OnePlus
-
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానా
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు బెంగళూరు వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ రూ.5,000 జరిమానా విధించింది. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసిన మొబైల్ ప్యాక్‌లో యూజర్ మాన్యువల్ రానందుకు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణ జరిపిన కమిషన్ ఇటీవల తీర్పునిచ్చింది.బెంగళూరులోని సంజయ్ నగర్‌కు చెందిన ఎంస్‌ఎం రమేష్ అనే వినియోగదారుడు వన్‌ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నార్డ్ సీఈ 3 మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఫోన్ విక్రయించిన ఆరు నెలల తర్వాత, జూన్‌లో వినియోగదారుల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేశాడు. తాను రూ.24,598కి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నానని, అయితే అందులో యూజర్ మాన్యువల్ లేదని ఫిర్యాదులో తెలిపాడు. ఫోన్ వారంటీ సమాచారం, కంపెనీ చిరునామాను తెలుసుకోవడంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కంపెనీని ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్‌లో వన్‌ప్లస్ మాన్యువల్‌ను అందించిందన్నారు. ఫోన్ కొనుగోలు చేసిన నాలుగు నెలల తర్వాత ‘సేవలో లోపం’ కారణంగా ఇలా చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంవినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వన్‌ప్లస్ ఇండియా వ్యవహారం పూర్తిగా నిర్లక్ష్యం, ఉదాసీనతను చూపుతుందని పేర్కొంటూ రూ.5,000 జరిమానా విధించింది. -
భారత్‌లో వన్‌ప్లస్ భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ప్లస్ ప్రాజెక్ట్ స్టార్లైట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా ఏటా రూ.2,000 కోట్లు వెచి్చంచనుంది. భారత్‌లో ఉత్పత్తులు, సేవలలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్టు వన్‌ప్లస్ గురువారం ప్రకటించింది. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని వివరించింది. మరింత మన్నికైన పరికరాలను తయారు చేయడం, అసాధారణ కస్టమర్ సేవలు, భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేయడం ఇందులో ఉన్నాయి. పరికరాలను మరింత మన్నికైనదిగా చేయడానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ రెండు ముఖ్యమైన డిస్ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి డిస్ప్లేమేట్ ఏ++ డిస్ప్లే, వన్‌ప్లస్ యొక్క గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్‌ను రూపొందించడం ఇందులో భాగం. భారత్ కస్టమర్ల కోసం.. కొత్త డిస్ప్లే రాబోయే ఫ్లాగ్షిప్ మోడల్లో కొలువుదీరనుందని వన్‌ప్లస్ వెల్లడించింది. గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ మొబైల్స్ కనిపించే ఆకుపచ్చని గీతలపట్ల ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ‘వివిధ సెట్టింగ్‌లలో మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నాం’ అని వన్‌ప్లస్ వివరించింది. అత్యంత ప్రాధాన్య మార్కెట్.. ‘వినియోగదారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయాలనే అంకితభావానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్’ అని వన్‌ప్లస్ ఇండియా సీఈవో రాబిన్ లేవో తెలిపారు. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ తన సరీ్వస్ సెంటర్లను 2026 మధ్య నాటికి 50 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్‌గ్రేడ్ చేయనుంది. 2024లో బ్రాండ్ సొంత ప్రత్యేక సేవా కేంద్రాలలో 11 శాతం పెరుగుదలతో సహా 22 శాతం మేర తన సరీ్వస్ సెంటర్లను పెంచినట్లు వన్‌ప్లస్ తెలిపింది. -
OnePlus: వన్‌ప్లస్ విక్రయాలు నిలిపేస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
నథింగ్ ఫోన్ గురించి తెలుసా..
నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
వన్‌ప్లస్ నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో దీని ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ నెల 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది. -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్‌ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్‌పై మరోసారి ట్రోలింగ్‌కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్‌తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్‌లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్‌ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా యాపిల్‌పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్‌ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్‌కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్‌ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్‌పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
విడుదలకు ముందే వివరాలు లీక్ - ధర ఎంతంటే?
OnePlus Nord Buds 2r: ఆధునిక కాలంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కంటే 'బడ్స్' ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సరసమైన ధరలో వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ 'నార్డ్ బడ్స్ 2ఆర్' (Nord Buds 2r) విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్' బాక్స్ ధర రూ. 2,999 అని తెలుస్తోంది. అంటే వీటి రిటైల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ వీటిని 2023 జులై 05న లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఇయర్‌బడ్స్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఒక ఛార్జ్‌తో 38 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ55 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి మంచి ఆడియో క్వాలిటీ అందిస్తుంది. ఇందులో 12.4mm డైనమిక్ టిటానియం డ్రైవర్, 25డీబీ నాయిస్ కాన్సిలింగ్ ఉండనున్నాయి. ఈ లేటెస్ట్ బడ్స్ కలర్ ఆప్షన్స్ గురించి మాత్రమే కాకుండా ఆఫర్స్ గురించి కూడా త్వరలోనే తెలుస్తుంది. -
వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ టాబ్లెట్ విభాగంలో తన అరంగేట్రం చేసింది. తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. MediaTek Dimensity 9000 చిప్సెట్, కార్టెక్స్-X2 కోర్ 3.05GHz తదితర ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ 35శాతం పనితీరు ప్రయోజనాన్ని, 35 శాతం పవర్ ఎఫిషియెన్సీ అందజేస్తుందని కంపెనీ వెల్లడించింది. (ఇదీ చదవండి: బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) వన్‌ప్లస్ ప్యాడ్: ధర, ఆఫర్లు వన్‌ప్లస్ ప్యాడ్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 37,999, రూ. 39,999. వన్‌ప్లస్ యాప్, ఎక్స్పీరియన్స్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈకామర్స్ సైట్లలోనూ, రిలయన్స్ క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. OnePlus Xchange కింద వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్ల మార్పిడిపై అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్ లభిస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓపెన్ సేల్ మే 2, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో) It's almost D-Day. The all-new #OnePlusPad will be open for pre-orders starting April 28, at ₹37,999. Mark your calendars! Stay tuned: https://t.co/PSbe5gA0aF pic.twitter.com/aaO7ak9yNG — OnePlus India (@OnePlus_IN) April 25, 2023 వన్‌ప్లస్ ప్యాడ్ ఫీచర్లు భారీ 11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్ప్లే 7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ 2.5D రౌండ్ ఎడ్జ్ .కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్ 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్ 9510mAh బ్యాటరీ 67w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా -
వన్‌ప్లస్ ఫోన్ స్పెసిఫికేషన్లు సూపర్! విడుదలకు ముందే వివరాలు లీక్!
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్(OnePlus) భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite)ని వన్‌ప్లస్ నార్డ్ బడ్స్2 (OnePlus Nord Buds 2)తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇదీ చదవండి: మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్! ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3’ స్పెసిఫికేషన్లు (అంచనా): 6.7అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్( Qualcomm Snapdragon) 695 5G ప్రాసెసర్ 8GB ర్యామ్ 128GB వరకు పెంచుకునే స్టోరేజీ సామర్థ్యం. 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డ్యూయల్ కెమెరా. 5,000 mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రారంభ ధర ₹ 19,999. కొత్త గ్రీన్ కలర్ వేరియంట్ (పాస్టెల్ లైమ్). ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్‌ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్‌ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్‌గా పనిచేసి ఫోన్ హీట్‌ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్‌ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్‌ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ,టీవీ, ప్యాడ్, బడ్స్: జోరు మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సంస్థ వన్‌ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ మోడల్స్‌ని తీసుకొచ్చింది. గేమింగ్ ప్రియుల కోసం హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ వీటిలో పొందుపర్చింది. అలాగే 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఉన్నాయి. వీటితోపాటు పాటు వన్‌ప్లస్ ప్యాడ్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్, క్యూ2 ప్రొ 65 టీవీని కూడా లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ రూ.61,999, 16జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999. గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్లోఈ స్మార్ట్ఫోన్లు లభ్యం. ప్రీ ఆర్డర్‌కు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 28 న సేల్ ప్రారంభం. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 100 వాట్ చార్జింగ్ సపోర్ట్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్ (హెడ్ ట్రాకింగ్ & వైర్లెస్ ఛార్జింగ్) ధర రూ 11,999 వన్‌ప్లస్ టీవీ క్యూ2 ప్రొ 65 రూ. 99,999 ముందస్తు ఆర్డర్లు: మార్చి 6, విక్రయాలు: మార్చి 10 -
వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్ప్లస్కుచెందిన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరలో లభ్యమవుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో ఇండియాలో 5 వేల రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇండియా లాంచింగ్ ప్రైస్ రూ. 66,999. కాగా ప్రస్తుతం 5,000 ధర తగ్గింపుతో రూ. 61,999లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఇది లభ్యం. దీంతోపాటు వన్‌ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60,999 కే లభిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 48+ 50+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ మరోవైపు వన్‌ప్లస్ 10కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 11 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో చైనాలో లాంచ్ కానుందని అంచనా. -
వన్‌ప్లస్ 10 ప్రొ పై భారీ తగ్గింపు, ఎక్కడ?
సాక్షి,ముంబై: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ 10ప్రో భారీ డిస్కౌంట్ ధరకకు లభిస్తోంది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ద్వారా వన్‌ప్లస్ 10ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్న కస్టమర్లు అదనంగా రూ. 5,000 తగ్గింపును కూడా పొందవచ్చు. చదవండి: మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే.. వన్ప్లస్కుసంబంధించి ఏడాది లాంచ్ చేసిన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో. ఇది ప్రస్తుతం రూ.66,999 నుంచి రూ.61,999కి లిస్ట్ అయింది. ఎస్బీఐ ఆఫర్ద్వారా రూ.56,999 సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 22,000 వరకు ఉంటుంది. అలాగే షరతుల మేరకు కనీసం 4,000 తగ్గింపు లభిస్తుంది. అంటే సుమారు 52 వేలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తొమ్మిది రోజుల్లో ముగుస్తుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్, ది వైర్లెస్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాంటివి ప్రధాన ఫీచర్లు. (TVS Jupiter Classic Edition: టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే) వన్‌ప్లస్ 10 ప్రో ఫీచర్లు 6.70 అంగుళాల (1440x3216) డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 32ఎంపీ సెల్ఫీ కెమెరా 8జీబీ,12 జీబీ ర్యామ్ 128, 256, 512, జీబీ మొమరీవేరియంట్స్ 5000mAhబ్యాటరీ కెపాసిటీ -
వన్‌ప్లస్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్
-
వన్‌ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి డిస్కౌంట్‌సేల్‌కు తెరలేవనుంది. మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 22 నుంచి దివాలీ సేల్‌ను ప్రారంభిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవీఎస్ ఇయర్‌బడ్‌లు, టీవీలు, మరిన్నింటిపై డిస్కౌంట్లులభ్యం. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్లు 6వేల వరకు తక్షణ తగ్గింపును పొందగలరు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌కూడా అందిస్తోంది. అంతేకాకుండా, దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022 వన్‌ప్లస్ ఉత్పత్తుల కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్లను కూడా అందిస్తుంది. అలాగే వన్‌ప్లస్ ఇండియా వెబ్సైట్లో ప్రస్తుతం ఫ్లిప్ అండ్ విన్ ఛాలెంజ్ కూడా ఉంది. ఈ సేల్‌లో ముఖ్యంగా వన్‌ప్లస్ 10 ప్రొను రూ 55,999 కి విక్రయిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ 66,999. అంటే రూ 11,000 డిస్కౌంట్ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్కౌంట్లతో కలిపి ఈ మొత్తం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే వన్‌ప్లస్ 10ఆర్ 5జీ 29,999లకే అందించనుంది. ఎంఆర్పీ ధర 34,999. అలాగే వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్నరెండవేల తగ్గింపుతో రూ. 26,999కే విక్రయించ నుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో స్మార్ట్ఫోన్లు, అలాగే టీవీలు ఇతర ఉత్పత్తులను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్
ముంబై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 10టీ 5 జీ పేరుతోఈ స్మార్ట్‌ఫోన్‌ను 16 జీబీ వేరియంట్‌తో భారతదేశంలో అత్యుత్తమ ర్యామ్‌తో తీసుకొచ్చింది. మొత్తం 8, 12, 16జీబీ ర్యామ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. 12జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54999గా నిర్ణయించింది. అలాగే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధరను రూ. 55999గా ఉంచింది. 8 జీబీ వేరియింట్పై అమెజాన్, వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ (8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్) 49వేల 999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. అయితే అమెజాన్, వన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తగ్గింపు ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చ. దీంతోపాటు ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుచేస్తే 3 వేల తగ్గింపు లభిస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కార్డు కొనుగోలుతో ఈఎంఐ ఎంచుకున్నవారికి 1500 తగ్గింపు అదేవిధంగా, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 1500 ధరతగ్గుతుంది. అంతేకాకుండా పాత వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా వినియోగదారులు రూ. 15,750 దాకా ప్రయోజనం పొందవచ్చు. వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.7-అంగుళాల పూర్తి-HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 1080×2,412 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ 50MP, 8MP 2MP ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,800mAh బ్యాటరీ 150వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ -
వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది.. ఆఫర్ అదిరింది!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్10టీ పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంచింది. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇంతకుముందు తీసుకొచ్చిన వన్‌ప్లస్ ప్రో కంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. అలాగే తొలి వన్‌ఫ్లస్ 16 జీబీ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను తొలగించిన తొలి వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. (చదవండి: గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత) ధర,ఆఫర్, లభ్యత) 8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 49,999. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999. 16 జీబీ, 256 జీబీ ధర రూ.55,999. అయితే ఐసీఐసీఐ, లేదా ఎస్బీఐ కార్డుల ద్వారా OnePlus 10T 5జీని కొనుగోలు చేస్తే, వినియోగదారులు రూ. 5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంటే 8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 44,999, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్రూ. 49,999, 16 జీబీ, 256 జీబీ రూ. 50,999లకే సొంతం చేసుకోవచ్చు. మూన్‌స్టోన్ బ్లాక్ , జేడ్ గ్రీన్ కలర్స్‌లో, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. OnePlus 10T ప్రీ బుకింగ్ షురూ అయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 10టీ 5జీ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED ప్యానెల్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS 12.1 50 + 8 + 2ఎంపీ ట్రిపుల్ వెనుక కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4800mAh బ్యాటరీ 150W ఛార్జింగ్ ఇదీ చదవండి: Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే? -
వివాదంలో స్మార్ట్ ఫోన్ సంస్థ,'డియర్ నథింగ్'..చూసుకుందాం పదా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి నథింగ్ ఫోన్(1) మంగళవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ ఫోన్ తయారీ సంస్థపైన దక్షణాదికి చెందిన స్మార్ట్ ఫోన్ లవర్స్, టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్(1) విడుదలైన కొన్ని గంటల్లోనే ఆఫోన్ విడుదల, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయనే అంశాలతో సంబంధం లేకుండా డియర్ నథింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో కార్ల్ పీ'ని విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేస్తున్నారు. డియర్ నథింగ్: అసలు ఏం జరిగింది? ప్రముఖ తెలుగు టెక్ యూట్యూబ్ క్రియేటర్ విడుదలైన ఫోన్(1) గురించి ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఫోన్ రివ్వ్యూ ఇవ్వాలని ఆ ఫోన్ కంపెనీ పేరుతో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో హాయ్ **** దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్ అని ఓ పేపర్లో రాసి ఉంటుంది. అంతే మనదేశానికి చెందిన ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ యూనిట్లు ఇవ్వలేదని విమర్శిస్తూ ఆ వీడియోను తయారు చేశాడు. రివ్వ్యూ యూనిట్లు ఇవ్వాలనేది కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు. అలా నథింగ్ ఫోన్(1)ను విమర్శిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్లు సైతం ఆ ఫోన్‌పై వీడియోలు చేశారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సౌత్‌కు చెందిన నథింగ్ ఫోన్(1) కొనుగోలు దారులు సైతం.. #డియర్ నథింగ్..పదా చూసుకుందాం, #బాయ్కాట్నథింగ్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా, ఈ నథింగ్ ఫోన్ సంస్థ ప్రమోషన్ కోసం క్రియేటర్లకు ఇలా లెటర్ అలా పంపిందా? లేదంటే నార్త్ కంటెంట్ క్రియేటర్లకు రివ్వ్యూ యూనిట్లు పంపి.. తమకు పంపలేదనే కోపంతో దక్షిణాదికి చెందిన టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఇలా వీడియోలు చేశారా అనే అంశం తెలియాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Worst case started for u guys #DearNothing pic.twitter.com/9mz106Dw93 — Dilipkumar789 (@ndileepkumar789) July 13, 2022 #DearNothing Telugu,Tamil,kanada, Malayalam these four language people can buy nothing phone but not now.... pic.twitter.com/yGi2GHdawd — m. arunkumar (@arunmallela5) July 13, 2022 #DearNothing #DearNothing dhesa bhasalandhu telugu lessa.......Learn to treat everyone equally...India is not only Hindi country..... pic.twitter.com/SSbBGyMb8D — MR UNIQUE. .. . SHIVA (@ShivaRouthu13) July 13, 2022 Thank You Darlings 😍 #DearNothing - Trending No.1 in India 🇮🇳. pic.twitter.com/4QBhle2Hu1 — Prasadtechintelugu (@iamprasadtech) July 12, 2022 #DearNothing Nothing is just North pan masala phone...🥴 pic.twitter.com/oEBrvYxf2J — Mehabub (@Mehabub94557493) July 13, 2022 -
వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ లాంచ్, ఫీచర్లు చూశారా?
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జూలై 5 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. 8జీబీ ర్యామ్/ 125 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఆఫర్లు, లభ్యత: అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్లతో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,500 తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంటే రూ. 27,499 లకే సొంతం చేసుకోవచ్చన్నమాట. 8జీబీ ర్యామ్, 125 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ. 28,999 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజహ మోడల్ ధరను రూ. 33,999 గ్రే షాడో అలాగే జేడ్ ఫాగ్ రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం. ‘నార్డ్ 2టీ’ 5జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఆక్సిజన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ,80W SuperVOOC ఛార్జింగ్ Sorry to keep you waiting folks. But we're almost there. #OnePlusNord2T coming soon. Get Notified: https://t.co/oEqZLKClpD pic.twitter.com/73Z3jUD0Sc — OnePlus India (@OnePlus_IN) July 2, 2022 -
వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్ ‘నార్డ్ 2 టీ’..కమింగ్ సూన్
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ తన నార్డ్ 2 సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 టీ (5జీ)పేరుతో జూలై 1న ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు నోటిఫై పేజ్‌ను కూడా లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో అమెజాన్ ద్వారా కూడా వన్‌ప్లస్ నార్డ్ 2 టీ లభించనుంది. ఇప్పటివరకు యూరప్ , యునైటెడ్ కింగ్డమ్లో మాత్రమే లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 1న భారత మార్కెట్లో కూడా తీసుకొస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ ల్యాండింగ్ పేజీని సెటప్ చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్బేస్ వెర్షన్‌తోపాటు, హై-ఎండ్ వేరియంట్‌గా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అందించనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 టీ ఫీచర్లు 6.43 అంగుళాల డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 50 +8+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 4,500mAh బ్యాటరీ 80W సూపర్ ఛార్జింగ్ ధరలు : బేస్ వేరియంట్ధర రూ. 28,999. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 33,999 ఉంటుందని అంచనా. -
అద్భుతమైన ఫీచర్స్.. కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన వన్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ టీవీల విభాగంలో 2020తో పోలిస్తే 2021లో 350 శాతం వృద్ధి సాధించినట్టు టెక్నాలజీ కంపెనీ వన్‌ప్లస్ ప్రకటించింది. ‘2019లో భారత్‌లో టీవీలను పరిచయం చేశాం. 2021 నాల్గవ త్రైమాసికంలో అతిపెద్ద స్మార్ట్ టీవీ బ్రాండ్లలో టాప్–5లో చోటు సంపాదించాం’ అని కంపెనీ ప్రకటించింది. తాజాగా భారత్‌లో 43 వై1ఎస్ ప్రో టీవీని వన్‌ప్లస్ ప్రవేశపెట్టింది. ఆధునీకరించిన 4కే యూహెచ్డీ డిస్ప్లేతో 43 అంగుళాల తెర, చిత్రం స్పష్టత కోసం ఎంఈఎంసీ సాంకేతికత, వేగవంతమైన గేమింగ్ అనుభూతికి ఆటో లో లేటెన్సీ మోడ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్, బడ్స్, వాచ్ కనెక్టివిటీ, డాల్బీ ఆడియో వంటి హంగులు ఉన్నాయి. వైఫై, డేటా కనెక్షన్ లేనప్పటికీ వన్‌ప్లస్ కనెక్ట్ 2.0 ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో టీవీని ఆపరేట్ చేయవచ్చు. ధర రూ.29,999 ఉంది. -
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వనప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రోను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన నేపథ్యంలో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది వన్‌ప్లస్. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందబాటులో ఉండనుంది. ఈ తగ్గింపు అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్స్ 8జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది. వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషన్లు 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 48MP + 50MP + 2MP రియర్ కెమెరా 16MP సెల్ఫీ కెమెరా 65W ఛార్జింగ్ సపోర్ట్ 4,500mAh బ్యాటరీ చదవండి: వాట్సాప్ సంచలన నిర్ణయం..! -
వన్‌ప్లస్ నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లలోకి వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా వన్‌ప్లస్ 10 ప్రో ఈ ఏడాది జనవరిలోనే చైనా మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్2 నెక్‌బ్యాండ్‌ను కూడా రిలీజ్ అయింది. క్వాల్కామ్ ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ రానుంది. ఇది వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను మద్దతు పలకునుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 వంటి స్మార్ట్ఫోన్లతో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ పోటీ పడనుంది. ధర ఏంతంటే..? వన్‌ప్లస్ 10 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. భారత్‌లో వన్‌ప్లస్ 10 ప్రో 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 71,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎమరాల్డ్ ఫారెస్ట్, వాల్కానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌తో రానుంది. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.7-అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ 50 ఎంపీ+ 48 ఎంపీ+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5జీ సపోర్ట్ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 80W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్ 50W AirVOOC వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో మరోలా.. విచిత్రమైన పరిస్థితి..! -
OnePlus 10 Pro: లీకైన వన్‌ప్లస్ 10 ప్రో ధర.. ఎంతో తెలుసా?
గతకొంత కాలంగా మొబైల్ ప్రియులను ఉరిస్తున్న వన్‌ప్లస్ 10ప్రో భారత్‌లో మార్చి 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మార్చి 31 రాత్రి 7:30 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ట్విటర్ వేదికగా పేర్కొంది. అయితే, కంపెనీ మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే ఈ ఫోన్ ధర, ఫీచర్లు ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ధరను ప్రముఖ టిప్ స్టర్ ట్విటర్ వేదికగా లీక్ చేయడమే గాక, మొదటి సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది అనేది కూడా పేర్కొన్నాడు. దీంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోన్ గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో ధరలు(అంచనా) ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో విడుదలైన వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లతోనే భారత్‌లో కూడా లాంచ్ కానున్నట్టు సమాచారం. దీనిలో ఈ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరల్ 1 ఎస్ఓసీ ఉండనుంది. ఈ సమాచారాన్ని టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. వన్‌ప్లస్ 10 ప్రో బేసిక్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.71,999గా ఉంది. ఏప్రిల్ 5 నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ భారత్‌లో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కంటే ముందు లాంచ్ చేసిన వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ.64,999గా ఉంటే, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.69,999గా ఉంది. Get ready to know how the new #OnePlus10Pro keep it cool on March 31, 7:30PM — OnePlus India (@OnePlus_IN) March 28, 2022 వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్(అంచనా) ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యూహెచ్డీ ప్లస్ 6.7-అంగుళాల డిస్ప్లే ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ సెకండరీ కెమెరా, 8 ఎంపీ స్నాపర్ కెమెరా 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కెమెరా 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 10 ప్రో బేసిక్ వేరియంట్ ధర రూ.66,999 వన్‌ప్లస్ 10 ప్రో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.71,999 (చదవండి: కనక వర్షం కురిపిస్తున్న ఆ టాటా కంపెనీ షేర్లు..!) -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ఫీచర్స్.. ధర కూడా తక్కువే!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ 'వన్‌ప్లస్' ఇప్పుడు నార్డ్ సిరీస్'లో మరో మొబైల్ తీసుకొచ్చింది. ఈ మిడ్ రేంజ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్'ను, వన్‌ప్లస్ వై1ఎస్ సిరీస్ టీవీతో పాటు నేడు(ఫిబ్రవరి 17) మన దేశంలో లాంచ్ చేసింది. కంపెనీ గత ఏడాది లాంఛ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీకి వారసుడు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ తీసుకొచ్చారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే హెచ్డీఆర్+ సపోర్టు చేసే అమోలెడ్ డిస్ప్లే ఉంది. నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ధర మన దేశంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటే, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బహామా బ్లూ, గ్రే మిర్రర్ రంగులలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అమ్మకానికి వస్తుందని వన్‌ప్లస్ తెలిపింది. నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ స్పెసిఫికేషన్స్ 6.43 అంగుళాల(1,080ఎక్స్2,400) ఫుల్హెచ్డీ+ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఏఆర్ఎమ్ మాలి-జీ68 జిపియు, 8జిబి ఎల్పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా + 2 ఎంపీ మాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 471 సెల్ఫీ కెమెరా 5జీ కనెక్టివిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సి, 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, యుఎస్బి టైప్-సి పోర్ట్ 65డబ్ల్యు సూపర్ వీఓఓసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!) -
తక్కువ ధరలో వన్‌ప్లస్ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్..! ఫీచర్స్ లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తక్కువ ధరలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈకు కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ రానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ కంటే తక్కువ ధరలోనే..! గత ఏడాది వన్‌ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ కేటాగిరీలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరలోనే Nord CE 2 ను విడుదల చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతోంది. అంతేకాకుండా మొదట భారత్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20 వేల నుంచి మొదలుకానుంది. దీనికంటే తక్కువ ధరకే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 రానుంది. OnePlus Nord CE 2 Lite 5G ఫీచర్స్ అంచనా..! 6.59-అంగుళాల ఫుల్ HD+ ఫ్లూయిడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 OxygenOS Qualcomm Snapdragon 695 చిప్సెట్ 64ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ 5జీ సపోర్ట్ చదవండి: రూ. 2,83,666 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..! -
OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన వన్‌ప్లస్ సూపర్ స్మార్ట్‌ఫోన్..!
యాపిల్, శామ్ సంగ్ మొబైల్స్ తర్వాత అంత క్రేజ్ వన్‌ప్లస్ మొబైల్స్‌కి ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్మడు పోతాయి. అయితే, తాజాగా వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ని చైనా మార్కెట్లో మొదట విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ వస్తుంది. ఈ మొబైల్ 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో వస్తుంది. కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ కూడా హైపర్ బూస్ట్ టెక్నాలజీతో రానున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో ధర: వన్ ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను సిఎన్‌వై 4,699 (సుమారు రూ. 54,500)కు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 4,999(సుమారు రూ. 58,000)కు లభిస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 5,299 (సుమారు రూ. 61,500)కు లభిస్తుంది. ఇది చైనాలో జనవరి 13 నుంచి సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ వన్‌ప్లస్ 10 ప్రోను ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయం పేర్కొనలేదు. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్: 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ గల కలర్ ఓఎస్ 12.1 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ 12 జీబీ ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ సపోర్ట్ 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ (చదవండి: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే..?) -
స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో!
న్యూ ఇయర్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో న్యూఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. తాగాజా స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 'వన్ ప్లస్ 10ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా..ఆఫోన్కు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. అంతేకాదు కొత్త ఏడాదిలో ఎప్పుడు మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు వన్ ప్లస్ ప్రతినిధులు. OnePlus 10 Pro from all angles launching on January 11, 2022 in China.#OnePlus #Oppo pic.twitter.com/FFFWq97ZQ9 — Abhishek Yadav (@yabhishekhd) December 30, 2021 అఫీషియల్‌గా చైనా సోషల్ మీడియా 'వైబో' కథనం ప్రకారం.. వన్‌ప్లస్ అఫీషియల్‌గా జనవరి 11,2022న చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అక్కడ విడుదల చేసిన తరువాత వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనుంది. 'వన్ ప్లస్ 10ప్రో' స్పెసిఫికేషన్లు చైనాలో విడుదలైన వన్ ప్లస్ 10ప్రో వీడియో ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్ 50ఎంపీ మెయిర్ రేర్ కెమెరా 6.7 కర్వుడ్ ఎల్టీపీఓ 2.0 అమోలెడ్ డిస్ప్లే 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ చదవండి: కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు -
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 9ఏ, రెడ్మీ నోట్ 10ఎస్, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5G, శాంసంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్మీ నార్జో 50ఏ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ వంటి స్మార్ట్ఫోన్స్తో పాటుగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్స్‌కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..! ► వన్‌ప్లస్ నార్డ్ 2 5G 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా బోనస్‌గా రూ. 16,950 వరకు అమెజాన్ అందిస్తోంది. ► వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అమెజాన్ అందిస్తోంది. ► రెడ్మీ నోట్ 10ఎస్ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. ► షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చును. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 19,950 కూడా రానుంది. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్! సోదాలు చేస్తోన్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్స్ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి. -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్‌ప్లస్ ..!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకెళ్లింది. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్ల(1 కోటి) మొబైల్స్ విక్రయించింది. తాము అనుకున్న లక్ష్యం కంటే ముందే ఈ మార్క్ చేరుకున్నట్లు పీట్ లావ్ తెలిపారు. వన్‌ప్లస్ కంపెనీ 8వ వార్షికోత్సవం సందర్భంగా వీబోలో రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు. వన్‌ప్లస్ 9 సిరీస్ లాంఛ్ అయిన 10 సెకండ్లలోనే 40 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాగాయని తెలిపారు. అందుబాటు ధరలో వన్‌ప్లస్ 9ఆర్, 9ఆర్టీ స్మార్ట్ఫోన్లను కూడా ఈ ఏడాది వన్‌ప్లస్ లాంఛ్ చేయడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. 2021 ప్రధమార్ధంలో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్స్ 257 శాతం వృద్ధి నమోదు చేశాయి. అమెరికాకు షిప్ మెంట్లు సంవత్సరానికి 428% పెరిగాయి. 2021 ఐరోపాలో వన్‌ప్లస్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో అత్యధిక వృద్ది రేటు సాధించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్ అమ్మకాలు ఏకంగా 304 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక భారత్‌లో 29 శాతం వార్షిక వృద్ధి సాధించగా, ఈ ఏడాది మూడో క్వార్టర్లో రూ. 30,000పైబడిన స్మార్ట్ఫోన్ల విక్రయంలో 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు వన్‌ప్లస్ వెల్లడించింది. అలాగే, వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరం సభ్యులు 11 మిలియన్లకు చేరుకుంది. వన్‌ప్లస్ సంస్థ కొత్త ఏడాదిలో 10 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. ఈ మొబైల్స్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నాయి. (చదవండి: 120 కిమీ రేంజ్‌తో మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) -
నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న
China Poco M3 battery explodes in india : చైనాకు చెందిన మరో కంపెనీ స్మార్ట్ ఫోన్ పేలింది. నవంబర్ 3న చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ పేలిందంటూ ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ 'పోకో' కు చెందిన 5జీ ఫోన్ పేలింది. ట్వీట్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 'పోకో' ఈ ఏడాది మనదేశంలో 'పోకో ఎం3' అనే 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంఛ్ చేసింది. లాంఛ్ సందర్భంగా మహబూబ్‌నగర్ కు చెందిన ఓ యువకుడు ఆఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాజాగా (నవంబర్ 27న) ఆ ఫోన్ పేలింది. దీంతో ఫోన్ పేలుడు ఘటనపై బాధితుడి అన్న మహేష్ ట్వీట్ చేశాడు. తన తమ్ముడు వినియోగిస్తున్న ఈ 5జీ ఫోన్ పేలిదంటూ మహేష్ ట్విట్లో పేర్కొన్నాడు. కానీ ఎందుకు పేలింది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. Hey @geekyranjit look at this. Another blast. This time it's Poco M3.https://t.co/BxdtZcUaj6 pic.twitter.com/DdAP25ZTrf — 𝕊𝕠𝕦𝕣𝕒𝕧 ℍ𝕒𝕥𝕚 (@Souravhati1999) November 27, 2021 మరి కొద్ది సేపటికి మహేష్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే పోకో ఫోన్ పేలింది అంటూ సౌరబ్ హతి అనే ట్విట్టర్ యూజర్ మహేష్ ట్వీట్‌ను షేర్ చేశారు. సౌరబ్ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. యూజర్ల భద్రతే తమకు ముఖ్యం అంటూ, ఫోన్ పేలడాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటాం' అంటూ రిప్లయి ఇచ్చారు. Hello Sourav, we are sorry to hear this and hope that you are safe. Your safety is our number one priority and we strive to make the highest quality products. Please share the details below and we will look into this on priority. Please refrain from sharing any personal (1/2) — POCO India Support (@POCOSupport) November 27, 2021 మహేష్ షేర్ చేసిన ట్వీట్లో బాధితుడి అన్న చేసిన ట్వీట్ ఆధారంగా పోకో 5జీ ఫోన్ కింది సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. కెమెరా మాడ్యుల్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ పేలడంపై పలు నేషనల్ మీడియా పోకో సంస్థను సంప్రదించింది. దీంతో ఫోన్ పేలుడుకు సంబంధించి పోకో బృందం దర్యాప్తు చేస్తుంది. సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అంతేకాదు పోకో' కి ఇండియన్ యూజర్ల భద్రత చాలాముఖ్యం. ఇలాంటి విషయాల్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాం. సమస్యను పరిశీలించి కస్టమర్‌కు అండగా నిలుస్తాం అంటూ వివరణ ఇచ్చింది. చదవండి : యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్ పేలింది..! -
దేవుడా..! ఏకంగా స్మార్ట్‌ఫోన్‌తో సినిమానే తీశారే..!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఏళ్లతరబడి నుంచి పాతుకుపోయినా యాపిల్, శాంసంగ్ కంపెనీలకు వన్‌ప్లస్ గట్టి పోటీనే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఒకానొక సమయంలో వన్‌ప్లస్ యూజర్లు తీసిన ఫోటోలను కంపెనీ బిల్బోర్డ్స్గా కూడా వాడుకుంది. తాజాగా వన్‌ప్లస్ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమానే చిత్రించారు. మొత్తం షూట్ వన్‌ప్లస్ 9ప్రోతోనే..! విక్రమాదిత్య మోట్వానేకు చెందిన ఆందోళన్ ప్రొడక్షన్, బిగ్ బ్యాడ్ వోల్ఫ్ స్టూడియోస్, ఆడ్ అండ్ ఈవెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 2024 అనే ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందించారు. 60 నిమిషాలపాటు సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తిగా వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో 8కే రికార్డింగ్‌లో చిత్రించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది.ఈ సినిమాలోని విజువల్స్ ప్రొఫెషనల్ సినిమా కెమెరాతో తీసినట్లుగానే అద్భుతంగా వచ్చాయి. చదవండి: కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే -
OnePlus: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు స్క్రీన్లు!!
OnePlus Foldable Phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది వన్‌ఫ్లస్ బ్రాండ్. జనాల్లో క్రేజ్ పెంచుకునేందుకు ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను ప్రకటించి.. టైం చూసి మార్కెట్లోకి వదలడానికి ఎదురుచూస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. వన్‌ఫ్లస్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్ (మడత ఫోన్) మార్కెట్లోకి తీసుకురానుంది. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోందట. అంతేకాదు అది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఉండబోతోదట!. కిందటి ఏడాదిలోనే చైనాలో పేటెంట్ డాక్యుమెంట్లను bbk electronics కంపెనీ సమర్పించిందని, ఈ ఏడాది జులైలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కూడా అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వివరాల ద్వారా వెల్లడైంది. ప్రతీకాత్మక చిత్రం ఇక వన్‌ఫ్లస్ తేబోతున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు దిశలో(ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టేదిగా ఉంటుందని, యూజర్ అప్లికేషన్లు సైతం ఎక్కువగా అందిస్తుందని ఆ డాక్యుమెంట్లలో ఉంది. స్లైడింగ్ కీ ప్యాడ్‌తో ఇది రానుంది. అంతేకాదు డబుల్ హింగ్డ్ టెక్నాలజీతో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది. నిజానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ రానుందనే వార్త చాలాకాలమే వినిపించింది. శాంసంగ్ పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా గెలాక్సీ జీ ఫోల్డ్ సిరీస్‌ను బీట్ చేసేందుకు తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. కానీ, ఆ టైంలో వన్‌ఫ్లస్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజా నిర్ధారణతో త్రీ ఫోల్డ్స్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై బంపరాఫర్! ఏకంగా 40 శాతం తగ్గింపు!.. వివరాలు -
స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై అమెజాన్ బంపర్ ఆఫర్..! ఏకంగా 40 శాతం...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌ను ప్రకటించింది. ‘ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ ’పేరుతో పలు స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ సేల్‌లో భాగంగా షావోమీ, శాంసంగ్, వన్‌ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లపై, మొబైల్ ఉపకరణాలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్ నవంబర్ 24 నుంచి ప్రారంభమై నవంబర్ 28తో ముగియనుంది. చదవండి: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..! ‘ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్’లో పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్స్‌లో కొన్ని...! ►షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ: 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 26,999 ఉండగా ఈ సేల్‌లో భాగంగా రూ. 19999కే కొనుగోలుదారులకు లభించనుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 39,990 ఉండగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా రూ. 38, 740కు రానుంది. ►వన్‌ప్లస్ 9ప్రో: ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 54,999 లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ కూపన్‌ను కూడా పొందవచ్చును. ►ఐక్యూ జెడ్5 5జీ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 20,615కే కొనుగోలుదారులకు లభించనుంది. ►ఐక్యూ జెడ్3 5జీ: ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 17,865 కే లభించనుంది. ►షావోమీ ఎమ్ఐ 11ఎక్స్ 5జీ: ఎక్స్చేంజ్ ఆఫర్, ఎస్బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 21,749 కే రానుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎమ్12: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లిస్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 10,349కు కొనుగోలుదారులకు లభించనుంది. చదవండి: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో? -
యువకుడి జీన్స్ ఫ్యాంట్లో స్మార్ట్ ఫోన్.. టపాసుల్లా పేలింది..!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'వన్‌ప్లస్' కు చెందిన ఛార్జర్లు, ఫోన్లు టపాసుల్లా పేలుతున్నాయి. ఇప్పటికే పలువురు వన్ ప్లస్‌కు చెందిన తమ ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయని, తగిన న్యాయం చేయాలని కోరుతూ కోర్ట్ మెట్లెక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరో వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడి జీన్స్ ఫ్యాంట్ జేబులో ఉన్న వన్ ప్లస్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Hi Suhit. Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 3, 2021 నవంబర్ 3న ట్విట్టర్ యూజర్ సుహిత్ శర్మ(suhit sharama) అనే యూజర్ వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ నార్డ్ 2 బ్లాస్ట్ అయ్యిందంటూ తీవ్రంగా గాయపడ్డ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేశారు. అంతేకాదు @OnePlus_IN మీ నుండి ఇది ఎప్పుడూ ఊహించలేదు. #OnePlusNord2Blast మీ ఫోన్ ఏం చేసిందో చూడండి అంటూ జీన్స్ ఫ్యాంట్లో ఫోన్ పేలిన ఇమేజెస్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈఘటనలో వన్ ప్లస్ యాజమాన్యం తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి. త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. సుహిత్ శర్మ ట్వీట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంత మంది యూజర్లు ఇప్పుడే తాము వన్ ప్లస్‌కు చెందిన ఫోన్లను బుక్ చేసుకున్నాం. వాటిని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తామని రీట్వీట్లు పెడుతున్నారు. Just order today now going to cancel Shame @OnePlus_IN pic.twitter.com/JDvdVVuAdK — KJ (@KJ_P00) November 8, 2021 అయితే ఆ ట్వీట్లపై ఇండియా వన్ ప్లస్ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి సమస్య ఎదుర్కొన్నందుకు క్షమించండి. బాధితుడికి అండగా ఉంటాం.డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. పరిశీలించి, తగిన సాయం చేస్తాం' అంటూ ట్వీట్ చేసింది. Hi Akshay! We are sorry you had such an issue. We strive to provide the best experience for you, please initiate a direct message so that we can check and assist you further. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) November 8, 2021 చదవండి: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్ -
దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ 5జీ స్మార్ట్ఫోన్ల షిప్ మెంట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఊపందుకున్నాయి. సీఎమ్ఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్లు 22 శాతం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్ లభించడమే అని సీఎమ్ఆర్ తెలిపింది. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, శామ్ సంగ్, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల 5జీ ఎక్కువగా అమ్ముడయ్యాయి అని పేర్కొంది. "ఈ ఐదు బ్రాండ్లు కలిసి క్యూ3 2021 సమయంలో 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,227 కోట్ల)కు పైగా 5జీ స్మార్ట్ఫోన్లను రవాణా చేశాయి" అని సీఎమ్ఆర్ లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు షిప్రా సిన్హా చెప్పారు. 5జీ స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా భారీగా డిమాండ్ ఉంది. అందుకే, భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ పరంగా 47 శాతం త్రైమాసీకంలో(క్యూవోక్యూ) వృద్ధి చెందింది. ఉదాహరణకు.. షియోమీ 23 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. శామ్ సంగ్ 18 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంటే, ఆ తర్వాత వివో, రియల్ మీ ఒక్కొక్కటి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, యాపిల్ షిప్ మెంట్ పరంగా 32 శాతం వృద్ధి నమోదు చేసింది. సూపర్ ప్రీమియం(రూ.50,000- 1,00,000) విభాగంలో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా ఇతర ఐఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. (చదవండి: మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్!) -
వన్‌ప్లస్ 9 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ త్వరలో 9 సిరీస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రిలీజ్చేయనుంది. వన్‌ప్లస్ 9ఆర్కు అప్‌గ్రేడ్‌గా వన్‌ప్లస్ 9ఆర్టీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 13 న చైనాలో లాంచ్ చేయనుంది. అదే రోజున భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 23 వేల నుంచి 34 వేల మధ్యలో ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? వన్‌ప్లస్ 9ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ 50+16+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 బ్యాటరీ 4500ఎమ్ఏహెచ్ ఫ్లాష్ చార్జ్ చదవండి: స్పేస్ఎక్స్ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..! -
స్మార్ట్‌ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన వన్‌ప్లస్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. వన్‌ప్లస్ తన అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యాన్నికూడా వన్‌ప్లస్ అందించనుంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9 స్మార్ట్ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్ 9ఆర్ ధర రూ. 36,999, కాగా వన్‌ప్లస్ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్ 4 నుంచి వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఎస్బీఐ కార్డులపై కూడా 7 వేల తగ్గింపు వర్తించనుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ వై, యూ సిరీస్ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ వై సిరీస్ 32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది. అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది. వన్‌ప్లస్ యూ సిరీస్ 50-అంగుళాల స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు రానుంది. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! -
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అక్టోబర్ 3 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు సంబంధించిన ఆఫర్లను, క్యాష్‌బ్యాక్ అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేస్తోంది. తాజాగా వన్‌ప్లస్ 9, 9 ప్రో మోడళ్లపై కొనుగోలుదారులకు భారీ తగ్గింపుతో అమెజాన్ అందించనుంది. అందుకు సంబంధించిన ఆఫర్‌ను అమెజాన్ తాజాగా టీజ్ చేసింది. చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! వన్‌ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభించనుంది. వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 64,999 కాగా, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 54,999 గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 9, 9 ప్రో వేరియంట్లపై వరుసగా పదివేలు, 15 వేల డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ, 256జీబీ వేరియంట్లలో వన్‌ప్లస్ 9 ప్రో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9 వేరియంట్ 8జీబీ, 12 జీబీ ర్యామ్స్తో కూడా లభించనున్నాయి. చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...! -
ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...!
OnePlus Nord 2 5G-Related Explosion: వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ పేలిందంటూ ఢిల్లీ న్యాయవాది వన్‌ప్లస్ కంపెనీపై కేసు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగుళూరుకు చెందిన మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలిందంటూ ఆరోపణలు వచ్చాయి. వరుస పేలుడు సంఘటనలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఛార్జర్ పేలిందంటూ కేరళ వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన జిమ్మీ రోజ్ వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌ను ఎలక్ట్రిక్ వాల్ సాకెట్‌కు కనెక్ట్ చేయగా... ఒక్కసారిగా భారీ శబ్దంలో పేలిందని ట్విటర్లో చిత్రాలను పోస్ట్ చేశాడు. ఛార్జర్ పేలడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యానని జిమ్మీ రోజ్ తెలిపాడు. స్పందించిన వన్‌ప్లస్...! ఛార్జర్ పేలిన సంఘటనపై వన్‌ప్లస్ స్పందించింది. కంపెనీ అందించిన పరికరాల్లో ఎలాంటి లోపాలు లేవని పేర్కొంది. ఒక్కసారిగా వచ్చిన వోల్టేజ్ హెచ్చుతగ్గుల వంటి బాహ్య కారకాల వల్లే పేలుడు సంభవించిందని పేర్కొంది. వన్‌ప్లస్ ఒక ప్రకటనలో కస్టమర్లు చేసే ఈ క్లెయిమ్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా యూజర్‌కు రీప్లేస్మెంట్ కూడా అందించామని వన్‌ప్లస్ వెల్లడించింది. ఛార్జర్ పేలడానికి గల కారణాలను యూజర్‌కు నివృత్తి చేశామని తెలిపింది. వోల్టోజ్ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు శక్తివంతమైన కెపాసిటర్లను ఛార్జర్లో ఏర్పాటు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ పేలుడు సంఘటనను వన్‌ప్లస్ క్షుణంగా విశ్లేషించింది. బాహ్య కారకాల వల్లే పేలుడు సంభవించిందని వన్‌ప్లస్ పేర్కొంది. I wanted to get this to your immediate attention. My OnePlus Nord 2 warp charger blasted with a huge sound and it blew up the socket. Luckily I'm alive to make this tweet. The Nord 2 is working. but this is scary af. I'm still in shock😐@OnePlus_IN @oneplus @OnePlus_Support pic.twitter.com/K3fXCyGzNp — Jimmy Jose (@TheGlitchhhh) September 25, 2021 చదవండి: ఆన్లైన్లో గేమ్స్ ఆడేవారిపై సైబర్ నేరస్తుల దాడులు..! -
గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్..! చర్యలకు సిద్దమైన కంపెనీ..!
Oneplus Sends Legal Notice To User: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ పేలిందని ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్ నోటీసులను పంపింది. కంపెనీ ప్రతిష్టదిగజారేలా ఆరోపణలు చేశాడని వన్‌ప్లస్ వెల్లడించింది. చదవండి: Apple Witnesses Record Iphone 13 Pre Orders: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! అసలు ఏం జరిగదంటే..! ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి ఈ నెల ఎనిమిదో తారీఖున వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కోర్టులో ఉండగా తన గౌనులో ఒక్కసారిగా పేలిందని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ పేలిన చిత్రాలను ట్విటర్లో పోస్ట్చేశాడు. వన్‌ప్లస్ కంపెనీ వినియోగదారులను మోసం చేస్తోందని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది. చర్యలకు సిద్దమైన వన్‌ప్లస్..! లాయర్ కోర్టులో వన్‌ప్లస్ కంపెనీపై పిటిషన్ దాఖలు చేయగా..తాజాగా వన్‌ప్లస్ యాజమాన్యం పిటిషన్ స్పందిస్తూ.. లాయర్‌కు దిమ్మే తిరిగేట్టుగా వన్‌ప్లస్ షాకిచ్చింది. సార్ట్‌ఫోన్‌పేలిందటూ లాయర్ అనవరంగా ఆరోపణలు చేశారని గౌరవ్ గులాటికి వన్‌ప్లస్ లీగల్ నోటీసులను పంపింది. వన్‌ప్లస్ తమ నోటీసుల్లో..కంపెనీపై తప్పడు ఆరోపణలు చేశాడని మండిపడింది. తమ ఫోన్లో ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించింది. ట్విటర్లో పబ్లిష్ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలంటూ కంపెనీ తమ పిటిషన్లో పేర్కొంది. లాయర్ చేసిన ఆరోపణలతో వన్‌ప్లస్ ప్రతిష్ట దిగజారిందని పిటిషన్లో పేర్కొంటూ..లాయర్‌పై పరువునష్టం దావాను కూడా వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్ ద్రావిడ్..ఇప్పుడు నీరజ్ చోప్రా..! సరికొత్త రూపంలో.. -
వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో 9 ఆర్టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్‌ప్లస్ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం) వన్‌ప్లస్ 9 ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల శామ్ సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 766 సెన్సార్ ట్రిపుల్ సెటప్ కెమెరా 65డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో పాగవేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. భవిష్యత్తులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. రూ. 20 వేల కంటే తక్కువ ధరల్లో లాంచ్ చేయాలని వన్‌ప్లస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 రెండో త్రైమాసికంలో ఈ బడ్జెట్ ఫోన్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పోతో విలీనం చెందిన తరువాత వన్‌ప్లస్ తన ఆక్సిజన్‌ఓఎస్‌ను ఓప్పో కలర్ఓఎస్తో వీలినం చేస్తోన్నట్లు ప్రకటించింది. చదవండి: Gmail: జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్...! ప్రముఖ డేటా ఇంజనీర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యోగేష్ బ్రార్ వన్‌ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్స్ రూ. 20 వేలపైనే ఉన్నట్లు తెలిపారు. నార్డ్ సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి సరసమైన ధరలకు (రూ. 20 వేల కంటే తక్కువ) స్మార్ట్ఫోన్లను తీసుకురావడంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసించాలని వన్‌ప్లస్ చూస్తోందని యోగేష్ బ్రార్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 200-5 జీ వంటి ఫోన్లను కంపెనీ యుఎస్ , కెనడా వంటి మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అయితే ఈ మోడల్స్‌ను ఇంకా భారత్‌లోకి తీసుకురాలేదు. చదవండి: Google Photos: మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...! -
వన్‌ప్లస్ యూజర్లకు బంపర్ ఆఫర్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇండియా ఎంపిక చేసిన మోడల్స్ బ్యాటరీ రీప్లేస్ మెంట్ కోసం ఆఫర్ అందిస్తోంది. వన్‌ప్లస్ కంపెనీ భారతదేశంలో వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 5 సిరీస్, వన్‌ప్లస్ 6 సిరీస్ ఫోన్ బ్యాటరీలను 50 శాతం ధరకే ఇవ్వనున్నట్లు తెలిపింది. మీ దగ్గర కనుక వన్‌ప్లస్ 3 - వన్‌ప్లస్ 6 సిరీస్ మధ్య గల ఫోన్ ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ తన పోర్టల్ దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. మీరు మీ మొబైల్ ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే పాత మోడల్స్ బ్యాటరీ మార్చుకోవడం ఉత్తమం. కంపెనీ అధికారిక పోర్టల్ ద్వారా మీరు మీ వన్‌ప్లస్ బ్యాటరీని మార్చవచ్చు. ఇక్కడ లింక్ ఉంది. ఇక గత కొంత కాలంగా వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. లాంఛ్ కు ముందే ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఒక ప్రసిద్ధ టిప్ స్టార్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ఫోన్ కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారు. వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఉంటుందని, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని పోస్ట్ చేశారు. అలాగే, 9ఆర్ టీలో 65 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు.(చదవండి: చైనా దెబ్బకి పండగ సీజన్లో నో డిస్కౌంట్స్) -
లీకైన వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోయే 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయినట్లు తెలుస్తుంది. చైనా టిప్ స్టార్ ఒకతను చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబోలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. వన్‌ప్లస్ 9ఆర్ టీ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది అని కూడా తెలిపారు. వన్‌ప్లస్ 9ఆర్ టీ 8/128 జీబీ వేరియంట్, 8/ 256 జీబీ అనే రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాలో వన్‌ప్లస్ 9ఆర్ టీ 8/128 జీబీ ధర రూ.39,999గాను, వన్‌ప్లస్ 9ఆర్ టీ 8/256 జీబీ వేరియంట్ ధర రూ.43,999 ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల శామ్సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో రానునట్లు తెలుస్తుంది. దీని డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రానున్నట్లు టిప్ స్టార్ పేర్కొన్నారు. ఈ ఫోన్ 8జీబీ ఎల్ పీడిడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్ తో వస్తుందని తెలిపారు. వన్‌ప్లస్ 9ఆర్ టీ మన దేశంలో అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(చదవండి: హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్) -
ఈ ఇయర్ బడ్స్‌తో వింటే చెవులకు స్ట్రెస్ ఉండదట ! న్యూ గాడ్జెట్
కరోనా కారణంగా గేమింగ్ ఇండస్ట్రీ జోరందుకుంది.అయితే వారికి అనుగుణంగా ఆయా టెక్ సంస్థలు పలు గాడ్జెట్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా గేమింగ్ ప్రియులు వినియోగించేందుకు వీలుగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ 'వన్‌ప్లస్ బడ్స్ ప్రో'ను మన దేశంలో విడుదల చేసింది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ఫీచర్స్ తాజాగా విడుదలైన ఈ వన్ ప్లస్ బడ్స్ ప్రోను వినియోగించే సమయంలో చుట్టుపక్కల నుంచి వచ్చే డిస్టబెన్స్ లేకుండా, ఒత్తిడి తగ్గించేందుకు జెన్ మోడ్ ఎయిర్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు వైర్ లెస్ ఛార్జింగ్, 1 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ బరువున్న ఏ వస్తువు ఈ ఇయర్ బర్డ్ పై పడినా.. ఎలా డ్యామేజీ కలగకుండా ఉండే (ఐపీ - 44 సర్టిఫికేషన్ ) ఫీచర్ తో డిజైన్ చేశారు. యూఎస్బీ టైప్‌సీ పోర్ట్, సౌండ్ ను ప్రొడ్యూస్ చేసే 11ఎంఎం మ్యాగ్నెటిక్ డైనమిక్ డ్రైవర్లు, హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్సీ), మూడు ఏఎన్సీ మోడ్లుతో పాటు ఎక్స్ట్రీం, ఫెయింట్, స్మార్ట్ మోడ్‌లో ఏఎన్సీ వినియోగించుకునే సౌకర్యం ఉంది. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ, 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుండగా..10 నిమిషాల చార్జింగ్ పెడితే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నారు. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర గ్లాసీ వైట్, మాట్ బ్లాక్ రంగుల్లో ఉండే ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర రూ.9,990గా నిర్ణయించారు. ఆగస్ట్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చని వన్ ప్లస్ ప్రతినిధులు వెల్లడించారు. -
మార్కెట్లోకి మరో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మొబైల్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ తీసుకోని వచ్చేందుకు సిద్దం అయ్యింది. వన్‌ప్లస్ 9ఆర్ టీ మొబైల్ చైనాలో లాంచ్ కు సిద్దంగా ఉంది అని సమాచారం. చైనా కంపెనీ తన 'టి' సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ పై పనిచేస్తున్నట్లు ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఈ వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?) వన్‌ప్లస్ 9ఆర్ టీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 120హెర్ట్జ్ ఆమో ఎల్ఈడీ ప్యానెల్, 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ గల ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు అని నివేదిక పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ మన దేశంలో రాబోయే అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. -
హ్యాండ్‌బ్యాగ్‌లో ఒక్కసారిగా పేలిన స్మార్ట్‌ఫోన్..!
బెంగళూరు: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2 5జీఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరుకు చెందిన అంకూర్ శర్మ భార్య ఐదు రోజుల క్రితమే వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసింది. రోజువారి దినచర్యలో భాగంగా అంకూర్ భార్య ఆదివారం రోజున ఉదయం సైక్లింగ్ చేస్తూ వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్‌ను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లింది. కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలింది. దీంతో ఉలిక్కిపడ్డ అంకూర్ భార్యకు యాక్సిడెంట్ జరిగింది. తరువాత తేరుకున్న అంకూర్ భార్య తన బ్యాగు నుంచి పొగలు రావడంతో షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని అంకూర్ ట్విటర్ ద్వారా వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్‌కు రిపోర్ట్ చేశాడు. పేలుడుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై వన్‌ప్లస్ స్పందించింది. అంకూర్ చేసిన ట్విట్‌కు వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ రిప్లై ఇచ్చింది. ఫోన్ పేలిపోయినందుకు చింతిస్తున్నామని వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ పేర్కొంది. పేలుడుకు సంబంధించిన విషయాన్ని నేరుకు కంపెనీకి మెసేజ్ చేయాల్సిందిగా సూచించారు. ఫోన్లో ఏర్పడిన లోపంను విశ్లేషించి, తిరిగి కొత్త ఫోన్‌ను అందిస్తామని తెలియజేశారు. కాగా ఫోన్ పేలుడుకు సంబంధించి బాధితుడికి ఏమైనా పరిహారం ఇచ్చారా లేదా..! అనే విషయం తెలియాల్సి ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా ఒకసారి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలింది. అప్పుడు కూడా వన్‌ప్లస్ ఇదే రకంగా స్పందించింది. Hi Ankur. We are gutted to hear about your experience. We are deeply concerned and want to make it up to you. We request you to connect to us over a direct message so that we can make amends and turn this around for you. https://t.co/Y6rHuMwu8J — OnePlus Support (@OnePlus_Support) August 1, 2021 -
అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 2
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్: 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్) 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్) 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 189 గ్రాముల బరువు -
భారీగా పెరిగిన వన్‌ప్లస్ టీవీ ధరలు...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తన యూజర్లకు భారీ షాక్‌నిచ్చింది. భారత మార్కెట్లో టీవీలకు ఉన్న గిరాకీని కంపెనీ క్యాష్ చేసుకోవడం కోసం టీవీల మార్కెట్లోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా వన్‌ప్లస్ తీసుకున్న నిర్ణయంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లుపడనుంది. వన్‌ప్లస్ తన టీవీ ధరలను గణనీయంగా పెంచింది. సుమారు వన్‌ప్లస్ టీవీ శ్రేణిల్లో ఆరు మోడళ్ల కొత్త ధరలను ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ టీవీ 32ఇంచ్వై1మోడల్‌ను 2 వేలు పెంచి రూ.18,999లుగా, టీవీ40వై1మోడల్‌ను రూ.2,500 పెంచి రూ.26,499లుగా, టీవీ43వై1 మోడల్‌ను రూ.2500 పెంచి కొత్త ధరను రూ.29,499లుగా, టీవీ 50యూ1ఎస్ మోడల్‌ను ఏకంగా రూ. 7000 పెంచి కొత్త ధర 46,999గా. టీవీ 55యూ1ఎస్ మోడల్‌ను రూ. 5000 పెంచి కొత్త ధరను రూ.52,999లుగా, టీవీ 65యూ1ఎస్ మోడల్‌ను రూ.6000 పెంచిన కొత్త ధరను రూ.68,999లుగా నిర్ణయించింది. -
జులై 22న వచ్చేస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే!
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా): 6.43 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 12 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా -
OnePlus Nord 2: త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 2
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక టీజర్లో ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ 2పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. తాజాగా కంపెనీ నార్డ్ 2 గురించి అధికారిక వివరాలను టీజ్ చేసింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో రావచ్చని సమాచారం. భారతీయ కస్టమర్ల కోసం వన్‌ప్లస్, మీడియాటెక్ తో జతకట్టినట్లు కంపెనీ తెలిపింది. మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గా వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ నిలవనుంది. గతంలో వన్‌ప్లస్ ఏ మోడల్లో వాడని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీని దీనిలో ఉపయోగించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2లో AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్‌ను చేర్చనుంది. కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు అదే బ్రైట్ నెస్, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ కనెక్టివిటీ సపోర్ట్‌తో వచ్చే వన్‌ప్లస్ నార్డ్ 2లో 6.43 అంగుళాల డిస్ప్లే తీసుకు రానున్నారు. ఈ డిస్ప్లే ఓఎల్‌ఇడీ టెక్నాలజీ, ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇక, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చే అవకాశం ఉంది. -
లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు
కొద్ది రోజుల క్రితమే వన్ ప్లస్ నార్డ్ సీఈ విడుదల అయ్యిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నార్డ్ 2కి సంబంధించిన పుకార్లు బయటకి వస్తున్నాయి. గత ఏడాది విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్ లను వెల్లడించిన టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్ అకా @OnLeaks సోమవారం మరికొన్ని వివరాలను షేర్ చేశారు. ఏఐ బెంచ్ మార్క్ వెబ్ సైట్ లో లిస్టింగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఎస్ వోసిపై సమాచారం లీక్ అయిన వెంటనే ఈ వార్త వచ్చింది. ఈ ఫోన్ జూలైలో మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డి + అమోల్డ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ లో హెమ్మర్స్ఆఫర్(అకా ఆన్ లీక్స్) షేర్ చేసిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ నార్డ్ 2 డిస్ప్లే పై ఎడమ మూలలో సెల్ఫీ స్నాపర్ హోల్-పంచ్ కటౌట్ ను కలిగి ఉంటుంది. ఇందులో వాల్యూమ్ రాకర్ ఎడమ అంచున ఉంది, కుడి అంచులో పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉంది. వన్ ప్లస్ నార్డ్ 2లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్ లో ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా యుఎస్ బి టైప్-సీ పోర్ట్, సీమ్ ట్రే, దిగువన స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఏఐ బెంచ్ మార్క్ లిస్టింగ్ ప్రకారం స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ తో వస్తుందని తెలుస్తుంది. చదవండి: ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జస్ప్రీత్ బుమ్రా..!
ముంబై: ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రాను ఎంచుకుంది. కంపెనీ తయారీ చేసిన వేరబుల్ విభాగపు ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు బుమ్రా డిజిటల్ ఫ్లాట్‌పామ్ వేదికగా ప్రచారం చేస్తారని కంపెనీ తెలిపింది. ‘‘ఫిట్నెస్ పట్ల రాజీలేని తత్వం, ఫ్యాషన్ పట్ల మంచి అభిరుచిని కలిగిన ఉన్న బూమ్రా దేశంలో ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి యువ క్రికెటర్‌తో భాగసామ్యం ద్వారా బ్రాండ్ థీమ్ ‘నెవర్ సెటిల్’ అనే ట్యాగ్‌లైన్‌కు పరిపూర్ణత లభిస్తుందని విశ్వస్తున్నాము’’ అని కంపెనీ ఇండియా విభాగపు అధికారి ఒకరు తెలిపారు. కాగా వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింన విషయం తెలిసిందే. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం
వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ చివరకు ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది. వన్ ప్లస్ కస్టమర్ ల కొరకు "ఇంకా మెరుగైన ఉత్పత్తులను" అందించడానికి ఒప్పోతో విలీనం అయినట్లు సీఈఓ ఫోరం పోస్ట్ లో పేర్కొన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కింద ఉన్నాయి. వాటితో పాటు వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కూడా సహ-స్థాపించారు. డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్
వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్‌ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్ సీఈ 5జీ' స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్‌ప్లస్ ఎదురు చూశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999 చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర
దేశీయ మొబైల్ మార్కెట్ లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి మొబైల్స్ తీసుకొచ్చిన వన్‌ప్లస్, హత్య కొద్దీ రోజుల హై ఎండ్ మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో మిడ్ రేంజ్ అభిమానులు అందరూ వన్‌ప్లస్ నుంచి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంస్థ తిరిగి మిడ్ రేంజ్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10న విడుదల చేయబోతున్నది. లాంచ్ చేయడానికి కొద్దీ రోజుల ముందు ఇండియాలో ఈ కంపెనీ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్‌ప్లస్ టీవీ యు 1 ఎస్ ధరలను ట్విటర్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండనున్నట్లు తెలుస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు అదనంగా రూ.1,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చే ఉంది. ఈ ఆఫర్ కూడా జూన్ మే 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది. లీక్‌ల ప్రకారం రాబోయే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. అలాగే ఇది 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్‌ప్లస్ కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు. చదవండి: జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్ -
వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తీసుకొని రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ జూన్ 10న తన సమ్మర్ లాంచ్ ఈవెంట్లో కొత్త వన్‌ప్లస్ టీవీ యు-సిరీస్ మోడళ్ తో పాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గతంలో యూరప్, ఉత్తర అమెరికాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీని పోలి ఉంటుందని తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ ఫోన్ గురించి మరికొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు ఆండ్రాయిడ్ సెంట్రల్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ పేరులో సీఈ అంటే కోర్ ఎడిషన్ అని అర్ధం. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ టీవీ యు సిరీస్‌తో పాటు లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 16 నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఓపెన్ సేల్ కి వస్తుంది. చదవండి: పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్ -
బడ్జెట్ ధరలో అదిరిపోయిన వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ
కొద్దీ నెలలు క్రితం వరకు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమ సత్తా చాటిన చైనా మొబైల్ కంపెనీలు. ఇక తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. కేవలం మొబైల్ మార్కెట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే వన్‌ప్లస్ ఇండియా తన టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీలను విడుదల చేస్తుంది. తాజాగా వన్‌ప్లస్ భారతదేశంలో వన్‌ప్లస్ 40 వై 1 స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇది 40 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. దీని ధర రూ.21,999. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ వై-సిరీస్‌లో ఇప్పటికే 32-అంగుళాల, 43-అంగుళాల టీవీలను విడుదల చేసింది. అలాగే, వన్‌ప్లస్ యు-సిరీస్‌లో 55 అంగుళాల టీవీ కూడా ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 మే 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి టివిని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు 10 శాతం ఆఫ్ పొందవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆండ్రాయిడ్ టీవీ. అంటే యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్‌కు చెందిన అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఫీచర్స్: వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆక్సిజన్‌ప్లే యుఐ ఆధారంగా పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్‌స్టార్, సోనీ లివ్, హంగమా, ఈరోస్ నౌ వంటి ప్రైమ్ వీడియోలకు అనుమతి ఉంటుంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వన్‌ప్లస్ టీవీని యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ వీడియోలను సులభంగా అన్వేషించడానికి ట్రాక్‌ప్యాడ్‌తో ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే వై-ఫై 2.4GHz 802.11 b / g / n, బ్లూటూత్ 5.0, 1 ఈథర్నెట్ పోర్ట్, 1 RF కనెక్షన్ ఇన్పుట్, 2 HDMI ఇన్పుట్, 1 AV ఇన్పుట్, 1 డిజిటల్ ఆడియో అవుట్‌పుట్, 2 యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి. చదవండి: 5జీతో భారీగా కొత్త నియామకాలు -
వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!
ఫ్లాగ్షిప్ స్మార్ట్పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో మార్చి 23న లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో హాసెల్‌బ్లాడ్ తో కలిసి వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. వన్‌ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకంగా ఒక క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో అడిగిన 6 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి ఏప్రిల్ 16వ తేదీన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ను అందిస్తుంది. ఈ క్విజ్ నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. వన్‌ప్లస్ 9 సిరీస్ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు, సమాధానాలు: ప్రశ్న 1: OnePlus 9 Pro comes with ___ W Wireless Charging జవాబు: (C) 50 W ప్రశ్న 2: OnePlus 9 Series gets a day’s power in ___ mins with Warp Charge 65T? జవాబు: (A) 15 Mins ప్రశ్న 3: The OnePlus 9 and OnePlus 9 Pro 5G come with _____? జవాబు: (C) Hasselblad Camera for Mobile ప్రశ్న 4: The OnePlus 9 Pro’s Fluid Display 2.0 comes with _____ and _____? జవాబు: (A) LTPO technology and Smart 120 Hz ప్రశ్న 5: OnePlus 9 and 9 Pro come with _____ MP Ultra-Wide Angle Lens జవాబు: (D) 50MP ప్రశ్న 6: OnePlus 9R 5G is powered by Qualcomm Snapdragon ____ జవాబు: (C) 870 చదవండి: వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు : అద్భుత ఫీచర్లు -
వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు : అద్భుత ఫీచర్లు
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్మార్ట్పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. వన్‌ప్లస్ 9 ఫీచర్లు 6.70 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 50+2 ఎంపీ రియర్ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 9 ప్రో ఫీచర్లు 6.7 అంగుళాల డిస్ప్లే 1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ 48+ 50+8+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీకెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ,వైర్లెస్చార్జర్ ధరలు వన్‌ప్లస్ 9 ధర రూ .39,999 నుంచి ప్రారంభం. 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో 43,999 కార్బన్ బ్లాక్ లేక్ బ్లూ రంగులతో వస్తుంది వన్‌ప్లస్ 9 ప్రో ధర 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌కు రూ .64,999 . హై ఎండ్ మోడల్‌కు 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .69,999గా ఉంది. పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ మార్నింగ్ మిస్ట్ రంగులలో వస్తుంది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్ ద్వారా లభ్యం. ఏప్రిల్ 1 , 15 తేదీల్లో తొలి సేల్ ఉంటుంది. ఆఫర్లు ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వ న్‌ప్లస్ 9 ఆర్‌పై వరుసగా రూ .4,000, రూ .3,000 రూ .2,000 తగ్గింపు. దీంతోపాటు పరిచయ ఆఫర్ గా స్మార్ట్‌వాచ్ ను 14వేల,999 రూపాయలకే అందించనుంది. వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్: ఈ స్మార్ట్ఫోన్లతో పాటు వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్‌ను కూడా రిలీజ్ చేసింది. 1.39 అంగుళాల అమోలేడ్ డిస్ప్లేతో వస్తున్న స్మార్ట్ వాచ్ ధర రూ. 16,999గా నిర్ణయించింది. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్, యాప్ నోటిఫికేషన్లు, ఫోన్ సెట్టింగులను సర్దుబాటు చేయడం, ఫోటో గ్యాలరీని యాక్సెస్ కెమెరా షట్టర్ రెగ్యులేటరీ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అ లాగే వర్కౌట్ డిటెక్షన్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో పని చేసే ఈ స్మార్ట్ వాచ్‌ని 20 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే. 7 రోజులు వస్తుందని వన్‌ప్లస్ తెలిపింది. -
లాంచ్ కు ముందే లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను రేపు (మార్చి 23) విడుదల చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభించటానికి కొద్దీ గంటల ముందు కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్‌కు చెందిన ధరలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వీటిలో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఉన్నాయి. కొన్ని లక్షణాలు అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ, ధర వివరాలు మాత్రం బయటకి విడుదల కాలేదు. ఇప్పుడు ఒక టిప్ స్టార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వన్‌ప్లస్ 9 సిరీస్ ఇండియాకు చెందిన ధర వివరాలను బయటకి లీక్ చేసాడు. లీకైన వివరాల ప్రకారం కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు (అంచనా): వన్‌ప్లస్ 9 ఆర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 వన్‌ప్లస్ 9 ఆర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 వనిల్లా వన్‌ప్లస్ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 వనిల్లా వన్‌ప్లస్ 9 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 వన్‌ప్లస్ 9 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999 వన్‌ప్లస్ 9 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999 చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి తీపికబురు లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర -
మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9 సిరీస్ విడుదల తేది బయటకి వచ్చింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ 9ఈ, వన్ ప్లస్ 9 లైట్, వన్ ప్లస్ 9ప్రో తీసుకొనిరావచ్చు. మార్చి 23న ఈ మొబైల్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల ప్రారంభ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్, జెడ్ ఇయర్‌బడ్స్ రెండు వెర్షన్లలో ఒకదాన్ని పొందవచ్చు అని సమాచారం. వన్ ప్లస్ 9ప్రో ఫీచర్స్(అంచనా): 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 48 ఎంపీ + 50 ఎంపీ + 8 ఎంపీ చదవండి: వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ ఇక వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి -
వన్‌ప్లస్ నార్డ్ కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్
వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్డేట్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ గత ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10తో విడుదల చేశారు. మార్చి 1నుంచి వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ దశల వారీగా రావడం ప్రారంభమైంది. ఈ అప్డేట్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. యాంబియంట్ డిస్ప్లే ట్వీక్స్, మెరుగైన డార్క్ మోడ్, షెల్ఫ్ ఈ అప్డేట్ లో అందించారు. -
లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన ఫోటోలు బయటకి విడుదలయ్యాయి. వనిల్లా వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన చిత్రాలను యూట్యూబర్ డేవ్2డి లీక్ చేసాడు. లీకైన ఫోటోలను బట్టి చూస్తే మనకు వన్‌ప్లస్ 9ప్రో వెనుక కెమెరాలో రెండు ప్రధాన కెమెరాలతో పాటు, మరో రెండు ఇతర చిన్న కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటో కెమెరాగా కనిపిస్తుంది. వన్‌ప్లస్ ఈ సారి ప్రధానంగా కెమెరా మీద దృష్ట్టి పెట్టినట్లు కనిపిస్తుంది. చాలా మంది వినియోగదారులు వన్‌ప్లస్ ప్రధానంగా కెమెరా విషయంలో ఇతర మొబైల్ ఫోన్ తో పోలిస్తే వెనుకబడినట్లు పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 9ప్రో డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది, దీని స్క్రీన్ QHD+(3120x1440 పిక్సెల్స్) రిజల్యూషన్ తో 120హెర్ట్జ్ అధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆసక్తికరం విషయం ఏంటంటే దీనిలో ఏ ప్రాసెసర్ తీసుకొస్తున్నారో బయటకి వెల్లడించలేదు. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. దీనిని ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో తీసుకొనిరానున్నారు.(చదవండి: పోకో ప్రియులకు శుభవార్త!) -
వన్‌ప్లస్ ప్రియులకి గుడ్ న్యూస్
గత వారమే వన్‌ప్లస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ బీటా వెర్షన్ ను వన్‌ప్లస్ 7, 7టీ సిరీస్ కోసం విడుదల చేసింది. వన్‌ప్లస్ తన వినియోగదారులకు కెమెరా విషయంలో ఇంకా మంచి అనుభూతిని అందించడానికి కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తన ఫోన్ కెమెరా యాప్‌కి ప్రత్యేక మోడ్స్ జోడించి తీసుకొస్తోంది. వన్‌ప్లస్ కెమెరాలో 6.4.23 వెర్షన్ కింద "టిల్ట్-షిఫ్ట్, స్టార్ట్ బస్ట్, మూన్, హైపర్ లాప్స్" అనే కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. వీటితో వన్‌ప్లస్ యూజర్లు తమ ఫోన్ కెమెరాతో ఫొటోలను ఇతరుల కంటే భిన్నంగా తీయవచ్చు.(చదవండి: మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో సరికొత్త ఫీచర్స్) ప్రస్తుతం ఈ సరికొత్త వన్‌ప్లస్ కెమెరా ఫీచర్లను కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం. కొత్తగా తీసుకురాబోయే టిల్ట్-షిప్ట్ మోడ్‌తో సాధారణ ఫోటోలను చాలా చిన్న ఫొటోలుగా క్రియేట్ చేయవచ్చు. అలాగే "స్టార్బర్స్ట్" మోడ్‌తో సూర్యని లాగా ప్రకాశించే ప్రతి దానిని ఒక నక్షత్రంలాగా మార్చవచ్చు. రాత్రి వేళలో ఆకాశాన్ని ఫోటోలను తీయడానికి ఇష్టపడే యూజర్లు మూన్ మోడ్ ఫిల్టర్లు వాడి చందమామ రంగుల్ని మార్చొచ్చు. -
వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్
వన్‌ప్లస్ చివరకు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11బీటా బిల్డ్ ను వన్‌ప్లస్ 7, 7టీ సిరీస్‌లకు విడుదల చేస్తోంది. ఈ కొత్త బిల్డ్ ను ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చింది. మిగతా వన్‌ప్లస్ వినియోగదారులకు ఈ అప్డేట్ త్వరలోనే అందనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ నార్డ్ ఇది వరకే ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా బిల్డ్‌ను అందుకున్నాయి. దీని తర్వాత 2019 విడుదలైన వన్‌ప్లస్ 7, 7టీ మొబైల్స్ కు అప్డేట్ రావడం మొదలైంది. ఈ అప్డేట్ దశల వారీగా రానున్నట్లు ప్రకటించింది.(చదవండి: బడ్జెట్ లో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్) ఈ బిల్డ్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. ఇది బీటా బిల్డ్ కాబట్టి వన్‌ప్లస్ టెస్టింగ్ లో భాగంగా కొన్ని ఫీచర్స్ సరిగా పనిచేయకపోవచ్చు. కొందరు ఇప్పటికే విద్యుత్ వినియోగం పెరిగినట్లు గమనించారు. కొన్ని ఫోటోలు గ్యాలరీలో కనబడకపోవడం, బ్లూటూత్ ద్వారా పనిచేసే పరికరాలు సౌండ్ రాకపోవడం, బ్రైట్ అడ్జస్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడం వంటివి కొందరు గమనించినట్లు పేర్కొన్నారు. -
వన్‌ప్లస్ బ్యాండ్ వచ్చేసింది!
మొబైల్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన మొదటి ఫిటెనెస్ బ్యాండ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇటీవలే దీనికి సంబందించిన కొన్ని ఫోటోలను మనతో సంస్థ పంచుకుంది. వన్‌ప్లస్ బ్యాండ్ కోసం ‘నోటిఫై మి’ అనే ఆప్షన్ తో కూడిన ఒక ప్రత్యేకమైన పేజీని అమెజాన్ ఇండియా సృష్టించింది. అలాగే వచ్చే ఏడాది చివరి కల్లా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనున్నట్లు వన్‌ప్లస్ పేర్కొంది. భారతదేశంలో వన్‌ప్లస్ బ్యాండ్ ధర రూ. 2,499 గా ఉంటుందని మేము గతంలోనే పేర్కొన్నాము. జనవరి 13న అమెజాన్, ఫ్లిప్ కార్టు వెబ్ సైట్ లలో ఫస్ట్ సేల్ కి రానుంది. (చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి) వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్: వన్‌ప్లస్ బ్యాండ్ లో 1.4 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫిట్నెస్ ట్రాకర్ లో రియల్ టైమ్ హార్ట్ రేట్ ట్రాకింగ్, స్పా 2బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 13 వ్యాయామ మోడ్లు, 3–యాక్సిస్ యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.ఓ, ఐపీ 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇది 50 మీటర్ల లోతు వరకు కూడా పనిచేస్తుంది. అవుట్డోర్ రన్, సైక్లింగ్, క్రికెట్, పూల్ స్విమ్, యోగా వంటి ఇతర వ్యాయామాలను ఇది ట్రాక్ చేయగలదు. వన్‌ప్లస్ హెల్త్ యాప్ ద్వారా వన్‌ప్లస్ బ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా పనిచేస్తుంది. దీనిలో అందించిన 100ఎంఏహెచ్ బ్యాటరీ 14 రోజుల వరకు పనిచేయగలదు. దీని బరువు కేవలం 10.3 గ్రాములు మాత్రమే ఉంటుంది. -
మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ప్రోడక్ట్
వన్‌ప్లస్ ఫిట్నెస్ బ్యాండ్ మార్కెట్ లోకి జనవరి 11న రానున్నట్లు ముకుల్ శర్మ, ఇషాన్ అగర్వాల్ టిప్స్టర్లు పేర్కొన్నారు. వన్‌ప్లస్ ఇండియా ఫిట్నెస్ బ్యాండ్ అధికారిక పేరు, ప్రత్యేకతలు ప్రకటించకుండా కేవలం టీజర్ చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకుంది. ఈ చిత్రంలో 'ది న్యూ ఫేస్ ఆఫ్ ఫిట్నెస్'తో పాటు 'కమింగ్ సూన్' కూడా ఉంది. ఫిట్నెస్ బ్యాండ్ యొక్క ప్రత్యేక వెబ్సైట్లో 'నోటిఫై మీ' అనే వివరాలతో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. టిప్స్టర్లు తెలిపిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ బ్యాండ్ జనవరి 11న రూ.2,499 లభించనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రేపే షియోమీ ఎంఐ 10ఐ లాంచ్) వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్: యూట్యూబ్‌లో ముకుల్ శర్మ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. వన్‌ప్లస్ బ్యాండ్ లో 1.1-అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లే, 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 3-యాక్సిస్ యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.0, ఐపి 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. వన్‌ప్లస్ బ్యాండ్ కూడా 50 మీటర్ల లోతు వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న 100 ఎంఏహెచ్ బ్యాటరీతో 14 రోజుల వరకు పనిచేస్తుందని తెలుపుతున్నారు. ఇది 10.3 గ్రాముల బరువు ఉంటుంది(ట్రాకర్ మాత్రమే). ఇది బ్లాక్, నేవీ, టాన్జేరిన్ గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నుంచి రానున్న మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను కూడా ఈ సంవత్సరంలోనే లాంచ్ చేయనున్నట్లు సంస్థ సీఈఓ పీట్ లా గత నెలలో ప్రకటించారు. -
లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర
వన్‌ప్లస్ 9 సిరీస్ లో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ను సంస్థ 2021 తొలి త్రైమాసికంలో తీసుకు రాబోతున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోతో పాటు వన్‌ప్లస్ 9 లైట్ అనే మొబైల్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వన్‌ప్లస్ 9కి సంబందించిన ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. 91 మొబైల్స్ వెబ్ సైట్ తెలిపిన సమాచారం మేరకు వన్‌ప్లస్ 9 మొబైల్ లో కార్నర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్) వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా రాబోయే వన్‌ప్లస్ 9 ప్రో మొబైల్ 30 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొట్ట మొదటి వన్‌ప్లస్ మొబైల్ ఇదే కావచ్చు. వన్‌ప్లస్ 9 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వనిల్లా వన్‌ప్లస్ 9 కూడా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ వన్‌ప్లస్ 9 మొబైల్ లో కంటే వన్‌ప్లస్ 9 ప్రో మోడల్లో ప్రీమియం ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో రెండూ లైకా బ్రాండెడ్ కెమెరాలతో వస్తాయని గత నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 9 మొబైల్ లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 20ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపీ టెలిఫోటో కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ రెండు మొబైల్స్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ద్వారా పనిచేయనున్నాయి. అలాగే వన్‌ప్లస్ 9 లైట్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 లైట్ ధర 600 డాలర్లు(సుమారు రూ.44,200) కాగా వన్‌ప్లస్ 9 ధర 700-800 డాలర్లు(సుమారు 51-58 వేలు), వన్‌ప్లస్ 9 ధర సుమారు 60 వేల నుండి 70 వేల మధ్య ఉండనున్నట్లు సమాచారం. -
వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్
భారత్‌లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్‌ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే తర్వాత వన్‌ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ 9ప్రో డిజైన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ ప్రకారం వన్‌ప్లస్ 9ప్రో యొక్క డిజైన్ వనిల్లా వెర్షన్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కర్వ్డ్ 6.7-అంగుళాల డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ కటౌట్‌తో రానున్నట్లు సమాచారం. వాల్యూమ్ బటన్ ఫోన్ కి ఎడమ వైపున ఉండగా, పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి. వెనుకవైపు, నాలుగు కెమెరా లెన్స్‌లతో సమానమైన దీర్ఘచతురస్రాకార కెమెరా ప్యానెల్ ఉంది. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లో 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం మార్చిలో కొత్త వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ తీసుకొస్తుందో లేదో చూడాలి. (చదవండి: ట్విటర్ ఫ్లీట్స్‌లో భారీ లోపం) -
వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ వైరల్
భారత్ లో 2021 మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ ఫోన్ ని తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయని సమాచారం. వన్‌ప్లస్ 9లో మూడు కెమెరా కలిగి ఉన్న ఒక చిత్రం ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఇందులో రెండు పెద్ద సెన్సార్ గల కెమెరాలు మరియు ఒక చిన్న కెమెరా సెన్సార్ ఉంది. వీటి పక్కన చిన్న డ్యూయల్-టోన్ LED ఫ్లాష్ ఉంటుంది. వన్‌ప్లస్ 9 ఫోన్ లో పంచ్ - హోల్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం. [Exclusive] OnePlus 9 camera setup details and live image revealedhttps://t.co/F4V4qgOc4u — 91mobiles (@91mobiles) November 21, 2020 వన్‌ప్లస్ 9 కెమెరా ఫీచర్స్ వన్‌ప్లస్ 9 ప్రధాన కెమెరా 48 మెగా పిక్సల్ కెమెరా తో రానుంది. ఈ 48ఎంపీ ప్రధాన కెమెరాలో సెన్సార్ సోనీ IMX 586 లేదా IMX689 ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ 9 ఎంపీ ప్రధాన కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఉన్న 16ఎంపీ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కలిగి ఉండనుంది. ఇది వన్ ప్లస్ 8టీ ఫోన్ తో పోలిస్తే పెద్ద మార్పు. చిత్రంలో ఉన్న చిన్న కెమెరా గురుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. దీనిలో మోనోక్రోమ్ లేదా మాక్రో సెన్సార్ ఉపయోగించవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ కెమెరాతో రానుంది. (చదవండి: ప్రపంచంలోనే టాప్ - 10 స్మార్ట్ ఫోన్స్ ఇవే) వన్‌ప్లస్ 9, వన్ ప్లస్ 8టీ యొక్క 6.55-అంగుళాల ప్యానెల్ కంటే పెద్దదిగా ఉండనుంది. వన్ ప్లస్ 9లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస ప్లే ప్రవేశపెడుతున్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నెంబర్లు LE2110, LE2117, LE2119 గల మొబైల్ ఫోన్లు 2021 మార్చిలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ గీక్ బెంచ్ పరీక్షలో ఫోన్ సింగిల్-కోర్ స్కోరు 1,122, మల్టీ-కోర్ స్కోరు 2,733 సాధించింది. దీని ధర 47,000 ఉండవచ్చు. వన్‌ప్లస్ 9 గురించి వన్‌ప్లస్ సంస్థ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. -
5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్
ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్మార్ట్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ వినియోగాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది. కొన్నేళ్ల క్రితం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత డీమాండ్ ఉండేదో ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి అంత డిమాండ్ ఉంది. అందుకే శామ్సంగ్, షియోమి, ఒప్పో, రియల్మీ వంటి బడ్జెట్ లోనే మంచి నాణ్యత గల ఇయర్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరలకే వస్తున్నాయంటే వీటిలో ఫీచర్లు బాగాలేవనే అంచనాకు రాకండి. మంచి నాణ్యతతో కూడిన వస్తువులను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తేవాలంటే చాలా రీసెర్చ్ అవసరమవుతుంది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్నా ఇలాంటి సంస్థలు ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ ను మనకు పరిచయం చేస్తున్నాయి. 5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మరి వాటి ఫీచర్స్, ధర వంటి వివరాలు మీ కోసం.. ఒప్పో ఏక్నో W51 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్' మార్కెట్లో ఒప్పో యొక్క ఆవిష్కరణ అయిన ఒప్పో ఏక్నో W51లో మంచి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో 7 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఆన్‌బోర్డ్, సుమారు 10 మీటర్ల పరిధి వరకు ధ్వని వినిపిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ లో 25 ఎంఏహెచ్ బ్యాటరీతో నిండి ఉంటుంది, ఛార్జింగ్ కేసులో 480 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేస్తే ఈ ఇయర్ ఫోన్ 3.5 గంటలు పనిచేస్తుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేయకపోతే 20 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీ సామర్థ్యం ఉండడం హైలైట్. అయితే, బ్యాటరీ ఇక్కడ చాలా సగటు. మీరు 15 నిమిషాల ఛార్జ్ చేస్తే ఇయర్ఫోన్లు 3 గంటల వరకు పనిచేస్తాయి. దీనికి 3 మైక్రో పోన్ సిస్టంను ఒప్పో యాడ్ చేసింది. దీంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండి, నాయిస్ తగ్గుతుంది. దీని ధర రూ. 4,999. (చదవండి: ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా?) రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అత్యంత చవకైన వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గా పేరుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఇవి బాగా పనిచేస్తాయి. రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఫీచర్-ప్యాక్డ్, కంపానియన్ యాప్ సపోర్ట్ వల్ల ఉపయోగించడం సులభం అవుతుంది. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోలో సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పటికీ, మీకు అద్భుతమైన సౌండ్‌స్టేజ్, బేస్ భారతదేశంలో చాలా మంది ప్రజలు ఇష్టపడే విధంగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే సూపర్ అనుకోండి. ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయని రియల్ మీ చెబుతోంది. దీని ధర రూ. 4,999. వన్‌ప్లస్ బడ్స్ Z వన్‌ప్లస్ బడ్స్‌లో ఒక మంచి విషయం దాని యొక్క డిజైన్. దాని సాఫ్ట్ మాట్టే ప్లాస్టిక్ కేసు సూపర్ ప్రీమియం అనిపిస్తుంది. బడ్స్ Z యొక్క పిల్-ఆకారపు కేసు పూర్తిగా నిగనిగలాడే ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది, తెలుపు రంగులో ఉండటం వల్ల ఇది త్వరగా మురికిగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ఒక చేత్తో మూత తెరవడం అంత సులభం కాదు. దీని వెనుక భాగంలో టైప్ సి పోర్ట్ మరియు పెయిరింగ్ / రీసెట్ బటన్ ఉంటాయి. ముందు భాగంలో LED సూచిక ఉంటుంది. సాధారణ వన్‌ప్లస్ పద్ధతిలో వన్‌ప్లస్ బడ్స్ జెడ్‌ను బిటి 5.0 నెట్‌వర్క్‌లో గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌కు సులభంగా జత చేయవచ్చు. మీరు మూత తెరిచిన వెంటనే కార్డ్ మీ Android ఫోన్లో కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, వన్‌ప్లస్ బడ్స్ ఐదు గంటలు వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. మీరు 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 2-3 గంటల వరకు పాటలు వినవచ్చు. దీని ధర 2,999. (చదవండి: డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్) నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో ఒక్క సారి చార్జ్ చేసిన నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో బ్యాటరీ లైఫ్ 8 గంటలు. 2,200mAh బ్యాటరీ కేస్ ను కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో టిడబ్ల్యుఎస్ బ్లూటూత్ 5.0పై పని చేస్తుంది. క్వాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రోడక్ట్ నాణ్యతలో చాలా అత్యుత్తమం. ఈ కారణంగా ఇయర్ ఫోన్లో ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. AptX+AAC Hi-Fiఆడియో టెక్నాలజీతో IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. దీనిలో ప్రతి ఇయర్ బడ్ టచ్ సెన్సార్లతో వస్తుంది, అందువల్ల వాల్యూమ్‌ను నియంత్రించడానికి, కాల్లకు సమాధానం ఇవ్వడానికి / తిరస్కరించడానికి , మీడియాను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 3,499. షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ఏకంగా రూ. 3,999 ధరకే లభిస్తోంది. చూసేందుకు ఇయర్ ప్యాడ్స్ లాంటి ఇయర్ పీస్ లా దీన్ని డిజైన్ అయిన ఈ ఇయర్ పీస్ ఫీచర్స్ బాగున్నాయి. 14.2mmడ్రైవర్స్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, SBC, AAC, LHDC బ్లూటూత్ codecs సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇందులో ANC లేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. 12 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం షియోమీ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కు ఉండగా, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. -
వన్‌ప్లస్ 8టీ, సూపర్ గేమింగ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ 8 టీ ప్రత్యేక సైబర్‌పంక్ 2077 ఎడిషన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. గేమింగ ప్రియులకోసం వీడియో గేమ్ డెవలపర్ సీడీ ప్రొజెక్ట్ రెడ్‌తో కలిసి బేసిక్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సింగిల్ వెర్షన్లో ఆవిష్కరించింది. అలాగే రియర్ కెమెరా మాడ్యూల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్‌గా ఉంది. మిగిలిన ఫీచర్లను వన్‌ప్లస్ 8 టీ మాదిరిగానే ఉంచింది. చైనాలో ప్రీఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమైనాయి. నవంబర్ 11నుండి కొనుగోలుకు అందుబాటులో ఉండనుండగా, భారతీయ మార్కెట్లో ఎపుడు లాంచ్ చేసేదీ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. వన్‌ప్లస్ 8 టీ సైబర్‌పంక్ 2077 ఫీచర్లు 6.55 టచ్‌స్క్రీన్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 స్నాప్‌డ్రాగన్ 865 చిప్ రియర్ క్వాడ్‌కెమెరా 48 (ఎఫ్ / 1.7) + 16(ఎఫ్ / 2.2) + 5+ 2ఎంపీ 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ధర 3,999 యెన్లు (సుమారు రూ.44,558) -
వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్
సాక్షి, ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ టీవీలు, వైర్లెస్ ఇయర్‌బడ్‌లతో ఆకట్టుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్ త్వరలోనే స్మార్ట్‌వాచ్ లను కూడా ఆవిష్కరించనుంది. తద్వారా శాంసంగ్, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్మార్ట్‌వాచ్ లాంచింగ్ పై చాలాకాలంగా ఇంటర్నెట్లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే సింగపూర్ ఇన్ఫోకామ్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దీనికి సంబంధించిన ధృవీకరణ పొందినట్లు సమాచారం. దీంతో రాబోయే నెలల్లో వన్‌ప్లస్ వాచ్ పేరుతో వీటిని తీసుకురానుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ, మార్కెట్లో ఉన్న ప్రముఖ స్మార్ట్‌వాచ్‌లకు ధీటుగా ఉండేలా మార్కెట్లోకి రానున్నాయి. ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫిట్నెస్, హెల్త్ ఫీచర్స్ ముఖ్యంగా హృదయ స్పందన సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ , స్లీప్ ప్యాటర్న్ అనాలిసిస్, గోల్స్ ఓరియెంటెడ్ ఎక్స్ ర్ సైజ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. కొనుగోలుదారులను మరింత ఆకర్షించేలా వన్‌ప్లస్ వాచ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 తరహాలో ఈసీజీ మానిటర్ లాంటి ప్రీమియం ఫీచర్లును కూడా జోడించనుంది. శాంసంగ్ తోపాటు ఇటీవల లాంచ్ చేసిన ఒప్పో వాచ్ లకు వన్‌ప్లస్ వాచ్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
మార్కెట్ లీడర్‌గా వన్‌ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ టాప్ లో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 29.3 శాతం మార్కెట్ వాటాతో ఇండియన్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని తాజా నివేదిక తెలిపింది. (వన్‌ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే) కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం వన్‌ప్లస్ 8 5 జీ మొబైల్ రెండవ త్రైమాసికంలో (క్యూ 2) ప్రీమియం విభాగంలో (30వేల రూపాయలు అంతకంటే ఎక్కువ) టాప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా అవతరించింది. ఒక బ్రాండ్‌గా, తమ విశ్వాసం ఉంచిన భారత సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ప్రకటించారు. అసమానమైన నాణ్యతతో పెద్దగా భారం లేని అనుభవాన్ని అందించే ఉత్పత్తులను రూపొందించే కృషి కొనసాగుతుందన్నారు. (భారత్‌లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో లాంఛ్) కాగా ఏప్రిల్‌లో లాంచ్ చేసిన వన్‌ప్లస్ 8 సిరీస్ 5 జీ వన్ ప్లస్ 8 ప్రో వన్ ప్లస్ 8 స్మార్ట్ఫోన్లకు భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ 8 ప్రో ఒకటి. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్‌ప్లస్) -
వన్‌ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే
సాక్షి, ముంబై: వన్‌ప్లస్ కొత్త మొబైల్ ‘నార్డ్’ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్, క్వాడ్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ నార్డ్‌కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది. మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ ఆగస్టు 4 నుండి అమెజాన్, వన్‌ప్లస్.ఇన్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రారంభంలో 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు మాత్రమే ఇవ్వబడతాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ సెప్టెంబర్‌లో వస్తుంది. షావోమి ఇతర సంస్థల మాదిరిగా కాకుండా, వన్‌ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్‌ను ఓపెన్ సేల్‌గా అందించనుంది. ప్రీ-బుకింగ్ వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ ద్వారా జూలై 22 నుంచి, జూలై 28 నుంచి అమెజాన్ ఇండియ లో అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ల విషయానికొస్తే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లతో 2 వేల రూపాయల తగ్గింపు. అదనంగా రిలయన్స్ జియో ద్వారా 6,000 విలువైన ప్రయోజనాలు లభ్యం. వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా పొడిగించిన వారంటీ , బైబ్యాక్ ఆఫర్, 50 జీబీ విలువైన ఉచిత వన్‌ప్లస్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనాలు లభిస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ ధర 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర 27,999 రూపాయలు 12 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 29, 999 రూపాయలు వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్లు 6.44 అంగుళాల డిస్ ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 32 + 8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా 48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్ క్వాడ్ రియర్ కెమెరా 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం Here's what Pretty Much Everything You Could Ask for, looks like With a Quad Camera setup, ultra wide selfie cameras , 90Hz Fluid AMOLED display, Snapdragon 765G 5G & upto 12GB RAM#OnePlusNord will be available starting from ₹24,999 Know more - https://t.co/aWOZnUyBEW pic.twitter.com/T1582FlhtH — OnePlus India (@OnePlus_IN) July 21, 2020 -
వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్ : టీజర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ దారు వన్‌ప్లస్ తన అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై తాజాగా ఒక టీజర్‌ను విడుదల చేసింది. ‘నార్డ్’ పేరుతో తీసుకొస్తున్న ఈ బడ్జెట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై తన అభిమానులకు హింట్ ఇచ్చింది. డియర్ పాస్ట్ పేరుతో వన్‌ప్లస్ ట్విటర్, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజీలో చిన్న టీజర్ వీడియోను షేర్ చేసింది. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’) బడ్జెట్ ఫోన్‌గా వన్‌ప్లస్ భారీగా ప్రచారం చేస్తున్న ‘నార్డ్’ ఫోన్ ఫీచర్లపై పూర్తి స్పష్టత లేనప్పటికీ ధర సుమారు 37,300 గా ఉండవచ్చని అంచనా. ట్రిపుల్ రియర్ కెమెరా , డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. భారతీయ మార్కెట్లోకి తీసుకురానున్న ఈ నార్డ్ ప్రీ బుకింగ్స్‌ను అమెజాన్ లో త్వరలోనే ప్రారభించనుంది. వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్లుపై అంచనాలు 6.4 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 క్వాల్కం స్నాప్ డ్రాగన్765జీ 5జీ ప్రాసెసర్ 10 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ View this post on Instagram New direction, pure OnePlus. Watch the full movie on @oneplus.nord #OnePlusNord #NewBeginnings Learn more: http://onepl.us/NordAz A post shared by OnePlus India (@oneplus_india) on Jul 3, 2020 at 5:31am PDT -
'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ ప్రారంభించామన్నారు. అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు. ఈ కేంద్రంలోని కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్వర్కింగ్, కనెక్టివిటీ ఫ్యూచర్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన) వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్సెట్ తయారీదారు గురువారం అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
వన్‌ప్లస్ కొత్త టీవీలు ఎంత సన్నగా ఉంటాయంటే..
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా వన్‌ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కి పెట్టింది పేరు. మరి ఇక వన్‌ప్లస్ టీవీలు ఇంకెంత సన్నగా ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు సీఈఓ వెల్లడించారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రాబోతున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఫ్లాగ్షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లు జూలై 2 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్ ఫీచర్, కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని తెలిపారు. సినిమాటిక్ డిస్ప్లే, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ యాప్ లాంటి ఫీచర్లను హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్ చేశారు. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ధర, లభ్యత వన్‌ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర 20 వేల రూపాయలు. ప్రస్తుతం, కొత్త వన్‌ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్‌ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర 69,900 రూపాయలు. With a 95% screen-to-body ratio, we're pushing the boundaries of your TV experience. Literally. #SmarterTV pic.twitter.com/gulLxbVvHE — Pete Lau (@PeteLau) June 24, 2020 -
నిమిషంలో అమ్ముడుపోయిన చైనా ఫోన్!
భారత్- చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలనే ప్రచారం గత కొన్ని రోజులుగా ఊపందుకుంది. ముఖ్యంగా చైనా ఫోన్లను బహిష్కరించాలని, భారతదేశపు వస్తువులను ప్రోత్సహించాలని క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. మేక్ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ నినాదాలు హోరెత్తుతున్నాయి. దీంతో చైనా కంపెనీలకు నష్టాలు తప్పవని అంతా భావించారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం చైనా కంపెనీ బీబీకె ఎలక్ట్రానిక్స్ విడుదల చేసిన వన్‌ప్లస్ 8 ప్రో హాట్ కేక్‌లాగా అమ్ముడైపోయింది. దీనికి తోడు తమకు ఫోన్ దొరకలేదని, అందుబాటులోకి మరిన్ని ఫోన్లను తీసుకురావాలని కూడా ట్విట్టర్ వేదికగా కొందరు కంపెనీని కూడా కోరారు. (పబ్జీ గేమ్ చైనాదేనా?) దీంతో చైనా వస్తువుల వినియోగం ఇప్పటికీ దేశంలో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాదికి చైనాకు ఇండియా నుంచి రూ. 3.8 లక్షల కోట్ల ఆదాయం లభిస్తోంది. చైనా ఫోన్లతో సెక్యూరిటీ సమస్య ఉందని, వాటిని బహిష్కరించాలనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇండియా కంపెనీలు లాభపడతాయని అంతా భావిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. (చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ) Show More -
వన్‌ప్లస్ జెడ్ కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. వన్‌ప్లస్ జెడ్ పేరుతో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను జూలై 10 న భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్న వన్‌ప్లస్ జెడ్ ధర రూ .24,990 గా ఉంటుందని అంచనా. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో పాటు, 12 జీబీ ర్యామ్ హై ఎండ్ వేరియంట్ ను తీసుకురానుందని ఇటీవల పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (బడ్జెట్ ధరల్లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు!) వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో మాదిరిగానే వన్‌ప్లస్ జెడ్ లో కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను జోడించినట్టు సమాచారం. ఈ ఊహాగానాలకు సంస్థ అధికారిక ప్రకటనతో మాత్రమే తెరపడనుంది. వన్‌ప్లస్ జెడ్ ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. (వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు) వన్‌ప్లస్ జెడ్ ఫీచర్లు 6.40 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 64+16 (అల్ట్రా-వైడ్) 2 డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధరల్లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో తన స్మార్ట్ టీవీ లైనప్‌ను విస్తరించడానికి సిద్దమవుతున్న వన్‌ప్లస్ కంపెనీ రెండు కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనుంది. జూలై 2న కొత్త టీవీలను తీసుకొస్తున్నామని వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్ లా సోమవారం ట్వీట్ చేశారు. భారతీయ కస్టమర్లకోసం ప్రీమియం స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ. 69.900 ప్రారంభ ధరల్లో గత ఏడాది దేశంలో వన్‌ప్లస్ రెండు వేరియంట్లలో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో భారతీయ వినియోగదారులను ఆకర్షించాలనే యోచనలో ఉంది. వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ధర అనే హింట్ మాత్రం ఇచ్చారు సంస్థ సీఈవో. "బెస్ట్-ఇన్-క్లాస్ డిస్ప్లే" ప్యానెల్స్‌తో, వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో మిడ్ రేంజ్, ఎంట్రీ లెవల్ విభాగాల్లో ప్రీమియం అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ టీవీలు ఉండనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు కొత్త స్మార్ట్ టీవీలు సుమారు రూ. 15 వేల వద్ద ప్రారంభం కానున్నాయని భావిస్తున్నారు. తద్వారా బడ్జెట్ ధరల్లో టీవీలను తీసుకొస్తున్న వు, షావోమి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. (వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు) It's official. We're making our premium smart TV experience more accessible to our Indian community. #SmarterTV pic.twitter.com/gc7WUcVIxJ — Pete Lau (@PeteLau) June 8, 2020 -
వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు
సాక్షి, ముంబై : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 8 అమ్మకాలను ఇండియాలో మరోసారి ప్రారంభించనుంది. అమెజాన్ , వన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.. వన్‌ప్లస్ 8 స్పెసిఫికేషన్లు : 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డి +ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 5జీ, స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48 +16+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 టి సపోర్టింగ్ టైప్-సి పోర్ట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ధరలు 6 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.41,999 8 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.44,999 12 జీబీ ర్యామ్ /256 జీబీ ధర రూ 49,999 సేల్ ఆఫర్లు: అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లకు రూ .2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రీపెయిడ్ ఆర్డర్లపై అమెజాన్ పే బ్యాలెన్స్‌గా అదనంగా రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా వడ్డీ లేని 12 నెలల వాయిదాల పథకం ఉంది. -
భారత్‌లో వన్‌ప్లస్ 8 సిరీస్ లాంఛ్
న్యూఢిల్లీ : పలు లీక్‌లు, టీజర్ల అనంతరం వన్‌ప్లస్ భారత మార్కెట్లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8ప్రోలను లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో అత్యాధునిక మోడల్స్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసినట్టు ఒన్‌ప్లస్ పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇవి త్వరలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. వన్‌ప్లస్ 8 రూ 41,999, వన్‌ప్లస్ 8 ప్రో రూ 54,999, బుల్లెట్స్ వైర్లెస్ జడ్ రూ 1999కు లభిస్తాయని పేర్కొంది. కొత్త ఆక్సిజన్ ఓఎస్ ఫీచర్లు స్మూత్ బాటిల్ 2.0, న్యూ డార్క్ థీమ్, డైనమిక్ వాల్ పేపర్స్, లైవ్ క్యాప్షన్, అమెజాన్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్, అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ, యాప్ గ్యాలరీ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను అధునాతనంగా అందించినట్టు కంపెనీ వెల్లడించింది.వన్‌ప్లస్ 8 బ్లాక్, గ్లేసియల్ గ్రీన్, గ్లాసీ, పోలార్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6.55 అంగుళాల అమోల్డ్ ఎల్ఈడీ డిస్ప్లే, త్రీడీ గొరిల్లా గ్లాస్‌తో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. ఇక వన్‌ప్లస్ 8 ప్రో బ్లాక్, గ్లేసియల్ గ్రీన్, అల్ర్టామెరైన్ బ్లూ కలర్స్‌లో 6.78 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్‌తో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 8 ప్రో 4510 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. చదవండి : వారంటీ పొడిగిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు -
వారంటీ పొడిగిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులకు వారంటీని పొడిస్తున్నాయి. వీటిలో శామ్సంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు ఉన్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ముగిసే అన్ని రకాల ఉత్పత్తులకు మే 31 వరకు వారంటీ పొడిగిస్తున్నట్టు శామ్సంగ్ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 30 వరకు ముగిసే వాటికి మే 31 వరకు వారంటీ ఇస్తున్నట్టు వన్ ప్లస్ తెలిపింది. ఒప్పో సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అలాగే ఆన్లైన్ రిపేర్ సర్వీస్‌ను సైతం అందిస్తోంది. పరిస్థితి సర్దుమణగగానే కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సర్వీసు అందిస్తామని షావొమీ స్పష్టం చేసింది. రియల్మీ మే 31 వరకు వారంటీ ఎక్స్టెండ్ చేసింది. మార్చి 15–ఏప్రిల్ 30 మధ్య కొనుగోలు చేసిన డివైస్‌లకు రిప్లేస్మెంట్ పీరియడ్‌ను అదనంగా 30 రోజులు పొడిగించింది. మార్చి 20 నుంచి మే 20 మధ్య వారంటీ ముగిసే ఉత్పత్తులకు 60 రోజులు పొడిగించినట్టు డీటెల్ వెల్లడించింది. మార్చి 15–మే 15 పీరియడ్‌లో వారంటీ పూర్తి అయ్యే ప్రొడక్టులకు 60 రోజులు ఎక్స్టెండ్ చేసినట్టు లావా పేర్కొంది. వారంటీ పీరియడ్‌ను రెండు నెలలు పొడిగించామని టెక్నో, ఇన్ఫినిక్స్ ప్రకటించాయి. -
వన్‌ప్లస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
బీజింగ్: చైనా మొబైల్ సంస్థ వన్‌ప్లస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్ అయిందంటూ బాంబు పేల్చింది. "అనధికార పార్టీ" ద్వారా కస్టమర్ల డేటా లీకైందని వెల్లడించింది. ఈ మేరకు తన వినియోగదారులకు సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితమయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు. వన్‌ప్లస్ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేశారని తెలిపింది. ముఖ్యంగా కస్టమర్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లు, ఇమెయిల్, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్వర్డ్లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ డేటా బ్రీచ్ మూలంగా కొంతమందికి స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్ రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారమే డేటా లీక్ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు సంస్థనుంచి అధికారిక ఇమెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితమనే విషయాన్ని గమనించాలని వన్‌ప్లస్ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వన్‌ప్లస్ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్ సీ ఒక ప్రకటనలో తెలిపారు. -
వన్‌ప్లస్ టీవీలపై రిలయన్స్ ఆఫర్
సాక్షి, ముంబై : చైనా సంస్థ వన్‌ప్లస్ దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ తో మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. ఈ మేరకు వన్ ప్లస్ టీవీలను నేడు (శనివారం, 19) రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయిస్తుంది. ఆఫర్లు వన్‌ప్లస్ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు,హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ .7వేల వరకు క్యాష్‌బ్యాక్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్టెండెడ్ వారంటీతోపాటు మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేకమైన ఆఫర్లను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రెండు వెర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్‌లో లభిస్తాయి. ప్రభాదేవిలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బడే అధ్యక్షత వహించగా, రిలయన్స్ డిజిటల్, ఈవిపి అండ్ సిఎంఓ కౌషల్ నెవ్రేకర్, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ (జీఎం) వికాస్ అగర్వాల్ పాల్గొన్నారు. బాలీవుడ్ నటి తారా సుతారియా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ డిజిటల్ తన అభిమాన టెక్నాలజీ స్టోర్ అనీ, భారతదేశమంతా ఈ కొత్త తరం టీవీని అనుభవించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది నవంబరునుంచి రిలయన్స్ డిజిటల్‌తో కలిసి పనిచేస్తున్నామని, స్పందన అద్భుతంగా వుందని వికాస్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా వన్‌ప్లస్ టీవీలతో తమ ఈ భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. బ్రియాన్ బాడే మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించిన నెంబర్ వన్ సంస్థగా తమ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలోఉంచుకుని, రిలయన్స్ డిజిటల్ కుటుంబానికి వన్‌ప్లస్ టీవీని స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందనీ, భారత వినియోగదారునికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన తాజా టెక్నాలజీ బ్రాండ్ల మధ్య వారధిగా కొనసాగుతామని వ్యాఖ్యానించారు. -
వన్‌ప్లస్ 7టీ ధర తెలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: చైనా సంస్థ వన్‌ప్లస్ వన్ ప్లస టీవీలతో పాటు మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 26 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వన్‌ప్లస్ 7 టీ పేరుతో ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మే 2019 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన వన్‌ప్లస్ 7కు సక్సెస్సర్గా దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128 జీటీ స్టోరేజ్ ధర రూ. 37,999, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 గా ఉంచింది. ఇవి సెప్టెంబరు 28నుంచి కొనుగోలుకు లభ్యం. వన్‌ప్లస్ 7టీ ఫీచర్లు 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ 1080X2340పిక్సెల్స్ రిజల్యూషన 8జీబీ ర్యామ్ 48 48+16+12ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ Introducing the OnePlus 7T pic.twitter.com/9posGe1E0n — OnePlus India (@OnePlus_IN) September 26, 2019 -
హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్అండ్డీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్ ప్లస్ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇక్కడి నానక్‌రామ్‌గూడలో 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వన్ ప్లస్ ఫౌండర్, సీఈవో పీట్ లావ్ వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో పరిశోధన, అభివృద్ధి సాగుతుందన్నారు. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్, ఆటోమేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కెమెరా ల్యాబ్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తామని వివరించారు. మూడేళ్లలో కంపెనీకి ఇది అతిపెద్ద ఆర్అండ్డీ కేంద్రంగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో 1,500 మంది.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 200 మంది నిపుణులు ఉన్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 1,500లకు చేరుతుందని వన్ ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ వెల్లడించారు. వీరిలో 25–40 శాతం ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని చెప్పారు. ‘రానున్న మూడేళ్ల కాలంలో ఆర్అండ్డీ సెంటర్‌కు రూ.1,000 కోట్లు పెట్టుబడి చేస్తాం. ఆవిష్కరణల విషయంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలుపుతాం. ఈ ఏడాదే భారత్ నుంచి విదేశాలకు మొబైల్ ఫోన్లు ఎగుమతి చేస్తాం. ప్రీమియం స్మార్ట్ఫోన్ల రంగంలో ప్రపంచంలో 2 శాతం వాటాతో తొలి అయిదు స్థానాల్లో ఉన్నాం. భారత్‌లో 43 శాతం వాటాతో అగ్ర స్థాయిని కైవసం చేసుకున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను అక్టోబరు–డిసెంబరు మధ్య ప్రారంభిస్తాం’ అని వివరించారు. షెంజెన్ గుర్తొచ్చింది.. పీట్ లావ్ గత ఏడాది హైదరాబాద్ సందర్శించారు. భాగ్యనగరిని చూడగానే ఆయనకు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ రాజధానిగా పేరున్న షెంజెన్ గుర్తొచ్చింది. ఆ నగరం మాదిరిగా హైదరాబాద్ సైతం అభివృద్ధి చెందుతోందని పీట్ భావించారు. ‘దేశంలో స్టార్టప్స్ జోన్‌గా భాగ్యనగరి రూపొందుతోంది. కంపెనీకి అవసరమైన నిపుణులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆర్అండ్డీ సెంటర్ కోసం ఈ నగరాన్ని ఎంచుకున్నాం’ అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా పీట్ లావ్‌ను ఉద్ధేశించి కేటీఆర్ కోరారు. ‘తయారీ కేంద్రానికి అవసరమైన స్థలాన్ని చూపిస్తానని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సెప్టెంబరులో తిరిగి భారత్ వస్తాను’ అని పీట్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి నోయిడాలో ఫోన్ల తయారీ ప్లాంటు ఉంది. రెండవ ప్లాంటు ఎక్కడ, ఎప్పుడు స్థాపించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. -
భారీ పెట్టుబడితో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారీ పెట్టుబడితో తన ఆర్అండ్ డి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేంద్రాన్ని ఆరంభించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ కోసం వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమని కేటీర్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రానున్న రెండేళ్లలో 1500 ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. సంస్థకు కావాల్సిన మద్దతును టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే వన్ ప్లస్ మొబైల్స్ మనుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆయన అభిలషించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా దీన్ని అభివృద్ది చేయాలని వన్‌ప్లస్ యోచిస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేసే సంస్థలకు హైదరాబాద్ ఆకర్షణీయ స్థానంగా అవతరించిందన్నారు. అటు హైదరాబాద్‌లో తమ సంస్థ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు వన్ ప్లేస్ ఫౌండర్ అండ్ సీఈవో పీట్ లౌ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా హాజరయ్యారు. -
వన్‌ప్లస్ టీవీలూ వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తెస్తోంది. సెప్టెంబర్‌లో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. చైనా కన్నా ముందుగా భారత మార్కెట్లోనే స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతుండటం గమనార్హం. ‘వన్‌ప్లస్ టీవీలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించబోతున్నాం. వీటిని ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెస్తున్నాం’ అని వన్‌ప్లస్ ఫోరంలో సంస్థ సీఈవో పీట్ లౌ వెల్లడించారు. అయితే, టీవీ ధర, ఇతరత్రా ఫీచర్స్ మొదలైన వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ కూడా గతేడాది నుంచే భారత్‌లో టీవీలను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. ఇక శాంసంగ్, ఎల్జీ, మైక్రోమ్యాక్స్ వంటి ఇతరత్రా ఫోన్స్ తయారీ సంస్థలకు కూడా సొంతంగా టీవీ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాటి బాటలోనే వన్‌ప్లస్ సంస్థ సైతం స్మార్ట్‌టీవీల విభాగంలోకి అడుగుపెడుతోంది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నామని, క్రమంగా ఒక్కో మార్కెట్లో ఈ టీవీలను ప్రవేశపెడతామని పీట్ వివరించారు. భారత్‌లో వివిధ కంటెంట్ ప్రొవైడర్స్‌తో సత్సంబంధాలు ఉండటంతో యూజర్లకు మరింత మెరుగైన కంటెంట్‌ను అందించగలమన్నారు. ఉత్తర అమెరికా, యూరప్, చైనా తదితర మార్కెట్లలో కూడా వన్‌ప్లస్ టీవీని ఆవిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ కంటెంట్ ప్రొవైడర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నా మని పీట్ చెప్పారు. ‘ప్రతీ చిన్న విషయంపైనా దృష్టి పెడతాం. భవిష్యత్ స్మార్ట్ టీవీలకు ప్రమాణాలు నిర్దేశించేలా మా ఉత్పత్తి ఉండాలన్నది మా లక్ష్యం’ అని ఆయన చెప్పారు. 2019 జూన్ క్వార్టర్ లో భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో (రూ.30,000 పైగా ధర ఉండే ఫోన్స్) వన్‌ప్లస్ 43 శాతం వాటాతో అగ్రస్థానంలో నిల్చింది. -
దిగ్గజాలకు దిగులే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు త్వరలో
ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనదైన శైలితో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ టీవీ రంగంలో కూడా అడుగుపెట్టనుంది. గత సెప్టెంబర్ 14నే తమ కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీ రానుందని వన్‌ప్లస్ సీఈవో పీటే లౌ తెలిపారు. దాని తర్వాత టీవీ గురించి ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా లౌ మాట్లాడుతూ టీవీని 2019 మధ్యలో మార్కెట్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని మే నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నామన్నారు. కానీ స్థాయికి తగ్గ ప్రొడక్ట్‌ను తయారు చేయాలని నిశ్చయించున్నాం కాబట్టి కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని తెలిపారు. వన్‌ప్లస్ మొబైల్స్‌లాగే, టీవీ సేల్స్ కూడా అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు. వన్‌ప్లస్ మొబైల్‌తో అనుసంధానం చేసేలా టీవీని తయారుచేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ సర్వీస్ ద్వారా సినిమాలు, షోలు చూసే సౌలభ్యం కల్పించనున్నారు. వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ రాక షావోమీకి గట్టి ఎదురుదెబ్బ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
వన్‌ప్లస్ మరో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారీ అమ్మకాలతో దుమ్ము రేపుతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో సంచలనానికి నాంది పలికింది. వన్‌ప్లస్ 6టీను ఏకంగా 10జీబీ వెర్షన్లో తీసుకురాబోతోంది. స్పీడ్‌కు సలాం అంటూ సరికొత్త హంగులతో మెక్లారెన్ ఎడిషన్ (అత్యంత ఖరీదైన ప్రముఖ స్పోర్ట్స్ కారు) వన్‌ప్లస్ 6టీని 10జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ డిసెంబర్ 11న లండన్‌లో లాంచ్ చేయనుంది. అలాగే డిసెంబరు 12న ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ మేరకు ట్విటర్లో ఒక టీజర్‌ను వదిలింది. కాగా కంపెనీ ఇప్పటికే వన్‌ప్లస్ 6టీ థండర్ పర్పుల్ ఎడిషన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6టీ కు సమానంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ధర తదితర వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. OnePlus and @McLarenF1. Forever in pursuit of speed. Experience the #SalutetoSpeed on December 11. https://t.co/inqbUCRYcK pic.twitter.com/Q7HGBqmZtw — OnePlus (@oneplus) November 27, 2018 -
గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన వన్‌ప్లస్ 6టీ
న్యూఢిల్లీ : కొత్త ఫోన్‌ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఉండే కిక్కే వేరు. ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఫోన్‌ని తొలిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు ఎవరైనా కాస్తా ఎగ్జైటింగ్‌గానే ఫీలవుతారు. అలాంటిది దాదాపు 500 మంది.. ఒకేసారి ఒకే మోడల్ ఫోన్‌ని అన్‌బాక్స్ చేస్తే ఆ ఫిలింగే వేరు. ఫీలింగ్ సంగతి ఏమో గాని ఇది మాత్రం రికార్డే అంటున్నారు గిన్నిస్ బుక్ అధికారులు. ఈ అరుదైన ఘనత సాధించిన ఫోన్ వన్‌ప్లస్ 6టీ. అత్యంత తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ తన రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన వన్‌ప్లస్, నిన్న (నవంబరు 1) ఇండియాలో వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తొలుత ఈ ఫోన్ అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నవంబర్ 3వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ సహా వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టీ లభ్యం కానుంది. అయితే లాంచ్ అయిన మరుసటి రోజే వనప్లస్ 6టీ అరుదైన రికార్డ్ సాధించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. అమెజాన్‌లో వనప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ని ఆర్డర్ చేసిన వందలాది మంది వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్‌ని ముంబైలోని ‘రిచర్డ్సన్ అండ్ క్రుడ్డాస్’కు రావాల్సిందిగా వన్‌ప్లస్ అధికారులు కోరారు. ఇలా దాదాపు 559 మంది ఇక్కడకు చేరుకున్నారు. వీరందరికి ఒకేసారి.. ఒకే వేదిక మీద వనప్లస్ 6టీ ఫోన్‌ని డెలివరీ చేసింది అమెజాన్. ఫోన్‌ని అందుకున్న వారంతా ఒకేసారి దాన్ని అన్‌బాక్స్ చేశారు. ఇంతవరకూ ప్రపంచంలో ఇంత మంది ఒకే వేదిక మీద.. ఒకేసారి ఒకే మోడల్ ఫోన్‌ని అన్‌బాక్స్ చేయలేదు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి మొబైల్గా వన్‌ప్లస్ 6టీ రికార్డ్ సృష్టించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కింది. ఈ విషయం గురించి వన్‌ప్లస్ అధికారులు ‘వన్‌ప్లస్ కమ్యూనిటీ శక్తిని, ఉత్సాహాన్ని చూసి మేం ఆశ్యర్యానికి గురయ్యాము. వన్‌ప్లస్‌కు ఇండియాలో ఎంత పాపులారిటీ ఉందో వీరిని చూస్తే అర్థం అవుతోంది’ అన్నారు. అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
వన్‌ప్లస్ 6టీ ధర, లాంచింగ్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టీ ని భారత మార్కెట్లో కూడా లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది. నవంబరు 1 నుంచి ఈ స్మార్ట్ఫోన్లు అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటులోకి రాన్నుఆయి. అలాగే నవంబర్ 3వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ సహా వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టీ లభ్యం కానుంది. వన్ ప్లస్ 6టీ లాంచింగ్ ఆఫర్లు : ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ ఈఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందివ్వనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు 6.41 ఇంచుల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 16+20 ఎంపీడ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ And there you have it! The OnePlus 6T starts at ₹37,999. Which one is your favourite variant? #OnePlus6TLaunch pic.twitter.com/RyovNwpfP3 — OnePlus India (@OnePlus_IN) October 30, 2018 -
భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న స్మార్ట్‌ఫోన్
ముంబై : స్మార్ట్ఫోన్ల యుగంలో రోజుకోక కొత్త ఫీచర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో నెలకొక స్టార్మ్‌ఫోన్‌ని లాంచ్ చేస్తోంది. వీటిలో కొన్ని హై బడ్జెట్ ఫోన్లు కాగా మరి కొన్ని మాత్రం సామాన్యులకు అందుబాటులో ఎక్కువ ఫీచర్స్‌తో.. తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్‌ఫోన్‌కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి. మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్ లెన్స్’ నిర్వహించిన సర్వేలో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా నిలిచింది. తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి. ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌తోనే అడ్జస్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్‌ప్లస్ బ్రాండ్‌ను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఒప్పో, వివో, ఆపిల్, హనర్ వంటి హై బడ్జెట్ బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్‌ప్లస్ ముందు వరుసలో ఉంది. -
వన్‌ప్లస్ 6టీ లాంచ్
న్యూయార్క్: ప్రముఖ చైనాకంపెనీ వన్‌ప్లస్ లేటెస్ట్ మొబైల్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 6టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను న్యూయార్క్‌లో లాంచ్ చేసింది. గత ఏడాది మేలో తీసుకొచ్చిన వన్‌ప్లస్ 6కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. ఈ రోజు (అక్టోబర్ 30) సాయంత్రం 8.30 లకు ఢిల్లీలో లాంచ్ చేయనుంది. 6జీబీ/ 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధరను సుమారు రూ. 40వేలు, 8జీబీ/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 42,500, 8జీబీ/256జీబీ స్టోరేజ్ ధరను సుమారు రూ 46వేలుగా ఉంచింది. ఇండియాలో ధరలు కూడా ఇదే రేంజ్లో ఉండవచ్చని అంచనా. వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు 6.41 అంగుళాల ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 2340x1080 పిక్సెల్ రిజల్యూషన్ అక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ 16 + 20ఎంపీ రియర్ డ్యుయల కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
రిలయన్స్ డిజిటల్‌తో జతకట్టిన వన్‌ప్లస్
సాక్షి,న్యూఢిల్లీ: భారదేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై కన్నేసిన చైనా మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోని దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థతో ఒక కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా వన్ ప్లస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలకు ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో వన్‌ప్లస్ ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. అంతేకాదు దేశంలోని పలు నగరాల్లో రిలయన్స్ డిజిటల్ స్టోర్ల ద్వారా వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్ 6టీ ఆవిష్కరణ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. దేశంలోనే నెంబర్‌వన్, అతి వేగంగా విస్తరిస్తున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రిలయన్స్ డిజిటల్‌తో వన్‌ప్లస్ ఒప్పందాన్ని చేసుకుందని రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తాజా భాగస్వామ్యంతో మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ ప్రకటించారు. భారతీయ నగరాల్లోని తమ మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోఉండేలా మరిన్ని రిటైల్ టచ్ పాయింట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. వన్ ప్లస్ సంస్థతో భాగస్వామ్యం పట్ల రిలయన్స్ డిజిటల్ సంస్థ సీఈవో బ్రయాన్ బేడ్ సంతోష వ్యక్తం చేశారు. తమ స్టోర్లలో వినియోగదారులకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తామని తద్వారా లైవ్ డెమో తోపాటు, కస్టమర్లు తమ సందేహాలను తమ సిబ్బంది ద్వారా పత్యక్షంగా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లో అక్టోబరు 29 వ తేదీ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభానికి ముందు ఈ భాగస్వామ్య ప్రకటన రావడం విశేషం. అలాగే అక్టోబర్ 30 న న్యూఢిల్లీలో లాంచ్ చేయనుంది. ఇప్పటివరకు టాటా గ్రూపునకు చెందిన క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యే వన్‌ప్లస్‌స్మార్ట్‌ఫోన్లు ఇపుడు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు : 6.4 అంగుళాల డిస్ప్లే , 8జీబీ ర్యామ్, 256 జీబీస్టోరేజ్ 3700ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. -
దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్
న్యూఢిల్లీ : ఇన్ని రోజుల భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్(రూ.30,000 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్)లో టాప్ లీడర్లు ఎవరూ అంటే.. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త లీడర్ దూసుకొచ్చింది. అదే చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 2018 రెండో క్వార్టర్లో 40 శాతం మార్కెట్ షేరుతో వన్‌ప్లస్ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. వన్‌ప్లస్ 6 రికార్డు షిప్మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే దిగ్గజ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్ షిప్మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 34 శాతం షేరుతో శాంసంగ్ ఈ సెగ్మెంట్లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8 కంటే, గెలాక్సీ ఎస్9 షిప్మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. మరోవైపు ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లకు డిమాండ్ ఈ క్వార్టర్లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్ మార్కెట్ షేరు భారీగా పడిపోయింది. కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ సిరీస్ షిప్మెంట్లు క్షీణించాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది. అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఈ క్వార్టర్లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్లోకి హువావే(పీ20), వివో(ఎక్స్21), నోకియా హెచ్ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్జీ(వీ30 ప్లస్) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్తగా వచ్చి చేరాయి. శాంసంగ్, వన్‌ప్లస్, ఆపిల్ టాప్-3 బ్రాండ్లు మొత్తం మార్కెట్ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్లో 95 శాతంగా నమోదైంది. -
వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ సేల్, వారికోసమే..
సేల్స్.. డిస్కౌంట్ ఆఫర్లతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లు మోరుమోగుతున్నాయి. ఇటీవలే అమెజాన్ తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను, బంపర్ డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 గంటల పాటు లాంగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ షాపింగ్ డేస్ సేల్కు తెరలేపింది. తాజాగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వన్‌ప్లస్ సైతం సొంతంగా ఓ వినూత్నమైన సేల్‌ను ప్రారంభిస్తుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా విద్యార్థులకు మాత్రమే. బ్యాక్-టూ-స్కూల్-సేల్ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, జూలై 30తో ముగియనుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఉత్పత్తులు కొనుగోలు చేసే విద్యార్థులకు బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ ఉత్పత్తులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే ఈ సేల్ లక్ష్యమని కంపెనీ చెప్పింది. ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో వన్‌ప్లస్ 6 కొనుగోలు చేసే వారికి రూ.1500 డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాక అమెజాన్‌ను నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు వన్‌ప్లస్ కేసులు, కవర్లపై వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.34,999గా ఉంది. ‘మా కోర్ యూజర్లు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు. అంటే మా కమ్యూనిటీ మొత్తంలో 30 శాతం. విస్తృతంగా పరిశోధన చేసిన అనంతరం, కన్జ్యూమర్లు డివైజ్‌లను కొంటారు. విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారులు. ఈ నేపథ్యంలో మా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం’ అని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ అన్నారు. -
నేటి నుంచే వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ సేల్
వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ నేటి నుంచి తొలిసారి విక్రయానికి వచ్చింది ఈ నెల ప్రారంభంలోనే ఈ కొత్త వేరియంట్ రూ.39,999కు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌తో కలిపి, మొత్తం నాలుగు వేరియంట్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌తో పాటు కంపెనీ అవెంజర్స్ స్పెషల్ ఎడిషన్ వన్‌ప్లస్ 6ను లాంచ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ కొన్ని విక్రయాల అనంతరం నిలిపివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ స్టోర్‌లో ఇది రూ.34,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయంతో పాటు అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆల్-గ్లాస్ డిజైన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 7.7 ఎంఎం పలుచనైది, 177 గ్రాముల బరువుంది 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
డిస్కౌంట్ ఆఫర్లో వన్‌ప్లస్ 6
వన్‌ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్ 2000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నుంచి ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఉచితంగా 12 నెలల పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఐడియా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే, మరో రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్లియర్‌ట్రిప్ నుంచి విమానం, హోటల్ బుకింగ్స్ చేసుకునే వారికి వన్‌ప్లస్ కంపెనీ రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇలా పలు ప్రయోజనాలను వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఆ కంపెనీ ఆఫర్ చేస్తుంది. వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లు 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్‌లలో మార్కెట్లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్ ధర 34,999 రూపాయలు కాగ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 39,999 రూపాయలు. మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. పైన పేర్కొన్న అన్ని వేరియంట్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐ ఆఫర్ వాలిడ్‌లో ఉంది. ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ఇండియా సైట్లో మాత్రమే ఉంది. వన్‌ప్లస్ స్టోర్‌లో ఈ ఆఫర్లు లేవు. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ -
8 జీబీ ర్యామ్‌తో వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్!
గత వారం టీజ్ చేసిన మాదిరిగానే వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు జూలై 16 నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ భారత్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ వన్‌ప్లస్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇటీవలే వన్‌ప్లస్ 6 మిడ్నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్మార్ట్‌ఫోన్ 256 జీబీ వేరియంట్లో రూ.43,999కు జూలై 14 నుంచి వినియోగదారుల కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
రికార్డు బద్దలుకొడుతున్న వన్‌ప్లస్ 6
అత్యంత తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ తన రికార్డులను బద్దలు కొడుతోంది. 22 రోజుల క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్, ఇప్పటికే 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని తాకిన క్రమంలో వన్‌ప్లస్ ‘కమ్యూనిటీ సెలబ్రేషన్స్’ను నిర్వహిస్తోంది. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లోనే మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. లాయల్టీ ప్రొగ్రామ్‌లో భాగంగా.. వన్‌ప్లస్ 1500 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ బోనస్‌ను అంతకముందు కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ 6ను కొనుగోలు చేసిన కస్టమర్, తన స్నేహితుడిని కూడా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని రిఫర్ చేస్తే... మూడు నెలల పాటు వారెంటీ కూడా పెరుగుతుంది. లాంచ్ అయిన దగ్గర్నుంచి వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక స్పెషల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎడిషన్ ఫోన్ సెకన్లలోనే అవుటాఫ్ స్టాక్ అయింది. ఈ ఫోన్ ధర 44,999 రూపాయలు. మూడు వేరియంట్లలో వన్‌ప్లస్ 6ను కంపెనీ లాంచ్ చేసింది. మిర్రర్ బ్లాక్ ఫిన్నిస్, మిడ్నైట్ బ్లాక్, ది అవెంజర్స్ ఎడిషన్. బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 34,999 రూపాయలు. రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర 39,999 రూపాయలు. ఇక అవెంజర్స్ ఎడిషన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్లో ఫీచర్లు... కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అంతా గ్లాస్ డిజైన్‌లో ఇది రూపొందింది. 6.28 అంగుళాల ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే, 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, క్వాల్కామ్ 845 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. -
వన్‌ప్లస్ 6 లాంచ్, అదిరిపోయే ఫీచర్లు
ముంబై : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను నేడు(గురువారం) భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ముంబై వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 6 తోపాటు వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా నేడు ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నిన్ననే లండన్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నేడు భారత్‌లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 అచ్చం ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లేను కలిగి ఉంది. అంతా గ్లాస్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ లాంచ్ ఈవెంట్లోనే కంపెనీ ఐదు కొత్త వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లను, 10 కొత్త సర్వీసు సెంటర్లను కూడా ప్రకటించింది. వన్‌ప్లస్ 6 ధర వన్‌ప్లస్ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్ వేరియంట్లలో భారత మార్కెట్లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్ భారత్‌కు రావడం లేదు. మూడు రంగులు మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ లిమిటెడ్ ఎడిషన్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను అమెజాన్‌లో మే 29 నుంచి ఓపెన్ సేల్కు ఉంచనుంది. వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ మాత్రం దేశవ్యాప్తంగా ఎనిమిది పాప్ అప్ స్టోర్లలో విక్రయానికి వస్తుంది. మే 21న మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల వరకు, అదేవిధంగా మే 22న ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్ అమెజాన్‌లో మే 21న తొలుత అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ఓపెన్ సేల్కు రానుంది. వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ లభ్యమవనుంది. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెగ్యులర్ వేరియంట్లతో కలిపి లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్‌ను, 256జీబీ స్టోరేజ్‌ను దీనిలో ఆఫర్చేస్తోంది. గొర్రిల్లా గ్లాస్ 5 కవరింగ్, గోల్డ్ వన్‌ప్లస్, వెనుక వైపు అవెంజర్స్ లోగోలు ఉన్నాయి. -
వన్‌ప్లస్ 6 లాంచ్ ఆఫర్లు రివీల్
న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను మరికొన్ని గంటల్లో లాంచ్ చేయబోతోంది. మరికొన్ని గంటల్లో మార్కెట్ల ముందుకు రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్లను భారత్‌లో రివీల్ చేసింది ఆ కంపెనీ. లాంచ్ ఆఫర్లలో రూ.2000 డిస్కౌంట్, 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కల్పించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐడియా కస్టమర్లకూ రూ.2000 క్యాష్‌బ్యాక్, డివైజ్ ఇన్సూరెన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కన్జ్యూమర్లకు రూ.250 విలువైన గిఫ్ట్ కార్డు, అమెజాన్ కిండ్లీపై రూ.500 వరకు డిస్కౌంట్ వస్తుంది. క్లియర్‌ట్రిప్‌తో వన్‌ప్లస్ కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో విమానాలు, హోటల్ బుకింగ్స్‌పై రూ.25వేల వరకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ లాంచ్ ఆఫర్లతో పాటు వన్‌ప్లస్ ఇప్పటికే ఈ డివైజ్ ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లండన్‌లో మే 16న లాంచ్ చేస్తున్నారు. భారత్‌లో మే 17న విడుదల చేయనున్నారు. మే 21 నుంచి మే 22 మధ్యలో భారత్‌లోని ఎనిమిది నగరాల్లో పాప్-అప్ ఈవెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వస్తోంది. లాంచ్ ఆఫర్లు కూడా మే 21 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. ఫుల్ వ్యూ డిస్ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 అంగుళాల డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
వన్‌ప్లస్ 6ను లీక్ చేసిన అమితాబ్
గత కొన్నేళ్లుగా వన్‌ప్లస్ కంపెనీకి, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ తన బ్రాండుకు అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. గతేడాది వన్‌ప్లస్ 5ను లాంచ్ ఈవెంట్లో అమితాబ్ అలరించారు కూడా. తాజాగా వన్‌ప్లస్ కంపెనీ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆ డివైజ్‌పై పలు లీక్‌లు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అమితాబ్ బచ్చనే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్ను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసి, వెంటనే డిలీట్ చేశారు. అమితాబ్ బచ్చన్, కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో పీటే లా ఇద్దరూ కలిసి తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న రెండు మోడల్స్‌ను చేతిలో పట్టుకుని ఉన్న ఇమేజ్ను పోస్టు చేశారు. వెంటనే ఈ పోస్టును అమితాబ్ డిలీట్ చేసేశారు. అయినప్పటికీ సెకన్ల వ్యవధిలోనే ఆ ఇమేజ్ సోషల్ మీడియాలో షేర్ అయిపోయింది. అమితాబ్ వెంటనే ఆ పోస్టు డిలీట్ చేయడంతో, వన్‌ప్లస్ తర్వాత తీసుకురాబోతున్న వన్‌ప్లస్ 6 డివైజ్ అదేనని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఈ ఫోన్ అచ్చం ఐఫోన్ ఎక్స్ మాదిరి డిజైన్‌లో మార్కెట్లోకి వస్తుందని ఈ ఇమేజ్ను బట్టి అర్థమవుతోంది. మెరిసే బాడీ, వెనుక వైపు రెండు కెమెరాలతో రూపొందినట్టు తెలుస్తోంది. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్టు ఆ ఇమేజ్ చూపిస్తోంది. మొత్తంగా నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ డివైజ్ చూడటానికి చూడముచ్చటగా ఉన్నట్టు టెక్ వర్గాలంటున్నాయి. వన్‌ప్లస్ 6 డివైజ్ ట్వీట్‌ను తొలగించిన అమితాబ్, వెంటనే పీటే లాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. మే 17న భారత్‌లో వన్‌ప్లస్ నిర్వహించబోతున్న వన్‌ప్లస్ 6 లాంచింగ్ ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ మే 16న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఒక్కరోజు అనంతరం ముంబైలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. వన్‌ప్లస్ నుంచి ఎంతో కాలంగా వేచిచూస్తున్న డివైజ్ వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు లీక్‌లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కంపెనీ సైతం పలు బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టుల ద్వారా ఈ డివైజ్‌కు సంబంధించి చాలా ఫీచర్లను రివీల్ చేసేసింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 లేదా ఐపీ68 సర్టిఫికేషన్‌ను ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. T 2798 - Always a pleasure meeting @petelau2007. Looking forward to attending the #OnePlus6 launch event on May 17 🤩 Launch Invites go live today on https://t.co/4u02gqa5nb at 10am sharp! Head to @OnePlus_IN for real time updates on the launch and the invites! pic.twitter.com/GrwBkvI4s4 — Amitabh Bachchan (@SrBachchan) May 8, 2018 -
వన్‌ప్లస్ 6 ఫీచర్లు లీక్: మే 21నుంచి ప్రీ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6కి సంబంధించిన ఫీచర్లు మరోసారి ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన స్మార్ట్ బై ఆఫర్స్ వెబ్ పేజీలో వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్లు దర్శనమిచ్చాయి. దీని ప్రకారం వన్ ప్లస్ 6 లో కింది ఫీచర్లు ఉండనున్నాయి. 5.7 ఇంచ్ డిస్ప్లే 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 23ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 6 ను ఈ నెల16న లండన్‌లోనూ 17వ తేదీన చైనాతోపాటు ఒకేసారి భారత్‌లోనూ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రి బుకింగ్స్ మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. -
ఫ్రీగా వన్‌ప్లస్ 6..కానీ
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 6ను ఎట్టకేలకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు ఒకవైపు హల్చల్ చేస్తుండగానే.. మరో గుడ్‌న్యూస్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రారంభానికి ముందే, వన్ ప్లస్టీం తన అభిమానులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము వాడుతున్న వస్ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకటించిన ల్యాబ్ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్ బ్యాక్ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ ది ల్యాబ్ వన్‌ప్లస్ 6 ఎడిషన్ అనే బ్లాగ్‌లో వెల్లడించింది. గతంలో వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 5టీ నిర్వహించినట్టుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్టు తలిపింది. ఎంట్రీలు పంపించేందుకు చివరి తేదీ మే 2. మే 12 న విజేతలను ప్రకటిస్తారు. రివ్యూలు ఇంగ్లీషులో మాత్రమే ఉండాలి. ఈ ల్యాబ్ ప్రోగ్రాం కోసం కేవలం 15మందిని ఎంపిక చేస్తారు. ఇతర నియమాలు, నిబంధనలు తదితర వివరాలు కోసం https://oneplus.typeform.com/to/W08XQ0 లింక్‌లో లభ్యం. అన్నట్టు ఏప్రిల్ 22నుంచే అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా 'నోటిఫై మీ' సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
వన్‌ప్లస్ 6 లాంచింగ్ మే 18...?
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై పలు అంచనాలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. చైనా స్మార్టఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను 2018, మే 18న భారతదేశంలో లాంచ్ చేయనుందని సమాచారం. గతంలో వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేసిన టీజర్లో చూపినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లే డిజైన్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది. 64జీబీ బేస్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 34వేల రూపాయలుగానూ, 128 జీబీ టాప్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర 39వేల రూపాయలుగా ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా వాటర్ రెసిస్టెన్స్ ఫిచర్ వన్‌ప్లస్ 6లో కీలక ఫీచర్‌గా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా వన్‌ప్లస్ సంస్థ సోమవారం పోస్టు చేసిన ట్విట్లో పేర్కొంది. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లపై అంచనాలు... 6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే 19:9 ఆస్పెక్ట్ రెషియో 845 సాన్డ్రాగన్ అక్టాకోర్ చిప్ సెట్ 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వెనుకవైపు 16+20 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 3450 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ సారి వన్‌ప్లస్ 6 లాంచింగ్‌తో పాటు వన్‌ప్లస్ కంపెనీ పదోవార్షికోత్సవాన్ని మార్వేల్స్ స్టూడియో భాగస్వామ్యంతో ‘అవేంజర్స్:ఇన్ఫినిటి వార్’ తో కలిసి నిర్వహించనున్నట్లు గురువారం తెలిపింది. గతంలో 2017, డిసెంబర్లో భారతదేశంలో తన మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ‘వన్‌ప్లస్ 5టీ’ స్మార్ట్‌ఫోన్‌ను ‘స్టార్‌వార్స్’తో కలిసి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
రికార్డులు బద్దలు కొట్టిన వన్‌ప్లస్ 5టీ
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వన్‌ప్లస్ తాజాగా తీసుకొచ్చిన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ శుక్రవారం విక్రయానికి వచ్చింది. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై స్పెషల్ వన్-అవర్ ప్రీవ్యూ సేల్ కింద విక్రయానికి వచ్చిన ఈ ఫోన్, కేవలం ఐదు నిమిషాలోనే అవుటాఫ్ స్టాక్ అయింది. భారత్‌లో, గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన చూస్తున్నామని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాశ్ అగర్వాల్ తెలిపారు. బెంగళూరు, ఢిల్లీలోని తమ ఎక్స్పీరియన్స్ స్టోర్లకు వందలాది మంది అభిమానలు తరలి వచ్చినట్టు పేర్కొన్నారు. నవంబర్ 28 నుంచి ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్కు వస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, అన్ని ఛానళ్లలోనూ ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కంపెనీ లాంచ్-డే సేల్స్ రికార్డులను వన్‌ప్లస్ 5టీ బద్దలు కొట్టింది. ఆరు గంటల్లో అత్యంత వేగంగా అమ్ముడుపోయిన కంపెనీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. వన్‌ప్లస్ 5టీ ఫీచర్లు.. 6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్సీజెన్‌ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్తో రన్నింగ్ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్ సెన్సార్, రెండోది 16 మెగాపిక్సెల్ మోడ్యూల్ ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ స్కానర్ -
వైరల్ : వన్‌ప్లస్ 5టీని గిఫ్ట్‌గా ఇవ్వండి
మీ ఫోన్ పనిచేయకపోతే ఏం చేస్తారు? ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లోకి లేదా స్టోర్‌లోకి వెళ్లి వేరే ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఓ వ్యక్తి ఒక్క అడుగు ముందుకేశాడు. తన ఫోన్‌కు రీబూట్ సమస్య ఉందని, తనకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ ఏకంగా కంపెనీ కో-ఫౌండర్ కార్ల్ పీకే ఈమెయిల్ చేశాడు. ఈ ఈ-మెయిల్‌ను స్క్రీన్ షాట్ తీసిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పోస్టుకు ట్విట్టర్లో అనూహ్య స్పందన వస్తోంది. క్రిష్ణకుమార్ వీ పేరుతో కార్ల్‌కు ఈ-మెయిల్ వచ్చింది. ''5టీ గురించి వినడం ఆనందదాయకంగా ఉంది. త్వరగా నాకు ఒకటి పంపండి. నా వన్‌ప్లస్ వన్‌కు రీబూట్ సమస్య వచ్చింది. వెంటనే నాకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ ఇవ్వండి. మీ విజయాన్ని అంచనావేయడానికి నేనే మొదటి వ్యక్తిని. నేనే ఈ సహజసిద్ధమైన హక్కును కలిగి ఉంది'' అనే సబ్జెట్‌తో అక్టోబర్ 11న ఈ మెయిల్‌ను పంపాడు. ప్రపంచంలో తొలి ఫ్యాన్‌గా పేర్కొంటూ ఈ ఈ-మెయిల్‌ను పంపాడు. ఆశ్చర్యకరంగా ఈ ఈ-మెయిల్‌ను స్క్రీన్‌షాట్ చేసిన కార్ల్ పీ 1.2 లక్షల మంది ఫాలో అయ్యే తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. కార్ల్ పీ పోస్టు చేసిన ఈ పోస్టుకు విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ఇటీవలే వన్‌ప్లస్ 5టీ ను కంపెనీ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 5ను లాంచ్‌చేసిన నెలల వ్యవధిలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం ఓ డ్రీమ్‌గా భావిస్తున్నారు. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అందుబాటులోకి వస్తోంది. విక్రయానికి రావడానికి ఒక నెల ముందే ఆ యూజర్, కో-ఫౌండర్‌కు ఈమెయిల్ చేశాడు. Natural right 🤦♂️ pic.twitter.com/0HTuh2zAYu — Carl Pei (@getpeid) November 18, 2017 If you're immediate granting 5T's, I'll have one too — Boj (@OliverBoj) November 18, 2017 IMMEDIATELY GRANT ME 5T — Matthew Sigmond (@matthew28845) November 19, 2017 typical Indian user go have a look at the forums... — Darren Powell (@Darrenintruder) November 18, 2017 My oneplus one doesn't have boot issues, but can I claim an 'artificial right' since natural right has been claimed already? — Viswanath G (@viswanathksg) November 19, 2017 LMFAO hahaha 🤣🤣🤣. Well the amount of coverage I have given to OnePlus products over the last few years, I think I have a stronger right @getpeid lol 🤣🤣🤣🤣 — J TheAndroidFreak (@cjunaid3) November 18, 2017 -
అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 5టీ లాంచ్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఎట్టకేలకు తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీని న్యూయార్క్ వేదికగా లాంచ్ చేసింది. అతిపెద్ద స్క్రీన్, మెరుగైన కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది మార్కెట్లోకి వచ్చింది. భారత్‌లో 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 కాగ, 128జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు. నవంబర్ 21 సాయంత్రం 4:30 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పైకి విక్రయానికి వస్తోంది. అన్ని సేల్స్ ఛానల్స్ ద్వారా ఈ డివైజ్ త్వరలోనే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్.. సామ్సంగ్, యాపిల్, ఎల్జీ వంటి దిగ్గజ బ్రాండ్లకు చెందిన ఫ్లాగ్షిప్ ఫోన్లకు నెక్ టు నెక్ కాంపిటీటర్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వన్‌ప్లస్ 5టీ ఫీచర్లు.. 6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్సీజెన్‌ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్తో రన్నింగ్ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్ సెన్సార్, రెండోది 16 మెగాపిక్సెల్ మోడ్యూల్ ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ స్కానర్ -
వన్‌ప్లస్ 5టీ ఫుల్ స్పెషిఫికేషన్లివే!
లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న లాంచింగ్‌కు సిద్దమై ఉంది. కానీ దీని ముందస్తుగానే ఆన్లైన్లో దీని వివరాలు బయటికి వచ్చాయి. లీకైన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6.01 అంగుళాలతో అతిపెద్దగా18:9 డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలిసింది. కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5, అమోలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందిందట. ఒరిజనల్‌గా వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. వన్‌ప్లస్ 5 మాదిరిగానే వన్‌ప్లస్ 5టీ కూడా ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తోనే రన్ అవుతుంది. స్టోరేజ్ పరంగా ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకటి 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. మరొకటి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్. వన్‌ప్లస్ 5టీలో అతిపెద్ద మార్పు హోమ్ బటన్ లేకపోవడం. ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపు ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఆక్సీజన్ ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది. కెమెరా పరంగా తీసుకుంటే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు డ్యూయల్ 16ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 398, 20ఎంపీ ఐఎంఎక్స్ 376కే డ్యూయల్ కెమెరాలుంటాయి. ఇక చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. -
ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్: లాంచింగ్‌కు ముందే
సాక్షి, ముంబై: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ వన్ ప్లస్ అతి త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్షిప్ ఫోన్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. నవంబరు 16న న్యూయార్క్‌లో అధికారికరంగా మార్కెట్లో విడుదల కానున్న వన్‌ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసికేషన్స్, డిజైన్ తదితర వివరాలు బయటికి వచ్చాయి. ఫుల్హెచ్డీ రిజల్యూషన్ భారీ స్క్రీన్, డ్యుయల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ , ఫేస్ అన్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఫీచర్‌తో దీన్ని లాంచ్ చేయనుందని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. దాదాపు వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ తరహాలోనే ఉన్నప్పటికీ తాజా డివైజ్‌ను 6జీబీ/64జీబీ స్టోరేజ్ , 8 జీబీ/128 స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేయనుందట. ఇండియాలో వన్‌ప్లస్ 5టి లభ్యత ఇప్పటి వరకు అందిన సమాచారం వన్‌ప్లస్ 5టి నవంబర్ 21న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. నవంబర్ 28నుంచి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి లభించనుంది. మరోవైపు వైర్లెస్ చార్జర్‌తో ఈ డివైస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వన్ ప్లస సీఈవో ఇప్పటికే వెల్లడించారు. వన్‌ప్లస్ 5టి ఫీచర్లు 6అంగుళాల ఆప్లిక్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2160 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 3,300 ఎంఏహెచ్ -
ఆ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి వన్ ప్లస్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు వెల్ కం చెప్పింది. ఇండియాలో తన స్మార్ట్ ఫోన్లకు కొత్త బ్రాండు అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ ను నియమించింది. బచ్చన్ రాకతో వన్ ప్లస్ బ్రాండు మార్కెట్లో మరింత మారుమోగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది. బచ్చన్ కేవలం అత్యుత్తమ, అత్యంత స్ఫూర్తిదాయకమైన నటుడు మాత్రమే కాదని, ఆయన అపారమైన విశ్వసనీయతకు మారుపేరుగా కంపెనీ అభివర్ణించింది. అదేవిధంగా వన్ ప్లస్ కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా అమెజాన్ ఇండియాలో కన్జ్యూమర్ రేటింగ్స్ పొందినట్టు పేర్కొంది. ఇండియాలో తమ బ్రాండు అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ కు వెల్ కం చెబుతున్నట్టు వన్ ప్లస్ సీఈవో, వ్యవస్థాపకుడు పీట్ లౌ చెప్పారు. బచ్చన్ తో తమ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. బ్రాండును సరికొత్త స్థాయిలకు తీసుకెళ్లడానికి బచ్చన్ భాగస్వామ్యం సహకరిస్తుందన్నారు. ఎంతో అద్భుతమైన టెక్నాలజీ బ్రాండుతో కలిసి పనిచేయడం తనకు సంతోషాన్ని కలుగజేస్తుందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. -
చైనా వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్
ధర రూ.29,999; రూ.34,999 న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్ మొబైల్ వన్‌ప్లస్ 3లో తాజా వెర్షన్‌ను శుక్రవారం నాడు మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్ 3టీ పేరుతో 64జీబీ(ధర రూ.29,999), 128 జీబీ(ధర రూ.34,999) వేరియంట్లలో ఈ ఫోన్లను అంది స్తోంది. ఈ ఫోన్లను 8 జీబీ ర్యామ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్(2.35 గిగా హెట్జ్)తో రూపొందించామని వన్‌ప్లస్ సీఈఓ పీటే లీయూ చెప్పారు. ఈ నెల 14 నుంచి అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. త్వరలో కొన్ని ఆఫర్లను అందించనున్నామని వన్‌ప్లస్ జనరల్ మేనేజర్(ఇండియా) వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆండ్రారుుడ్ 6.0 1 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఆప్టిక్ అమెలెడ్ డిస్ప్లే, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే చార్జింగ్ చేయగల ద డాష్ చార్జ్ టెక్నాలజీ, ముందు, వెనకా 16 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనక భాగంలో ఉండే కెమెరాకు, స్మార్ట్ క్యాప్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. -
వన్‌ప్లస్ దివాలీ డాష్ సేల్ ... మరో బంపర్ ఆఫర్
చైనీస్ హ్యాండ్ సెట్ మేకర్ వన్ ప్లస్ కూడా పండుగ సీజన్ అమ్మకాల్లోకి ప్రవేశించింది. ఒక రూపాయికే స్మార్ట్ ఫోన్ అందించడానికి రడీ అయ్యింది. అక్టోబర్ 24 నుండి 26వరకు కంపెనీ ఈ కామర్స్ స్టోర్ లో జరుగనున్న దీపావళి డాష్ అమ్మకాల్లో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మూడు రోజులు, మధ్యాహ్నం12, సాయంత్రం 4గంటలకు, రాత్రి 8గంటలకు ఫ్లాష్ సేల్ వుంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారుడు కేవలం ఒక రూపాయికే వన్ ప్లస్ 3 ఇతర యాక్ససరీస్‌ను గెల్చుకోవచ్చని వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ పోటీలో భాగంగా మిస్టరీ బాక్సులను లక్కీ డ్రా ద్వారా ఎంపకి చేస్తామని, అలాగే ఇలా విక్రయించిన ఫోన్లకు రిటన్ పాలసీ వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఈ పోటీలో పాల్గొన దలచినవారు వన్ ప్లస్ స్టోర్ లో అకౌంట్ తెరిచి, డాష్ సేల్ లో రిజిస్టర్ కావాలి. మొబైల్ నెం, పూర్తి చిరునామా స్పష్టంగా పేర్కొనాలి. ఆగండాగండి.. అంతటితో అయిపోలేదు.. అకౌంట్ ఓపెన్ చేసిన అనంతరం దీన్ని కనీసం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ పాంలో షేర్ చేయాలి...అపుడు మాత్రమే డాష్ సేల్ లో ఎంట్రీ లభిస్తుంది. ఆ తరువాత ఆ రోజుకు సంబంధించి కొన్ని మిస్టరీ బాక్సలను కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క ఖాతాదారుడు ఒక్కో బాక్స్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలంటే..ఒక రూపాయి ఖచ్చితంగా చెల్లించాలి. మూడు గంటలలోపు చెల్లించడంలో ఫెయిల్ అయితే.. బాక్స్ డ్రా చేసే అవకాశం మిస్ అయినట్టే. మరోవైపు మీరు మళ్లీ డ్రా బాక్స్ డ్రా చేయడం అనేది మీ డాష్ లెవల్ ను బట్టి ఉంటుంది. వన్ ప్లస్ సైట్ రిజిస్టర్ కోసం స్నేహితులకు పంపే రిక్వెస్టులు, వన్ ప్లస్ సోర్ల ద్వారా ఇతర మొబైళ్ల కొనుగోలు తదితర అంశాలను బట్టి ఈ లెవల్ నిర్ణయించబడుతుందని కంపెనీ వెబ్ సైట్ లో ప్రకటించింది. అయితే మొత్తం ఎన్ని ఫోన్లను అందించనున్నదీ, ఎన్ని మిస్టరీ బాక్సులను పొందుపరిచిందీ స్పష్టంగా ప్రకటించలేదు. మరిన్ని వివరాలకోసం వన్ ప్లస్ వెబ్ సైట్ లో చెక్ చేయండి.