వన్‌ప్లస్‌ 6పై భారీ డిస్కౌంట్‌ | OnePlus 6 To Get Massive Discount Before OnePlus 6T Launch | Sakshi
Sakshi News home page

  వన్‌ప్లస్‌ 6పై భారీ డిస్కౌంట్‌

Published Thu, Oct 4 2018 6:45 PM | Last Updated on Thu, Oct 4 2018 6:47 PM

OnePlus 6 To Get Massive Discount Before OnePlus 6T Launch - Sakshi

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌

మరికొన్ని రోజుల్లో వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానున్న నేపథ్యంలో, వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఈ డిస్కౌంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. వన్‌ప్లస్‌ 6 బేస్‌ వేరియంట్‌(6జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌)ను అమెజాన్‌లో రూ.29,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. వన్‌ప్లస్‌ 6 ఇతర వేరియంట్ల ధరలను కూడా తగ్గించింది ఆ కంపెనీ. 8జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.34,999కు, 8జీబీ ర్యామ్‌+256జీబీ స్టోరేజ్‌ మోడల్‌ను రూ.38,999కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. ఈ ధరలు, లాంచింగ్‌ ధరల కంటే 5వేల రూపాయలు తక్కువ. అంటే రూ.5000 మేర డిస్కౌంట్‌లో వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో లభిస్తుంది. 

వన్‌ప్లస్‌ 6టీ లాంచ్‌ అయిన తర్వాత ఆ డిస్కౌంట్‌ను శాశ్వతంగా అందించనుంది వన్‌ప్లస్‌ కంపెనీ. అక్టోబర్‌ 17న వన్‌ప్లస్‌ 6టీ లాంచ్‌ కాబోతుంది. వన్‌ప్లస్‌ 6టీకి అతిపెద్ద స్క్రీన్‌, టాప్‌లో వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ ఉంటాయి. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో కంపెనీ అందించబోతుంది.

అయితే ప్రస్తుతం డిస్కౌంట్‌ అందించిన వన్‌ప్లస్‌ 6 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూడండి...
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్‌ 5.1
డ్యూయల్‌-సిమ్‌(నానో)
6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
84 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో
గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ 845 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్‌ లేదా 8జీబీ ర్యామ్‌
16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌(0.4 సెకన్లలో అన్‌లాక్‌)
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ 
64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3300ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్‌ 10 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ సేల్‌ అక్టోబర్‌ 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, అతిపెద్ద ఉపకరణాలు, టీవీలు, హోమ్‌, కిచెన్‌ ప్రొడక్ట్‌లు, ఫ్యాషన్‌, కన్జ్యూమరబుల్‌ ప్రొడక్ట్‌లపై అమెజాన్‌ డిస్కౌంట్లు అందిస్తుంది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లో రూ.300ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement