OnePlus 6
-
వన్‌ప్లస్ 6పై భారీ డిస్కౌంట్
మరికొన్ని రోజుల్లో వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో, వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా ఈ డిస్కౌంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. వన్‌ప్లస్ 6 బేస్ వేరియంట్(6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్)ను అమెజాన్‌లో రూ.29,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. వన్‌ప్లస్ 6 ఇతర వేరియంట్ల ధరలను కూడా తగ్గించింది ఆ కంపెనీ. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.34,999కు, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.38,999కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. ఈ ధరలు, లాంచింగ్ ధరల కంటే 5వేల రూపాయలు తక్కువ. అంటే రూ.5000 మేర డిస్కౌంట్లో వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ 6టీ లాంచ్ అయిన తర్వాత ఆ డిస్కౌంట్‌ను శాశ్వతంగా అందించనుంది వన్‌ప్లస్ కంపెనీ. అక్టోబర్ 17న వన్‌ప్లస్ 6టీ లాంచ్ కాబోతుంది. వన్‌ప్లస్ 6టీకి అతిపెద్ద స్క్రీన్, టాప్‌లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్లో కంపెనీ అందించబోతుంది. అయితే ప్రస్తుతం డిస్కౌంట్ అందించిన వన్‌ప్లస్ 6 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూడండి... ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, అతిపెద్ద ఉపకరణాలు, టీవీలు, హోమ్, కిచెన్ ప్రొడక్ట్‌లు, ఫ్యాషన్, కన్జ్యూమరబుల్ ప్రొడక్ట్‌లపై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్‌లో రూ.300ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. -
వన్‌ప్లస్ 6టీ టీజర్ వచ్చేసింది...
వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. తన అప్‌కమింగ్ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘నోటిఫై మి’ అనే పేజీతో వన్‌ప్లస్ 6టీ అమెజాన్ ఇండియాలో బుధవారం నుంచి లైవ్‌కు వచ్చింది. అమెజాన్‌లో మాత్రమే కాక, టీవీల్లో, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రమోషన్లను ఇస్తోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వన్‌ప్లస్ 6టీ ప్రకటనలను అదరగొడుతున్నారు. వన్‌ప్లస్ 6టీ కమింగ్ సూన్ అనేది, అమెజాన్ ఇండియా టీజర్ పేజీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వన్‌ప్లస్ 6 లాంచ్ అయిన మూడు నెలల్లోనే దీని టీజర్ వచ్చేసింది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తున్న తొలి వన్‌ప్లస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదే ఫీచర్‌ను వివో తన నెక్స్, వీ11 ప్రొ ఫోన్లలో, ఒప్పో ఆర్17 ప్రొలలో అందించాయి. వివో, ఒప్పో, వన్‌ప్లస్ లు సిస్టర్ బ్రాండ్లు. ఎప్పడికప్పుడూ తమ టెక్నాలజీలను ఈ కంపెనీలు షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి. అయితే వన్‌ప్లస్ 6టీలో హెడ్‌ఫోన్ జాక్‌ను అందించడం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధానమైన ఫీచర్‌గా వస్తోంది. బ్యాటరీ కూడా చాలా పెద్దదే అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ ఫీచర్లుగా ఉండబోతున్నాయి. -
వన్‌ప్లస్ 6 కొత్త వెర్షన్.. ధర రెండు లక్షలపైనే!!
వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వన్‌ప్లస్ 6 కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ఫోన్లలో అత్యంత సక్సస్ఫుల్ ఫోన్. మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ రంగుల్లో వన్‌ప్లస్ 6 మార్కెట్లోకి వచ్చింది. అటు వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6టీని రూపొందిస్తుండగా.. ఇటు లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ హడోరో పారిస్ వన్‌ప్లస్ 6 కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వెర్షన్ లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకు రాబోతుందట. స్టన్నింగ్ లుక్‌లో రాబోతున్న ఈ వెర్షన్ ధర వింటేనే మీరు షాక్‌కు గురవుతారు. దీని ధర రూ.2.26 లక్షలుగా నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఫ్రెంచ్కు చెందిన హడోరో పారిస్ లగ్జరీ డిజైనర్ కంపెనీ. ఈ కంపెనీ లెదర్స్, విలువైన మెటల్స్, జెమ్స్‌తో ఐఫోన్లను, ఐఫోన్ కేసులను, ఎయిర్‌పాడ్స్‌ను, స్మార్ట్ఫోన్లను, ఇతర యాక్ససరీస్‌ను తయారు చేస్తూ.. స్టన్నింగ్ లుక్‌లో మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సారి వన్‌ప్లస్ 6ను కస్టమైజ్ చేస్తోంది. హార్డ్‌వేర్ వన్‌ప్లస్ 6 ఫోన్ ఒరిజినల్‌దే ఉంచి, వెలుపల మాత్రం లెదర్స్, విలువైన మెటల్స్, జెమ్స్‌తో వన్‌ప్లస్ 6 ను అలకరించబోతుందట. హడోరో లాంచ్ చేసే కస్టమైజ్డ్ వెర్షన్ పేరును హడోరో వన్‌ప్లస్ 6 కార్బన్‌గా నామకరణం చేస్తోంది. కొత్త ఏరో కార్బన్‌తో ఈ వెర్షన్‌ను డిజైన్ చేస్తోంది. రెగ్యులర్ గ్లాస్ బ్లాక్‌కు బదులు ఫైబర్‌గ్లాస్ బ్లాక్ప్లేట్ను ఇది ఈ ఫోన్‌కు జత చేస్తుంది. ఈ వెర్షన్ కీ హైలెట్ బ్లాక్ కవర్‌కు మధ్యలో ప్రకాశించే వన్‌ప్లస్ లోగోను ఏర్పాటు చేయడం. స్క్రాచ్-ప్రూఫ్ సఫైర్ గ్లాస్‌తో ఈ లోగోను రూపొందిస్తోంది. సఫైర్ గ్లాస్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ పరిమిత వెర్షన్ బరువు బేస్ వన్‌ప్లస్ 6 కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, సిమ్ ఫ్రీ, అన్లాక్డ్తో ఇది మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను హడోరో అధికారిక వెబ్సైట్లో చేపట్టనుంది. 10 రోజుల్లో షిప్మెంట్ ప్రారంభించనుంది కంపెనీ. ఆసక్తి గల కస్టమర్లు ఫోన్‌పై తమ పేరును కూడా డిజైన్ చేయించుకోవచ్చు. -
వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ సేల్, వారికోసమే..
సేల్స్.. డిస్కౌంట్ ఆఫర్లతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లు మోరుమోగుతున్నాయి. ఇటీవలే అమెజాన్ తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను, బంపర్ డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 గంటల పాటు లాంగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ షాపింగ్ డేస్ సేల్కు తెరలేపింది. తాజాగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వన్‌ప్లస్ సైతం సొంతంగా ఓ వినూత్నమైన సేల్‌ను ప్రారంభిస్తుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా విద్యార్థులకు మాత్రమే. బ్యాక్-టూ-స్కూల్-సేల్ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, జూలై 30తో ముగియనుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఉత్పత్తులు కొనుగోలు చేసే విద్యార్థులకు బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ ఉత్పత్తులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే ఈ సేల్ లక్ష్యమని కంపెనీ చెప్పింది. ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో వన్‌ప్లస్ 6 కొనుగోలు చేసే వారికి రూ.1500 డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాక అమెజాన్‌ను నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు వన్‌ప్లస్ కేసులు, కవర్లపై వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.34,999గా ఉంది. ‘మా కోర్ యూజర్లు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు. అంటే మా కమ్యూనిటీ మొత్తంలో 30 శాతం. విస్తృతంగా పరిశోధన చేసిన అనంతరం, కన్జ్యూమర్లు డివైజ్‌లను కొంటారు. విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న వినియోగదారులు. ఈ నేపథ్యంలో మా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం’ అని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ అన్నారు. -
నేటి నుంచే వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ సేల్
వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ నేటి నుంచి తొలిసారి విక్రయానికి వచ్చింది ఈ నెల ప్రారంభంలోనే ఈ కొత్త వేరియంట్ రూ.39,999కు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌తో కలిపి, మొత్తం నాలుగు వేరియంట్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌తో పాటు కంపెనీ అవెంజర్స్ స్పెషల్ ఎడిషన్ వన్‌ప్లస్ 6ను లాంచ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ కొన్ని విక్రయాల అనంతరం నిలిపివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ స్టోర్‌లో ఇది రూ.34,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయంతో పాటు అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆల్-గ్లాస్ డిజైన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 7.7 ఎంఎం పలుచనైది, 177 గ్రాముల బరువుంది 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
డిస్కౌంట్ ఆఫర్లో వన్‌ప్లస్ 6
వన్‌ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్ 2000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నుంచి ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఉచితంగా 12 నెలల పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఐడియా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే, మరో రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్లియర్‌ట్రిప్ నుంచి విమానం, హోటల్ బుకింగ్స్ చేసుకునే వారికి వన్‌ప్లస్ కంపెనీ రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇలా పలు ప్రయోజనాలను వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఆ కంపెనీ ఆఫర్ చేస్తుంది. వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లు 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్‌లలో మార్కెట్లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్ ధర 34,999 రూపాయలు కాగ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 39,999 రూపాయలు. మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. పైన పేర్కొన్న అన్ని వేరియంట్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐ ఆఫర్ వాలిడ్‌లో ఉంది. ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ఇండియా సైట్లో మాత్రమే ఉంది. వన్‌ప్లస్ స్టోర్‌లో ఈ ఆఫర్లు లేవు. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ -
8 జీబీ ర్యామ్‌తో వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్!
గత వారం టీజ్ చేసిన మాదిరిగానే వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు జూలై 16 నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ భారత్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ వన్‌ప్లస్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇటీవలే వన్‌ప్లస్ 6 మిడ్నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్మార్ట్‌ఫోన్ 256 జీబీ వేరియంట్లో రూ.43,999కు జూలై 14 నుంచి వినియోగదారుల కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
వన్‌ప్లస్ 6 రికార్డులను బద్దలుకొట్టిన ఎంఐ 8
వన్‌ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన షావోమి ఎంఐ 8 బద్దలు కొట్టింది. లాంచ్ అయిన కొన్ని రోజుల్లో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, పది లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని చేధించడానికి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌కు కేవలం 18 రోజుల్లో పట్టిందని కంపెనీ తెలిపింది. జూన్ 5న తొలిసారి షావోమి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్ అధికార ప్రతినిధి డోనోవాన్ సంగ్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ‘జూన్ 5న ఎంఐ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్ తొలిసారి విక్రయానికి వచ్చింది. కేవలం 18 రోజుల్లోనే మేము 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేశాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 22 రోజుల సమయం పట్టింది. అంటే వన్‌ప్లస్ 6 రికార్డులను ఎంఐ 8 బద్దలు కొట్టేసిందన్న మాట. ఇక ఎంఐ 8 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.21 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ నాచ్డ్ డిస్ప్లేను ఇది కలిగి ఉంది 2.5 కర్వ్డ్ గ్లాస్‌తో గ్లాస్, మెటల్ డిజైన్‌తో రూపొందింది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యం 12 ఎంపీ + 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్‌కు కూడా రాబోతుంది. -
రికార్డు బద్దలుకొడుతున్న వన్‌ప్లస్ 6
అత్యంత తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ తన రికార్డులను బద్దలు కొడుతోంది. 22 రోజుల క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్, ఇప్పటికే 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని తాకిన క్రమంలో వన్‌ప్లస్ ‘కమ్యూనిటీ సెలబ్రేషన్స్’ను నిర్వహిస్తోంది. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లోనే మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. లాయల్టీ ప్రొగ్రామ్‌లో భాగంగా.. వన్‌ప్లస్ 1500 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ బోనస్‌ను అంతకముందు కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ 6ను కొనుగోలు చేసిన కస్టమర్, తన స్నేహితుడిని కూడా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని రిఫర్ చేస్తే... మూడు నెలల పాటు వారెంటీ కూడా పెరుగుతుంది. లాంచ్ అయిన దగ్గర్నుంచి వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక స్పెషల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎడిషన్ ఫోన్ సెకన్లలోనే అవుటాఫ్ స్టాక్ అయింది. ఈ ఫోన్ ధర 44,999 రూపాయలు. మూడు వేరియంట్లలో వన్‌ప్లస్ 6ను కంపెనీ లాంచ్ చేసింది. మిర్రర్ బ్లాక్ ఫిన్నిస్, మిడ్నైట్ బ్లాక్, ది అవెంజర్స్ ఎడిషన్. బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 34,999 రూపాయలు. రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర 39,999 రూపాయలు. ఇక అవెంజర్స్ ఎడిషన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్లో ఫీచర్లు... కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అంతా గ్లాస్ డిజైన్‌లో ఇది రూపొందింది. 6.28 అంగుళాల ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే, 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, క్వాల్కామ్ 845 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. -
వన్‌ప్లస్ 6లో సెక్యురిటీ లోపం, ఫోనంతా..
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఇటీవలే తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచీ... ఏదో ఒక ఇష్యూతో వార్తలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సెక్యురిటీ లోపాన్ని సెక్యురిటీ రీసెర్చర్లు గుర్తించారు. ఈ లోపంతో, యూజర్ల ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని రీసెర్చర్లు కనుగొన్నారు. అమెరికాకు చెందిన ఎడ్జ్ సెక్యురిటీ ఎల్ఎల్సీ జాన్సన్ డోనెన్‌ఫీల్డ్ ఈ లోపాన్ని గుర్తించారు. అసురక్షితంగా ఉన్న ఏడీపీతో బూట్ ఇమేజ్ మార్చబడితే, హ్యాకర్లు ఫిజికల్ యాక్సస్‌తో మొత్తం డివైజ్‌ను తమ నియంత్రణలో తెచ్చుకోగలరని రీసెర్చర్ పేర్కొన్నారు. ఏడీబీ అనేది డిఫాల్ట్‌గా సెట్ చేయబడి ఉంటుంది. ఈ సెక్యురిటీ లోపంతో యూజర్లు ఎంతో అప్రమత్తతో ఉండాలని, స్మార్ట్‌ఫోన్‌లో ప్రైవేట్ డేటా స్టోర్ చేసుకుని ఉంచుకున్న వారు ఆందోళన చెందాల్సినవసరం ఉందని ఎక్స్‌డీఏ రిపోర్టు చేసింది. ఈ సెక్యురిటీ లోపాన్ని కంపెనీకి కూడా రిపోర్టు చేసింది. ఈ రిపోర్టుపై వన్‌ప్లస్ కంపెనీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘వన్‌ప్లస్‌లో సెక్యురిటీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. సెక్యురిటీ రీసెర్చర్‌తో మేమే కాంటాక్ట్ అయ్యాం. త్వరలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ను చేపడతాం.’ అని కంపెనీ తెలిపింది. గత నెలలోనే వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 34,999 రూపాయలు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందింది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 6జీబీ/8జీబీ ర్యామ్, 64జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీనిలో ఫీచర్లు. -
10 నిమిషాల్లో ఆ ఫోన్‌కి రూ.100 కోట్లు
ముంబై వేదికగా వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను కంపెనీ గత వారమే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను 34,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. నిన్న అంటే మే 21న ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్, వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారి సేల్కు వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. 10 నిమిషాల్లోనే రూ.100 కోట్ల విలువైన విక్రయాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను వన్‌ప్లస్ కంపెనీ ప్రారంభించింది. గతేడాది వన్‌ప్లస్ 5టీ రికార్డును సైతం బద్దలు కూడా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దూసుకెళ్లింది. గతేడాది వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ రూ.100 కోట్ల విక్రయాలను ఆర్జించడానికి ఒక రోజంతా పట్టింది. కానీ వన్‌ప్లస్ 6కు అది కేవలం నిమిషాల వ్యవధిలోనే సాధ్యమవడం విశేషం. అది కూడా పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ఇది వన్‌ప్లస్ 6కు ఇది సాధ్యమైంది. నేడు వినియోగదారులందరకూ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి అందుబాటులో ఉంచింది. అమెజాన్ సైట్లోనూ, వన్‌ప్లస్ వెబ్సైట్లలోనూ, పాప్-అప్ స్టోర్లలో, క్రోమా, కంపెనీకి చెందిన ఇతర స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ నేడు లభ్యమవుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 6 అందుబాటులో ఉండే స్టోర్లు.. ముంబైలో హై స్ట్రీట్ ఫోనిక్స్, పుణేలో ఫోనిక్స్ మార్కెట్‌సిటీ, చెన్నైలో ది ఫోరమ్ విజయ, హైదరాబాద్‌లో ది ఫోరమ్ సుజన, ఢిల్లీలో డీఎల్ఎఫ్ ప్లేస్ సాకెట్, కోల్‌కతాలో సౌత్‌సిటీ మాల్, అహ్మదాబాద్‌లో గుల్మోహర్ పార్క్ మాల్, బెంగళూరులో వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్, బ్రిగేడ్ రోడ్డులో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా స్టోర్లలో కూడా దొరుకుతోంది. ఎస్బీఐ కస్టమర్లకు కంపెనీ రెండు వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ రెండు రకాల స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా.. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. -
హైఎండ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 6 లాంచ్
-
వన్‌ప్లస్ 6 లాంచ్, అదిరిపోయే ఫీచర్లు
ముంబై : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను నేడు(గురువారం) భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ముంబై వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 6 తోపాటు వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా నేడు ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నిన్ననే లండన్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నేడు భారత్‌లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 అచ్చం ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లేను కలిగి ఉంది. అంతా గ్లాస్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ లాంచ్ ఈవెంట్లోనే కంపెనీ ఐదు కొత్త వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లను, 10 కొత్త సర్వీసు సెంటర్లను కూడా ప్రకటించింది. వన్‌ప్లస్ 6 ధర వన్‌ప్లస్ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్ వేరియంట్లలో భారత మార్కెట్లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్ భారత్‌కు రావడం లేదు. మూడు రంగులు మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్, సిల్క్ వైట్ లిమిటెడ్ ఎడిషన్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను అమెజాన్‌లో మే 29 నుంచి ఓపెన్ సేల్కు ఉంచనుంది. వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ మాత్రం దేశవ్యాప్తంగా ఎనిమిది పాప్ అప్ స్టోర్లలో విక్రయానికి వస్తుంది. మే 21న మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల వరకు, అదేవిధంగా మే 22న ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్ అమెజాన్‌లో మే 21న తొలుత అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ఓపెన్ సేల్కు రానుంది. వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ లభ్యమవనుంది. వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 5.1 డ్యూయల్-సిమ్(నానో) 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ప్లే 84 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ 845 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ లేదా 8జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్(0.4 సెకన్లలో అన్‌లాక్) వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 3300ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెగ్యులర్ వేరియంట్లతో కలిపి లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్‌ను, 256జీబీ స్టోరేజ్‌ను దీనిలో ఆఫర్చేస్తోంది. గొర్రిల్లా గ్లాస్ 5 కవరింగ్, గోల్డ్ వన్‌ప్లస్, వెనుక వైపు అవెంజర్స్ లోగోలు ఉన్నాయి. -
వన్‌ప్లస్ 6 లాంచ్ ఆఫర్లు రివీల్
న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను మరికొన్ని గంటల్లో లాంచ్ చేయబోతోంది. మరికొన్ని గంటల్లో మార్కెట్ల ముందుకు రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్లను భారత్‌లో రివీల్ చేసింది ఆ కంపెనీ. లాంచ్ ఆఫర్లలో రూ.2000 డిస్కౌంట్, 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కల్పించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐడియా కస్టమర్లకూ రూ.2000 క్యాష్‌బ్యాక్, డివైజ్ ఇన్సూరెన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కన్జ్యూమర్లకు రూ.250 విలువైన గిఫ్ట్ కార్డు, అమెజాన్ కిండ్లీపై రూ.500 వరకు డిస్కౌంట్ వస్తుంది. క్లియర్‌ట్రిప్‌తో వన్‌ప్లస్ కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో విమానాలు, హోటల్ బుకింగ్స్‌పై రూ.25వేల వరకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ లాంచ్ ఆఫర్లతో పాటు వన్‌ప్లస్ ఇప్పటికే ఈ డివైజ్ ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లండన్‌లో మే 16న లాంచ్ చేస్తున్నారు. భారత్‌లో మే 17న విడుదల చేయనున్నారు. మే 21 నుంచి మే 22 మధ్యలో భారత్‌లోని ఎనిమిది నగరాల్లో పాప్-అప్ ఈవెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వస్తోంది. లాంచ్ ఆఫర్లు కూడా మే 21 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. ఫుల్ వ్యూ డిస్ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 అంగుళాల డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
వన్‌ప్లస్ 6ను లీక్ చేసిన అమితాబ్
గత కొన్నేళ్లుగా వన్‌ప్లస్ కంపెనీకి, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ తన బ్రాండుకు అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. గతేడాది వన్‌ప్లస్ 5ను లాంచ్ ఈవెంట్లో అమితాబ్ అలరించారు కూడా. తాజాగా వన్‌ప్లస్ కంపెనీ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆ డివైజ్‌పై పలు లీక్‌లు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అమితాబ్ బచ్చనే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్ను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసి, వెంటనే డిలీట్ చేశారు. అమితాబ్ బచ్చన్, కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో పీటే లా ఇద్దరూ కలిసి తెలుపు, నలుపు రంగుల్లో ఉన్న రెండు మోడల్స్‌ను చేతిలో పట్టుకుని ఉన్న ఇమేజ్ను పోస్టు చేశారు. వెంటనే ఈ పోస్టును అమితాబ్ డిలీట్ చేసేశారు. అయినప్పటికీ సెకన్ల వ్యవధిలోనే ఆ ఇమేజ్ సోషల్ మీడియాలో షేర్ అయిపోయింది. అమితాబ్ వెంటనే ఆ పోస్టు డిలీట్ చేయడంతో, వన్‌ప్లస్ తర్వాత తీసుకురాబోతున్న వన్‌ప్లస్ 6 డివైజ్ అదేనని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఈ ఫోన్ అచ్చం ఐఫోన్ ఎక్స్ మాదిరి డిజైన్‌లో మార్కెట్లోకి వస్తుందని ఈ ఇమేజ్ను బట్టి అర్థమవుతోంది. మెరిసే బాడీ, వెనుక వైపు రెండు కెమెరాలతో రూపొందినట్టు తెలుస్తోంది. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్టు ఆ ఇమేజ్ చూపిస్తోంది. మొత్తంగా నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ డివైజ్ చూడటానికి చూడముచ్చటగా ఉన్నట్టు టెక్ వర్గాలంటున్నాయి. వన్‌ప్లస్ 6 డివైజ్ ట్వీట్‌ను తొలగించిన అమితాబ్, వెంటనే పీటే లాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. మే 17న భారత్‌లో వన్‌ప్లస్ నిర్వహించబోతున్న వన్‌ప్లస్ 6 లాంచింగ్ ఈవెంట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ మే 16న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఒక్కరోజు అనంతరం ముంబైలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. వన్‌ప్లస్ నుంచి ఎంతో కాలంగా వేచిచూస్తున్న డివైజ్ వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు లీక్‌లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కంపెనీ సైతం పలు బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టుల ద్వారా ఈ డివైజ్‌కు సంబంధించి చాలా ఫీచర్లను రివీల్ చేసేసింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 లేదా ఐపీ68 సర్టిఫికేషన్‌ను ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. T 2798 - Always a pleasure meeting @petelau2007. Looking forward to attending the #OnePlus6 launch event on May 17 🤩 Launch Invites go live today on https://t.co/4u02gqa5nb at 10am sharp! Head to @OnePlus_IN for real time updates on the launch and the invites! pic.twitter.com/GrwBkvI4s4 — Amitabh Bachchan (@SrBachchan) May 8, 2018