డిస్కౌంట్‌ ఆఫర్‌లో వన్‌ప్లస్‌ 6 | OnePlus 6 Available With Discount Under New Limited Period Offer | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్‌ ఆఫర్‌లో వన్‌ప్లస్‌ 6

Published Fri, Jul 6 2018 12:27 PM | Last Updated on Fri, Jul 6 2018 4:59 PM

OnePlus 6 Available With Discount Under New Limited Period Offer - Sakshi

డిస్కౌంట్‌ ఆఫర్‌లో వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌

వన్‌ప్లస్‌ కంపెనీ తాజాగా లాంచ్‌ చేసిన తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఇండియా సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్‌ 2000 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ నుంచి ఈ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్‌, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. ​హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఉచితంగా 12 నెలల పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ కూడా వర్తిస్తుంది. ఐడియా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే, మరో రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. క్లియర్‌ట్రిప్‌ నుంచి విమానం, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకునే వారికి వన్‌ప్లస్‌ కంపెనీ రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇలా పలు ప్రయోజనాలను వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు ఆ కంపెనీ ఆఫర్‌ చేస్తుంది. 

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లు 6 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌లలో మార్కెట్‌లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్‌ ధర 34,999 రూపాయలు కాగ, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది. పైన పేర్కొన్న అన్ని వేరియంట్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంది. ఈ ఆఫర్‌ కేవలం అమెజాన్‌ ఇండియా సైట్‌లో మాత్రమే ఉంది. వన్‌ప్లస్‌ స్టోర్‌లో ఈ ఆఫర్లు లేవు. 

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లు
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్‌ 5.1
డ్యూయల్‌-సిమ్‌(నానో)
6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
84 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో
గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ 845 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్‌ లేదా 8జీబీ ర్యామ్‌
16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌(0.4 సెకన్లలో అన్‌లాక్‌)
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ 
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3300ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement