భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ నియామకాలు | For the first time, Infosys logs drop in hiring | Sakshi
Sakshi News home page

భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ నియామకాలు

Published Mon, Feb 13 2017 8:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ నియామకాలు

భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ నియామకాలు

హైదరాబాద్‌: ఒక వైపు  దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ  ఇన్ఫోసిస్ లో  వివాదంకొనసాగుతుండగానే మరో షాకింగ్‌  న్యూస్‌ వెలుగు చూసింది. సంస్థలో ఉద్యోగుల నియమకాలు మొదటిసారి భారీగా పడిపోయాయి.  33ఏళ్ల చరిత్రలో  తొలిసారి  నెగిటివ్‌ గ్రోత్‌ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇన్ఫీ నియామకాలు భారీగా పడిపోయాయని సంస్థ  సహ వ్యవస్థాపకులు ఎన్‌ ఆర్‌ నారాయణ  మూర్తి  వ్యాఖ్యలను ఉటంకిస్తూ తెలంగాణ ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ప్రతిసంవత్సరం 20-25 వేలు నియామకాలు చేపట్టే సంస్థ ఈ ఏడాది కేవలం 6వేలమందిని మాత్రమే నియమించుకున్నట్టు  ఐటి శాఖ కార్యదర్శి జయేశ్‌​ రంజన్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌, సాఫ్ట్‌వేర్‌  నిపుణుల నియమకాలు 75 శాతం పడిపోయాయన్నారు. అలాగే వేరు వేరు కారణాల రీత్యా సుమారు 7 వేలమంది సంస్థను వీడారు.  ఇండియాసాఫ్ట్‌-2017 కాన్ఫరెన్స్‌ లో  ప్రసంగించిన జయేశ్‌  ఈ వివరాలను వెల్లడించారు.  ఐటి పరిశ్రమపై కృత్రిమ మేధస్సు,  ఆటోమేషన్, డిజిటల్  ఇంటిలిజెన్స్‌ ప్రభావంపై మాట్లాడిన  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

 కాగా క్వార‍్టర్‌ 3 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా కంపెనీ సీఈవో  విశాల్‌ సిక్క ఈ ఆర్థిక సంవత్సరం మొదటి  తొమ్మిదినెలల్లో 5700మంది నియమించుకున్నట్టు చెప్పారు. అలాగే గత ఏడాది ఈ   సంఖ్య 17 వేలుగా పేర్కొన్నారు. అయితే ఉద్యోగులను సంఖ్య పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ , నియామకరేటులో మందగమనం ఉండనుందని   సూచించడం  గమనార్హం.
కాగా క్యూ 3 ఫలితాలు సమయంలో విడుదల చేసిన కంపెనీ ప్రకటన ప్రకారం  డిసెంబర్‌ 31 నాటికి ఇన్ఫీలో మొత్తం ఉద్యోగుల సం‍ఖ్య 1,99,763  ఉంది.  సెప్టెంబర్‌ ​ 30 నాటికి ఈ సంఖ్య 1,99,829 గాను, జూన్‌ 30 నాటికి 1,97,050గాను  ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement