Mobiles
-
2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..
ఇండియన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ రేటున్న మొబైల్స్ ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ కథనంలో రూ. 10వేలు ధర వద్ద అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూసేద్దాం.మోటో జీ45 5జీ (Moto G45 5G)మార్కెట్లో సరసమైన మొబైల్ ఫోన్ల జాబితాలో మోటో కంపెనీకిని చెందిన 'జీ45 5జీ' ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 4 జీబీ. 8 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఎందుకుని వేరియంట్‌ను బట్టి ధరలు మారుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.45 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G)ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అనేది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పొందుతుంది. ఇది 4జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 5,000 mAh బ్యాటరీ కలిగి 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.9,499.రియల్మీ సీ63 (Realme C63)రియల్మీ సీ63 ధర రూ. 8,999 మాత్రమే. ఇది 6.67 ఇంచెస్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, 120 Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ వంటివి పొందుతుంది. ఈ మొబైల్ 64 జీబీ, 128 జీబీ ర్యామ్ ఆప్షన్ పొందుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇదీ చదవండి: సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!వివో టీ3 లైట్ (Vivo T3 Lite)తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లలో.. వివో టీ3 లైట్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 6.65 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 840 నిట్స్ బ్రైట్నెస్ పొందుతుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 మిమీ జాక్ కూడా పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.రెడ్మీ 13 సీ 5జీ (Redmi 13C 5G)మార్కెట్లో 'రెడ్మీ 13 సీ 5జీ' ధర రూ. 7,199. ఇది 6.74 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్.. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ద్వారా శక్తిని పొందే ఈ ఫోన్ 8 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, మరొక 2 మెగా పిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ వంటి వాటి కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.Note: మొబైల్ ధరలు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, ర్యామ్ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంటుంది. -
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్‌ప్లస్ నార్డ్ 4వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4వన్‌ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది. -
99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు. -
‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ‘బీ న్యూ మొబైల్స్’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ, వివో, ఒప్పో, రియల్‌మి, మొబైల్స్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు, యాక్సెసరీస్‌పై 80% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్‌టాప్‌పై రూ.10 వేలు, టీవీ కొనుగోలుపై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టీవీఎస్ కార్డు ద్వారా కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా, ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. బజాజ్‌ఫిన్‌సర్వ్ ద్వారా వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఈడీ సాయి నితీష్‌లు తెలిపారు. -
యాపిల్ కీలక నిర్ణయం: మొదటిసారి భారత్‌లో..
యాపిల్ కంపెనీ తన 'ఐఫోన్ ఎస్ఈ' 2017లో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడూ ప్రో వేరియంట్లను తయారు చేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారు చేయనున్నట్లు సమాచారం.యాపిల్ కంపెనీ ప్రో మోడల్ మొబైల్స్ తయారు చేయనున్నట్లు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో & ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొంది. ప్రారంభంలో ఎంట్రీ-లెవల్, పాత ఐఫోన్ మోడళ్లపై దృష్టి సారించిన కంపెనీ క్రమంగా అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.వచ్చే 3 - 4 సంవత్సరాలలో దేశంలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో 25 శాతం లక్ష్యంగా, యాపిల్ తన ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 16 ప్రో మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త విడుదలతో సమకాలీకరించాలనే లక్ష్యంతో ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులోని తన సదుపాయంలో వేలాది మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే కంపెనీ తన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్‌చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్‌చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్‌లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్‌చాట్. దీనితో ఆర్టిస్ట్‌లు, డెవలపర్లు స్నాప్‌చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
రూ.30 వేలలోపు బెస్ట్ మొబైళ్లు ఇవే.. (ఫొటోలు)
-
మీ మొబైల్ ఫోన్ పోయిందా..ఇకపై నిశ్చింతగా ఉండండి
-
ఈ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ - వివరాలు
భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో కొత్త వాహనాలు, కొత్త మొబైల్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కావున ఈ కథనంలో ఈ నెల (అక్టోబర్) దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 04 న విడుదలకానున్నట్లు సమాచారం. ఇది పిక్సెల్ 8 & పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్‌లో విడుదలకానున్నట్లు సమాచారం. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, ప్రో మోడల్ 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 'ప్రో' లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా ఉండవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 58170 & రూ. 74814 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వివో29 సిరీస్ వివో వి29 సిరీస్ కూడా ఈ నెల 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లలో విడుదలకానుంది. వీ29 లో 120 Hz రేటుతో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉండవచ్చని సమాచారం. రెండు వేరియంట్లు మంచి కెమెరా సెటప్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నాయి. రెడ్మీ నోట్ 13 5జీ చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 13 5జీ అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే పొందుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధరలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ ఓపెన్ ఒకటి. ఈ మొబైల్ ఈ నెల మధ్యలో లేదా చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోల్డ్ స్క్రీన్, 6.3 ఇంచెస్ అమోల్డ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ధర & వివరాలు తెలియాల్సి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఈ నెల మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉండనుంది. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సీనోస్ 2200 చిప్ సెట్ ఉండనున్నట్లు సమాచారం. కెమరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్‌ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్‌మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్‌లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఫోన్ ఫ్రీ!
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ టచ్ మొబైల్స్ ‘ఫ్రీ ఫోన్’ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 15 ఒక్క రోజుకే పరిమితం. అలాగే బ్రాండెడ్ ఫోన్లపై 50%, యాక్ససరీస్‌లపై 77% వరకు తగ్గింపు అందిస్తుంది. ఒప్పో అన్ని మోడళ్లపై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.6,999తో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రిడిట్ కార్డులపై 10% తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో అధునాతన మోడల్స్ పొందే అవకాశం ఉంది. -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
సెల్కాన్ చేతికి టచ్ మొబైల్స్ - మహిళలకు అవకాశాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న సెల్కాన్ గ్రూప్ తాజాగా మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ టచ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టచ్ మొబైల్స్‌కు 42 స్టోర్లు ఉన్నాయి. టచ్ బ్రాండ్ కింద దక్షిణాదితోపాటు మహారాష్ట్రలో 200 ఫ్రాంచైజీ స్టోర్లను స్థాపిస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారం మీడియాకు తెలిపారు. ‘కంపెనీ యాజమాన్యంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ఆన్లైన్ పోటీతో చిన్న రిటైలర్ల మనుగడ కష్టం. గ్రూప్ కంపెనీల ద్వారా తయారీ సంస్థల నుంచి నేరుగా మొబైల్స్, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసి ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తాం. తద్వారా ఆన్లైన్ కంటే తక్కువ ధరకే వీటిని విక్రయించవచ్చు’ అని వివరించారు. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.. మొబైల్స్ సర్వీస్, విక్రయాలలో సమగ్ర శిక్షణను అందించడానికి హైదరాబాద్‌లో ట్రైనింగ్ సెంటర్ స్థాపించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏటా 1,000 మంది వరకు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సెల్కాన్ గ్రూప్ 2022–23లో రూ.2,600 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. ఇంటెరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఉపకరణాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.5,000 కోట్లు ఆశిస్తోంది. -
మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్ - ధరలు ఎలా ఉన్నాయంటే?
Best Smartphones Under 35000: దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే చాలా మంది కొంత తక్కువ ధర కలిగిన బెస్ట్ అండ్ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ మార్కెట్లో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద మొబైల్ కొనాలని చూస్తున్న వారు ఈ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ చూడవచ్చు. ఇందులో రియల్మీ, మోటోరోలా, పోకో బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రియల్మీ 11 ప్రో ప్లస్.. ప్రస్తుతం చాలామంది కొనుగోలుదారులు రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మన జాబితాలో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో 'రియల్మీ 11 ప్రో ప్లస్' (Realme 11 Pro+) ఒకటి. దీని ధర రూ. 27,999 మాత్రమే. ఇందులో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటివాటితో పాటు ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫీచర్స్ చాలా ఆధునికంగా ఉంటాయి. మోటోరోలా ఎడ్జ్ 40.. మన జాబితాలో రెండవ స్మార్ట్‌ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 40' (Motorola Edge 40). దీని ధర రూ. 29,999. ఈ మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేటుతో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెంటర్డ్ పంచ్-హోల్ కెమెరా ఉంది. 4400 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 68 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 3.. రూ. 33,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ 3' (OnePlus Nord 3) స్మార్ట్‌ఫోన్ ఆధునిక ఫీచర్స్ అయిన సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అండ్ అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. 120 Hz రేటుతో 6.74 ఇంచెస్ ఫుల్లీ హెచ్డీ డిస్ప్లే కలిగి వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్లను పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 80 వాట్స్ పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) పోకో ఎఫ్5.. మన జాబితాలో రూ. 29,999 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ 'పోకో ఎఫ్5' (Poco F5). ఇది 120 Hz 6.67 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్లతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?) ఐక్యూ నియో 7 ప్రో ( iQOO Neo7 Pro).. రూ. 34,999 వద్ద లభించే ఈ ఐక్యూ నియో 7 ప్రో ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న మొబైల్. ఇది అండర్-స్క్రీన్ బయోమెట్రిక్ రీడర్ కలిగి 6.78 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక వైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా పొందుతుంది. -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్‌స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్‌లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్‌లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్‌లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్‌కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్‌లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ మీటింగ్‌లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!
Top 5 Best Smartphones: ఆధునిక కాలంలో మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన స్మార్ట్‌ఫోన్ ఎవరి చేతిలో చూసిన కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో లభించే మొబైల్స్ ఉన్నాయి, సరసమైన ధరలో లభించే ఫోన్లు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 20 వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ స్మార్ట్ఫోన్లను గురించి మరిన్ని తెలుసుకుందాం. రెడ్మీ నోట్ 12 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్మీ బ్రాండ్‌కి సంబంధించిన 'నోట్ 12' రూ. 20,000 కంటే తక్కువ ధర లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 16,999. ఇందులోని 5,000mAh బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లను పొందుతుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 రూ. 18,999 వద్ద లభించే 'ఐక్యూ జెడ్7' మన జాబితాలో రెండవ ఉత్తమ మోడల్. ఇందులో 5,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 6.38 ఇంచెస్ 90Hz AMOLED డిస్ప్లే ఉంటాయి. ఈ మొబైల్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. మోటో జీ73 దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న మోటో బ్రాండ్ మొబైల్ ఇప్పటికీ అదే రీతిలో ముందుకు సాగుతున్నాయి. ఇందులో మోటో జీ73 స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 వద్ద లభించే పాపులర్ మోడల్. ఇది 6.5 ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 10 ప్రో 5జీ రియల్మీ 10 ప్రో 5జీ కూడా మన జాబితాలో సరసమైన వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 18,999. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD ప్యానెల్ పొందుతుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీ కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రూ. 19,999 వద్ద లభించే 'వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' ఆధునిక ఫీచర్స్ కలిగిన అద్భుతమైన మోడల్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ LCD డిస్ప్లే కలిగిన ఈ మోడల్ 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు హై రిజల్యూషన్ 108MP ప్రైమరీ సెన్సార్ పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు లభిస్తుంది. -
వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!
2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7A): 2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 'గూగుల్ పిక్సెల్ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 6.1 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన గూగుల్ పిక్సెల్ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold): గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.69 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. రియల్మీ 11 ప్రో (Realme 11 Pro): భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్ చిప్సెట్ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!) రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro Plus): మే 2023లో విడుదలకానున్న మరో రియల్మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..
కొత్త స్మార్ట్ఫోన్లు కొనాలనుకుని ఎక్కువ ధర కారణంగా కొనలేకపోయినవారికి ఇది సరైన సమయం. ఎందుకంటే గతేడాది విడుదలైన పలు టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ల ధరలు ప్రస్తుతం బాగా తగ్గాయి. వన్‌ప్లస్ (OnePlus), షావోమీ (Xiaomi), మోటరోలా (Motorola) సహా అనేక మధ్య శ్రేణి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇటీవల తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. (బిజినెస్ ‘మోడల్’: 24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!) షావోమీ (Xiaomi) 12 Pro రెండు వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 10,000 తగ్గింది . గత విడుదలైన ఈ ఫోన్ 8GB వర్షన్‌ను ఇప్పుడు రూ. 52,999లకు, 12GB వెర్షన్‌ను రూ. 54,999లకు కొనుగోలు చేయవచ్చు . కోర్చర్ బ్లూ (Couture Blue), నాయిర్ బ్లాక్ (Noir Black), ఒపేరా మావ్ (Opera Mauve) రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 50MP రియర్ ట్రిపుల్ కెమెరా, 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, 4600mAh బ్యాటరీ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు. వన్‌ప్లస్ (OnePlus) 10R గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రెండోసారి తగ్గింది. మొదటి సారి రూ.4,000 తగ్గగా ఇప్పుడు రూ. 3,000 తగ్గింది. ప్రారంభ ధర తగ్గింపు తర్వాత 8GB+128GB (80W) వేరియంట్ ధర రూ. 34,999 ఉండగా ఇప్పుడు రూ. 31,999లకు అందుబాటులో ఉంది. 12GB+256GB (80W) ఫోన్ ధర అప్పుడు రూ. 38,999 కాగా ఇప్పుడు రూ. 35,999. ఇక 12GB+256GB (150W) వేరియంట్ ధర అప్పుడు రూ. 39,999 ఉండగా ప్రస్తుతం రూ.36,999లకు లభిస్తోంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX చిప్సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ ర్యామ్ గరిష్టంగా 12 GB. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఆక్సిజన్ఓఎస్ 13 ఓవర్లేతో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. షావోమీ (Xiaomi) 11 Lite NE 5G 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై రూ.3,000 ధర తగ్గింది. స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB వెర్షన్లను ప్రస్తుతం వరుసగా రూ. 26,999లకు, రూ. 28,999లకు సొంతం చేసుకోవచ్చు . ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ డాజిల్, జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 4250mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. మోటో ఎడ్జ్ 30 ఈ స్మార్ట్‌ఫోన్ 2021లో రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. 6GB+128GB, 8GB+128GB వేరియంట్ల ధరలు గతంలో వరుసగా రూ.27,999, రూ.29,999లుగా ఉండేవి. తగ్గింపు తర్వాత 6GB వెర్షన్ రూ. 24,999లకు, 8GB వేరియంట్ రూ.26,999లకే లభిస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ చిప్సెట్, 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 4020mAh బ్యాటరీ ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. మోటో G72 గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999. దీనిపై రూ. 3,000 తగ్గింపు ఉంది. అంటే రూ. 15,999లకే లభిస్తుంది. మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ MediaTek Helio G99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) -
రూ.20వేల లోపు సూపర్ స్మార్ట్ఫోన్లు..
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్‌తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా.. పోకో (POCO) X4 ప్రో ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ (Xiaomi Redmi) Note 12 ధర: రూ. 17,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ (realme) 10 Pro 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.72 అంగుళాలు కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... వన్‌ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.59 అంగుళాలు కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్ (realme) 9 5g SE ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 778G ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! రియల్మీ (realme) 9 ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh శాంసంగ్ గెలాక్సీ A14 5G ధర: రూ. 16,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఒప్పో (OPPO) A78 5G ధర: రూ. 18,980 ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.56 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో (Moto) G73 ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో (Vivo) Y56 ధర: రూ. 19,780 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్ భారత్ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను అమలు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూలతల దృష్ట్యా మెరైన్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తోడ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు. 2014లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్ ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. -
ఈ ‘ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్’ రూ. 10 వేలకే: ట్విస్ట్ ఏంటంటే?
కార్ల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ల వరకు దాదాపు అన్నీ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. గతంలో ఇలాంటి డూప్లికేట్ మోడల్స్ గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు ఖరీదైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో కూడా క్లోన్ పుట్టుకొచ్చింది. దీని ధర కేవలం రూ. 10,000 మాత్రమే. ఇలాంటి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని i14 Pro Max అని పిలుస్తారు. దీనిని దూరం నుంచి చూస్తే ఒక్కసారిగా ఐఫోన్ అని భ్రమ పడతారు. అయితే పరీక్షించి చూస్తే ఇది పులి తోలు కప్పుకున్న మేక అని అర్థమయిపోతుంది. (ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!) డూప్లికేట్ ఐ14 ప్రో మ్యాక్స్ గ్లాస్ లాంటి, ప్రీమియం ఫినిషింగ్‌తో అదే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కలిగి ట్రై యాంగిల్లో అమర్చిన కెమెరా సెటప్ కూడా పొందుతుంది. అయితే ఇందులో యాపిల్ లోగో ఉండదు, కలర్ ఆప్సన్స్ కూడా భిన్నంగా ఉంటాయి. ఐ14 ప్రో మ్యాక్స్ 6.5 ఇంచెస్ డిస్ప్లే, 6.8 ఇంచెస్ డిస్ప్లే అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. మొదటి వేరియంట్ AMOLED స్క్రీన్, MediaTek MTK6753 చిప్సెట్ , డ్యూయల్ రియర్ కెమెరాలు (16MP+8MP), 6జిబి రామ్, 128 జిబి స్టోరేజ్, 2,800mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. రెండవ వేరియంట్ 2జిబి రామ్, 16జిబి స్టోరేజ్, చిన్న 2,550mAh బ్యాటరీ, 2 మెగా పిక్సల్ రియర్ అండ్ సెల్ఫీ షూటర్ పొందుతుంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు గమనించవచ్చు. -
Vivo V27 Pro: విడుదలకు ముందే వివరాలు లీక్, ధర ఎంతంటే?
మార్కెట్లో వివో కంపెనీ తన 5జీ సిరీస్‌లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ విడుదల చేయకముందే ప్రైస్, డీటైల్స్ అన్నీ కూడా ప్రకటించింది. కంపెనీ వీ27 సిరీస్‌లో వీ27, వీ27 ప్రో విడుదలచేయనుంది. ఈ రెండూ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి. వివో వీ27 ప్రో భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అవి 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, చివరగా టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999. కంపెనీ విడుదల చేసే వివో వీ27 ప్రారంభ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు మర్చి 01న అధికారికంగా విడుదలవుతాయి. ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో వెల్లడయ్యాయి. వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది. -
రీసైకిల్ ప్లాస్టిక్ తో నోకియా ఫోన్లు తయారీ
-
సంసారంలో స్మార్ట్‌ఫోన్ చిచ్చు.. గంటల తరబడి అదే పని!
బనశంకరి(బెంగళూరు): స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోగా, దానివల్ల సంసార జీవితం సమస్యల్లోనూ పడుతోందని తరచూ జరిగే ఉదంతాలు చాటుతున్నాయి. మొబైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ విపరీతంగా వినియోగంతో భార్యభర్తల బాంధవ్యం బీటలు వారే ప్రమాదముంది. తద్వారా కుటుంబాల్లో సంక్షోభం ఏర్పడుతోందని బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఒక సర్వే హెచ్చరించింది. అందులో 88 శాతం సమీక్షలో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తలెత్తే దుష్పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి తక్కువ సమయం ► సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో కలిసి వివో అధ్యయనం సాగించింది. స్మార్ట్ ఫోన్లు, మానవ సంబంధాలపై వాటి పరిణామాలు – 2022 అనే పేరుతో సర్వే చేయగా, ఎక్కువమంది దంపతులు స్మార్ట్ ఫోన్‌ను మితిమీరి వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ► దీని వల్ల కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నట్లు 89 శాతం మంది తెలిపారు. ► స్మార్ట్ ఫోన్ తమ దృష్టి ఆకర్షిస్తుందని సమీక్షలో పాల్గొన్న 69 శాతం మంది తెలిపారు. అంతేగాక జీవిత భాగస్వామిపై దృష్టి సారించడంలేదని చెప్పారు. ► ఖాళీ సమయం దొరికితే మొబైల్‌తో గడుపుతున్నామని చెప్పారు. మొబైల్ కారణంగా తమ ప్రవర్తనలో మార్పు వచ్చిందని 88 శాతం మంది అంగీకరించారు. చదవండి: ఘరానా దొంగలు..ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు ! -
వావ్.. రూ.10వేలకే బోలెడు ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంపెనీలు కూడా కస్టమర్లకు 5జీ అధునాతన టెక్నాలజీ సర్వీసును అందించే క్రమంలో బిజీ అయ్యాయి. అయితే కొన్ని మొబైల్స్‌కి మాత్రం ఈ 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేయదన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సేవలు అందించే స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూ. 10వేలకే 5జీ మొబైల్ తీసుకురానున్నట్లు ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఐఎంసీ 2022 ఈవెంట్లో లావా బ్లేజ్ (Lava Blaze 5G)ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో దొరికే 5జీ ఫోన్లలో ఇదే అతి చౌకైందని, ఈ దీపావళికి ప్రీబుకింగ్స్‌తో కస్టమర్లకు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ బడ్జెట్ 5G ఫోన్ కీలక ఫీచర్లు ఇవే! ►5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్, ► మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, ►1600×720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్‌తో 6.5 ఇంచెస్ LCD స్క్రీన్, ►90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ►5000mAh బ్యాటరీ, బ్లూ, గ్రీన్ కలర్స్ ► 50mp రియర్ కెమెరా, 8 mp ఫ్రంట్ కెమెరా ►4GB RAM, 128GB ►5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయు చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
హైదరాబాద్: మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్ చేయకండమ్మా!
లాట్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లు మొబైల్ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పాడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్ హోం థియేటర్ కాంబో ఆఫర్లు లభిస్తాయన్నారు. స్మార్ట్ టీవీ రూ.8,999, ల్యాప్టాప్స్ రూ.17,499కే లభిస్తాయని తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ పండుగలకు సంప్రదాయంతోపాటు ఆధునికత ఉట్టిపడే సరికొత్త వస్త్రాలతోపాటు నగలనూ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్వదినాలను తెలుగు మహిళలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. షాపింగ్ చేసిన వారికి 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 శాంసంగ్ టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లతోపాటు మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. సౌత్ ఇండియా డిస్కౌంట్లు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ను అందజేస్తోంది. చీరలు, మెన్స్‌వేర్‌పై డిస్కౌంట్‌తోపాటు అతి తక్కువ తరుగుతో బంగారు ఆభరణాలను, తరుగు, మజూరీ లేని వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ పి.వి.ఎస్.అభినయ్ తెలిపారు. దసరా–దీపావళి లక్కీ బంపర్‌డ్రాలో భాగంగా రూ.ఆరుకోట్ల విలువైన బహుమతులను రెండువేల మంది విజేతలకు అందజేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఈనెల 5న, దీపావళి సందర్భంగా ఈనెల 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడించినున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి కేంద్రం భారీ షాక్! -
పోలీసుల మాస్టర్‌ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో మొబైల్ దొంగల హవా తీవ్రతరమైంది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు సిటీ పోలీసులు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఇకపై చోరీకి గురైన మొబైల్‌ను చోరీకి పాల్పడిన దొంగలు వినియోగించకుండా లాక్ చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను ఢిల్లీ, ముంబై పోలీసులు అమలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు నగర పోలీసులు ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చి వీటి సాదక బాదకాలపై అధ్యయనం చేస్తున్నారు. నిత్యం 30 మొబైల్స్ చోరీ సిలికాన్ సిటీలో నిత్యం 25 నుంచి 30 మొబైల్స్ చోరీకి గురవుతున్నాయి. రోడ్డుపై నిలబడి మాట్లాడుతున్నవారి నుంచి లాక్కుపోవడం, సిటీ బస్సులు, రద్దీ ప్రదేశాల్లో కొట్టేయడం, లేదా సొంతదారే పోగొట్టుకోవడం జరుగుతోంది. ఐఫోన్, చాలా ఖరీదైన ఫోన్లయితే కంపెనీ సహాయంతో ఆ మొబైల్‌ని లాక్ చేయవచ్చు. కానీ చాలా మొబైల్స్‌ను ఏమీ చేయడానికి సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) సహాయంతో మొబైల్ లాక్ చేసే విధానాన్ని పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. మొబైల్‌ను లాక్ చేస్తే దొంగలు ఉపయోగించలేరు దొంగ మొబైల్స్ కొనొద్దు చోరీకి గురైన మొబైల్స్‌ను తక్కువ ధరకు వస్తుందని ఎవరైనా కొని ఉపయోగిస్తే అది పోలీసులకు తెలిసిపోతోంది. ఆ మొబైల్లోని సిమ్ నంబరు, ఏ ఊరిలో వాడుతున్నారు అనేది పూర్తిగా పోలీసులకు చేరుతుంది. కాబట్టి చోరీ చేసిన ఫోన్లను కొనడం, ఉపయోగించడం ఎంతమాత్రం తగదని రమణ్‌గుప్తా తెలిపారు. ఇలా ఫిర్యాదు చేయాలి ►మొబైల్ చోరీలు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర పోలీస్ విభాగంలో సీఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ రూపొందించారు. ►మొబైల్ చోరీకి గురైన బాధితులు పీఎస్‌లో కానీ, 112 నంబరుకు లేదా నగర పోలీస్ వెబ్‌సైట్‌లోని ఇ– లాస్ట్‌లో కానీ ఫిర్యాదు చేయాలి. ఐఎంఈఐ నంబరును చెబితే వెంటనే మొబైల్‌ను బ్లాక్ చేస్తారు. ఆ మొబైల్ ను ఎవరూ ఉపయోగించలేరు. ►తద్వారా మొబైల్ విక్రయించడానికీ వీలు కాకపోవడంతో చోరీలు తగ్గుతాయని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ►ఇందుకుగాను బాధితులు అదే నంబరుతో మరో సిమ్ తీసుకుని ఉండాలి. అప్పుడు ఆ ఫోన్‌కు ఓటీపీ రాగానే ఎంటర్ చేయాలి. తరువాత బ్లాక్ ప్రక్రియ పూర్తవుతుంది. ►ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి భయ సందేహాలు వద్దని పోలీసులు తెలిపారు. ఫోన్ మళ్లీ దొరికితే పోలీసుల అనుమతి తీసుకుని యథావిధిగా ఉపయోగించవచ్చని చెప్పారు. -
సేల్స్ బీభత్సం, 700 శాతం వృద్ధి..ఏ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐక్యూ’ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో.. భారత్‌లో వేగంగా వృద్ధి సాధిస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ ‘స్మార్ట్‌ఫోన్ మోడల్ ట్రాకర్’ నివేదికను ప్రకటించింది. జూన్ క్వార్టర్లో ఐక్యూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాల్లో 700 శాతం వృద్ధిని చూపించింది. అంతేకాదు మార్చి త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూసినా ఐక్యూ జూన్ క్వార్టర్లో 135 శాతం వృద్ధిని చూపించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
టపా టప్!.. పేలుతున్న స్మార్ట్ ఫోన్లు
దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి. ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో స్మార్ట్ ఫోన్ పేలడంతో కస్టమర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాములపాడులో బుధవారం ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌ని ఇంట్లో చార్జింగ్కు ఉంచిన సమయంలో పేలిపోయింది. వివరాల ప్రకారం.. షేక్‌ముర్తుజా ఈ ఏడాది జూలై 13న నందికొట్కూరులో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టి బయటకు రాగా.. శబ్దంతో పేలిందని ఆయన తెలిపారు. ఫోన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని షేక్‌ముర్తుజా కోరారు. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే.. లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అలాగే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో -
వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!
మన దేశంలో కొత్త మొబైల్స్‌తో పోటీగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ ఐసీఈఏ, పరిశోధన సంస్థ ఐడీసీ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 నాటికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 34,500 కోట్లు) ఉంటుందని అంచనా. వినియోగదారులు ఈ ఏడాదిలో 2.3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.17,250 కోట్లు) విలువ గల 25 మిలియన్ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు ఈ నివేదికలో తేలింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 94 డాలర్ల(సుమారు రూ. 7,050)గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. "ఈ మార్కెట్ పెరుగుదల వల్ల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు" ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదికను ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. మొత్తం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లలో 95 శాతానికి పైగా ఎలాంటి డ్యామేజ్ కాకముందే విక్రయస్తున్నారని, మిగిలిన ఐదు శాతం స్మార్ట్ఫోన్లను రిపేర్ వచ్చినప్పుడు విక్రయిస్తున్నారు. "వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అతిపెద్ద వాటా(90 శాతానికి పైగా)ను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు వంటి ఇతర పరికరాల విక్రయాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి" అని నివేదిక తెలిపింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో 78 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000 కంటే తక్కువగా ఉంటే, 18 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000-రూ.50,000గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. (చదవండి: షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!) -
పవర్ ఫుల్ ఫాస్ట్ చార్జర్‌తో రానున్న రెడ్మి నోట్11 సిరీస్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ ఈ నెల 28న ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెడ్మి నోట్11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని ఆవిష్కరించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో రెడ్మి వాచ్ 2 కూడా విడుదల కానుంది. రెడ్మి నోట్11 సిరీస్ పోస్టర్ నుంచి రాబోయే సిరీస్ డిజైన్ వెల్లడైంది. రెడ్మి నోట్11 సిరీస్‌లో చాలా ఫోన్లను ప్రారంభించవచ్చని సమాచారం. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబోలో.. రెడ్మి నోట్11 సిరీస్ 120డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు కంపెనీ దృవీకరించింది. అలాగే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో రానున్నట్లు పోస్ట్ చేసింది. రెడ్మి నోట్ 11 మొబైల్ మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో మీడియాటెక్ డిమెన్సిటీ 920 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో+ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. రెడ్మి నోట్11 సిరీస్ ఫోన్లు 120హెర్ట్జ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వస్తాయని సమాచారం. వీటిలో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. (చదవండి: మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!) -
వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో 9 ఆర్టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్‌ప్లస్ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం) వన్‌ప్లస్ 9 ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల శామ్ సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 766 సెన్సార్ ట్రిపుల్ సెటప్ కెమెరా 65డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
సెప్టెంబర్ 9న మార్కెట్లోకి వస్తున్న రియల్మీ ట్యాబ్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సెప్టెంబర్ 9న భారత మార్కెట్లోకి రియల్ మీ ప్యాడ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రత్యేక పేజీని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పేజీలో రియల్ మీ ప్యాడ్ కీలక స్పెసిఫికేషన్లను, డిస్ ప్లే వివరాలను వెల్లడించింది. ఇందులో రెండు కెమెరాలను తీసుకొస్తున్నారు. ఒకటి ముందు, మరొకటి వెనుక భాగంలో ఉండనుంది. ఈ ప్యాడ్ 2,000ఎక్స్1,200 రిజల్యూషన్, 82.5 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో 10.4 అంగుళాల ఫుల్ స్క్రీన్ డబ్ల్యుఎక్స్ జిఎ+ డిస్ ప్లే కలిగి ఉండనుంది.(చదవండి: ఈ వారంలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు) ఈ రియల్ మీ ప్యాడ్ ఒక మూలలో సింగిల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దీని ముందు, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా తీసుకొనిరావొచ్చు. ఈ రెండూ కూడా 1.36 అంగుళాల సెన్సార్లు కలిగి ఉండవచ్చు. దీనిలో ఎఫ్/2.8 అపెర్చర్, 2.8మిమి ఫోకల్ లెంగ్త్, ఇమేజ్ స్టెబిలైజేషన్, 65.3 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ(ఎఫ్ వోవి) ఉండవచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ అల్యూమినియం యూనిబాడీతో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇది యుఎస్ బి టైప్-సి పోర్ట్ తో రావచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్యాడ్ 3.5 మిమీ హెడ్ ఫోన్ జాక్ తో వచ్చే అవకాశం ఉంది. -
రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ చాలా తక్కువ ధరకే ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సీ21వైను నేడు(ఆగస్టు 23) మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త రియల్మీ స్మార్ట్‌ఫోన్ 20:9 డిస్ ప్లేతో వస్తుంది. ఈ సీ21వై స్మార్ట్‌ఫోన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అలాగే ఇది రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. మొత్తం మీద రియల్మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది. భారతదేశంలో రియల్మీ సీ21వై 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) రియల్మీ సీ21వై స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ యునిసోక్ టీ610 ఆక్టా కోర్ ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్) 3/32 జీబీ, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్) 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ వి5.0, జీపిఎస్/ ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్ బి, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. -
మార్కెట్లోకి మరో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మొబైల్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ తీసుకోని వచ్చేందుకు సిద్దం అయ్యింది. వన్‌ప్లస్ 9ఆర్ టీ మొబైల్ చైనాలో లాంచ్ కు సిద్దంగా ఉంది అని సమాచారం. చైనా కంపెనీ తన 'టి' సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ పై పనిచేస్తున్నట్లు ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఈ వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?) వన్‌ప్లస్ 9ఆర్ టీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 120హెర్ట్జ్ ఆమో ఎల్ఈడీ ప్యానెల్, 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ గల ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు అని నివేదిక పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ మన దేశంలో రాబోయే అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. -
ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీగా ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ "బిగ్ సేవింగ్ డేస్ సేల్" పేరుతో మరోసారి సరికొత్త డిస్కౌంట్ సేల్‌ను తీసుకొని వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్, ఒప్పో, వివో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా కిచెన్ వంటి పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే జూలై 25 నుంచి జూలై 29 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో సేల్ నిర్వహించింది. ఇప్పుడు మరోసారి అదే పేరుతో సేల్ తీసుకొని వచ్చింది. ఎప్పటిలాగే, ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్లస్ సభ్యులు డీల్స్ ను ముందస్తుగా యాక్సెస్ చేసుకోగలరు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది. ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపును లభించనుంది. అమ్మకం సమయంలో కంపెనీ మొబైల్స్, టాబ్లెట్లపై డిస్కౌంట్ అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ & యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీ & ఉపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. -
వన్‌ప్లస్ నార్డ్ 2కు పోటీగా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్‌ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ధర భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది. ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్: 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1) మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్) 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ) 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 2
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్: 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్) 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్) 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 189 గ్రాముల బరువు -
అయిదు సార్లు ఫోన్లు మార్చా..అయినా వదల్లే: పీకే
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అటు లోక్సభలోకూడా తీవ్ర దుమారాన్ని రాజేసాయి. తాజాగా ఈ సెగ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా తాకింది. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉండటం గమనార్హం. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను కేంద్రం హ్యాక్ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రచార వ్యూహకర్తగా కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలకే పనిచేస్తూ వచ్చారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో పీకే కృషి చాలా ఉంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎన్ఎస్ఓ గ్రూప్, పెగాసస్ మాలావేర్ క్లయింట్ల జాబితాలో ఉన్న పది దేశాలలో భారతదేశం ఒకటి -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్ ను ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్ లో కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ 1 రోజు ముందుగా ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ అనేది అమెజాన్ ప్రైమ్ కు ఫ్లిప్ కార్ట్ కు సమానం. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కావడానికి కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ఈ సేల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం రూ.23,999 ధర గల పోకో ఎక్స్3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249 (ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం అవుతుంది. పోకో ఎక్స్3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ ప్లేతో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రస్తుతం రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీకి చెందిన ఎంఐ 11 లైట్ రూ.20,499 (బ్యాంక్ ఆఫర్ తో సహా) లభ్యం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీంతో పాటు శామ్ సంగ్, ఒప్పో, వివో, ఆపిల్ బ్రాండ్స్ కి చెందిన మొబైల్స్ పై కూడా భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. -
పోకో ఎఫ్ 3 జీటీ జూలై 23న లాంఛ్
పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు ధృవీకరించింది. చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ చేసిన మొబైల్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోకో బ్రాండ్ కింద 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ లో "స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్ ఉందని కంపెనీ పేర్కొంది. ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ నుంచి తయారు చేశారు. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో ఆటపట్టించారు. 2021 క్యూ3లో తీసుకొస్తారని అప్పుడు పేర్కొన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు, హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లేను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సీఎన్ వై 1,999 (సుమారు రూ. 23,000) లాంచ్ చేశారు. -
త్వరలో ఇండియా మార్కెట్లోకి రెడ్మీ నోట్ 10టీ!
రెడ్మీ నోట్ 10టీ త్వరలో భారతదేశంలో లాంఛ్ సిద్దంగా ఉన్నట్లు అమెజాన్‌లో టీజ్ చేసింది. ఇటీవలే రెడ్మీ నోట్ 10 5జీని పోకో ఎం3 ప్రో 5జీగా భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు, నోట్ 10టీ మోడల్ కూడా భారతదేశానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. పోకో ఎమ్3 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 10టీ, రెడ్మీ నోట్ 10 5జీ ఒకే విధమైన స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి. రెడ్మీ నోట్ 10టీని గత నెలలో రష్యాలో మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లతో వచ్చింది. ఈ ఫోన్ ఎలా ఉంటుందో టీజర్ లో స్పష్టంగా వెల్లడించనప్పటికీ, రెడ్మీ తీసుకొని రాబోయే మొబైల్ 'వేగంగా, ఫ్యూచరిస్టిక్ గా' ఉంటుందని టీజర్ లో పేర్కొంది. భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ 4జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్ సుమారు రూ.20,500కు తీసుకొని రావచ్చు. దీనిని బ్లూ, గ్రీన్, గ్రే, సిల్వర్ రంగులలో తీసుకొని రావచ్చు. రెడ్మీ నోట్ 10టీ ఫీచర్స్ 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లేను ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12 మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 18డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు
ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలలో ఒకటైన షియోమీకి చెందిన ఎంఐ 11 మొబైల్ ఇంకా అన్నీ దేశాలలో విడుదల అయ్యిందో కాలేదో గాని అప్పుడే తదుపరి తరం మొబైల్ ఎంఐ 12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఈ పుకార్ల ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. మన మానవుడి కంటి సామర్థ్యమే 576 మెగాపిక్సల్ అలాంటిది ఎంఐ 12 మొబైల్ లో 200 మెగాపిక్సల్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. పుకార్ల ప్రకారం అయితే ఈ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలో తీసుకొచ్చిన ఎంఐ 11లో ఫ్లాగ్ షిప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మొదటిసారి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా షియోమీ(ఎంఐ 11) కంపెనీకి చెందినదే. తర్వాత రాబోయే ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో తదుపరి క్వాల్ కామ్ నుంచి రాబోయే ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చైనీస్ టిప్ స్టార్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. షియోమీ కొత్తగా తీసుకొని రాబోయే ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్8450 అనే పేరుతో పిలిచే ప్రాసెసర్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఆ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 895 లేక కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అని విషయం పూర్తిగా తెలియదు. 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నిక్ స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అనే ప్రాసెసర్, 888 ప్రాసెసర్ కంటే చాలా శక్తివంతమైనది. ఎంఐ 12లో శామ్ సంగ్, ఒలంపస్ నుంచి రాబోయే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ పుకార్ల ప్రకారం 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నిక్ ద్వారా 200-మెగాపిక్సెల్ కెమెరా అవుట్ పుట రానుంది. అంటే 12 మెగాపిక్సల్ సామర్ధ్యమే(12*16 =192 మెగాపిక్సల్). ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ లో ఒలంపస్ లోగో కూడా ఉండవచ్చు. ఇది అడ్రినో 730 జీపీయు, క్వాడ్-ఛానల్ ఎల్ పీడీడీఆర్5 ర్యామ్ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తుంది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం -
బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్సాంగ్
ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ సంస్థ శామ్సాంగ్ మార్కెట్లోకి బడ్జెట్ లో మరో కిల్లర్ మొబైల్ తీసుకొనివచ్చింది. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎమ్31 కొనసాగింపుగా ఈ ఏడాది గెలాక్సీ ఎమ్32ను నేడు(జూన్ 21) లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్సాంగ్ ఫోన్ 90హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32లో మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ వోసి ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది. మూవీలు, గేమ్స్, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్32 రెడ్ మి నోట్ 10ఎస్, పోకో ఎం3 ప్రో, రియల్ మీ 8 5జీ వంటి వాటితో పోటీపడనుంది. భారతదేశంలో శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంటే, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,999గా ఉంది. ఇది బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అమెజాన్, శామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, కీలక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు రానుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం జూన్ 28 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా గెలాక్సీ ఎమ్32 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ ఎమ్32 స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(వన్ యుఐ 3.1) 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ బ్రైట్ నెస్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 25డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (బాక్స్‌లో 15డబ్ల్యు ఛార్జర్ వస్తుంది) 4జీ ఎల్ టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సీ, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ 196 గ్రాముల బరువు చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి? -
ఆన్లైన్లో ఎంఐ 11 లైట్ ఫీచర్స్ వైరల్
షియోమీ జూన్ 22న భారతదేశంలో తీసుకొని వస్తున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇది కొనుగోలుకు రానుంది. ఎంఐ 11 లైట్ మూడు రంగుల్లో అందించనున్నట్లు షియోమీ ఇటీవల ప్రకటించింది. ఎంఐ 11 లైట్ ఇప్పటికే 2021 స్లిమ్మింగ్, తేలికైన స్మార్ట్ ఫోన్ గా దృవీకరించారు. షియోమీ ఎంఐ 11 లైట్ ధర రూ.25,000 కంటే తక్కువగా తీసుకొస్తారని సమాచారం. ఫోన్ బేస్ వేరియెంట్ ధర రూ.20,000 ఉండవచ్చు. ఎంఐ 11 లైట్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, ఐక్యూఓయూ జెడ్3, ఇతర ఫోన్ లతో పోటీ పడనుంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ చదవండి: Revolt RV400: రెండు గంటల్లో బుకింగ్స్ క్లోజ్.. స్పెషల్ ఏంటి? -
ఈ-సిమ్ల తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఐడెమియా(IDEMIA) దేశీయ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానం అయిన ఎంబెడెడ్ సిమ్ల (ఈ-సిమ్) తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన అన్ని ప్లాంట్లు ఏటా 30 కోట్ల ఈ-సిమ్‌లు ఉత్పత్తి చేయగలవు. ఇందులో నోయిడా కేంద్రం వాటా 6 కోట్ల యూనిట్లు. ఈ ఫెసిలిటీని ఈ-సిమ్ల తయారీలో భారీ ప్లాంటుగా నిలపాలన్నది సంస్థ లక్ష్యం. ఈ-సిమ్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ సిమ్‌కు బదులు మొబైల్ ఫోన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్‌ను పొందుపరుస్తారు. కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలంటే సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో మరో ఆపరేటర్‌కు సింపుల్‌గా మారవచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ వినియోగించే పని లేదు. వేరబుల్స్, వాచెస్ వంటి ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల్లో ఈ-సిమ్ ద్వారా స్థలం ఆదా అవుతుంది. రూ.1,780 కోట్ల పెట్టుబడి పరిశోధన, అభవృద్ధికి భారత్‌లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా ఇప్పటికే ప్రకటించింది. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ‘ఈ-సిమ్ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా భారత్ నిలవనుంది. దేశంలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది. టెలికం రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి భారత్‌ను ఎంచుకున్నాం’ అని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్‌లను ఇక్కడ తయారు చేస్తోంది. సంస్థ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం. భారత కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్‌లను అందించింది. దేశీయ సిమ్ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతంపైమాటే. ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ సంస్థ అందించింది. భవిష్యత్ ఈ-సిమ్లదే.. ప్రస్తుతం భారత్‌లో సుమారు 10 లక్షల మంది వినియోగదార్లు ఈ-సిమ్‌ను వాడుతున్నారు. యాపిల్, శామ్సంగ్, గూగుల్, మోటరోలా స్మార్ట్ఫోన్లలో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే టెలికం కంపెనీలు ఈ-సిమ్‌లను పెద్దగా ప్రోత్సహించడం లేదు. వీటితో వినియోగదార్లు సులువుగా ఆపరేటర్లను మారుస్తారు కాబట్టే కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. రాబోయే కొన్నేళ్లలో 30 శాతం స్మార్ట్ఫోన్లు ఈ-సిమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటాయని ఐడెమియా అంచనా వేస్తోంది. ఏటా ఈ మార్కెట్ 30 శాతం వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తోంది. ఈ-సిమ్‌లకు యూఎస్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ అతి పెద్ద మార్కెట్లు. చదవండి: నాలుగు రోజుల్లో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ -
ఫోన్ల విక్రయంలో.. హైదరాబాదీలు నిజాలే చెప్తారు
సెకండ్ హ్యాండ్లో స్మార్ట్‌ఫోన్ అన్ లైన్లో కొనాలంటే మనకొచ్చే మెయిన్ డౌట్ కొన్నాక ఫోన్ సరిగా పనిచేస్తుందో లేదోనని? అయితే ప్రీఓన్ట్ మొబైల్స్ విక్రయం విషయంలో మాత్రం హైదరాబాదీలు అన్ని వివరాలు పక్కాగా, నిజాలే చెబుతారంట. యూజ్జ్ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వినియోగదారులు 'టాప్ సెల్లింగ్ జాబితాలో నిలిస్తే.. హైదరాబాద్ చెన్నైవాసులు మాత్రం 'ట్రూత్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. స్మార్ట్ఫోన్ల అమ్మకంలో వాస్తవ పరిస్థితిని అత్యంత నిజాయితీగా వివరిస్తున్నారని అన్ లైన్లో యూజ్జ్ ఫోన్లను విక్రయించే కంపెనీ క్యాషిఫై పేర్కొంది. ఘజియాబాద్, ఫరీదాబాద్ అహ్మదాబాద్ లక్నో వంటి శాటిలైట్ టౌన్స్లలోను సెకండ్స్ మొబైల్స్ మార్కెటక డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. 2020లో ప్రీఓన్ట్ ఫోన్లు అత్యధిక రిపేర్లు కలిగిన నగరంలో ఢిల్లీ నిలిచిందని క్యాషిఫై 'యూజర్ బిహేవియర్ వైట్‌పేపర్ ఐదవ వార్షిక నివేదిక వెల్లడించింది. టాప్ బ్రాండ్ షావోమీ, యాపిల్ ప్రపంచ ప్రీఓన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇండియా రెండో అతిపెద్ద దేశం. దేశంలో సగటు భారతీయుడు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన 14-18 నెల ఒకసారి అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నారని క్యాషిఫై కో-ఫొండర్ అండ్ సీఓఓ నకుల్ కుమార్ తెలిపారు. హైస్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ(3జీ నుంచి 4జీ), ఆన్లైన్ తరగతుల కోసం ఎక్కవగా ప్రీఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2020లో సెకండ్‌హ్యాండ్ ఫోన్లు ఎక్కువ విక్రయమైన బ్రాండ్లలో 26 శాతం వాటాతో షావోమీ అగ్రస్థాసంలో నిలవగా... 20 శాతంతో యాపిల్, 16 శాతంతో శామ్సంగ్, వివో, మోటరోలా (ఒక్కోటి 6 శాతం) వరుసగా తర్వాతి స్థానాలలో నిలిచాయి. రూ.10 వేల లోపు ధర ఉన్న స్మార్ట్ఫోన్లనే వినియోగదారులు ఎక్కవగా విక్రయించారు. ఐఫోన్-7, రెడ్మీ నోట్ 4, వన్‌ప్లస్ 6 హాటెస్ట్ స్మార్ట్ఫోన్లలో జాబితాలో నిలిచాయి. కనీసం మూడేళ్ల వయసున్న ఫోన్లు, సగటున రూ.4,217లకు ప్రీఓన్డ్ ఫోన్లను విక్రయించారు. చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త! -
వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం
వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ చివరకు ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది. వన్ ప్లస్ కస్టమర్ ల కొరకు "ఇంకా మెరుగైన ఉత్పత్తులను" అందించడానికి ఒప్పోతో విలీనం అయినట్లు సీఈఓ ఫోరం పోస్ట్ లో పేర్కొన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కింద ఉన్నాయి. వాటితో పాటు వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కూడా సహ-స్థాపించారు. డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు -
సెల్‌ఫోన్ దెబ్బ..‘టైం’ బాగలేదు!
సాక్షి, కనగల్(నల్లగొండ) : సెల్‌ఫోన్ విప్లవంతో గడియారం టైం బాగోలేక విలవిల్లాడుతోంది. సెల్ఫోన్లోనే టైం చూపుతున్నందున ప్రజలు గడియారాలను వాడడం మానేస్తున్నారు. ఒకప్పుడు చేతికి వాచీ ఉంటే స్టేటస్ సింబల్.. ఇప్పడు చేతిలో సెల్‌ఫోన్ ఉంటే అదే ప్రపంచం. ఇలా కాలానుగుణంగా మారుతున్న లోకం పోకడలకు ఎన్నో వస్తువులు కనుమరుగువుతున్నాయి. అందులో మణికట్టు మణిహారం చేతిగడియారం ఒకటి. ఒకప్పుడు పెళ్లి కొడుకుకు గడియారం, సైకిల్, రేడియోను ఆడపెళ్లివారు పెట్టేవారు. అది ఎంతో గొప్పగా భావించేవారు. గడియారం పెట్టకపోతే పెళ్లిలు ఆగిన ఘటనలు ఉన్నాయి. ఇలా శతాబ్దాలుగా మనిషితో పెనవేసుకున్న గడియారం బంధాన్ని సెల్‌ఫోన్ తెంచేస్తోంది. మణిహారం చేతి గడియారం.. కొన్నేళ్ల క్రితం వరకు మణికట్టుకు మణిహారంగా చేతిగడియారం వెలిగిపోయేది. చేతికి గడియారం ఉంటే అదో స్టేటస్ సింబల్. గడియారంపై మమకారంతో ఇప్పటికీ కొందరు సీనియర్ సిటిజన్స్ చేతిగడియారాలను వాడుతున్నారు. మొబైల్ ఫోన్ రాకతో గడియారం స్థితిగతులు మారిపోయాయి. సెల్ఫోన్లోనే సమయంతోపాటు తేదీ నెల, సంవత్సరం చూపిస్తున్నందున ప్రజలు గడియారానికి ప్రత్యామ్నాయంగా మొబైల్ ఫోన్‌ను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతి వీధిలో గడియారాల షాపు ఉండేది. రంగురంగుల డిజైన్లతో షాపు నిండా గోడ గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్ గడియారాలు ఉండేవి. గడియారాల విక్రయాలు, రిపేర్లతో ఎంతోమంది ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. గడియారం దుకాణాలు గిరాకీ లేక మూతపడ్డాయి. దీంతో దుకాణదారులకు ఉపాధి కరువైంది. మూతపడుతున్న దుకాణాలు సెల్‌ఫోన్ దెబ్బకు గడియారంతోపాటు ఇతర ఉపకరణాలు సైతం కనుమరుగవుతున్నాయి. రంగుల లోకాలను ఒక్క క్లిక్‌తో ఫొటో ఫ్రేమ్‌లో బంధించే కెమెరా, మనసుకు హాయినిచ్చే పాటలు వినిపించే టేప్‌రికార్డర్, రేడియో, చీకట్లో దారిచూపే టార్చిలైట్, ఎంతటి లెక్కనైనా క్షణాల్లో చేసే క్యాలకులేటర్.. ఇలా ఎన్నో ఉపకరణాలను సెల్‌ఫోన్ మింగేసింది. మొబైల్లోనే ఫొటోలు దిగడం ఎవరికి పంపాలనుకుంటే వారికి క్షణాల్లో పంపుతున్నందున పనిలేక ఫోటో స్టూడియోలు మూతపడుతున్నాయి. కెమెరాకు క్రేజీ తగ్గడంతో ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు జీవనోపాధిని కోల్పోయారు. -
పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్మీ తన జీటీ 5జీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్మీ బుక్ ల్యాప్‌టాప్, రియల్మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో రియల్మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను చైనా సీఎన్‌వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,299 (రూ. 37,800). రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు: 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్) 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
కిస్తీ కట్టకపోతే ఫోన్ లాక్ అయిపోతుంది మరి!
‘మీరు ఈ నెల వాయిదా చెల్లించని కారణంగా మీరు మొబైల్ ఫోన్ వినియోగించలేరు. వెంటనే ఫైన్ సహా వాయిదా చెల్లించండి’ అంటూ కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడి ఫోన్‌కి సందేశం వచ్చింది. వెంటనే ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. సిద్దిపేట సమీపంలో ఉండే మరో యువకుడి ఫోన్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. ఇన్కమింగ్ ఫోన్ నంబర్లు మినహా మరే ఆప్షన్ పనిచేయట్లేదు. వెంటనే ఈనెల కిస్తీ చెల్లించాలన్న సందేశం మాత్రం ఫోన్ స్క్రీన్‌పై కనబడుతోంది. సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకున్న వారిని మైక్రోఫైనాన్స్ కంపెనీలు రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంటాయి. తాజాగా నెల వాయిదా చెల్లించకపోతే ఫోన్లను కూడా లాక్ చేస్తూ చుక్కలు చూపుతున్నాయి. అంటే ఆ సంస్థల వద్ద అప్పు తీసుకుని మొబైల్ ఫోన్ కొనుక్కుంటే ఫోన్ పేరుకే మనం వాడుతాం. కానీ ఎప్పుడంటే అప్పుడు దాన్ని పనిచేయకుండా చేయగలవు ఆ కంపెనీలు. తమ వద్ద రుణం తీసుకుని ఫోన్ కొన్న వారెవరైనా నెల వాయిదా చెల్లించకుంటే ఫోన్ పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో వినియోగదారులకు అర్థం కావట్లేదు. తమ ఫోన్ హ్యాక్‌కు గురైందా లేదా ఏదైనా సాఫ్ట్వేర్ సమస్య వచ్చిందా? వైరస్ దాడి చేసిందా అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలు, గ్రామాలపైనే టార్గెట్.. వాస్తవానికి మైక్రో సంస్థలు సెల్ఫోన్లు కొనుక్కునేందుకు రుణాలు ఇవ్వడం కొత్తేం కాదు. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలంతా క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అందుకే, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు జిల్లాల్లో తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా సెమీ అర్బన్, రూరల్‌లోని జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, టౌన్లలోని మొబైల్ షాపుల్లో వీరి ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు షాపు నిర్వాహకులకు మధ్య ముందే వ్యాపార అవగాహన ఉంటుంది. అందుకే ఫోన్లు కొనేందుకు వచ్చినవారికి వారి బడ్జెట్ కంటే అధిక ధర ఉన్న ఫోన్లను చూపిస్తారు. అప్పుడే ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ సీన్లోకి వస్తాడు. సార్.. తక్కువ వడ్డీతో మంచి ఫోన్ తీసుకోండి అంటూ ఆఫర్లతో ఊరిస్తాడు. వినియోగదారుడు సరే అనగానే.. అతడితో కొన్ని సంతకాలు తీసుకుంటారు. ఆ పత్రాల్లో ఎక్కడో చిన్నగా నెల వాయిదా చెల్లించకపోతే హ్యాండ్సెట్ లాక్ అవుతుందని నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలు ఇంగ్లిష్‌లో ఉండటం, గ్రామీణులకు ఇంగ్లిష్ రాకపోవడం, షాపింగ్ ముగించుకునే తొందరలో ఉండటంతో చాలామంది ఈ షరతులను చదవడం లేదు. అన్యాయం అంటున్న వినియోగదారులు.. ‘నేను వృత్తిరీత్యా పలు ఊర్లు తిరుగుతాను. వాస్తవానికి నెల వాయిదా కట్టడం మర్చిపోయాను. ఎలాంటి అలర్ట్, వార్నింగ్ సందేశాలు లేకుండా.. పనిలో ఉండగా ఉన్నట్లుండి నా ఫోన్ లాక్ అయింది. నేను వెంటనే చెల్లించాను. కానీ, మూడు రోజుల పాటు నా ఫోన్‌ను తిరిగి అన్‌లాక్ చేయలేదు. ఈ మూడు రోజులు నేను తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. ‘ఫోన్ పే, గూగుల్‌పేతో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ మొత్తం స్తంభించిపోయింది. దీంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను’అని వాపోయాడు. ఎక్కడో ఉండి తమ ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నారంటే.. ఇది చట్ట విరుద్ధమే కదా అని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్డౌన్ కారణంగా రెండు, మూడు నెలలుగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వేళ ఫోన్లు లాక్ చేయడం అన్యాయమని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను సంప్రదించగా.. ఫోన్లు లాక్ అయ్యాయన్న ఫిర్యాదులు తమ వద్దకు రాలేదని సమాధానమిచ్చారు. ఈ చర్య ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, తీవ్రమైన విషయంగా పరిగణించాలని ప్రముఖ సైబర్ అనలిస్ట్ అనిల్ రాచమల్ల అన్నారు. చదవండి: రేషన్ కార్డుకు రేటు! -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్
వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్‌ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్ సీఈ 5జీ' స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్‌ప్లస్ ఎదురు చూశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999 చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర
దేశీయ మొబైల్ మార్కెట్ లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి మొబైల్స్ తీసుకొచ్చిన వన్‌ప్లస్, హత్య కొద్దీ రోజుల హై ఎండ్ మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో మిడ్ రేంజ్ అభిమానులు అందరూ వన్‌ప్లస్ నుంచి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంస్థ తిరిగి మిడ్ రేంజ్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10న విడుదల చేయబోతున్నది. లాంచ్ చేయడానికి కొద్దీ రోజుల ముందు ఇండియాలో ఈ కంపెనీ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్‌ప్లస్ టీవీ యు 1 ఎస్ ధరలను ట్విటర్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండనున్నట్లు తెలుస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు అదనంగా రూ.1,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చే ఉంది. ఈ ఆఫర్ కూడా జూన్ మే 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది. లీక్‌ల ప్రకారం రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. అలాగే ఇది 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్‌ప్లస్ కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు. చదవండి: జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్ -
Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్ట్రా షిప్మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990. చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద -
దేశంలో తొలిసారిగా విడుదలైన డ్యూయల్ సిమ్ 5జీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ.. డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో తొలిసారిగా డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌ను ఇందులో తీసుకొచ్చారు. డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై కూడా సపోర్ట్ చేస్తుంది. జూన్ 4 నుంచి అమ్మకానికి రానుంది. దీని గరిష్ఠ డేటా డౌన్లోడ్ వేగం సెకనుకు 4.7 గిగాబిట్ వరకు ఉంటుంది. రియల్మీ ఎక్స్ 7 మాక్స్ 5జీలోని మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మొబైల్ ప్రియులకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని రిరియల్మీఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ, 128జీబీ ధర రూ.26,999, అలాగే 12 జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.29,999 ఉంది. రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా(సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్) 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 50W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1 సపోర్ట్ చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్‌లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.2,499కే పోకో ఎక్స్3 ప్రో
పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. పోకో ఎక్స్3 ప్రో తదుపరి సేల్ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.16,500 విలువచేయాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఒకవేళ పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను డైరెక్ట్‌గా సేల్ లో కొనాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
మూడు బడ్జెట్ మొబైల్స్ లాంచ్ చేసిన రియల్మీ
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఒకే రోజు మూడు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. రియల్మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్ గా సీ సిరీస్‌లోనే రియల్మీ సీ20, రియల్మీ సీ21, రియల్మీ సీ25 పేరిట మరో మూడు కొత్త మోడల్స్‌ని తీసుకొచ్చింది. మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్ విభిన్నంగా ఉన్నాయి. రియల్మీ సీ20, సీ21 మోడల్స్‌లో స్పెసిఫికేషన్స్, డిజైన్ కాస్త దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999. రియల్మీ సీ సిరీస్ మొబైల్స్ ను రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రియల్మీ సీ25 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ డెప్త్ సెన్సార్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్ 4జీబీ+64జీబీ ధర రూ.9,999 4జీబీ+128జీబీ ధర రూ.10,999 రియల్మీ సీ21 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ బ్లాక్ అండ్ వైట్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్స్ 3జీబీ + 32జీబీ ధర రూ.7,999 4జీబీ + 64జీబీ ధర రూ.8,999 రియల్మీ సీ20 స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఓఎస్ డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్స్ 2జీబీ + 32జీబీ ధర రూ.6,999 చదవండి: జియో ఫైబర్ బంపర్ ఆఫర్! -
రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై బంపర్ అఫర్
రియల్ మీ మనదేశంలో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఈ ఐదు రోజుల సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ నార్జో 30 ప్రోతో పాటు మరిన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పతులపై అద్భుతమైన డిస్కౌంట్లను రియల్ మీ అందిస్తుంది. ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్ 7 ప్రో ధర రూ.29,999, అయితే మీరు ఈ సేల్ భాగంగా రూ.27,999 కు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ఆన్లైన్ స్టోర్‌లో బుక్ చేసిన ప్రీపెయిడ్ ఆర్డర్లకు మాత్రమే రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. దీని అర్థం మీరు ఎక్స్ 7 ప్రోను కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు చెల్లింపు చేస్తేనే ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే డిస్కౌంట్ అఫర్ లభించదు. అదేవిధంగా, రియల్ మీ ఎక్స్ 7, నార్జో 30 ప్రో మొబైల్స్ పై రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పే చేయవచ్చు. వాస్తవానికి రూ.19,999 ధర గల రియల్మే ఎక్స్ 7 డిస్కౌంట్ తర్వాత మీకు రూ.18,999కు లభిస్తుంది. రూ.16,999కు విక్రయించే నార్జో 30 ప్రో మీకు రూ.15,999కు లభిస్తుంది. ఈ సేల్ లో డిస్కౌంట్ అనేది స్మార్ట్ఫోన్ల పైన మాత్రమే కాకూండా స్మార్ట్ టెలివిజన్లు, వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, నెక్‌బ్యాండ్ ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బ్రీఫ్‌కేసులు మొదలైనవి వాటిపై ఉన్నాయి. చదవండి: రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్ -
రియల్మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. రియల్మీ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్ మీ8, 8 ప్రోలను గత నెలలో చైనాలో లాంఛ్ చేసింది. అతి త్వరలోనే వీటిలో 5జీ కనెక్టివిటీ అందించి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే, ఈ రెండు ఫోన్లు ఎఫ్‌సిసి, బిఐఎస్ సర్టిఫికేషన్‌ను సాధించడంతో అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో అందిస్తున్న స్పెసిఫికేషన్లు వివరాలను పరిశీలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. రియల్ మీ 8 స్పెసిఫికేషన్లు(అంచనా): 6.4-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 4 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.14,999 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.15,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.16,999 రియల్మీ 8ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా) 6.4 అంగుళా ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 108 ఎంపి ప్రైమరీ సెన్సార్ 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2 ఎంపి మాక్రో లెన్ష్ కెమెరా 2 ఎంపి లెన్స్ కెమెరా 16 ఎంపి సెల్ఫీ కెమెరా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ 2.0 రియల్మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.17,999 రియల్మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర: రూ.19,999 చదవండి: ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ -
రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రెడ్మీ రికార్డు సృష్టించింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ మొదటి రెండు వారాల్లోనే భారతదేశంలో రూ.500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు షియోమీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ మూడు ఫోన్లు తీసుకొచ్చింది. షియోమీ ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. ప్రతి ఫోన్ వరుసగా మార్చి 16, మార్చి 17, మార్చి 18న ఫస్ట్ సేల్ కు వెళ్లాయి. షియోమీ ఒక ప్రెస్‌నోట్ ద్వారా ఈ ఫోన్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను షియోమీ ప్రకటిచింది. మార్చి 16 ఫస్ట్ సేల్ నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.500 కోట్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 10 మాత్రమే మార్చి 16వ తేదీన అమ్మకానికి వచ్చింది. రెడ్మి నోట్ 10 ప్రో మార్చి 17న, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ మార్చి 18న అమ్మకాలు జరిగాయి. షియోమీ మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందో తెలపలేదు. కాబట్టి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడు ఫోన్లలో ఏది అనేది అస్పష్టంగా ఉంది. అంచనా ప్రకారం, షియోమీ రెండు వారాల్లో 2,27,000 నుంచి 4,16,000 యూనిట్ల రెడ్మి నోట్ 10 సిరీస్ ఫోన్ల విక్రయించవచ్చు. చదవండి: రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్! -
భారీ ర్యామ్‌తో విడుదలైన ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్ లో ఎంఐ మిక్స్ పేరుతో విడుదల చేసింది. ఇది టాప్-ఆఫ్-లైన్ స్పెసిఫికేషన్లతో నో-బెజెల్ స్మార్ట్‌ఫోన్. ఫోల్డబుల్ డిస్ ప్లే మాత్రమే కాకుండా షియోమీ ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, హువావే మేట్ ఎక్స్ 2లతో పోటీ పడనుంది. దీనిని మన దేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్‌తో 840 x 2,520 పీఎక్స్ రిజల్యూషన్‌తో బయట వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తెరిచినప్పుడు పెద్ద స్క్రీన్ 4: 3 నిష్పత్తిలో 1440పీ రిజల్యూషన్‌తో 8.01-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్ప్లే అని కంపెనీ పేర్కొంది. ఓఎల్ఈడి ప్యానెల్ హెచ్‌డిఆర్10 ప్లస్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ చేస్తే 6.5-అంగుళాల డిస్ప్లే 27: 9 నిష్పత్తితో, 90హెర్ట్జ్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. ఇది 12జీబీ, 16జీబీ ర్యామ్ ఎంపికలతో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా (శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్), లిక్విడ్ లెన్స్ టెక్నాలజీతో 8 ఎంపీ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డ్యూయల్ సెల్ 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. 37 నిమిషాల్లో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్‌లో క్వాడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి హర్మాన్ కార్డాన్ చేత ట్యూన్ చేయబడతాయి.ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12తో నడుస్తుంది. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఎంఐ మిక్స్ ఫోల్డ్ ఫీచర్స్: 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా(శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్) 08 ఎంపీ సెకండరీ కెమెరా 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,12,100 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,23,300 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,45,700 చదవండి: ఈ-వాహన రంగంలో షియోమీ భారీ పెట్టుబడులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! -
మార్చి 29న ఎంఐ 11 యూత్ ఎడిషన్ లాంచ్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త మొబైల్స్‌ను ఎప్పటికప్పుడూ మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఎంఐ 11 యూత్ ఎడిషన్‌ను చైనాలో మార్చి 29న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ బ్యాండ్ 6, కొత్త ఎంఐ మిక్స్ వంటి ఇతర కొత్త మొబైల్ వేరియంట్స్, పరికరాలను లాంచ్ చేయనున్నారు. ఎంఐ 11 యూత్ ఎడిషన్‌లో అమోఎల్ఈడి ప్యానెల్, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల డిస్ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్ కలిగి ఉంది. అదే విధంగా 20ఎంపీ సెల్ఫీ కెమెరాను షియోమీ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 780 5జీ ప్రాసెసర్ అమర్చారు. సాధారణ ఫోన్ల మాదిరిగానే ఇందులో షియోమీ ఎంఐ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందిస్తుంది. ఎంఐ 11 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ట్రఫుల్ బ్లాక్, సిట్రస్ ఎల్లో, మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత సామర్థ్యంతో తయారుచేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,250 ఎంఏహెచ్ గా ఉంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. చదవండి: ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త! -
వన్‌ప్లస్‌కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వన్‌ప్లస్‌కు పోటీగా ఎక్స్60 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో వన్‌ప్లస్‌కు దీటుగా మంచి ఫీచర్లను అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేలు ఇందులో ఉన్నాయి. వివో ఎక్స్60లో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్, ఎంఐ 10 సిరీస్ ఫోన్లతో వివో ఎక్స్60 సిరీస్ పోటీ పడనుంది. వివో ఎక్స్60 స్పెసిఫికేషన్లు: 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,990 వివో ఎక్స్60 ప్రో స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990 వివో ఎక్స్60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా (జీఎన్1 సెన్సార్) 48 ఎంపీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 32 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 55 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990 చదవండి: జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ -
వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!
ఫ్లాగ్షిప్ స్మార్ట్పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో మార్చి 23న లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో హాసెల్‌బ్లాడ్ తో కలిసి వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. వన్‌ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకంగా ఒక క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో అడిగిన 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి ఏప్రిల్ 16వ తేదీన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంది. ఈ క్విజ్ నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. వన్‌ప్లస్ 9 సిరీస్ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు, సమాధానాలు: ప్రశ్న 1: OnePlus 9 Pro comes with ___ W Wireless Charging జవాబు: (C) 50 W ప్రశ్న 2: OnePlus 9 Series gets a day’s power in ___ mins with Warp Charge 65T? జవాబు: (A) 15 Mins ప్రశ్న 3: The OnePlus 9 and OnePlus 9 Pro 5G come with _____? జవాబు: (C) Hasselblad Camera for Mobile ప్రశ్న 4: The OnePlus 9 Pro’s Fluid Display 2.0 comes with _____ and _____? జవాబు: (A) LTPO technology and Smart 120 Hz ప్రశ్న 5: OnePlus 9 and 9 Pro come with _____ MP Ultra-Wide Angle Lens జవాబు: (D) 50MP ప్రశ్న 6: OnePlus 9R 5G is powered by Qualcomm Snapdragon ____ జవాబు: (C) 870 చదవండి: వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు : అద్భుత ఫీచర్లు -
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3
పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది. పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డాట్ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) పోకో ఎఫ్3 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల -
ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్
కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్, దుస్తువులు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో ఫ్లీప్కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ మార్చి 24 నుంచి మార్చి 26 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల మాత్రం నేటి నుంచి సేల్ లో పాల్గొనవచ్చు. మూడు రోజుల పాటు జరిగే సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఎస్బిఐ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారికీ 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ మాత్రం మొబైల్ ప్రియుల కోసం అమెజాన్ "ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో రియల్ మీ, పోకో, ఆపిల్ కు సంబందించిన ఉత్పత్తుల ఉన్నాయి. చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త! -
లాంచ్ కు ముందే లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను రేపు (మార్చి 23) విడుదల చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభించటానికి కొద్దీ గంటల ముందు కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్‌కు చెందిన ధరలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వీటిలో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఉన్నాయి. కొన్ని లక్షణాలు అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ, ధర వివరాలు మాత్రం బయటకి విడుదల కాలేదు. ఇప్పుడు ఒక టిప్ స్టార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వన్‌ప్లస్ 9 సిరీస్ ఇండియాకు చెందిన ధర వివరాలను బయటకి లీక్ చేసాడు. లీకైన వివరాల ప్రకారం కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు (అంచనా): వన్‌ప్లస్ 9 ఆర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 వన్‌ప్లస్ 9 ఆర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 వనిల్లా వన్‌ప్లస్ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 వనిల్లా వన్‌ప్లస్ 9 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 వన్‌ప్లస్ 9 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999 వన్‌ప్లస్ 9 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999 చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి తీపికబురు లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర -
కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త!
కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త అందించింది. మొబైల్ ప్రియుల కోసం అమెజాన్ "ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. రెడ్మీ 9ఎ, రెడ్మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం21తో పాటు మరిన్ని స్మార్ట్ఫోన్లపై ఆకర్షిణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. త్వరలో మార్కెట్లోకి విడుదలకాబోతున్న వన్‌ప్లస్ 9 సిరీస్, వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలపై 40శాతం వరకు తగ్గింపు లభించనుంది. శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్ తదితర బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు ప్రకటించింది. చదవండి: అమెజాన్ క్విజ్: రూ.10వేలు గెలుచుకోండి! -
పవర్ బ్యాంక్ కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
ఈ రోజు చాలా వరకు స్మార్ట్ఫోన్లు పెద్ద బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మన బ్యాటరీ తొందరగా ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా వేదించే సమస్య బ్యాటరీ. అందుకే వారు తమ వేంట తప్పనిసరిగా పవర్ బ్యాంక్ తీసుకెళ్తుంటారు. మనం పవర్ బ్యాంక్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. చాలా వరకు పవర్ బ్యాంక్ కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనుగోలు చేయమని సలహాలు ఇస్తుంటాయి. అయితే, మనం వారి మార్కెట్ బుట్టలో పడవద్దు. మన వాడే మొబైలును బట్టి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలి. ఉదా: ఫోన్ యొక్క బ్యాటరీ సామర్ధ్యం అనేది 4000 ఎంఏహెచ్ అనుకుంటే 10,000 ఎంఏహెచ్ సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు ఔట్పుట్ వచ్చేది సుమారు 8,000 ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకుల తీసుకునేటప్పుడు కొలతలు, బరువు, ఆకారం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి. పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది. ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే. మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, ఛార్జింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది. ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల జీవితం ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే. చదవండి: ఇండియా కా నయా బ్లాక్‌బస్టర్ వచ్చేసింది -
శామ్సంగ్ నుంచి సరికొత్త మొబైల్స్ విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ తన గెలాక్సీ ‘ఏ’ సిరీస్ నుంచి గెలాక్సీ ఏ52, ఏ52 5జీ, ఏ72 అనే మూడు మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసింది. మార్చి 17న జరిగిన ‘గెలాక్సీ ఆసమ్ అన్ప్యాక్డ్’ ఆన్లైన్ కార్యక్రమంలో ఈ మూడు మోడళ్లను విడుదల చేసింది. మూడు ఫోన్లు ఐపీ67 సర్టిఫైడ్ డస్ట్ - వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ ఎ 52 మోడల్స్, గెలాక్సీ ఎ72లో క్వాడ్ రియర్ కెమెరాలతో పాటు హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ కూడా ఉన్నాయి. శామ్సంగ్ తన కొత్త గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్లు ఒకే ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయని పేర్కొంది. గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లు అద్భుతమైన డిస్ప్లే, ప్రో-గ్రేడ్ కెమెరా, దీర్ఘకాలిక మన్నిక ఇచ్చే బ్యాటరీకి గుర్తింపు పొందాయి. ఇప్పటికే గెలాక్సీ నుంచి వచ్చిన ఏ సిరీస్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించాయి. వీటి ధర, భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. గెలాక్సీ ఎ52 ఫీచర్లు: 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 గెలాక్సీ ఎ52 5జీ ఫీచర్లు: 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 గెలాక్సీ ఎ72 ఫీచర్లు: 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో షూటర్ + 8 ఎంపీ టెలిఫోటో షూటర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6 జీబీ ర్యామ్ + 8 జీబీ ర్యామ్ 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! -
బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి 23న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వన్‌ప్లస్ 9ప్రో కెమెరాకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వన్‌ప్లస్ ప్రధాన లోపం కెమెరా కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి హస్సెల్ బ్లేడ్ తో కలిసి వస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ కెమెరా పనితీరు ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్ల కంటే మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ప్రో ప్రధాన కెమెరాలో సోనీ IMX789 సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలో సోనీ IMX766 సెన్సార్‌ను తీసుకొస్తున్నట్లు గతంలో ధృవీకరించారు. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా వన్‌ప్లస్ 9 సిరీస్ కెమెరా పనితీరును పరీక్షించడం కోసం DxOMarkకు పంపించరని తెలుస్తుంది. DxOMark కెమెరా పనితీరుతో పాటు డిస్ ప్లే, ఆడియో, వైర్ లెస్ స్పీకర్ వంటి కీలక అంశాలకు సంబంధించి రేటింగ్ ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. వన్‌ప్లస్ 9 ప్రో వేరియంట్ ఆస్ట్రల్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని వస్తుందని తెలుస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ -
మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9 సిరీస్ విడుదల తేది బయటకి వచ్చింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ 9ఈ, వన్ ప్లస్ 9 లైట్, వన్ ప్లస్ 9ప్రో తీసుకొనిరావచ్చు. మార్చి 23న ఈ మొబైల్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల ప్రారంభ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్, జెడ్ ఇయర్‌బడ్స్ రెండు వెర్షన్లలో ఒకదాన్ని పొందవచ్చు అని సమాచారం. వన్ ప్లస్ 9ప్రో ఫీచర్స్(అంచనా): 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 48 ఎంపీ + 50 ఎంపీ + 8 ఎంపీ చదవండి: వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ ఇక వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి -
ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!
సాధారణంగా హై ఎండ్ మొబైల్స్ లో అత్యధికంగా 8జీబీ ర్యామ్ లేదా ఇంకొంచం ఎక్కువ అయితే 12జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ, న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18 జీబీ ర్యామ్ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో తీసుకోని వచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 6 ప్రో 18జీబీ ర్యామ్ గల మొబైల్ లో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొనివచ్చారు. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. రెడ్‌మ్యాజిక్ 6 & రెడ్‌మ్యాజిక్ 6 ప్రో ఫీచర్స్: వీటిలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్ ఉన్నాయి. 165 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్న ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మల్టీ టచ్‌లో 360 హెర్జ్ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, 3.1 యూఎఫ్ఎస్ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్లో బ్యాటరీ కూలింగ్ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్ 6లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్లోకి ఈ మొబైల్స్ విక్రయానికి రానున్నాయి. రెడ్‌మ్యాజిక్ 6 ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 3,799 (సుమారు రూ.42,700) 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,099 (సుమారు రూ.46,000) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,500) రెడ్ మ్యాజిక్ 6 ప్రో ధర: 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,550) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,799 (సుమారు రూ.54,000) 16జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 5,299 (సుమారు రూ.59,600) 18జీబీ + 512జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 6,599 (సుమారు రూ.74,200) చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
టెలిఫోన్లలో ఎన్ని రకాలో తెలుసా?
తమ యొక్క పరిశోధనలతో మానవ జాతికి మహోపకారం చేసిన మహనీయులలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఒకరు. టెలిఫోన్‌ను రూపొందించి సమాచార రంగంలో గొప్ప విప్లవానికి గ్రహంబెల్ నాంది పలికారు. ఈయన 1847వ సంవత్సరం మార్చి 3న ఇంగ్లాండులో జన్మించారు. ఇంగ్లాండ్, జర్మనీ దేశాలలో గ్రహంబెల్ విద్యాభ్యాసం జరిగింది. ఒకేసారి అనేక సందేశాలను శబ్దరూపంలో పంపడానికి నిర్విరామంగా కృషి చేశారు. టెలిఫోన్ కనుగొనడమే తన యొక్క జీవిత ఆశయంగా నిర్ణయించుకొని, తన ఆరోగ్యాన్నికూడా లెక్క చేయకుండా పరిశోధనలు జరిపాడు. చివరికి 1876వ సంవత్సరంలో తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ విధంగా మానవుని జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఒక అద్భుతమైన పరికరం రూపొందించబడింది. ఈ పరికరం నేడు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల రూపంలో అనేక విషయాలు, సమాచారాన్ని నిమిషాలలో మనకు అందిస్తోంది. ఇప్పడు అయితే అరచేతిలో పట్టే స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి గానీ కిందటి మొబైల్స్ చరిత్ర తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతాం. అలెగ్జాండర్ గ్రాహంబెల్ జయంతి సందర్బంగా వాటి గురుంచి తెలుసుకుందాం. హ్యాండ్ క్రాన్క్ టెలిఫోన్: 1880ల్లో ఈ హ్యాండ్ క్రాంక్ టెలిఫోన్లు వాడేవారు. ఇది చాలా పెద్దగా ఉండటమే కాదు దీనితో కాల్స్ చేయడం కూడా కష్టంగానే ఉండేది. కాండిల్ స్టిక్ టెలిఫోన్: పదేళ్లు తర్వాత 1890లోకి వచ్చేసరికి సౌకర్యవంతమైన ఫోన్ వచ్చింది. ఈ క్యాండిల్ స్టిక్ ఫోన్ అప్పట్లో బాగా ఆదరణ పొందింది. డెస్క్ టాప్ రోటరీ టెలిఫోన్: కొంత కాలం తర్వాత 1920లోకి వచ్చేసరికి అనుకూలమైన డెస్క్‌టాప్ రోటరీ టెలిఫోన్‌ను తయారుచేశారు. పాత సినిమాల్లో ఇది బాగా కనిపిస్తుంది. టచ్ టోన్: డెస్క్ టాప్ రోటరీ ఫోన్ చాలా కాలం నిలబడింది. అయితే, నంబర్ల కోసం మధ్యలోని రింగ్ అదే పనిగా తిప్పడం కష్టమవుతుంటే చాలా పరిశోధనల అనంతరం 1960లో టచ్ టోన్ ఫోన్లను తెచ్చారు. దింతో కాల్ చేయడం తేలికైపోయింది. వాల్ టచ్ టోన్: ఎప్పుడైతే టచ్ టోన్ ఫోన్ వచ్చిందో అది మరో సంచలన ఆవిష్కరణగా మారింది. ఆ తర్వాత పదేళ్లకే అంటే 1970ల్లో గోడకు తగిలించే వాల్ టచ్ టోన్ ఫోన్ వచ్చేసింది. ఇది టెలిఫోన్ రంగాన్ని మరో ముందు అడుగు వేయించింది. కార్డ్‌లెస్ ఫోన్: 1980ల్లో అంటే టెలిఫోన్ కనిపెట్టిన వందేళ్లకు టెలిఫోన్ చరిత్రలో మరో అద్భుత ఆవిష్కరణ వచ్చింది. అదే కార్డ్‌లెస్ ఫోన్. అప్పటివరకూ ఫోన్‌కి కార్డ్(వైర్) తప్పని సరి అయ్యేది. ఇవి వచ్చాక ఇక ఇల్లంతా తిరుగుతూ మాట్లాడే అవకాశం రావడంతో ప్రజలు ఎంతో సంతోష పడ్డారు. మొబైల్ ఫోన్: కార్డ్ లెస్ ఫోన్ వచ్చిన మూడేళ్లకే మొదటి మొబైల్ ఫోన్ 1983లో వచ్చేసింది. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ల రూపు రేఖలు చాలా వేగంగా మారిపోతూ వచ్చాయి. స్మార్ట్ మొబైల్స్: గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రాకతో మొబైల్స్‌లో మరో సంచలనంగా మారిపోయింది. ఇప్పడు వాటిలోనూ చాలా మార్పులొస్తున్నాయి. నాలుగైదు కెమెరాలతో రెవల్యూషన్ సృష్టిస్తున్నాయి. -
ఫిబ్రవరి 24న రియల్మీ నార్జో 30 ప్రో 5జీ లాంచ్
రియల్మీ ప్రియులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా రియల్మీ నార్జో 30 ప్రో 5జీ విడుదల తేదీలను సంస్థ ప్రకటించింది. దీనితో పాటు రియల్మీ నార్జో 30ఎ, రియల్మీ బడ్స్ ఎయిర్ 2లను కూడా ఫిబ్రవరి 24న సంస్థ భారతదేశంలో విడుదల చేయనుంది. రియల్మీ గతేడాది రియల్మీ నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు వాటికీ కొనసాగింపుగా రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ ఫోన్లను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంది. రియల్మీ బడ్స్ ఎయిర్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ వీటి కోసం ఒక ప్రత్యేక పేజీని కూడా సృష్టించింది. రాబోయే రెండు ఫోన్ల డిజైన్ వివరాలతో పాటు రియల్మీ నార్జో 30ప్రో 5జీ ప్రాసెసర్ సమాచారం కూడా వెల్లడించింది. రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 6.5 అంగుళాల డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొనిరావచ్చు అని సమాచారం. ఇక రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలియాలంటే ఫిబ్రవరి 24న రిలీజ్ వరకు ఆగాల్సిందే. -
రూ.13వేలకే రియల్మీ ఎక్స్7 ప్రో
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ ఇటీవలే ప్రీమియం రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. రియల్మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. కొద్దీ రోజుల క్రితం ఫస్ట్ సేల్ కి వచ్చిన అవుట్ అఫ్ స్టాక్ వెళ్లింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్ఛేంజ్ కింద రూ.30వేలు విలువైన రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.16,500 తగ్గిస్తే మీరు చెల్లించాల్సింది రూ.13,499 మాత్రమే. మీ దగ్గర యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 7 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.13,499 ధరపై 5 శాతం అంటే రూ.674 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ లెక్కన మీకు రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,000 లోపే కొనవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బట్టి ఎక్స్ఛేంజ్ రేటు మారే అవకాశం ఉంది. అందుకే కొనే ముందు ఒకసారి మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ ఎంత వస్తుందో ఓసారి చెక్ చేసుకోండి. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
మోటో ఈ7 పవర్ ను ఫిబ్రవరి 19న ఇండియాలో తీసుకొనిరానున్నట్లు మోటోరోలా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హెలియో పీ22 ప్రాసెసర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ7 పవర్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. మోటో ఈ-సిరీస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన మోటో ఈ7 ప్లస్‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. లెనోవా యాజమాన్యంలోని సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మోటో ఈ7 పవర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.5 హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ ర్యామ్: 4జీబీ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ22 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62
గత ఏడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్-సిరీస్ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్సంగ్ కంపెనీ మరో సరికొత్త మోడల్ గెలాక్సీ ఎఫ్ 62ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. ఇప్పటికే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 7,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ ర్యామ్: 6జీబీ, 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: ఎక్సినోస్ 9825 బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్ ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999 8జీబీ+128జీబీ - రూ.25,999 చదవండి: అదిరిపోయిన ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్ -
ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ 11 అల్ట్రా మొబైల్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆ మొబైల్ కు సంబందించిన డిజైన్, స్పెసిఫికేషన్లు వివరాలు ఉన్నాయి. ఎంఐ 11 సిరీస్‌లో తీసుకునివచ్చే టాప్ ఎండ్ మోడల్ ఇదే అయ్యే అవకాశం ఉంది. షియోమీ కంపెనీ మాత్రం ఎంఐ 11 అల్ట్రాకు సంబందించి ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. దీనిలో 120ఎక్స్ అల్ట్రా పిక్సెల్ ఏఐ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టెక్ బఫ్ యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఎంఐ 11 అల్ట్రాలో రెండు వేరియంట్లు రానున్నట్లు తెలిపారు. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీని కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా ఉంది. వీడియోలో మనం గమనిస్తే వెనకవైపు ఫోన్లో సగభాగాన్ని కెమెరా మాడ్యూలే ఆక్రమించింది. దీంతోపాటు వెనక కెమెరా మాడ్యూల్లో చిన్న డిస్ ప్లే కూడా ఉంది. దీని సాయంతో వెనక కెమెరాలో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే మొబైల్ స్క్రీన్ కూడా కనబడుతుంది. ఎంఐ 11 అల్ట్రా లీకైన ఫీచర్స్: డిస్ప్లే: 6.8-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే రిఫ్రెష్ రేట్: 120 హెర్ట్జ్ బ్యాటరీ: 5,000 ఫాస్ట్ ఛార్జింగ్: 67వాట్ వైర్డ్, 67వాట్ వైర్లెస్, 10వాట్ రివర్స్ ఛార్జింగ్ ర్యామ్: 12జీబీ స్టోరేజ్: 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 50ఎంపీ + 48ఎంపీ + 48ఎంపీ సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 కలర్స్: బ్లాక్, వైట్ చదవండి: ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
మన స్మార్ట్‌ఫోన్‌లో ఎంత ర్యామ్ ఉండాలి?
ప్రతి సంవత్సరం మొబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో చాలా మొబైల్స్ విడుదల అవుతుంటాయి. అయితే, చాలా మంది మాత్రం ఏ మొబైల్ కొనాలనే విషయంలో అయోమయానికి లోనవుతారు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలతో విరమించుకున్నవాళ్లూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రధానంగా కోరుకునేది వేగం. తమ ఫోన్ వేగంగా పనిచేయాలని కోరుకుంటారు. అందుకు మొబైల్ లో అతి ముఖ్యమైనది ర్యామ్. మన ఫోన్ ఎంత సామర్థ్యం గల ర్యామ్ ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. కానీ, కొన్నిసార్లు మనకు అవసరం లేని దానికన్నా ఎక్కువ సామర్ధ్యం గల మొబైల్ కొన్న డబ్బులు వృధానే. అందుకే మనం ఏదైనా మొబైల్ కొనే ముందు మనకు ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని తెలుసుకోవాలి. అసలు ర్యామ్ అంటే ఏమిటి, మన మొబైల్ ఫోన్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని ఇప్పడు తెలుసుకుందాం.. ర్యామ్(రాండమ్ యాక్సెస్ మెమరీ): రాండమ్ యాక్సెస్ మెమరీ అనేది తాత్కాలిక, ఇంటర్మీడియట్ డేటాను నిల్వ చేసే ఒక మెమరీ. మన మొబైల్ లో స్వల్ప కాలంలో ఎక్కువ పనులు ఒకేసారి చేసిపెడుతుంది. ఇది డేటాను మాత్రం ఎప్పటికి నిల్వ చేసుకోదు, తక్కువ కాలం మాత్రమే మనం మొబైల్ లో చేసే పనులను గుర్తుంచుకుంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను. మీరు మొబైల్ ఒక చిన్న గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడుతుంటారు అనుకుందాం. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు వారితో మాట్లాడుతారు. ఆ తర్వాత మళ్లీ గేమ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ గేమ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇలా మొదటి నుంచి ప్రారంభం కావడానికి ప్రధాన కారణం మీ మొబైల్ తక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉండటం వల్ల అది తక్కువ కాలానికి గుర్తు పెట్టుకుంది. అలాగే మీ మొబైల్ లో ఎక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే రెండు, మూడు పనులను ఒకేసారి చేసిన ఎటువంటి ఆటంకం కలగదు. పైన చెప్పిన ఉదాహరణలో తక్కువ ర్యామ్ ఉండటం వల్ల ఎక్కువ సేపు గేమ్ గుర్తుపెట్టుకోలేక మొదటి నుంచి ప్రారంభం అయ్యింది. అయితే, అసలు మన మొబైల్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ తీసుకోవాలంటే మన అవసరాలు బట్టి మనం నిర్ణయించుకోవాలి. మొబైల్ ఫోన్ తక్కువగా వాడే వారు 8జీబీ ర్యామ్ గల మొబైల్ ను తీసుకున్న డబ్బులు వృధానే. అలాగే ఎక్కువ మొబైల్ తో పనిచేసే వారు 3జీబీ ర్యామ్ తీసుకుంటే మీకు చిరాకు వేస్తుంది. 1జీబీ - 3జీబీ ర్యామ్: స్మార్ట్‌ఫోన్ ను కొత్తగా కొనేవారు లేదా తక్కువ వాడే వారు 3జీబీ లోపు ర్యామ్ గల మొబైల్ తీసుకుంటే మంచిది. వీటి ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా కాల్స్, సందేశాలను పంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ లో ఇతర పనులు చేసుకునే వారు ఆశించవచ్చు. సాధారణ అవసరాలకు ఫోన్లను వాడేవారికి ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. మీ ఇంట్లో ఉండే పెద్దవారికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఈ ఫోన్లలో టెంపుల్ రన్ వంటి జనాదరణ పొందిన గేమ్స్ కూడా కష్టంగా ప్లే అవుతాయి, మల్టి-టాస్క్ కూడా నిర్వహించలేవు. వీటిని ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అని అంటారు. 4జీబీ - 6జీబీ ర్యామ్: స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా బాగా ఉపయోగించే వారు, ఫోనులో ఒకేసారి రెండు లేదా మూడు పనులు చేసేవారి మొబైల్ ఫోన్ లలో 4జీబీ - 6జీబీ సామర్థ్యం గల ర్యామ్ ఉంటే చాలా మంచిది. అలాగే ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేసుకునే వారికీ కూడా బాగా ఉపయోగపడుతాయి. 4జీబీ - 6జీబీ ర్యామ్ గల మొబైల్ మల్టీ-టాస్కింగ్ పనులు కూడా సులభంగా నిర్వహిస్తుంది. మీరు ఒకేసారి బ్రౌజర్ ట్యాబ్‌లు, మెసేజింగ్ యాప్స్ వంటివి ఒకేసారి చక్కగా నిర్వహించవచ్చు. పబ్జీ, ఫౌజీ వంటి గేమ్స్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆడవచ్చు. మీకు 8జీబీ - 12జీబీ ర్యామ్: ప్రస్తుతం చాలానే స్మార్ట్ ఫోన్లు 8జీబీ ర్యామ్ తో వస్తున్నాయి. ఈ ఫోన్ హెవీ గేమింగ్ మల్టి టాస్కింగ్, సూపర్ స్పీడ్ తో పనిచేస్తుంది. ఎక్కువ శాతం పనులను మొబైల్ ద్వారా చేయాలనుకునే వారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. హై-ఎండ్ గేమ్స్, ఫోటో, వీడియో చేసే వారికీ 8జీబీ - 12జీబీ ర్యామ్ సామర్ధ్యం గల మొబైల్స్ చాలా ఉపయోగపడుతాయి. Aspalt 9, Call Of Duty వంటి హై ఎండ్ గేమ్స్ ఆడేవారికి సరిగ్గా సరిపోతుంది. ఇది ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అప్స్ ని ఒకేసారి నిర్వహిస్తుంది. ర్యామ్ తో పాటు మన మొబైల్ లో వచ్చే ప్రాసెసర్ మీద ఆధారపడి కూడా మొబైల్ పనితీరు ఆధారపడి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62
ప్రస్తుతం శామ్సంగ్ కంపెనీ షియోమీకి దీటుగా మొబైల్ ఫోన్లను తీసుకోని వస్తుంది. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ఒక మైక్రోసైట్‌ను కూడా సృష్టించింది. ఈ సైట్లో గెలాక్సీ ఎఫ్62 సంబందించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ బహిర్గతం చేసింది. గెలాక్సీ ఎఫ్62లో క్వాడ్-కెమెరా సెటప్, గ్రేడియంట్ గ్రీన్ కలర్ ఆప్షన్, ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62లో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎం51 తర్వాత ఇంత బ్యాటరీ సామర్థ్యం గల మొబైల్ ఇదే. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్స్: డిస్ప్లే: 6.7 అంగుళాలు సూపర్ అమోలెడ్ బ్యాటరీ: 7000ఎంఏహెచ్ ర్యామ్: 6జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: శామ్సంగ్ ఎక్సినోస్ 9 ఆక్టా 9825 బ్యాక్ కెమెరా: 64ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11(వన్ యూఐ 3.0) కలర్స్: గ్రీన్, బ్లూ కనెక్టివిటీ: 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపిఎస్, యుఎస్బి టైప్-సి చదవండి: సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు పోకో ఎం3 కాసుల వర్షం! -
పోకో ఎం3 కాసుల వర్షం!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇటీవలే ఎం3 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో లాంచ్ అయిన పోకో ఎం2కి తర్వాతి వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 9న ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొచ్చిన ఫస్ట్ సేల్‌లో 1.5 లక్షల యూనిట్లు అమ్ముడపోయినట్లు పోకో ప్రకటించింది. మొదటి నుంచి దీని మీద చాలా హైప్ ఉండటం చేత ఇంతగా సేల్ జరిగింది. దాదాపు 30లక్షల మంది వినియోగదారులు ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి కనబరిచినట్లు పోకో పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా దాదాపు రూ.165 కోట్ల బిజినెస్ జరిగింది. ఫిబ్రవరి 16న ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సేల్ కి రానుంది. పోకో ఎం3 ఫీచర్స్: డిస్ప్లే: 6.53-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ బ్యాటరీ: 6,000 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ ర్యామ్: 6జీబీ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: పవర్ బ్లాక్, కూల్ బ్లూ, యెల్లో ధర: రూ.10,999(6జీబీ, 64జీబీ) రూ.11,999(6జీబీ, 128జీబీ) చదవండి: -
రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేస్తుంది!
షియోమీ అభిమానులకు శుభవార్త తెలిపింది రెడ్మీ. వచ్చే నెల మార్చిలో రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లు తీసుకొస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఖచ్చితమైన విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ ఫోన్లకు సంబందించిన టీజర్ ను కూడా విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 సిరీస్ కొనసాగింపుగా దీనిని తీసుకువస్తుంది. రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎన్ని ఫోన్లు తీసుకొస్తుందో స్పష్టత లేదు. షియోమీ రెడ్మీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లను రూ.20,000లోపే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన కొన్ని ఫీచర్స్ బయట చక్కర్లు కొడుతున్నాయి. రెడ్మి నోట్ 10 సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో 120 హెర్ట్జ్ ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. రెడ్మి నోట్ 10 6జీబీ + 64జీబీ, 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్లలో రానున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో 4జీ, 5జీ మోడల్స్ ఉంటాయని సమాచారం. రెడ్మీ నోట్ 10ప్రో 5జీ మోడల్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉంటుందని అంచనా. రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లు బ్రాంజ్, బ్లూ, గ్రే కలర్స్‌లో లభించే అవకాశం ఉంది. #RedmiNote10 series - 2021's smartphone of the year is making it's way home in early March. ⚡️ India's most-loved smartphone series is getting an upgrade unlike anything anyone's ever seen before! 👀 Are you ready to be blown away by the #10on10 experience? Heads up! 🔥 pic.twitter.com/vs9KGJAhOG — Redmi India - #RedmiNote10 Series is coming! (@RedmiIndia) February 10, 2021 చదవండి: ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు -
నోకియా నుంచి మరో రెండు బడ్జెట్ మొబైల్స్
మొబైల్ మార్కెట్ లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నోకియా నేడు నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్‌ని భారత్ లో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం మరో విశేషం. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఫిబ్రవరి 17న నోకియా 5.4 మొబైల్ ఫస్ట్ సేల్ కి రానుంది. అలాగే నోకియా 3.4ని ఫిబ్రవరి 20న కొనవచ్చు. నోకియా 5.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ, 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: చార్కోల్, డస్క్, ఎఫ్జార్డ్ ధర: రూ.13,999(4జీబీ, 64జీబీ) రూ.15,499(6జీబీ, 64జీబీ) నోకియా 3.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 460 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: డస్క్, పోలార్ నైట్ ధర: రూ.11,999 -
శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు!
వాలెంటైన్స్ డే సందర్బంగా శామ్సంగ్ డేస్ సేల్ పేరుతో కొత్త సేల్‌ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. శామ్సంగ్ డేస్ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. శామ్సంగ్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్ఫోన్లు శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్41 ఉన్నాయి. అలాగే టాబ్లెట్లలో గెలాక్సీ టాబ్ ఎస్7+, గెలాక్సీ టాబ్ ఎ7 వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, సెలెక్ట్ ఇ-కామర్స్ పోర్టల్స్, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా గెలాక్సీ టాబ్లను కొనుగోలు చేస్తే వినియోగదారులు పదివేల వరకు డిస్కౌంట్ లభించనుంది. చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్ -
రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన ఎక్స్7ప్రో 5జీ మొబైల్ ను కొద్దీ రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా రియల్ మీ ఎక్స్7 ప్రో ఫ్లిప్ కార్టులో ఫస్ట్ సేల్ కి వచ్చింది. రియల్ మీ ఎక్స్7 సిరీస్ లో రెండు మొబైల్స్ తీసుకోని వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లనే దీనిలో అందించారు. రియల్ మీ ఎక్స్7 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ప్రస్తుతం 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను రూ.30,000కు తీసుకొనివచ్చింది. రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫీచర్స్: డిస్ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ బ్యాటరీ: 4,500 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ బ్యాక్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: ఫాంటసీ, మిస్టిక్ బ్లాక్ కనెక్టివిటీ: డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1 ధర: రూ.29,999 చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక -
సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమీ రోజు రోజుకి సంచలనాలను సృష్టిస్తుంది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇయర్ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులను తక్కువ ధరకే అందిస్తూ ప్రపంచంలోని చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. తక్కువ కాలంలోనే శాంసంగ్, యాపిల్ వంటి ఇతర కంపెనీలను దీటుగా ఎదుర్కొంటూ షియోమీ తన హవా కొనసాగిస్తోంది. షియోమీ కేవలం 6 సంవత్సరాల కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా రెడ్మి నోట్ సిరీస్ ఫోన్లను విక్రయించినట్లు షియోమీ ప్రకటించింది. రెడ్మీ ఇండియా ఈ గణాంకాలను తెలుపుతూ ట్విటర్లో ఈ విషయాన్ని షేర్ చేసింది. మొట్ట మొదటి రెడ్మి నోట్ సిరీస్ ఫోన్‌ను 2014లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి కంపెనీ రెడ్మి నోట్ సిరీస్ ఫోన్లను వరుసగా విడుదల చేస్తుంది. షియోమీ ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించింది. షియోమీ 2014లో తొలిసారి రెడ్మి నోట్ సిరీస్‌ను ఫోన్లను విడుదల చేసింది. 2015లో రెడ్మి నోట్2, రెడ్మి నోట్3, 2016లో రెడ్మి నోట్4 తర్వాత 2017లో రెడ్మి నోట్ 5ఎ వచ్చింది. ఆ తర్వాత 2018లో రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 6 సిరీస్ తీసుకోని వచ్చింది. 2019లో రెడ్మి నోట్7, రెడ్మి నోట్8 సిరీస్‌ను వరుసగా విడుదల చేసింది. 2020లో రెడ్మీ నోట్ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా త్వరలోనే రెడ్మి నోట్ 10 సిరీస్ ఫోన్లను 2021 మొదటి త్రైమాసికంలో తీసుకురావాలని షియోమీ యోచిస్తుంది. #RedmiNote series smartphones has shipped more than 2⃣0⃣,0⃣0⃣,0⃣0⃣,0⃣0⃣0⃣ units globally! 🌏 Crazy feat achieved by our most feature packed smartphone series! This milestone is a testament to #Redmi Note being the most-loved series in the world! ❤️ pic.twitter.com/sUdhmC9neH — Redmi India - #Redmi9Power is Here! (@RedmiIndia) February 8, 2021 చదవండి: ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి -
ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి
రియల్మీ అభిమానులకు శుభవార్త. రియల్మీ నార్జో సిరీస్ కింద రియల్మీ గత ఏడాది మే నుంచి మొబైల్స్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సిరీస్ కింద ఇప్పటికే రియల్మీ నార్జో 10, నార్జో 10ఏ, నార్జో 20, నార్జో 20ఏ, నార్జో 20 ప్రో మోడల్స్ తీసుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన నార్జో 20 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్మీ నార్జో30, నార్జో30 ప్రో వంటి మొబైళ్లను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఒక సర్వే కూడా చేపడుతుంది. ఈ సర్వేలో భాగంగా రియల్మీ నార్జో 30 సిరీస్ రీటైల్ బాక్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని తన అభిమానులను కోరుతుంది. దింట్లో ఆరు ఎంపికలు ఉన్నాయి. మీరు కూడా గూగుల్ ఫారం ద్వారా ఓటు వేయవచ్చు. అలాగే ఒక లక్కీ విన్నర్ కి ఉచితంగా ఈ నార్జో మొబైల్ అందించనున్నట్టు తెలిపింది. ప్యాకేజింగ్, కంపెనీ పేరు తప్ప ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అలాగే ఇండియాలో 30లక్షల మంది రియల్మీ నార్జో వినియోగదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఈ ఫోన్ జనవరిలో విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న సర్వేను బట్టి చూస్తే త్వరలోనే తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. రియల్మీ ఇటీవల రియల్మీ నార్జో 20 ప్రో కోసం ఆండ్రాయిడ్ 11 ఓపెన్ బీటాను రియల్మీ యుఐ 2.0తో పాటు అనేక ఇతర ఫోన్లకు విడుదల చేసింది. 3 Million young players have chosen the performance-oriented #Narzobyrealme series so far. Now calling all gaming enthusiasts to choose your favourite Narzo smartphone box. 1 lucky fan will win a new narzo phone! Head here to #realmeCommunity for voting: https://t.co/sRIK7rZNw4 pic.twitter.com/uUeaRJTjGs — Madhav FutureX (@MadhavSheth1) February 8, 2021 చదవండి: ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్ అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11 -
ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్
ఎన్ని మొబైల్స్ మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ మొబైల్స్ ఉన్న క్రెజ్ ఏ మాత్రం తగ్గదు. అందుకే ఆపిల్ నుంచి విడుదలైన ప్రతి మోడల్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ ఒక ఐఫోన్ కు మాత్రం అనుకున్నంత ఆదరణ రావడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఐఫోన్ 12మినీ ఉత్పత్తిని ఆపిల్ నిలిపివేయచ్చు అనే సమాచారం బయటకి వస్తుంది. మినీ-వెర్షన్ ఐఫోన్ ఐఫోన్ 12, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 12ప్రో మాక్స్ లతో పాటు ఇది ప్రారంభమైంది. ఈ ఐఫోన్ 12మోడళ్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంది. బడ్జెట్ ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ మొబైల్ రెండవ త్రైమాసికం తర్వాత నిలిపివేయవచ్చు అని జెపి మోర్గాన్ నిపుణుడు పేర్కొన్నారు. మంచి పనితీరు కనబరిచినప్పటికీ డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలల ఐఫోన్ అమ్మకాల్లో ఐఫోన్ 12 మినీ కేవలం 6 శాతం వాటాను మాత్రమే నమోదు చేసిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఐఫోన్ ఇతర వాటితో పోల్చితే చిన్నగా ఉండటంతో పాటు బ్యాటరీ జీవితం కూడా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన 5జీ మొబైల్ కావడం విశేషం. ఐఫోన్ 12మినీ 5.4 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. చదవండి: అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11 వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం -
అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11
షియోమీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11ను గ్లోబల్ మార్కెట్లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల చేసింది. షియోమీ ఎంఐ 11 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఎంఐయూఐ 12.5 ఓఎస్ తో పనిచేస్తుంది. ఎంఐ 11 మొబైల్ ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. షియోమీ ఎంఐ 11ను గత ఏడాది డిసెంబర్లో చైనాలో విడుదల చేశారు. షియోమీ ఎంఐ 11 ఫీచర్స్: డిస్ప్లే: 6.81-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డి అమోలెడ్ రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్ బ్యాటరీ: 4,600 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్లెస్ ర్యామ్: 8జీబీ LPDDR5 స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 108ఎంపీ(ఎఫ్/1.85) + 13ఎంపీ(ఎఫ్/2.4) + 5ఎంపీ సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఎంఐయూఐ 12.5 కలర్స్: హారిజన్ బ్లూ, మిడ్ నైట్ గ్రే, క్లౌడ్ వైట్ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.2 ఎంఐ 11 ధర: ఎంఐ 11 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 749(సుమారు రూ.65,800)గా నిర్ణయించగా, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 799(సుమారు రూ.70,100)గా ఉంది. ఫోన్ క్లౌడ్ వైట్, హారిజోన్ బ్లూ, మిడ్నైట్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీనికి రెండు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. చదవండి: వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం నోకియా 5.4ను టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్ -
నోకియా 5.4 మొబైల్ ఫీచర్స్ టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్
నోకియా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ టీజ్ చేసింది. విడుదలకు ముందే ఫ్లిప్‌కార్ట్ నోకియా 5.4 కోసం ప్రత్యేకంగా ఒక ల్యాండింగ్ పేజీని సృష్టించింది. ఇందులో దీనికి సంబంధించిన ఫీచర్లను కూడా టీజ్ చేశారు. నోకియా 5.3 వారసుడిగా నోకియా 5.4ను తీసుకొస్తున్నారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్‌ను అందించారు. నోకియా 5.4లో ఓజో ఆడియో సపోర్ట్‌తో పాటు 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది. నోకియా 5.4 ఫీచర్స్(అంచనా): డిస్ప్లే: 6.39-అంగుళాల హెచ్డి ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్(10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ర్యామ్: 4జీబీ, 6జీబీ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 48ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: డస్క్, పోలార్ నైట్ ధర: రూ.15 వేలు చదవండి: వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు -
గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది!
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు(మధ్యాహ్నం) భారతదేశంలో విడుదల కానుంది. దీనికి సంబందించిన ఒక ప్రత్యేక పేజీని ఫ్లిప్‌కార్ట్ సృష్టించింది. ఈ ఫోన్ 7నానో మీటర్ మీద నిర్మించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 62 మొబైల్ ముందు, వెనుక భాగాలు ఎలా ఉండనున్నాయో ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీలో చూపించింది. శామ్సంగ్ షేర్ చేసిన ప్రకారం ఈ ఫోన్ ధర రూ.20వేల నుంచి రూ.25వేల మధ్య ఉండనుంది. దీని గీక్ బెంచ్ స్కోర్ 2,400గా ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్స్: డిస్ప్లే: 6.7 అంగుళాలు బ్యాటరీ: 7000ఎంఏహెచ్ ర్యామ్: 6జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: శామ్సంగ్ ఎక్సినోస్ 9 ఆక్టా 9825 బ్యాక్ కెమెరా: 64ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు -
లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన ఫోటోలు బయటకి విడుదలయ్యాయి. వనిల్లా వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన చిత్రాలను యూట్యూబర్ డేవ్2డి లీక్ చేసాడు. లీకైన ఫోటోలను బట్టి చూస్తే మనకు వన్‌ప్లస్ 9ప్రో వెనుక కెమెరాలో రెండు ప్రధాన కెమెరాలతో పాటు, మరో రెండు ఇతర చిన్న కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటో కెమెరాగా కనిపిస్తుంది. వన్‌ప్లస్ ఈ సారి ప్రధానంగా కెమెరా మీద దృష్ట్టి పెట్టినట్లు కనిపిస్తుంది. చాలా మంది వినియోగదారులు వన్‌ప్లస్ ప్రధానంగా కెమెరా విషయంలో ఇతర మొబైల్ ఫోన్ తో పోలిస్తే వెనుకబడినట్లు పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 9ప్రో డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది, దీని స్క్రీన్ QHD+(3120x1440 పిక్సెల్స్) రిజల్యూషన్ తో 120హెర్ట్జ్ అధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆసక్తికరం విషయం ఏంటంటే దీనిలో ఏ ప్రాసెసర్ తీసుకొస్తున్నారో బయటకి వెల్లడించలేదు. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. దీనిని ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో తీసుకొనిరానున్నారు.(చదవండి: పోకో ప్రియులకు శుభవార్త!) -
పోకో ప్రియులకు శుభవార్త!
పోకో ఎఫ్1 మొబైల్.. ఇండియన్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. ఏదైనా ఒక ఫోన్ విడుదల అయితే 6నెలల తర్వాత ఔట్ డేట్ గా మారిపోతుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం విడుదలైనప్పటి నుంచి ఒక ఏడాది పాటు దాని హవా కొనసాగింది. అంత బాగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం ప్రీమియం మొబైల్స్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకోనిరావడమే. 2018లో విడుదలైన పోకో ఎఫ్1 మొబైల్లో అప్పటి ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. దీనిని కేవలం రూ.20వేలకే అందుబాటులో ఉంచడంతో చాలా మంది ఎగబడి కొన్నారు. అంతలా సక్సెస్ అయిన ఈ మొబైల్ కి కొనసాగింపుగా పోకో ఎఫ్2ను తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని అందుబాటులోకి తీసుకొనిరాలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి తీసుకోని రానున్నట్లు సమాచారం. ఇటీవలే పోకో ఇండియన్ డైరెక్టర్ అనుజ్ శర్మ, క్వాల్కామ్ ప్రాసెసర్ ప్రతినిధితో ట్విటర్ లో మాట్లాడిన వీడియోలో త్వరలో మరో కొత్త మొబైల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఆ రాబోయే మొబైల్ పోకో ఎఫ్2 కావచ్చు అని చాలా మంది నిపుణలు భావిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్/875 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చని అంచనా. పోకో ఎఫ్2 లీకైన స్పెక్స్‌లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. పోకో ఎఫ్2 5జీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానుంది. ఇది రూ.25వేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. (చదవండి: టెస్లాకు పోటీగా మరో ఎలక్ట్రిక్ కారు) -
రూ.13 వేలకే రియల్మీ 5జీ ఫోన్
రియల్మీ తన చవకైన 5జీ మొబైల్ వీ11ని చైనాలో తక్కువ ధరకే విడుదల చేసింది. ఇందులో 5,000 సామర్థ్యం గల ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. రియల్మీ వి11 5జీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ గత నెలలో తక్కువ ధరకే రియల్మీ వి15 5జీని విడుదల చేసింది. 6.52 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కూడా ఇందులో అందించారు.(చదవండి: అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!) రియల్మీ వీ11 ఫీచర్స్: రియల్మీ వీ11 5జీ 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయు ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. రియల్మీ వీ11 5జీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్ తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, వై-ఫై, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఫీచర్లను ఇందులో అందించారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఏకైక 4జీబీ+128జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రియల్మీ వీ11 5జీ ధర చైనా 1,199యువాన్లుగా(సుమారు రూ.13,500)గా ఉంది. ఇది వైబ్రాంట్ బ్లూ, క్వైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
లీకైన ఎంఐ11 గ్లోబల్ ధరలు
షియోమీకి చెందిన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన యూరోపియన్ మార్కెట్ ధరలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ యొక్క ధరలను ఒక టిప్‌స్టర్ బయటకి షేర్ చేసారు. లీకైన సమాచారం ప్రకారం, ఐరోపాలో ఎంఐ11 ధర 799(సుమారు రూ.69,800) యూరొల నుంచి ప్రారంభమవుతుంది. షియోమీ యొక్క ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇప్పటికే చైనాలో తీసుకొచ్చారు. అక్కడ బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర చైనా యువాన్ 3,999(సుమారు రూ.45,300)గా ఉంది.(చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!) ఐరోపాలో ఎంఐ11 ధర(అంచనా): టిప్‌స్టర్ సుధాన్షు షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఎంఐ11 బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరప్‌లో యూరో 799(సుమారు రూ.69,800)కి తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 899(సుమారు రూ.78,500)గా నిర్ణయించినట్లు సమాచారం. చైనాలో లాంచ్ చేసిన మొబైల్ ధరల కంటే ధరలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంఐ11 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ తో రాబోయే ఎంఐ11 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12తో పనిచేస్తుంది. ఇది 6.81-అంగుళాల 2కే డబ్ల్యూఓ హెచ్ డి(1,440x3,200 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎంఐ11లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 20మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఎంఐ11 టర్బోచార్జ్ 55వాట్ వైర్డు, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్
షియోమీ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్లో లీకయ్యయి. ఇది రెడ్ మీ కే40 సిరీస్ లేదా ఎంఐ 11 సిరీస్‌కు సంబంధించిన ఫోన్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇందులో వనిల్లా మోడల్ క్వాల్కామ్ నుంచి సబ్-ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను షియోమీ తీసుకొస్తున్నట్లు సమాచారం.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3!) ఇందులో పంచ్ హోల్ కటౌట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేను షియోమీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ మొబైల్ లో ఉపయోగించే ఎస్ఎం7350 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది 5ఎక్స్ జూమ్ కి సపోర్ట్ చేసే 64 ఎంపీ కెమెరా కలిగి ఉండవచ్చని టిప్‌స్టర్ పేపేర్కొన్నారు. ఇది రాబోయే రెడ్మి కె40 లేదా ఎంఐ 11 సిరీస్ వేరియంట్ కావచ్చు అని భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ సిద్ధంగా ఉంది. దీని ధర సిఎన్‌వై 2,999(సుమారు రూ.34,000) నుంచి ప్రారంభమవుతుంది. రెడ్ మీ కే40లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 765జీకి తర్వాత వెర్షన్‌గా స్నాప్ డ్రాగన్ 775జీ రానుంది. ఈ ప్రాసెసర్ ను ఇందులో తీసుకురానున్నట్లు అంచనా. -
లీకైన శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎ72 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు అనాటెల్ బ్రెజిల్ సర్టిఫికేషన్ సైట్లో లీక్ అయ్యాయి. ఆ సర్టిఫికేషన్ సైట్ జాబితాలో ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు బయటకి లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ72కు సంబందించిన వివరాలు గతంలో కూడా అనేక సందర్భాల్లో లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు.(చదవండి: షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!) శాంసంగ్ ఏ72 ఫీచర్స్ లీకైన వివరాల ప్రకారం 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ71కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ71లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ అనాటెల్ వెబ్ సైట్లో SM-A725M/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇందులో డిఎస్ అంటే డ్యూయల్ సిమ్ అని అర్థం. శామ్సంగ్ గెలాక్సీ ఎ72 బిగ్ 6.7-అంగుళాల డిస్ప్లే, యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటు దిగువన స్పీకర్ గ్రిల్ కలిగి ఉండవచ్చు. ఇవి తప్ప శాంసంగ్ గెలాక్సీ ఏ72కి సంబందించిన వివరాలేవీ తెలియరాలేదు.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) శాంసంగ్ ఏ72 ధర ఈ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. ఈ ఫోన్ ధర కూడా ఆన్లైన్లో లీకైంది. ఈ ఫోన్ కొన్ని మార్కెట్లలో 4జీతో, కొన్ని మార్కెట్లలో 5జీతో రానుంది. కొన్ని మార్కెట్లలో రెండు వేరియంట్లూ రానున్నట్లు తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన 4జీ వేరియంట్ ధర 449 యూరోలుగానూ(సుమారు రూ.39,800), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న 4జీ వేరియంట్ ధర 509 యూరోలుగానూ(సుమారు రూ.45,100) ఉండనున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీ ధర 600 డాలర్లుగా(సుమారు రూ.43,800) ఉండనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ కూడా వచ్చే నెలలో జరగనుందని సమాచారం. -
షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!
షియోమీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11 మొబైల్ విడుదల తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11ను ఫిబ్రవరి 8న గ్లోబల్ లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత నెలలో చైనాలో ఎంఐ 10కి కొనసాగింపుగా ఎంఐ 11ను విడుదల చేశారు. డిసెంబరులో ఆవిష్కరించబడిన ఫ్లాగ్షిప్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో వచ్చిన మొదటి మోడల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డు సృష్టించింది. దీనిలో షియోమీ కొత్త ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను తీసుకోనురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ ఎంఐ 11 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.8-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పాటు 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ను తీసుకోని రానున్నారు. ఎంఐ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ ఎంఐ 11లో 256జీబీ యుఎఫ్ఎస్3.1 స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ లో ఎంఐ టర్బోచార్జ్ 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే 4,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, ఇన్ఫ్రారెడ్, యుఎస్బి టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. ఎంఐ 11 ధర: గ్లోబల్ మార్కెట్ షియోమీ ఎంఐ 11 ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ చైనాలో కోసం సిఎన్‌వై3,999 (సుమారు రూ.45,300)కి లాంచ్ చేశారు. ఎంఐ 11 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ సిఎన్‌వై 4,299 (సుమారు రూ.48,700)కి, టాప్-ఆఫ్-లైన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్ సిఎన్‌వై4,699(సుమారు రూ.53,200) ధరను కలిగి ఉంది. -
శామ్సంగ్ మరో బడ్జెట్ మొబైల్
శామ్సంగ్ సంస్థ మరో బడ్జెట్ మొబైల్ గెలాక్సీ ఎం02ను ఫిబ్రవరి 2న భారతదేశంలో లాంచ్ చేయనుంది. గత ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన గెలాక్సీ ఎం01 కొనసాగింపుగా కంపెనీ దీనిని తీసుకొస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం02 విడుదల తేదీని వెల్లడించడంతో పాటు అమెజాన్ సైట్ లో కొన్ని ఫీచర్స్ వెల్లడించింది. శామ్సంగ్ గెలాక్సీ ఎం02పై గత కొంతకాలంగా అనేక రుమార్లు వస్తున్నాయి.(చదవండి: రిలయెన్స్ జియో మరో రికార్డ్) గెలాక్సీ ఎం02 ఫీచర్స్: శామ్సంగ్ గెలాక్సీ ఎం02 6.5-అంగుళాల హెచ్డి ఇన్ఫినిటీ-వి డిస్ప్లేని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను 3జీబీ, 32జీబీ, 6జీబీ, 128జీబీ వేరియంట్లలో నవంబర్‌లో యూరప్‌లో లాంచ్ చేసిన గెలాక్సీ ఎ02 ఎస్ రీబ్రాండెడ్‌గా భావిస్తున్నారు. శామ్సంగ్ గెలాక్సీ ఎం 02 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. దీని బేస్ మోడల్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ గా ఉంది. ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, యుఎస్బి టైప్-సి పోర్ట్ తీసుకొస్తారని భావిస్తున్నారు. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తున్నట్లు అమెజాన్ పేజీలో చూపిస్తుంది. దీని బేస్ మోడల్ ధర రూ.6999గా ఉండనుంది. -
మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో అదిరిపోయే ఫీచర్స్
మోటొరోలా తన కొత్త ఫోన్ ఎడ్జ్ ఎస్ మొబైల్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గత వారం క్వాల్కామ్ కంపెనీ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ తో విడుదలైన మొట్టమొదటి మొబైల్ ఇదే. మోటరోలా ఎడ్జ్ ఎస్‌లో డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ ఉన్నాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు రెండు కెమెరాలను తీసుకొచ్చారు. ఎడ్జ్ ఎస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.(చదవండి: పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఫీచర్స్: డ్యూయల్ సిమ్(నానో) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఆండ్రాయిడ్ 11లో మైయుఐ మీద నడుస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రినో 650 జీపీయును తీసుకొచ్చారు. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ(యుఎఫ్ఎస్ 3.1) వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఎడ్జ్ ఎస్‌లో 64 మెగాపిక్సెల్(ఎఫ్/1.7) ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు) వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. మోటరోలా 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. దీని బరువు 215 గ్రాములు. మోటరోలా ఎడ్జ్ ఎస్ ధర: మోటరోలా ఎడ్జ్ ఎస్ 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సిఎన్‌వై 1,999(సుమారు రూ.22,600), 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సిఎన్‌వై 2,399(సుమారు రూ.27,000)గా నిర్ణయించారు. టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సిఎన్‌వై 2,799(సుమారు రూ.31,600)గా ఉంది. ఫోన్ ఎమరాల్డ్ లైట్, స్నో, మిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?
ఇండియాలో పోకోఎం3 విడుదల తేదీని అధికారికంగా సంస్థ ప్రకటించింది. దీనిని ఫిబ్రవరి 2న తీసుకొస్తున్నట్లు ఒక వీడియోను నేడు విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. పోకో ఎం3లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ని తీసుకురానున్నారు. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3ని తీసుకువస్తున్నారు.(చదవండి: నిశ్శబ్దంగా విడుదలైన గెలాక్సీ ఎ02) పోకో ఎం3 ఫీచర్స్: పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే ఎంఐయుఐ 12 మీద నడుస్తుంది. ఇది 6.53-అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. పోకో ఎం3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనితో పాటు 4జీబీ ఎల్ పిడీడీఆర్4ఎక్స్ ర్యామ్+ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ లలో దీనిని తీసుకొస్తున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో ఎం3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పోకో ఎం3లో కనెక్టివిటీ విషయానికి వస్తే 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇందులో ఉంది. దీని బరువు 198 గ్రాములుగా ఉంది. గ్లోబల్ లాంచ్ ధరల ప్రకారం, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 యూరోలుగా(సుమారు రూ.11,000) నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 169 యూరోలుగా(సుమారు రూ.12,500) ఉంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. -
లీకైన మోటరోలా 'నియో' ఫీచర్స్
మోటరోలా 'నియో' అనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ ఇంటర్ నెట్ లో లీక్ అయ్యాయి. మోటరోలా 'నియో' లీకైన చిత్రాలు మొదట వీబోలో కనిపించాయి. మోటరోలా 'నియో' పిక్స్ కొన్ని వాయిస్‌లో నిల్స్ అహ్రెన్స్మీర్ లీక్ చేసారు. వాయిస్ పోస్ట్ ప్రకారం మోటరోలా నియో 'బెరిల్' కలర్ వేరియంట్ లో లభించనుంది. లీకైన చిత్రాలు మోటరోలా నియోలో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఫేస్బుక్లో లైక్ బటన్ కనిపించదు) మోటరోలా నియో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉండనుంది. ఇది క్వాల్కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ రెండు మెమరీ వేరియంట్లు లభించనున్నాయి. మోటరోలా నియో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ కెమెరా, 2ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. -
ఒప్పో రెనో 5ప్రోలో అదిరిపోయే ఫీచర్స్
న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో భారతదేశంలో మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్లతో ప్రారంభించబడింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ని ఈ మొబైల్ లో తీసుకొచ్చింది. ఒప్పో రెనో 5 ప్రో భారతదేశంలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.35,990. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఒప్పో రెనో 5ప్రో జనవరి 22న ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్ కి రానుంది.(చదవండి: ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు) ఒప్పో రెనో 5ప్రో స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే(90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) ర్యామ్: 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ రియర్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,350 ఎంఏహెచ్(65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ: 5జీ, 4జీ వోఎల్టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యుఎస్బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1 కలర్స్: ఆస్ట్రల్ బ్లూ, స్టార్రి బ్లాక్ ధర: రూ.35,990 -
ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు
భారతదేశంలో ఒప్పో తన ఎ12 మోడల్ ధరను తగ్గించింది. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎ15, ఒప్పో రెనో 3 ప్రోలతో పాటు ఒప్పో ఎ12ను జూన్‌లో భారత్‌లో విడుదల చేశారు. ఒప్పో ఎ12 మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెసర్ ని కలిగి ఉంది. కొత్త ధరల ప్రకారం భారతదేశంలో ఒప్పో ఎ 12 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,990 నుంచి రూ.8,490కు తగ్గించింది. అదే విదంగా 4 జీబీ ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ధర కూడా రూ.11490 నుంచి రూ.10,990కు ధర తగ్గించబడింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత) ఒప్పో ఎ12 ఫీచర్స్: డిస్ప్లే: 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ర్యామ్: 3జీబీ, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ35 రియర్ కెమెరా: 13ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 05 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,320 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
ఒప్పో రెనో 5ప్రో విడుదల నేడే
న్యూఢిల్లీ: ఒప్పో తన కొత్త సిరీస్ రెనో 5ప్రో 5జీ మొబైల్ ని నేడు(జనవరి 18) భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రెనో 5ప్రో 5జీ మొబైల్ మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి కంపెనీ ఒక మైక్రో పేజీని సృష్టించింది. ఇక్కడ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు హైలైట్ చేసారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.5-అంగుళాల 1080p అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 90 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌ను అందించనున్నారు. రెనో 5ప్రో 5జీలో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. దీనిలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 3,399(సుమారు రూ.39,000) చైనా యువాన్లుగా ఉంది. -
5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!
ఒప్పో ఏ93 5జీ మొబైల్ ను చైనాలో ప్రారంభించింది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ ను తీసుకొచ్చింది. ఒప్పో మొదటిసారిగా బడ్జెట్ మొబైల్స్ లో 5జీ కనెక్టివిటీ తీసుకురావడం విశేషం. ఈ మొబైల్ ప్రధాన కెమెరా సామర్ధ్యం 48 మెగాపిక్సెల్. అలాగే ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది రెండు స్టోరేజ్ మోడల్స్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.(చదవండి: శామ్సంగ్ నుంచి మరో పవర్ ఫుల్ ప్రాసెసర్) ఒప్పో ఏ93 ఫీచర్స్: ఒప్పో ఏ93 5జీ మొబైల్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్(1,080x2,400) ఎల్సిడి డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్తో పాటు 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఒప్పో ఏ93 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.7 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు + వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒప్పో ఏ93 5జీ కనెక్టివిటీ విషయానికి వస్తే 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యుఎస్ బి టైపు సీ పోర్టు ఉన్నాయి. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. చైనాలో దీని 8జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 (సుమారు రూ.22,500)యువాన్లుగా ఉంది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ సిల్వర్, బ్లాక్, అరోరా కలర్ ఆప్షన్లలో లభించనుంది. -
రెడ్మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్
షియోమీ గత ఏడాది రెడ్మీ 9 ప్రైమ్‌ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. 9 ప్రైమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 11తో పనిచేస్తుంది. ఇప్పుడు 9 ప్రైమ్ యూజర్లకు ఎంఐయుఐ12 అప్డేట్ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వినియోగదారులు కూడా ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు. దీనికి సంబందించిన స్క్రీన్ షాట్లను తమ ట్విటర్ లో యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్ లో ల్యాండ్ స్కేప్ మోడ్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. ఎంఐయుఐ 12.0.1.0.QJCINXM వెర్షన్ నంబర్‌తో ఈ అప్డేట్ రానుంది. ఈ అప్డేట్ సైజు కూడా 600ఎంబీ వరకు ఉంది. ఈ అప్డేట్ మొదట్లో చైనాలోని రెడ్మీ 9 వంటి ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలోని రెడ్మి 9 ప్రైమ్‌కు తీసుకురానునట్లు ప్రకటించింది. ఇది దశల వారీగా యూజర్ ఫోన్లకు రానుంది. రెడ్మి 9 ప్రైమ్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ వేరియంట్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ కాగా, మరొకటి 6జీబీ ర్యామ్ +1 28 జీబీ స్టోరేజ్ వేరియంట్. డిసెంబర్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో ఈ అప్డేట్ రానుంది. ఈ కొత్త ఎంఐయూఐ 12 అప్ డేట్ ద్వారా కంట్రోల్ సెంటర్‌కు మెరుగులు దిద్దారు.(చదవండి: రెడ్మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్) -
రెడ్మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్
రెడ్మీ కే40 మొబైల్ ను వచ్చే నెలలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. రెడ్మీ కే40 ధరను కూడా రెడ్మీ జనరల్ మేనేజర్ "లు వీబింగ్" వెల్లడించారు. రెడ్మీ కే40 సిరీస్ గతేడాది ప్రారంభించిన రెడ్మీ కే30 సిరీస్ కొనసాగింపుగా రానుంది. ప్రస్తుతానికి రెడ్మీ కే40 స్పెసిఫికేషన్స్ గురుంచి ఇప్పటివరకు తెలియదు. రెడ్మీ కే40 సిరీస్ బేస్ వేరియంట్ ధర సిఎన్‌వై 2,999(సుమారు రూ. 34,000) నుంచి ప్రారంభం కానునట్లు "లు వీబింగ్" ధృవీకరించారు. రెడ్మీ కే40 సిరీస్‌లో మెరుగైన ర్యామ్,స్టోరేజ్‌తో పాటు ఎక్కువ ప్రీమియం ఆప్షన్స్ తీసుకురానున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ పేర్కొన్నట్లుగా దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నారు. రెడ్మీ కే40 అమోలెడ్ డిస్ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు యుఎస్బి టైప్-సి పోర్ట్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది.(చదవండి: వాట్సాప్, సిగ్నల్ కు ప్రధాన తేడా ఏంటి?) -
18న రానున్న ఒప్పో కొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్
ఒప్పో ఇండియా కొత్త ఎన్కో ఎక్స్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్, ఒప్పో రెనో 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 18న విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ రెండింటిని చైనాలో ఇప్పటికే విడుదల చేసారు. చైనాలో ఒప్పో ఎన్కో ఎక్స్ ధర సిఎన్‌వై 999(సుమారు రూ .11,000)కు, ఒప్పో రెనో 5 ప్రో 5జీ ధర సీఎన్‌వై 3,399(సుమారు రూ.38,200)కు అందుబాటులో ఉన్నాయి.(చదవండి: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా) ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్: ఒప్పో రెనో 5 ప్రోలో 6.55-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ 90హెర్ట్జ్ డిస్ప్లేను 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిలో కలిగి ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్, 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోలను తీయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ 5జీ ఫోన్ లో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో పని చేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, ఎస్ఐ/ఎన్ఎస్ఎ, డ్యూయల్ 4జీ వోల్టిఇ, వై-ఫై 802.11ఎసి, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సి, డ్యూయల్ సిమ్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనిని అరోరా బ్లూ, మూన్లైట్ నైట్, స్టార్రి నైట్ రంగులలో అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎన్కో ఎక్స్ ఫీచర్స్: ఈ ఇయర్ఫోన్లు డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందిస్తున్నాయి. ప్రతి ఇయర్‌పీస్‌లో 11 ఎంఎం మూవింగ్ కాయిల్ డ్రైవర్, 6 ఎంఎం ప్లేన్ డయాఫ్రాగమ్ డ్రైవర్ ఉంటుంది. ఇది ఎస్బీసి,ఏఏసి, ఎల్ హెచ్ డీసి వంటి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇవి 4 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్ కేస్‌తో అయితే 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఐపీ54 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. -
నాలుగు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన మోటొరోలా
అమెరికా: మోటొరోలా సంస్థ ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్లను అమెరికాలో లాంచ్ చేసింది. అవి మోటో జీ స్టైలస్(2021), మోటో జీ పవర్(2021), మోటో జీ ప్లే(2021), మోటొరోలా వన్ 5జీ స్మార్ట్ ఫోన్లు. ఈ నాలుగు ఫోన్లూ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనున్నాయి. ఈ నాలుగు ఫోన్ల అమ్మకాలు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మొబైల్స్ మనదేశంలో లాంచ్ అవుతాయో లేదో కంపెనీ తెలపలేదు.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?) మోటో జీ స్టైలస్ (2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 4జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 678 ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ+ 8ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: అరోరా బ్లాక్, అరోరా వైట్ కలర్ ధర: 299 డాలర్లు(సుమారు రూ.22,000) మోటో జీ పవర్(2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 3 జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ+ 2 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: ఫ్లాష్ గ్రే కలర్ ధర: 3+32జీబీ 199 డాలర్లుగా(సుమారు రూ.14,700) 4+64 జీబీ 249 డాలర్లుగా(సుమారు రూ.18,300) మోటో జీ ప్లే(2021) ఫీచర్స్: డీస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 3 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: మిస్టీ బ్లూ కలర్ ధర: 169 డాలర్లు(సుమారు రూ.12,500) మోటొరోలా వన్ 5జీ ఏస్ ఫీచర్స్: డీస్ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే ర్యామ్: 6 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ స్టోరేజ్ ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ రియర్ కెమెరా: 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 కనెక్టివిటీ: వైఫై, 5జీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: మిస్టీ బ్లూ కలర్ ధర: 399.99 డాలర్లు(సుమారు రూ.29,500) -
షియోమీ ఎంఐ 10ఐ ఫస్ట్ సేల్
న్యూఢిల్లీ: షియోమీ ఎంఐ 10ఐ ఈ రోజు భారతదేశంలో అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 7నే అందుబాటులో ఉంది. షియోమీ ఈ వారం మొదట్లో ఎంఐ 10ఐని విడుదల చేసింది. ఎంఐ 10ఐ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు అందుబాటులోకి వచ్చింది. ఎంఐ 10ఐ యొక్క 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, అలాగే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఎంఐ 10ఐ పసిఫిక్ సన్‌రైజ్, అట్లాంటిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.67-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే(120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) ర్యామ్: 6జీబీ, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ రియర్ కెమెరా: 108ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,820 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ: 5జీ, 4జీ, డ్యూయల్ వోఎల్‌టిఇ, యుఎస్బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ధర: రూ.20,999-23,999 -
మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా లావా మొబైల్స్
న్యూఢిల్లీ: మళ్లీ మొబైల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా కంపెనీల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో విదేశీ కంపెనీలదే పై చేయి. ప్రధానంగా చెప్పాలంటే చైనా మొబైల్ కంపెనీలు ఈ మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడటానికి గతంలో మైక్రో మాక్స్ కొన్ని మొబైల్స్ విడుదల చేయగా.. తాజాగా లావా కంపెనీ తన కొత్త నాలుగు మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా జెడ్1, లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 పేరుతో స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. కొత్త ఫోన్లు దేశంలోనే స్థానికంగా బ్యాటరీలు, ఛార్జర్లతో సహా 60 శాతం భాగాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని సంస్థ పేర్కొంది. లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 మొబైల్స్ జనవరి 11 నుంచి, లావా జెడ్ 1 జనవరి 26 నుంచి అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.(చదవండి: శామ్సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ మొబైల్) లావా జెడ్1 ఫీచర్స్: డిస్ప్లే: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో 5-అంగుళాల డిస్ప్లే ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ20 రియర్ కెమెరా: 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్ బ్యాటరీ: 3,100ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.5,499 లావా జెడ్2 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.6,999 లావా జెడ్4 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.8,999 లావా జెడ్6 ఫీచర్స్: డిస్ప్లే: 6.5-అంగుళాల హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ర్యామ్: 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ ధర: రూ.9,999 -
శామ్సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ మొబైల్
న్యూఢిల్లీ: శామ్సంగ్ సంస్థ గెలాక్సీ ఎం02ఎస్ అనే మరో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను తాజాగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ బడ్జెట్ హ్యాండ్సెట్ ధర రూ.10,000. ఇందులో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. కొద్ది రోజుల క్రితం ఈ మొబైల్ నేపాల్‌లో లాంచ్ అయ్యింది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్) గెలాక్సీ ఎం02ఎస్ ఫీచర్స్: శామ్సంగ్ గెలాక్సీ ఎం02ఎస్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత శామ్సంగ్ వన్ యూఐతో నడుస్తుంది. ఇందులో 6.5-అంగుళాల (720x1,560 పిక్సెల్స్) వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ టిఎఫ్టి ఎల్సిడి డిస్ప్లేను 20: 9 నిష్పత్తితో కలిగి ఉంది. ఇది అడ్రినో 506 జిపియూతో స్నాప్‌డ్రాగన్450 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ ఎం02ఎస్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 196 గ్రాములు. గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.8,999, 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.9,999గా ఉంది. ఫోన్ బ్లాక్, బ్లూ మరియు రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
రియల్మీ వి15 వచ్చేస్తుంది!
రియల్మీ వి15 మొబైల్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి బదులుగా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ జనవరి 7న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ గత కొన్ని రోజులుగా దాని డిజైన్‌ను టీజ్ చేస్తోంది. రియల్ మీ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జు క్వి చేజ్ చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబోలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకొస్తున్నట్లు ధృవీకరించారు. రియల్మీ వి15 5జీ కనెక్టివిటీ, హోల్-పంచ్ కటౌట్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. రియల్మీ వి15 మొబైల్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ బరువు 176 గ్రాములు, 8.1 మీ.మీ మందంగా ఉంటుందని ఒక టిప్‌స్టర్ చెప్పారు. రియల్మీ రేపు(జనవరి 7న) చైనాలో మధ్యాహ్నం 11 గంటలకు (ఐఎస్ టీ ఉదయం 11:30 గంటలకు) ఫోన్‌ను ఆవిష్కరించనుంది. రియల్మీ వి15 భారతీయ మార్కెట్లోకి వస్తుందో లేదో చూడాలి.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్) -
గెలాక్సీ ఎస్ 21 లాంచ్ డేట్ వచ్చేసింది!
గతంలో మనం చెప్పుకున్నట్లే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను జనవరి 14న తీసుకొస్తున్నట్లు శామ్సంగ్ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ కొత్త గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2021 ఈవెంట్ పేరుతో విడుదల తేదీని ప్రకటించింది. “వెల్కమ్ టు ది ఎవ్రీడే ఎపిక్” పేరుతో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్ లో ఇండియా కాలమాన ప్రకారం జనవరి 14 రాత్రి 8 గంటలకు గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను విడుదల చేయనుంది. తాజా గెలాక్సీ ఫ్లాగ్షిప్ ఫోన్లలో గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ఉన్నాయి.(చదవండి: ఆన్లైన్ లో హలచల్ చేస్తున్న గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్) ఇప్పటికే గెలాక్సీ ఎస్ 21 ఫోన్ల ఫీచర్స్ కి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ లీక్స్ ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 6.2-అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2 ఎక్స్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ మోడల్ 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ ప్యానెల్లు ఉంటాయి. ఈ మొబైల్ స్క్రీన్లు హెచ్ డిఆర్ 10 ప్లస్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ మొబైల్స్ లో తాజా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, అండర్ స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసుకురావచ్చు. ఈ ఫోన్లలో శామ్సంగ్ కొత్త ఎక్సినోస్ ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫోన్లలో మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉందా లేదా అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. -
లీకైన మోటో జీ స్టైలస్ ఫీచర్స్
ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీల మాదిరిగానే మోటరోలా కూడా ఈ ఏడాది తన కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా తన మార్కెట్ ను విస్తరించుకోవాలని చూస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, మోటరోలా త్వరలో మోటో జీ స్టైలస్ 2021 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ 2020 మొదటి త్రైమాసికంలో ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్లో లాంచ్ చేసిన మోటో జీ స్టైలస్ వారసురాలుగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మాక్స్ విజన్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?) మోటో జీ స్టైలస్ 2021 6.8-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ మాక్స్ విజన్ డిస్ప్లే కలిగి ఉంది. మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ వెనుకవైపు నాలుగు కెమెరాలతో వస్తుంది. 48 ఎంపీ మెయిన్ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. మోటో జీ స్టైలస్ 2021 స్నాప్‌డ్రాగన్ 675 చిప్సెట్తో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఇందులో 4000ఎంఏహెచ్ బ్యాటరీని తీయాసుకు రానున్నారు. దీనిలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ తీసుకురావడం లేదని సమాచారం. -
గీక్‌బెంచ్‌లో మోటరోలా కొత్త మొబైల్
2021లో ప్రతి మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మోటరోలా కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక మోటోరోలా మొబైల్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ తో రాబోయే నియో మొబైల్ కావచ్చు అని తెలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే 14 స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటరోలా కూడా ఉంది. రూట్మైగలాక్సీ ప్రకారం.. “నియో” అనే కోడ్ పేరుతో పిలిచే మోటరోలా ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో రానుందని లిస్టింగ్ వెల్లడించింది. మిగతా కంపెనీలన్నీ స్నాప్‌డ్రాగన్ 888తో ఫోన్లను లాంచ్ చేస్తుండగా మోటరోలా మాత్రం ఈ ఫోన్ లో పాత ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు, మోటరోలా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో ఎడ్జ్ ప్లస్‌ను విడుదల చేసింది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల) మోటరోలా నియో ఫీచర్స్: మోటరోలా నియో 8 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11తో రాబోయే మొట్టమొదటి మోటరోలా ఫోన్ నియో అవుతుందని లిస్టింగ్ వెల్లడించింది. అయితే, గీక్‌బెంచ్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాదు. గీక్‌బెంచ్‌లో స్కోరు విషయానికొస్తే మోటరోలా నియో సింగిల్-కోర్ పరీక్షలో 958 మరియు మల్టీ-కోర్ పరీక్షలో 2969 స్కోర్లు సాధించింది. ఎక్కువ స్కోరు ప్రాసెసర్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ జాబితా డిసెంబర్ 29, 2020న కనిపించింది. 2021 ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1,080x2,520 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుందని తెలుస్తుంది. మోటరోలా నియోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో రావచ్చు. సెల్ఫీ కోసం ఇందులో ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. -
ఐఫోన్ 13లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసి కొద్దీ కాలమే అయినప్పటికీ, అప్పుడే ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ఐఫోన్ 13 గురించి కొన్ని రూమర్లు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ టాప్- ఎండ్ మోడళ్లలో 120హెర్ట్జ్ ఎల్టిపిఓ డిస్ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ 13 ప్యానెల్స్ కోసం సామ్సంగ్ డిస్ప్లే, ఎల్జీ డిస్ప్లే ప్రధాన సరఫరాదారులను సంప్రదించినట్లు సమాచారం. కొరియన్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వేరియంట్లలో 120హెర్ట్జ్ ఎల్టిపిఓ ప్రోమోషన్ డిస్ప్లేను కలిగి ఉండనున్నాయి. బేస్ వేరియంట్లు అయిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ఎల్‌టిపిఎస్ డిస్ప్లేతో వస్తాయని పేర్కొన్నారు. పైన తెలిపినట్లు ప్రో వేరియంట్లు 120 హెర్ట్జ్ ఎల్టిపిఓ డిస్ప్లేను కలిగి ఉంటాయని సూచించారు. అయితే, వచ్చే ఏడాది అన్ని ఐఫోన్లను వైర్‌లెస్‌గా మార్చడానికి ఆపిల్ ప్రణాళిక వేస్తున్నట్లు టిప్‌స్టర్ జోన్ ప్రాసెసర్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ప్రాసెసర్ ఆపిల్ ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియోను తన యూట్యూబ్ లో షేర్ చేసారు.(చదవండి: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తుంది!) -
గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 మొబైల్ ను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా గెలాక్సీ ఎస్ 21కు సంబందించిన టీజర్‌ను శామ్సంగ్ యూట్యూబ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎక్కడ కూడా గెలాక్సీ ఎస్ 21 పేరు ప్రస్తావించకుండా ఒక హింట్ మాత్రం ఇచ్చింది. అలాగే విడుదల తేదీ గురుంచి ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ గత లీక్‌ల ప్రకారం జనవరి రెండవ వారంలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మొబైల్ కి సంబందించిన ఫీచర్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఎస్ 20 మాదిరిగానే గెలాక్సీ ఎస్ 21 ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తుంది. (చదవండి: 2021లో రాబోయే బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్) గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో రానుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1పై పని చేయనున్నాయి. ఈ మొబైల్స్ ప్రాంతాన్ని బట్టి శామ్సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానుంది. గెలాక్సీ ఎస్ 21 8 జీబీ ర్యామ్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉండగా 128 జీబీ, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ లలో లభించనుంది. డిస్ప్లే విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21లో 6.2-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో రానున్నట్లు పేర్కొంది. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో ఎఫ్/2.0 లెన్స్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 కెమెరా, వైడ్ యాంగిల్ ఎఫ్/1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా గెలాక్సీ ఎస్ 21 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేయనుంది. కనెక్టివీటి కోసం బ్లూటూత్ వీ5, యుఎస్బీ టైప్ సి పోర్ట్, ఎన్ఎఫ్సి, వై-ఫై 6 ఉన్నాయి. -
ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో
చైనా: వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో ధరలు, ఫీచర్స్, అమ్మకపు తేదీలను అధికారికంగా సంస్థ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో రాబోయే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ జనవరిలో లాంచ్ కానుంది. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో రెండూ శామ్సంగ్ ఎక్సినోస్ 1080 5జీ ప్రాసెసర్ తో రానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ఫోన్లు ఇవి. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్‌హెచ్‌డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉన్నాయి. అయితే భారతదేశంలో వీటిని ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వివో ఎక్స్ 60 ప్రో ఫీచర్స్: వివో ఎక్స్ 60 ప్రో 6.56-అంగుళాల అమోలేడ్ డిస్ప్లేతో ఎఫ్‌హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ 5నానోమీటర్ తయారు చేయబడిన ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ సరికొత్త ఆరిజిన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేసే 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 48 ఎంపీ(ఎఫ్/1.48) సోనీ ఐఎమ్ఎక్స్ 598 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 13 ఎంపీ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్, 13ఎంపీ లెన్స్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది సెకండ్-జెన్ మైక్రో-గింబాల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ టెక్నాలజీతో వస్తుంది. వివో ఎక్స్ 60 ప్రోలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32ఎంపీ కెమెరా ఉంది. ఇందులో భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా వివో 60 ప్రోలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. వివో ఎక్స్ 60 ప్రో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 4,498 (సుమారు రూ.50,500)కి లభిస్తుంది. ఈ మొబైల్ బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది. వివో ఎక్స్ 60 ఫీచర్స్: వివో ఎక్స్ 60 ఫీచర్స్ ప్రో మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్. వివో ఎక్స్ 60 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. చైనాలో వివో ఎక్స్ 60 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సీఎన్‌వై 3,498 (సుమారు రూ.39,400), 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,798(సుమారు రూ.42,700), 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,998(సుమారు రూ.45,000)కి లభిస్తుంది. -
స్మార్ట్ ఫోన్స్ తయారీకి చిప్‌ల కొరత
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి 48,000 కోట్లతో భారత ప్రభుత్వం మూడు పథకాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 10.5 లక్షల కోట్ల రూపాయల మొబైల్ ఫోన్ల తయారీ కోసం పీఎల్ఐ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 16 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గత అక్టోబర్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.11 వేల కోట్లను కూడా విడుదల చేసింది. తాజాగా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కింద ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారుచేసే కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు అని ప్రభుత్వానికి పేర్కొన్నాయి.(చదవండి: అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్) మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ(ఐసీఇఎ)లో సభ్యులైన ఆపిల్, ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ మరియు లావా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఐటి కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీకి డిసెంబర్ 24న ఒక లేఖ రాసాయి. అందులో కోవిడ్ -19 చేత సరఫరా పరిమితులతో ఏర్పడిన కొరత కారణంగా పీఎల్ఐ పథకం కింద గతంలో విధించుకున్న లక్ష్యాలను చేరుకోక పోవచ్చని తెలిపాయి. "పీఎల్ఐ పథకం కింద చేరిన కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో చాలా కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కాదని" ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ లేఖలో తెలిపారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఎ) గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతకు కారణాలను వివరించింది. చైనా టెక్నాలజీ దిగ్గజం "హువావే" సంస్థ ఎలక్ట్రానిక్ చిప్స్, ప్రాసెసర్ల సరఫరాపై గత సెప్టెంబర్ లో అమెరికా నిషేధం విధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హువావే 2 సంవత్సరాలకు సరిపడా చిప్‌లను దిగుమతి చేసుకుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చిప్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. దింతో వివిధ దేశాలకు చెందిన సంస్థలు 97 శాతం సరఫరా భారత దేశ తయారీ కంపెనీలకు నిలిపివేశాయని మోహింద్రూ చెప్పారు. అంతర్జాతీయ విమాన నిషేధంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ఇష్యూ కారణంగా పీఎల్ఐ పథకం ప్రారంభించడానికి నాలుగు నెలల ముందు పలు కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఐసీఇఎ తెలిపింది. పీఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకం కోసం కాలపరిమితులను సర్దుబాటు చేయాలని పరిశ్రమల సంఘం కోరింది. -
పిక్సెల్ 6లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా
న్యూఢిల్లీ: గూగుల్ నుండి త్వరలో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 6లో కొత్త ఫీచర్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మధ్య గూగుల్ తన పిక్సెల్ 6 మొబైల్లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాను తీసుకురావడం కోసం పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పేటెంట్లో ప్రైమరీ కెమెరా వివరాలతో సహా ఫోన్ గురించి ఇతర వివరాలను కూడా బయటికి వచ్చాయి. పేటెంట్ పిక్సెల్ 6 ప్రైమరీ కెమెరా మాడ్యూల్ యొక్క డిజైన్ చూపిస్తుంది. ఈ డిజైన్ ప్రకారం కెమెరా మాడ్యూల్లో రెండు సెన్సార్లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి అని తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా, 2021లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాలతో కొత్త మొబైల్స్ తీసుకురావడానికి అనేక ఫోన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు, గూగుల్ కూడా వాటిలో ఒకటి కావచ్చు. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో పని చేయనున్నట్లు సమాచారం. ఇది 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. (చదవండి: యాపిల్ బాటలో షియోమీ) -
యాపిల్ బాటలో షియోమీ
చైనా: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ రేపు(డిసెంబర్ 28) ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంఐ 11ను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ సీఈఓ లీ జూన్ ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ పేర్కొన్నారు. ఇంట్లో పాత ఛార్జర్ లేని వినియోగదారులు కొత్త ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి అని అన్నారు. గతంలో ఇదే విదంగా యాపిల్ పర్యావరణ హితం అనే కారణంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను ఇయర్ఫోన్లు, ఛార్జర్ లేకుండా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అదేవిదంగా శామ్సంగ్ నుండి త్వరలో రాబోయే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్ఫోన్లతో కూడా ఛార్జర్‌ను తీసుకురావడం లేదని సమాచారం.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్) రాబోయే ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని చైనా సోషల్ మెసేజింగ్ యాప్ వీబోలో అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ చెప్పారు. అదేవిదంగా ఎగ్జిక్యూటివ్ రిటైల్ బాక్స్ యొక్క ఫోటోను షేర్ చేసారు. ఈ ఫొటోలో '11' నెంబర్ తో మినిమాలిస్టిక్ డిజైన్ లో బాక్స్ సైజ్ సన్నగా ఉంది. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను తీసుకురానున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12పై పనిచేయనుంది. అలాగే, ఫ్లాగ్‌షిప్‌లో QHD ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. షియోమీ ఎంఐ 11 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర. సీఎన్‌వై 4,500 (సుమారు రూ.50,700) లభించనుంది. దీని 8జీబీ ర్యామ్ + 256 జీబీ మోడల్ సీఎన్‌వై 4,800(సుమారు రూ.54,000), టాప్-ఎండ్ మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 5,200 (సుమారు రూ.58,600)గా ఉండనుందని తెలుస్తోంది. -
శాంసంగ్ గెలాక్సీ ఏ72 ధర ఎంతంటే?
గెలాక్సీ ఏ72 అనే కొత్త స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 మొబైల్ 4జీ, 5జీ వెర్షన్లలో లభించనుంది. తాజా సమాచారం ప్రకారం గెలాక్సీ ఏ72 4జీ మొబైల్స్ SM-A725F, SM-A726B కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీనికి సంబందించిన కొన్ని ఫీచర్స్ కూడా బయటకి వచ్చాయి. గెలాక్సీ ఏ72 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇది 8జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీలో వెనకవైపు 4 కెమెరాలు తీసుకురానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ72 5జీ 6.7 అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లేతో ప్యాక్ చేసి క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 4జీ మోడల్ కూడా ఇదే స్పెసిఫికేషన్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 5జీ ధర 550 యూరోల నుండి 600యూరోల(సుమారు రూ.55-60 వేలు), అలాగే 4జీ వేరియంట్‌కు ధర 450-500(సుమారు రూ.45-50 వేలు) యూరోల మధ్య ఉండనుంది.(చదవండి: టెస్లా క్రిస్మస్ బహుమతి) -
మార్కెట్లోకి హువావే 5జీ మొబైల్స్
చైనా: ప్రముఖ టెక్ కంపెనీ హువావే నోవా 8 ప్రో, హువావే నోవా 8 స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు 5జీ స్మార్ట్ఫోన్లు 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఈ ఫోన్లు కీరిన్ 985 ప్రాసెసర్ చేత పనిచేస్తాయి. హువావే నోవా 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-హెచ్డి + డిస్ప్లే ఉంది. మరోవైపు, హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. లాంచ్‌కి ముందు చైనా టెలికాం సైట్లో హువావే నోవా 8 యొక్క ఫీచర్స్ లీక్ అయ్యాయి.(చదవండి: లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర) హువావే నోవా 8 ప్రో స్పెసిఫికేషన్లు హువావే నోవా 8 ప్రో హార్డ్‌వేర్ ఫ్రంట్‌లోని నోవా 8తో సమానంగా ఉంటుంది. కానీ డిస్ప్లే, బ్యాటరీ మరియు ఫ్రంట్ కెమెరాలో తేడాలు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ (నానో) హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల పూర్తి-హెచ్డి + ఒఎల్ఇడి డిస్ప్లే (1,236x2,676 పిక్సెల్స్) తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్10 ఆధారిత ఈఎంయుఐ 11తో నడుస్తుంది. 5జీ హ్యాండ్‌సెట్‌లో హిసిలికాన్ ఆక్టా-కోర్ కిరిన్ 985 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. హువావే నోవా 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 16 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా. హువావే నోవా 8ప్రో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, యుఎస్బి టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఇది 184 గ్రాముల బరువు ఉంటుంది. ధర సుమారు రూ.49,600. హువావే నోవా 8 ఫీచర్స్: డిస్ప్లే: 6.57 అంగుళాలు ప్రాసెసర్: హిసిలికాన్ కిరిన్ 985 ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్ రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ బ్యాటరీ కెపాసిటీ: 3800ఎంఏహెచ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 ధర: రూ.37,200 -
లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర
వన్‌ప్లస్ 9 సిరీస్ లో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ను సంస్థ 2021 తొలి త్రైమాసికంలో తీసుకు రాబోతున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోతో పాటు వన్‌ప్లస్ 9 లైట్ అనే మొబైల్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వన్‌ప్లస్ 9కి సంబందించిన ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. 91 మొబైల్స్ వెబ్ సైట్ తెలిపిన సమాచారం మేరకు వన్‌ప్లస్ 9 మొబైల్ లో కార్నర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్) వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా రాబోయే వన్‌ప్లస్ 9 ప్రో మొబైల్ 30 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొట్ట మొదటి వన్‌ప్లస్ మొబైల్ ఇదే కావచ్చు. వన్‌ప్లస్ 9 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వనిల్లా వన్‌ప్లస్ 9 కూడా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ వన్‌ప్లస్ 9 మొబైల్ లో కంటే వన్‌ప్లస్ 9 ప్రో మోడల్లో ప్రీమియం ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో రెండూ లైకా బ్రాండెడ్ కెమెరాలతో వస్తాయని గత నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 9 మొబైల్ లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 20ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపీ టెలిఫోటో కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ రెండు మొబైల్స్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ద్వారా పనిచేయనున్నాయి. అలాగే వన్‌ప్లస్ 9 లైట్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 లైట్ ధర 600 డాలర్లు(సుమారు రూ.44,200) కాగా వన్‌ప్లస్ 9 ధర 700-800 డాలర్లు(సుమారు 51-58 వేలు), వన్‌ప్లస్ 9 ధర సుమారు 60 వేల నుండి 70 వేల మధ్య ఉండనున్నట్లు సమాచారం. -
రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్
షియోమీ, రియల్ మీ సంస్థలు బడ్జెట్ ధరలో 5జీ మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పడు ఇదే తరహాలో శామ్సంగ్ కూడా బడ్జెట్ లో 5జీ మొబైల్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారతదేశం, ఇతర ఆగ్నేయాసియా దేశాల వంటి మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన శామ్సంగ్ గెలాక్సీ ఏ21కి తర్వాతి వెర్షన్ గా శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ 2021 రెండవ భాగంలో తీసుకురానునట్లు సమాచారం. దీని ధర రెండు లక్షల కొరియన్ వాంగ్లు(సుమారు రూ.13,300)గా నిర్ణయించారు. (చదవండి: 5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..) గెలాక్సీ ఏ22 5జీ కన్నా ముందు గెలాక్సీ ఏ32 5జీ మొబైల్ ని మార్కెట్లోకి తీసుకువస్తారని సమాచారం. కొత్త శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ హువావే, ఒప్పో, వివో, షియోమి వంటి కంపెనీ 5జీ మొబైల్స్ కీ పోటీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ తయారీ కోసం శాంసంగ్ జాయింట్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ మెథడ్(జేడీఎం) పద్ధతిని ఎంచుకున్నారు. అంటే ఈ మొబైల్ కి సంబందించిన రూపకల్పనలో ప్రధాన భాగాలు, కొన్ని స్పెసిఫికేషన్లను మాత్రమే శామ్సంగ్ రూపొందిస్తుంది. మిగతా డిజైన్, ప్రొడక్షన్ ప్రక్రియ మొత్తం అవుట్ సోర్స్ చూసుకుంటుంది. ఈ ఏడాది రవాణా చేసిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ఫోన్లలో 20-30 శాతం జేడీఎం పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేసినట్లు సమాచారం. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
జనవరిలో రానున్న ఐక్యూ 7 మొబైల్
చైనా: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ రాబోయే ఐక్యూ 7 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ చేయడానికి సిద్దమవుతుంది. ఈ ఏడాదిలో తీసుకొచ్చిన ఐక్యూ 5 సిరీస్ తదుపరి వెర్షన్ గా ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. అంతేకాకుండా అధికారిక గేమింగ్ మొబైల్ కూడా ఇదేనని ప్రకటించింది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఐక్యూ 7 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. దాని కింద ఐక్యూ బ్రాండింగ్ ఉండనున్నాయి. ఈ ఫోన్ వెనుకవైపు రెడ్, బ్లూ, బ్లాక్ రంగుల డిజైన్ కూడా ఉండనుంది. ఫ్లాగ్ షిప్ మొబైల్ స్పెసిఫికేషన్స్ తో ఇది విడుదల కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకు రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో 120వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా తీసుకురానున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని తీసుకు రానున్నట్లు ఒక టిప్ స్టార్ ప్రకటించారు. (చదవండి: 5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..) -
గూగుల్ 'కెమెరా గో'లో సరికొత్త ఫీచర్
గూగుల్ తన కెమెరా గో అప్లికేషన్లో హెచ్‌డిఆర్ ఫోటోలను తీయడానికి వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. "గూగుల్ కెమెరా గో అప్లికేషన్ ద్వారా ఇప్పుడు నాణ్యత గల ఫోటోలను తీసుకోవచ్చు. త్వరలో మరిన్నీ ఆండ్రాయిడ్ గో మొబైల్స్ కు ఈ హెచ్‌డిఆర్ సపోర్ట్ ఫీచర్ తీసుకురానున్నాము. దింతో ప్రతి ఒక్కరు రోజులో ఎప్పుడైనా మంచి ఫోటోలను తీసుకోవచ్చు" అని గూగుల్ ఒక ట్వీట్లో పేర్కొంది. కెమెరా గో అనేది పిక్సెల్ ఫోన్లలో లభించే గూగుల్ యొక్క ప్రధాన కెమెరా అప్లికేషన్. కెమెరా గో ఇతర గో అప్లికేషన్ మాదిరిగానే ఎంట్రీ లెవెల్,బడ్జెట్ ధర కలిగిన ఫోన్లను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చారు. కెమెరా గోని తక్కువ ర్యామ్, నిల్వ సామర్థ్యం గల మొబైల్స్ కోసం తీసుకొచ్చారు.(చదవండి: ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్స్టాగ్రామ్) కెమెరా గో అప్లికేషన్ 2020 మార్చిలో ప్రారంభించిన హెచ్ఎండి గ్లోబల్ యొక్క నోకియా 1.3 ఫోన్‌తో ప్రారంభమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్ మరియు ప్రీమియం ఫోన్లలో లభించే ఆధునిక కెమెరాలలో హెచ్‌డిఆర్ అనేది ఒక ఫీచర్. ఈ హెచ్‌డిఆర్ ఫీచర్ ద్వారా బడ్జెట్ మొబైల్స్ లో తీసుకునే క్వాలిటీతో ఫోటోలను తీసుకోవచ్చు. గూగుల్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. సాధారణ కెమెరా గల మొబైల్స్, హెచ్‌డిఆర్ ఫీచర్ గల మొబైల్స్ కి ఉన్న తేడా ఏంటో. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తున్న ఫోన్ల కోసం గూగుల్ కెమెరా గో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. -
వివో నుండి మరో బడ్జెట్ మొబైల్
చైనా: వివో చైనాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే ఈ మొబైల్ జూలైలో భారతదేశంలో లాంచ్ అయిన వివో వై30 యొక్క డౌన్‌గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాలో వివో వై 30 ధర 1,398యువాన్లు(సుమారు రూ.15,700)గా నిర్ణయించబడింది.(చదవండి: పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్) వివో వై 30 ఫీచర్స్: వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ పై నడుస్తుంది. ఇందులో పవర్‌వీఆర్ జీఇ8320 జీపీయును తీసుకొచ్చింది. దీనిలో 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మొబైల్ లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రెగ్యులర్ వివో వై 30 మాదిరిగానే వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్‌తో వస్తుంది. ఇది 720 x 1600 రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో వివో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ లో 13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8మెగాపిక్సల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్బి ఒటిజి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అందిస్తుంది. -
వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్
వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఐక్యూ యు 3ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల స్క్రీన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐక్యూ యు 3 5జీ మొబైల్ చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం డిసెంబర్ 18 నుండి సేల్ లో ఉంచింది. ఐక్యూ యు 3 గ్లో కలర్, టూ ఎర్లీ బ్లాక్ లభిస్తుంది. ఈ బ్రాండ్ చైనాలో వివోలో భాగంగా పనిచేస్తుంది, కానీ దేశంలో చైనా బ్రాండ్ల పట్ల పెరుగుతున్న ఆగ్రహం కారణంగా దీనిని స్వతంత్ర బ్రాండ్‌గా తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా సమాచారం లేదు. ఐక్యూ యు 3 ఫీచర్స్: ఐక్యూ యు3 మొబైల్ 6.58-అంగుళాల ఎల్సిడి స్క్రీన్‌ను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5 జి చిప్సెట్ ద్వారా 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఐక్యూ యు 3లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాతో ఎఫ్/1.79 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ /2.4 ఎపర్చరుతో ఉంటుంది. ఇది 4కేలో వీడియోలను రికార్డ్ చేయగలదు, 10x డిజిటల్ జూమ్ కలిగి ఉంటుంది. ఐక్యూ యు 3లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఐక్యూ యు 3 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికివస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు 1,498 యువాన్లు(సుమారు రూ.16,800), 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు సిఎన్‌వై 1,698 యువాన్లు(సుమారు రూ.19,000) ధరను నిర్ణయించారు. -
14వేలకే నోకియా 5.4 మొబైల్
హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో ఈ ఫోన్లు లభించనున్నాయి. నోకియా 5.4ను ఈ నెలాఖరులో(డిసెంబర్ 2020) కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియాలో 699 ఏఈడీ లేదా 190 డాలర్లు(సుమారు 14,000) ప్రారంభ ధరలో తీసుకురానున్నారు. ఇదే ధరలో మిగతా ప్రపంచ వ్యాప్తంగా 2021 జనవరి ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) నోకియా 5.4 ఫీచర్స్: పేరు: నోకియా 5.4 డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్ ఢీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ర్యామ్: 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రధాన కెమెరా: 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా సెల్ఫీ కెమెరా: 16ఎంపీ(f2.0) కనెక్టివిటీ: నానో సిమ్, జిఎస్ఎమ్/ఎల్‌టిఇ, బ్లూటూత్ ® 4.2, జిపిఎస్/ఎజిపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్సి బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, 10వాట్ ఛార్జర్ ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్™ 10( ఆండ్రాయిడ్ 11 సపోర్ట్) బరువు: 181 గ్రా. కలర్స్: పోలార్ నైట్, డస్క్ -
డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11
తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, షియోమీ ఎంఐ 11 మొబైల్ ని డిసెంబర్ 29న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఎంఐ 11 సరికొత్త క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని షియోమి సహ వ్యవస్థాపకుడు, సిఇఒ లీ జూన్ ఇప్పటికే ధృవీకరించారు. వీబోలో రెడ్మి ప్రొడక్ట్ డైరెక్టర్ వాంగ్ టెంగ్ థామస్ వెల్లడించిన కెమెరా శాంపిల్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ నెల చివర్లో ఎంఐ 11 ప్రారంభించనున్నట్లు గిజ్మో చైనా వెబ్ సైట్ షేర్ చేసిన నివేదిక ద్వారా తెలుస్తుంది. ఎంఐ 11 సిరీస్ మోడళ్లను మొదట చైనాలో లాంచ్ చేస్తారా లేదా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తారా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టతలేదు.(చదవండి: ఐఫోన్13లో టచ్ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్) ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 మొబైల్ లో 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురానున్నారు. అలాగే, సెల్ఫీ కోసం పంచ్ హోల్ కెమెరా తీసుకురానున్నారు. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. లీకైన ఫోటోల ప్రకారం.. మొబైల్ నీలం, వైట్ గ్రేడియంట్ కలర్ వేరియంట్లలో లభించనుంది. ఎంఐ 11లో వెనుక కెమెరాలో పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో రెండు పెద్ద కెమెరా టెలిఫోటో కెమెరా సెన్సార్లు, మూడవ కెమెరా మాక్రో కెమెరాతో రావచ్చు. ఈ మొబైల్ లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో QHD ప్లస్ ఏఎంఓఎల్ఈఢీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇప్పటికే మీ 10టీ ప్రోలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను తీసుకొచ్చారు. ఊహాగానాల ప్రకారం ఎంఐ 11 ధర 3,999 యువాన్లు(సుమారు రూ.44,984) నుండి 4,499యువాన్ల(రూ.50,610) మధ్య ఉండనుంది. అయితే ప్రో వెర్షన్ మాత్రం ర్యామ్, స్టోరేజ్ బట్టి 5,299 యువాన్ల నుండి 5,499 యువాన్ల మధ్య ఉండనుంది. -
ఐఫోన్13లో టచ్ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్
ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయ్యి కొద్దీ నెలలు అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13పై పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోన్ విడుదలకు ఏడాది సమయం ఉన్న తాజాగా ఐఫోన్13లో రాబోయే ఫీచర్స్ గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. ఇటీవల ఒక టిప్‌స్టర్ జాన్ ప్రాసెసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఐఫోన్ 13 సిరీస్‌లో టచ్ఐడి అనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సాంకేతికతను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, ఐఫోన్ 13 యొక్క టచ్ఐడి సెన్సార్ మునుపటిలాగా స్క్రీన్ దిగువన క్రింద కాకూండా ఈ సారి డిస్ప్లే కింద తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇదివరకే ఈ టెక్నాలజీని మీరు శామ్సంగ్, వివో, ఒప్పోతోపాటు ఇతర ఫోన్లలో చూసి ఉండవచ్చు. అలాగే కొత్త ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్‌లో ఇప్పటికే ఉన్న టెక్, పవర్ బటన్‌పై టచ్ఐడిని తీసుకురావడానికి అవకాశం ఉంది.(చదవండి: స్మార్ట్ఫోన్లతో జర జాగ్రత్త) -
బీ అలర్ట్; స్మార్ట్ఫోన్లతో నెగెటివ్ ఆలోచనలు
మీరు ప్రతి రోజు స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువత తమ స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువత ఫోన్లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు ఫోన్ పై నియంత్రణను కోల్పోతున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) బీఎంసీ సైకియాట్రీలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే పరిణామాలను తెలుసుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా 42,000 మంది యువత మీద పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. ఇందులో 23 శాతం మంది మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. వారు ఫోన్‌ను ఉపయోగించలేకుండా ఉండలేక పోవడం, సమయం విషయంలో నియంత్రణను కోల్పోవడం వంటి విషయాలను గమనించినట్లు తెలిపారు. మొబైల్ ని ఎక్కువగా వాడటం వల్ల ఒత్తిడికి గురిఅవ్వడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించ లేకపోవడం, కుటుంబాన్ని, బంధువులను పట్టించుకోకుండా ఏకాంతంగా ఉండటం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరినీ పట్టించుకోకుండా స్వార్థంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నెగెటివ్ ఆలోచనలు భాగా పెరుగుతునట్లు తెలుస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. మానసికంగా కుంగుబాటుకు గురిఅవుతూ ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తునట్లు నివేదికలో తేలాయి. వీటికి అన్నింటికీ మూలం స్మార్ట్‌ఫోన్ లేక వారు ఉపయోగించే యాప్స్ అనేది తెలియడం లేదు అని డాక్టర్ నికోలా కాల్క్ అన్నారు. అందుకోసమే పిల్లలు, యువకులు స్మార్ట్‌ఫోన్ వాడకం విషయంలో అవగాహన కల్పించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ ఫోన్లలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవాలి లేకపోతే వారి మానసిక ఆరోగ్యం, రోజువారీ పనితీరుపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి అని సహ రచయిత సమంతా సోహ్న్ హెచ్చరించారు. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త) -
ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్
ఒప్పో రెనో5 5జీ, ఒప్పో రెనో5 5జీ ప్రో స్మార్ట్ ఫోన్ లను చైనాలో విడుదల చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకురాలేదు. డిసెంబర్ 24న రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఒప్పో రెనో5 5జీలో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, ఒప్పో రెనో5 5జీ ప్రోలో మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ ని తీసుకొస్తున్నారు. ఈ రెండు మొబైల్ లో కూడా 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 64వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మొబైల్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు ఫోన్లు డిసెంబర్ 18న చైనాలో ఫస్ట్ సేల్ కి వస్తాయి. ఒప్పో రెనో5 5జీ ఫీచర్స్ ఒప్పో రెనో 5 6.00-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 172 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 30,400, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.33,800. ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్ ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1000ప్లస్ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 38,300, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.42,800. భారతదేశంలో ఎప్పుడు తీసుకు వస్తారో తెలియదు. -
షియోమీ మరో సంచలనం
గత కొన్ని నెలలుగా మొబైల్ పరిశ్రమలో పెద్ద పెద్ద కంపెనీలు రోలబుల్ ఫోన్ తీసుకోని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో షియోమీ కూడా చేరబోతోంది. త్వరలో షియోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ లవర్స్ కి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నపటికీ, దీనిని భారీ ఎత్తున తీసుకురావడానికి షియోమీ ప్రయత్నిస్తుంది. సాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది సాంసంగ్. ఎల్జీ ఇదివరకే డ్యూయెల్ డిస్‌ప్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. త్వరలో మరో మోడల్ ని కూడా తీసుకురాబోతుంది. (చదవండి: డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) టిసిఎల్ మరియు ఒప్పో తీసుకొస్తున్ రోలబుల్ డిస్ప్లే ఫోన్ల మాదిరిగానే షియోమి ఫోన్ కూడా అలాంటి డిజైన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. షియోమీ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ మరియు ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో రోలబుల్ ఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పేటెంట్ లో చూపినట్లుగా దీనిని రోల్ చేస్తే స్మార్ట్‌ఫోన్ లాగా కనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అకా కాన్సెప్ట్ క్రియేటర్ షియోమీ రోలబుల్ పేటెంట్ల ఇమేజెస్ సహాయంతో షావోమీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్ రెండర్ క్రియేట్ చేశాడు. ఇది చూడటానికి మి మిక్స్ ఆల్ఫా కాన్సెప్ట్ లాగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ డిజైన్ కేవలం స్కెచ్ మాత్రమే. డివైజ్ తయారైన తర్వాత దీనికి భిన్నంగా కూడా ఉండొచ్చు. ఈ మొబైల్ వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివరలో రావచ్చు. -
2021లో రాబోయే షియోమీ ఫోన్లు ఇవే
షియోమీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ లను తీసుకొస్తుంది. ఒక్కోసారి నెలకు 1, 2 ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. అలాగే 2021లో కూడా మరిన్నీ ఫోన్లను తీసుకురావడానికి షియోమీ సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం షియోమీ మనదేశంలో రెడ్మి బ్రాండ్ క్రింద రెడ్మి 10 సిరీస్, రెడ్మి నోట్ 10 సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే పోకో విషయానికి వస్తే పోకో ఎం 3 ప్రో, పోకో ఎమ్ 3 ప్రో మరియు పోకో ఎక్స్ 4, పోకో ఎక్స్ 5 ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 2021లో రాబోయే పూర్తీ షియోమీ ఫోన్ల జాబితా ఈ క్రింద ఉంది. (చదవండి: వోడాఫోన్ ఐడియా రికార్డు) షియోమీ ఎంఐ 11, ఎంఐ 11 ప్రో షియోమీ ఎంఐ 11 సిరీస్ లో రాబోయే మొబైల్ జనవరిలో వస్తుందని సమాచారం. దీనిలో ఇటీవల లీకైన సమాచారం ప్రకారం 108 ఎంపీ ప్రధాన కెమెరా, కర్వేడ్ డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లను తీసుకురానున్నారు. ఎంఐ 11 ప్రోలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ నుండి 192 మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం. పోకో ఎఫ్ 2 పోకో ఎఫ్ 2 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. పోకో ఎఫ్ 1 తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. పోకో ఈ మధ్యే ఎన్నో ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది. పోకో ఎఫ్ 2 ఫీచర్ల గురుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ రెడ్ మీ నోట్ సిరీస్‌లో రానున్న తర్వాతి వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయని సమాచారం. రెడ్మి నోట్ 10 తక్కువలో 108 ఎంపి కెమెరా ఫోన్‌గా మారవచ్చు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ కే 40/ పోకో ఎక్స్ 4 రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 775 5జీ ప్రాసెసర్ తో రావచ్చు. కొన్ని మార్కెట్లలో రెడ్ మీ బ్రాండింగ్, కొన్ని మార్కెట్లలో పోకో ఎక్స్4గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్మి కే 40 ప్రో/ పోకో ఎఫ్ 3ప్రో రెడ్మి కే 30 ప్రో లేదా పోకో ఎక్స్ 2 ప్రో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో భారతదేశానికి రావచ్చు. రెడ్మి కె 40 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మల్టీ కెమెరా సెటప్, 12 జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీ తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్మి 10, రెడ్మి 10 ప్రైమ్, రెడ్మి 10 పవర్, రెడ్మి 10 ఐ ఇవి రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో లాంచ్ కానున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ తర్వాతి వెర్షన్లుగా రెడ్ మీ 10 సిరీస్ రానుంది. వీటి ధర వచ్చేసి 7,000 నుండి రూ.12,000 ఉండనున్నట్లు సమాచారం. 2021 మొదటి త్రైమాసికంలో మొదలయ్యి ఏడాది పొడవునా రెడ్మి 10 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. పోకో ఎం3, పోకో ఎం 3 ప్రో పోకో ఎం3 ఇప్పటికే లాంచ్ అయింది. కొన్ని దేశాల్లో ఈ ఫోన్ పోకో ఎం3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. పోకో ఎం 3 రియల్మే నార్జో 20 ఎ, రియల్మే సి 15 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వంటి వాటికీ పోటీగా తీసుకొచ్చింది. పోకో ఎం3 స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. పోకో ఎం3 ఇండియా ధర బడ్జెట్ కేటగిరీ రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. పోకో ఎం 3 ప్రో 15,000 కేటగిరీలో మిడ్-బడ్జెట్ రేంజ్ లో తీసుకురానుంది. ఎంఐ నోట్ 10 లైట్/ఎంఐ 10ఐ ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2021 ప్రారంభంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎంఐ నోట్ 10 లైట్ సెప్టెంబర్‌లో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీగా లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఎంఐ 10ఐగా లాంచ్ కానుందని తెలుస్తోంది. -
మోటోరోలా బడ్జెట్ మొబైల్ వచ్చేసింది
మోటోరోలా మొబైల్ వినియోగదారుల కోసం మరో బడ్జెట్ మొబైల్ ని తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మోటో జీ9కి తదుపరి మోడల్ గా మోటో జీ9 పవర్ తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ మొబైల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపి ట్రిపుల్ కెమెరాలు మరియు స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్ తో 6.8-అంగుళాల హెచ్డి + డిస్ప్లేను తీసుకొచ్చారు. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ లో మొబైల్స్ పై భారీ తగ్గింపు) మోటో జీ9 పవర్ ఫీచర్స్ & ధర: మోటో జీ9 పవర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. మోటో జీ9 పవర్ 6.8-అంగుళాల హెచ్ డీ ప్లస్ (720 x 1,640 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఆన్‌బోర్డ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించడం ద్వారా 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ 9 పవర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ కెమెరా ఎఫ్/1.79 లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్ వెనుక-ఫింగర్ ప్రింట్ మౌంటెడ్ స్కానర్ మరియు 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తుంది. కనెక్టివిటీ కోసం మోటో జీ 9 పవర్ 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంది. భారతదేశంలో మోటో జీ9 పవర్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .11,999. ఎలక్ట్రిక్ వయొలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 15వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మొబైల్స్ బొనాంజా సేల్ ని తీసుకొచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ద్వారా కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లను ఉత్తమ ధరకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో షియోమి, రియల్మీ, ఆసుస్, శామ్సంగ్, పోకో, ఒప్పో, ఆపిల్ మరియు ఇతర ప్రముఖ పేర్ల బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్ ని తీసుకొచ్చింది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,750 తగ్గింపు లభించనుంది.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ సందర్బంగా షియోమీ మీ 10టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 4, ఆసుస్ రాగ్ ఫోన్ 3, మోటో రాజర్(4జీ వెర్షన్) వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించననున్నారు. షియోమి మీ 10టీ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ సేల్ సందర్భంగా రూ.35,999(అసలు ధర రూ.39,999)కి లభిస్తుంది. అలాగే, ఆసుస్ రోగ్ ఫోన్ 3 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 44,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్మీ 9ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది. రియల్ మీ నార్జో 20 ప్రోపై కూడా రూ.1,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది. ఇక మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రూ.15,499(అసలు ధర రూ.19,999)కి లభిస్తుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ మరియు ఇఎంఐ ఆఫర్లను కూడా పొందవచ్చు. -
మార్కెట్ లోకి మరో బడ్జెట్ గేమింగ్ ఫోన్
చైనాకు చెందిన ట్రాన్స్షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో బ్రాండ్ ఇటీవల టెక్నో పోవా సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా గేమింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 128జీబీ. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ దేశంలోని ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లైన షియోమికి చెందిన రెడ్మి 9 మరియు రియల్మీ నార్జో 20లతో పోటీ పడగలదని ఆశిస్తోంది. ఈ మొబైల్ లో క్వాడ్ రియర్ కెమెరా6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్‌తో వచ్చింది. (చదవండి: 600 మెగా పిక్సెల్ కెమెరాతో శామ్సంగ్) టెక్నో పోవా ఫీచర్స్ ఇందులో 6.8 అంగుళాల హెచ్డీ+డాట్-ఇన్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 4జీబీ + 6 జీబీ ర్యామ్, 64జీబీ+128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. టెక్నో పోవాలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. దీంతో పాటు మరో ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది. భారతదేశంలో టెక్నో పోవా ధర రూ. బేస్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 9,999 ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,999. ఈ ఫోన్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ఫ్లిప్ కార్ట్ లో మొదటి సేల్ కు రానుంది. -
11వేలలో 5జీ ఫోన్
11 వేలలో 5జీ మొబైల్ ను చైనాలో విడుదల చేసింది జెడ్‌టీఈ కంపెనీ. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్‌ఫోన్ ను 2 డిసెంబర్ 2020న విడుదల చేసింది. ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర 999 చైనా యువాన్లు (సుమారు రూ.11,200), ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. (చదవండి: భారత్‌లో షియోమీని బ్యాన్ చేయండి) జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్పెసిఫికేషన్లు జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫోన్ 6.52-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 4జీబీ ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించగల 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ తో వస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంతో మిఫావర్ 10 ఆపరేటింగ్ సిస్టంపై నడవనుంది. ఇది 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపున ఉన్న జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను f/1.79 ఎపర్చర్‌తో, f/2.2 ఎపర్చర్‌తో రెండవ 8 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో మూడవ 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇది సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ గ్రే, ఫాంటసీ బ్లూ మరియు స్పేస్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధరను 999 యూరోలుగా(సుమారు రూ.11,200) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యూరోలుగా(సుమారు రూ.15,700) నిర్ణయించారు. -
జనవరిలో రానున్న మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
షియోమీ తన మీ 10 సిరీస్ తర్వాత రాబోయే సిరీస్ ను త్వరలో తీసుకొస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీ 11 సిరీస్ తో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ అవుతాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, షియోమీ 2021 జనవరిలో మీ 11 మరియు మీ 11 ప్రోలను తీసుకురావాలని యోచిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ రాబోయే ఫోన్లలో మీ 11, మీ 11 ప్రో ఫోన్లు ఒకటని తెలుస్తుంది.(చదవండి: నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్) షియోమీ మీ 10 ప్రో అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న మీ 11 ప్రో మొబైల్ WQHD + ప్యానెల్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో రాబోతుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ తో రాబోయే మొట్టమొదటి చైనీస్ ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది. స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ కంటే ఇది 20 శాతం ఎక్కువ పవర్ ఎఫిసియెంట్, 10 శాతం ఎక్కువ శక్తివంతమైనది. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త స్నాప్‌డ్రాగన్ క్వాల్కామ్ చిప్సెట్ ఆపిల్ యొక్క A14 బయోనిక్ చిప్సెట్ కంటే వేగంగా పనిచేస్తుందని సమాచారం. ఇందులో ఉండే ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ నుండి 192-మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. ఇతర లెన్స్‌లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అప్‌గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని గురుంచి షియోమీ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ మీ 11 సిరీస్ వచ్చే ఏడాది జనవరి నాటికి కంపెనీ చైనాలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట దీని చైనా మార్కెట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. షియోమీ మీ 11 సిరీస్ ను యుఎస్‌లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 30 సిరీస్‌ను జనవరిలో లాంచ్ చేయడానికి ముందే తీసుకురావాలని చూస్తుంది. -
టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. మొబైల్ వినియోగదారులు వరుసగా గత మూడు వారలుగా పోకో ఎమ్3 మొబైల్ గురుంచి తెగ సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం కొత్తగా వచ్చిన పోకో ఎమ్3 ఈ వారంలో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత షియోమీ రెడ్మి నోట్ 9 4 జీ రెండవ స్థానంలో నిలిచింది.(చదవండి: గతవారం టాప్ -10 ట్రేండింగ్ ఫోన్స్) అక్టోబర్ నెలలో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ గత వారం కంటే ఒక స్థానం వెనుకబడి మూడవ స్థానంలో నిలిచింది. గతంలో నాల్గవ స్థానంలో ఉన్న పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్సి మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకుంది. షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో గత వారం 6వ స్థానంలో నిలువగా ఈ వారంలో 5వ స్థానానికి ఎగబాకింది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 51 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయింది. కొత్తగా రాబోయే రెడ్మి నోట్ 9 ప్రో 5 జీ ఏడవ స్థానంలో నిలిచింది. వరుసగా తర్వాత స్థానాలలో కొత్తగా వస్తున్న శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్, గెలాక్సీ A21, గెలాక్సీ A02ఎస్ ఫోన్లు 8, 9, 10 స్థానాలలో నిలిచాయి. ఈ వారంలో అత్యధికంగా వెతుకుతున్న పది ఫోన్లలో శామ్సంగ్(4), షియోమీ(4), ఆపిల్(2) సంస్థలవే కావడం విశేషం. ర్యాంక్ 1: షియోమి పోకో ఎం3 ర్యాంక్ 2: షియోమి రెడ్మి నోట్ 9 4జీ ర్యాంక్ 3: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ర్యాంక్ 4: షియోమి పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్సి ర్యాంక్ 5: షియోమి రెడ్మి నోట్ 9 ప్రో ర్యాంక్ 6: శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ర్యాంక్ 7: రెడ్మి నోట్ 9 ప్రో 5 జీ ర్యాంక్ 8: శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్ ర్యాంక్ 9: శామ్సంగ్ గెలాక్సీ A21 ర్యాంక్ 10: శామ్సంగ్ గెలాక్సీ A02ఎస్ -
వచ్చే వారంలో టెక్నో పోవా మొబైల్
టెక్నో స్మార్ట్ ఫోన్ కంపెనీ మనదేశంలో పోవా అనే కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో మొదటి ఫోన్ అయిన టెక్నో పోవా గేమింగ్ ఫోన్‌గా రానుంది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 4న భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. టెక్నో పోవా మూడు రంగులలో లభిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ(రూ.10,800)గా ఉండనున్నట్లు సమాచారం. (చదవండి: డిసెంబర్ లో లాంచ్ కానున్న వివో వీ20 ప్రో) టెక్నో పోవా ఫీచర్స్ ఇందులో 6.7 అంగుళాల హెచ్డీ+ డాట్-ఇన్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. టెక్నో పోవాలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. దీంతో పాటు మరో ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది.