OnePlus 9 Series Smart Mobiles Launch In India: Check Date, Expected Features - Sakshi
Sakshi News home page

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

Published Tue, Mar 9 2021 3:43 PM | Last Updated on Tue, Mar 9 2021 8:12 PM

OnePlus 9 Series Mobiles To Launch on March 23 - Sakshi

వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9 సిరీస్ విడుదల తేది బయటకి వచ్చింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ 9ఈ, వన్ ప్లస్ 9 లైట్, వన్ ప్లస్ 9ప్రో తీసుకొనిరావచ్చు. మార్చి 23న ఈ మొబైల్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్‌ల ప్రారంభ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్, జెడ్ ఇయర్‌బడ్స్‌ రెండు వెర్షన్లలో ఒకదాన్ని పొందవచ్చు అని సమాచారం.

వన్ ప్లస్ 9ప్రో ఫీచర్స్(అంచనా):

  • 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 
  • 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
  • 48 ఎంపీ + 50 ఎంపీ + 8 ఎంపీ 
     

చదవండి: 

వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ 

ఇక వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement