వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌, వారికోసమే.. | OnePlus Announces Back To School Offers | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌, వారికోసమే..

Jul 20 2018 1:31 PM | Updated on Aug 14 2018 4:01 PM

OnePlus Announces Back To School Offers - Sakshi

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌

సేల్స్‌.. డిస్కౌంట్‌ ఆఫర్లతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెట్లు మోరుమోగుతున్నాయి. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వన్‌ప్లస్‌ సొంతంగా ఓ వినూత్నమైన సేల్‌ను ప్రారంభిస్తుంది.

సేల్స్‌.. డిస్కౌంట్‌ ఆఫర్లతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెట్లు మోరుమోగుతున్నాయి. ఇటీవలే అమెజాన్‌ తన ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్‌ను, బంపర్‌ డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 గంటల పాటు లాంగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌కు తెరలేపింది. తాజాగా చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వన్‌ప్లస్‌ సైతం సొంతంగా ఓ వినూత్నమైన సేల్‌ను ప్రారంభిస్తుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా విద్యార్థులకు మాత్రమే. బ్యాక్‌-టూ-స్కూల్‌-సేల్‌ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌, జూలై 30తో ముగియనుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసే విద్యార్థులకు బంపర్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్‌ ఉత్పత్తులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే ఈ సేల్‌ లక్ష్యమని కంపెనీ చెప్పింది.

ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో వన్‌ప్లస్‌ 6 కొనుగోలు చేసే వారికి రూ.1500 డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అంతేకాక అమెజాన్‌ను నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు వన్‌ప్లస్‌ కేసులు, కవర్లపై వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు రూ.34,999గా ఉంది. ‘మా కోర్‌ యూజర్లు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు. అంటే మా కమ్యూనిటీ మొత్తంలో 30 శాతం. విస్తృతంగా పరిశోధన చేసిన అనంతరం, కన్జ్యూమర్లు డివైజ్‌లను కొంటారు. విద్యార్థులు అత్యంత డిమాండ్‌ ఉన్న వినియోగదారులు. ఈ నేపథ్యంలో మా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం’ అని వన్‌ప్లస్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ అగర్వాల్‌ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement