యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజం యాపిల్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఐఫోన్ల 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. Apple iPhone 15పై అమెజాన్ , Flipkartలో రూ.60,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్‌లనుమొదలైన సంగతి తెలిసిందే.ఐఫోన్ 15 సెప్టెంబర్ 22 నుండి తొలి సేల్. అలాగే షిప్పింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం. యూజర్లు Apple India వెబ్‌సైట్‌లో అలాగే ఢిల్లీ, ముంబైలోని రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌లను యాక్సెస్ చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి వారి వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు లభ్యం.
యాపిల్ దేశంలో తన తాజా ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్లను ప్రకటించింది. iPhone 15 ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 79,900.అలాగే రూ. 89,900 నుంచి దిగి వచ్చిన iPhone 15 Plus రూ. 84,900 వద్ద అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో రూ. 128,900కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,34,900. iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు రూ. 159,900. (ఎన్‌ఆర్‌ఐలకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్:యోనో యాప్‌తో ఈజీగా)
తాజా నివేదికల ప్రకారం, అమెజాన్‌లో iPhone 15 ప్రీ-ఆర్డర్‌లో రూ. 89,900 నుంచి షురూ అవుతాయి. డిస్కౌంట్ తర్వాత, ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900 నుండి ప్రారంభం అయితే, ఈ సమయంలో వెబ్‌సైట్‌లో అన్ని మోడల్‌లు స్టాక్‌లో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్‌ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. (ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!)
మీదగ్గర iPhone 12 ట్రేడ్-ఇన్ ఆఫర్‌లో భాగంగా రూ. 20,000 అదనపు తగ్గింపు. ఈ డిస్కౌంట్ రావాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. దీనికి అదనంగా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు వర్తించినతరువాత ఐఫోన్ 15 ధర రూ. 48,900కి పడిపోతుంది.ఈ తాజా ఆఫర్ సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటుంది.
మీకు iPhone 12 లేకపోయినా డోంట్‌వర్రీ. మీ iPhone లేదా Android స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా Cashifyలో లేదా iStore అధికారిక వెబ్‌సైట్‌లో తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఫోన్ వయస్సు ,పరిస్థితిని బట్టి వినియోగదారులు రూ.2వేల రూ.67,800 వరకు ధర దిగి వస్తుంది.
(Disclaimer: తాజా iPhone 15 స్మార్ట్‌ఫోన్‌పై ఉత్తమమైన డీల్స్‌కోసం ఆయా ప్లాట్‌ఫారమ్‌లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను చెక్ చేసుకోవడం ఉత్తమం)
Comments
Please login to add a commentAdd a comment