చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్‌మీ’లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో భారత్ టెలివిజన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంటే దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు
ఈ రెండు సంస్థలు తమ దేశమైన చైనాలో ఇతర కంపెనీలకు చెక్ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. కాబట్టే భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ రెండు కంపెనీలు మరింత ముందుకు సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీలు అభివృద్ది పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం.
భారత్‌లో టీవీ అమ్మకాల జోరు
నివేదిక ప్రకారం .. భారత్‌లో ఇంటర్నెట్ విస్తరణ, సరసమైన డేటా ధరల కారణంగా టెలివిజన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. దీన్ని మరింత క్యాష్ చేసుకునేందుకు వన్‌ప్లస్, రియల్‌మీలు టెలివిజన్ సేల్స్, బ్రాండింగ్ విషయంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ, అనూహ్యం భారత టీవీ మార్కెట్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.
కారణం అదేనా
భారతీయ టెలివిజన్ మార్కెట్‌లో ఎల్‌జీ, శాంసంగ్, సోనీ, ప్యానసోనిక్ వంటి బ్రాండ్‌లతో పాటు చైనా నుండి కొత్తగా అడుగు పెట్టిన షావోమీ, టీసీఎల్ బ్రాండ్‌లు పోటీపడుతున్నాయి. అదనంగా, దేశీయ బ్రాండ్లు వీయూ, థామ్సన్ (బ్రాండ్ లైసెన్సింగ్ కింద) మార్కెట్‌లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్‌మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం.
చివరిగా, రియల్ మీ, వన్ ప్లస్‌లు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయన్న నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment