
ముంబై: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్ డిజిటల్ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.5వేల వరకు తక్షణ తగ్గింపు, దాదాపు రూ.8వేల వరకు ఎక్సే్చంజ్ బోనస్‌లు అందిస్తుంది.
రిలయన్స్ డిజిటల్ అవుట్‌లెట్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 27న విడుదలయ్యే ఈ ఫోన్ ధర రూ.1,39,999.
‘అద్భుతమైన వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఆవిష్కరణ కోసం వన్‌ప్లస్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. భారత కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించడమే మా లక్ష్యం’ రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియాన్ బాడే అన్నారు.