యావరణానికి, జీవజాలానికి పెనుముప్పు పొంచి ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాంతి కాలుష్యం వర్తమాన ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతోందని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘సైన్స్ మ్యాగజైన్’ అధ్యయనం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశంలో ఏటా 20 శాతం పెరుగుతున్న స్కై గ్లో అభివృద్ధి పేరుతో నగరాల్లో రాత్రుళ్లు మితిమీరిన విద్యుత్ వెలుగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చీకటిని పారదోలుతున్నాయి. ఈ విద్యుత్ కాంతుల నుంచి వెలువడే రేడియేషన్‌ను ‘స్కై గ్లో’ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘స్కై గ్లో’ ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుండటం గమనార్హం. న్కూయార్క్, వాషింగ్టన్, లండన్ వంటి నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనూ ‘స్కై గ్లో’ ఏటా 20 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ‘స్కై గ్లో’ ఆకాశంలోని చిన్న చిన్న నక్షత్రాలను సైతం మసకబారుస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అంటున్నారు. 2011– 2022 మధ్య 10 శాతం చిన్న నక్షత్రాలు మసకబారిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది. అంతరిస్తున్న కార్పెంటర్ తేనెటీగలు.. కాంతి పరావర్తనాన్ని బట్టి మొక్కల పెరుగుదల ఉంటుందన్న సంగతి తెలిసిందే. ‘స్కై గ్లో’ పూల వికాసంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పూలు సహజసిద్ధంగా వికసించడం లేదని.. నిర్ణీత సమయానికి కంటే ముందుగానే వికసిస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పూలపై ఆధారపడి పరాగ సంపర్కం చేసే తేనెటీగలు సందిగ్ధతకు గురవుతున్నాయి. దీంతో వాటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. భారత్‌లోనే ప్రత్యేకంగా ఉండే ‘కార్పెంటర్ తేనెటీగ’ ఉనికి ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీకట్లో పరాగ సంపర్కం జరపడం ‘కార్పెంటర్ తేనెటీగ’ ప్రత్యేకత. కృత్రిమ వెలుగులతో చీకటి తగ్గిపోతుండటంతో ఈ తేనెటీగలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ముంబైకి 100 కి.మీ. దూరంలో ఉన్న భీమశంకర్ అభయారణ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ముంబై నగరం చిమ్మే వెలుగులతో ఆ అభయారణ్యంలో కార్పెంటర్ తేనెటీగలు క్రమంగా అంతరిస్తున్నాయని గుర్తించారు. ఏటా లక్షల పక్షులు బలి.. నక్షత్రాల వెలుగునే ఆధారంగా చేసుకుని వివిధ ఖండాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చేపక్షులకు స్కై గ్లో నుంచి ముప్పు ఏర్పడుతోంది. విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్న భారీ భవంతులతో వలస పక్షులు సందిగ్ధతకు లోనవుతున్నాయి. పక్షులు కాంతి పరావర్తనాన్ని గుర్తించలేవు. దీంతో కృత్రిమ కాంతిని చూసి అదే తమ గమ్యస్థానమని భావిస్తున్నాయి. నేరుగా వచ్చి ఎత్తైన భవనాల అద్దాలను ఢీకొట్టి లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కాగా వలస పక్షుల విసర్జకాలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. వలస వచ్చే సముద్ర పక్షులు ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.8,500 కోట్లు) విలువైన సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి వచ్చే పెలికాన్ పక్షులు సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇంతటి ప్రయోజనాన్ని అందిస్తున్న వలస పక్షులు స్కై గ్లో బారిన పడుతుండటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. డార్క్ స్కై లైటింగ్ విధానాలే పరిష్కారం ప్రమాదకరమైన ‘స్కై గ్లో’ను తగ్గించే దిశగా నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు డార్క్ స్కై లైటింగ్‌ను ప్రవేశపెట్టాయి. అమెరికాలోని పిట్స్బర్గ్ నగరంలో ‘డార్క్ స్కై లైటింగ్’ అమల్లో ఉంది. అంటే మిరుమిట్లు గొలిపే కాంతిని కాకుండా తక్కువ కాంతిని వెదజల్లే లైట్లను అమరుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా అవకాశం ఉన్నంతవరకు రాత్రి వేళల్లో సహజసిద్ధమైన చీకటి ఉండేలా చూస్తోంది. ఎత్తైన భవనాలకు ముదురు రంగులు వేస్తోంది. దాంతో కాంతి పరావర్తనం చెందదు కాబట్టి వలస పక్షులకు ఇబ్బంది ఉండదు. -
గోహత్యపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు
గుజరాత్ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్‌కి గురికావని సైన్స్ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది. (చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!) . -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
Health: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..
క్యాన్సర్ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...? అదే ‘ప్రెసిషన్ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్సర్ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కచ్చితంగా క్యాన్సర్ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి. అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్ థెరపీ’ తాలూకు సిద్ధాంతం. ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం. ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్జీఎస్’ అంటారు. దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్జీఎస్ ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్ మేడ్) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్ క్యాన్సర్ అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు. పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. రొమ్యు క్యాన్సర్ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్ ఆంకాలజీకి ఓ మంచి ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి. అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ –హెమటో ఆంకాలజిస్ట్ -
క్యాన్సర్ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి
Chhavi Mittal About Her First Radiation Therapy Experience: ప్రముఖ టీవీ నటి ఛవి మిట్టల్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గత నెల తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన ఆమె ఏమాత్రం బాధపడకుండా తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా వేదికగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకున్న ఆమె ఈ రోజు తొలి రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తొలి రేడియేషన్ థెరపీ అనుభవాన్ని పంచుకుంది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ‘నా రేడియేషన్ థెరపీ ఈ రోజే మొదలైంది. దీనికి ముందు ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని కొందరితో చర్చించాను. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి మన ప్రాణాలు కాపాడడంపైనే కానీ, మన సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరం చేయడంపై కాదు’ ఆమె రాసుకొచ్చింది. చదవండి: భర్తతో హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు, వైరల్ ‘అయితే నేను కేవలం జీవించాలనుకోవడం లేదు. నా లైఫ్‌ని సంతోషంగా గడపాలనుకుంటున్నా. ఎలాగు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను. అందుకే రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఈ జర్నీలో నాకు సహాకరిస్తూ వెన్నంటే ఉంటున్న నా డాక్టర్లకు కృతజ్ఞతలు. ఈ రేడియేషన్ థెరపీ అనేది 4 నెలల పాటు వారానికి లేదా 5 రోజుల చొప్పున 20 సైకిల్స్‌గా ఇవ్వనున్నారు’ అని ఛవి మిట్టల్ పేర్కొంది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
చిన్న బుక్.. 1,500 ఏళ్ల డేంజర్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎటూ తేలడం లేదు. చివరికి అణు దాడికీ పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల విషయంగా చాలా దేశాలు వణికిపోతున్నాయి. మరి ఇంత భయానికి కారణం.. రేడియేషన్. అలాంటి రేడియేషన్‌తో ప్రమాదమెంత?ఎంతకాలం ప్రభావం ఉంటుందనే వివరాలు తెలుసుకుందామా.. అణువే.. బ్రహ్మాండం.. అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. కానీ దానికి ఉండే శక్తి మాత్రం అపారమైనది. ఇది అది అని కాదు.. అత్యంత ప్రాథమికమైన హైడ్రోజన్ నుంచి.. అణ్వస్త్రాల్లో వాడే యురేనియం, ఫ్లూటోనియం దాకా అన్ని మూలకాల్లో అపరిమిత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి, మనకు అనుకూలంగా వాడుకోవడం కోసం శాస్త్రవేత్తలు వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో అణు ధార్మికత (రేడియేషన్)ను.. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నారు. ఆ పుస్తకాలు, వ్రస్తాలు ప్రమాదకరమే.. రేడియం మూలకం అత్యంత తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను విడుదల చేస్తుంది. తక్కువ పరిమాణంలోని రేడియంపైనే మేరీ క్యూరీ ప్రయోగాలు చేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా పడింది. దానితోనే ఆమె శరీరంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. క్యూరీ పరిశోధన చేసిన ల్యాబ్‌లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, ఆమె వస్త్రాలు, పరిశోధన వివరాలు రాసిన నోట్‌బుక్స్ అన్నీ రేడియం ప్రభావానికి లోనయ్యాయి. ఎంతగా అంటే.. ఆమె పుస్తకాలు, వ్రస్తాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. ఇప్పుడే కాదు.. మరో 1,500 ఏళ్ల పాటు వాటిలో రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ► మేరీ పరిశోధనలకు గుర్తుగా ఆమె నోట్‌బుక్స్‌ను ఫ్రాన్స్‌లోని బిబ్లియోథెక్ మ్యూజియంలో భద్రపర్చారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ బయటికి రాకుండా సీసపు పెట్టెల్లో వాటిని ఉంచారు. ► మేరీ క్యూరీ శరీరం నుంచీ రేడియేషన్ వెలువడుతుండటంతో.. ఆమె మృతదేహాన్ని ఒక అంగు ళం మందంతో తయారు చేసిన సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేయడం గమనార్హం. ► అణుధార్మిక మూలకాల నుంచి వెలువడే రేడియేషన్‌ను సీసం సమర్థవంతంగా పీల్చుకోగలుగుతుంది. అందుకే రేడియో యాక్టివ్ మూలకాలను నిరంతరం సీసపు పెట్టెల్లోనే ఉంచుతారు. ‘ఎలిఫెంట్ ఫుట్’.. బతికేది ఐదు నిమిషాలే.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ప్రమాదానికి లోనైన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్. 1986 ఏప్రిల్‌లో అందులోని ఒక రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ లీకైంది. దాని ప్రభావంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వేలాది మంది ఆ రేడియేషన్‌కు లోనై.. వివిధ వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో రియాక్టర్ పేలినప్పుడు.. అందులోని అణు ఇంధనం, చుట్టూ ఉన్న లోహ పరికరాలు, కాంక్రీట్ శ్లాబ్‌లు, బీమ్‌లు కరిగి దిగువకు కారిపోయాయి. అవి దిగువన కాస్త వెడల్పుగా విస్తరించిన పొడుగాటి స్తంభంలా ఏర్పడ్డాయి. అది చూడటానికి ఏనుగు కాలు ఆకారంలో ఉండటంతో ‘ఎలిఫెంట్ ఫుట్’అని పేరుపెట్టారు. ఇది జరిగి 38 ఏళ్లయినా ఇప్పటికీ దాని నుంచి రేడియేషన్ వెలువడుతూనే ఉంది. ఎవరైనా దాని దగ్గరగా వెళ్లి.. ఐదు నిమిషాలుగానీ ఉంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఈ రేడియేషన్ బయటికి రాకుండా.. దాని చుట్టూ రెండు వరుసలుగా సీసం, ఇతర లోహాలతో ప్రత్యేకంగా కంటైన్మెంట్ చేసి మూసేశారు. ► ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. ఆ దేశంలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాదీనంలోకి తెచ్చుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనది కూడా ఇందుకే.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..?
సీతంపేట (విశాఖ ఉత్తర): ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. చదవండి: అద్భుతాలు సృష్టించి.. వాటికే బలై.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహా్మ్రస్తాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‌తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కలి్పస్తున్నారు, ఏ ఏడాది ‘ఐ లవ్ స్పారో’ థీమ్‌తో వరల్డ్ స్పారో డే నిర్వహిస్తున్నారు. వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు ,కళాశాలల్లో అవేర్నెస్ క్యాంపైన్స్, , వ్యాసరచన, సమావేశలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 23 ఏళ్లుగా కృషి చేస్తున్నాం పట్టణీకరణ, కాలుష్యం, రేడియేషన్ కారణంగా సున్నితమైన పిచ్చుక సంతంతి నానాటికీ తగ్గిపోతోంది. పిచ్చుకలు మానవాళికి ఎంతో ప్రయోజకరమైనవి. పిచ్చుకల పరిరక్షణకు 2000 సంవత్సరంలో గ్రీన్ క్లైమేట్ సంస్థను స్థాపించి 23 ఏళ్లుగా వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాం. సభలు, సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పిచ్చుకల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణకు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని వివరిస్తున్నాం. ఈ విధంగా గ్రీన్ క్లైమేట్ టీం వేలాది మంది విద్యార్థులకు , యువతకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లి పిచ్చుకల పరిరక్షణకు ఏం చెయ్యాలో అవగాహన కల్పించి విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. పిచ్చుకలు కనిపించే ప్రాంతాలకు వెళ్లి వాటిని కాపాడటానికి గూళ్లు, ఆహారం, నీరు ఏర్పాటు చెయ్యమని చైతన్య పరిచాం. 2002లో చెక్కతో తయారు చేసిన పిచ్చుకల గూళ్లు నగర ప్రజలకు పరిచయం చేసి విరివిగా ఏర్పాటు చెయ్యాలని ప్రచారం చేశాం. అలాగే 2005లో మట్టితో చేసిన గూళ్లు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చి ఇంటి పరిసరాలలో ఉంచాలని అవగాహన కల్పించాం. టీమ్ సభ్యుల సుదీర్ఘ కృషితో విశాఖనగరంలో ప్రస్తుతం 280 ప్రాంతాలలో పిచ్చుకలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు తమ ఇళ్ల బాల్కనీలు, మెట్ల కింద మట్టితో చేసిన గూళ్లు, ఆహారం, నీళ్లు ఏర్పాటు చెయ్యాలి. –జేవీ రత్నం, వ్యవస్థాపకుడు, గ్రీన్ క్లైమేట్ సంస్థ పిచ్చుకల అవసరం ఎంతో ఉంది పెదవాల్తేరు (విశాఖ తూర్పు): పిచ్చుకలను పరరిక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకుడు జేవీ రత్నం, పేర్కొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని శనివారం చినవాల్తేరులో గల –జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పిచ్చుకల దినోత్సవం ఇతివృత్తం ‘నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను’ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో దినోత్సవాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీ.కృష్ణవేణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు పిచ్చుకలను పరిరక్షిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి పిచ్చుకల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చుకల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వాటికి నివాసయోగ్యంగా ప్రజలు సౌకర్యాలు కల్పించాలి. డోడో పక్షి అంతరిస్తే జరిగిన నష్టం మనం తెలుసుకున్నాం. అందుకే మన ఇంటి చుట్టు ఉన్న పిచ్చుకలను కాపాడుకోవాలి. పిచ్చుకలవల్ల మన ఇంటికి, వ్యవసాయానికి మేలుజరుగుతుంది. –ఈయూబీ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ విభాగం ఆహారం..నీరు అందించాలి పిచ్చుకలు అంతరించిపోతే పంటలకు హానికలుగుతుందని గ్రహించాలి. మనకు, పంటలకు హానికలిగించే క్రిమి కీటకాలను నివారించే సున్నితమైన పక్షి. మనం పిచ్చుక జాతిని పరిరక్షించుకోవాలి, పిచ్చుకల ఆవశ్యకతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాటి మనుగడకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాలలో అందుబాటులో ఉంచాలి. ఇతర జీవుల వల్ల వాటి సంతతికి నష్టం కలగకుండా చూడాలి. – హేమలత, జువాలజీ లెక్చరర్ సంతతి తగ్గుముఖం పిచ్చుకల సంఖ్య ఘనణీయంగా తగ్గిపోయింది. పిచ్చుకల సంతతి పెరిగేలా చేపట్టాల్సిన చర్యలపై భావితరాలకు అవగాహన కలి్పంచాలి. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకల ఆవశ్యకతపై అవగాహన కలి్పంచి వాటి పరిరక్షణలో భాగస్వామ్యం చెయ్యాలి. పిచ్చుకల రక్షణ బాధ్యత పూర్తిగా మనదే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. – సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత కులపతి, కృష్ణా యూనివర్సిటీ -
అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం
సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య శక్తి పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్డ్ కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు. We were treated to the strongest auroras of the entire mission, over north America and Canada. Amazing spikes higher than our orbit🤩, and we flew right above the centre of the ring, rapid waves and pulses all over. #MissionAlpha https://t.co/5rdb08ljhx pic.twitter.com/0liCkGvRCh — Thomas Pesquet (@Thom_astro) November 6, 2021 అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉన్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌కి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి మీరు చూడండి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) -
ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!
విశ్వంలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఛేదించడం కోసం మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని దృగ్విషయాల చిక్కుముడి విప్పి ఇప్పటికే కొంతమేరకు విజయాన్ని సాధించాడు. అందులో చెప్పుకోదగినదే.. ఈవెంట్ హారిజోన్.. ఈ ఈవెంట్ మొట్టమొదటి సారిగా కృష్ణ బిలాల( బ్లాక్‌హోల్) ఫోటోను తీయడానికి ఉపయోగపడింది. కాగా ప్రస్తుతం నైరుతి ఆఫ్రికాలోని నమీబియా శాస్త్రవేత్తల బృందం సుదూరాన ఉన్న గెలాక్సీలో జరిగిన నక్షత్ర భారీ విస్పోటనాన్ని గుర్తించారు. సుమారు ఈ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ విస్పోటనం ద్వారా అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన గామా-రే పేలుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. గామా రే పేలుళ్ల నుంచి అత్యంత శక్తివంతమైన రేడియేషన్ వెలువడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రేడియేషన్ విశ్వంతరాలపై జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గామా రే పేలుడు భూమి నుంచి సుమారు ఒక బిలియన్ కాంతి సంవత్పరాల దూరంలో జరిగింది. కాగా ఈ విస్పోటనం భూ గ్రహానికి అత్యంత సమీపంలో జరిగింది. సాధారణంగా గామా రే పేలుళ్లు భూమి నుంచి 20 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పేలుడు ప్రస్తుతం ఉన్నగామా రే పేలుళ్ల సిద్ధాంతాన్ని సవాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఎక్స్ రే, గామా పేలుళ్లలో భారీగా సారుప్యతలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశీలనకు సంబంధించిన విషయాలను డ్యూయిష్ ఎలెక్ట్రోనెన్-సింక్రోట్రోన్ (DESY) లో ప్రచురించారు. ఇది జర్మనీకి చెందిన అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అంతేకాకుండా హెల్మ్హోల్ట్జ్ అసోసియేషన్‌లో భాగం.ఈ పేలుళ్లలకు సంబంధించిన సిములేషన్ వీడియోను ఈ సంస్థ పోస్ట్ చేసింది. కాగా ఈ పేలుడు నుంచి వెలువడే అత్యంత ప్రకాశంతమైన నీలి రంగు కాంతిని కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు ఏంటి ఈ గామా రే పేలుళ్లు... సాధారణంగా నక్షత్రాలు తమ జీవితకాలన్ని ముగిసిపోయి, సూపర్నోవాగా రూపాంతరం చెంది అప్రకాశవంతమైన వస్తువులుగా మారి క్రమేపి కృష్ణబిలాలుగా మారుతుంటాయి. నక్షత్రాల్లో పేలుళ్లు సంభవించినప్పుడు అత్యంత శక్తివంతమైన ఎక్స్ రే, గామా దృగ్విషయాలు వెలువడుతుంటాయి. గామా-రే పేలుళ్లు సుదూరంగా ఉన్న గెలాక్సీలలో జరిగే అపారమైన శక్తివంతమైన పేలుళ్లు. ఈ పేలుళ్లు విశ్వంలో సంభవించే అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన విద్యుదయస్కాంత సంఘటనలు. గామా రే పేలుళ్లు కొన్ని సార్లు పది మిల్లీసెకన్ల నుంచి కొన్ని గంటల వరకు జరుగుతుంటాయి. -
5జీ నెట్‌వర్క్‌తో పర్యావరణానికి పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంపై బాలీవుట్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5జీ నెట్‌వర్క్‌తో విపరీతమైన రేడియేషన్ వెలువడుతుందని, తద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుందని చెప్పారు. ఇది మనుషుల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విలువైన జంతుజాలం, పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను వ్యతిరేకిస్తూ జుహీ చావ్లా సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సి.హరిశంకర్ ముందుకు విచారణకు రాగా, ఆయన దాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జుహీ చావ్లా పిటిషన్‌పై జూన్ 2న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 5జీ నెట్‌వర్క్‌తో రేడియేషన్ ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు పెరిగిపోతుందని జుహీ చావ్లా పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ ఒక్క మనిషి, జంతువు, పక్షి, కీటకం, చెట్టు ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోలేవని తెలియజేశారు. అంతేకాకుండా మన పర్యావరణానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుందన్నారు. -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
ఆవుపేడతో రేడియేషన్‌కు చెక్ పెట్టొచ్చట..!
న్యూఢిల్లీ: ఆవు హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలానే ఆవు పేడ, మూత్రాన్ని కూడా అనేక రకాలుగా వినియోగిస్తారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. ఇక ఆవు పేడను కూడా ఇప్పటికే దీన్ని ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆవు పేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడకు రేడియేషన్‌ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా తెలిపారు. ఆవు పేడతో తయారైన చిప్‌ని ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్‌ని నివారించడానికి ఈ ఆవు పేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది’’ అన్నారు కతిరియా. (చదవండి: అమెరికాలో పిడకల వేట!) ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవు పేడ చిప్‌ని ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి ‘గౌసత్వా కవచ్’ అని పేరు పెట్టారు. రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్‌ను ఫోన్లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. ‘గౌసత్వ కవచ్’ పేరుతో రూపొందించిన ఈ చిప్‌ను గుజరాత్‌కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. -
యమ డేంజర్..యూవీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత నాలుగైదు రోజులుగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో ఆల్ట్రా వయోలెట్ (యూవీ) రేడియేషన్ తీవ్రత ఎనిమిది పాయింట్లు ఉండగాల్సి ఉండగా, తాజాగా 11 పాయింట్లుగా రికార్డు అవుతుంది. ఫలితంగా నీడలో ఉన్నా మంట, వేడిగాలులు తప్పడం లేదు. ఉక్కపోతకు తోడు..వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం సిటిజన్లు ఇష్టం లేకపోయినా ఏసీ, కూలర్లను వినియోగించాల్సి వస్తుంది. కరోనా భయంతో గత కొంతకాలంగా వీటి వినియోగానికి దూరంగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం వీటి కొనుగోలుకు పోటీ పడుతున్నారు. రోజంతా వాటిని వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదువుతుంది. తాజాగా బుధవారం 68 ఎంయూలు నమోదైంది. ఈ ఏడాది.. ఈ సీజన్లో ఇదో రికార్డు. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కరెంట్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. హైఓల్టేజీ సమస్యతో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం ఆయా పవర్ ట్రాన్స్ఫార్మర్లకు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం విశేషం. ♦ రికార్డు స్థాయిలో వినియోగం... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 48 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడు లక్షల వరకు వాణిజ్య కనెక్షన్లు ఉండగా, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. లక్షకు పైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. హోటళ్లు, సినిమా హాళ్లు, భారీ మాల్స్ ఇంకా తెరుచుకోకపోయినా విద్యుత్ వినియోగం మాత్రం భారీగా నమోదవుతుంది. నిజానికి శీతల గాలుల్లో కరోనా వైరస్ బలపడే ప్రమాదం ఉందని భావించిన గ్రేటర్ వాసులు భయంతో గత రెండు నెలలుగా ఏసీలు, కూలర్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వడగాల్పులు వీస్తుండటంతో ఇష్టం లేక పోయినా ఏసీలు, కూలర్లను ఆన్ చేశారు. ఫలితంగా గత నాలుగైదు రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం ఫీక్ స్టేజ్‌కి చేరుకుంటుంది. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినియోగం తక్కువే అయినప్పటికీ...మార్చి, ఏప్రిల్ నెల రోజువారి సగటు వినియోగంతో పోలిస్తే...లాక్డౌన్ స డలింపు తర్వాత వినియోగం క్రమంగా పెరగడం విశేషం. మే మొదటి వారంలో గ్రేటర్లో రోజువారి సగటు వినియోగం 54 ఎంయూలు ఉండగా...ప్రస్తుతం 68 ఎంయూలకు చేరుకోవడం గమనార్హం. వెంటాడుతున్న నిర్వహణ లోపం.... వేసవికి ముందే లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో తలెత్తే ఆయిల్ లీకేజీలను అరికట్టడం, ఫీడర్లలో ఎర్తింగ్ సమస్య లేకుండా చూడటం వంటి పునరుద్ధరణ పనులు నిర్వహించాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇందుకు ఏటా వంద కోట్లుకు పైగా ఖర్చు చేస్తుంది. నిర్వహణ లోపానికి అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో హై ఓల్టేజీ సమస్య తలెత్తినప్పుడు సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లలో మంటలు తలెత్తి కాలిపోయే ప్రమాదం ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా కామినేని ఆస్పత్రి సమీపంలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో తలెత్తిన విద్యుత్ ప్రమాదానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ మొదటి వారంలో గాలివానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లూజ్ కాంటాక్ట్‌లు, వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించక పోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు ప్రస్తుతం నగరంలోని అనేక ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీ తదితర సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని సరి చేయక పోవడం వల్ల వాటిలో మంటలు వచ్చి కాలిపో యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పిట్ట కథలు
మనకు తొట్టతొలి పిట్టకథ రామాయణం. క్రౌంచ మిథు నాన్ని ఒక బోయ చంపాడు. తొలి సహగమనం కూడా అక్కడే జరిగింది. శోకం లోంచి శ్లోకం పుట్టింది. మహేతిహాసానికి నాంది వాక్యమైంది. క్రౌంచ పక్షుల్ని వాడుకలో కవుజు పిట్టలంటారు. చుక్కల చుక్కల రెక్కలతో చూడముచ్చటగా ఉంటాయి. పిట్టమాంస ప్రియులు కవుజు రుచి పరమాద్భుతం అంటారు. వేటగాళ్లు దీన్ని చాలా తెలివైన పిట్టగా చెబుతారు. అనవసరంగా ఇది ఎక్కడా కూత వెయ్యదు. కూతతో ఉనికిని చాటుకుని ప్రాణం మీదికి తెచ్చుకోదు. అందుకే వేటగాళ్లు దీన్ని వేటాడాలంటే కవుజు సాయమే తీసుకుంటారు. షికారీల దగ్గర పెంపుడు కవుజులుంటాయ్. నూకలుజల్లి కౌజుల్ని అక్కడ వదులుతారు. పెంపుడు కౌజు చేత ‘ఇక్కడ మేతలు న్నాయ్ రమ్మని’ కూతలు వేయిస్తారు. పాపం నమ్మి బయటి కవుజులు వచ్చి ముగ్గులో వాల్తాయ్. మరు క్షణం వేటగాడి వలలో పడతాయి. మనిషి తిండి కోసం ఎవరినైనా ఎన్ని మోసాలైనా చేస్తాడు. దేశంలో పిట్టలు, అనేకానేక పక్షి జాతులు కను మరుగవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతి ప్రియుల్ని చాలా బాధపెడుతోంది. నగ రీకరణ, అడవుల కొరత, పర్యావరణ కాలుష్యం, మనిషి జిహ్వ చాపల్యం–ఇవన్నీ పిట్టలు కనుమ రుగు అవడానికి కారణం. ఎక్కడ దాక్కున్నా మనిషి పిట్టల్నీ బతకనీయడం లేదు.మనిషి భూమిని, ఆకా శాన్ని, సముద్రాన్నీ ఇప్పటికే వశపరచుకున్నాడు. ఇప్పుడు ఇతర గోళాలమీద దృష్టి సారించాడు. చివ రకు మనిషి త్రివిక్రముడిగా మిగులుతాడో, భస్మాసు రుడుగా కనుమరుగు అవుతాడో కొన్ని తరాలు ఆగి చూడాల్సి ఉంది. అనేకానేక పరిశోధనల తర్వాత పక్షులు కూడా డైనోసార్స్ నుంచే ఆవిర్భవించాయని తేల్చి చెప్పారు. సమస్త చరాలకు డైనోయే మూల మని రుజువైంది. మనదేశంలో చాలామంది పక్షి ప్రియులున్నారు. వాళ్లు టెలిస్కోపులు, కెమెరాలు వేసుకుని కంచెలెంబడి అస్తమానం తిరుగుతుం టారు. వాటి కూతల్ని రికార్డు చేసి ఆనందిస్తుంటారు. ఒకప్పుడు ఎటుచూసినా గుంపులుగా కనిపించే కాకులు ఇప్పుడు అపురూపమైపోయాయి. పిచ్చు కలు ఇళ్లలో కిచకిచలాడుతూ, అద్దాల్ని చూసి ఆడు కుంటూ ఎక్కడంటే అక్కడ గూళ్లుపెట్టి గుడ్లు పెడుతూ నానా యాగీ చేస్తుండేవి. ఇప్పుడు లేవు. సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పిచుకలు పోయాయని చెబుతారు. పల్లెటూళ్లలో అతిపెద్ద పరి మాణంలో రాబందులు, కనిపించేవి. ఇవ్వాళ వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వాటిని పెంచ డానికి లక్షలు వెచ్చించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. చెట్ల తొర్రలో కాపురముండే రామ చిల కలు, గువ్వలు, గోరువంకలు ఒకనాడు మనుషుల బాల్యాన్ని ఆనందంగా నింపేవి. అన్నం తినక మారాం చేసే పిల్లలకు చందమామ, పావురాలు, రామచిలకల్ని చూపి తల్లలు బువ్వలు తినిపించే వారు. తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట. ఎగిరే ఇంద్ర ధనుస్సులా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దా మంటే విజయదశమి పండగరోజు కూడా దర్శనమీ యడం లేదు. తక్కువ ఎగురుతూ, ఎక్కువ పరు గులు పెడుతుండే కంచెకోడి బలే రంగురంగుల పిట్ట. నిజంగా దాన్ని చూసి ఎన్నాళ్లు అయిందో. కోయిల కూతకి బదులు కూత వేస్తూ పిల్లలని కవ్వించేది. అది ఎప్పుడూ కన్పించడం తక్కువే. ఇప్పుడు ఉగాది పండగ చిత్రాల్లో పంచాంగం పక్కన, మామిడి పిందెల సరసన వేపకొమ్మకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నల్లటి కోయిల. తీతువుపిట్ట అరుపులు విన్నాంగానీ ఎప్పుడూ అది కంటపడలేదు. వడ్రంగిపిట్ట బాగా పరిచయం. మునుపు తమిళనాట పక్షి తీర్థం అని క్షేత్రం ప్రసిద్ధి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు ఎక్కడినుంచో అయిదు గద్దలు అక్కడకు దిగేవి. అర్చక స్వాములు సమర్పిం చిన ప్రసాదం తిని తిరిగి ఎగిరిపోయేవి. ఏరోజూ వేళ తప్పేవి కావు. వాటిని గరుత్మంత అవతారాలుగా భావించేవారు. పాతికేళ్ల క్రితం వంద ఉన్న చాలా పక్షులు ప్రస్తుతం మూడు, అయిదుకి పడిపోయాయి. ఇప్పటికీ ఎక్కువ రకాల పక్షులు, పాములు తిరుమల ఏడుకొండలమీదే ఉన్నాయని చెబుతారు. పక్షుల్ని సంరక్షించే బాధ్యత ఏడుకొండలవాడికే అప్పగిం చాలి. అనువైన ఒక కొండని పక్షి ఆశ్రయంగా, కణ్వా శ్రమంగా తీర్చిదిద్దాలి. అపురూపమైన అరుదైన పక్షి జాతుల్ని స్వామి సన్నిధిలో కాపాడాలి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
పిట్ట ‘కొంచెమే’!
సాక్షి, హైదరాబాద్ : ఏడాదికి వివిధ రకాల సాధారణ పక్షుల్లో 80 శాతం వరకు తగ్గిపోతున్నాయి. గత 25 ఏళ్ల కాలంలో దేశంలోని ఐదో వంతుకు పైగా వివిధ పక్షి జాతుల (షార్ట్ టోవ్డ్స్నేక్ ఈగిల్ (గద్ద) మొదలుకుని సర్కిర్ మల్కోటాగా పిలిచే చిన్నపక్షి వరకు) సంఖ్య తగ్గిపోయింది. ఊర పిచ్చుక, పిట్ట వంటి సాధారణంగా కనిపించే పక్షిజాతి క్షీణత నుంచి కొంత మెరుగు పడినా... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలోనే తొలిసారిగా వివిధ రకాల పక్షి జాతులపై స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్–2020 (ఎస్‌వోఐబీ) పేరిట డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, వైల్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వెట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, ఏ ట్రీ, బీఎన్హెచ్ఎస్ ఇండియా, ఎఫ్ఈఎస్, ఎన్సీబీఎస్, సాకాన్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సమగ్ర నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ–బర్డ్ ప్లాట్‌ఫామ్‌పై 867 భారత పక్షుల రకాలకుసంబంధించి 15,500 మందికి పైగా పక్షి వీక్షకులు తమ పరిశీలనాంశాల ఆధారంగా ఒక కోటికి పైగా అప్లోడ్ చేసిన వివరాలు, సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను తయారు చేశారు. పక్షుల సంఖ్య తగ్గిపోవడానికి స్పష్టమైన కారణాలు కనుక్కోవాల్సిన అవసరముందని సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నివేదిక విడుదల సందర్భంగా ఎస్‌వోఐబీ సభ్యుడు సోహెల్ ఖాదర్ పేర్కొన్నారు. రామ చిలుకల నుంచి కాకుల దాకా... రాష్ట్రంలో రామ చిలుకలు, పాలపిట్ట, పిచ్చుకలు, గద్దలు చివరకు కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. అదే సమయంలో మనుషులకు ఆరోగ్యపరంగా నష్టం చేకూర్చే పావురాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. పావురాల విసర్జనలు ఎండిపోయాక పొడిగా మారి గాలిలో కలిసి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పక్షుల్లో మొండిజీవిగా, ఎక్కడైనా బతకగలిగే ఓర్పు, నేర్పు ఉన్న జీవిగా గుర్తింపు పొందిన కాకులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా కాకుల గుంపులు కనిపించేవి.. ఇప్పుడు ఇక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తున్నాయని ఆయా రకాల పక్షుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పక్షుల సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోవడానికి... నగరీకరణ పెరిగి చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం ఒక కారణం కాగా.. కాలుష్యం, వివిధ రూపాల్లోని రేడియేషన్ మరో కారణం. అదేవిధంగా పంటలు పండించడంలో, పండ్ల చెట్ల పెంపకంలో పురుగు మందులు, రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం ముఖ్య కారణం. కాలుష్యం, రేడియేషన్ ప్రభావం ‘పక్షులు స్వేచ్ఛగా పెరిగే వాతావరణం తగ్గిపోవడం, కాలుష్యం పెరగడంతో పాటు వివిధ రూపాల రేడియేషన్‌తో పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. గత 15 ఏళ్లుగా ఆయా అంశాలను దగ్గర నుంచి గమనిస్తున్న నాకు పక్షుల సంఖ్యలో తగ్గుదల స్పష్టంగా గోచరిస్తోంది. పక్షులను కాపాడుకోవడంలో ప్రజల జీవన విధానం, అనుసరిస్తున్న పద్ధతుల్లో కచ్చితమైన మార్పు రావాల్సిన అవసరముంది. కాలుష్యం, రేడియేషన్ పెరగడంతో పక్షులు గుడ్లు పెట్టినా వాటిని పొదగడం లేదు. ఆధునిక వసతులతో కూడిన వ్యవస్థ, దానితో పాటు ప్రకృతి, పర్యావరణం రెండూ అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటేనే ప్రాణకోటికి మనుగడ. పక్షులను కాపాడుకుని, అవి సహజ సిద్ధంగా ఉండేలా చేసినపుడే మానవాళికి కూడా వివిధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది’. –సాక్షితో జి.సాయిలు, ఫారెస్ట్ ప్లస్ 2.0 రీజినల్ డైరెక్టర్, బయో డైవర్సిటీ కన్జర్వేషనలిటిస్ట్ భారీగా పెస్టిసైడ్స్ వినియోగంతో తీవ్ర నష్టం ‘పంటల దిగుబడి పెంచేందుకు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయనాల వినియోగం పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలపిట్ట వంటి పక్షి పంట పొలాలపై క్రిములను తిని జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం పెస్టిసైడ్స్‌ను అడ్డూఅదుపు లేకుండా ఉపయోగిస్తుండటంతో క్రిమి, కీటకాలు లేక పాలపిట్టల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రామ చిలుకలు, ఊర పిచ్చుకలదీ ఇదే పరిస్థితి. పండ్ల చెట్లు ఎక్కువ ఫలాలు ఇచ్చేందుకు పురుగు మందులు వినియోగిస్తుండటంతో వాటిని తిని రామచిలుకలు చచ్చిపోవడమో లేక వాటి పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమో జరుగుతోంది’. – ‘సాక్షి’తో శంకరన్, వల్డ్లైఫ్ విభాగం ఓఎస్డీ -
ప్రకృతి సేద్యంతోనే భూతాపానికి చెక్!
వాల్టర్ యన.. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన సుప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్టు, వాతావరణ శాస్త్రవేత్త. హెల్దీ సాయిల్స్ ఆస్ట్రేలియా సంస్థ వ్యవస్థాపకులుగా రైతులతో మమేకమై పనిచేస్తుంటారు. భూతాపోన్నతికి, కరువు కాటకాలకు ఎటువంటి ఆచ్ఛాదనా లేని భూమి ఎండ వేడిమిని వాతావరణంలోకి తిరగ్గొట్టడం (రీ రేడియేషన్) వల్ల సహజ నీటి చక్రం (నేచురల్ వాటర్ సైకిల్) చెదిరిపోవడమే మూల కారణమన్నది ఆయన విశ్లేషణ. ఏడాది పొడవునా బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచేలా(గ్రీన్ కవర్) ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తే వాతావరణంలోని కర్బనాన్ని జీవద్రవ్యం ద్వారా భూమిలో స్థిరీకరించడం (సాయిల్ కార్బన్ స్పాంజ్) సాధ్యమవుతుందని, తద్వారా భూమిని చల్లబరిచి సహజ నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోవచ్చని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. తీవ్ర కరువున్న ప్రాంతాల్లో సైతం క్రమంగా పదేళ్లలో కరువును శాశ్వతంగా పారదోలవచ్చని, భూతాపోన్నతిని ఉపశమింపజేయవచ్చని అంటున్నారాయన. మన దేశానికి మొదటి సారి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఇటీవల సందర్శించారు. అనంతపురం వంటి తీవ్ర కరువు జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రుతుపవనాల రాకకు ముందే విత్తనం వేసే (ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్) వినూత్న పద్ధతి రైతులకు ఉపయోగపడటంతోపాటు భూతాపాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అంటున్న వాల్టర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖి.. ► భూతాపోన్నతితో నెలకొన్న వాతావరణ ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రపంచం అంతటా ఇవ్వాళ మనం చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం(ప్రపంచవ్యాప్తంగా దీన్నే రీజనరేటివ్ అగ్రికల్చర్ అని అంటున్నారు) ద్వారా మాత్రమే పరిస్థితిని చక్కదిద్దగలమని గత కొన్నేళ్లుగా మీరు చెబుతున్నారు కదా.. అదెలా..? భూతాపం, కరువులకు ప్రధాన కారణం విచక్షణా రహితంగా అడవులను నరికివేస్తూ నేలను ఎండబారిన పడెయ్యడం, పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో గత వందేళ్లుగా ఏక పంటలను సాగు చేయడం వల్ల ప్రతి హెక్టారు భూమిలో నుంచి ఏటా 5–10 టన్నుల కర్బనాన్ని చేజేతులా గాల్లో కలిపేస్తున్నాం. భూముల్లో 5%గా ఉండాల్సిన సేంద్రియ కర్బనం.. అత్యంత కనిష్ట స్థాయి 0.3%కి దిగజారింది. అందువల్ల మన భూములు నీటిని నిలుపుకోలేక ఉత్పాదకతను కోల్పోయాయి. అంతేకాదు, యావత్ వాతావరణాన్ని చల్లబరిచే ప్రాణశక్తిని సైతం కోల్పోయాయి. అందువల్ల ‘సహజ నీటిచక్రం’ దెబ్బతిన్నది. కరువు కాటకాలు, అకాల వర్షాలు, భూతాపం అపరిమితంగా పెరిగిపోవడం.. ఇవన్నీ ‘సహజ నీటి చక్రం’ దెబ్బతినటం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలే. ► దెబ్బతిన్న నీటిచక్రాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వ్యవసాయం వల్ల సాధ్యమవుతుందా? సాధ్యమే. భూతాపాన్ని నిజంగా తగ్గించాలంటే.. మనం మొదట చేయాల్సింది రసాయనాలతో పారిశ్రామిక వ్యవసాయం చేయటం మాని, భూములను సజీవవంతం చేసే çపకృతి వ్యవసాయం చేపట్టాలి. భూమి అంతటికీ దట్టమైన ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పించాలి. భూములు ఎండ బారిన పడకుండా ఒకటికి నాలుగు పంటలతో, తోటలు చెట్లతో 365 రోజుల పాటు కప్పి ఉంచేలా గ్రీన్‌కవర్ పెంచగలిగితే భూతాపాన్ని తగ్గించెయ్యవచ్చు. వాతావరణంలో అతిగా పోగుపడిన కర్బనాన్ని తిరిగి భూమిలోకి జీవ ద్రవ్యం రూపంలో స్థిరీకరించవచ్చు (ఈ ప్రక్రియనే ‘సాయిల్ కార్బన్ స్పాంజ్’ అంటున్నారు). సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉండి స్పాంజ్ మాదిరిగా నీటిని పట్టి ఉంచే సజీవ భూముల సాయంతో మాత్రమే 365 రోజులు గ్రీన్ కవర్ పెంచగలుగుతాం. అప్పుడే గతి తప్పిన నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోగలం. భూతాపాన్ని అరికట్టడం వీలవుతుంది. పారిశ్రామిక వ్యవసాయాన్ని వదిలెయ్యకుండా, భూములను తిరిగి సజీవవంతంగా చేసుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టకుండా భూతాపాన్ని అరికట్టడం అసాధ్యం. పదిహేనేళ్లుగా నేను ఇదే చెబుతున్నాను. అయితే, భారత దేశంలో మీరు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇందుకు దోహదపడతాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న భూములను స్వయంగా పరిశీలించారు కదా. మీకెలా అనిపించింది? ప్రకృతి వ్యవసాయ పద్ధతి భూములకు, రైతులకు, వాతావరణానికి నిస్సందేహంగా ఎంతో మేలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే.. అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో కూడా రుతుపవనాల రాకకు ముందే విత్తనాలు వేయడం(ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్) చాలా అద్భుత ఫలితాలనిచ్చే ప్రయోగం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏడాది పొడవునా పంటలతో నిండి ఉండేలా భూములకు సజీవ ఆచ్ఛాదన కల్పించడానికి ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొలాలు చూసి నేనెంతో ముగ్ధుడినయ్యాను. చాలా దేశాలు తిరిగాను. ఇలాంటి మెరుగైన సాగు పద్ధతి క్షేత్రస్థాయిలో అమలులో ఉండటం మరెక్కడా చూడలేదు. ఇది ప్రపంచానికే అనుసరణీయమైన గొప్ప ఉదాహరణగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అయితే, సీజనల్ పంటల సాగుతోపాటు.. పండ్ల తోటలు వేయటం, ఇతర ప్రయోజనకరమైన జాతుల చెట్లు పెంచుతూ వాటి మధ్యలో రకరకాల పంటలను ఏడాది పొడవునా సాగు చేయడం(ఆగ్రో ఫారెస్ట్రీ) ద్వారా భూమిని సాధ్యమైనంత వరకు కప్పి ఉంచేలా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వంతోపాటు చిన్న, సన్నకారు రైతులు కీలకపాత్ర పోషించాలి. ► రుతుపవనాల రాకకు ముందే పొడి వాతావరణంలో విత్తనాలు వేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఏ విధంగా విశిష్టమైనదో శాస్త్రీయంగా వివరిస్తారా? ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేయడంతోపాటు ఒకటికి పది రకాల ఏక దళ, ద్విదళ పంటల విత్తనాలను బీజామృతంతో శుద్ధిచేసి వర్షం రాకకు ముందే విత్తుతున్నారు. గడ్డీ గాదాన్ని, పొట్టు వంటి పంట వ్యర్థాలను నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ద్రవజీవామృతం పిచికారీ చేస్తున్నారు. వర్షం రావడానికి ముందుగానే విత్తినప్పటికీ.. అంతటి పొడి వాతావరణంలోనూ దొరికిన కొద్దిపాటి తేమతోనే ఈ విత్తనాలు మొలకెత్తి, మిశ్రమ పంటలు పచ్చగా పెరుగుతున్నాయి. వర్షానికి ముందే అతికొద్ది పరిమాణంలోనైనా మూడు రకాలుగా నీరు సమకూరటం వల్లనే ఈ విత్తనాలు మొలిచి పెరుగుతున్నాయి. వర్షం పడిన తర్వాత మరింత పుంజుకొని భూమికి గ్రీన్ కవర్‌గా మారుతున్నాయి. వానకు ముందే వేసిన విత్తనం మొలవడానికి దోహదపడుతున్న నీటి వనరులు ఇవి.. ఘనజీవామృతం, జీవామృతంలోని పిండిపదార్థాన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసినప్పుడు నీరు విడుదలవుతుంది. ప్రతి గ్రాము పిండి పదార్థానికి 6 గ్రాముల చొప్పున నీరు విడుదలవుతుంది. రెండోరకం నీటి వనరు.. ఎండాకాలంలో కూడా మట్టి కణాల చుట్టూ సూక్ష్మ స్థాయిలో నీటి జాడ(వాటర్ ఫిల్మ్) ఉంటుంది. కానీ, ఈ నీటిని మొక్కల పీచు వేర్లు కూడా పీల్చుకోలేవు. అయితే, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ద్వారా వేర్ల దగ్గర పెరిగిన మైకోరైజా శిలీంధ్రపు పోగులు (ఒక మీటరు ఘనపు మీటరు సజీవవంతమైన మట్టిలో 25 వేల కిలో మీటర్ల పొడవు వరకు శిలీంధ్రపు పోగులు విస్తరిస్తాయి) ఈ నీటిని పీల్చుకొని వేర్లకు అందిస్తాయి. పొడి వాతావరణంలో విత్తనం మొలకెత్తడానికి తేమ ఇలా లభిస్తుంది. మూడో రకం.. మొలక వచ్చిన తర్వాత ఆ ఆకులు వాతావరణంలో నుంచి నీటి తేమను రాత్రి పూట పీల్చుకొని పెరుగుతాయి. ఎండాకాలం బొత్తిగా నీరే లేదు అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇలా నీటి వనరులు ప్రకృతిలోనే నిగూఢంగా దాగున్నాయి. ఉపాయంతో ఆ వనరులను అందిపుచ్చుకోవడానికి ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ వంటి వినూత్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. పంటకు– పంటకు మధ్యలో నవధాన్యాలను పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసి, భూమిలో కలియదున్ని (ఇలా భూమిలోకి చేరిన సేంద్రియ కర్బనం ఒక గ్రాముకు 8 గ్రాముల నీటిని పట్టి ఉంచగలుగుతుంది).. కొద్ది రోజుల్లోనే మళ్లీ పంటలు వేసుకుంటూ ఏడాది పొడవునా భూమిని కప్పి ఉంచుతున్న రైతులను కూడా ఇక్కడ కలుసుకున్నాను. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ► అనంతపురం జిల్లాలో కూడా ఇలా జరిగిందా? ఇందులో శాస్త్రీయత ఎంత? అవును. ఇదంతా శాస్త్రీయంగానే జరిగింది. గత మే నెలలో వానకు ముందే విత్తిన పంటలు మొలిచాయి. జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 100 ఎం.ఎం. వర్షం పడింది. పంటలు మాత్రం హెక్టారుకు 12 నుంచి 15 టన్నుల బరువు మేరకు పెరిగాయి. 15 టన్నుల బరువున మొక్కలు (బయోమాస్) పెరగాలంటే 15 వేల టన్నుల నీరు అవసరం. ఒక గ్రాము బయోమాస్ పెరగాలంటే ఒక లీటరు నీరు అవసరం. 100 మిల్లీ మీటర్ల వర్షం హెక్టారు పొలంలో కురిస్తే, వెయ్యి మెట్రిక్ టన్నుల నీరు లభించినట్లు లెక్క. అనంతపురంలో కురిసిన 100 ఎం.ఎం. వర్షంతో లభించిన వెయ్యి మెట్రిక్ టన్నులు పోను.. 12 టన్నుల పంటల బయోమాస్ పెరగడానికి దోహదపడిన మిగతా 11 వేల టన్నుల నీరు ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో నుంచే! ► 365 రోజులూ భూమిని పంటలు, చెట్ల పచ్చదనంతో కప్పి ఉంచినప్పుడు రైతుకు ఎన్నాళ్లలో ప్రయోజనం కనిపిస్తుంది? ప్రకృతి వ్యవసాయ సూత్రాలన్నీ పాటించే పొలంలో రైతుకు మొదటి సంవత్సరం నుంచే దీని సత్ఫలితాలు కనిపిస్తాయి. భూమి సజీవవంతం అవుతుంది. మట్టి భౌతిక జీవ రసాయనిక స్థితిగతుల్లో, దిగుబడిలో మొదటి మూడేళ్లూ చాలా ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తుంది. ► భూతాపం తగ్గి, కరువు పూర్తిగా పోవడానికి ఒక ప్రాంతంలో కనీసం ఎంత విస్తీర్ణంలో గ్రీన్ కవర్ కల్పించాల్సి ఉంటుంది? కనీసం 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ కవర్ పెంచితే ఉష్ణోగ్రతలో క్రమంగా తేడా తెలుస్తుంది.10 ఏళ్ల కాలంలో 90% మేరకు నీటి చక్రం పునరుద్ధరణ సాధ్యమవుతుంది. నేను నివసించే కాన్బెర్ర(ఆస్ట్రేలియా రాజధాని)లో వెయ్యి హెక్టార్లలో గ్రీన్ కవర్ ఉండటం వల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అక్కడ 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తేడా వచ్చింది. ఆసియాలో గత 20 ఏళ్లలో రుతుపవనాల విశ్వసనీయత 30 శాతం తగ్గిపోయింది. భూములను పచ్చదనంతో నింపితే వాతావరణంలో రీరేడియేషన్ తగ్గి కూలింగ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. మేఘాలు వర్షించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎక్కువగా మొక్కలు నాటడంతోపాటు.. భూములను 365 రోజులూ పంటల పచ్చదనంతో కప్పి ఉంచేలా వ్యవసాయ పద్ధతిని మార్చుకుంటే తప్ప భూతాపాన్ని తగ్గించడం, కరువును శాశ్వతంగా పారదోలడం అసాధ్యం. (Walter jehne వీడియో ప్రసంగాల కోసం యూట్యూబ్‌లో వెతకండి) ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న పత్తి పంటను పరిశీలిస్తున్న వాల్టర్ యన రైతులతో ముచ్చటిస్తున్న వాల్టర్ యన తదితరులు -
సెల్‌ఫోన్ వినియోగం తగ్గించండిలా...
ఇటీవల సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ కారణంగా మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఇది నిత్యం చర్చల్లో ఉండే ఒక (డిబేటబుల్) అంశం. ఇక సెల్‌ఫోన్ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీనినుంచి రేడియేషన్ వెలువడుతుందన్నది నిర్వివాదాంశం. ఇక రేడియేషన్‌తో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా తెలిసిందే. అందుకే సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని వైద్యనిపుణులు, పరిశోధకులు/అధ్యయనవేత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలివి... మీ మొబైల్‌ఫోన్ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. సెల్‌ఫోన్‌ను షర్ట్ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్ పార్ట్స్‌కు దగ్గరగా ఉండేలా ప్యాంట్ పాకెట్స్‌లో ఉంచడం అంత మంచిది కాదు. పౌచ్‌లో ఉంచడమే మంచిది. వీలైతే బ్రీఫ్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్‌ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోండి. మీటింగులు, కాన్ఫరెన్స్‌హాల్స్, దేవాలయాలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి. పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా ఉంచండి. అదనపు ఫీచర్లు ఉన్న సెల్ఫోన్లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్ ఆడటానికి కూడా సెల్‌ఫోన్ ఇవ్వకండి. ఎక్కువసేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్లైన్నే ఉపయోగించాలి. ఇక సెల్ఫోన్లోనే ఎక్కువ సేపు కాల్ చేయాల్సి వస్తే తరచు ఫోన్‌ని కుడి చెవికి, ఎడమ చెవికి ఇలా మారుస్తుండాలి. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడడం ప్రమాదకరం. సెల్‌ఫోన్స్‌తో పోలిస్తే హెడ్ సెట్స్ నుంచి రేడియేషన్ వెలువడటం తక్కువ. అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే హెడ్‌ఫోన్స్ కూడా వాడటం మంచిదే. వినేటప్పుడు కంటే మాట్లాడేటప్పుడు మన ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం కొంత మేలు. దేహంలోని మృదువైన కండరాలపై రేడియేషన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయానికి ఎదురుగానో, ఒళ్ళో పెట్టుకునో మాట్లాడడం వద్దు. ఏంటెన్నా క్యాప్స్, కీపాడ్ కవర్స్ వంటివి కనెక్షన్ నాణ్యతను తగ్గిస్తాయి. ఇది ఫోన్‌ను మరింత శక్తిమంతంగా పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా రేడియేషన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. సెల్‌ఫోన్‌ను ఉపయోగించండిలా... సెల్‌ఫోన్‌ను అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితం చేయండి. మాట్లాడటం కంటే వాట్సాప్, మెసేజెస్ రూపంలోనే వీలైనంతవరకు ఎక్కువ సమాచారం పంపండి. సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అనవసరమైన కాల్స్‌ను చాలావరకు తగ్గించుకోవచ్చు. పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడిపోవడం అడిక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఫోన్‌ను కేవలం సంభాషణలకు మాత్రమే పరిమితం చేయండి. ఎక్కువగా ఫోన్ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదని వ్యక్తిగతంగా దృఢమైన నిర్ణయం తీసుకోండి. అది ప్రాణానికి ప్రమాదం. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం అన్నది మీ సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ సూచనలు పాటించడం అన్నది మీ ఆరోగ్యమూ ఇటు మెడికల్గానూ, అటు సామాజికంగానూ చాలాకాలం బాగుండేలా చేస్తుంది. -
ప్రమాదంలో పుడమి కవచం
పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచానికి చిల్లు పడింది. ఈ చిల్లు నానాటికీ విస్తరిస్తోంది. కవచానికి ఏర్పడిన ఈ చిల్లులోంచి తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు నేలను తాకుతున్నాయి. వీటి తాకిడి వల్ల మనుషులు చర్మ కేన్సర్ బారిన పడుతున్నారు. సముద్రజీవులు ముప్పు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోకుంటే, భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులకూ ముప్పతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ సహజ కవచమే ‘ఓజోన్ పొర’. ఒక ఆక్సిజన్ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ అణువుకు మరో ఆక్సిజన్ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్’ను ‘ట్రైయాక్సిజన్’ అని కూడా అంటారు. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్ పొర మందం మారుతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, హెడ్రాక్సిల్, క్లోరిన్, బ్రోమిన్ వంటి వాటి వల్ల ఓజోన్ పొర దారుణంగా తరిగిపోతోంది. ఓజోన్ పొర సహజమందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా ఓజోన్ పొరకు చిల్లు పడిందని అంటాం. ధ్రువప్రాంతాల్లో ఓజోన్ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీరాలు మునిగిపోతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీత పరిమాణంలో వెలువడుతుండటం వల్ల ఓజోన్ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ అనర్థాలు ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లో మంటలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులను ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు. ప్రపంచ జనాభాకు అవసరమైన ఆక్సిజన్‌లో దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే అందుతోంది. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన సువిశాలమైన వర్షారణ్యాలు అమెజాన్ అడవులు. ఇవి బ్రెజిల్ సహా తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. గత ఆగస్టులో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఒక వ్యక్తి దమ్ముకొట్టి, ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్ పీక కారణంగానే దావానలం వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. వారాల తరబడి రగులుతున్న ఈ కార్చిచ్చును ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా, ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు బ్రెజిల్లో 77 వేల కార్చిచ్చు సంఘటనలు జరిగాయి. వాటిని రోజుల వ్యవ«ధిలోనే ఆర్పేశారు. అయితే, ఆగస్టులో చెలరేగిన కార్చిచ్చు మాత్రం ఇప్పటికీ అదుపులోకి రాకపోవడం యావత్ ప్రపంచాన్నే ఆందోళనలో ముంచెత్తుతోంది. అమెజాన్ అడవుల్లో వేలాది ఎకరాల మేరకు వృక్షసంపద మంటలకు ఆహుతవుతోంది. మంటలను చల్లార్చేందుకు బ్రెజిల్ సైనిక విమానాలు గగనతలం నుంచి భారీస్థాయిలో నీటిని గుమ్మరిస్తున్నాయి. అమెజాన్ కార్చిచ్చుపై ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ కూటములు, వివిధ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చల్లారని మంటల కారణంగా అమెజాన్ అడవుల్లో ఏ మేరకు విస్తీర్ణంలో చెట్లు నాశనమయ్యాయో కచ్చితంగా తెలియడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అమెజాన్ కార్చిచ్చును ‘అంతర్జాతీయ సంక్షోభం’గా అభివర్ణించారు. ఈ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక దేశాలన్నీ ముందకు రావాలని ఆయన జీ–7 సమావేశాల్లో పిలుపునిచ్చారు. అమెజాన్ కార్చిచ్చును చల్లార్చే ప్రక్రియకు సాయం చేయడానికి జీ–7 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేసినా, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం వాటి సాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అమెజాన్ కార్చిచ్చును అడ్డుపెట్టుకుని పారిశ్రామిక దేశాలన్నీ బ్రెజిల్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను పర్యావరణాన్ని నాశనం చేయాలనుకోవడం లేదని, బ్రెజిల్‌ను కాపాడుకోవాలనుకుంటున్నానని అన్నారు. అమెజాన్ కార్చిచ్చుపై అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ కార్చిచ్చు వల్ల చెలరేగే పొగలు వాతావరణంలోని ఎగువభాగానికి– అంటే స్ట్రాటోస్పియర్ వరకు చేరుకుంటాయని, దీనివల్ల ఓజోన్ పొరకు మరింత ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓజోన్ ఉపయోగాలూ అనర్థాలూ ఓజోన్ పొర సాధారణంగా వాతావరణానికి ఎగువ భాగమైన స్ట్రాటోస్పియర్ వద్ద ఉంటుంది. అది అక్కడ ఉండటమే క్షేమం. అక్కడి నుంచి ఓజోన్ పొర భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు చేరుకోకుండా అడ్డు పడుతుంది. వాతావరణంలోని దిగువభాగమైన స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అతి స్వల్పంగా ఉంటుంది. భూమ్మీద పరిసరాల్లో ఆక్సిజన్ 21 శాతం ఉంటుంది. మనం పీల్చేది ఆక్సిజన్ (ఓ2) మాత్రమే. మనుషులతో పాటు సమస్త జీవరాశుల శ్వాసక్రియకు ఓ2 రూపంలో ఉన్న ఆక్సిజన్ మాత్రమే అవసరం. భూమ్మీద పరిసరాల్లో ఓజోన్ అత్యంత స్వల్పస్థాయిలో– అంటే, పది లక్షల భాగాలకు ఒక వంతు (0.0001 శాతం) మాత్రమే ఉంటుంది. శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్‌కు ఎలాంటి వాసనా ఉండదుగాని, ఓజోన్‌కు వాసన ఉంటుంది. ఈ వాసన దాదాపు క్లోరిన్ వాసననుపోలి ఉంటుంది. భూమి పరిసరాల్లోని వాతావరణం దిగువ పొరలో ఓజోన్ పరిమాణం ఎక్కువైతే, దానివల్ల జీవరాశికి మేలు బదులు కీడే ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. మనుషులకు, జంతువులకు శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. ఓజోన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సజావుగా పండని పరిస్థితులు తలెత్తుతాయి. స్ట్రాటోస్పియర్ వద్ద షార్ట్వేవ్ అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల ఆక్సిజన్ ఓజోన్‌గా పరిణామం చెందుతుంది. భూమికి చేరువలో ఆవరించి ఉన్న వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్పై అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఏర్పడితే, భూవాతావరణానికి చేరువలోనే ఓజోన్ సాంద్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే పర్యావరణానికి చాలా అనర్థాలు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఓజోన్ పొర ఎందుకు అవసరం? అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్లనే ఏర్పడే ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో భూమి చుట్టూ ఆవరించి ఉండటం భూమ్మీద మనుగడ సాగించే జీవరాశికి అత్యంత అవసరం. ఓజోన్ పొర సూర్యుడి నుంచి 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యంతో (వేవ్‌లెంగ్త్) వెలువడే అతి నీలలోహిత కిరణాలను సమర్థంగా అడ్డుకోగలదు. ఫలితంగా అతి నీలలోహిత కిరణాల ప్రమాదకర రేడియేషన్ ప్రభావం నుంచి జీవరాశికి రక్షణ ఏర్పడుతుంది. సహజమైన ఈ రక్షణ కొరవడితే మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు తప్పదు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్ర పరికరాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించడం వల్ల ఓజోన్ పొర ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యంగా దక్షిణార్ధగోళంలో ఓజోన్ పొరకు చిల్లుపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించే ప్రమాదకర రసాయనాల వల్ల ఓజోన్ పొరకు నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు దశాబ్దాల కిందటే తమ పరిశోధనల్లో గుర్తించారు. ఫలితంగా ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 1987లో ప్రపంచంలోని ప్రధాన దేశాలు మాంట్రియల్ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఓజోన్ పొరకు 1 శాతం విఘాతం ఏర్పడితే, భూమ్మీద నివసించే మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2–5 శాతం మేరకు పెరుగుతాయి. క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరగడమే కాకుండా, మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. భూమ్మీద నివసించే మనుషులకు, పశుపక్ష్యాదులకు, సముద్రాల్లోను, నదుల్లోను జీవించే జలచరాలకు ఆహారాన్ని ఇచ్చే వృక్షజాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఫలితంగా జీవజాతులు క్రమంగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుంది. ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటోంది? పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్రపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రపరికరాలు పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడుక కూడా పెరిగింది. అధునాతన యంత్రపరికాలలో వాడే కొన్ని రసాయనాలు ఓజోన్ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాదాపు ఐదుదశాబ్దాల కిందటే ఈ సంగతిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా ‘ఓజోన్ డెప్లీటింగ్ సబ్‌స్టన్సెస్’ (ఓడీఎస్) అని పేరు పెట్టారు. ఈ ఓడీఎస్ రసాయనాలలో చాలావరకు రసాయనాలు పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంత సేపూ వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్ను దాటుకుని, స్ట్రాటోస్పియర్ను చేరుకున్నప్పుడే, అక్కడ ఓజోన్ పొరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఓజోన్‌తో జరిపే రసాయనిక చర్యల వల్లనే సమస్య తలెత్తుతోంది. ఇవి ఓజోన్ అణువు నుంచి ఒక్కో ఆక్సిజన్ పరమాణువును కాజేస్తాయి. ఫలితంగా ఓజోన్ తన సహజమైన ట్రైయాక్సైడ్ రూపాన్ని కోల్పోయి మామూలు ఆక్సిజన్ (డయాక్సైడ్–ఓ2) రూపంలో మిగులుతుంది. స్ట్రాటోస్పియర్కు చేరిన రసాయనాలు ఓజోన్ నుంచి కాజేసిన ఆక్సిజన్ పరమాణువును కలుపుకొని కొత్తగా రూపాంతరం చెందుతాయి. వీటి ప్రభావంతో ఓజోన్ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన ప్రదేశంలో ఖాళీ ఏర్పడి, సూర్యుడి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు దూసుకొస్తాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరోక్లోరో కార్బన్లు, కార్బన్ టెట్రా క్లోరైడ్, బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్లు వంటి రసాయనాలను ఓజోన్ పొరను దెబ్బతీసే ‘ఓడీఎస్’ రసాయనాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఓజోన్ పొరకు ఏర్పడే ముప్పును గుర్తించిన తర్వాత వీటిలో ‘హాలోన్స్’గా పిలిచే బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్ల వాడకాన్ని కేవలం అగ్నిమాపక యంత్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఓజోన్ను దెబ్బతీసే ఇతర రసాయనాలతో పోల్చుకుంటే, హాలోన్స్ పదిరెట్లు ఎక్కువగా ఓజోన్ను దెబ్బతీస్తాయి. భారీ ఎత్తున అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులు చెలరేగిన ప్రాంతాల్లో అనివార్యంగా హాలోన్స్ను ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓజోన్ పొర దెబ్బతినక తప్పని పరిస్థితులు ఉంటాయి. రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్ పొర ఓజోన్ పొర ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బాగా దెబ్బతింది. ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్ పొర మందం దాదాపు 5–9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్–నవంబర్ నెలల మధ్య కాలంలో ఓజోన్ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ వంటి ‘ఓడీఎస్’ రసాయనాల వినియోగం ఓజోన్ పొరకు మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు కిందకే వస్తాయి. ఇవి వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఓజోన్ పొరకు ఇవి కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక క్లోరిన్ పరమాణువు ఏకంగా లక్ష ‘ఓజోన్’ అణువులను దెబ్బతీయగలదు. ఇక బ్రోమిన్ అయితే క్లోరిన్ కంటే 40 రెట్లు ఎక్కువగా హాని చెయ్యగలదు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న ‘ఓడీఎస్’ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్ రసాయనాలదే సింహభాగం. ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల్లో వీటి వాటా 80 శాతానికి పైగానే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1995 సంవత్సరానికి ముందుగా తయారైన రిఫ్రిజిరేటర్లు, ఇళ్లల్లోను, వాహనాల్లోను ఉపయోగించే ఎయిర్ కండిషనర్ల లోను వీటి వాడుక విపరీతంగా ఉండేది. వీటితో పాటు ఆస్పత్రులలో ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్లు, స్టెరిలంట్స్, పరుపులు, కుషన్ల తయారీకి వాడే ఫోమ్, హోమ్ ఇన్సులేషన్ పదార్థాలను తయారు చేసే పరిశ్రమల్లోను క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ తెచ్చిపెడుతున్న ముప్పును గుర్తించిన తర్వాత వీటి స్థానంలో హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడటం మొదలైంది. ఇవి క్లోర్లోఫ్లోరో కార్బన్స్‌తో పోల్చు కుంటే కొంత తక్కువ హానికరమైనవి. ఇవే కాకుండా, భారీ అగ్నిమాపక యంత్రాలలో వాడే హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కోల్డ్ క్లీనింగ్, వేపర్ డీగ్రీజింగ్, కెమికల్ ప్రాసెసింగ్, పరిశ్రమల్లో వాడే జిగురు వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే మీథైల్ క్లోరోఫామ్ వంటివి కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఎలా నివారించగలం? ఓజోన్ పొర మరింతగా దెబ్బతినకుండా చూడాలంటే అదంతా మనుషుల చేతుల్లోనే ఉంది. మనుషులు కాస్త మెలకువ తెచ్చుకుని, ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ఓజోన్ పొరను కాపాడుకోవడానికి మనుషులు ముఖ్యంగా తగ్గించుకోవాల్సినవేవంటే... రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి. పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్ పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్ ఉత్పత్తులను వాడుకోవాలి. మాంట్రియల్ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్ రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించుకున్నాయి. అయితే, ఈ ఒడంబడికలో ఓజోన్ పొరకు ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్ ఆక్సైడ్ వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్ పొరను కాపాడుకోగలుగుతాం. -
కళ్లు తెరవండి...
సూర్యుడు భగభగా మండుతుంటేకళ్లు మూసుకుంటాం. కానీ... మూసుకునే ఉండలేంగా?!అందుకే...కళ్లు తెరవండి. ఎండాకాలం నిజాలతో కనువిప్పు కలిగించుకోండి. కంటికి ఏదైనా కనపడాలంటే కాంతి కావాల్సిందే. కానీ అదే కాంతి తీవ్రత మరీ ఎక్కువైతే? వేసవిలో కాంతి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. దాంతో ఆ కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు, ఇన్ఫ్రా రెడ్ కిరణాల ప్రతికూల ఫలితాలు కంటిని ప్రభావితం చేస్తాయి. ఈ వేసవిలో కాంతి తీవ్రతతో కంటిపై పడే దుష్ప్రభావాలు, ఇతరత్రా సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. అలాగే వేసవి కాంతి తీవ్రత నుంచి కంటిని రక్షించడం కోసం నాసిరకం కళ్లజోళ్ల వల్ల కంటికి కలిగే నష్టాలు, తీవ్ర కాంతి నుంచి కళ్లను రక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఏమిటీ కాంతి... దాంతో ఎలా కనిపిస్తుంది? మన కన్ను పనిచేయడానికి దోహదపడే కాంతి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. సూర్యుని నుంచి భూమికి చేరే అనంతమైన రేడియేషన్ పటలంలో మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ పరిమితమైన కాంతి మన కంట్లోని కంటిపాప ద్వారా వెళ్లి రెటీనాపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రెటీనాపై పడ్డ ప్రతిబింబాన్ని ఆప్టిక్ నర్వ్ మన మెదడుకు చేరవేసి, అదేమిటో తెలిపేలా చూపుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎన్నెన్నో రకాల రేడియేషన్... నిజానికి రేడియేషన్‌లో ఒక్క కాంతి కిరణాలు మాత్రమే కాకుండా... రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్... ఇలా ఎన్నెన్నో రకాల తరంగాలు ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్’ అంటారు. ఇందులో వేర్వేరు రకాల కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. నిజానికి ఆయా వేవ్లెంత్లను బట్టే ఆ రేడియేషన్‌ను వర్గీకరిస్తారు. అల రూపంలో ప్రసారితమయ్యే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరమే వేవ్‌లెంగ్త్. దీన్ని ప్రామాణికంగా తీసుకొని చూస్తే... మన కళ్లకు కనిపించే, మనం చూడటానికి దోహదం చేసే ఈ కాంతి కేవలం 380 – 780 నానో మీటర్ల (మైక్రాన్స్) రేంజ్లో మాత్రమే ఉంటుంది. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. హాని కలిగేది అల్ట్రా వయొలెట్,ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలు కంటికి హాని కలిగిస్తాయి. వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. ఇన్ఫ్రారెడ్ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. కాంతికి తక్షణం ఆవల ఉన్న రేడియేషన్, రకాలు మనకు కంటికి కనిపించే కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్‌తో మన కంటికి చాలా ప్రమాదం . కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్, అందులోని రకాల గురించి తెలుసుకుందాం. కాంతిపుంజం లేదా కాంతి కిరణానికి పక్కనే తక్కువ వేవ్‌లెంగ్త్‌లో ఉండే కిరణాలే అల్ట్రా వయొలెట్ కిరణాలు. అల్ట్రా వయొలెట్లోని మూడు రకాలు... కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవీ యూవి– ఏ, యూవీ– బీ, యూవీ– సీ వీటిలో మొదటి రెండిటి కంటే యూవీ – సీ చాలా ప్రమాదకరం. ఇన్ఫ్రా రెడ్ కిరణాలను ఇన్ఫ్రారెడ్ – ఏ, ఇన్ఫ్రారెడ్ – బీ, ఇన్ఫ్రారెడ్ – సీ అని మూడుగా వి¿¶ జించవచ్చు. ఈ మూడు రకాల కిరణాలూ కంటికి ప్రమాదకరమైనవి. రేడియేషన్‌తో కంటికి హాని ఇలా... సూర్యుడి నుంచి మొదలై, మొదట శూన్యంలో ప్రయాణం చేసే రేడియేషన్, భూమి ఉపరితలంలో ఉన్న వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరుతుంది. ఈ క్రమంలో రేడియేషన్‌లోని అత్యంత హానికారకమైన కిరణాలను ఓజోన్ పొర చాలా వరకు వడపోస్తుంది. అందువల్ల కేవలం 3 శాతం కిరణాలు మాత్రమే ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతి వల్ల కంటికి ఎలాంటి హాని ఉండదు గానీ తీవ్రమైన కాంతి వల్ల కంటికి జరిగే నష్టం రెండు రకాలుగా జరగవచ్చు. ఇందులో కంటికి తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్ అనర్థాలు’గా చెప్పవచ్చు. అదేపనిగా చాలాకాలం పాటు రేడియేషన్‌కు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కంటిపైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలూ పడవచ్చు. వీటినే ‘క్రానిక్ దుష్ప్రభావాలు’ గా పేర్కొంటారు. అల్ట్రా వయొలెట్ రకాల్లో యూవీ–ఏ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలావరకు తాత్కాలికమైనవి. యూవీ–ఏ కంటే యూవీ–బీ కిరణాలవల్ల కలిగే అనర్థాల తీవ్రత ఎక్కువ. అయితే వీటివల్ల కంటికి కలిగే అనర్థాలను వైద్యచికిత్సతో చాలావరకు చక్కదిద్దవచ్చు. కానీ యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొరే నిరోధించి, జీవకోటిని రక్షిస్తుంటుంది. హానికర కిరణాల దుష్ప్రభావం ఇలా... వాతావరణంలోకి ప్రవేశించిన ఈ కాంతి కిరణాలు కొన్నిసార్లు నేరుగానూ, మరికొన్నిసార్లు రిఫ్లక్షన్ చెంది కంటిపై పడి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే రిఫ్లెక్షన్‌తో కలిగే నష్టాలన్నిటిలో చాలా సందర్భాల్లో మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర, నీళ్ల ఉపరితలం వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనం డ్రైవింగ్ చేసేప్పుడు నేరుగా పై వైపు కంటే, ఒకింత కిందివైపుకే చూస్తూ వాహనాన్ని నడుపుతుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్ కిరణాలతో ఇలా దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. రిఫ్లెక్ట్ అయ్యే కిరణాలు సాధారణంగా కిందివైపు నుంచి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరతాయి కాబట్టి వాటి వల్ల పడే దుష్ప్రభావాలను టోపీ, గొడుగు లాంటి వాటితో ఆపలేం. మబ్బుపట్టి ఉన్నా.. వరండాలో ఉన్నా ... మబ్బు పట్టి ఉన్నప్పుడు ఈ అల్ట్రా వయొలెట్ కిరణాలను మబ్బులు అడ్డుకుంటాయి కాబట్టి వాటి తీవ్రత ఉండదని మనం భావిస్తుంటాం. కానీ... అది వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండాలాంటి బయటి గదుల్లో (ఇన్–డోర్స్‌లో) ఉన్నప్పటికీ... దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. ప్రత్యేకంగా యూవీ–సీ, యూవీ–బీ తరహాకు చెందిన కిరణాల వల్ల మరింత హాని జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే... మన కంటిలోపల ఉండే లెన్స్ యూవీ–బీ తరహా కిరణాలను చాలావరకు ఫిల్టర్ చేస్తుంది. అయితే... కొన్నిసార్లు మాత్రం ఈ యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి... సోలార్ బర్న్ రూపంలో రెటీనాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుంది. తాత్కాలిక దుష్ప్రభావాలు తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాల కారణంగా కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలావరకు తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చాలా సందర్భాల్లో యూవీ కిరణాలకు సుదీర్ఘకాలం పాటు ఎక్స్పోజ్ కావడం కూడా వల్ల అనర్థాలు సంభవిస్తాయి. వీటిని క్రానిక్ ‘సైడ్ఎఫెక్ట్స్’గా పేర్కొంటారు. క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్: దీర్ఘకాలం యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ అయితే ఈ కింది అనర్థాలు సంభవిస్తాయి. టెరీజియమ్: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున కంటి లోపలి కండ పింక్ రంగులో కనిపిస్తుంటుంది. ఈ కండ క్రమంగా పెరుగుతూ ఒక దశలో నల్లగుడ్డును పూర్తిగా మూసేస్తుంది. దాంతో చూపు పూర్తిగా తగ్గుతుంది. ఇలా టెరీజియమ్ అనే సమస్య రావడం అన్నది పట్టపగలు తీవ్రమైన కాంతిలో ఆరుబయట పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉంటుంది. అందువల్ల సముద్రం అలలపై సర్ఫింగ్ చేసేవారిలోనూ టెరీజియమ్ తరచుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్ ఐ’ అని కూడా అంటారు. క్యాటరాక్ట్: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే ముప్పుగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్పోజ్ కావడం వల్ల మామూలు కంటే కాటరాక్ట్ ముందుగానే వస్తుంది. అన్ని కాటరాక్ట్ కేసులను పరిశీలిస్తే... వాటిల్లో 10 శాతం కాటరాక్ట్ కేసులు యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చేవేనని చాలా అధ్యయనాల్లో తేలింది. మాక్యులార్ డీజనరేషన్: ఒంటిలో ఉన్నట్టే... మెలనిన్ అనే నల్లటి రంగునిచ్చే పదార్థం కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తూ కంటికి రక్షణ కల్పిస్తుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు గానీ, రెటీనాలో ఉండే ఎపిధీలియంలో గానీ యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటిచూపు క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. కంటిపై భాగంలో సంభవించే తీవ్రమైన దుష్ప్రభావాలివి... ∙ కనురెప్ప క్యాన్సర్లు ... కనురెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల వల్ల కనిపించే కొన్ని తీవ్రమైన అనర్థాలలో బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామోజ్ సెల్ కార్సినోమా, మెలనోమా అనే రకం కంటి క్యాన్సర్లు ప్రధానమైనవి. ∙ కంజెంక్టివాకు కలిగే అనర్థాలు: కంటిపై ఉండే పొర అయిన కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అని అంటారు. ఈ తరహా సమస్య వచ్చిన వారిలో కంటిపై ఉండే పొర మందంగా మారి పసుపు రంగును సంతరించుకుంటుంది. కంటిలోని నల్లపొర అంచుల పైకి రెండవైపుల నుంచి ఈ పొర పాకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్ ఇన్ ఐ’ అని కూడా అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారిపోవడం వల్ల కూడా ‘పింగ్వెక్యులా’ రావచ్చు. ∙ కార్నియాపై: కొందరిలో ఫొటోకెరటైటిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్ చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్ చేసే వారిలో సైతం నేరుగా పడే కాంతి కిరణాల వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్నెస్’ అంటారు. ∙ ఐరిస్ దెబ్బతినడం వల్ల: కొందరిలో ఐరిస్‌పై దుష్ప్రభావం పడవచ్చు. ∙ రెటీనా: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్ బర్న్ అంటారు. దీనివల్ల హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం కూడా ఇలాంటిదే. ఈ వేసవిలో కంటికి రక్షణ ఎలాగంటే... ∙ మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్ వాడాలి. ∙ 100 శాతం లేదా 400 యూవీ పొటెక్షన్ (ఇవి 400 మైక్రాన్స్ వరకు వడపోస్తాయి) ఇచ్చే లేబుల్డ్ గ్లాసెస్ కూడా వాడవచ్చు. ∙ ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట ఫ్రేమ్ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్ ఎక్కువగా ఉండే గ్లాసెస్ మరింత మేలు చేస్తాయి. ∙ కొందరు ఏ రంగు గ్లాసెస్ అయితే మేలు అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. ∙ పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అంత సురక్షితమైనవి కావు. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే రక్షణ ఇస్తాయి. ∙ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్లు యూవీ ప్రొటెక్షన్ ఉన్న ఇంట్రా ఆక్యులార్ లెన్స్ (ఐఓఎల్స్)ను ఎంచుకోవాలి. ∙ కంటిపైన కాంతి నేరుగా పడకుండా అంచులు (బ్రిమ్) పెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్) ధరించడం మేలు. ∙ ఫొటో కెరటైటిస్ వంటి కండిషన్ ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి. ∙ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకూడదు. ∙కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. ∙ తరచూ కంటిపరీక్షలు చేయించుకోవడం. వేసవిలో కనీసం ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యవయసు దాటిన వారికి ఇది చాలా అవసరం. ∙నాసిరకం కళ్లజోళ్లలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకే సమర్థంగా అల్ట్రా వయొలెట్ కిరణాలను వడపోసే నాణ్యమైన గ్లాసులు వాడటం మంచిది. ∙వాహనాలపై ప్రయాణం చేసేవారికి తీవ్రమైన కాంతితో పాటు, గాలిలో ఎగిరి వచ్చే ఫ్లైయింగ్ అబ్జెక్ట్స్ కారణంగా కూడా కంటికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లోనూ కంటికి రక్షణ ఇచ్చే గ్లాసులు ధరించడం మంచిది. ∙ఇటీవల రకరకాల రంగుల అద్దాలు ఉన్న గ్లాసెస్‌ను ధరిస్తున్నారు. బ్లూ కలర్ ఉన్న గ్లాసులు అన్నిటికంటే చాలా ప్రమాదం. సాధ్యమైనంత రంగు అద్దాల కంటే వరకు డార్క్షేడ్లో నల్లటివే వాడటం మంచిది. ∙స్విమ్మింగ్‌పూల్‌లో ఈదేటప్పుడు తప్పక గాగుల్స్ వాడాలి. దీనివల్ల రెండు రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఒకటి యూవీ కిరణాల నుంచి; మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లోని కెమికల్స్ నుంచి. ∙చెమటతో నీళ్లు కళ్ల మీదికి జారినప్పుడు కళ్లను నలపకూడదు. ∙కళ్లు పొడిబారకుండా... డాక్టర్ సలహా మేరకు ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ వాడటం మంచిది. ∙ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. విటమిన్–ఏ ఎక్కువగా ఉండే తాజాపండ్లు, కూరగాయలు ఒంటితో పాటు కంటికీ మేలు చేస్తాయి. ∙ కంటినిండా నిద్రపోవాలి. ∙ పొగతాగకూడదు. ∙ అవసరమైనప్పుడు గదిలో తేమశాతాన్ని పెంచే హ్యుమిడిఫైయర్స్ వాడుకోవచ్చు. పిల్లల్లో ముప్పు మరీ ఎక్కువ... సాధారణంగా కాంతి మన కంటిలోకి కాంతి ప్రవేశించగానే మన ఐరిస్/ప్యూపిల్ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోతుంది. కాంతి తీవ్రతను బట్టి కంటికి రక్షణ కలిగించడం కోసం ప్రకృతి మనలో ఇలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మనం కనురెప్పలను కాస్త మూసి, చికిలించి చూస్తుంటాం. బయటి కాంతికి మన కన్ను అడ్జెస్ట్ అయ్యేవరకు ఇలా జరగడం మనందరికీ అనుభవమే. అలాగే బయటి నుంచి కాంతి తక్కువ ఉండే ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా కాసేపు మనకు కనపబడదు. మనం ఆ కాంతికి అడ్జెస్ట్ అయ్యాక మనకు చిరుచీకట్లోనూ కనిపిస్తుంది. దీనికి కారణం... కంటిపాప విశాలంగా విప్పారడమే. అయితే చిన్నపిల్లల్లో కంటి పాప సైజ్ ఎక్కువ. పైగా లెన్స్ ట్రాన్స్పరెంట్గానూ, క్లియర్గానూ ఉంటుంది. పైగా చిన్నపిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే పిల్లల్లో కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. ఇంకా ఎవరెవరిలో... ∙ కాటరాక్ట్ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్ లేని ‘ఇంట్రా ఆక్యులార్ లెన్స్’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ∙ యూవీ ప్రొటెక్షన్ లేని కాంటక్ట్ లెన్స్ వాడేవారిలోనూ దుష్ప్రభావాలు ఎక్కువ; ∙ టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడేవారు, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో, యాంటీ మలేరియా మందులు వాడే వారితోపాటు, ఇబూప్రొఫేన్ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో యూవీ ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎక్కువ. మరీ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు ఎప్పుడంటే... ∙కొందరు తమ వృత్తిరీత్యా చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. వారు సాధారణం కంటే చాలా ఎక్కువ కాంతిలో పనిచేస్తుంటారు. ఉదాహరణకు డ్రైవర్లు చాలా తీవ్రమైన కాంతిని అదేపనిగా చూడాల్సి వస్తుంది. అలాగే వేసవిలో పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. పైన పేర్కొన్న అనర్థాలు వీళ్లలో చాలా ఎక్కువ. ∙ఇక అత్యంత ఎక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేసే నీటి ఉపరితలానికి దగ్గరగా ఉండే... నదీప్రాంతాలు, సముద్రజలాల ఒడ్డులు (బీచ్‌ల) వంటి చోట్ల తిరుగాడేవారికి; ∙కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారికీ; ∙అలాగే చాలా ఎల్తైన పర్వతసానువుల్లాంటి (హిల్లీ ఏరియాస్) ప్రదేశాల్లో ఉండేవారికీ; ∙ తెల్లని దేహఛాయతో ఒంట్లో, కంట్లో మెలనిన్ తక్కువగా ఉండే వారికి, చిన్నపిల్లల్లో... కాంతికారణంగా కంటిపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఎక్కువ. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు,మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
బాబోయ్...సెల్ టవర్ మాకొద్దు
సాక్షి, టవర్‌సర్కిల్: నగరంలోని శ్రీరాంనగర్‌కాలనీలో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ను నెలకొల్పడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నగర అధ్యక్షుడు జెల్లో జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్శిటీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తోరోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెల్‌టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్‌తోపాటు కాలనీవాసులు అనారోగ్యం బారినపడతారన్నారు. అనుమతిని నగరపాలక సంస్థ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య టవర్‌ను ఎత్తేసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సాయిల్ల రాజమల్లయ్య, ఎర్రబెల్లి రవీందర్, బసాలత్‌ఖాన్, గొల్లె అమర్నాథ్, జావీద్, నర్సయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
అతి ప్రమాదకరమైన స్మార్ట్ఫోన్లు ఇవేనట!
సెల్‌ఫోన్ మనిషి జీవితంలో భాగమై పోయింది. ఒక నిత్యావసర వస్తువుగా అవతరించిన క్రమంలో చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఇక సోషల్ మీడియాకు బానిసలైపోతున్న ప్రస్తుత తరుణంలో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్ఫోన్లతోనే కాలక్షేపం.అయితే స్మార్ట్‌ఫోన్ వల్ల సాంకేతికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. వీటినుంచి వెలువడే రేడియేషన్‌తో ఆరోగ్యానికి ముప్పు కూడా అంతకంటే ఎక్కువే పొంచి వుంది. ఇది జగమెరిగిన సత్యం అయినా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. షావోమి, వన్ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్ఫోన్లు అతి ప్రమాదకరమైనవిగా పేర్కొంది. ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్ 16జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి, వన్‌ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. షావోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐఏ1, వన్‌ప్లస్ 5టీ స్మార్ట్ఫోన్లు ఈ వరుసలో ముందున్నాయి. షావోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్7 నిలిచింది. దీంతోపాటు యాపిల్ ఐ ఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల రేడియేషన్ కూడా అత్యధికంగానే నమోదైందని రిపోర్టు చేసింది. మరోవైపు అతి తక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ డివైస్‌లు నిలవడం గమనార్హం. ఎల్జీ, హెచ్‌టీసీ, మోటో, హువావే, హానర్కుచెందిన కొన్నిఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని నివేదించింది. ఇతర చైనా కంపెనీలు ఒప్పో, వివో తయారు చేసిన స్మార్ట్ఫోన్లను పరీక్షించలేదని పేర్కొంది. -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్‌టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
పోయిన రేడియోధార్మిక మూలకం.. ఎట్టకేలకు దొరికింది!
‘‘అమ్మో! రేడియోధార్మిక మూలకం సీఎస్ –137 కనిపించడం లేదు. రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్ నుంచి కనిపించకుండా పోయింది. దాని వల్ల చాలా ప్రమాదం’’ అని అమలాపురం ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు ఒక వైపు, ‘‘అవును ఆయన చెప్పింది నిజమే కానీ.. అంత ప్రమాదమేమీ కాదు’’ అంటూ ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ శేఖర్.. ఇలా విరుద్ధ ప్రకటనలు చేశారు. గత నాలుగైదు రోజులుగా ఈ రేడియోధార్మిక మూలకం చోరీ ఘటనపై రకరకాల వదంతులు కూడా వ్యాపించాయి. మరోవైపు ఇదెక్కడికి పోయింది? ఎవరు ఎత్తుకెళ్లారనే విషయంపైనా ఓఎన్జీసీ అధికారులు తమ శక్తి వంచన లేకుండా వెతికారు. అయితే ఎట్టకేలకు దాని ఆచూకీ గుర్తించారు. ఆ వివరాలను అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్‌పాయ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్: ఓఎన్జీసీ రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్‌లో లాగింగ్ యూనిట్ నుంచి కనిపించకుండా పోయిన రేడియో ధార్మిక మూలకం సీఎస్–137 కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలోని పాత ఇనుప సామాగ్రి దుకాణంలో లభ్యమైందని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్పేయ్ వెల్లడించారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేడియో ధార్మిక మూలం సీఎస్–137 దొరికిన విషయాలను వెల్లడించారు. ఈ నెల 17న ఓఎన్జీసీలో బేస్ కాంప్లెక్స్‌లో లాగింగ్ యూనిట్ నుంచి రేడియో ధార్మిక మూలకం సీఎస్–137 కనిపించకుండా పోయిందని సంస్థలోని అధికారి ఇ.పాపారావు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నెల 12న రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్ నుంచి కృష్ణా జిల్లా మల్లేశ్వరానికి తీసుకుÐð వెళ్లి తిరిగి ఈ నెల 14న బేస్ కాంప్లెక్స్‌లో వాహనాన్ని డ్రైవర్ పెట్టి వెళ్లిపోయాడన్నారు. ఈ నెల16న రేడియో ధార్మిక మూలకం సిఎస్–137 కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పోలీసులను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడంతోపాటు, ఓఎన్జీసి సంబంధిత అధికారులతో కలిసి తీవ్రంగా శోధించామన్నారు. ఈ మూలకం వల్ల భారీ ప్రమాదం ముంచుకొస్తుందని వదంతలు రావడంతో దానికోసం పోలీసు బృందాలు అన్ని కోణాలలోను దర్యాప్తు చేశారన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు సహకారంతో ఓఎన్జీసీ అధికారులు సహకారంతో ఎప్పటికప్పుడు సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళ్లామన్నారు. చివరకు బుధవారం మ«ధ్యాహ్నం నాలుగు గంటలకు కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో పాత ఇనుప సామగ్రి దుకాణంలో సీఎస్–137 లభ్యమైందన్నారు. దీని వెనుక ఎవరున్నదీ విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇన్స్పెక్టర్లు వరప్రసాద్, మురళీకృష్ణా రెడ్డి, ముక్తేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి రేడియోధార్మిక మూలకాన్ని గుర్తించామన్నారు. ఈ వస్తువును ప్రత్యేకమైన వాహనంలో అతి జాగ్రత్తగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్బన్ క్రైం ఏఎస్పీ వైవీ రమణారావు, తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
రేడియేషన్ పడకుండా ఉండాలంటే?
రేడియేషన్ సమస్య వల్ల గర్భస్త శిశువుల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండాలంటే సెల్ టవర్లు ఉన్న ప్రాంతాలలో ఉండకూడదా? లేక సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడకూడదా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.సుచిత్ర, మదనపల్లి సెల్ టవర్స్ నుంచి nonionizing కొంచెం ఎక్కువ ప్రీక్వెన్సీ 19-00 MHZ ఉన్న ఎలక్ట్రోమెగ్నటిక్ రేడియేషన్స్ విడుదల అవుతాయి. ఈ తరంగాల వల్ల వీటికి మరింత చేరువలో ఎక్కువ కాలం అక్కడే ఉన్నవాళ్లలో తలనొప్పి, కొద్దిగా మతిమరుపు, నిద్రపట్టకపోవడం, కొందరిలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనలు తేలిపాయి. అలాగే గర్భిణీలు సెల్ టవర్లకు మరీ సమీపంలో నివసిస్తుంటే పుట్టబోయే పిల్లల్లో, పుట్టిన తర్వాత వారిలో ఏకాగ్రత తగ్గడం, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని, జంతువులు మీద చేసిన కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు. అలాగే సెల్ఫోన్లలో రోజూ ఎక్కువ సేపు మాట్లాడటం, అవి శరీరానికి దగ్గర్లో ఎక్కువ సమయం, ఉండటం వల్ల కూడా శిశువుకి ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని జంతువుల మీద చేసిన కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత వీలు అయితే అంత సెల్ఫోన్లో మాట్లాడటం, వైఫై వాడి నెట్ చూడటం తగ్గిస్తే అంత మంచిది. కావాలంటే ల్యాండ్‌లైన్ ఫోన్ వాడుకోవచ్చు. సెల్ టవర్స్ నుంచి కనీసం అరకిలోమీటర్ దూరంలో ఉండటం మంచిది. రేడియేషన్ ఎఫెక్ట్ కంటే కూడా సెల్ఫోన్లతో, అనవసరమైన విషయాలు గంటలు గంటలు మాట్లాడటం, నెట్, ఫేస్బుక్ వంటివి చాలా సేపు చూడటం వల్ల అనవసరమైన సందేహాలు, భయాలు వంటివి ఏర్పడటం, మానసికంగా సరిగా ఉండకపోవడం వల్ల కూడా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సమయంలో టైమ్‌పాస్‌కి కొద్దిగా నడక, ధ్యానం, మంచి పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకోవటం మంచిది. ∙నా వయసు 25. ప్రస్తుతం మూడోనెల. గర్భిణులకు ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం... మొదలైనవి సమృద్ధిగా అందాలంటే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. నాకు పిండిపదార్థాలు ఎక్కువగా తినే అలవాటు ఉంది. ప్రెగ్నెన్సిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినవచ్చా?– ఆర్.శ్రీలత, తుంగతుర్తి గర్భిణీలలో శిశువు తొమ్మిది నెలల పాటు ఆరోగ్యంగా పెరగాలంటే, తల్లి నుంచి సరైన పోషకపదార్థాలు బిడ్డకు చేరాలి. అలాగే తల్లి శరీరంలో జరిగే మార్పులకు కూడా ఇవి అవసరం. తల్లీ బిడ్డ అవసరాలకు కూడా ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం మొదలైన మినరల్స్ ఎంతో అవసరం, కీలకం. ఇవి కొద్ది మోతాదులో రోజూ అవసరం కాబట్టి వాటిని మైక్రోనూట్రియంట్స్ అంటారు. ఐరన్ తల్లిలో రక్తం సమృద్ధిగా పెరగడానికి తోడ్పడుతుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. తద్వారా శరీరంలోని అన్నికణాలకు ఆక్సిజన్‌ను అందజేస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. కాల్షియం, ఎముకలు, దృఢంగా బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. జింక్, కణాలలోని డీఎన్ఏ మరియు ప్రొటీన్స్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, కండరాల నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పైన చెప్పిన మినరల్స్‌తో పాటు ఐయోడిన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా బిడ్డలోని అన్ని అవయవాల ఎదుగుదలకు ఎంతో అవసరం. ఆహారంలో తాజా ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, కొద్దిగా డ్రైఫ్రూట్స్ వంటివి అలాగే మాంసాహారలు అయితే గుడ్లు, మాంసం, చేపలు మితంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకపదార్థాలు తల్లి నుంచి బిడ్డకు చేరి, బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. పిండిపదార్థాలలో ఎక్కువగా కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగటం, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి షుగర్ శాతం పెరిగి గర్భంలో మధుమేహవ్యాధి వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న బరువును బట్టి, ఫ్యామిలీ హిస్టరీ షుగర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది. అలాగే డాక్టర్ సలహామేరకు పోషక ఆహారంతో పాటు అవసరమైతే ఐరన్, కాల్షియం, మినరల్స్ విటమిన్స్‌తో కూడిన మందులు తీసుకోవడం కూడా మంచిది. ∙నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. చలికాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. నాకు దుప్పటి పూర్తిగా కప్పుకొని పడుకునే అలవాటు ఉంది. గర్భిణిలు ఇలా పడుకోవచ్చా? ఫోలిక్ యాసిడ్ ఉపయోగం ఏమిటి? తప్పనిసరిగా తీసుకోవాలా? – బి.చంద్రిక, రామచంద్రాపురం చలికాలంలో గర్భిణులలో చర్మం ఎక్కువగా పగిలే అవకాశాలు డిహైడ్రేషన్, జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటి అనేక ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో దాహం లేకపోయినా కనీసం 2–3 లీటర్లు మంచినీళ్లు తీసుకోవాలి. వీలైనంత వరకు రద్దీ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ తొందరగా వేరేవాళ్ల నుంచి లేదా చల్ల వాతావరణం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీలయితే డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్ వాడటం మంచిది. గోరువెచ్చని నీళ్లలో స్నానం చెయ్యవచ్చు. తాజాగా కూరగాయలు, పప్పులు, పండ్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. వెచ్చని వులెన్ దుస్తులు శరీరంతో పాటు చేతులకి, కాళ్లకి కూడా మరీ బిగుతుగా లేకుండా ధరించవచ్చు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకపోతే దుప్పటి పూర్తిగా కప్పుకోవచ్చు. రోజూ కొద్దిసేపు వాకింగ్, మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చెయ్యడం మంచిది. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జలుబు, దగ్గు వంటి వ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో రోగ నిరోధక శక్తి, మామూలు సమయంలో కంటే తక్కువగా ఉండటం వల్ల, అంటువ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అనేది బి9 అనే బీకాంప్లెక్స్ విటమిన్ జాతికి చెందినది. ఇది శరీరంలోని కణాలలో డీఎన్ఏ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకముందు, వచ్చిన తర్వాత కూడా వాడటం వల్ల బిడ్డ ఎదుగుదల, అవయవాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మెదడు నాడీ వ్యవస్థ సరిగా ఏర్పడటానికి దోహదపడుతుంది. దీని లోపం వల్ల కొంత మంది శిశువులలో అవయవలోపాలు, మెదడు, వెన్నుపూస ఏర్పడటంలో లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గర్భిణీలు తప్పనిసరిగా మొదటి మూడునెలలు ఫోలిక్ యాసిడ్ 5mg మాత్ర రోజుకొకటి వేసుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
టీవీఎస్ నుంచి రేడియాన్ మోటార్‌బైక్
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్తగా రేడియాన్ బైక్‌ను ఆవిష్కరించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ బైక్ ధర రూ. 48,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంటుంది. కార్ తరహా స్పీడోమీటర్, పెద్ద సీటు, క్రోమ్ సైలెన్సర్, స్మార్ట్ ఫోన్ చార్జర్, ట్యూబ్‌లెస్ టైర్లు, లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనున్నట్లు, తొలి ఏడాదిలో రెండు లక్షల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ జాయింట్ ఎండీ సుదర్శన్ వేణు గురువారం విలేకరులకు తెలిపారు. టీవీఎస్ ఇప్పటికే స్పోర్ట్, స్టార్ సిటీ, విక్టర్ బైక్స్ విక్రయిస్తోంది. రేడియాన్‌లో మరికొన్ని వేరియంట్స్ కూడా ప్రవేశపెడతామని, ఈ శ్రేణిని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గతేడాది రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. ఈసారి రూ. 700 కోట్లు మేర వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన అపాచీ ఆర్ఆర్ 310, అపాచీ ఆర్టీఆర్ 160–4వి, ఎన్‌టార్క్ బైక్‌లకు మంచి స్పందన లభించిందని రాధాకృష్ణన్ చెప్పారు. -
సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారా?
కాలిఫోర్నియా : సెల్ఫోన్లను దూరంగా ఉంచకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా క్యాన్సర్, వంధత్వం, మానసిక సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు చెప్పింది. మొబైల్ ఫోన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఫైళ్లను డౌన్లోడ్ చేస్తున్నా.. స్ట్రీమింగ్(వీడియోలు చూస్తున్నా, ఆడియో వింటున్నా) విడుదల అయ్యే రేడియేషన్ పాళ్లు మామూలు సమయాలతో పోల్చితే అధికంగా ఉంటాయని వివరించింది. ఎక్కువ మంది సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నిద్రించే సమయాల్లో సెల్‌ఫోన్‌ను రెండు అడుగుల దూరంలో ఉంచడం మంచిదని పేర్కొంది. ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదని చెప్పింది. చిన్నపిల్లలు రేడియేషన్‌కు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపింది. పలు పరిశోధనలు సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడు, చెవులలో గడ్డలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో సెల్ఫోన్ల వినియోగాన్ని ఫ్రాన్స్ గత వారం నిషేధించింది. -
అణుపరీక్షలతో ‘దెయ్యం వ్యాధి’
ప్యాంగ్యాంగ్ : అంతుచిక్కని వ్యాధితో ఉత్తరకొరియా ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అణు పరీక్షల వల్ల విడుదలైన కాలుష్య పదార్థాలు కిమ్ దేశ ప్రజలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గర్భస్థ శిశువులపైనా, స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి, నాడీ వ్యవస్థల మీద రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తెలిసింది. 2011లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కింగ్ జాంగ్ ఉన్ వరుస అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాలో ఉన్న అణు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన ‘పంగ్యే రీ’ వద్ద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో పంగ్యే రీ వద్ద పహారా ఉంటున్న సైనికులు అంతుచిక్కని దెయ్యం వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న సైనికులు.. తప్పించుకునేందుకు దక్షిణ కొరియాలోకి పారిపోతున్నారు. ఇప్పటివరకూ 30 మంది ఉత్తరకొరియా సైనికులు అనారోగ్య కారణాల రీత్యా దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయి. రేడియేషన్కారణంగా విపరీతమైన నొప్పికి సైనికులు గురైనట్లు వారికి చికిత్స అందించిన దక్షిణ కొరియా వైద్యులు చెప్పారు. అణు పరీక్షల వల్ల ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు తెలిపారు. దీంతో రేడియేషన్ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్ డిసీజ్’ తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతారని వెల్లడించారు. అవయవ లోపంతో జన్మించిన శిశువులను చంపేస్తారని తెలిపారు. దీంతో తల్లిదండ్రులే బిడ్డలను చంపుకున్నట్లు అవుతుందని వివరించారు. అయితే, రేడియేషన్ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ప్రత్యేక ఆధారాలు లభ్యం కాలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. -
అంతరిక్ష రేడియేషన్‌పై నాసా గురి!
వాషింగ్టన్: భూమి నుంచి అంగారకుడికి చేరుకోవడంలో ముఖ్యమైన అడ్డంకి అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు అమెరికా అంత రిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త సాంకేతికతను రూపొందిస్తోంది. దీంతో అంగారకుడిపైకి సురక్షితంగా, విజయవంతంగా చేరుకునే వీలు కలుగనుంది. రేడియేషన్ కారణంగా అంగారకుడిపైకి మానవులను నాసా పంపలేకపోతోందని కొందరు భావిస్తున్నారని, అయితే అది ఈ పరిస్థితుల్లో తాము విజయం సాధిస్తామని నాసా శాస్త్రవేత్త పాట్ ట్రౌట్‌మాన్ పేర్కొన్నారు. భూమిపై రేడియేషన్ కన్నా అంతరిక్ష రేడియేషన్ చాలా ప్రమాదకరమై నదని నాసా పేర్కొంది. అంతర్జాతీయ అంత రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) రక్షిత భూఅయస్కాంత క్షేత్రంలోనే ఉన్నప్పటికీ అక్కడి వ్యోమగాములు భూమిపై కన్నా పది రెట్ల ఎక్కువ రేడియేషన్‌కు గురవుతున్నారని చెప్పింది. భూఅయస్కాంత క్షేత్రం దాటితే ప్రమాదకరమైన గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు, అంతరిక్ష రేడియేషన్ ఉన్న సోలార్ పార్టికల్ ఈవెంట్స్, వాన్ అలెన్ బెల్టులు ఉంటాయి. గెలాక్టిక్ కాస్మిక్ కిరణాల బారిన పడకుండా కాపాడటం చాలా శ్రమతో కూడుకుంటుందని చెప్పింది. ఇవి గెలాక్సీ అన్ని వైపుల నుంచి వస్తాయని నాసా వివరించింది. వీటికి ఏకంగా లోహాలు, ప్లాస్టిక్, జీవ కణాలను చీల్చేయగలిగేంత శక్తి ఉంటుందని పేర్కొంది. -
ఎండకావరం... కన్ను కలవరం!
సమ్మర్ కేర్ కన్ను కండకావరం అన్న మాటను కాస్త ఎండకూ వర్తింపజేద్దాం. అప్పుడది ఎండకావరం అవుతుంది. కంటికి వెలుగు కావల్సిందే. చూపు కోసం కాంతి అవసరమే. కానీ వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కంటికీ కొన్ని సమస్యలు రావచ్చు. రకరకాల రేడియేషన్ల ఉగ్రత వల్ల నేత్రాలకు అనర్థాలు కలగవచ్చు. వాటి నుంచి రక్షణ పొందడం ఎలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం. కాంతి అంటే ఏమిటంటే? మన భూమికి చేరే అనంతమైన రేడియేషన్లలో కేవలం మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ రేడియేషన్స్ అన్నీ... తరంగాల రూపంలో మనకు చేరుతుంటాయి. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా ఎన్నో ఉంటాయి. దీన్నంతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. కాంతి కిరణంలో పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంగ్త్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్లెంగ్త్తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 380 – 780 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్ ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్ ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. యూవీ కిరణాల ప్రభావం ఇలా... సూర్యుడి నుంచి వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్ పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల కంటిపై దుష్ప్రభావాలు రెండు రకాలు. తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్ అనర్థాలు’గా చెప్పవచ్చు. రేడియేషన్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వచ్చే సమస్యలు ‘క్రానిక్ దుష్ప్రభావాలు’. యూవీ–ఏ దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి. యూవీ–బీ వల్ల కలిగే అనర్థాలను వైద్య చికిత్స ద్వారా చక్కదిద్దవచ్చు. యూవీ–సి అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొర నిరోధిస్తుంది. ఈ కాంతి కిరణాలు నేరుగానూ, కొన్ని సందర్భాల్లో కింద నుంచి రిఫ్లక్షన్ చెంది కంటిపై పడుతుంటాయి. మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతుంది. సాధారణంగా కిందివైపుకు ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్ కిరణాలతో ఇలా ప్రభావం పడుతుంది. టోపీ, గొడుగు ధరించినా సరే... రిఫ్లెక్టెడ్ కిరణాల నుంచి రక్షణ ఉండదు. యూవీ దుష్ప్రభావాలు... తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాలు సోకినప్పుడు కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలా సందర్భాల్లో తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. అయితే చాలా సందర్భాల్లో సుదీర్ఘకాలం పాటు యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్లనే అనర్థాలు సంభవిస్తాయి. కంటిపై పడే ఇతర దుష్ప్రభావాలు కనురెప్ప క్యాన్సర్లు: కంటి రెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల కారణంగా కొన్ని తీవ్రమైన అనర్థాలు కనిపించే అవకాశాలున్నాయి. అవి... బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్, స్క్వామోజ్ సెల్ కార్సినోమా క్యాన్సర్, మెలనోమా అనే ఇంకోరకం క్యాన్సర్. కంటిపై ఉండే పొర (కంజెంక్టివా)కు వచ్చే అనర్థాలు: కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో కంటిపై పొర మందంగా, ఒకింత పసుపు రంగు లోకి మారుతుంది. నల్లపొర అంచుల పైకి రెండువైపుల నుంచి ఈ పొర పాకివస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్ ఇన్ ఐ’ అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారి ‘పింగ్వెక్యులా’ రావచ్చు. అలాగే కొంతమందిలో కంటిలో గడ్డలు (ట్యూమర్స్) కూడా కనిపించవచ్చు. కార్నియా పై: కొందరిలో ఫొటోకెరటైటిస్ సమస్య రావచ్చు. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్ వంటివి చేసేవారిలో ఈ ఫొటో కెరటైటిస్ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్ చేసే వారిలో సైతం రిఫ్లెక్షన్ వల్ల పడే కాంతి కిరణాలు వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్నెస్’ అంటారు. రెటీనా పై: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్ బర్న్ అని పేర్కొంటారు. దీనివల్ల కొందరిలో హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. ఇది మనం సాధారణంగా సూర్యగ్రహణం పట్టినప్పుడు, దాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం. ఎవరెవరిలో... అత్యంత కాంతిమంతమైన వాతావరణంలో పనిచేయడం... ఉదాహరణకు డ్రైవర్లు అదేపనిగా అత్యంత ఎక్కువ కాంతిని చూస్తూ ఉండాల్సి వస్తుంది. అలాగే పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు అదేపనిగా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. వీరిలో పైన పేర్కొన్న అనర్థాలు కనిపించే అవకాశం ఎక్కువ. ఇక అత్యంత ఎక్కువ కాంతిని వెలువరిచే నదీప్రాంతాలు, సముద్రజలాలు వంటి చోట్ల సంచరించే వారిలో. కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారిలోనూ. చాలా ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో ఉండేవారిలో. తెల్లని దేహఛాయ (మెలనిన్ తక్కువ) ఉండే వారిలో. సాధారణంగా కంటిలోకి కాంతి ప్రవేశించగానే ఐరిస్/ప్యూపిల్ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోయేలా మన దేహనిర్మాణం ఉంటుంది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మన కన్ను దానికి అడ్జెస్ట్ అయ్యే వరకు మనం కంటిని చికిలించి చూస్తాం. పిల్లల్లో కంటి పాప పెద్దదిగా ఉంటుంది. దాంతో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. పైగా ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. కాటరాక్ట్ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్ లేని ‘ఇంట్రా ఆక్యులార్ లెన్స్’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్, గర్భనిరోధక మాత్రలు, యాంటీ మలేరియా మందులు వాడే వారితో పాటు, ఇబూప్రొఫేన్ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో కూడా యూవీ దుష్ప్రభావాలు ఎక్కువ. మబ్బులు పట్టినా... వరండాల్లో ఉన్నాసురక్షితం కాదు! మబ్బు పట్టి ఉన్నప్పుడు... అల్ట్రా వయొలెట్ కిరణాలు వడపోతకు గురవుతాయనీ, దాంతో వీటి దుష్ప్రభావం మనపై అంతగా ఉండకపోవచ్చని చాలామంది ఊహిస్తారు. కానీ... అది అంత వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండా లేక బయటి గదుల్లో (ఎండతగిలే గదులు) ఉన్నా దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. అయితే యూవీ–బి తరహా కిరణాలను మన కంటిలోపల ఉండే లెన్స్ చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి దాన్ని సోలార్ బర్న్ రూపంలో దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. యూవీ వల్ల కలిగే అనర్థాలివి... టెరీజియమ్: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున మనకు కాస్తంత పింక్ రంగులో ఉండే కండలాంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. ఈ కండ క్రమంగా నల్లగుడ్డును మూసివేసేలా పెరుగుతుంది. దీనివల్ల కనుచూపు పూర్తిగా తగ్గుతుంది. ఇది పట్టపగలు ఆరుబయట పనిచేసే వారిలో కనిపించే సమస్య. అలాగే సముద్రం అలలపై సర్ఫింగ్ చేసేవారిలోనూ టెరీజియమ్ చాలా తరచూగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్ ఐ’ అని కూడా అంటారు. సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉండటం వల్ల వారిలో టెరీజియమ్ ఎక్కువగా వస్తుంది. క్యాటరాక్ట్: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్‌గా పేర్కొంటారు. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే క్యాటరాక్ట్‌లు ఎలాగూ వస్తాయి. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్పోజ్ కావడం వల్ల కాటరాక్ట్ త్వరగా వస్తుంది. దాదాపు 10 శాతం కాటరాక్ట్ కేసులు ఇలా యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్లనే అని పరిశోధనలు చెబుతున్నాయి. మాక్యులార్ డీజనరేషన్: మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం ఒంట్లోనూ, కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తుంటుంది. ఈ మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం ఒంటి రంగు నల్లగా ఉండేవారిలో ఎక్కువగానూ, తెల్లటి దేహఛాయ ఉండేవారిలో తక్కువగానూ ఉంటుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు, రెటీనాలో ఉండే ఎపిధీలియానికీ యూవీ కిరణాలను వడపోసే సామర్థం తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటి చూపు కూడా క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. వేసవిలో కంటి రక్షణ ఇలా... నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావల నుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కంటిని మరింతగా తెరచుకుని చూడాల్సి వస్తుంది. దాంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే నియమిత ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్ వాడాలి. 100 శాతం లేదా 400 యూవీ ప్రొటెక్షన్ ఇచ్చే లేబుల్డ్ గ్లాసెస్ కూడా వాడవచ్చు. ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట చిన్నఫ్రేమ్ వాటికంటే... ఒకింత పెద్ద ఫ్రేమ్ గ్లాసెస్ వాడడం మంచిది. కొందరు ఏ రంగు గ్లాసెస్ అయితే మేలు... అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది కంటికి పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అంత సురక్షితమైనవి కావని గ్రహించండి. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే కంటికి రక్షణనిస్తాయి. ఒకింత తెల్లని దేహ ఛాయ ఉన్నవారు చర్మానికి మంచి సన్ స్క్రీన్ లోషన్స్‌ను మూడు గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మాన్ని కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలనుంచి కాపాడుకునే అవకాశం ఉంది. కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్లు తప్పనిసరిగా యూవీ ప్రొటెక్షన్ ఉన్న ఇంట్రా ఆక్యులార్ లెన్స్ (ఐఓఎల్స్)నే ఎంచుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అంచుపెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్) ధరించడం మేలు. ఫొటో కెరటైటిస్ వంటి కండిషన్ ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవిలోనే కాదు, అన్ని కాలాలకూ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. వీలైనంత వరకు కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. అలాగే పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. సూర్యగ్రహణం చూడాలనుకునేవారు డాక్టర్లు సిఫార్సు చేసిన ఫిల్టర్ గ్లాసెస్‌నే వాడాలి. తరచూ కంటి పరీక్షలు చేయించుకోండి. వేసవిలో ఒకసారి రొటీన్ కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. అల్ట్రా వయొలెట్... ఇన్ఫ్రా రెడ్లతో కంటికి హాని! మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన కంటికి హాని చేకూరే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి హాని చేసే అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్) ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... యూవీ – ఏ... వేవ్‌లెంగ్త్ 315 – 400 న్యానో మీటర్లు (ఇవి తక్కువ శక్తి కలిగినవి). యూవీ – బీ...æ వేవ్‌లెంగ్త్ 280 – 315 న్యానో మీటర్లు (ఇవి ప్రమాదకరమైనవి). యూవీ – సీ... వీటి వేవ్‌లెంగ్త్ 100 – 280 న్యానో మీటర్లు (ఇవి అత్యంత ప్రమాదకరం). ఇన్ఫ్రా రెడ్ కిరణాలు ఇన్ఫ్రారెడ్ – ఏ వేవ్‌లెంగ్త్ 700 – 1400 న్యానో మీటర్లు ఇన్ఫ్రారెడ్ – బీ వేవ్‌లెంగ్త్ 1400 – 3000 న్యానో మీటర్లు ఇన్ఫ్రారెడ్ – సీ వేవ్‌లెంగ్త్ 3000 న్యానో మీటర్లు నుంచి 1 మిల్లీమీటరు వరకు ఇన్ఫ్రారెడ్ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. -
సెల్‌ఫోన్ వాడటం సురక్షితమేనా?
జనరల్/న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 27 ఏళ్లు. సాఫ్ట్వేర్. ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతూ, బ్రౌజ్ చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్ నుంచీ ఇలా మాట్లాడే అలవాటు ఉంది. ఇంజనీరింగ్ చేసేటప్పుడు పెరిగింది. ఇటీవల బాగా ఎక్కువైంది. సెల్‌ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. మా మనవడి వయసు మూడేళ్లు. వాడు కూడా సెల్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుతున్నాడు. నాకు చాలా భయంగానూ, ఆందోళనగానూ ఉంది. సెల్‌ఫోన్‌తో క్యాన్సర్ వచ్చే మాట నిజమేనా? – నిర్మల, సికింద్రాబాద్ సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే సెల్‌ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంతవరకు జరిగిన అధ్యయనాల్లో ఫోన్లు, సెల్ టవర్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందని గుర్తించినా, అది క్యాన్సర్‌కు దారితీస్తాయని కచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలే లేవు. కొన్ని అధ్యయనాలు మొబైల్ఫోన్స్తో మెదడుకు క్యాన్సర్ ప్రమాదం ఉందని చెబితే... మరికొన్ని అలాంటిదేమీ లేదని తేల్చాయి. అయితే ఈ రెండు రకాల అధ్యయనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చాయి. అయితే ఒక అంశం మాత్రం స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్‌ఫోన్స్ వెలువరించే రేడియేషన్ స్థాయి తగ్గుతూ పోతోంది. పైగా మొబైల్స్ వాడకం ఆధునిక జీవితంలో భాగంగా మారింది. క్యాన్సర్ ప్రమాదం గురించి అనుమానాలు, భయాలు వ్యాప్తిలో ఉన్నా మొబైల్‌ఫోన్స్‌ను పూర్తిగా విస్మరించడం సాధ్యం కావడం లేదు. సెల్‌ఫోన్ రేడియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని మందు జాగ్రత్తలను పాటించాలి. ►సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించి సురక్షిత స్థాయి అంటూ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ (ఎస్.ఏ.ఆర్.)ను నిర్ణయించారు. ఆ పరిధిలో ఉన్న ఫోన్స్ వాడాలి n వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి n సెల్‌ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి n సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యాండ్స్ ఫ్రీ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించడం, మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి n రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ ఆయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి n పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి. ప్రత్యేకించి పిల్లలను సెల్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలి. పిల్లల మెదడు లేత కణాలతో కూడి ఉంటుంది. వాటిగుండా రేడియేషన్ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అందువల్ల సెల్‌ఫోన్ రేడియేషన్ ప్రభావం పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఐదారేళ్ల నుంచే మరీ ఎక్కువగా పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్స్ చేరుతున్నాయి. మరో పదేళ్లు పోతేగానీ సెల్‌ఫోన్ రేడియేషన్ ఎటువంటి ప్రభావం చూపిందన్నది కచ్చితంగా తెలిసిరాదు. అంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా అవసరం అని మాత్రం చెప్పగలం. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
రేడియేషన్ పరార్
సియోల్: మొబైల్ ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ వంటి పరికరాల నుంచి వెలువడే రేడియేషన్ బారి నుంచి తప్పించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పదార్థాన్ని అభివృద్ధిపరిచారు. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీకి చెందిన గు జాంగ్-మిన్ బృందంలోని శాస్త్రవేత్తలు కలసి ఎమ్‌ఎక్స్‌ఈన్ నుంచి దీన్ని తయారు చేశారు. టైటానియం, కార్బన్ల నుంచి తయారైన 2డీ అకర్బన రసాయన సమ్మేళనాల తరగతికి చెందినదే ఈ ఎమ్‌ఎక్స్‌ఈన్. ఇందులో ఓ పొర నానోమీటర్ మందంతో ఉంటుంది. ఎమ్‌ఎక్స్‌ఈన్ గృహోపకరణాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలను నిరోధిస్తుందని గుర్తించారు. దీన్ని తయారు చేయడం సులువు, ధర కూడా తక్కువగా ఉండటం మరో విశేషం. -
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?
కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్’గా పిలిచే వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్ ఫోన్లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు
న్యూయార్క్: ప్రపంచంలో క్యాన్సర్ర్ తో ఏటా చనిపోతున్న స్త్రీలలో ఎక్కువ కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మాలిక్యులర్ మార్కర్ ను పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా స్త్రీలలో ఉండే పునరుత్పాదక కణాలను గుర్తించడం ద్వారా క్యాన్సర్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 302 మంది మహిళల బయాప్సీలను చేసిన పరిశోధనల ఫలితాల్లో 'కి 67' లెవల్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు క్యాన్సర్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. వీరిలో 63 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తర్వాతి పరిశోధనలతో తెలిసింది. 'కి67' కణాలు 'కి 67' మమ్మరీ ఎపీథెలియమ్ కణాలని అంటారు. స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో ఈ కణాలు భిన్న మార్పులు చెందడం వల్ల ఈ కణాల్లో కాన్సర్ కణుతులు తయారవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలిపారు. 'మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదని మహిళలకు ఊరికే చెప్పేబదులు బయాప్సీ చేయించడం వల్ల భవిష్యత్ అవకాశాలను పూర్తిగా తెలుసుకోవచ్చు' హార్వాడ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన కొర్నెలియా పొల్యాక్ అన్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్న మహిళలను ముందే గుర్తించడం వల్ల ప్రత్యేకమైన మార్గాలను అనుసరించి రిస్క్ ను తగ్గించవచ్చని హార్వాడ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రుల్లా తమిమి తెలిపారు. కి67 లెవల్స్ ను గుర్తించే క్రమంలో సాధారణంగా ఉపయోగించే పరికరాల కంటే మాలిక్యులర్ బేస్డ్ టెస్టింగ్ లో రేడియేషన్ తక్కువగా ఉంటుందని వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ఈ వివరాలను ఆన్ లైన్ జర్నల్ క్యాన్సర్ రిసెర్చ్ లో ప్రచురించారు. -
చందమామే కీలకం
లండన్: భూమి అయస్కాంత శక్తి ప్రభావంలో చంద్రుడి పాత్ర అత్యంత కీలకమని, అంతేకాక ఇది సూర్యుడి లాంటి వాటి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ప్రాణులను కాపాడుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఫ్రాన్స్‌కు చెందిన బ్లేజ్ పాస్కల్ వర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంయుక్తంగా ‘గురుత్వాకర్షణ’పై అధ్యయనం నిర్వహించాయి. భూపరిభ్రమణం వల్ల ఈ అయస్కాంత శక్తి ప్రభావం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
మొబైల్స్‌తో కేన్సర్ ముప్పు!
కొత్త పరిశోధన మన దేశంలో టాయిలెట్ల కంటే మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మొబైల్స్ ద్వారా వెలువడే రేడియేషన్ కారణంగా ముప్పు తప్పదనే హెచ్చరికలు, అబ్బెబ్బే.. అలాంటివేం పట్టించుకోనక్కర్లేదంటూ మొబైల్ కంపెనీల ప్రచారాలు కూడా తెలిసినవే. అయితే, మొబైల్ ఫోన్లను అతిగా వాడితే కేన్సర్ ముప్పు తప్పదని ఉక్రెయిన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా వెలువడే రేడియేషన్ వల్ల శరీరంలో అసమతుల్యతలు ఏర్పడతాయని, ఫలితంగా పార్కిన్సన్స్, అల్జిమర్స్ వంటి వ్యాధులే కాకుండా, కేన్సర్ సోకే అవకాశాలూ ఉన్నాయని ఉక్రెయిన్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ పరిశోధకుడు డాక్టర్ ఇగర్ యాక్మెన్కో చెబుతున్నారు. మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని, దానివల్ల తలెత్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా మనుషుల్లో డీఎన్ఏ దెబ్బతింటుందని ఆయన వివరిస్తున్నారు. రోజుకు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సేపు వరుసగా ఐదేళ్లు మొబైల్ వాడినట్లయితే, ఇలాంటి అనర్థాలను ఎదుర్కోక తప్పదని తమ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు. -
క్యాన్సర్ కౌన్సెలింగ్
తగ్గిన వ్యాధి తిరగబెట్టే అవకాశముందా? మా అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ ఉంది. ఆమెకు సర్జరీ చేసి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చారు. ఆమెకు ‘టామోక్సిఫెన్ 20 ఎంజీ’ టాబ్లెట్లు వాడమని సూచించారు. దాంతో ఆమె గత ఐదేళ్లుగా ఆ టాబ్లెట్లు వేసుకుంటోంది. ఇప్పుడు బాగానే ఉంది. అయితే, మళ్లీ మరో ఐదేళ్ల పాటు అదే టాబ్లెట్లను కొనసాగించమని డాక్టర్ చెబుతున్నారు. ఇలా కొనసాగించడం సరైనదేనా? మాకు తగిన సలహా చెప్పండి. - ఎస్.ఆర్.వి., ఖమ్మం మీ అమ్మగారు చాలా మెరుగుపడ్డారని మీ లేఖ వల్ల తెలుస్తోంది. అందుకు చాలా సంతోషం. ఇక గతంలో మీరు రాసిన మందును ఐదేళ్ల పాటే వాడేవారు. కానీ మరో ఐదేళ్ల పాటు టామోక్సిఫెన్ 20 ఎంజీ వాడటం రోగికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా ఆ మందును పదేళ్లు వాడటం వల్ల అది రొమ్ముక్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా మరో 15 ఏళ్ల పాటు రక్షణ ఇస్తుంది. ఈలోపు మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించడం మంచిది. దీనివల్ల ఆమె గర్భసంచి, ఎండోమెట్రియమ్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నాకు 2005లో రొమ్ముక్యాన్సర్ వచ్చింది. చికిత్స తర్వాత పూర్తిగా తగ్గింది. ఇటీవల నాకు వెన్నునొప్పి రాగా డాక్టర్గారికి చూపించుకున్నాను. వారు బోన్‌స్కాన్ పరీక్ష చేసి ‘ఎల్2’ వెన్నుపూసకు క్యాన్సర్ వ్యాపించినట్లు చెప్పారు. దాంతో నేను షాక్ అయ్యాను. ఇలా పదేళ్ల తర్వాత కూడా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందా? - ఒక సోదరి, మిర్యాలగూడ క్యాన్సర్లు ఏవైనా సరే... చికిత్స తర్వాత అవి ఐదేళ్లలోపు మళ్లీ తిరగబెట్టకుండా ఉంటే దాన్ని పూర్తిగా నయమైనట్లుగా డాక్టర్లు పరిగణిస్తారు. కానీ ఐదు శాతం కేసుల్లో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే క్యాన్సర్ పూర్తిగా తగ్గిన రోగులైనా సరే... వారు ప్రతి ఐదేళ్లకోసారి క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయా అని భౌతికంగా పరీక్షించి చూసుకోవడమే కాకుండా, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే... ఐదేళ్ల తర్వాత తిరగబెట్టిన క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా మళ్లీ నయం చేయవచ్చు. మీ విషయంలో ఎస్ఆర్ఎస్ (స్టీరియోస్టాటిక్ రేడియో సర్జరీ) అనే ప్రక్రియ ద్వారా ఒకే సిట్టింగ్‌లో మీకు రేడియేషన్ ఇచ్చి వ్యాధిని నయం చేసేందుకు అవకాశం ఉంది. -
వైర్లెస్ కరెంట్
తీగలు లేకుండా విద్యుత్ ప్రసారం.. అది కూడా అంతరిక్షం నుంచి! ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగేశారు మరి. తీగలు లేకుండా 55 మీటర్ల దూరం పాటు వారు కరెంటును విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాల రూపంలో విజయవంతంగా పంపగలిగారు. దీంతో భవిష్యత్తులో అంతరిక్షంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. భూమి మీదకు తీసుకువచ్చేందుకు వీలు కానుంది! - నేషనల్ డెస్క్ తీగల్లేని కరెంటు ఇలా జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ శాస్త్రవేత్తలు తొలుత 1.8 కిలోవాట్ల విద్యుత్‌ను సూక్ష్మ తరంగాలు(మైక్రోవేవ్స్)గా మార్చారు. వాటిని 55 మీటర్ల దూరంలోని రిసీవర్‌కు పంపారు. వాటిని రిసీవర్ స్వీకరించి, విద్యుత్ తరంగాలుగా మార్చి తిరిగి ప్రసారం చేసింది. శక్తిమంతమైన విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాలను వైర్‌లెస్‌గా పంపడం ప్రపంచంలో ఇదే తొలిసారని, దీన్ని గతవారం విజయవంతంగా నిర్వహించామని జపాన్ తెలిపింది. తాజాగా మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 10 కిలోవాట్ల విద్యుత్‌ను మెక్రోవేవ్స్గా మార్చి 1640 అడుగుల దూరంలోని ఓ రిసీవర్‌కు పంపించి తద్వారా వంటగదిలో వాడే కొన్ని పరికరాలను విజయవంతంగా పనిచేయించారు. అంతరిక్ష విద్యుత్తు భూమి మీద 24 గంటలూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కుదరదు. అంతరిక్షంలో అయితే అడ్డంకులే ఉండవు. అందుకే ఉపగ్రహాలకు భారీ సౌరఫలకాలను బిగించి.. సౌరవిద్యుత్‌ను తయారుచేసి.. భూమికి తీసుకురావాలన్న యత్నం. కానీ రోదసి నుంచి విద్యుత్ తీగలు కుదరవు కనుక వైర్‌లెస్‌గా కరెంట్ ప్రసారమే మార్గం. మైక్రోవేవ్స్ టెక్నాలజీని అభివృద్ధిపరిస్తే 2040 నాటికి ఇది సాధ్యమవుతుందని జాక్సా చెబుతోంది. వీరి ప్రతిపాదన ప్రకారం.. భూమికి 36 వేల కి.మీ. ఎత్తులో భారీ సోలార్ శాటిలైట్లను మోహరిస్తారు. భూమిపై భారీ రిసీవర్లను ఏర్పాటుచేస్తారు. 3 కి.మీ. సైజు ఉండే ఒక రిసీవర్ ఒక అణు రియాక్టర్ ఉత్పత్తి చేసేంత విద్యుత్‌ను గ్రహిస్తుందని అంచనా. ఇదే టెక్నాలజీతో మన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తీగలు లేకుండానే కరెంటును వాడుకునేందుకు కూడా వీలు కానుంది! ముప్పు మాటేమిటి..? సూక్ష్మ తరంగాలు అంటే.. విద్యుదయస్కాంత రేడియేషన్‌కి ఒక రూపమే. మరిఈ రేడియేషన్‌తో మనుషులకు ప్రమాదం కలగదా? సూక్ష్మతరంగాల కిందుగా పక్షులు, విమానాలు ప్రయాణిస్తే ముప్పేమీ జరగదా? అంటే అది మైక్రోవేవ్స్ శక్తిస్థాయి మీద ఆధారపడి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్‌కు ఈ వేవ్స్ ప్రసారం అయినా, చుట్టూ జనావాసాలకు ప్రమాదం ఉండదు. అయితే, రిసీవర్ ప్రాంతం మీదుగా విమానాలను నిషేధించాలి. లేదా విమాన ప్రయాణికులపై మైక్రోవేవ్స్ ప్రభావం పడకుండా ప్రత్యేక లోహ కవచాలు ఉపయోగించాలి. పక్షులకు హాని కలగని స్థాయిలోనే మైక్రోవేవ్స్‌ను ప్రసారం చేయాల్సి ఉంటుంది. -
భూమి చుట్టూ రక్షణ కవచం!
వాషింగ్టన్: స్టార్ ట్రెక్ సిరీస్‌లో కనిపించే భారీ స్పేస్ షిప్ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఆవరించి ఉంటుంది. గ్రహాంతర వాసులు ప్రయోగించే ఆయుధాలను ఆ శక్తి క్షేత్రం అడ్డుకుంటూ అంతరిక్ష నౌక(అంతరచిత్రంలో)ను కాపాడుతూ ఉంటుంది. అది కల్పితమే అయినా, మన భూగోళం చుట్టూ నిజంగానే అలాంటి అదృశ్య క్షేత్రం ఆవరించి ఉండి నిరంతరం మనను రక్షిస్తోందట. ఈ అదృశ్య క్షేత్రం భూమి నుంచి 11,600 కి.మీ. ఎత్తులో ఉందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎలక్ట్రాన్లు, ప్రొటాన్లతో గోడలా ఏర్పడి ఉన్న ఈ రక్షణ కవచమే అంతరిక్షం నుంచి దూసుకు వచ్చే ‘కిల్లర్ ఎలక్ట్రాన్ల’ను, రేడియేషన్‌ను అడ్డుకుంటోందట. సౌర తుపాన్ల వల్ల విడుదలై సెకనుకు 1,60,934 కి.మీ. వేగంతో దూసుకువచ్చే కిల్లర్ ఎలక్ట్రాన్లు భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే గనక.. వాతావరణం మారిపోవడం, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలడం, ఉపగ్రహాలు స్తంభించడం, మనుషులకు కేన్సర్ల ముప్పు పెరగడం వంటివి సంభవించేవని, కానీ ఈ అదృశ్య క్షేత్రం మనల్ని కాపాడుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
‘టవర్ల’కు సొసైటీలు నో..
సాక్షి, ముంబై: నగరంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు త్వరలో గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ టవర్లు ఏర్పాటుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి. కొందరు కుదుర్చుకున్న ఒప్పందం (అగ్రిమెంట్) ను పొడగించేందుకు ముఖం చాటేస్తున్నారు. మొబైల్ టవర్ల నుంచి వెలువడే ప్రమాదకర రేడియేషన్‌కు భయపడే వారు తమ అగ్రిమెంట్లను పునరుద్ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ సేవలు అందించే వివిధ సంస్థలు కొత్త సొసైటీలు, ఖాళీ స్థాలాల వేటలో పడ్డాయి. నగరంలో దాదాపు మూడు కోట్ల నాలుగు లక్షల మొబైల్ వాడకం దారులున్నారు. ప్రతి నెలా సుమారు 70 వేల నుంచి లక్ష వరకు కొత్త వినియోగదారులు తోడవుతున్నారు. ప్రతి 20 వేల వినియోగదారులకు ఒక మొబైల్ టవర్ అవసరముంటుంది. ప్రస్తుతం ముంబైలో 9,500 మొబైల్ టవర్లున్నాయి. వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో టవర్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ప్రస్తుతం అదనంగా 670 టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ పేర్కొంది. సొసైటీలు, బహుళ అంతస్తుల భవనాలపై ఏర్పాటుచేసే సెల్‌ఫోన్ టవర్ల ఒప్పందం ఐదేళ్లు ఉంటుంది. కాని ఈ కాలవ్యవధి పూర్తయిన తరువాత గడువు పొడగించి ఇచ్చేందుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి. సెల్ టవర్లు ఏర్పాటుచేయడంవల్ల అందులోంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని వివిధ సేవా సంస్థలు గత రె ండు, మూడు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. దీంతో కాని వీటిని ఏర్పాటు చేయడంవల్ల సొసైటీలకు మంచి ఆదాయం వస్తుంది. కాని స్వయం సేవా సంస్థల ప్రచారం వల్ల టవర్లు ఏర్పాటుకు అనుమతివ్వడానికి సొసైటీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నగరంలో కొత్తగా 670 సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముండగా కేవలం 105 టవర్లకు స్థలం లభించింది. మిగతా టవర్ల ఏర్పాటుకు స్థలం వేటలో పడ్డాయి. ఇదిలా ఉండగా, సొసైటీ యాజమాన్యాలు సెల్ టవర్లను ఇలాగే నిరాకరిస్తూ పోతే కొద్ది రోజుల్లో సాధారణ ఫోన్లతోపాటు ఖరీదైన టూ జీ, త్రీ జీ లాంటి సేవలు నెట్వర్క్ లేక ఫొన్లు మొరాయించే పరిస్థితి ఎదురుకావడం ఖాయమని అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. -
మొబైల్ రేడియేషన్‌పై సంయుక్త అధ్యయనం
న్యూఢిల్లీ: మొబైల్ఫోన్లు, టవర్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్ర(ఈఎంఎఫ్) రేడియేషన్‌తో మనుషుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళనల నేపథ్యంలో.. ఈ అంశంపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ మేరకుఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, జేఎన్‌యూ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యక్తులు సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
చంద్రుడి బిలాలే ఆవాసాలు..
వాషింగ్టన్: చంద్రుడిపై ఉండే పెద్ద పెద్ద బిలాలే భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆవాసాలు కానున్నాయి. చంద్రుడిపై రేడియేషన్, దుమ్ము, ఉష్ణోగ్రతల్లో తీవ్ర తారతమ్యాల నుంచి వారికి రక్షణకోసం ఆ బిలాలను వినియోగించుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. లూనార్ రీకన్నేస్సన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) తీసిన చిత్రాలను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ సహాయంతో పరిశీలించి ఈ బిలాలను కనుగొన్నట్లు చెబుతున్నారు. అయితే చంద్రుడి ఉపరితలంపై దాదాపు 200కు పైగా పెద్దపెద్ద బిలాలున్నాయి. ఈ బిలాలు దాదాపు గుహల్లాగా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్నాయని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రాబర్ట్ వాగ్నర్ చెప్పారు. లావా ప్రవహించడం మూలంగా ఖాళీలు ఏర్పడి ఉంటాయని.. ఆ తర్వాత ఆ ఖాళీల పైన ఉండిపోయిన మట్టిపొర కూలిపోవడంతో బిలాలు ఏర్పడి ఉంటాయని పేర్కొన్నారు. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు వీటిల్లో ఆవాసాలను ఏర్పరచుకుంటే.. అక్కడి దుర్భర పరిస్థితుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. -
ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్?
మీ ఇంటికి సమీపంలో ఎక్కడైనా సెల్‌ఫోన్ టవర్ ఉందా? దాన్నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. నేషనరల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఎమిషన్ సైట్లోకి వెళ్లి చూడండి. అందులో దేశంలో ఉన్న ప్రతి ఒక్క టవర్ నుంచి ఎంతెంత రేడియేషన్ వస్తోందో స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతానికి పరీక్షల చివరి దశలో ఉన్న ఈ పోర్టల్.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెల్ టవర్లు నిజంగానే సురక్షితంగా ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు టెలికం శాఖ, టెలికం పరిశ్రమ కూడా చాలారోజులుగా ఒక వెబ్సైట్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇన్నాళ్లకు అది సాధ్యం అవుతోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) డైరెక్టర్ జనరల్ రంజన్ ఎస్. మాథ్యూస్ తెలిపారు. రెండు నెలల్లో ఈ సైట్ టెస్టింగ్ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలుచేస్తామని, తర్వాత దేశం మొత్తంలోని టవర్ల సమాచారం ఇందులో ఉంటుందని అన్నారు. దీంతో టవర్ల గురించి ఉన్న అపోహలు తొలగిపోతాయని మాథ్యూస్ అన్నారు. -
సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరం కాదు!
సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరమా కాదా? ఇన్నాళ్లూ సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరమేనని అనుకున్నాం. నిపుణులు అదే చెప్పారు. దాంతో సెల్ టవర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. చాలా చోట్ల ఉన్న సెల్ టవర్లను పీకేశారు. కానీ ఇప్పుడు ఒక నిపుణుల బృందం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కూడా ప్రమాదకరం కాదని ఆ నిపుణులు అంటున్నారు. ప్రముఖ రేడియాలజిస్టు డా భావిన్ జాంఖరియా సెల్ రేడియేషన్ క్యాన్సర్ వ్యాధికి కారణం కాదని చెప్పారు. దాని వల్ల మనుషులపై ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని ఆయన అన్నారు. ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ కి అధ్యక్షులు కూడా. టాటా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కి చెందిన డా. హోసూర్ కాస్త టెంపరేచర్ ని పెంచడం తప్ప సెల్ రేడియేషన్ ఎలాంటి అపకారమూ చేయదని తేల్చి చెప్పారు. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సెల్ రేడియేషన్ క్యాన్సర్ కారకం కాదని ప్రకటించింది. కాబట్టి సెల్ టవర్ల విషయంలోనూ, ఫోన్ల విషయంలోనూ కంగారు పడాల్సిన అవసరం లేదని వారంటున్నారు. -
బ్రెయిన్ ట్యూమర్?.. నో ఫియర్
జూన్ 8వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే గడ్డ (ట్యూమర్) ఎక్కడైనా రావచ్చు. ఇతర ఏ శరీర భాగాల్లో వచ్చినా దానితో అంత ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అన్ని అవయవాల నియంత్రణ కేంద్రం అయిన మెదడులో గడ్డలు వస్తే? అది తప్పకుండా ప్రమాదమే. ఎందుకంటే... మెదడులో ఒక అవయవాన్ని నియంత్రించే భాగంలో గడ్డ వస్తే అది ఆ నియంత్రణ కేంద్రంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆ అవయవమూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఇలా మెదడులోని గడ్డలు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, చురుకుదనం వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 8న ‘వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే’ సందర్భంగా వాటిపై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. మెదడు గడ్డలు - వివరాలు మెదడులో అసహజంగా/అసాధారణంగా పెరిగే కణజాలాన్ని గడ్డ (ట్యూమర్)గా పేర్కొనవచ్చు. ఈ గడ్డ మెదడుతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థలోని ఏ ప్రాంతంలో వచ్చినా అది మెదడు సాధారణ పనితీరును దెబ్బతీయవచ్చు. మెదడు గడ్డల్లో దాదాపు 120 రకాలుంటాయి. మెదడులో అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి, ఆ గడ్డలో ఉన్న కణాల తీరును బట్టి ఆ గడ్డకు పేరు పెడతారు. మెదడు గడ్డల్లో ప్రధానంగా రెండు రకాలు ఉండవచ్చు. మొదటివి ఎలాంటి హానీ చేయని మామూలు గడ్డలు (బినైన్). రెండోవి ప్రమాదకరమైన క్యాన్సర్ (మ్యాలిగ్నెంట్) గడ్డలు. గడ్డల వర్గీకరణ హాని చేయనివి (బినైన్): వీటి వల్ల మెదడుకు సాధారణంగా పెద్దగా ప్రమాదం ఉండదు. ఇవి మెదడులోని కణజాలం నుంచి గాని లేదా మెదడు పరిసరాల్లో ఉండే కణజాలం నుంచి గాని పుట్టుకొస్తాయి. అయితే ఇవి క్యాన్సర్ సంబంధిత గడ్డలు కాకపోవడం వల్ల మెల్లగా పెరుగుతాయి. గడ్డ ఏ మేరకు పెరిగిందనే విషయం తెలుసుకోవడానికి వీలుగా గుర్తించడానికి అనువైన అంచులు కలిగి ఉంటాయి. ఫలితంగా ఇవి మరో రకం కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరగవు. హాని చేసే గడ్డలు (మ్యాలిగ్నెంట్): ఈ తరహా గడ్డల కణాలు క్యాన్సర్ కణాలను కలిగి ఉంటాయి. వీటి అంచులు గుర్తించడానికి వీలుగా ఉండవు. పెరుగుదల కూడా చాలా వేగంగా ఉంటుంది. వీటి అంచులు గుర్తించడానికి వీలుగా ఉండకపోవడంతో చుట్టుపక్కల, పరిసరాల కణజాలంలోకి చొచ్చుకుపోయేలా పెరిగిపోతాయి. దాంతో ప్రాణాపాయానికి అవకాశాలు ఎక్కువ. ఇవి మళ్లీ రెండు రకాలు - ప్రైమరీ, సెకండరీ లేదా మెటాస్టాటిక్ గడ్డలు. ప్రైమరీ గడ్డలు: మెదడులో పుట్టిన ఈ తరహా గడ్డలు మొదట మెదడు కణజాలంలో పుడతాయి. అయితే అవి మెదడులోనే ఇతర ప్రాంతాలకుగాని, లేదా వెన్నులోకి గానీ పాకే అవకాశం ఉంటుంది. సెకండరీ లేదా మెటాస్టాటిక్ గడ్డలు: అవి మెదడులో నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించిన గడ్డలు. వీటి ఆవిర్భావ కేంద్రాన్ని బట్టి వీటికి పేర్లు పెడతారు. మెదడులో గడ్డలు - కొన్ని వాస్తవాలు మెదడులో గడ్డలు వచ్చే అవకాశాలు పురుషులూ, మహిళలూ ఇద్దరిలో కనిపిస్తున్నా... అవి స్త్రీలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. (ప్రతి లక్ష మందిలో స్త్రీలలో 22.3 మందికి, ప్రతి లక్ష మంది పురుషుల్లో 18.8 మందికి మెదడులో గడ్డలు రావచ్చు). మొత్తం మెదడు గడ్డల్లో హానికరం కానివి 63 శాతమైతే, హానికరమైనవి 37 శాతం. ప్రతి ఏటా తెలుగునాట 25,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇతర రకాల క్యాన్సర్లు (అంటే రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేగు, మూత్రపిండాల క్యాన్సర్లు) సోకిన సందర్భాల్లో వారిలోని 20 - 40 శాతం కేసుల్లో అవి మెదడుకు పాకి, అక్కడ క్యాన్సర్ గడ్డలు ఏర్పడుతున్నాయి. బ్రెయిన్ ట్యూమర్లకు కారణాలు వాతావరణ సంబంధమైనవి: నిత్యం రేడియేషన్‌కు గురయ్యే ఆస్కారమున్న ప్రాంతాల్లోని వారికి మెదడులో గడ్డలు రావచ్చు. అంటే చికిత్స కేంద్రాల్లో, వైద్య పరీక్ష కేంద్రాల్లో పనిచేసేవారికి, సాధారణంగానే వాతావరణంలో రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారికి, పారిశ్రామికంగా రేడియేషన్ వెలువడేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోని వారికి, అణు ప్రమాదాలు జరిగిన చోట్ల ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇస్తాయి. అయొనైజేషన్ లేకుండానే రేడియేషన్: కొన్ని సందర్భాల్లో మనం అయొనైజేషన్ ఎక్కువగా లేకుండా కూడా రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మొబైల్ వాడకం వల్ల ఇలా జరిగేందుకు అవకాశం ఉంది. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారిలో గ్లయోమా తరహా మెదడులో గడ్డలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల పరిశోధనల వల్ల తేలింది. అయితే మొబైల్ ఫోన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ ఇదమిత్థంగా లభించలేదు. అందువల్ల, ఫోన్ల వల్ల ట్యూమర్లు తప్పనిసరిగా వస్తాయని బల్లగుద్ది చెప్పేందుకు వీల్లేదు. అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే 16 ఏళ్ల లోపు పిల్లలకు మొబైల్‌ఫోన్స్ నిత్యం ఉపయోగించేందుకు ఇవ్వకపోవడమే మంచిది. చాలా సుదీర్ఘమైన కాల్స్ చేసేందుకు బదులు చిన్న చిన్న కాల్స్ (అవసరమైన మేరకే) చేయడం ఉత్తమం. జన్యుపరమైనవి: క్రోమోజోముల్లో వచ్చిన మార్పులతోనూ మెదడులో గడ్డలు రావచ్చు. మానవుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అయితే సాధారణంగా ఇందులోని 1, 10, 13, 17, 19, 22 క్రోమోజోముల్లో ఏవైనా మార్పులు ఏర్పడటం వల్ల మెదడులో గడ్డలు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఇక 1, 19 క్రోమోజోముల్లో వచ్చే మార్పుల వల్ల ఆలిగోడెండ్రోగ్లియోమా తరహా క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే 22వ క్రోమోజోములో మార్పుల వల్ల మెనింజియోమా తరహా మెదడు గడ్డ ఏర్పడుతుంది. అయితే ఈ గడ్డ హానికరం కాదు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లలో కొన్ని రకాలు గ్లయోబ్లాస్టోమా తరహావి 16 శాతం ఆస్ట్రోసైటోమా 7 శాతం మెనింజియోమా 35 శాతం పిట్యూటరీ 14 శాతం నర్వ్ షీత్ 9 శాతం లింఫోమా 2 శాతం ఇతర రకాలు (ఎపిండిమోమా, ఆలిగోడెండ్రోగ్లిమోవా, ఎంబ్రియోనల్ వంటివి) 33 శాతం. ఎలాంటి సమస్యలు రావచ్చు? మెదడు ఫ్రంటల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల... కదలికలకు సంబంధించినవి రీజనింగ్‌కు సంబంధించిన లోపాలు ప్రవర్తనాలోపాలు జ్ఞాపకశక్తి లోపాలు నిర్ణయం తీసుకోవడంలో లోపం వ్యక్తిత్వ లోపాలు ప్రణాళికలో లోపాలు ఏదైనా విషయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం చొరవ తీసుకోవడంలో లోపాలు తరచూ మూడ్స్ మారిపోవడం. టెంపోరల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల... భాషను అర్థం చేసుకోవడంలో లోపం ప్రవర్తనలో లోపం జ్ఞాపకశక్తిలో లోపం వినికిడి లోపాలు భావోద్వేగపరమైన మార్పులు పెరైటల్ లోబ్‌లో గడ్డలు రావడం వల్ల... ఏదైనా విషయాన్ని చెప్పడంలో లోపాలు సరిగ్గా లెక్కలు చేయడంలో అశక్తత స్పర్శజ్ఞాన లోపం చదవలేకపోవడం రాయలేకపోవడం పిట్యూటరీ గ్రంథి ప్రాంతంలో గడ్డల వల్ల... హార్మోన్ పరమైన మార్పులు ఎదుగుదల లోపాలు ప్రత్యుత్పత్తి లోపాలు / వంధ్యత్వం సెరిబెల్లమ్ ప్రాంతంలో గడ్డలు రావడం వల్ల... శరీరాన్ని నిటారుగా ఉంచడంలో లోపం తూగుతున్నట్లు నడవడం ఆక్సిపెటల్ లోబ్‌లో గడ్డల వల్ల... చూపు మసకబారడం / చూపునకు సంబంధించిన లోపాలు బ్రెయిన్ స్టెమ్ ప్రాంతంలో గడ్డల వల్ల... శ్వాస సంబంధమైన లోపాలు రక్తపోటులో మార్పులు గుండె స్పందనల్లో మార్పులు మింగడంలో, మాట్లాడటంలో ఇబ్బందులు నిర్ధారణకు వైద్య పరీక్షలు సీటీ స్కాన్ : మెదడులో ఏవైనా గడ్డలున్నట్లు అనుమానిస్తే మొదట చేయించే పరీక్ష ఇది. ఎమ్మారై: ఈ పరీక్ష వల్ల మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ తరహాకు చెందినది, సైజు, మెదడులోని ఇతర భాగాల్లో ఏ మేరకు చొచ్చుకుపోయింది వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. శస్త్రచికిత్సలో కూడా ఎమ్మారై టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. పెట్ స్కాన్: ఇది గడ్డలకూ, గడ్డలుగా కనిపించేవాటికి (ట్యూమర్స్కూ, నాన్ట్యూమర్స్కు) మధ్య తేడా చూపేందుకు ఉపకరించే పరీక్ష. లక్షణాలు మెదడులో గడ్డ ఏ ప్రాంతంలో ఏర్పడిందన్న అంశం ఆధారంగా ఈ లక్షణాలు మారుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మెదడులో గడ్డ ఉన్నప్పటికీ బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. సాధారణ లక్షణాలివి... నలభై ఏళ్లకు పైబడిన వారిలో లేదా ఆరేళ్లలోపు వారిలో మొదటిసారిగా తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వాంతి మొట్టమొదటిసారిగా ఫిట్స్ రావడం స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా ఏదైనా అవయవానికి సంబంధించిన కదలికలు లోపించడం చూపు మసగ్గా మారడం వెంట్రుకలు రాలిపోవడం మాట ముద్దగా రావడం డిప్రెషన్ ప్రవర్తనలో, ఆలోచనసరళిలో మార్పు అంతర్గత హార్మోన్ల స్రావాల్లోనూ మార్పులు (ఎండోక్రైన్ డిస్ఫంక్షన్). ట్యూమర్లు - చికిత్సలు మెదడులో గడ్డలకు చేసే చికిత్సలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని, అప్పుడు చేయాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. ఆ అంశాలివి... రోగి వయసు అతడి పూర్తి ఆరోగ్యపరిస్థితి గడ్డ ఉన్న ప్రదేశం, దాని సైజు, అది ఏ తరహాకు చెందినది అన్న వివరాలు అది క్యాన్సర్ గడ్డా, కదా అన్న అంశాలు ఏదైనా ప్రత్యేక చికిత్స విధానానికి రోగి స్పందించే తీరు, అతడు తట్టుకోగలిగే తీరుతెన్నుల వంటి వ్యక్తిగత అంశాలు. మైక్రోన్యూరోసర్జరీ ప్రక్రియలు ఇటీవల వైద్య విజ్ఞానశాస్త్రంలో ఏర్పడిన పురోగతితో మెదడులోని గడ్డల తొలగింపులో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా వచ్చిన ఇమేజింగ్ ప్రక్రియలు, మైక్రోస్కోపిక్ విధానాలు, మ్యాపింగ్ ప్రక్రియలు, ఆపరేషన్ ప్రణాళికల్లో మార్పుల వల్ల మైక్రో న్యూరోసర్జన్లు అతి సూక్ష్మమైన గడ్డలతో పాటు, గతంలో శస్త్రచికిత్స ద్వారా తొలగించలేని ప్రాంతాల్లోకి సైతం చేరుకొని వాటిని తొలగించి, బయాప్సీకి పంపగలుగుతున్నారు. ఈ పురోగతి వల్ల మరింత కచ్చితత్వంతో గడ్డ ఏ తరహాకు చెందిందన్న విషయాన్ని నిర్ధారణ చేసి, గతంలో ఆపరేషన్ ద్వారా తొలగించలేమని భావించిన (ఇన్ ఆపరబుల్), చేరలేమని భావించిన (ఇన్ ఆక్సిసిబుల్) గడ్డలనూ తేలిగ్గా తొలగించగలుగుతున్నారు. ఈ మైక్రో న్యూరోసర్జరీ ప్రక్రియల్లో ఇటీవల అత్యంత ప్రభావశీలమైన, శక్తిమంతమైన మైక్రోస్కోప్‌లను ఉపయోగించి గడ్డను ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపించేలా చేసి, శస్త్రచికిత్స సమయంలో వాటిని స్పష్టంగా చూస్తూ శస్త్రచికిత్స నిర్వహించగలుగుతున్నారు. అంతేకాదు... శస్త్రచికిత్సకు ఉపయోగించే ఉపకరణాలు, పరికరాల (సర్జికల్ టూల్స్)లో సైతం గణనీయమైన మార్పులు, పురోగతి వచ్చాయి. దాంతో చాలా సునిశితత్వం అవసరమైన కేసులలోనూ సులభంగా ఆపరేషన్ చేయడం సాధ్యమవుతోంది. ఈ తరహా శస్త్రచికిత్సల్లో సునిశితత్వమే చాలా ప్రధానమైన అంశం. ఏదైనా చిన్న రక్తనాళానికి ఆనుకొని ఉన్న గడ్డలు/ ఏదైనా చిన్న నరానికి ఆనుకొని ఉన్న గడ్డలు / పుర్రెలోని ఎముక అంచుకు ఆనుకొని ఉన్న సునిశిత భాగాల్లోంచి గడ్డను తొలగించడానికి ఈ తరహా మైక్రోన్యూరో శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరమవుతాయి. కీహోల్ సర్జరీ సాధ్యమేనా? ఇప్పుడు అన్ని శస్త్రచికిత్స ప్రక్రియల్లోనూ కోత కోసే భాగం అతి తక్కువగా ఉండేలా చిన్న గాటుతోనే మొత్తం శస్త్రచికిత్స నిర్వహించేలా ‘కీ-హోల్’ ప్రక్రియ శస్త్రచికిత్సలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే మెదడుకు శస్త్రచికిత్స చేసే సందర్భాల్లోనూ ఇదే టెక్నిక్ సహాయంతో పుర్రెకు చిన్న గాటు పెట్టడం లేదా అసలు గాటే లేకుండా కూడా శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతోంది. ఈ తరహా శస్త్రచికిత్స వల్ల ఆసుపత్రుల్లో ఉండాల్సిన వ్యవధి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు... కొన్ని కేసుల్లోనైతే అదే రోజు ఇంటికి వెళ్లేలా కూడా శస్త్రచికిత్స ప్రక్రియల్లో పురోగతి వచ్చింది. అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ ప్రక్రియలు ఏమిటంటే... న్యూరో ఎండోస్కోపీ ఈ ప్రక్రియలో భాగంగా చిన్న రంధ్రం ద్వారా మెదడు ఉండే ప్రదేశంలోకి సూక్ష్మమైన ఎండోస్కోప్‌ను పంపుతారు. ఆ ఎండోస్కోప్ లోపలికి వెళ్లి, దానికి అమర్చి ఉన్న కెమెరా సహాయంతో గడ్డ ఉన్న ప్రదేశాన్ని స్పష్టంగా చూపుతుంటుంది. ఆ నిజ చిత్రం (రియల్‌టైమ్ ఇమేజ్) ఆధారంగా సర్జికల్ లేజర్ సహాయంతో న్యూరో మైక్రోసర్జన్లు గడ్డలను/తిత్తులను న్యూరోసర్జన్లు అతి తేలిగ్గా తొలగించగలరు. స్టీరియోటాక్టిక్ సర్జరీ ఇది కూడా అతి సూక్ష్మమైన గాటుతో చేసే న్యూరో సర్జరీ ప్రక్రియ. ఇందులో మెదడులోని అత్యంత ఇరుగ్గానూ, సంక్లిష్టంగానూ ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన గడ్డ నుంచి కూడా నమూనాను సేకరించి బయాప్సీకి పంపవచ్చు. అక్కడ ఏర్పడిన గడ్డను ఏ మాత్రం కదిలించినా కూడా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని భావించిన సందర్భాల్లో అత్యంత సునిశితమైన శస్త్రచికిత్స కోసం ఈ స్టీరియోటాక్టిక్ శస్త్రచికిత్స ప్రక్రియను అవలంబిస్తారు. ఫ్రేమ్-బేస్డ్ స్టీరియోటాక్టిక్ సర్జరీ ఈ తరహా శస్త్రచికిత్సలో అత్యంత తేలిగ్గా ఉండే ఒక ఫ్రేమ్‌ను తలకు అమరుస్తారు. ఈ ఫ్రేమ్‌ను పుర్రెకు సంబంధించిన నలువైపులా నాలుగు చోట్ల ఉండేలా అమర్చాల్సి ఉంటుంది. ఒకసారి ఫ్రేమ్‌ను అమర్చాక సీటీ, ఎమ్మారై పరీక్షలతో పాటు మెదడులోని రక్తనాళాల్లోకి ఒక రంగు వంటి పదార్థాన్ని (డై ను) పంపుతారు. దాంతో ఆ మెదడులో ఆ గడ్డ ఉన్న ప్రదేశం, సైజు వంటివి స్పష్టంగా (త్రీ-డైమన్షన్‌లో) కనిపిస్తుంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యూరోసర్జన్లు అత్యంత సునిశితంగా మెదడులోకి ఒక యంత్రభాగాన్ని (ప్రోబ్‌ను) పంపి, అత్యంత సునిశితమైన గాటు ద్వారా గడ్డను తొలగించి, దాన్ని బయాప్సీతో పాటు ఇతర పరీక్షలకు పంపుతారు. ఫ్రేమ్‌లెస్ స్టీరియోటాక్టిక్ సర్జరీ (న్యూరో నేవిగేషన్) ఈ ప్రక్రియలో తలకు ఫ్రేమ్ అమర్చరు. అదేదీ లేకుండానే తల లోపలి భాగాలను గుర్తించేందుకు వీలుగా చిన్న చిన్న గుర్తులు పెట్టుకుంటారు. మనం బయట ఏదైనా ప్రాంతానికి చేరడానికి వీలుగా కొన్ని కొండగుర్తులను (ల్యాండ్‌మార్క్స్) పెట్టుకున్నట్లుగానే ఈ గుర్తులు ఉపయోగపడతాయి. ఈ గుర్తులను ‘ఫిడ్యూషియల్ మార్క్స్’గా చెబుతారు. ఆ గుర్తుల ఆధారంగా మెదడులోపలి ప్రాంతాలను గుర్తించేందుకు అనువుగా మెదడును కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. దాంతో కంప్యూటర్ స్క్రీన్‌పై మెదడు లోపలి భాగాలు, గడ్డ ఉన్న చోటు వంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయి. సర్జరీ ప్రక్రియలో సర్జన్ పెట్టుకున్న ఈ గుర్తులను ఒక పాయింటింగ్ ఉపకరణం సహాయంతో తెలుసుకుంటారు. ఈ పాయింటింగ్ డివైజ్‌ను ‘వ్యాండ్’ అంటారు. ఈ ప్రక్రియలో గడ్డను తొలగించాల్సిన సునిశితమైన ఉపకరణాలు మెదడులోని ఏ భాగంలో ఉన్నదీ కంప్యూటర్‌పై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ చిత్రాల ఆధారంగా సరిగ్గా గడ్డ ఉన్న ప్రాంతానికి చేరి అత్యంత సంక్లిష్టమైన భాగాల్లో ఉన్న గడ్డను సైతం తొలగిస్తారు. మందులతో చికిత్స కొన్ని సందర్భాల్లో గడ్డ ఉన్న ప్రాంతంలోని వాపును తగ్గించడానికి కొన్ని స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో రోగికి తలనొప్పి వంటి ఇతర భౌతిక లక్షణాలు తగ్గుతాయి. అలాగే గడ్డల కారణంగా రోగికి ఫిట్స్ వస్తే వాటిని తగ్గించేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. అసలు గాటు పెట్టకుండానే శస్త్రచికిత్స చేసే వీలుందా? అవును ఉంది. దానికి ఈ కింది ప్రక్రియలు ఉపయోగపడతాయి. అవి... స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఈ ప్రక్రియలో అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాలు (గామా కిరణాలు / ఎక్స్-రే /ప్రోటాన్ బీమ్) వంటివి ఉపయోగించి గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. ఈ చికిత్సలో గడ్డ పరిసరాల్లో ఉండే మెదడు భాగాలు ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకుంటారు. అయితే గడ్డ మరీ పెద్దగా ఉంటే ఈ తరహా చికిత్సకు అవకాశం ఉండదు. అందుకే పెద్ద గడ్డల విషయంలో ఇదో ప్రతిబంధకం అనుకోవచ్చు. ఇలా కోత లేదా గాటు పెట్టకుండానే శస్త్రచికిత్స చేయడానికి రెండు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అవి... గామా నైఫ్. ఇందులో తల చుట్టూ ఫ్రేమ్‌ను అమర్చి సునిశితమైన రీతిలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఇక లినాక్ బేస్డ్ ప్రక్రియ అనే తరహాలోనూ రేడియో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మెనింజియోమా అకాస్టిక్ న్యూరోమా మెటాస్టాసిస్ పిట్యూటరీ అడినోమా గ్లామస్ ట్యూమర్ కాండ్రోసర్కోమా / కాండ్రోమా హిమాంజియోబ్లాస్టోమా గ్లయోమాస్ వంటి గడ్డలను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ కొన్ని రకాల మెదడులోని క్యాన్సర్ గడ్డలనూ / క్యాన్సర్ తరహాకు చెందని గడ్డలనూ తొలగించడానికి రేడియేషన్ థెరపీ మంచి మార్గం. ఇందులో గడ్డను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు దాని పెరుగు దలను అరికట్టడం జరుగుతుంది. అయితే రేడియేషన్ చికిత్స ఏ మేరకు విజయవంతమవుతుందన్న విషయం అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ తరహా గడ్డకు చికిత్స చేస్తున్నాం, దాని సైజు ఎంత వంటివి). చిన్న సైజు గడ్డలకు ఈ తరహా చికిత్స బాగుంటుంది. ఇక కొన్ని తరహా గడ్డలకైతే కేవలం రేడియేషన్ చికిత్స మాత్రమే పనికివస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో బయాప్సీ తర్వాత లేదా కొంత గడ్డను తొలగించాక శస్త్రచికిత్స ద్వారా తొలగించలేని ఆ మిగిలిపోయిన గడ్డ భాగాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు. అలాగే శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి వీల్లేకుండా ఉన్న ప్రాంతాల్లో పెరిగిన గడ్డలకూ రేడియేషన్ థెరపీ బాగా పనికి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా గడ్డ ఎంత మేరకు ఉందో, అంతే మేరకు రేడియేషన్ తగిలేలా, మిగతా మెదడు భాగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా రేడియేషన్‌ను పంపించగల అత్యంత సునిశితమైన యంత్రపరికరాలూ అందుబాటులోకొచ్చాయి. అలాగే అత్యంత సురక్షితమైన మోతాదుల్లో (డోస్‌లలో) రేడియేషన్‌ను వెలువరించేలా కూడా పురోగతి చోటు చేసుకుంది. అందుకే ఇప్పుడు రేడియేషన్ చికిత్స గతం కంటే మరింత సురక్షితంగా జరుగుతోంది. కీమో థెరపీ చిన్న తరహా హానికరమైన గడ్డల (మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్)కు చికిత్స చేయడానికి కీమోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు రేడియేషన్‌తో పాటు కీమోథెరపీ ఇస్తేనే చికిత్సకు బాగా లొంగిపోతాయి. ఇక కొన్ని సందర్భాల్లో నేరుగా గడ్డలోకి మందు వెళ్లేలా కూడా కీమోథెరపీ ఇస్తారు. ఇప్పుడు కీమోథెరపీలోనూ మరింత సమర్థంగా పనిచేసే మందులు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. మెదడులో గడ్డలకు చికిత్స చేసే నిపుణులు మెదడులోని గడ్డల చికిత్సల్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు పాలుపంచుకుంటుంటారు. వారు న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, న్యూరోరేడియలాజిస్టులు, న్యూరోపాథాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు... వీళ్లందరి సమన్వయం, సహకారంతో మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. మెదడులో ఏర్పడే గడ్డలను తొలగించడం అనే ప్రక్రియ ఇప్పుడు గతంలో కన్నా సమర్థంగా, సునిశితత్వంతో, సురక్షితమైన రీతిలో జరుగుతోంది కాబట్టి మునుపటిలా ఆందోళన అవసరం లేదు. శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారంటే... రోగికి శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని సిఫార్సు చేసే సందర్భాలివి... వీలైనంత వరకు గడ్డను తొలగించేందుకు అవకాశం ఉన్నప్పుడు. గడ్డ ఏ తరహాకు చెందినదనే అంశం స్పష్టంగా, నిర్ధారణగా తెలిసినప్పుడు గడ్డను తొలగించడం వల్ల మెదడులోని ఇతర ప్రాంతాల్లో గడ్డ వల్ల పడే ఒత్తిడి (ఇంట్రాక్రేనియల్ ప్రెషర్) గణనీయంగా తగ్గి మంచి ఉపశమనం లభిస్తుందని తెలిసినప్పుడు లేదా మిగతా గడ్డను రేడియేషన్ / కీమోథెరపీతో తేలిగ్గా నిర్మూలించగలమని స్పష్టంగా తెలిసినప్పుడు మందులతో ఫిట్స్ నియంత్రణలోకి రాని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వస్తున్న ఆ ఫిట్స్ కాస్తా గడ్డలను తొలగించడం వల్ల తగ్గిపోతాయని నిర్ధారణగా తేలినప్పుడు. భవిష్యత్తులో రానున్న మరిన్ని ప్రక్రియలు జీన్ థెరపీ: ఇందులో జన్యుపరివర్తన ద్వారా గడ్డలు రాకుండానే చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇమ్యూనోథెరపీ: కొన్ని రకాల మందులు ఉపయోగించి, రోగి తాలూకు రోగనిరోధకత పెంచి చేసే చికిత్సలతో గడ్డలు అసలు రాకుండానే చేయడం. యాంటీ యాంజియో జెనిక్ థెరపీలాంటివి... - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
తేనె చినుకులేవీ..!
మన్యంలో తగ్గిపోతున్న తేనె దిగుబడి రేడియేషన్ ప్రభావం, చెట్లు తగ్గడం కారణం ఒకప్పుడు 2,000 క్వింటాళ్ల సేకరణ ఇప్పుడు సగం కూడా కష్టమే పుట్ట తేనె...ఈ పేరు తలవగానే నోరంతా తియ్యగా మారుతుంది. ఇక రెండు చుక్కలు గానీ నోట్లో వేసుకుంటే.... మ్మ్మ్ ...ఇక మాధుర్యమంటే ఇదేనా అని పరవశించాల్సిందే. అడవుల నుంచి అలా తీసుకొచ్చిన తేనెపట్లను మన కళ్ల ముందే పిండి స్వచ్ఛమైన తేనెను మనకు ఇస్తుంటే... అబ్బ...ఆ ఆనందమే వేరు..కానీ అవన్నీ పాత జ్ఞాపకాలే..ఇప్పుడు తేనె పట్టూ లేవు...తేనే లేదు కొయ్యూరు,.న్యూస్‌లైన్: అడవులు అంతరించడం..మొబైల్ సిగ్నల్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా తేనెటీగలు దారి మళ్లడం. గిరిజన యువకులకు తేనెసేకరణపై సరైన అవగాహణ లేకపోవడం.. కొత్తగా ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కాఫీ తోటలకు పురుగు మందులు కొట్టడం లాంటి కారణాలతో తేనె దిగుబడి మన్యంలో విపరీతంగా పడిపోతుంది. గిరిజన సహకార సంస్థ నుంచి సైరె న ప్రోత్సహం లేకపోవడం ఒక కారణమైతే అర్హులైన బ్రాంచి మేనేజర్లు లేకపోవడం మరో కారణం వెరసి జీసీసీకి అత్యంత రాబడి తీసుకువచ్చే తేనె దిగుబడి ప్రతీ యేడాది తగ్గిపోతుంది. ఏటా దాదాపు రెండు మూడువేల క్వింటాళ్ల తేనె దిగుబడి వచ్చేది. అయితే ఇది రానురాను తగ్గినోతోంది. పాడేరు డివిజన్లో వెయ్యి క్వింటాళ్లు రావడం కష్టంగా మారుతోంది. గిరిజన యువత నిరాసక్తత ఒక తరం అయిపోయింది. ప్రస్తుత తరం అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి పెట్టడం లేదు. చదువుకున్నవారు వివిధ ఉద్యోగాలులేదా ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్నారు.పుట్టి పెరిగిన గ్రామంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సేకరించే వారు సైతం తగ్గిపోయారు. దారి మళ్లుతున్న తేనెటీగలు ఇది కాకుండా సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా తేనెటీగలు బయటకు వెళ్లి వచ్చిన తరువాత దారి మళ్లుతున్నాయి.తిరిగి తేనెపట్ల వద్దకు రాలేకపోతున్నాయి.కాఫీ తోటలకు ఇటీవల కాలంలో పురుగులు మందు లు కొట్టడం కూడా కారణంగా మారుతుంది.దీంతో ఈగలు ఇతర ప్రాంతాలకు పోతున్నాయి. దీనికి తోడుగా చెట్లు నరకివేయడంతో సరైన వాతావరణం లేకపోవడంతో తేనెపట్టు పెట్టేందుకు వీలు లేకుండాపోతుంది. -
మిణుగురు రంగు ఉంటుంది ..
Transmission of Heat, Electrostatics 1. The coefficient of thermal conductivity of a metal depends on 1) Temperature difference between two sides 2) Thickness of metal plate 3) Area of the plate 4) Nature of the material 2. Heat is transmitted from higher to lower temperature through actual motion of the molecules in 1) Conduction 2) Convection 3) Radiation 4) All of these 3. A piece of ice placed in a room 1) Does not rate 2) Radiates less but absorbs more 3) Radiates more than it receives 4) Radiates as much as it receives 4. A red-glass piece is heated until it glows in dark. The colour of the glow will be 1) Red 2) Orange 3) Green 4) Violet 5. A metal piece is heated upto T K. The temperature of the surroundings is t K. The heat radiated to the surroundings due to radiation is proportional to 1) (T – t)4 2) T4 – t4 3) (T – t)1/4 4) T2 – t2 6. A sphere, a cube and a thin circular plate all made of the same material and having the same mass are initially heated to a temperature of 200°C. Which of these objects will cool slowest, when left in air at room temperature? 1) The sphere 2) The cube 3) The circular plate 4) All will cool at the same rate 7. Absorptive power of a white body is 1) 1 2) 0 3) 1 4) ¥ 8. Rods of different radii r and length l made of the same material are used to connect two sources of heat at two different temperatures. Which one will conduct maximum heat? 1) r = 1 cm; l = 1 m 2) r = 2 cm; l = 2 m 3) r = 1 cm; l = 0.5 m 4) r = 2 cm, l = 0.5 m 9. Two cylindrical conductors A and B of same material have their diameters in the ratio 1:2 and lengths in the ratio 2:1. If the temperature difference between their ends is same, then the ratio of the rate of heats conducted by A and B is 1) 1 : 8 2) 1 : 4 3) 1 : 2 4) 4 : 1 10. The colour of a star is a measure of its 1) Age 2) Temperature 3) Size 4) Distance from the earth 11. 24000 calories of heat flows across a silver cube of side 4 cm in one minute when its opposite faces are at 0°C and 100°C respectively. The coefficient of thermal conductivity of silver is 1) 1 cal/cm/s/°C 2) 2 cal/cm/s/°C 3) 3 cal/cm/s/°C 4) 1.5 cal/cm/s/°C 12. The outside of a beaker containing dry ice at 0°C is maintained at 40°C. The area of the glass in contact with ice is 250 cm2 and the thickness of glass wall of the beaker is 1.6 mm. If K of glass 0.0016 cgs units, then the rate at which ice starts melting is 1) 1 g/sec 2) 1.75 g/sec 3) 1.5 g/sec 4) 1.25 g/sec 13. A compound slab is made with two different materials A and B with coefficients of thermal conductivities in the ratio 1:2 and the thickness in the ratio 2 : 1. If the free face of A is at 100°C and that of B is at 25°C, then the temperature of the interface is 1) 20°C 2) 40°C 3) 60° C 4) 90° C 14. What temperature gradient must exist in an aluminium rod in order to transmit 8 cal/s per square centimeter of cross-section down the rod? K for aluminium is 0.5 cal/s/cm/°C. 1) 16° C/m 2) 15° C/m 3) 32° C/m 4) 30° C/m 15. A tungsten filament lamp of power 625 W is at 2227°C. The emissivity of the filament is 0.16. If s = 6 ´ 10–8 Wm–2 K–4. The surface area of the filament is 1) 16.67 ´ 10–2 m2 2) 14.67 ´ 10–4 m2 3) 16.67 ´ 10–4 m2 4) 14.67 ´ 10–2 m2 16. The radiant power of a furnace of surface area of 0.6 m2 is 36 kW. The temperature of the furnace is (s = 6 ´ 10–8 W m–2 k–4) 1) 250 K 2) 500 K 3) 750 K 4) 1000 K 17. The rate of radiation from a block body at 0°C is E. The rate of radiation from this block body at 273°C is 1) 16 E 2) 32 E 3) 8 E 4) 28 E 18. Hot water, at 80°C cools to 70°C is in 5 minutes. If the room temperature is 30°C in what time will it cool from 60°C to 50°C 1) 6 minutes 2) 7 minutes 3) 9 minutes 4) 10 minutes 19. A body which has a surface area of 5.00 m2 and a temperature of 727°C radiates 3 ´ 1013 ergs each minute. If Stefan's constant s = 5.67 ´ 10–8 watt/m2–K4, then the emissivity of the body is 1) 1.76 2) 0.176 3) 17.6 4) 0.0176 20. [A]: Radiation is the speediest mode of heat transfer. [R]:Radiation can be transmitted in vacuum even in curved path. 1) Both A and R are true and R is correct explanation for A 2) Both A and R are true and R is not correct explanation for A 3) A is true but R is false 4) A is false but R is true 21. A soap bubble is charged to a potential of 8V. Its radius is then doubled. The potential of the bubble now will be 1) 16 V 2) 8 V 3) 4 V 4) 2 V 22. Two conducting spheres of radii r1 and r2 are equally charged. The ratio of their potentials is 1) 2) 3) 4) 23. Two identical charges each are at a distance r apart. If the distance between them is to be halved, the work to be done is 1) 2) 3) 4) 24. Following figure shows three points A, B and C in an electric field. If VA, VB and VC are the potential at these points, then 1) VA = VB> VC 2) VA < VC< VB 3) VA = VB< VC 4) VA > VC> VB 25. The capacitance of a parallel plate condenser does not depend on the 1) Area of the plates 2) Medium between the plates 3) Distance between the plates 4) Metal of the plates 26. A parallel plate condenser with oil between the plates (dielectric constant of oil = 2) has a capacitance C. If the oil is removed, the capacitance of the capacitor becomes 1) Ö2 C 2) 2C 3) C / Ö2 4) C / 2 27. A parallel plate condenser with a dielectric of dielectric constant K between the plates has a capacity C and is charged to a potential V volts. The dielectric slab is slowly removed from between the plates and then reinserted. The net work done by the system in this process is 1) 2) CV2(K – 1)/K 3) (K – 1) CV2 4) zero 28. A battery is used to charge a parallel plate capacitor till the potential difference between the plates becomes equal to the electromotive force of the battery. The ratio of the energy stored in the capacitor and the work done by the battery will be 1) 1 2) 2 3) 1/4 4) 1/2 29. Two point charges +25 C and – 6 C are 15.5 cm apart. The point between them at which the potential is zero is 1) 10.5 cm from – 6 C 2) 12.5 cm from + 25 C 3) 12 cm from – 6 C 4) 11.5 cm from +25C 30. An electric field is existing in a region. The potential at the origin (0, 0) is 0. Then the potential at P(2m, 3m) is 1) 180 V 2) 220 V 3) 260 V 4) 200 V 31. Two plates of a parallel capacitor are at potentials 200V and – 200V. If the distance between plates is 4cm then find electric field at a distance 2cm from one plate in between plates. 1) 102 V/m 2) 106 V/m 3) 103 V/m 4) 104 V/m 32. A bullet of mass 2 g is moving with a speed of 10 ms–1. If the bullet has a charge of 2 mC, through what potential must it be accelerated, starting from rest to acquire the same speed ? 1) 50 kV 2) 40 kV 3) 30 kV 4) 45 kV 33. A liquid drop of electric energy 16J is split into 8 small drops of same size. Then the electric energy of each drop is 1) 0.2 J 2) 0.3 J 3) 0.4 J 4) 0.5 J 34. Match the following: N identical charge droplets combines into a single drop. The potential capacity energy and surface charge density of bigger drop are V, C, U, s and each droplet one v, c, u, and s' respectively a) V / v e) N1/3 b) C / c f) N5/3 c) U / u g) N4/3 d) s / s' h) N2/3 1) a – h , b – e , c – f , d – g 2) a – g , b – e , c – f , d – h 3) a – g , b – f , c – e , d – h 4) a – g , b – f , c – h , d – e 35. Out of the following two statements [A]: As we move in the direction of the field potential goes on decreasing [B]: If a charged body is moved with in the field work must be done 1) A is correct and B is wrong 2) A is wrong and B is correct 3) Both A and B are correct 4) Both A and B are wrong 36. A cloud carrying a charge of 50 C is at a potential of 4200 V. If it is discharged, then the amount of ice that can melt at 0° C is 1) 7/8 kg 2) 3/8 kg 3) 8/5 kg 4) 5/8 kg 37. The capacitance of a spherical condenser is 1.8 pF. It diameter is 1) 3.24 cm 2) 1.28 cm 3) 2.24 cm 4) 16.2 cm 38. Three condensers of capacities 3 mF, 6mF, 12mF are connected in series with a battery, If the charge on 12mF condensers is 24mC, then the P.D. across the battery is 1) 12 V 2) 14 V 3) 16 V 4) 18 V 39. The equivalent capacitance of two condensers is 3 mF when connected in series and 16 mF when connected in parallel. The individual capacitances are 1) 4 mF, 8 mF 2) 12 mF, 4 mF 3) 12 mF, 16 mF 4) 4 mF, 16 mF 40. Two metal spheres of radii 10 cm and 17 cm are kept in contact. Then the equivalent capacity of the combination is 1) 3 ´ 10 –11 F 2) 2 ´ 10–11 F 3) 4 ´ 10–11 F 4) 2.5 ´ 10–11 F Key 1) 4; 2) 2; 3) 2; 4) 3; 5) 2; 6) 1; 7) 2; 8) 4; 9) 1; 10) 2; 11) 1; 12) 4; 13) 2; 14) 1; 15) 3; 16) 4; 17) 1; 18) 3; 19) 2; 20) 3; 21) 3; 22) 4; 23) 1; 24) 2; 25) 4; 26) 4; 27) 4; 28) 4; 29) 2; 30) 3; 31) 4; 32) 1; 33) 4; 34) 1; 35) 1; 36) 4; 37) 1; 38) 2; 39) 2; 40) 1. -
రేడియోషన్‌కు 18 ఏళ్ల యువకుడి మృతి
-
బుల్లి నేస్తమా.. మళ్లీ రావమ్మా.
చిన్నారి నేస్తాల విలువను గుర్తించడంలో ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్న నగరం.. పిచ్చుకల పిలుపు కోసం ఆరాట పడుతోంది. లంకంత ఇళ్లల్లో లక్కపిడతంత చోటును వాటి కోసం కేటాయించేందుకు సిద్ధపడుతోంది. అది చాలనుకుంటున్న పిచ్చుకలు తిరిగొస్తున్నాయి. రేడియేషన్ పొల్యూషన్ సృష్టించి తమను దూరంగా వెళ్లగొట్టిన మనిషి తప్పును తెలుసుకుని తమ పెద్ద మనసును చాటుకుంటున్నాడు. దీనికి నిదర్శనంగా నగరంలో పలు ఇళ్లల్లో వెలుస్తున్న పిచ్చుకగూళ్లలో బుల్లిపిట్టలు ఇప్పుడిప్పుడే సవ్వడి చేస్తున్నాయి. పిలవకున్నా మన ఇంటికి వచ్చేవి... గుమ్మాల ముంగిట గూళ్లు కట్టుకునేవి... నిత్యం పలకరించే నేస్తాలయ్యేవి. మనకి హానికలిగించే పురుగుల్ని ఆరగించే అభయహస్తాలయ్యేవి. మరిప్పుడేవి..? మనిషితో కలిసి మెలిసి జీవించడంలో మరో మనిషికన్నా తామే గొప్ప అని నిరూపించిన నిన్నటి బుల్లి ‘భాగ్యాలు’... నేటి మన ఆధునిక ఆరాటాలకు జడిసి‘పోయాయి’. అయిష్టంగానే మనల్ని విడిచిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే వీటి విలువను గుర్తిస్తున్న ఆధునిక సమాజం ఆలస్యంగానైనా పిచ్చుకకు స్వాగతం పలుకుతోంది. కిచకిచల కళ్యాణ్‌నగర్.. యూసఫ్‌గూడలోని కళ్యాణ్‌నగర్ ఫేజ్ 2లో ఉన్న రామరాజు ఇంటికి వెళితే ఆయన ఇంటిపైన ఉన్న టైగార్డెన్లో దాదాపు 10కి పైగా పిచ్చుక గూళ్లు కనిపిస్తాయి. ‘ప్రస్తుతం మా ఇంట్లో ఒక పిచ్చుక స్థిరనివాసం ఏర్పరచుకుంది. అలాగే మరో రెండు నిత్య అతిథులుగా మారాయి. ఒకటి గుడ్డు కూడా పెట్టింది’ అంటూ రామరాజు ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ కాలనీలోనే దాదాపు 300 దాకా ‘స్పారో నెస్ట్బాక్స్’లు ఏర్పాటు చేశారు. గత మూడేళ్లుగా ఈ తరహా బాక్స్‌లు ఉచితంగా అందిస్తున్న సంబంధిత విభాగం అత్యధికంగా గూళ్లు పంపిణీ చేసింది కళ్యాణ్‌నగర్ కాలనీ వాసులకే కావడం గమనార్హం. నగరంలోని బాగ్‌లింగంపల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్... వంటి ప్రాంతాల్లో ఈ నెస్ట్బాక్స్లను విరివిగా పంపిణీ చేశామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్నితాలజీ విభాగానికి చెందిన రవీందర్‌రెడ్డి చెప్పారు. తాము నగరంలో పంపిణీ చేసిన పలు గూళ్లకు పిచ్చుకలు వస్తున్నాయని, మరికొన్ని చిన్ని పక్షులు కూడా ఈ గూళ్లను వినియోగించుకుంటున్నాయని చెప్పారాయన. శివారు గ్రామాల్లో జోరు.. రేడియేషన్, కాలుష్యం వంటి సమస్యలున్నప్పటికీ, వీలున్నంత వరకూ మన ఇళ్లలో వీటికి అవసరమైన గూళ్లు ఏర్పాటు చేస్తే పిచ్చుకలు మనుగడ సాగించే అవకాశం ఉందని రవీందర్‌రెడ్డి అంటున్నారు. టై గార్డెన్స్, ఇంటి ఆవరణలో పచ్చని ల్యాండ్ స్కేప్ వంటి పరిసరాలు వీటిని ఇట్టే ఆకర్షిస్తాయని చెప్పారాయన. ప్రస్తుతం నగర శివార్లలోని హయత్‌నగర్, హిమాయత్‌సాగర్ ప్రాంతం, అజీజ్‌నగర్, ఇబ్రహీంపట్నంలోని పలు గ్రామాల్లో పిచ్చుకలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నాయని, వీటి సంతతిని పెంపొందించేందుకు ఆయా ప్రాంతాల్లో నెస్ట్బాక్స్లు అధికంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పిచ్చుకలు నివసించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా రూపొంది, గుడ్లు పెట్టేందుకు ఉపకరించే బాక్స్‌లు వీరు అందిస్తున్నారు. కేవలం 16 సెం.మీ పొడవు 24 నుంచి 39 గ్రాములలోపు బరువుండే వీటికి పెద్దగా ఆహారం కూడా అవసరం లేదు. ధాన్యపు గింజల దగ్గర్నుంచి పురుగుల దాకా ఏది దొరికితే అది తింటాయి. పిలిస్తే పలకడానికి మనిషికి మనిషే కరవైపోతున్న ఈరోజుల్లో.. పిలవకున్నా వచ్చి మనతో చెలిమి చేసే ఈ చిన్ని నేస్తాల కోసం స్నేహహస్తం అందిద్దాం. వాటి కోసం ఓ చిన్ని గూడు నిర్మిద్దాం అంటున్నారు పిచ్చుకల ప్రేమికులు. -
BIG STORY - టెక్నాలజీకో దండం
-
ఆరోగ్యాన్ని హరిస్తున్న టెక్నాలజీ
-
రేడియేషన్ పొల్యూషన్ ఈ కాలుష్యాన్నీ నివారించుకుందాం రండి..!
మనం ‘రేడియేషన్’ అనే మాటను కనీసం అదేమిటో తెలియకుండానే మనం తరచు ఉపయోగిస్తుంటాం. అసలు రేడియేషన్ అంటే ఏమిటి? అది చెడ్డదా? మంచిదా? దాంతో ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా? క్యాన్సర్ లాంటి చికిత్సలకు రేడియేషన్ లాంటి ఉపయోగాలు ఉన్నాయనుకుందాం. అప్పుడది మంచిదే కావాలి కదా! కానీ దానికి ఎక్స్పోజ్ కావడాన్ని ఎందుకు కీడుగా పరిగణిస్తాం. ఇటీవల ఆ రేడియేషన్ కాలుష్యం వాతావరణంలో పెరుగుతుండటంతో దాని గురించిన జాగ్రత్తలూ అవసరమవుతున్నాయి. వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో విరివిగా ప్రస్తావనకు వచ్చే రేడియేషన్ గురించిన అవగాహన కోసమే ఈ కథనం. రమేశ్‌కు క్యాన్సర్ గడ్డ తొలగించాక ఉన్న కొద్దిపాటి క్యాన్సర్ భాగాన్నీ కాల్చివేయడానికి రేడియేషన్ ఇచ్చారట. ఇక సురేశ్ విషయంలో ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే... నిత్యం రేడియేషన్‌కు గురికావడం వల్ల సురేశ్‌కూ క్యాన్సర్ వచ్చిందట. అది బ్లడ్ క్యాన్సర్ట. అదేమిటి? ఒక జబ్బు ను తగ్గించిన రేడియేషన్, మరోచోట అదేలాంటి మరో జబ్బును కలిగించిందా? అసలీ రేడియేషన్ అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వాటికి సమాధానాలు చూద్దాం. రేడియేషన్ అంటే ఏమిటి? మనం రోజూ ఎండ రూపంలో కాంతిని చూస్తాం కదా! ఈ కాంతి సూర్యుడి నుంచి తరంగాల రూపంలో వస్తుంది. ఈ తరంగాలలో మన కళ్లకు కనపడే కాంతికిరణాలేగాక... కంటికి కనపడని కిరణతరంగాలూ ఉంటాయి. కాంతితో వచ్చే ఈ తరంగాలన్నీ వేర్వేరుగా ఉంటాయి. మన కంటికి కనపడే కాంతిని విజిబుల్ లైట్ అంటారు. ఇదిగాక... దీనికి ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాలు ఇలా చాలా రకాలుంటాయి. అయితే ఆకాశం నుంచి వచ్చే ఈ కిరణాలను ఒక పోలిక కోసం కాసేపు ఓ చెట్టు మొదలు సైజ్‌లో ఉంటాయనుకుందాం. అందులో మనకు కనిపించే ‘కాంతి’ కేవలం మధ్యలోని ఓ పూచిక పుల్లంత మాత్రమే. మిగతాభాగంలో ఆయా తరంగదైర్ఘ్యాల (వేవ్లెంగ్త్ల)ను బట్టి ఒక వైపున ఇన్ఫ్రారెడ్ కిరణాలు, మైక్రోవేవ్ తరంగాలు, రేడియోతరంగాలు ఉంటాయి. మరోవైపున ఆల్ఫా, బీటా, గామా తరంగాలు ఉంటాయి. కాంతితో సహా ఈ కిరణాల సముదాయాన్నంతటినీ కలిపి ‘రేడియేషన్’ అంటారు. రేడియేషన్‌ను రోజూ చూస్తామా? కాంతిని తప్ప మరిదేన్నీ కంటితో చూడలేం. కానీ రేడియేషన్‌లోని తరంగాలన్నింటినీ రోజూ మనం వాడుకుంటాం. ఉదాహరణకు... కాంతి కంటే తక్కువ వేవ్లెంత్ ఉన్న రేడియో తరంగాల సహాయంతోనే మనం రేడియో వింటాం. వాటికంటే కాస్త పవర్‌ఫుల్‌గా ఉండే మైక్రోవేవ్ తరంగాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. కాబట్టి వాటి సహాయంతో వంట వండుకుంటాం. మనం మొబైల్ వాడేటప్పుడు ఒకరితో మరొకరికి అనుసంధానం ఈ తరంగాల వల్లనే కలుగుతుంది. ఈ కిరణాల్లో ఒక రకమైన రాడార్ తరంగాల సహాయంతో వాతావరణాన్ని తెలుసుకోవడం, సముద్రంలోని ఓడలు దారి తప్పకుండా చూడటం, సమాచారాలను పంచుకోవడం చేస్తుంటాం. అంతెందుకు పెద్ద పెద్ద భవంతుల్లోకి వెళ్లినప్పుడు తలపై స్మోక్ డిటెక్టర్స్ అని ఉంటాయి. భవనంలో ఎక్కడైనా పొగను పసిగట్టి మనల్ని హెచ్చరించేలా చేసుకోడానికి ఈ తరంగాలనే ఉపయోగించుకుంటున్నాం. ఇలా ఈ రేడియేషన్ తరంగాల తో మనం అనేకరకాల సేవలు చేయించుకుంటున్నాం. కాంతికి ఈ వైపు ఉన్న ఈ తరహా కిరణాలు ఏదైనా వస్తువుపై పడితే వాటికి ఎలాంటి విద్యుదావేశమూ కలిగించవు కాబట్టి వాటిని ‘నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్’ అంటారు. ఇక ఇప్పుడు ఐయొనైజింగ్ రేడియేషన్ కిరణాల దగ్గరకు వద్దాం. ఇవి కాంతికిరణాలకు మరోవైపున ఉంటాయి. వాటి శక్తి కాస్త ఎక్కువ. వాటిలో ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ తరంగాలు అని రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి గాని ఇవి మనిషి చర్మంలోకి చొచ్చుకుపోయేంత శక్తి కలిగి ఉండవు. కాకపోతే ఎక్కడైనా గాయం ఉంటే దాన్లోంచి మనిషి శరీరంలోకి వెళ్లగలవు. అయితే కాగితంలోంచి అతి కష్టం మీద అట్నుంచి ఇటు వెళ్లగలిగే ఇవి... దుస్తుల్లోంచి మాత్రం వెళ్లలేవు. ఇక బీటా పార్టికిల్స్ వాటి కంటే మరికాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అవి శరీరంలోకి ఒకింత దూరం ప్రవేశించగలవు. కానీ దుస్తుల్లోంచి దూరలేవు. అందుకే దుస్తులు వేసుకోవడం వల్ల అటు ఆల్ఫా, బీటా తరంగాల నుంచి రక్షణ కలుగుతుంది. మన చర్మంలో ‘జెర్మినేషన్ లేయర్’ అనే పొర ఉంటుంది. మన చర్మం ఎప్పుడూ మనకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈ క్రమంలో శిథిలమైన చర్మకణాల స్థానంలో కొత్తకణాలు వచ్చి చేరుతుంటాయి. ఆ కొత్త కణాలు ఎప్పుడూ పుడుతుండే పొరే... ఈ జర్మినేషన్ లేయర్. ఒకవేళ ఏ కారణంగానైనా బీటా తరంగాలు ఈ పొర వరకు చేరితే కొత్త కణాలు పుట్టే ప్రక్రియకు హాని చేకూరుతుంది. ఆల్ఫా, బీటా తరంగాలతో పోలిస్తే గామా తరంగాలు మరింత శక్తిమంతమైనవి. అవి మానవ దేహాల్లోకి చొచ్చుకుపోగలవు. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు... ఈ రెండూ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. కాబట్టే ఈ ఎక్స్-రే ల సహాయం తో విరిగిన ఎముకలు, విరిగిన పంటి భాగాలను, ఇతరత్రా కణజాలాలను చూసి తగిన చికిత్స చేయడానికి సాధ్యమవుతుంది. ఇలా ఎక్స్-రే రూపంలో రేడియేషన్ కూడా మానవుల వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే గామా రేస్ కూడా వైద్యవిజ్ఞానంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోబాల్ట్-60 అనే మూలకం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నారు. ఈ గామా కిరణాలను ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలోనూ, వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయడంలోనూ ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ఉపయోగకరమైన రేడియేషన్ గురించి ఆందోళన ఎందుకు? మనకు వైద్యశాస్త్రంలో ఇంతగా ఉపయోగపడే రేడియేషన్ కిరణాల గురించి ఆందోళన ఎందుకు? ఎందుకంటే... ఇవి మనిషి కణజాలాల్లోని కణంపైన ప్రభావం చూపినప్పుడు అందులోని జన్యుస్వరూపాన్ని మార్చగలవు కాబట్టి. జన్యుస్వరూపం అంతా జెనిటిక్ కోడ్ రూపంలో కణంలో నిక్షిప్తమై ఉంటుంది. మన అన్ని జీవక్రియలకు ఇదే ప్రాతిపదిక. ఒకవేళ జన్యుస్వరూపంలో మార్పు వస్తే ఆ మేరకు అది జీవక్రియల్లోనూ ప్రతిఫలిస్తుంది. దాంతో జీవక్రియలు అస్తవ్యస్తమైపోతాయి. ఇలా అస్తవ్యస్తన జీవక్రియలు దీర్ఘకాలంలో మృత్యువుకు సైతం దారితీయవచ్చు. అందుకే ఇలా దీర్ఘకాలంలో రేడియేషన్‌కు గురవుతూంటే క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి రేడియేషన్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రేడియేషన్ కంటామినేషన్ కూడా ఉంటుందా? వ్యాధి ఇతరులకు సోకినట్లుగా రేడియేషన్ కూడా ఇతరులకు సోకుతుందా? ‘రేడియేషన్ కంటామినేషన్’ కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు ‘ఉంటుంది’ అన్నదే జవాబు. రేడియేషన్ ఎక్కడైనా ఉంటుంది. ఆఖరికి మన సాధారణ వాతావరణంలో కూడా ఉండనే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు అది మనకు హాని చేసేంత మోతాదులో ఉండదు. కాబట్టి వాతావరణంలో, కాంతికిరణాలతో పాటు నిత్యం ఉండే రేడియేషన్ వల్ల మనకు హాని జరగదు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా రేడియేషన్‌ను వెలువరించగల వస్తువులుంటే అవి దుస్తులపై ఉన్నా, అవి ఒకరి నుంచి మరొకరికి తాకి కంటామినేషన్కు దారితీయవచ్చు. రేడియేషన్‌ను వెలువరించగల పదార్థాల వద్ద ఆవలించినప్పుడు లేదా శ్వాసించినప్పుడు అవి మనలోకి వెళ్లవచ్చు లేదా చర్మంపైన రేడియేషన్ పేరుకున్నప్పుడు... దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా గాయం ఉంటే అది శరీరంలోకి ప్రవేశించవచ్చు. అలాంటప్పుడు దాని దుష్ర్పభావాలను ఎంతోకొంత చూపించే ప్రమాదమూ ఉంది. పెరుగుతున్న రేడియేషన్ కాలుష్యం... ఇప్పుడు మనం ప్రతిరోజూ రేడియేషన్ ఉపయోగాలను పెంచుకుంటుండంతోనూ, రేడియేషన్ కిరణాలతో ఉపయోగించే వస్తువుల (ఉదా: మొబైల్ఫోన్లు, స్మోక్ డిటెక్టర్లు, మైక్రోవేవ్ అవెన్ వంటివి) వాడకం కూడా పెరగడంతోనూ వాతావరణంలో నిత్యం ఉండే పాళ్ల కంటే రేడియేషన్ మరింతగా పెరుగుతోంది. దాంతో రేడియేషన్ వల్ల మనపై పడే దుష్ర్పభావాలూ పెరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో నిపుణులకు మాత్రమే పరిమితమైన రేడియేషన్ గురించి, వారితో పాటు సాధారణ ప్రజలకూ అవగాహన అవసరం. రేడియేషన్కూ కొలత ఉంటుందా? ఉంటుంది. మన చుట్టూ ఉండే రేడియేషన్ పాళ్లనూ కొలవగలం. దీనికి యూనిట్ ‘గ్రే’ అనీ, ‘సీవెర్ట్స్’ అని కొలతకు ప్రమాణాలు కూడా ఉంటాయి. ఇంకొక విషయం... కేవలం సూర్యుడు ఉన్నప్పుడు ఎండవేళల్లోనే కాంతికిరణాలతో పాటు రేడియేషన్ వస్తుందని అపోహ పడకూడదు. సూర్యుడి శక్తి భూమిలో నిక్షిప్తమై రాత్రివేళల్లో బయటికి వస్తున్నప్పుడు, దానితోపాటు భూమిలో ఉండే రేడియేషన్‌ను వెలువరించే ఖనిజాలు, మూలకాల నుంచి కూడా రేడియేషన్ బయటకు వస్తుంటుంది. ఆకాశం నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘కాస్మిక్ రేడియేషన్’ అంటారు. భూమి నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘టెరెస్ట్రియల్ రేడియేషన్’ అంటారు. ఇలా రేడియేషన్ అన్నది వానలా ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. అయితే దానిపాళ్లను ప్రమాదకరం కాకుండా పర్యావరణ స్పృహతో అదుపులో ఉంచుకోవడమంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కూడానని గ్రహించాలి. - నిర్వహణ: యాసీన్ రేడియేషన్ ప్రమాదాల నుంచి జాగ్రత్తలు నిత్యం పొడవు చేతుల చొక్కాలు, శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులు ధరించడం మంచిది. అవి మనల్ని కేవలం వాతావరణ దుష్ర్పభావాల నుంచి మాత్రమే గాక... ఇలాంటి రేడియేషన్ దుష్ర్పభావాల నుంచి కూడా ఎంతో కొంత కాపాడుతుంటాయి. ఒకవేళ దుస్తులు రేడియేషన్‌తో కంటామినేట్ అయ్యాయని గ్రహిస్తే వాటిని విడిచి, మళ్లీ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. రేడియేషన్‌ను వెలువరించే వస్తువులు ఉండే కంటెయినర్ వద్దకు వెళ్లినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా ముట్టుకోకూడదు. డాక్టర్లు ఎక్స్-రే వంటి పరీక్షలు చేయించుకోమన్నప్పుడు ఎక్స్-రే తీసేవారు చెప్పే సూచనలను విధిగా పాటించాలి. ఎక్స్-రే గాని లేదా రేడియేషన్ ప్రమేయం ఉండే సీటీ స్కాన్ వంటి అన్ని రకాల పరీక్షలు అన్ని జాగ్రత్తలతో చేయించుకోవాలి. (ఇక్కడ అల్ట్రాసౌండ్ పరీక్షలను రేడియేషన్ పరీక్షలుగా పొరబడేవారు చాలామంది ఉంటారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కేవలం ఒకరకమైన శబ్దతరంగాలను ఉపయోగించి దేహం లోపలి భాగాలను చూస్తారు. వాటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కాబట్టి గర్భవతుల విషయంలో చేసే అల్ట్రాసౌండ్ పరీక్షలతో ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందకూడదు. అది అనవసరమైన భయాలను పెంపొందించుకోవడమే. అయితే గర్భవతులు మాత్రం వీలైనంతవరకు రేడియేషన్‌కు గురికావలసిన ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలను చేయించుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై చేయించాల్సి వస్తే, తాము ఎన్నో నెల గర్భవతి, ఏ అవసరాల కోసం చేయించుకోవాల్సి వస్తుందో డాక్టర్‌తో విపులంగా చర్చించాలి. మీరు రేడియేషన్‌కు గురైన తర్వాత, రేడియేషన్ సోకిందని అనుకున్న భాగాన్ని సబ్బు (నాన్-అబ్రేసిడ్ సోప్)తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటప్పుడు అక్కడ గరుకుగా ఉండే సబ్బు (అబ్రెసివ్ సోప్)ను వాడకూడదని గుర్తుంచుకోండి. డాక్టర్ రావూరి పవర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
రేడియేషన్ పరిమితి దాటితే రెట్టింపు జరిమానా
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల నుంచి పరిమితికి మించి రేడియేషన్ వెలువడిన పక్షంలో టెలికం కంపెనీలపై విధించే జరిమానాను టెలికం శాఖ రెట్టింపు చేసింది. ఇకపై రూ. 10 లక్షలు విధించనుంది. గతంలో రేడియేషన్‌కి సంబంధించి ఏ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా గరిష్టంగా రూ.5 లక్షలు ఉండేది. మరోవైపు, దరఖాస్తులు, ఇతరత్రా పత్రాల సమర్పణ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించే జరిమానా పరిమాణాన్ని టెలికం శాఖ తగ్గించింది. కొత్త పెనాల్టీ శ్లాబ్‌ల ప్రకారం రేడియేషన్ మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్లను సమర్పించడంలో జాప్యం జరిగితే గరిష్టంగా రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. గతంలో చిన్నపాటి ఉల్లంఘనలకు కూడా గరిష్టంగా రూ. 5 లక్షల జరిమానా ఉండేది. పరిశ్రమవర్గాల అంచనాల ప్రకారం మొబైల్ టవర్ల నిబంధనల ఉల్లంఘనల విషయంలో ఈ ఏడాది ప్రథమార్ధం దాకా టెలికం శాఖ సుమారు రూ. 1,900 కోట్ల జరిమానాలు విధించింది. ఇందులో అత్యధికంగా 64 శాతం పెనాల్టీలు డాక్యుమెంట్ల అంశానికి చెందినవే కాగా రేడియేషన్ ఉల్లంఘనల వాటా 1.2 శాతం మాత్రమే. కొత్త శ్లాబ్‌ల ప్రకారం మొబైల్ టవర్‌ను ఉపయోగించడం మొదలుపెట్టినప్పట్నుంచీ 15 రోజుల్లోగా కాంప్లయన్స్ సర్టిఫికెట్‌ను టెలికం కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత 15-30 రోజుల జాప్యానికి రూ.5,000-20,000 దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతకు మించి 60 రోజుల దాకా ఆలస్యమైతే రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. అప్పటికీ సమర్పించకపోతే టవర్‌ని మూసేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ అయిన అన్ని మొబైల్ టవర్ల విషయంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ సమర్పించేందుకు 2015 మార్చ్ దాకా గడువునిచ్చింది టెలికం శాఖ. -
సెల్ టవర్లు...‘హెల్’ టవర్లే!
‘సెల్ టవర్లతో రేడియేషన్ దారుణంగా విస్తరిస్తోంది. దాంతో మానవుల ఆరోగ్యం దెబ్బ తింటోంది. జనావాసాల నడుమ సెల్ టవర్ల ఏర్పాటును నిరోధించండి.’ అంటూ కొంతకాలంగా నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మొరపెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. పెపైచ్చు కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించి, సెల్ టవర్లతో రేడియేషన్ ప్రభావం పెద్దగా ఉండబోదంటూ వక్రభాష్యాలు చెప్పారన్న ఆరోపణలున్నాయి. సెల్ టవర్ల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముంబై ఐఐటీకి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు గిరీష్ కుమార్ ఓ సమగ్ర నివేదిక పొందించారు. ఈ నివేదికలను ప్రస్తావిస్తూ, తమ నివాస ప్రాంతాల్లో ఎదురవుతున్న రేడియేషన్ దుష్పరిణామాలపై న్యూ రేసపువానిపాలెం నివాసులు జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. నిబంధనల సడలింపు సెల్ టవర్ల ఏర్పాటు నిబంధనలు గత కొన్నాళ్లుగా సరళీకృతమవుతూ వస్తున్నాయి. జీవీఎంసీలో నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలున్నా, కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపించి అధికారులు తప్పించుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం ఎంత? జీవీఎంసీలో 584 సెల్ టవర్లున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ జేబులోని మొబైల్ ఫోన్ రింగయినపుడు వచ్చేంత మాత్రమే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించినట్టు జీవీఎంసీ అధికారులు గతంలోనే వెల్లడించారు. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కూడా పొందుపరిచారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై మూడు మాసాల కిందట నాతయ్యపాలెం ప్రజలు కమిషనర్‌కు మొరపెట్టుకుంటే.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము చేసేదేం లేదని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే న్యూరేసపువానిపాలెంలోని ఓ అపార్టుమెంట్‌వాసులు తమ అపార్ట్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై ఫిర్యాదు చేశారు. వీటివల్ల కొందరు తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. ఇందుకు సెల్ టవర్ల రేడియేషనే ప్రధాన కారణమంటూ ముంబయిలోని టాటా మెరియల్ హాస్పిటల్ అండ్ కేన్సర్ రీసెర్చ్ సంస్థ నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ముంబయి ఐఐటీ ఆచార్యుడు గిరీష్ కుమార్ పరిశోధన నివేదికను కూడా జత చేశారు. బాధితులు ఎందరో.. నివాస భవనాలపై సెల్ టవర్ల వల్ల రేడియేషన్ మితిమీరి చాలా మంది రోగాలకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మా అపార్ట్‌మెంట్‌పైనే రెండు టవర్లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది రేడియేషన్ ప్రభావానికి లోనయ్యారు. ముగ్గురు తీవ్ర వ్యాధిగ్రస్తులయ్యారు. ఓ మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. తక్షణమే వీటిని నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి. - జి.ఎస్.సిద్దార్థ, ఫిర్యాది, న్యూ రేసపువానిపాలెం ప్రభుత్వానికి నివేదిస్తాం అపార్టుమెంట్‌వాసుల ఫిర్యాదును, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ గిరీష్ కుమార్ పరిశోధన బుక్‌లెట్‌ను ప్రభుత్వానికి అందిస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీటిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇపుడీ పరిశోధన పత్రం ఆధారంగా మరోసారి రేడియేషన్ ప్రభావంపై పరిశోధన చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించనున్నాం. - ఎం.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ -
టవర్ల రేడియేషన్‌ను తగ్గిస్తాం
సాక్షి ముంబై: నగరవ్యాప్తంగా ఉన్న మొబైల్ టవర్ల రేడియేషన్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ సహాయక మంత్రి మిలింద్ దేవరా తెలిపారు. ప్రజలు, సామాజిక సంస్థల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన విలేకరులకు వెల్లడించారు. రేడియేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా భారత్‌లో రేడియేషన్ విడుదల స్థాయుల తగ్గింపునకు గత ఏడాదే ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతకుముందు రేడియేషన్ తీవ్రత 4,500 మి.లి.వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ ఉండేదని, దానిని 450 మి.లి. వాట్స్ పర్ స్క్వేర్ మీటర్‌కు తగ్గించినట్లు వివరించారు. ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, ఆస్ట్రియా దేశాలతో పోలిస్తే భారత్‌లో రేడియేషన్ స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్జీఓలు వాదిస్తుండడాన్ని కూడా దేవరా ప్రస్తావించారు. ‘రేడియేషన్‌తో వల్ల కలిగే దుష్ర్పభవాలపై భారత్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనుషులతోపాటు పక్షి, ఇతర ప్రాణులపై కూడా ఇది దుష్ర్పభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడయింది’ అని ఆయన పేర్కొన్నారు. అందుకే రేడియేషన్ ఫ్రీక్వెన్సీలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రేడియేషన్ విడుదల నిబంధనలను భారత్‌లోని టెలికాం కంపెనీలు పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఒక టవర్‌పై ఉన్న యాంటెన్నాల సంఖ్య ఆధారంగా రేడియేషన్ తీవ్రతను లెక్కిస్తారు. ఒకే టవర్‌పై అనేక యాంటెన్నాలు ఉంటే అధికముప్పు ఉంటుందని ముంబై ఐఐటీ ప్రొఫెసర్ గిరిష్‌కుమార్ తెలిపారు. టవర్ల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలు ఒక భవనంపై ఒకే టవర్‌కు అనుమతి ఇవ్వాలి. అందులో నివసించే 70 శాతం మంది, ముఖ్యంగా చివరి అంతస్తులో ఉంటున్న వారి అంగీకారం కచ్చితంగా ఉండాలి. పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రి, వృద్ధాశ్రమాలు ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టవర్లకు అనుమతి లభించదు. ఇక ముంబై నగరంలో మొత్తం 4,779 మొబైల్ టవర్లు ఉన్నాయి. అందులో 1,159 టవర్లు మినహా మిగతావన్నీ అనధికారికంగానే ఏర్పాటయ్యాయి. మొబైల్ టవర్ల రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి, చిరాకు, ఉదాసీనత, మతిమరుపు, పక్షవాతం, సంతానం కలగకపోవడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. -
టవర్ టై..
సాక్షి, మచిలీపట్నం/ న్యూస్‌లైన్, మచిలీపట్నం టౌన్ : ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 420 జీవోతో సెల్ టవర్ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు కల్పించింది. దీంతో సెల్‌టవర్లు ప్రజల పాలిట టైగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ టవర్ల నుంచి విడుదలయ్యే అత్యధిక రేడియేషన్ ప్రభావం ప్రజారోగ్యానికి చేటు తెస్తుంది. గతంలో నివాస ప్రాంతాల్లో సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలంటే ఆ భవన యజమానితో పాటు చుట్టుపక్కల నివాసితుల అంగీకారం తప్పనిసరి అనే నిబంధన ఉంది. ప్రస్తుత జీవో ప్రకారం టవర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే స్థల, భవన యజమాని అనుమతి ఉంటే చాలు. సెల్ కంపెనీల కాసులకు లొంగి.. ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక విచ్చలవిడిగా టవర్ల ఏర్పాటు... ప్రభుత్వ జీవోతో ఇకపై విచ్చలవిడిగా సెల్ టవర్లను ఏర్పాటు చేసుకునే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం 318 సెల్వన్ (బీఎస్ఎన్ఎల్ సెల్) టవర్లు ఉన్నాయి. వాటిలో 105 విజయవాడ నగరంలోనివే. మిగిలిన ప్రైవేటు నెట్‌వర్క్‌లకు చెందిన సెల్ టవర్లు జిల్లాలో సుమారు 1200 వరకు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు నిర్దేశించిన ఫ్రీక్వెన్సీతోనే ఉంటాయి కాబట్టి వాటి నుంచి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించేంతగా రేడియేషన్ ప్రభావం ఉండదు. ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం మారుమూల ప్రాంతాలకు సైతం తమ నెట్వర్క్ అందేలా సెల్ టవర్లను అత్యధిక ఫ్రీక్వెన్సీ ఉండేలా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అత్యధిక రేడియేషన్ విడుదలై సమీపంలో నివసించే ప్రజలకు చర్మవ్యాధులు, ప్రమాదకర రోగాలు ప్రబలుతున్నట్టు అనేక సందర్భాల్లో నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలతో పాటు తిరువూరు, నందిగామ, ఉయ్యూరు నగర పంచాయతీల్లోను సెల్ టవర్ల ఏర్పాటుపై అనేకసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సైతం సెల్ టవర్ల ఏర్పాటుతో తాము అనారోగ్యం పాలవుతున్నామంటూ ప్రజలు అధికారులకు అనేక ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా అధికారిక అనుమతితో సెల్ టవర్ల ఏర్పాటు మాత్రం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. న్యాయస్థానాల సూచనలనూ తోసిరాజని... సెల్ టవర్ల ఏర్పాటుకు భవన యజమాని అనుమతితోపాటు సమీప నివాసితుల అనుమతి తప్పనిసరని, పాఠశాలలు, ఆస్పత్రుల సమీపంలో సెల్ టవర్లను నిషేధించాలని గతంలో అనేక పర్యాయాలు న్యాయస్థానాలు సూచించాయి. అయినా ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా జీవో ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభావం.. నివాసగృహాల మధ్య సెల్ టవర్ల ఏర్పాటు కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామని, వ్యాధులబారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్టవర్ల నుంచి వచ్చే తరంగాల వల్ల దాదాపు 500 మీటర్ల పరిధిలో ఉండే నివాసితులు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ప్రధానంగా చర్మ, గుండె సంబంధ వ్యాధులు, నిద్రలేమి, వినికిడి లోపం, క్యాన్సర్, కణితులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులపై రేడియేషన్ ప్రభావం అధికంగా పడితే పుట్టే పిల్లలకు అంగవైకల్యం సంభవించే అవకాశముందని వివరిస్తున్నారు. మచిలీపట్నం 42వ వార్డు పరిధిలోని జెట్టివారి వీధిలో నాలుగేళ్ల క్రితం ఏర్పాటుచేసిన సెల్ టవర్ కారణంగా తాము రోగాలబారిన పడ్డామని ప్రాంత మహిళలు గతంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సెల్ టవర్‌ను తొలగించాలని వారు కోరారు. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ ఎస్.శివరామకృష్ణకు బాధితులు తమ ఆవేదన వివరించారు. గుండె, ఊపిరితిత్తులు, చర్మ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడిన వారు తమ హెల్త్ రిపోర్ట్‌లను కూడా చూపారు. టవర్ తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. మచిలీపట్నం 16వ వార్డు మల్కాపట్నం వాసులు క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నామని వాపోతున్నారు. ఆ టవర్ వల్ల క్యాన్సర్ బారినపడి దాదాపు 12 మందికి మృతిచెందారని చెబుతున్నారు. గత మే నెలలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ పట్టణ నాయకుడు శ్లీలరాజు కూడా ఈ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగానే క్యాన్సర్ బారిన పడి మృతి చెందాడని ఆయన కుటుంబీకులే ఆరోపించారు. సుల్తానగరంలో ప్రజలు గతేడాది పదిరోజుల పాటు రిలే దీక్షలు చేశారు. చివరకు సెల్కంపెనీ ప్రతినిధులు సెల్‌టవర్ నిర్మాణం నిలుపుదల చేస్తున్నట్టు చెప్పడంతో ఆందోళనలు విరమించారు. ఏదేమైనా ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 420 జీవోతో సెల్ టవర్ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు కల్పించింది. -
సెల్ రేడియేషన్‌తో క్యాన్సర్ రాదు :ఢిల్లీ మెడికల్ అసోసియేషన్
సెల్‌ఫోన్ టవర్లు విడుదల చేసేదాని కంటే సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ శక్తి వెయ్యిరెట్లు అధికంగా ఉంటుందని, మొబైల్స్ వినియోగం వల్ల బ్రెయిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు లేవని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే టవర్లు పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తే ప్రమాదాలు ఉండవచ్చని పేర్కొంది. న్యూఢిల్లీ: మొబైల్ఫోన్ల టవర్లు విడుదల చేసే రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ సోకుతుందన్న వాదనలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే టవర్లు పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తే ప్రమాదాలు ఉండవచ్చని పేర్కొం ది. మొబైల్ఫోన్ల రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యా న్సర్ వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రేడియేషన్ ప్రభావం వల్ల శరీరంలోని ఏ ఒక్క భాగానికీ పెద్దగా హాని జరగదని డీఎంఏ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ తెలిపారు. ‘మొబైల్ఫోన్ల రేడియేషన్‌తో బ్రెయిన్ క్యాన్సర్(మెనింగ్లోమా)కు ఏదైనా సంబంధం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, డానిష్ కోహర్ట్ స్టడీ, ఇంటర్‌ఫోన్ స్టడీ, హార్డ్‌వెల్ స్టడీ పత్రాలను డీఎంఏ వైద్యనిపుణుల బృందం పరిశీలించింది. ఈ రెండింటి మధ్య ఎటువంటి సంబంధమూ లేదని తేల్చింద’న్నారు. టవర్లు విడుదల చేసేదానికంటే సూర్యుడు విడుదల చేసే రేడియేషన్ శక్తి వెయ్యిరెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. మొబైల్ రేడియేషన్ తీవ్రతతో పోలిస్తే వంటిం ట్లోని ఓవెన్ ఒక సెకనులో విడుదల చేసే రేడియేషన్ చాలా రెట్లు అధికమన్నారు. సెల్ఫోన్ల ఫోటాన్లకు మనిషి డీఎన్ఏకు హాని చేయగల శక్తి ఎంత మాత్రమూ ఉండబోదని అనిల్ వివరించారు. మొబైల్ఫోన్ల రేడియేషన్ స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేటు (ఎస్ఏఆర్) 1.6 వాట్లు/కేజీకి మించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. బెయి న్ కేన్సర్ కేసులకు మనదేశంలో పెరుగుతున్న మొబైల్ఫోన్ల కనెక్షన్లకు ఎటువంటి సంబంధమూ లేదని టాటా మెమోరియల్ సెంటర్ పరిశోధనలు కూడా ప్రకటించాయని అనిల్ పేర్కొన్నా రు. అయితే పైన వివరించిన పరిశోధనలు చిన్నపిల్లలు, గర్భిణులపై రేడియేషన్ ప్రభావాన్ని అధ్యయనం చేయలేదు. అయినప్పటికీ గుండెకు పేస్మేకర్లు అమర్చుకున్న వాళ్లు, గర్భిణులు, చిన్నారులు రేడియేషన్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలని హృద్రోగ వైద్యనిపుణులు ప్రేమ్అగర్వాల్ అన్నారు. -
అక్రమ సెల్‌ఫోన్ టవర్లపై చర్యలేవీ?
సాక్షి, ముంబై: నగరంలో అక్రమంగా ఏర్పాటుచేసిన సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగానికి ముహూర్తం దొరకడం లేదు. నియమాలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసుకున్న వివిధ కంపెనీలకు చెందిన వేలాది సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు నిర్ణయించిన బీఎంసీ ఆ మేరకు కొత్త నియమావళిని రూపొందించడంలో సాగదీత ధోరణిని అవలంభిస్తోంది. దీన్ని రూపొందించేందుకు ఇప్పటివరకు బీఎంసీకి సమయం దొరకకపోవడం వారికి పనిమీద ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. నగరంలో వివిధ సంస్థలకు చెందిన 4,776 సెల్‌ఫోన్ టవర్లు ఉన్నాయి. ఇందులో ఏకంగా 75 శాతం టవర్లు అక్రమంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం 1,145 టవర్లు మాత్రమే అవసరమైన అనుమతులు తీసుకున్న నిర్వాహకులు నియమాలకు కట్టుబడి వాటిని ఏర్పాటు చేశారు. మిగతా టవర్లు అక్రమంగా ఏర్పాటు చేసినట్లు బీఎంసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులను విన్నవించేందుకు హిందీ సినీ నటి జూహి చావ్లా ఇటీవల బీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సీతారాం కుంటేతో భేటీ అయ్యారు. దీంతో నగరంలోని సెల్ టవర్లపై జూన్ ఒకటో తేదీ వరకు వివరాలు అందజేసి, జూలై 15 వరకు కొత్త నియమావళి ప్రకటిస్తామని చావ్లాకు కుంటే హామీ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో బీజేపీ కార్పొరేటర్ వినోద్ శేలార్ సీతారాం కుంటేతో భేటీ అయి ఆగస్టు ఒకటో తేదీ వరకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ ఆగస్టు రెండో వారం ముగుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నియమావళి అమలు చేయలేదు. అయితే అనేక సెల్ టవర్లకు బెస్ట్ సంస్థ, రిలయన్స్ ఎనర్జీ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం టవర్లు అక్రమంగా ఏర్పాటుచేసినవే ఉన్నాయి. ఇలాంటి టవర్లపై దర్యాప్తు చేయడంతో పాటు వీటికి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని శేలార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజల సమస్యలు వినేందుకు సెల్ టవర్ల కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సమాజ సేవా సంస్థల పదాధికారులతో కూడిన ఒక కమిటీని స్థాపించాలని కోరుతూ ఆయన కేంద్ర మంత్రి మిలింద్ దేవరాకు ఒక లేఖ పంపించారు.