drop
-
తోటల్లోనే టమాటా
పలమనేరు: మార్కెట్లో టమాటా ధర పడిపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. ఓ పక్క ఎగుమతులు లేకపోవడం, మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. రైతుకు మిగులుతున్నది పంట పెట్టుబడికి తెచి్చన అప్పులే. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో రైతులకు పంట సాగు ఖర్చులు కూడా రావడంలేదు. స్థానిక టమాటా మార్కెట్లో సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 మాత్రమే ఉంది.సగటు ధర బాక్సుకు రూ.180గా ఉంది. దీంతో పంట కోసిన కూలీల డబ్బు కూడా రావడంలేదని, కోసి నష్టపోయేకంటే తోటల్లోనే వదిలేయడం మేలన్న నిర్వేదంతో రైతులు పంటను కోయకుండా వదిలిపెట్టారు. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో టమాటా సీజన్ ఏడాదంతా ఉంటుంది. ప్రస్తుతం 9 వేల హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. 2,58,888 టన్నులు దిగుబడి ఉంటుందని అంచనా. ఎక్కువగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటా కొనుగోలు చేస్తుంటారు.అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లోనే సాగు పెరిగి, అక్కడి మార్కెట్లకు సరుకు భారీగా వస్తోంది. దీంతో అక్కడి వ్యాపారులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లి రావడంలేదు. ఎగుమతులు లేక ఇక్కడ ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు వచి్చన కాస్త పంటను కూడా వ్యాపారులు, మధ్యవర్తులు అతి తక్కువ ధరకు కొని, బహిరంగ మార్కెట్లో అతి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రైతుకు మిగిలేదేమీ లేదు ఎకరా పంట పండించడానికి రైతుకు రూ. 1.20 లక్షలు ఖర్చవుతుంది. ఎకరాకు ప్రస్తుతం 500 నుంచి 600 బాక్సుల (బాక్సుకి 15 కిలోలు) దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఉన్న రేటు కనీసం రూ. 160 నుంచి గరిష్టంగా రూ. 200 మాత్రమే ఉంది. సరాసరి ధర రూ.180 వేసుకున్నా రైతుకు రూ. లక్ష నుంచి రూ.1,08,000కి మించి రావడంలేదు. ఇక్కడే రైతుకు కనీసంగా రూ.12 వేలు నష్టం వస్తోంది. రైతు కుటుంబమంతా కష్టపడి పంటకు నీరందించి సస్యరక్షణ చర్యలు చేపట్టి వారి కూలీని లెక్కకడితే అతనికి మిగిలేది అప్పులే. దీంతో కోత ఖర్చులు కూడా వృథాయేనన్న నిర్వేదంతో రైతులు పంటను చెట్టు మీదే వదిలేస్తున్నారు. ఎకరా సాగుకు అయ్యే ఖర్చు ఇలా..ఎకరా టమాటా సాగు కోసం భూమి దున్నటం, నర్సరి నుంచి మొక్కల కొనుగోలు (ఎకరాకు 8 వేల మొలకలు) రూ.8 వేలు అవుతుంది. టమోట స్టిక్‌లు ఎకరాకు 1200. ఒక్కోటి రూ.20 చొప్పున రూ.24 వేలు వీటికి ఖర్చవుతుంది. సేంద్రియ ఎరువు పది లోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు కలిపి రూ.27వేలు అవుతాయి. క్రిమి సంహారక మందులు రూ.10 వేలు. కూలీల ఖర్చు రూ.15 వేలు. ఇలా ఎకరా పంట సాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.84 వేలు. పంట వడిగేలోపు తోటలో కాయలు కోసేందుకు కూలీ, మార్కెట్‌కు రవాణ, తదితరాల ఖర్చు మరో రూ.36 వేలు అవుతోంది. మొత్తం కలసి రూ.1.20 లక్షలు అవుతుంది.బయటి నుంచి వ్యాపారులు వస్తేనే ధర పెరుగుతుంది..మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంలేదు. దీంతో సరుకు మిగిలిపోతోంది. ధరలు తగ్గిపోయాయి. కనీసం బాక్సు టమాటా ధర రూ.300 ఉంటే తప్ప రైతుకు మిగిలేదేమీ ఉండదు. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకులు, పలమనేరు -
ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రాణం తీసిన పొగమంచు! బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్రామ్పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. -
నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చీఫ్ మీ ఫెంగ్ మీడియాకు తెలిపారు. నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్ -
అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..
కొత్త స్మార్ట్ఫోన్లు కొనాలనుకుని ఎక్కువ ధర కారణంగా కొనలేకపోయినవారికి ఇది సరైన సమయం. ఎందుకంటే గతేడాది విడుదలైన పలు టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ల ధరలు ప్రస్తుతం బాగా తగ్గాయి. వన్‌ప్లస్ (OnePlus), షావోమీ (Xiaomi), మోటరోలా (Motorola) సహా అనేక మధ్య శ్రేణి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇటీవల తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. (బిజినెస్ ‘మోడల్’: 24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!) షావోమీ (Xiaomi) 12 Pro రెండు వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 10,000 తగ్గింది . గత విడుదలైన ఈ ఫోన్ 8GB వర్షన్‌ను ఇప్పుడు రూ. 52,999లకు, 12GB వెర్షన్‌ను రూ. 54,999లకు కొనుగోలు చేయవచ్చు . కోర్చర్ బ్లూ (Couture Blue), నాయిర్ బ్లాక్ (Noir Black), ఒపేరా మావ్ (Opera Mauve) రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 50MP రియర్ ట్రిపుల్ కెమెరా, 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, 4600mAh బ్యాటరీ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు. వన్‌ప్లస్ (OnePlus) 10R గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రెండోసారి తగ్గింది. మొదటి సారి రూ.4,000 తగ్గగా ఇప్పుడు రూ. 3,000 తగ్గింది. ప్రారంభ ధర తగ్గింపు తర్వాత 8GB+128GB (80W) వేరియంట్ ధర రూ. 34,999 ఉండగా ఇప్పుడు రూ. 31,999లకు అందుబాటులో ఉంది. 12GB+256GB (80W) ఫోన్ ధర అప్పుడు రూ. 38,999 కాగా ఇప్పుడు రూ. 35,999. ఇక 12GB+256GB (150W) వేరియంట్ ధర అప్పుడు రూ. 39,999 ఉండగా ప్రస్తుతం రూ.36,999లకు లభిస్తోంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX చిప్సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ ర్యామ్ గరిష్టంగా 12 GB. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఆక్సిజన్ఓఎస్ 13 ఓవర్లేతో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. షావోమీ (Xiaomi) 11 Lite NE 5G 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై రూ.3,000 ధర తగ్గింది. స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB వెర్షన్లను ప్రస్తుతం వరుసగా రూ. 26,999లకు, రూ. 28,999లకు సొంతం చేసుకోవచ్చు . ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ డాజిల్, జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 4250mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. మోటో ఎడ్జ్ 30 ఈ స్మార్ట్‌ఫోన్ 2021లో రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. 6GB+128GB, 8GB+128GB వేరియంట్ల ధరలు గతంలో వరుసగా రూ.27,999, రూ.29,999లుగా ఉండేవి. తగ్గింపు తర్వాత 6GB వెర్షన్ రూ. 24,999లకు, 8GB వేరియంట్ రూ.26,999లకే లభిస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ చిప్సెట్, 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 4020mAh బ్యాటరీ ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. మోటో G72 గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999. దీనిపై రూ. 3,000 తగ్గింపు ఉంది. అంటే రూ. 15,999లకే లభిస్తుంది. మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ MediaTek Helio G99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) -
ఉసూరుమనిపించిన వర్ల్‌పూల్: నికర లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో ప్రముఖ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియా సెప్టెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 88 శాతం పడిపోయి రూ.49 కోట్లకు పరిమితమైంది. ఒకవైపు కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావం ఉండగా, మరోవైపు క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఏకీకృత లాభం చూపించడం ఈ వ్యత్యాసానికి కారణమని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.413 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.1,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,607 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదు కాలేదు. కంపెనీ వ్యయాలు 3 శాతం పెరిగి రూ.1,567 కోట్లకు చేరాయి. ‘‘నికర లాభం తగ్గడానికి ప్రధానంగా కమోడిటీల (తయారీలో వినియోగించే) ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణం. అయితే తయారీ పరంగా కొన్ని చర్యలు తీసుకోవడం, ధరలు పెంచడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించాం. ఎలికా ఇండియా కొనుగోలు అనంతరం కంపెనీ సబ్సిడరీగా మారింది. భారత అకౌంటింగ్ ప్రమాణాల మేరకు ఎలికా ఇండియాలో మా వాటాల పారదర్శక విలువ ఆధారంగా, రూ.324 కోట్ల లాభాన్ని గతేడాది సెప్టెంబర్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ ఫలితాల్లో గుర్తించాం. ఇది మినహాయించి చూస్తే నికర లాభంలో క్షీణత 45 శాతమే ఉంటుంది’’ అని కంపెనీ తెలిపింది. 88 శాతం పడిపోయిన నికర లాభం -
భారీగా క్షీణించిన వెండి, బంగారం ధరలు, కారణం ఏమిటంటే
సాక్షి,ముంబై: ఇటీవలి కాలంలో ఆకాశానికి చేరిన బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో దిగి వస్తున్నాయి. బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా మంగళవారం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు ఏడు రోజుల కనిష్టానికి చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 52,760 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 1500 రూపాయలు క్షీణించి 61,500గా ఉంది. దేశీయ మార్కెట్లలో మే నెల అంతా వెండి బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన పసిడి ధర ఈ రెండు రోజుల్లో రూ.1300 మేర తగ్గడం విశేషం. అటు ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి10 గ్రాముల ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.50,445కి చేరుకుంది. వెండి ధరలు కూడి ఇద్దే బాట పట్టాయి. జూలై ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి కిలోకు రూ. 59,867 వద్దకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును దాదాపు 50 బీపీఎస్ పాయింట్లు పెంచననుందని ఇదిడాలర్కు మరింత బలమని పెట్టబడిదారులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకోసమే వడ్డీ రేటును పెంచనుందని అంచనా. ఇది పసిడి ధరలకు నెగిటివ్‌గా ఉంటుందని, ఈ స్థాయిలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో మాంద్యం భయాలు, రికార్డు స్థాయికి బలపడుతున్న డాలరు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు తాజా కోవిడ్ ఆంక్షలతో గ్లోబల్‌గా ఆయిల్ ధరలు లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. గత సెషన్లో 78.03 వద్ద స్థిరపడిన దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో 78.02 వద్ద ప్రారంభమై 77.98 వద్ద ముగిసింది. ఇక డాలర్ 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అటు స్టాక్మార్కెట్లో సోమవారం నాటి బ్లడ్ బాత్ ఛాయలు మంగళవారం కూడా కనిపించాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడిన సూచీలు చివరకు కనీస మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. -
గుడ్‌న్యూస్ : భారీగా దిగివచ్చిన బంగారం
ముంబై : బంగారం ధరలు గత మూడురోజుల్లో మంగళవారం రెండోసారి భారీగా దిగివచ్చాయి.అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 2392 రూపాయలు తగ్గి 52,554 రూపాయలకు పతనమైంది. ఇక కిలో వెండి ఏకంగా 5080 రూపాయలు తగ్గుముఖం పట్టి 70,314 రూపాయలకు దిగివచ్చింది. డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. ఇక అమెరికాలో ఆర్థిక ఉద్దీపన ప్రణాళిక పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతోనూ పసిడి కొనుగోళ్లను ప్రభావితం చేసింది. దీంతో స్పాట్‌గోల్డ్ ఔన్స్ ధర 2021 డాలర్లకు పడిపోయింది. అమెరికన్ డాలర్ కోలుకుంటే బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడతాయని, బంగారంలో తాజా పెట్టుబడులపై వేచిచూసే ధోరణి అవలంభించాలని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక కోవిడ్-19 కేసుల పెరుగుదలతో ఈ ఏడాది బంగారం ధరలు 35 శాతం పెరిగాయి. చదవండి : పసిడి ఎఫెక్ట్ : రూ . 1500 కోట్ల ఆదాయం -
వణుకుతున్న రాష్ట్రం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి–టీలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నధరి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సహా ఆ జిల్లాలోని రాంనగర్, కొమురంభీం జిల్లా లింగాపూర్, సంగారెడ్డి జిల్లా అలగోల్లో 4 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, మెదక్, వరంగల్ రూరల్ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
చలి చంపేస్తోంది!
న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: చలి గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీస్తాయి. తెలంగాణ, ఏపీలలో పొడి వాతావరణం ఉండటం వల్ల ఆ గాలుల ప్రభావం తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఏడాది ఇలా నాలుగైదుసార్లు జరుగుతుం ది. గతవారంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తే, ఇప్పుడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి దుప్పట్లో ఉత్తర భారతం ఉత్తరభారతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఒకట్రెండు రోజుల్లో రెండు డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో కూడా నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఇలా సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియల్ నమోదైంది. తెలంగాణలో పొడి వాతావరణం ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వణుకుతున్న హైదరాబాద్ వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ గజగజలాడుతోంది. మంగళవారం కనిష్టంగా 16.3 డిగ్రీలు, గరిష్టంగా 31.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల మూడురోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వీస్తోన్న శీతలగాలులు వృద్ధులు, రోగులు, చిన్నారులను గజగజలాడిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ‘సాక్షి’కి తెలిపారు. -
రైతుల ఆందోళన
నారాయణఖేడ్: కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆశయంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అధికారులు కుంటిసాకులతో కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తూ.. క్రవారం నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని మార్కెట్ యార్డు వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. నారాయణఖేడ్–హైదరాబాద్ రాహదారిపై రైతులు బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మినుములు కొనుగోలు చేసేందుకు నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదన్నారు. పెసర్లు, మినుములు కొనుగోళ్లకు ఒకే అధికారిని నియమించారన్నారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆరోపించారు. నిబందనల ప్రకారం 12 శాతంలోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలుపుతున్నప్పటికీ కొందరి రైతుల నుంచి అధిక శాతం తేమ ఉన్నా కొనుగోలు చేశారని కంగ్టికి చెందిన రైతు భూంరెడ్డి, ముబారక్‌పూర్‌కు చెందిన రైతు రాములు, చుక్కల్‌తీర్థ్‌కు చెందిన రైతు దిగంబర్‌రావు ఆరోపించారు. మార్కెట్ యార్డు వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. టోకెన్ల ఆధారంగా అర్హులైన రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఆర్ఐ నారాయణ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. పెసర్లను తేమ శాతం అధికంగా ఉందని కొనుగోలు చేయకపోవడంతో మనూరు మండలం దుదగొండ గ్రామానికి చెందిన రైతు దావిద్ కంట తడిపెడుతూ ఆటోలో తీసుకెళ్లాడు. రైతుల ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్యం సంఘీభావం తెలిపారు. -
డ్రాప్ పేరుతో నిలువు దోపిడీ
యశవంతపుర: డ్రాప్ పేరుతో దుండగులు ఓ వ్యక్తిని నిలువునా దోచుకున్నారు. ఈఘటన మహాలక్ష్మి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. లగ్గేరికి చెందిన సంతోష్ అనే వ్యక్తి దేవాలయానికి వెళ్లేందుకు మహాలక్ష్మి లేఔట్ వద్ద బస్సు కోసం వేచి ఉన్నాడు.ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు డ్రాప్ ఇస్తామని సంతోష్‌ను వాహనంలో ఎక్కించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు అతన్ని వాహనంలోనే తిప్పారు. హెబ్బాళ సమీపంలో సంతోష్‌ను చాకుతో బెందిరించి సెల్‌ఫోన్, ఎటీఎం కార్డు లాక్కున్నారు. పిన్ నంబర్ తెలుసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అతని ఖాతానుంచి రూ. 14వేలు డ్రా చేసి మార్గం మధ్యలో కిందకు నెట్టేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భారీగా పడిపోతున్న ఈ కార్ల రీసేల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జిఎం) భారతీయ కార్ల మార్కెట్ నుంచి నిష్క్రమించాలన్న ప్రకటన కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా రీసేల్ మార్కెట్ లో షెవ్రోలె కార్ల ధరలు భారీగా పడిపోయాయి. గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు పడిపోతున్నాయని, ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం భారతదేశ దేశీయ విక్రయ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రధాన ప్రకటన చేసింది జినరల్ మోటార్. దేశీయ విఫణిలో నిరంతర నష్టాలు, చిన్న మార్కెట్ వాటా (2017 ఏప్రిల్ నాటికి 0.32 శాతం) తర్వాత కంపెనీ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపదని అంచనా వేసినప్పటికీ, జీఎం బ్రాండ్ షెవ్రోలె కార్ల పునఃవిక్రయాలపై మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఎం ప్రకటించిన తరువాత రీసేల్ మార్కెట్లో 5శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే దేశీయ విక్రయాలను నిలిపి వేసినప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తామనీ కార్ల విడిభాగాలు. ఇతర సర్వీసులను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. వారెంటీలకు సంబంధించి అన్ని ఒప్పందాలను, అమ్మకాల సేవలను గౌరవిస్తామని జిఎం వినియోగదారులకు గురువారం ప్రకటించింది. అయినా వినియోగదారుల్లో ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరోవైపు ఈ సంవత్సరాంతానికి సంస్థ ఆథరైజ్డ్ సర్వీసులు విలువైన సేవల్ని అందించలేకపోవచ్చని ట్రూ బిల్ కో ఫౌండర్ సుభ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీఎం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించడం కూడా కష్టం కావచ్చని అంచనా వేశారు. ఒక సంస్థ అమ్మకాలను నిలిపివేసినపుడు సాధారణంగా సంవత్సరం కాలంలో క్రమంగా 10-15 శాతం ధరలు పతనం నమోదవుతుందని అయితే జీఎం కార్ల విషయంలో ఇప్పటికే 5 శాతం పతనం నమోదైందని తెలిపారు. కాగా డిసెంబర్31, 2017 నుంచి విక్రయాలు ముగియనున్నాయని జీఎం ఇండియా ఎండీ కహర్ కజిమ్ ప్రకటించారు. అయితే, అమ్మకాల సేవలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని స్థానిక వాటాదారుల మద్దతు కొనసాగిస్తామనిచ భారతదేశంలో విక్రయించిన జీఎం కార్ల భాగాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కజీమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జీఎం బీట్, స్పార్క్, సెయిల్(సెడాన్) క్రూయిజ్, ఎంజాయ్, తవేరా, ట్రయిల్ బ్లేజర్లతో సహా ఏడు మోడళ్లను విక్రయిస్తుంది.మోడళ్లను విక్రయిస్తోంది -
భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ నియామకాలు
హైదరాబాద్: ఒక వైపు దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో వివాదంకొనసాగుతుండగానే మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. సంస్థలో ఉద్యోగుల నియమకాలు మొదటిసారి భారీగా పడిపోయాయి. 33ఏళ్ల చరిత్రలో తొలిసారి నెగిటివ్ గ్రోత్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నియామకాలు భారీగా పడిపోయాయని సంస్థ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రతిసంవత్సరం 20-25 వేలు నియామకాలు చేపట్టే సంస్థ ఈ ఏడాది కేవలం 6వేలమందిని మాత్రమే నియమించుకున్నట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ నిపుణుల నియమకాలు 75 శాతం పడిపోయాయన్నారు. అలాగే వేరు వేరు కారణాల రీత్యా సుమారు 7 వేలమంది సంస్థను వీడారు. ఇండియాసాఫ్ట్-2017 కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన జయేశ్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటి పరిశ్రమపై కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్రభావంపై మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా క్వార్టర్ 3 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా కంపెనీ సీఈవో విశాల్ సిక్క ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిదినెలల్లో 5700మంది నియమించుకున్నట్టు చెప్పారు. అలాగే గత ఏడాది ఈ సంఖ్య 17 వేలుగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగులను సంఖ్య పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ , నియామకరేటులో మందగమనం ఉండనుందని సూచించడం గమనార్హం. కాగా క్యూ 3 ఫలితాలు సమయంలో విడుదల చేసిన కంపెనీ ప్రకటన ప్రకారం డిసెంబర్ 31 నాటికి ఇన్ఫీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,763 ఉంది. సెప్టెంబర్ 30 నాటికి ఈ సంఖ్య 1,99,829 గాను, జూన్ 30 నాటికి 1,97,050గాను ఉంది. -
ఆస్తి అమ్మకాలకు మరింత కష్టకాలం
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ స్టాక్స్‌కు మంచి ఏడాది ఏదైనా ఉందంటే అది 2007నే. అప్పటినుంచి ఇప్పటివరకు మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ప్రతేడాది 85 శాతం కుప్పకూలుతూ వస్తున్నాయి. 2007 డిసెంబర్ నుంచి 2017 జనవరి 25 వరకు బీఎస్ఈ రియాల్టీ సూచీ దాదాపు 90 శాతం పడిపోయింది. దీనికి తోడు పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్8న కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం. వీటికి మరింత ప్రతికూలంగా మారింది. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి 2017లోనూ ఆస్తి అమ్మకాలు మరో 30 శాతం కిందకి పడిపోతాయట. ఫిచ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం దేశంలో ప్రాపర్టీ అమ్మకాలు 20-30 శాతం కిందకి పడిపోతాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు, ఇతర అంశాలు గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయని రేటింగ్ సంస్థ పేర్కొంది. నోట్ల రద్దుతో గృహాల కొనుగోలుకు డిమాండ్ తగ్గడంతో బిల్డర్స్ చుక్కలు చూస్తున్నారు. డిమాండ్ బలహీన దశలో ఉండటంతో ఆస్తుల అమ్మక ధరలు తగ్గించడానికి బిల్డర్స్ వెనుకాడటం లేదు. లిక్విడిటీపై మరిన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్లో లిక్విడిటీపై ఆంక్షలు పెరిగితే రియాల్టీ అమ్మకాలు 2017లోనూ కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. ఈ ఏడాది గృహ ధరలు భారీగా తగ్గుతాయని ఫిచ్ అంచనావేస్తోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ అంచనా ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు 2016 చివరి త్రైమాసికంలో యేటికేటికి 44 శాతం పడిపోతాయని, మొత్తంగా అమ్మకాలు 9 శాతం క్షీణిస్తాయని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ మరింత పడిపోనున్నాయట. యూనిటెక్, హెచ్‌డీఐఎల్, శోభా డెవలపర్స్, ప్రెస్టేజి ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటివి భారీగా క్షీణించనున్నాయట. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, లోధా డెవలపర్స్ వాటి బ్రాండ్ విలువతో కొంత లాభపడొచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. -
60 లక్షలు పడిపోనున్న కరెన్సీ ప్రింటింగ్!
పెద్ద నోట్లు రద్దైనప్పటి నుంచి ఇటు సాధారణ ప్రజానీకమే కాదు, అటు బ్యాంకు ఉద్యోగులు, ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సరిపడ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం అదనపు సమయాలు వెచ్చించి మరీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు కరెన్సీని ముద్రిస్తున్నారు. కానీ ఇక తమ వల్ల కాదంటూ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. తొమ్మిది గంటల సిఫ్ట్ను పన్నెండు గంటల మేర పనిచేస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సాల్బోని(పశ్చిమబెంగాల్) ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు అదనపు సమయాలను పనిచేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని మేనేజ్మెంట్కు తెలిపారు. ఉద్యోగుల ఈ నిర్ణయం నోట్ల ముద్రణపై పడనుందని తెలుస్తోంది. 12 గంటల సిఫ్ట్లో రోజుకు 460 లక్షల కరెన్సీ నోట్లు ప్రింట్ చేస్తున్న ఈ ప్రెస్, ఉద్యోగుల నిర్ణయంతో రోజుకు ప్రింట్ చేయనున్న కరెన్సీ నోట్లు 60 లక్షలు పడిపోనున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 12 గంటల సిఫ్ట్లో ఉద్యోగులు పనిచేసి ప్రజల అవసరార్థం ఎక్కువ నగదును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఈ అదనపు పనిగంటలతో ఉద్యోగులకు వెన్నునొప్పి, నిద్రలేమి, శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ప్రబలుతున్నాయని తెలిసింది. దేశ ప్రజల కోసం ఇన్ని రోజులు 12 గంటల సిఫ్ట్లో పనిచేశామని, మరింత కాలం తాము పనిచేయలేకపోతున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు చెప్పారు. మేనేజ్మెంట్తో డిసెంబర్ 14న కుదుర్చుకున్న అగ్రిమెంట్ కూడా డిసెంబర్ 27తో ముగిసిందన్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో కొత్త రూ.2000, రూ.500 నోట్లతో పాటు అన్ని కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. -
స్మార్ట్ ఫోన్ల పరిస్థితి ఇక ఇంతేనా..!
'అరచేతిలో ప్రపంచం' కాన్సెప్ట్ తో పాటు... అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ల కోసం యూజర్లు ఎదురు చూస్తున్నారట. అదీ అందుబాటుల్లో.. సాధ్యమైనంత చవకగా దొరకాలని కోరుకుంటున్నారట. అందుకే ఇక ముందు స్మార్ట్ ఫోన్ మార్కెట్ వెలవెలబోనుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ వ్యాపారాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ లో అమ్మకాలు పడిపోతున్నాయట. వరుసగా జనవరి-మార్చి త్రైమాసికంలో 8.2శాతం క్షీణించాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కూడా అమ్మకాలు పడిపోవడం సాధారణ విషయం కాదని, ఇది తయారీ కంపెనీలు ఆలోచించాల్సి విషయమని చెబుతోంది. అక్టోబర్-డిసెంబర్ లో ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ను అందుకోవడానికి ఇన్వెంటరీ పెంచడంతోనే అమ్మకాల క్షీణతకు దారితీసిందని తెలిపింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కేవలం 5 శాతమే పెరిగాయని, అనంతరం నుంచి అమ్మకాలు తక్కువగానే నమోదవుతూ వస్తున్నాయని ఐడీసీ పేర్కొంది. అయితే ఏప్రిల్-జూన్ కూడా ఈ అమ్మకాలు ప్లాట్ గానే ఉంటాయని, గత ఏడాదిలా పెరుగుదల ఉండదని ఐడీసీ తెలిపింది. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లలోకి మారడానికి సమయం పడుతుండడంతోనే ఈ అమ్మకాలు తక్కువగా నమోదవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సరియైన స్మార్ట్ ఫోన్ ఎంపికల కోసం, 4జీ ఫోన్ల కోసం బేసిక్ ఫోన్ యాజర్లు వేచి చూస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ట్రెండ్ తో ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలు ఫీచర్ల ఫోన్లపై మళ్లీ దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫోన్ల అమ్మకాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. స్మార్ట్ ఫోన్ డివైజ్ ల ధరలు అందుబాటులో లేకుండా.. ఇవే ధరలు కొనసాగితే యూజర్లను ఆకట్టుకోవడం కష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 4జీ స్మార్ట్ ఫోన్లు ధరలు ఈ ఏడాది చివరకు రూ.3,000 కిందకు వస్తే స్మార్ట్ ఫోన్ పరిశ్రమ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లలోకి మారే వాళ్లు కేవలం 10శాతమే ఉన్నారని, ముందు త్రైమాసికాల్లో ఈ శాతం 17-18గా ఉండేవారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!
న్యూయార్క్ః భోజన ప్రియులు ఇప్పటికే ఎన్నో రకాల కేక్ లను రుచి చూసి ఉంటారు. కానీ వాటర్ కేక్ ను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు నీటితో తయారయ్యే స్వచ్ఛమైన నీటి బిందువులా కనిపించే వాటర్ కేక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా గుడ్డుతోనూ, గుడ్డు లేకుండానూ కూడా కేక్ లు తయారు చేయడం చూశాం. ఇప్పుడా రోజులు పోయి ఏకంగా నీటితోనే చవులూరించే రుచికరమైన కేక్ లు కొన్ని దేశాల్లో తయారైపోతున్నాయ్... స్వచ్ఛమైన నీటితో కేక్ ను తయారు చేయడం కొత్తగా కనుగొన్నారు న్యూయార్క్ వాసులు. ఈ కొత్త ప్రయోగానికి జనం ఆకర్షితులయ్యారంటే ఇక వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో త్వరలో మంచినీటికి ఎద్దడి ఏర్పడక తప్పదేమో అంటున్నారు వినియోగదారులు. తాజాగా తయారైన వాటర్ కేక్ ఇప్పుడు న్యూయార్క్ లోని సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్మార్గాస్ బర్గ్ లో ఈ సంవత్సరం అత్యంత ఆదరణను చూరగొన్నఈ జపనీస్ డెజర్ట్ ను మిజు షింగెన్ మోచీగా పిలుస్తున్నారు. జపాన్ లోని కేక్ ల సృష్టికర్త.. డేరెన్ వాంగ్ సృష్టించిన ఈ స్ఫటికాకారంలో ఉన్ననీటి వంటకాన్ని(వాటర్ కేక్) న్యూయార్క్ కు తీసుకొచ్చి రైన్ డ్రాప్ కేక్ గా మార్చారు. మృదువుగా, ట్రాన్స్పరెంట్ జెల్లీలా కనిపించే వాటర్ కేక్ ను ముక్కలు ముక్కలుగా కూడ కోయచ్చు. అయితే దీన్ని కాస్త భద్రంగా కూడ నిల్వ ఉంచాల్సి వస్తుంది. వేడి తగిలినా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కరిగిపోతుంది. ఇప్పటికే పలు రకాల ఆహార పదార్థాలను సృష్టించి, తన ప్రయోగాలతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న వాంగ్ కేవలం ఘనీభవించిన నీరు, జెలటిన్ తో ఈ కేక్ ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన వాటర్ కేక్ పై బ్రౌన్ సుగర్ సిరప్, వేయించిన సోయా పిండి చల్లి వడ్డిస్తున్నారు. జపాన్ లో వాటర్ కేక్ గా గుర్తింపు పొందిన ఈ కేక్ ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు రైన్ డ్రాప్ కేక్ గానూ పరిచయమై ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది.