one plus
-
Aswaraopeta SI: నా వన్ ప్లస్ ఫోన్ చూడండి
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడగా.. మంగళవారం పలు విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ‘నా వన్ ప్లస్ ఫోన్ చూడండి.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి’ అంటూ ఎస్సై మెసేజ్ పెట్టారనే వార్త చక్కర్లు కొట్టింది. ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే తాను పురుగుల మందు తాగానని, ఆ తర్వాత భార్యాబిడ్డలు గుర్తు రావడంతో బతకాలనిపించి 108కు ఫోన్ చేశానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు వీడియోలో వైరల్ అయింది. సీఐ జితేందర్‌రెడ్డి, స్టేషన్ సిబ్బంది అవమానాలకు గురి చేశారని, తనను అవినీతిపరుడిగా ముద్ర వేశారని, ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వెల్లడించారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి ముందే సర్వీస్ రివాల్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఆ ఫోన్ ఎక్కడ ఉంది?ఎస్సై శ్రీనివాస్ చెబుతున్న వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆత్మహత్యాయత్నం సమయంలో ఫోన్ తన వద్దే ఉంటే దాంట్లో నుంచే అందరికీ ఆధారాలు షేర్ చేయొచ్చు కదా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారా, ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదేశంలో మహబూబాబాద్ పోలీసులకు లేదా 108 సిబ్బందికి లభిస్తే పోలీసులకు అప్పగించారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ఆ ఫోన్లోని వివరాలు పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాగా, ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు వచ్చి పలు కోణాల్లో విచారణ చేపట్టారు. -
వన్ ప్లస్ ఫోన్ పై క్రేజీ డిస్కౌంట్..
-
సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు
చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్మీ’లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో భారత్ టెలివిజన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంటే దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు ఈ రెండు సంస్థలు తమ దేశమైన చైనాలో ఇతర కంపెనీలకు చెక్ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. కాబట్టే భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ రెండు కంపెనీలు మరింత ముందుకు సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీలు అభివృద్ది పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. భారత్‌లో టీవీ అమ్మకాల జోరు నివేదిక ప్రకారం .. భారత్‌లో ఇంటర్నెట్ విస్తరణ, సరసమైన డేటా ధరల కారణంగా టెలివిజన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. దీన్ని మరింత క్యాష్ చేసుకునేందుకు వన్‌ప్లస్, రియల్‌మీలు టెలివిజన్ సేల్స్, బ్రాండింగ్ విషయంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ, అనూహ్యం భారత టీవీ మార్కెట్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. కారణం అదేనా భారతీయ టెలివిజన్ మార్కెట్లో ఎల్జీ, శాంసంగ్, సోనీ, ప్యానసోనిక్ వంటి బ్రాండ్లతో పాటు చైనా నుండి కొత్తగా అడుగు పెట్టిన షావోమీ, టీసీఎల్ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అదనంగా, దేశీయ బ్రాండ్లు వీయూ, థామ్సన్ (బ్రాండ్ లైసెన్సింగ్ కింద) మార్కెట్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. చివరిగా, రియల్ మీ, వన్ ప్లస్‌లు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయన్న నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌పై ఆఫర్లు
ముంబై: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్ డిజిటల్ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.5వేల వరకు తక్షణ తగ్గింపు, దాదాపు రూ.8వేల వరకు ఎక్సే్చంజ్ బోనస్‌లు అందిస్తుంది. రిలయన్స్ డిజిటల్ అవుట్‌లెట్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 27న విడుదలయ్యే ఈ ఫోన్ ధర రూ.1,39,999. ‘అద్భుతమైన వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఆవిష్కరణ కోసం వన్‌ప్లస్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. భారత కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించడమే మా లక్ష్యం’ రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియాన్ బాడే అన్నారు. -
విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‌ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్‌ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!) త్వరలో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 10ఆర్ ధరల్ని భారీగా తగ్గించింది. గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 10 ఆర్ ప్రారంభ ధర రూ. 38,999 గా ఉంది. అయితే తాజాగా ఆఫోన్ ధరల్ని భారీ తగ్గించడంతో.. కొనుగోలు దారులు రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చని వన్ ప్లస్ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 150డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్, 80డబ్ల్యూ ఛార్జర్ సప్టోర్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 50 ఎంపీ రిసొల్యూషన్తో సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్లు, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్లు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్ సెట్, 12జీబీ నుంచి 256 జీబీ వరకు ఇంట్రర్నల్ స్టోరేజ్, ఆక్సీజెన్ ఓఎస్ 12.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లు ఉన్నాయి. -
జియో యూజర్లకు బంపరాఫర్!
ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థ దేశీయ టెలికం దిగ్గజం జియోతో చేతులు కలిపింది. దేశలో వేగంగా 5జీ నెట్ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. భారత్‌లో వన్ ప్లస్ - జియోలు లేటెస్ట్ 5జీ టెక్నాలజీ నెట్వర్క్ పై పనిచేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జియో సంస్థ వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ఆర్టీ’తో పాటు వన్ ప్లస్ 10 ప్లస్, వన్ ప్లస్ 9 ఆర్, వన్ ప్లస్ 8 సిరీస్‌లోని నార్డ్, నార్డ్ 2టీ, నార్డ్ 2, నార్డ్ సీఈ, నార్డ్ సీఈ2, నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్లలో జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 18 వరకు వన్‌ప్లస్ యానివర్సరీ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో అర్హులైన వన్ ప్లస్, జియో 5జీ వినియోగదారులకు రూ.10,800 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఆగస్ట్‌లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్ఫోన్లు ఇవే!
ఫెస్టివల్ సీజన్లో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫోన్లను విడుదల చేస్తుంటాయి. అయితే ఎప్పటిలాగే ఆగస్ట్ నెలలో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడే చూసేద్దాం వన్ ప్లస్ 10టీ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జనరేషన్ 1 చిప్సెట్తో ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను విడుదల అవ్వనుంది. ఆగస్ట్ 3న కొనుగోలు దారులకు పరిచయం కానుంది. మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐక్యూ9టీ సైతం ఆగస్ట్ 2న విడుదల కానుండగా..ఆ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రియల్ మీ జీటీ నియో 3టీ స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో ఆగస్ట్ 15 తరువాత విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 సైతం ఆగస్ట్ 4న విడుదల కానుండగా.. ఈ ఫోన్ శాంసంగ్ విడుదల చేసే లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదేనని తెలుస్తోంది. మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ 12లైట్ ఇదే నెలలో విడుదల కానుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా మోటరోలా ఎడ్జ్ ఎక్స్ 30 ప్రో ఆగస్ట్ 15 తర్వాత విడుదల కానుంది. పోకో ఎం5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ 15తర్వాత విడుదల కానుంది. వివో వీ25ఫోన్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. -
రెడీగా ఉండండి.. అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే!
OnePlus 10T 5G Launch: వన్‌ప్లస్ మొబైల్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఈ సంస్ధ మార్కెట్లోకి త్వరలో తీసుకురానున్న వన్‌ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) విడుదల తేదీ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో వన్‌ప్లస్ 10Tని గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని తన ల్యాండింగ్ పేజ్‌లో వెల్లడించింది. ఈ ఫోన్‌కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని చూస్తే.. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 360 డిగ్రీ యాంటినా సిస్టమ్‌ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్లో వన్‌ప్లస్ సరికొత్త ఆక్సిజన్ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది. భారత్: OnePlus 10T ధర (అంచనా) నివేదిక ప్రకారం OnePlus 10T 5G ధర CNY3,000 (చైనా యువాన్లు) (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500), CNY 4,000 (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400) మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999(భారత్‌లో) ఉంటుందని సమాచారం. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. OnePlus 10T ఫీచర్లు (అంచనా) అమెజాన్ లిస్టింగ్ పేజ్ ద్వారా వన్‌ప్లస్ 10టీ 5జీకి చెందిన ప్రాసెసర్ వివరాలు బయటికి వచ్చాయి. ♦ OnePlus 10T: Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ఫీచర్‌తో రానుంది. ♦ హ్యాండ్సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ♦ పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే ♦ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ♦ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్ ♦ 16GB LPDDR5 RAMతో పాటు 512GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్ ♦ కలర్స్: బ్లాక్, గ్రీన్ చదవండి: Vedanta Share Price: లాభాల్లో షేర్ మార్కెట్.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్! -
ఒప్పో, వన్‌ప్లస్‌కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్‌ప్లస్‌లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్‌ప్లస్‌ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్‌ప్లస్‌లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
జూన్‌లో స్మార్ట్ ఫోన్ల పండుగ, అదిరిపోయే ఫీచర్లతో 9 ఫోన్లు రిలీజ్!
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి సీజన్లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్ ఫోన్ సేల్స్ సైతం విపరీతంగా జరుగుతుంటాయి. అందుకే జూన్‌లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలైన ఒప్పో, వన్ ప్లస్, పోకో, రియల్ మీ, షావోమీ'లు ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. 1.రియల్మీ చైనా స్మార్మ్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ జూన్ 7న స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో రియల్ మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. 2.పోకో షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్తో పోకో ఎఫ్4 జీటీ స్మార్ట్ ఫోన్‌ను జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది 3.వన్ ప్లస్ మరో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ 90హెచ్ జెడ్ ఆమోలెడ్ డిస్ప్లే, 80 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్ ప్లస్ నార్డ్ 2టీని జూన్ నెలలో విడుదల చేయనుంది. 4.ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 5.షావోమీ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో షావోమీ 12ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సైతం జూన్ 15 తేదీ లోపు విడుదల చేయనుంది 6.మోటో జూన్ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మోటో ఈ32ఎస్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 7.శాంసంగ్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది. 8.వివో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్‌లో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 9.మోటరోలా మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్ ఫోన్‌ను జూన్ నెలలో విడుదల కానుంది. చదవండి👉ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్! -
వరల్డ్‌లోనే ఫాస్టెస్ట్ ఫోన్ ఛార్జర్ ! కేవలం 17 నిమిషాల్లో..
మొబైల్ ఫోన్ టెక్నాలజీ రోజురోజుకి విస్తరిస్తోంది. సరికొత్త ఆవిష్కరణలు ఫోన్ వాడకాన్ని మరింత సులువు చేస్తున్నాయి. ఫోన్ పెర్ఫ్మామెన్స్ మొదలు డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ వరకు ప్రతీ దాంట్లో కొత్తగా వస్తున్న టెక్నాలజీ అబ్బుర పరుస్తోంది. తాజాగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో వన్ ప్లస్ కొత్త మైలురాయిని ఆవిష్కరించింది. వన్‌ప్లస్ తాజాగా 10ఆర్ 5జీ మొబైల్లో అమర్చిన ఛార్జింగ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా మొబైల్‌ఫోన్‌ను ఛార్జ చేసేదిగా గుర్తింపు పొందింది. వన్‌ప్లస్ 10ఆర్ 5జీ మోడల్లో సూపర్‌వూక్ ఎండ్యురెన్స్ పేరుతో ప్రత్యేక ఎడిషన్ తెచ్చారు. ఇందులో ఏకంగా 150 వాట్స్ ఛార్జర్‌ను అమర్చారు. కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 100 శాతం ఛార్జ్ చేయడం దీని ప్రత్యేకత. ఆరేడేళ్ల కిందట ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5 వాట్స్ నుంచి ఇది మొదలయ్యాయి. ఇప్పటి వరకు మార్కెట్లో ఫాస్ట్ ఛార్జర్ కెపాసిటీ 65 వాట్స్‌గా ఉండేంది. కానీ పాత రికార్డులు బద్దలు కొడుతూ వన్ ప్లస్ ఏకంగా 150 వాట్స్ ఛార్జర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. చదవండి: చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్‌లో చాలా విషయం ఉందే! -
టపా టప్: మాట్లాడుతుండగా టపాసుల్లా పేలిన స్మార్ట్‌ఫోన్.! యువకుడికి గాయాలు!
Oneplus Nord 2 Blast: స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్. ఇటీవల కాలంలో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ పేలుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు చైనా స్మార్ట్ తయారీ సంస్థకు చెందిన 5జీ వన్‌ప్లస్ నార్డ్2 మాట్లాడుతుండగా పేలింది. ఫోన్ పేలడంతో బాధితుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు స్మార్ట్ ఫోన్ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూఢిల్లీ చెల్లి చెందిన 'లక్ష్య వర్మ' అనే ట్విట్టర్ మార్చి31,2022న యూజర్ వన్‌ప్లస్ నార్డ్2 విషయంలో తన తమ్ముడికి జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా తమ్ముడు వన్‌ప్లస్ నార్డ్2 స్మార్ట్‌ఫోన్'లో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆఫోన్ పేలింది. తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించాం. న్యాయం కోసం వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్ ప్రతినిధుల్ని ఆశ్రయించాను. 2,3 రోజుల తర్వాత సర్వీస్ సెంటర్ ప్రతినిధులు పేలిన స్మార్ట్‌ఫోన్‌ను కలెక్ట్ చేసుకున్నారే తప్పా ఏం చేయలేదు. @OnePlus_IN Is that your NEVER SETTLE?? This is not a joke! He could have got serious injuries too but luckily he is alive! We just asked for a healthy solution for this, not any compensation or anything else.All I get from you is NO NO NO NO, we can’t do anything pic.twitter.com/RTVUaDln67 — Lakshay Verma (@lakshayvrm) March 31, 2022 @OnePlus_IN హ్యాష్ ట్యాగ్‌కు వన్‌ప్లస్ మోటివేషనల్ కోట్ NEVER SETTLE?? ను యాడ్ చేస్తూ.. ఇది జోక్ కాదు. నా తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నష్టపరిహారమో, ఇంకేదో కావాలని మేం అడగం లేదు. ఒకటే అడిగేది మాకు న్యాయం చేయమని. కానీ ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకేం చేయలేం' అంటూ విచారం వ్యక్తం చేశాడు. @OnePlus_IN Stop promoting/introducing new phones and start working on your existing products. My brother’s phone One Plus Nord 2 burst out suddenly while he was talking on phone. Portions of melted metal got clinged on his palm and face. We will get this reported shortly. pic.twitter.com/x1pVoDosZM — Lakshay Verma (@lakshayvrm) March 26, 2022 ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయి ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయంటూ వర్మ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 పేలడంతో..ఆఫోన్ మెటల్ నా తమ్ముడి మొహంపై, చేతిలో గుచ్చుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అంటే వర్మ పోస్ట్ చేసిన వీడియోలో వన్ ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి పొగలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Hi Lakshay! Thank you for bringing this to our notice. We hope your brother is alright! Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMx1Yh — OnePlus Support (@OnePlus_Support) March 26, 2022 అయితే వర్మ వరుస ట్వీట్లతో వన్‌ప్లస్ యాజమాన్యం స్పందించింది. మీ తమ్ముడి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీరు మాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామంటూ రిప్లయి ఇచ్చింది. చదవండి: అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను.. -
Flipkart TV Days Sale: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!
ప్రముఖ ఈ-కామర్స ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్‌తో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో భాగంగా వివిధ ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ టీవీ డేస్ సేల్ నేటి(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10, 2022వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వివిధ బ్రాండ్ల టీవీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటుగా యూజర్ నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ► శామ్ సంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25% తగ్గింపు లభిస్తుంది. దీని మీద నెలకు ₹1,899తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ టీవీతో కస్టమర్లు 20వాట్ స్పీకర్‌ను కూడా పొందుతారు. ► వన్ ప్లస్ వై సిరీస్ 80 సెం.మీ(32 అంగుళాల) హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ సేల్‌లో రూ.16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ వినియోగదారులకు 17% తగ్గింపుతో లభిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలో కస్టమర్లు 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. ► ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో 24 అంగుళాల కొడాక్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే లభిస్తోంది. ఇది కాకుండా, మీరు అడ్సున్ 24 అంగుళాల మోడల్ టీవీని రూ.7,290కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మార్క్యూ 24 అంగుళాల మోడల్ రూ.7,999కు లభిస్తోంది. ► రియల్ మీ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై 11 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అది వినియోగదారులకు రూ.15,999కి అందుబాటులో ఉంటుంది. ఈ టీవీలో 24వాట్ స్పీకర్ అవుట్‌పుట్ , 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. (చదవండి: ఇక పెట్టుబడికి సిద్దం కాండి.. దేశంలో డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడే..!) -
వన్‌ప్లస్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, స్పీడ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
OnePlus Warp Car: పెట్రోల్ ధరలు రోజు రోజుకి భారీగా పెరిగి పోతుండటంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తమ వాహనలను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి మరో దిగ్గజ చైనా మొబైల్ కంపెనీ ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 'వన్‌ప్లస్ లైఫ్' పేరుతో భారతదేశంలో ఆటోమోటివ్ కేటగిరీలోకి ప్రవేశించడానికి ట్రేడ్ మార్క్ కోసం దాఖలు చేసింది. ఇప్పటికే దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు అన్నీ తమ ఈవీలను తీసుకొనిరావడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు మొబైల్ దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం షియోమీ, రియల్ మీ వంటి కంపెనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే వన్‌ప్లస్ కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు సిద్దం అయ్యింది. రష్ లెన్ నివేదించిన ట్రేడ్ మార్క్ ఫైలింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ లైఫ్ బ్రాండ్ పేరుతో వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రారంభించాలని చూస్తోంది. గతంలో ఈ ఎలక్ట్రిక్ కారు గురుంచి సంస్థ ఒక విడుదల చేసింది. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోలేదు. స్పోర్ట్స్ కారు కానీ, ఇప్పుడు ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ కారులో కూడా వన్‌ప్లస్ వర్ప్ టెక్నాలజీ కూడా ఇందులో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలోపు అందుకొనున్నట్లు తెలుస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 467 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి కూడా 200 కిమీ అని తెలుస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ కారును కేవలం 20 నిమిషాలు చార్జ్ చేస్తే దాదాపు 435 కిమీ వరకు వెళ్లగలదు అని సంస్థ తెలిపింది. ఈ కారు చూడాటానికి స్పోర్ట్స్ తరహా కారు లాగా కనిపిస్తుంది. -
చైనాకు భారత్ భారీ షాక్!
Indian Government Regulation To Prevent Handset Snooping: పొరుగు దేశం చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న.. చైనా బ్రాండ్ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను భారత్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని(చైనా ఇంతవరకు చేయని పనే ఇది!.. ఈ విషయంలో పలు దేశాలకూ అనుమానాలున్నాయి) నోటీసుల్లో భారత్ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ట్ ఓ కథనం ప్రచురించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డాటా ప్రకారం.. మన దేశపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్‌ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అప్పటి నుంచి ‘లోకల్‌నెస్’ ప్రదర్శించుకోవడం కోసం స్థానిక ఉత్పత్తి దిశగా అడుగులు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు. కానీ, కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్ఫోన్ల మార్కెట్ నియంత్రణకు సిద్ధపడడం విశేషం. చదవండి: చైనాతో కచ్చి.. బిజినెస్ మాత్రం బిలియన్లలో! -
వన్‌ప్లస్ కోఫౌండర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే...!
వన్‌ప్లస్ కో ఫౌండర్ కార్ల్ పై వన్‌ప్లస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కార్ల్‌పై నథింగ్ అనే కంపెనీ స్థాపించాడు. నథింగ్ కేవలం టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. వీటితో పాటుగా స్మార్ట్ఫోన్ల తయారీపై కూడా నథింగ్ ఫోకస్ పెట్టింది. తాజాగా నథింగ్ స్మార్ట్ఫోన్లను కూడా త్వరలోనే లాంచ్‌చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..! స్మార్ట్ఫోన్ల తయారీలో భాగంగా అమెరికన్ చిప్ మేకర్ క్వాల్కమ్తో నథింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నథింగ్ స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉండనుంది. నథింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్సే కాకుండా నథింగ్ పవర్(1) పేరుతో పవర్‌బ్యాంకునుకూడా లాంచ్ చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో కార్ల్‌పై వన్‌ప్లస్ సంస్థను వీడిపోయాడు. We’re excited to be working with @Qualcomm to power our growing tech ecosystem. Over the last year, we’ve seen that there’s a space for a challenger in the tech world. This partnership will play a big role in achieving our vision. Here’s to the future. — Nothing (@nothing) October 13, 2021 చదవండి: హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే! -
Samsung Vs One Plus: కెమెరాల పని అయ్యింది ఇక డిస్ప్లేల వంతు!
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో కొత్త యుద్దానికి తెర లేచింది. ఇంత కాలం చిప్సెట్స్, కెమెరాల విషయంలో పోటాపోటీగా మోడళ్లు విడుదల చేసిన ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడు డిస్ప్లే కేంద్రంగా వార్ రెడీ అయ్యాయి. బ్రాండ్ వార్ స్మార్ట్‌ఫోన ఇండస్ట్రీలో గడిచిన ఐదేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శామ్సంగ్, యాపిల్ వంటి బడా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ చైనాకు చెందిన వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ, ఒప్పో, వివోలు మార్కెట్‌పై పట్టు సాధించాయి. మైక్రోమ్యాక్స్, సెల్కాన్ వంటి దేశీ కంపెనీలను చైనా మొబైల్ బ్రాండ్స్ వెనక్కి నెట్టాయి. నోకియా ఇంకా ఫీచర్ ఫోన్లను దాటి ముందుకు రాలేకపోయింది. హ్యువావే, ఎల్జీ, సోనిలు పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం శామ్సంగ్, చైనా కంపెనీల మధ్యనే ప్రైస్‌వార్, ఫీచర్ వార్ జరుగుతోంది. ఎన్ని కెమెరాలు, పిక్సెల్ ఎంత స్మార్ట్ఫోన్లకు సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా వెనుక వైపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. వాటి మెగాపిక్సెల్ ఎంత అనే అంశం చుట్టూనే ఇటు శామ్సంగ్, అటు షావోమీ వంటి చైనా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పెరిగి వెనుక వైపు నాలుగు, ముందు వైపు రెండు కెమెరాలు అందించే స్థాయికి చేరుకున్నాయి. ఇక కెమెరా సామర్థ్యానికి సంబంధించి 16 మెగా పిక్సెల్స్ దగ్గర మొదలైన పోటీ 48 మెగా పిక్సెల్స్ మీదుగా 108 మెగా పిక్సెల్స్ వరకు చేరుకుందీ. ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ విషయంలోనూ పోటీ నెలకొని ఉండేది. ఇక్కడ కూడా ఇరు వర్గాలు సమస్థాయికి చేరుకున్న బ్యాటరీ సామర్థ్యం మీద ఫోకస్ చేశాయి. టాప్ నాచ్, డ్రాప్ నాచ్ అంటూ మోడళ్లు విడుదల చేసినా అవి లాంగ్‌రన్‌లో ప్రభావం చూపలేదు. కెమెరా, ర్యామ్, ప్రాసెసర్లే ప్రధానంగా పోటీ నెలకొంది. డిస్ప్లే క్వాలిటీ విషయంలో పోటీ ఉన్నా హెచ్డీ, ఫుల్హెచ్డీ దగ్గరే చైనా కంపెనీలు ఆగిపోగా శామ్సంగ్ అమోల్డ్ డిస్ప్లే తో అదరగొట్టింది. శామ్సంగ్ నోట్, ఎస్ సిరీస్‌లో 4కే డిస్ప్లేలు ఇచ్చి టాప్‌గా నిలవగా వన్‌ప్లస్ సైతం బరిలోకి దిగింది. వీడియో కంటెంట్‌కి గిరాకీ జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో నెట్ కంటెంట్ వాడకం పెరిగింది. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా వీడియో కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. రోజుకో వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దీంతో డిస్ప్లే క్వాలిటీతో పాటు సైజుకి కూడా ప్రాధాన్యత పెరిగింది. గతేడాదే శామ్సంగ్ జెడ్ సిరీస్‌లో ఫ్లిప్ అంటూ డబుల్ డిస్ప్లే ఫోన్లను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జెడ్ సిరీస్‌కే మరిన్ని హంగులు జోడించి ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. జెడ్ సిరీస్‌లో రెండు తెరలు కలిపితే స్క్రీన్ సైజు 7.30 ఇంచులుగా ఉంది. దాదాపు ట్యాబ్ స్థాయిలో ఈ స్ర్రీన్ ఉండనుంది. శామ్సంగ్ వర్సెస్ వన్ ప్లస్ నాణత్య పాటిస్తూ తక్కువ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లు అందిస్తూ వన్ ప్లస్ బ్రాండ్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. హై ఎండ్ సెగ్మెంట్లో యాపిల్, శామ్‌సంగ్‌కి ధీటుగా ఎదిగింది. బడ్జెట్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఇండియన్ మార్కెట్లో స్థిరమైన స్థానం సాధించింది. అన్నింటా శామ్సంగ్, యాపిల్‌కు పోటీ ఇచ్చే వన్‌ప్లస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆగస్టులో బిగ్ స్క్రీన్ ఫోన్ రిలీజ్ చేస్తామంటూ శామ్సంగ్ దాదాపు రెండు నెలల ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆగస్టు 11న డేట్ ఫిక్స్ చేసింది. సరిగ్గా శామ్సంగ్ ఈవెంట్‌కి ఒక్క రోజు ముందే వన్‌ప్లస్ సప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్రాండ్ నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఫోన్ వస్తోందంటూ వన్‌ప్లస్ యూఎస్ఏ ట్విట్టర్ పేజీలో టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఆసక్తికర పోరుకి తెరలేచింది. 8.11 10am EThttps://t.co/mmPi4jlrhx pic.twitter.com/U6lPdrFnjf — OnePlus➕ (@OnePlus_USA) August 10, 2021 ప్రభావం చూపుతుందా ? మొబైల్ బ్రాండ్ల మధ్య ధర, కెమెరా, ర్యామ్, చిప్సెట్, బ్యాటరీ బ్యాకప్ విషయంలోనే గట్టి పోటీ నెలకొంది. వీటి ఆధారంగానే అమ్మకాలు సాగాయి. మధ్యలో ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్, డిస్ ప్లే రి ఫ్రెష్ రేటు విషయంలో కంపెనీలు ప్రయోగాలు చేసినా అవేమీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపలేదు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ వార్ నిజంగానే ప్రభావం చూపుతుందా లేక కొద్ది కాలం హడావుడి తర్వాత సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది. -
వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం
వన్ ప్లస్ యూజర్లకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఒప్పోలో వన్ ప్లస్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్‌ను ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఆక్సిజన్ ఓఎస్ ఎప్పటిలాగే గ్లోబల్ వన్ ప్లస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి ఈ సరికొత్త ఓఎస్ మరింత స్థిరమైన, బలమైన వేదికగా మీకు అందుబాటులో ఉంటుంది’’ అని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్వాంగ్ డాంగ్ బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్న వన్ ప్లస్, ఒప్పో కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే, కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వనరులను సమీకృతం చేసిన తర్వాత ఒప్పందాన్ని బహిర్గతం చేశాయి. ఒక ఫోరం పోస్ట్ లో వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనంతో యూజర్స్‌కి అద్భుతమైన సరికొత్త ఓఎస్ సాఫ్ట్వేర్ అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఓఎస్ భవిష్యత్తులో తన కొత్త పరికరాలకు వర్తిస్తుందని, మెయింటెనెన్స్ షెడ్యూల్ లో ఉన్న ప్రస్తుత పరికరాల కొరకు, ఆక్సిజన్ ఓఎస్ కలర్ ఓఎస్ మధ్య కోడ్ బేస్ స్థాయి ఇంటిగ్రేషన్ ఆండ్రాయిడ్ 12తోపాటు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్ డేట్ ద్వారా వస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఒరిజినల్ వన్ ప్లస్ నార్డ్, కొత్త నార్డ్ మోడల్స్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ విషయంలో కంపెనీ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వన్ ప్లస్ తన ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో ఒప్పో కలర్ ఓఎస్ ను ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో అన్ని చైనీస్ మొబైల్స్ లో తీసుకొచ్చింది. చదవండి: మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు -
ఈ ఫోన్ కొంటే.. 1 టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీ ఉచితం
వెబ్‌డెస్క్: వన్ టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీని ఆఫర్‌గా ప్రకటించింది వన్‌ప్లస్ సంస్థ. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న వన్‌ప్లస్ నార్డ్ CE 5జీ ప్రమోషన్లో భాగంగా ఈ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. గూగుల్ క్లౌడ్ స్టోరేజీ నిబంధనల్లో మార్పులు తెచ్చిన ప్రస్తుత తరుణంలో 1 టెరా బైట్ క్లౌడ్ స్టోరేజీ ఆఫర్ మార్కెట్లో సంచలనంగా మారింది. ఈ ఫోన్ యూజర్లు వేలాది ఫోటోలు, వందలాది వీడియో కంటెంట్‌ని నిశ్చింతగా భద్రపరుచుకోవచ్చు. జూన్ 16న జూన్ 16 నుంచి అమెజాన్‌లో సేల్‌కి రానున్న ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 22,999గా ఉంది. హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు మొదటి రెండు రోజులు ఆర్డర్ చేసిన కారికి రూ. 500 క్యాష్‌బ్యాక్ అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా వన్ టెరాబైట్ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తోంది. అయితే జులై 31వరకు కేవలం రెడ్ కేబుల్ కేర్ యూజర్స్‌కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. హై ఎండ్ ఫీచర్స్ హై ఎండ్ ఫీచర్స్ విత్ లో బడ్జెట్ మొబైల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ కోసం టెక్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జూన్ 16న మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్‌కు అమెజాన్‌లో ఇప్పటికే ఆర్డర్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌కి సంబంధించి బిల్ట్ క్వాలిటీ, ఫీచర్స్, కెమెరా, ర్యామ్ మేనేజ్మెంట్ అత్యుత్తమంగా ఉందని రివ్యూయర్లు అభిప్రాయపడుతున్నారు. స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ టెక్నాలజీతో వచ్చన తొలి హై ఎండ్ బడ్జెట్ ఫోన్‌గా వన్ ప్లస్ నార్డ్ జీఈ నిలిచింది. ఈ ఫోన్లో న్యూ ఏజ్ ప్రాసెసరైన స్నాప్‌డ్రాగన్ 750 జీ ప్రాసెసర్ ఉపయోగించారు. 90 హెర్జ్ అమోల్డ్ డిస్ప్లే పొందు పరిచారు. హై ఎండ్ ఫోన్లకు తగ్గరీతిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ అందిస్తోందని రివ్యూయర్లు చెబుతున్నారు. డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ విషయంలో వన్‌ప్లస్ తనకు సాటైన అత్యుత్తమ ప్రమాణాలు మరోసారి పాటించింది. 30 టీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఏకంగా 4500 మిల్లీయాంప్ పవర్ బ్యాటరీని అందించింది. దీంతో ఎక్కువ సేపు వీడియో కంటెంట్ చూసేందుకు ఈ ఫోన్ అనువుగా ఉందంటున్నారు నిపుణులు. చదవండి : Asus ROG Phone 3 : చేతిలో ఇమిడిపోయే గేమింగ్ ఫోన్ -
బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి 23న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వన్‌ప్లస్ 9ప్రో కెమెరాకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వన్‌ప్లస్ ప్రధాన లోపం కెమెరా కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి హస్సెల్ బ్లేడ్ తో కలిసి వస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ కెమెరా పనితీరు ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్ల కంటే మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ప్రో ప్రధాన కెమెరాలో సోనీ IMX789 సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలో సోనీ IMX766 సెన్సార్‌ను తీసుకొస్తున్నట్లు గతంలో ధృవీకరించారు. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా వన్‌ప్లస్ 9 సిరీస్ కెమెరా పనితీరును పరీక్షించడం కోసం DxOMarkకు పంపించరని తెలుస్తుంది. DxOMark కెమెరా పనితీరుతో పాటు డిస్ ప్లే, ఆడియో, వైర్ లెస్ స్పీకర్ వంటి కీలక అంశాలకు సంబంధించి రేటింగ్ ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. వన్‌ప్లస్ 9 ప్రో వేరియంట్ ఆస్ట్రల్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని వస్తుందని తెలుస్తుంది. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ -
అమెజాన్ లో మరో కొత్త సేల్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలోని మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలువబడే ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. నాలుగు రోజుల సేల్ లో లభించే మొబైల్, మొబైల్ సంబంధిత ఇతర ఉపకరణాలపై డిస్కౌంట్, ఒప్పందాలను హైలైట్ చేయడానికి కంపెనీ ఇప్పటికే మైక్రోసైట్‌ను రూపొందించింది. అమెజాన్ తన మైక్రోసైట్లో సేల్ విక్రయించే స్మార్ట్ఫోన్లను జాబితాను విడుదల చేసింది.(చదవండి: క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!) అమెజాన్ విడుదల చేసిన జాబితాలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం51, రెడ్మీ నోట్ 9 ప్రో మాక్స్, రెడ్మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం31, శామ్సంగ్ గెలాక్సీ ఎం21 ఇంకా మరిన్ని ఉన్నాయి. అయితే, స్మార్ట్ఫోన్ల తగ్గింపు ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రేపు (డిసెంబర్ 19) ధరలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో ఇప్పుడు పవర్ బ్యాంకులు, హెడ్ఫోన్లు, మొబైల్ కేసులు, కవర్లు, కేబుల్లతో సహా ఇతర మొబైల్ ఉపకరణాలపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. వన్‌ప్లస్, నోకియా, షియోమి, హానర్, శామ్సంగ్, ఎల్జి, రియల్మే, ఆపిల్, ఒప్పో, జాబ్రాతో సహా ప్రముఖ బ్రాండ్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 1,500 రూపాయల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తుంది. -
స్టూడెంట్స్, టీచర్స్ కి వన్ ప్లస్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: భారత్ లో మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి అన్ని కార్యకలపాలు ఇంటి నుండే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ లాక్ డౌన్ కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలల తర్వాత దశల వారీగా కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది. అప్పటి నుండి కళాశాలలు ఆన్లైన్లోనే విధ్యా బోధన చేస్తున్నాయి. ఈ దశలో స్మార్ట్ ఫోన్ వినియోగం భాగా పెరిగింది. వారి అవసరాలను గుర్తించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ మనదేశంలో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక లాభాలను అందించనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 760 విశ్వవిద్యాలయాలను, 38,498 కాలేజీలను కవర్ చేస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఎవరైనా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతోపాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లే వారికి వన్ ప్లస్ యాక్సెసరీల కొనుగోలుపై ఐదు శాతం తగ్గింపును అందించనున్నారు. ఈ ఆఫర్‌ను పొందాలంటే అర్హత ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము విశ్వవిద్యాలయం లేదా కాలేజీకి వెళ్తున్నామని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ధ్రువీకరణ కోసం వన్ ప్లస్ స్టూడెంట్ బీన్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వినియోగదారుల వన్‌ప్లస్ ఖాతాకు కూపన్ వోచర్‌ను పంపిస్తారు. అర్హత ఉన్న వినియోగదారులు అక్కడ ధ్రువీకరించుకోవచ్చు. ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుకోవడానికి అర్హులు. ఈ లాభాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వన్ ప్లస్ ఆడియో డివైస్‌లు, కేసెస్‌పై ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వోచర్‌ను కేవలం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు మాత్రమే ఉపయోగించుకోగలరు. సంవత్సరం తర్వాత ఈ వోచర్ ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అయ్యాక కొత్త వోచర్ కోసం మళ్లీ ధ్రువీకరించుకోవాలి. -
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వన్‌ప్లస్9 ఫీచర్స్
న్యూఢిల్లీ: భారత్ లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వ్యాపించాయి. వచ్చే 2021 మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ కూడా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఉండనుంది.సెల్ఫీ కెమెరా, ప్రధాన కెమెరా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. అయితే, ఈ మొబైల్ లో కొంచెం పెద్ద 6.55-ఇంచ్ గల ప్యానెల్ కలిగి ఉంటుంది. గత నివేదికలకు విరుద్దంగా, ఈ మొబైల్ లో 144Hz అధిక రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. వన్‌ప్లస్ 9 లోని దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్లో 3 సెన్సార్లు మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి, రెండు సెన్సార్లు మూడవ దాని కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయి. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. వన్ ప్లస్ సింగిల్ కోర్ స్కోరు 1,122 మరియు మల్టీ కోర్ స్కోరు 2,733 ని సాధించడాన్ని కూడా గీక్ బెంచ్ లిస్టింగ్ హైలైట్ చేసింది. అయితే ఈ మొబైల్ లో వైర్ లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తారా లేదా అనేది ఇంకా సమాచారం లేదు. చివరగా, అన్ని కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లు లెమోనేడ్ అనే కోడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. This could be our first look at the upcoming OnePlus 9 https://t.co/lpfFDHCkoJ — XDA (@xdadevelopers) November 16, 2020 -
వన్‌ప్లస్‌కు భారీ షాక్!
వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సంస్థను వదిలి వెళ్లిపోవచ్చనే వార్తలు వినిబడుతున్నాయి. పీ తన సొంత వెంచర్ ప్రారంభించడానికి కంపెనీని విడిచిపెట్టినట్లు కథనాలు వెలువెడుతున్నాయి. వన్‌ప్లస్ 8టీ ఈ నెల 14న విడుదల చేయనుండగా ఇప్పుడు పీ వెళ్లిపోవడం సెన్సెషన్‌గా మారింది. దీనిపై వన్‌ప్లస్ నుంచి కానీ కార్ల్ పీ దగ్గర నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేకాకుండా పీ ట్విట్టర్ ఖాతా బయోలో ఇప్పటికీ #NewBeginnings @oneplus అనే ఉంది. అయితే ఈ విషయాన్ని రెడ్డిట్ యూజర్ జోన్సిగుర్ తన ఖాతా ద్వారా తెలిపారు. వన్‌ప్లస్ ఈ మెయిల్స్‌లా కనిపించే ఫోటోలను షేర్చేశారు. వీటిలో కార్ల్ పీ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ఉంది. అయితే అందులో కార్ల్‌పీ డిజిగ్నేషన్ గురించి ఎక్కడ ప్రస్తవించలేదు. ఇకపై కార్ల్‌పీ స్థానంలో ఎమిలీడై వన్‌ప్లస్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. చైనాలోని షెన్జెన్ ఆధారంగా వన్‌ప్లస్‌ను పీట్ లా, కార్ల్ పీ 2013లో స్థాపించారు. ఈ తరువాత వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. చదవండి: వన్‌ప్లస్ సర్ప్రైజ్; తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు