రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫారెక్స్ నిల్వలను (Forex reserves) వినియోగిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ చివరిలో 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 27వ తేదీతో ముగిసిన వారానికి 640.279 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
అంతక్రితం వారం (డిసెంబర్ 21) వారంతో పోల్చితే ఏకంగా 4.11 బిలియన్ డాలర్లు తగ్గాయి. డాలర్లకు డిమాండ్ తగ్గించడానికి తద్వారా రూపాయి విలువ స్థిరత్వానికి బ్యాంకులు, ఫారెక్స్ ట్రేడర్లకు ఆర్‌బీఐ తగిన స్థాయిలో అమెరికన్ కరెన్సీని అందుబాటులో ఉంచుతున్నట్లు నిపుణుల విశ్లేషణ. ఫారెక్స్‌లో ప్రధాన విభాగాలను పరిశీలిస్తే..
డాలర్లలో పేర్కొనే ఫారెన్స్ కరెన్సీ అసెట్స్ విలువ 4.641 బిలియన్ డాలర్లు తగ్గి 551.921 బిలియన్ డాలర్లకు చేరింది.
పసిడి నిల్వలు 541 మిలియన్ డాలర్లు తగ్గి, 66.268 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్)కు సంబంధించి పరిమాణం 12 మిలియన్ డాలర్లు తగ్గి 17.873 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిస్థితి యథాతథంగా 4.217 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment