సెల్ రేడియేషన్‌తో క్యాన్సర్ రాదు :ఢిల్లీ మెడికల్ అసోసియేషన్
Published Sat, Sep 28 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
సెల్‌ఫోన్ టవర్లు విడుదల చేసేదాని కంటే సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ శక్తి వెయ్యిరెట్లు అధికంగా ఉంటుందని, మొబైల్స్ వినియోగం వల్ల బ్రెయిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు లేవని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే టవర్లు పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తే ప్రమాదాలు ఉండవచ్చని పేర్కొంది.
న్యూఢిల్లీ: మొబైల్‌ఫోన్ల టవర్లు విడుదల చేసే రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ సోకుతుందన్న వాదనలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే టవర్లు పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తే ప్రమాదాలు ఉండవచ్చని పేర్కొం ది. మొబైల్‌ఫోన్ల రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యా న్సర్ వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రేడియేషన్ ప్రభావం వల్ల శరీరంలోని ఏ ఒక్క భాగానికీ పెద్దగా హాని జరగదని డీఎంఏ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ తెలిపారు. ‘మొబైల్‌ఫోన్ల రేడియేషన్‌తో బ్రెయిన్ క్యాన్సర్(మెనింగ్లోమా)కు ఏదైనా సంబంధం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, డానిష్ కోహర్ట్ స్టడీ, ఇంటర్‌ఫోన్ స్టడీ, హార్డ్‌వెల్ స్టడీ పత్రాలను డీఎంఏ వైద్యనిపుణుల బృందం పరిశీలించింది.
ఈ రెండింటి మధ్య ఎటువంటి సంబంధమూ లేదని తేల్చింద’న్నారు. టవర్లు విడుదల చేసేదానికంటే సూర్యుడు విడుదల చేసే రేడియేషన్ శక్తి వెయ్యిరెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు. మొబైల్ రేడియేషన్ తీవ్రతతో పోలిస్తే వంటిం ట్లోని ఓవెన్ ఒక సెకనులో విడుదల చేసే రేడియేషన్ చాలా రెట్లు అధికమన్నారు. సెల్‌ఫోన్ల ఫోటాన్లకు మనిషి డీఎన్‌ఏకు హాని చేయగల శక్తి ఎంత మాత్రమూ ఉండబోదని అనిల్ వివరించారు. మొబైల్‌ఫోన్ల రేడియేషన్ స్పెసిఫిక్ అబ్సార్‌ప్షన్ రేటు (ఎస్‌ఏఆర్) 1.6 వాట్లు/కేజీకి మించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది.
బెయి న్ కేన్సర్ కేసులకు మనదేశంలో పెరుగుతున్న మొబైల్‌ఫోన్ల కనెక్షన్లకు ఎటువంటి సంబంధమూ లేదని టాటా మెమోరియల్ సెంటర్ పరిశోధనలు కూడా ప్రకటించాయని అనిల్ పేర్కొన్నా రు. అయితే పైన వివరించిన పరిశోధనలు చిన్నపిల్లలు, గర్భిణులపై రేడియేషన్ ప్రభావాన్ని అధ్యయనం చేయలేదు. అయినప్పటికీ గుండెకు పేస్‌మేకర్లు అమర్చుకున్న వాళ్లు, గర్భిణులు, చిన్నారులు రేడియేషన్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలని హృద్రోగ వైద్యనిపుణులు ప్రేమ్‌అగర్వాల్ అన్నారు.
Advertisement
Advertisement