కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుని ఎక్కువ ధర కారణంగా కొనలేకపోయినవారికి ఇది సరైన సమయం. ఎందుకంటే గతేడాది విడుదలైన పలు టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు ప్రస్తుతం బాగా తగ్గాయి. వన్‌ప్లస్ (OnePlus), షావోమీ (Xiaomi), మోటరోలా (Motorola) సహా అనేక మధ్య శ్రేణి ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇటీవల తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి.
(బిజినెస్ ‘మోడల్’: 24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!)
షావోమీ (Xiaomi) 12 Pro
రెండు వేరియంట్‌లలో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 10,000 తగ్గింది . గత విడుదలైన ఈ ఫోన్ 8GB వర్షన్‌ను ఇప్పుడు రూ. 52,999లకు, 12GB వెర్షన్‌ను రూ. 54,999లకు కొనుగోలు చేయవచ్చు . కోర్చర్ బ్లూ (Couture Blue), నాయిర్ బ్లాక్ (Noir Black), ఒపేరా మావ్ (Opera Mauve) రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 50MP రియర్ ట్రిపుల్ కెమెరా, 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, 4600mAh బ్యాటరీ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు.
వన్‌ప్లస్ (OnePlus) 10R
గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రెండోసారి తగ్గింది. మొదటి సారి రూ.4,000 తగ్గగా ఇప్పుడు రూ. 3,000 తగ్గింది. ప్రారంభ ధర తగ్గింపు తర్వాత 8GB+128GB (80W) వేరియంట్ ధర రూ. 34,999 ఉండగా ఇప్పుడు రూ. 31,999లకు అందుబాటులో ఉంది. 12GB+256GB (80W) ఫోన్ ధర అప్పుడు రూ. 38,999 కాగా ఇప్పుడు రూ. 35,999. ఇక 12GB+256GB (150W) వేరియంట్ ధర అప్పుడు రూ. 39,999 ఉండగా ప్రస్తుతం రూ.36,999లకు లభిస్తోంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX చిప్‌సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ ర్యామ్ గరిష్టంగా 12 GB. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఆక్సిజన్‌ఓఎస్ 13 ఓవర్‌లేతో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
షావోమీ (Xiaomi) 11 Lite NE 5G
2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై రూ.3,000 ధర తగ్గింది. స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB వెర్షన్‌లను ప్రస్తుతం వరుసగా రూ. 26,999లకు, రూ. 28,999లకు సొంతం చేసుకోవచ్చు . ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ డాజిల్, జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 4250mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
మోటో ఎడ్జ్ 30
ఈ స్మార్ట్‌ఫోన్ 2021లో రెండు వేరియంట్‌లలో మార్కెట్‌లోకి వచ్చింది. 6GB+128GB, 8GB+128GB వేరియంట్ల ధరలు గతంలో వరుసగా రూ.27,999, రూ.29,999లుగా ఉండేవి. తగ్గింపు తర్వాత 6GB వెర్షన్ రూ. 24,999లకు, 8GB వేరియంట్ రూ.26,999లకే లభిస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ చిప్‌సెట్, 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 4020mAh బ్యాటరీ ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది.
మోటో G72
గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999. దీనిపై రూ. 3,000 తగ్గింపు ఉంది. అంటే రూ. 15,999లకే లభిస్తుంది. మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ MediaTek Helio G99 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment