దేశీయ మొబైల్ మార్కెట్ లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి మొబైల్స్ తీసుకొచ్చిన వన్‌ప్లస్, హత్య కొద్దీ రోజుల హై ఎండ్ మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో మిడ్ రేంజ్ అభిమానులు అందరూ వన్‌ప్లస్ నుంచి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంస్థ తిరిగి మిడ్ రేంజ్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10న విడుదల చేయబోతున్నది.
లాంచ్ చేయడానికి కొద్దీ రోజుల ముందు ఇండియాలో ఈ కంపెనీ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్‌ప్లస్ టీవీ యు 1 ఎస్ ధరలను ట్విటర్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండనున్నట్లు తెలుస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు అదనంగా రూ.1,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చే ఉంది. ఈ ఆఫర్ కూడా జూన్ మే 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది.
లీక్‌ల ప్రకారం రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. అలాగే ఇది 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్‌ప్లస్ కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment