వన్‌ప్లస్‌ 6 కొత్త వెర్షన్‌.. ధర రెండు లక్షలపైనే!! | This OnePlus 6 Limited Edition Costs Over Rs 2 Lakh | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 6 కొత్త వెర్షన్‌.. ధర రెండు లక్షలపైనే!!

Published Fri, Sep 14 2018 7:53 PM | Last Updated on Fri, Sep 14 2018 8:50 PM

This OnePlus 6 Limited Edition Costs Over Rs 2 Lakh - Sakshi

వన్‌ ప్లస్‌ 6 (ఫైల్‌ ఫోటో)

వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వన్‌ప్లస్‌ 6 కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో అత్యంత సక్సస్‌ఫుల్‌ ఫోన్‌. మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ రంగుల్లో వన్‌ప్లస్‌ 6 మార్కెట్‌లోకి వచ్చింది. అటు వన్‌ప్లస్‌ కంపెనీ వన్‌ప్లస్‌ 6టీని రూపొందిస్తుండగా.. ఇటు లగ్జరీ ఫ్రెంచ్‌ బ్రాండ్‌ హడోరో పారిస్‌ వన్‌ప్లస్‌ 6 కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వెర్షన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకు రాబోతుందట. స్టన్నింగ్‌ లుక్‌లో రాబోతున్న ఈ వెర్షన్‌ ధర వింటేనే మీరు షాక్‌కు గురవుతారు. దీని ధర రూ.2.26 లక్షలుగా నిర్ణయిస్తుందని తెలుస్తోంది. 

ఫ్రెంచ్‌కు చెందిన హడోరో పారిస్‌ లగ్జరీ డిజైనర్‌ కంపెనీ. ఈ కంపెనీ లెదర్స్‌, విలువైన మెటల్స్‌, జెమ్స్‌తో ఐఫోన్లను, ఐఫోన్‌ కేసులను, ఎయిర్‌పాడ్స్‌ను, స్మార్ట్‌ఫోన్లను, ఇతర యాక్ససరీస్‌ను తయారు చేస్తూ.. స్టన్నింగ్‌ లుక్‌లో మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సారి వన్‌ప్లస్‌ 6ను కస్టమైజ్‌ చేస్తోంది. హార్డ్‌వేర్‌ వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ ఒరిజినల్‌దే ఉంచి, వెలుపల మాత్రం లెదర్స్‌, విలువైన మెటల్స్‌, జెమ్స్‌తో వన్‌ప్లస్‌ 6 ను అలకరించబోతుందట. హడోరో లాంచ్‌ చేసే కస్టమైజ్డ్‌ వెర్షన్‌ పేరును హడోరో వన్‌ప్లస్‌ 6 కార్బన్‌గా నామకరణం చేస్తోంది. కొత్త ఏరో కార్బన్‌తో ఈ వెర్షన్‌ను డిజైన్‌ చేస్తోంది. రెగ్యులర్‌ గ్లాస్‌ బ్లాక్‌కు బదులు ఫైబర్‌గ్లాస్‌ బ్లాక్‌ప్లేట్‌ను ఇది ఈ ఫోన్‌కు జత చేస్తుంది. 

ఈ వెర్షన్‌ కీ హైలెట్‌ బ్లాక్‌ కవర్‌కు మధ్యలో ప్రకాశించే వన్‌ప్లస్‌ లోగోను ఏర్పాటు చేయడం. స్క్రాచ్‌-ప్రూఫ్‌ సఫైర్‌ గ్లాస్‌తో ఈ లోగోను రూపొందిస్తోంది. సఫైర్‌ గ్లాస్‌ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ పరిమిత వెర్షన్‌ బరువు బేస్‌ వన్‌ప్లస్‌ 6 కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, సిమ్‌ ఫ్రీ, అన్‌లాక్డ్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లను హడోరో అధికారిక వెబ్‌సైట్‌లో చేపట్టనుంది. 10 రోజుల్లో షిప్‌మెంట్‌ ప్రారంభించనుంది కంపెనీ. ఆసక్తి గల కస్టమర్లు ఫోన్‌పై తమ పేరును కూడా డిజైన్‌ చేయించుకోవచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement