వన్‌ప్లస్‌ 6లో సెక్యురిటీ లోపం, ఫోనంతా.. | OnePlus Confirms Security Flaw In OnePlus 6 | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 6లో సెక్యురిటీ లోపం, ఫోనంతా..

Published Mon, Jun 11 2018 3:19 PM | Last Updated on Mon, Jun 11 2018 8:41 PM

OnePlus Confirms Security Flaw In OnePlus 6 - Sakshi

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ ఇటీవలే తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6ను మార్కెట్లోకి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచీ... ఏదో ఒక ఇష్యూతో వార్తలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సెక్యురిటీ లోపాన్ని సెక్యురిటీ రీసెర్చర్లు గుర్తించారు. ఈ లోపంతో, యూజర్ల ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని రీసెర్చర్లు కనుగొన్నారు. అమెరికాకు చెందిన ఎడ్జ్‌ సెక్యురిటీ ఎల్‌ఎల్‌సీ జాన్సన్‌ డోనెన్‌ఫీల్డ్‌ ఈ లోపాన్ని గుర్తించారు. అసురక్షితంగా ఉన్న ఏడీపీతో బూట్‌ ఇమేజ్‌ మార్చబడితే, హ్యాకర్లు ఫిజికల్‌ యాక్సస్‌తో మొత్తం డివైజ్‌ను తమ నియంత్రణలో తెచ్చుకోగలరని రీసెర్చర్‌ పేర్కొన్నారు. ఏడీబీ అనేది డిఫాల్ట్‌గా సెట్‌ చేయబడి ఉంటుంది. 

ఈ సెక్యురిటీ లోపంతో యూజర్లు ఎంతో అప్రమత్తతో ఉండాలని, స్మార్ట్‌ఫోన్‌లో ప్రైవేట్‌ డేటా స్టోర్‌ చేసుకుని ఉంచుకున్న వారు ఆందోళన చెందాల్సినవసరం ఉందని ఎక్స్‌డీఏ రిపోర్టు చేసింది. ఈ సెక్యురిటీ లోపాన్ని కంపెనీకి కూడా రిపోర్టు చేసింది. ఈ రిపోర్టుపై వన్‌ప్లస్‌ కంపెనీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘వన్‌ప్లస్‌లో సెక్యురిటీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. సెక్యురిటీ రీసెర్చర్‌తో మేమే కాంటాక్ట్‌ అయ్యాం. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను చేపడతాం.’ అని కంపెనీ తెలిపింది. గత నెలలోనే వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర 34,999 రూపాయలు. ​క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో ఈ స్మా‍ర్ట్‌ఫోన్‌ రూపొందింది. ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6జీబీ/8జీబీ ర్యామ్‌, 64జీబీ/128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ దీనిలో ఫీచర్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement