Television
-
ఒకే కంపెనీ ఏడాదిలో 10 లక్షల టీవీ యూనిట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ 2025లో పది లక్షల యూనిట్ల టీవీ విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్ల భారత మార్కెట్ లైసెన్స్ కలిగిన ఈ సంస్థ టీవీ(TV)లతోపాటు గృహోపకరణాలను విక్రయిస్తుంటుంది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ, ఆఫ్‌లైన్ ఛానళ్ల అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. థామ్సన్, కొడాక్(Kodak), బ్లాపంక్ట్, వైట్–వెస్టింగ్ హౌస్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ లైసెన్స్ హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి.మరో రెండు అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి భారత మార్కెట్ హక్కులను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, జనవరి చివరికి వీటిని ప్రవేశపెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది 6,00,000 యూనిట్ల టీవీ అమ్మకాలను సాధించనున్నాం. వచ్చే ఏడాది 10,00,000 లక్షల అమ్మకాలు మా లక్ష్యం’అని చెప్పారు. అందుబాటు ధరల శ్రేణిలో వివిధ బ్రాండ్లపై స్మార్ట్ టీవీ(Smart TV)లను విక్రయిస్తున్న ఈ సంస్థ టర్నోవర్ రూ.700 కోట్లుగా ఉంది. ఆదాయంలో అధిక భాగం టీవీల విక్రయాల ద్వారానే వస్తోంది.కరోనా తర్వాత అమ్మకాల జోరుకరోనా అనంతరం ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల అమ్మకాలు ఆ సమయంలో జోరుగా సాగాయి. అనంతరం ఈ మార్కెట్లో వృద్ధి బలహీనపడింది. అయినప్పటికీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీ అమ్మకాల్లో వృద్ధి నమోదు చేస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో థామ్సన్ బ్రాండ్ విక్రయాలపై ఈ కంపెనీకి అధిక ఆదాయం లభిస్తోంది. ఆ తర్వాత కొడాక్ బ్రాండ్ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?వాషింగ్ మెషిన్లపై దృష్టి..సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీల తర్వాత వాషింగ్ మెషిన్ల విభాగంలో అధిక అమ్మకాలు సాధిస్తోంది. ఆన్లైన్ మార్కెట్లో వాషింగ్ మెషిన్ల విక్రయాల్లో ఈ సంస్థ వాటా రెండంకెల స్థాయిలో ఉంటోంది. ఆఫ్‌లైన్ ఛానళ్లనూ ఈ ఏడాది విస్తరించుకున్నామని, 2025లో రెండు లక్షల వాషింగ్ మెషిన్ యూనిట్ల అమ్మకాలు నమోదు చేయనున్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్(Amazon) ఈ–కామర్స్ పోర్టళ్లలో ఈ సంస్థ ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తుంటుంది. ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తమ అమ్మకాల్లో 80 శాతం ఆన్లైన్ నుంచి, 20 శాతం ఆఫ్‌లైన్ నుంచి వస్తున్నాయని అవనీత్ సింగ్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆఫ్‌లైన్‌లో విక్రయాల వాటాను 40 శాతానికి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. టైర్–1 నగరాల నుంచి 35 అమ్మకాలు వస్తుండగా, టైర్–2 నుంచి 25 శాతం, టైర్–3 నుంచి 15 శాతం ఉంటున్నట్టు వెల్లడించారు. మిగిలిన 25 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఇవన్నీ ఉచితం..
ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.WAVES is finally here!Explore WAVES, the new OTT platform by Prasar Bharati, for FREE. Stream old Doordarshan favourites like Ramayan and Mahabharat and the latest releases like Fauji 2.O. What’s more? You can now listen to radio programs & devotional songs, read books, play… pic.twitter.com/MwBOZpuIKc— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) November 20, 2024 -
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు?
ఇకపై టీవీలు కొనడం మరింత భారం కావచ్చు. తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతో కీలకమైన ఓపెన్ సెల్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల టీవీలు ధరలు కూడా మరింత పెరుగుతాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. కోవిడ్ సమయం నుంచే పరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గత డిసెంబర్ నుంచి ఓపెన్-సెల్ ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి మరో 15 శాతం పెంచే యోచనలో టెలివిజన్-ప్యానెల్ తయారీదారులు ఉన్నారు. ఏమిటీ ఓపెన్ సెల్? టెలివిజన్ సెట్ల తయారీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగాలలో ఒకటి. టీవీల ఉత్పత్తిలో 60-65 శాతం ఓపెన్ సెల్లకే ఖర్చవుతుంది. వీటిని చైనాలోని నాలుగైదు కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని కారణంగా ధరల అధికారం వారి చేతుల్లోనే ఉంటోంది. -
చరిత్ర సృష్టించిన ఏక్తా కపూర్!..ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు!
భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్నఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్సులో ఆమెను ‘డైరెక్టరేట్ అవార్డ్’ వరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా. మంగళవారం తెల్లవారుజామున (అమెరికాలో సోమవారం రాత్రి) న్యూయార్క్‌లో ఈ అవార్డు బహూకరించారు. ఏక్తా కపూర్ (48)కు ముందు అభినందనలు చెప్పాలి. టెలివిజన్ రంగంలో సుదీర్ఘకాలం నిలిచినందుకు, ఢక్కామొక్కీలు తిని విజయం సాధించినందుకు, వేల మందికి ఉపాధి కల్పించినందుకు, టెలివిజన్ చానల్స్ ప్రైమ్‌టైమ్‌ను ఏదో ఒక కాలక్షేపంతో నింపినందుకు, ఇంకా కొనసాగుతున్నందుకు. ఇప్పటివరకూ ఆమె 17,000 గంటల టెలివిజన్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసిందంటే దాని వెనుక శ్రమను, ప్యాషన్‌ను, వ్యాపార శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... 45 సినిమాలను కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది. వ్యాపార ఎత్తుగడల్లో భాగంగా నాసిరకం/సరసమైన కంటెంట్‌ను తయారు చేసి విమర్శలు ఎదుర్కొన్నా అన్ని రకాల జానర్స్‌లో కంటెంట్ తయారు చేస్తాను... దేనికి తగ్గ ప్రేక్షకులు దానికి ఉంటారు అనే ధోరణిలో ముందుకు దూసుకుపోతోందామె. అందుకే ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ గుర్తింపు అమెరికాలోని ‘ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ప్రతి సంవత్సరం అమెరికా బయటి దేశాలలో టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు’లను బహూకరిస్తుంది. ఇవి టెలివిజన్ ఆస్కార్స్లాంటివి. ఈ అవార్డులు భారతీయులకు వరించడం తక్కువ. వివిధ కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో విశిష్టమైన ‘డైరెక్టరేట్ అవార్డు’ను ఈ సంవత్సరానికి ఏక్తా కపూర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా. అకాడెమీ సీఈవో బ్రూస్ ప్రైస్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భారతీయ మాస్ ప్రేక్షకులను, సౌత్ ఏసియా ప్రేక్షకులను ఏక్తా కపూర్ తన సీరియళ్ల ద్వారా చేరగలిగింది. టెలివిజన్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది’ అని కొనియాడారు. న్యూయార్క్‌లో అవార్డు అందుకున్న ఏక్తా ‘ఈ అవార్డు నా మాతృదేశం కోసం’ అంటూ భావోద్వేగానికి గురైంది. విభిన్న వ్యక్తిత్వం ఏక్తా కపూర్ టెలివిజన్ రంగంలో (1995) అడుగు పెట్టే సమయానికి అదంతా పురుష ప్రపంచం. తండ్రి జితేంద్ర (నటుడు) దగ్గర 50 లక్షలు తీసుకొని ‘బాలాజీ టెలి ఫిల్మ్స్’ కింద కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీస్తే అన్నీ రిజెక్ట్ అయ్యాయి. దాంతో 50 లక్షలూ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె ‘మానో యా మానో’, ‘హమ్ పాంచ్’ సీరియల్స్‌తో హిట్స్ మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ‘కె’ అక్షరం సెంటిమెంట్‌తో మొదలెట్టిన ‘క్యూంకి సాస్‌భీ కభీ బహూ థీ’ టెలివిజన్ చరిత్రను తిరగరాసింది. ఇది పొందినంత టిఆర్పి మరే సీరియల్ పొందలేదు. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘పవిత్ర రిష్టా’, ‘కుంకుమ్ భాగ్య’ లాంటి 134 సీరియల్స్ ఇప్పటి వరకూ తీసింది. పెద్ద పెద్ద సెట్లు, మహిళా పాత్రధారులకు ఖరీదైన చీరలు, ఆభరణాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఏక్తా మొదలుపెట్టి మొత్తం దేశంలో అదే ట్రెండ్ ఫాలో అయ్యేలా చేసింది. సరోగసి ద్వారా ఏక్తా వివాహం చేసుకోలేదు. కాని 2019లో సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. కొడుక్కి తండ్రి పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. అవార్డు వేదిక మీద ఏక్తా మాట్లాడుతూ ‘మా నాన్నకు, నేనిక్కడ ఉంటే నా కొడుకు కోసం బేబీ సిట్టింగ్ చేస్తున్న మా అన్నయ్య తుషార్కపూర్కు కృతజ్ఞతలు’ అంది. ప్రస్తుతం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ కోసం ఏక్తా ఎక్కువగా కంటెంట్‌ను తయారు చేస్తోంది. (చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే) -
సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు
చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్మీ’లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో భారత్ టెలివిజన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంటే దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు ఈ రెండు సంస్థలు తమ దేశమైన చైనాలో ఇతర కంపెనీలకు చెక్ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. కాబట్టే భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ రెండు కంపెనీలు మరింత ముందుకు సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీలు అభివృద్ది పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. భారత్‌లో టీవీ అమ్మకాల జోరు నివేదిక ప్రకారం .. భారత్‌లో ఇంటర్నెట్ విస్తరణ, సరసమైన డేటా ధరల కారణంగా టెలివిజన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. దీన్ని మరింత క్యాష్ చేసుకునేందుకు వన్‌ప్లస్, రియల్‌మీలు టెలివిజన్ సేల్స్, బ్రాండింగ్ విషయంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ, అనూహ్యం భారత టీవీ మార్కెట్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. కారణం అదేనా భారతీయ టెలివిజన్ మార్కెట్లో ఎల్జీ, శాంసంగ్, సోనీ, ప్యానసోనిక్ వంటి బ్రాండ్లతో పాటు చైనా నుండి కొత్తగా అడుగు పెట్టిన షావోమీ, టీసీఎల్ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అదనంగా, దేశీయ బ్రాండ్లు వీయూ, థామ్సన్ (బ్రాండ్ లైసెన్సింగ్ కింద) మార్కెట్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. చివరిగా, రియల్ మీ, వన్ ప్లస్‌లు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయన్న నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
సెట్‌టాప్ బాక్స్‌ల్లేకుండానే టీవీ కార్యక్రమాలు
ముంబై: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది. రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ లేఖ కూడా రాయడం గమనార్హం. -
స్మార్ట్‌గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్లైన్లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్‌లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇంటర్నెట్ స్క్రీనింగ్‌లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్నెట్లో) ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది 2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్‌లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్ స్క్రీన్ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్లైన్లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్ సమయం కంటే ఎక్కువ. కళ్లు పొడారిపోతాయి ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్‌ను చూడాలి. – ఈఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. అమెరికన్ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్‌లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్‌ను చూస్తే టైప్–2 డయాబెటిస్ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీలు.. స్క్రీనింగ్‌కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్‌లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. -
క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!
సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్‌తో ఈ అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ నవంబర్ 27 నుండి మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర 29,999గా ఉంచింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ ఫీచర్లు ఈ టీవీలో తాజా గూగుల్ టీవీ ఓఎస్‌తోపాటు ఏఐ ప్రాసెసర్‌తో కూడిన గ్లోప్యానెల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కోర్ GPU, డాల్బీ అట్మోస్ వర్చువలైజేషన్తో వస్తుంది. తమ ఏఐ ప్రాసెసర్ ద్వారా ఓటీటీ కంటెంట్ మరింత మెరుగు పడుతుందనీ, అలాగే అధునాతన క్రికెట్ మోడ్‌తో వినియోగదారులు ప్రత్యక్ష స్టేడియం అనుభవాన్ని, 100 శాతం బాల్ విజిబిలిటీని పొందుతారనీ, డీజీ సబ్ వూఫర్, సొగసైన ఫ్రేమ్‌తో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాల్యూమ్ 100 శాతం పెంచినా కూడా తమ టీవీలోని సౌండ్ వైబ్రేట్ అవ్వదని తెలిపింది. 84వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చేలా రెండు స్పీకర్లతో కూడిన ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌ను ఇందులో జోడించింది. కేవలం రెండు నెలల్లో 46675 యూనిట్లను విక్రయించామనీ, 2023లో రెండు లక్షల టీవీలను విక్రయించాలని భావిస్తున్నామని వీయూ టెక్నాలజీస్ సీఈఓ అండ్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. -
ప్రపంచంలోనే చిన్న టీవీ వచ్చేసింది, ధర వింటే?
టీవీ అనగానే ఒకప్పుడు 21 అంగుళాలవే ఉండేవి.. ఇప్పుడు ఏకంగా 75 అంగుళాలు అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ లభిస్తున్నాయని తెలుసు.. కానీ ఈ భారీ సైజులకు పూర్తి వ్యతిరేకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న టీవీలను అమెరికాకు చెందిన టైనీ సర్క్యూట్స్ అనే కంపెనీ తయారు చేసింది. చిన్న టీవీలు అనగానే ఏదో మన స్మార్ట్ఫోన్ల సైజులో ఉంటాయిలే.. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోకండి.. ఎందుకంటే ఇవి అంతకన్నా చిన్నవి మరి!! అంటే ఒక పోస్టల్ స్టాంపు సైజులో కేవలం అర అంగుళం, అంగుళం సైజుల్లో తయారైనవి అన్నమాట!! మార్కెట్లో టీవీల సైజులు రోజురోజుకూ పెరుగుతుంటే ఈ కంపెనీ మాత్రం ఇలా వెరైటీగా బుజ్జిబుజ్జి టీవీలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు నమూనా టీవీలను తాజాగా ఆవిష్కరించింది. 0.6 అంగుళాల తెరతో టీనీటీవీని, ఒక అంగుళం స్క్రీన్‌తో టైనీటీవీ–2ను తీసుకొచ్చింది. పాతకాలం టీవీల్లో చానళ్లు మార్చుకొనేందుకు, వాల్యూమ్ పెంచుకొనేందుకు వీలుగా ఉండే గుండ్రటి నాబ్లను వీటికి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ టీవీల్లో సాధారణ చానళ్ల ప్రసారాలు మాత్రం రావు! మరి ఇంకేం వస్తాయంటారా? ఈ టీవీల్లో అమర్చిన 8 జీబీ మెమరీ కార్డుల ద్వారా 10 గంటల నుంచి 40 గంటల వరకు వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వీడియోలను కూడా కంపెనీ సిద్ధం చేసింది. ఈ బుజ్జి టీవీల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‌లో ఉండే ఫేవరేట్ సినిమాలు, వ్యక్తిగత వీడియోల ఫైళ్లను కంపెనీ అందించే ఉచిత సాఫ్ట్వేర్ ద్వారా వేరే ఫార్మాట్లోకి మార్చుకొని ఇందులో వీక్షించొచ్చు. ఇంతకీ వీటి ధర ఎంతో తెలుసా సుమారు 4-5 వేల రూపాయలు. -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో గేమింగ్‌కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
వరల్డ్‌లో తొలి, ఏకైక అద్భుత టీవీ: మరి ధర సంగతేంటి?
హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్జీ ప్రకటించింది. కస్టమర్లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్‌లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రోలబుల్ టీవీ ప్రత్యేకత అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
తక్కువ ధరలో టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఎలక్ట్రానిక్స్ సేల్ ఉందిగా!
సాక్షి, ముంబై: వాషింగ్మెషీన్లు, ఏసీలు,టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల సేల్ ప్రారంభించింది. ముఖ్యంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు కూడా లభ్యం. వూ ప్రీమియం అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ టీవీ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999లకే లభ్యం. దీని ఎంఆర్పీ ధర రూ. 45,000. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎంఐ 5 ఎక్స్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే)టీవీని ఫ్లిప్‌కార్ట్ ఇపుడు రూ. 31,999 దీని ఎంఆర్పీ ధర రూ. 49,999. 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 2,000 తగ్గింపు. రియల్మీ హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఫ్లిప్‌కార్ట్ రూ. 15,999లకే సొంతంచేసుకోవచ్చు. దీని ఎంఆర్పీ ధర రూ. 17,999. దీంతోపాటు 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. Axis Bank కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC వోల్టాస్ 1.5 టన్న 5 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ తక్కువ ధర రూపాయలలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ. 67,990 ల ఏసీని ఈ సేల్ లో కేవలం రూ. 37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 సందర్భంగా. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్. శాంసంగ్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ శాంసంగ్ 198 లీటర్ల 198 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ రూ. 18,000 (ఎంఆర్పీ ధర రూ. 21,990). 12 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఒనిడా 7కేజీ 5 స్టార్ వాషింగ్ మెషీన్ ఒనిడా 7కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తగ్గింపు ధరలో రూ.13,490కి లభ్యం. దీని ఎంఆర్పీ ధర. రూ. 21,990 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. -
నూపుర్ వ్యవహారం.. బీజేపీ దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలుకా ప్రభావం.. బీజేపీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దేశంలో రాజకీయ విమర్శలు ఎదురుకాగా.. ముఖ్యంగా ఇస్లాం దేశాల అభ్యంతరాలతో వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. అంతేకాదు.. టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. తాజా రూల్స్ ప్రకారం.. టీవీ డిబేట్లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసినందుకే నూపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆమెను పార్టీని నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అదే విధంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఖతర్, కువైట్, యూఏఈ, పాకిస్థాన్, మాల్దీవ్, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. చదవండి: అలా చేయకుంటే.. నూపుర్ శర్మ అంతుచూస్తాం -
బుల్లితెరపై కందనూలు కుర్రాడు.. పదేళ్ల కష్టం తర్వాత..
సాక్షి, మహబూబ్‌నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్లోనూ సెకండ్ లీడ్రోల్లో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. రాఘవ డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ప్రయత్నాలు చేశారు. టిక్‌టాక్‌తోనే.. స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్లో సంప్రదించి అవకాశం ఇచ్చారు. చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్.. మొదటిసారి యాడ్‌లో.. దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్కే టీ పౌడర్ యాడ్‌లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్లోనూ నటించారు. సీరియల్స్‌లో అవకాశం.. 2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్లో హీరో కావాలని.. ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో అవ్వడమే లక్ష్యం.. ప్రస్తుతం రెండు సీరియల్స్‌లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను. – రాఘవ, సీరియల్ హీరో -
టీవీల్లో సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'.. ఆరోజే ప్రసారం
నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 26న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత కొద్ది రోజులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురింపించారు. తాజాగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక సినిమాను టీవీ ఆడియెన్స్ వీక్షించనున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో 'శ్యామ్ సింగరాయ్' ప్రసారం కానుంది. అంటే థియేటర్, ఓటీటీలో చూడని వీక్షకులు టీవీ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. సుమారు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలైంది. పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతి శెట్టి, మడోన్నాసెబాస్టియన్లు హీరోయిన్లుగా అలరించారు. Story of Aspiring film maker haunted hy his past Shyam Singha Roy | April 3 | 6 PM#GeminiTV#UgadiwithShyamSinghaRoy #KrithiShetty @IamKrithiShetty@Sai_Pallavi92@NameisNani pic.twitter.com/DVeuYy0a4J — Gemini TV (@GeminiTV) April 1, 2022 -
గమ్మత్తైన టీవి.. చూస్తే నోరూరుతుంది.. నాకితే రుచి తెలుస్తుంది.. ఎక్కడో తెలుసా!
కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలను తలచుకోగానే నోరు ఊరుతుంది. కళ్లముందు కనపడితే.. అసలు ఆగలేరు. ఇలాంటి వారినే ఊరిస్తూ ఉంటాయి.. టీవీలో కనిపించే కొన్ని ఆహారపదార్థాలకు సంబంధించిన ప్రకటనలు, ఫుడ్ షోలు. ఆ ఆహార పదార్థాలను ఎంచక్కా రుచి చూడొచ్చు కాణి ఖర్చు లేకుండా. నిజం.. జపాన్‌లో టీటీటీవీ అంటే ‘టేస్ట్ ద టీవీ’ పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించారు. ఇందులోని ప్రొటోటైప్ తెరకు ప్రత్యేకమైన సెటప్ ద్వారా కొన్ని టేస్టీ ట్యూబ్‌లను అమర్చారు. దీంతో తెరపై కనిపించే ఆహార పదార్థాలను నాకి, రుచి చూడొచ్చు. అంతేకాదు మీకు నచ్చిన ఫ్లేవర్స్నూ కోరి మరీ టేస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెబితే.. వెంటనే, తెర మీద ఉన్న ఫ్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ బొమ్మ వచ్చి పడుతుంది. చక్కగా ఆ చాక్లెట్‌ను చప్పరించొచ్చు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన ప్రసిద్ధమైన పది వంటకాల రుచులను మాత్రమే తెలియజేస్తుందీ టీవీ. త్వరలోనే మరింత అ‹ప్డేట్ అయ్యి అన్ని రుచులనూ ఆస్వాదించేలా ఆ టీవీని రూపొందిస్తామని చెప్తోంది సదరు టీవీ కంపెనీ యాజమాన్యం. -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
వైరల్: తండ్రి లైవ్ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు..
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలల పాటు అన్ని కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఆఫీస్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలో అందరూ ఇంటి నుంచి పనులు చేసుకుంటారు. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. కరోనా దెబ్బతో పిల్లలకు క్లాస్‌లు, ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇంట్లో నుంచి లైవ్ మీటింగ్‌లు, డిబెట్లు చేస్తుండగా కొన్నిఇబ్బందులు తలెత్తడం సహజమే. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి టీవీ ఛానల్‌కు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా తన పిల్లలు అంతరాయం కలిగించాడు. తండ్రి వెనకాలకు వచ్చిన కొడుకు కెమెరాకు హాయ్ చెబుతూ కనిపించాడు. ఇది గమనించిన వ్యక్తి కొడుకును పక్కకు పంపేందుకు ప్రయత్నించగా అతడు వెళ్లిపోయాడు. అయితే మళ్లీ స్క్రీన్ ముందుకు వచ్చిన పిల్లవాడు తండ్రి వెనకాల డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పిల్లవాడి చేష్టలకు చివరికి యాంకర్ కూడా నవ్వేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. A special guest on @bsurveillance was very excited about Weidmann’s departure from the Bundesbank pic.twitter.com/o2sgMk2MK0 — Aggi (@aggichristiane) October 20, 2021 -
క్రియేటివిటీ అంటే ఇది..
Old TV Advertisements: అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్.. బిజినెస్‌కి అవసరమైన ప్రధాన సూత్రం. ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు, జనాలకు దగ్గరిదాకా తీసుకెళ్లేందుకు వీటికి మించిన పవర్ఫుల్ మార్గం మరొకటి ఉండదు. అందుకే వెరైటీ కాన్సెప్ట్‌లు, రకరకాల స్క్రిప్లతో తమలోని క్రియేటివిటీ మొత్తాన్ని చూపిస్తుంటారు యాడ్ మేకర్స్, డైరెక్టర్స్. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యాడ్స్ ట్రెండ్.. పోను పోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఒకానొక టైంలో వచ్చిన యూనివర్సల్ యాడ్స్ మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా నైంటీస్, మిలీనియంలో బుల్లితెర ద్వారా ఇంటింటికీ చేరిన ఈ యాడ్స్.. ఇప్పటికీ తలుచుకున్నా ఆహ్లాదకరమైన ఓ అనుభూతి కలుగుతుంది. పిల్లలతో పాటు పెద్దల పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో చాలావరకు క్రికెట్ మ్యాచ్‌ల మధ్యల్లో రిపీట్‌గా టెలికాస్ట్ కావడం వల్ల చాలామందికి బహుశా ఇవి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అతుక్కుపోయే గుణం ఉన్న ఫెవికిక్ను చేపల వేటను ఉపయోగించే ఈ ఫన్నీ యాడ్.. చివర్లో ఆ వ్యక్తి నవ్వే నవ్వు. ప్రాణం కన్నా డబ్బు మిన్న అనుకునే ఓ వ్యక్తికి నీటి బొట్టు ఇచ్చే భారీ షాక్.. ఎమ్‌సీల్ యాడ్ కోసం రూపొందించింది. జంతువుల్లో ఉన్న సెన్సిబుల్ ప్రేమను.. ఆడ పక్షి- దత్తత తాబేలు పిల్ల, ఆ పిల్లను యాక్సెప్ట్ చేసే మిగతా పక్షి పిల్లల ద్వారా చూపించిన సరదా యాడ్. చిన్నప్పుడు చదివిన కాకి-దాహం కథ.. రాళ్లకు బదులు ముక్కుతో పొడిచే కాకి.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సాంగ్(తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది) కరెంట్ లేని ప్యాలెస్‌లో దీపం పెట్టే కూలీల కథ.. చివరిదాకా అర్థం కానీ ట్విస్ట్.. హ్యాపీడెంట్ చూయింగ్‌గమ్ యాడ్ మూకీ యాడ్లలో కొత్త ఒరవడి.. మిరిండా యాడ్ దురదృష్టంలోనూ సరదాను ఆస్వాదించొచ్చని చూపించిన సరదా పెప్సీ యాడ్.. మేరా నెంబర్ కబ్ ఆయేగా(నా నెంబర్ ఎప్పుడు వస్తుంది) పగిలిపోని గుడ్డు.. జుట్టు పీక్కునే వంటగాడు. ఫెవికల్ డబ్బాలో దాణా తినే కోడి.. ఉల్లాసంగా సాగే లిరిల్ సోప్ యాడ్.. జలపాతం, అందమైన లొకేషన్లో వయ్యారి చిందులు కుటుంబ ఆప్యాయతలకు అడ్డొచ్చే గోడను బద్ధలు కొట్టాలని ప్రయత్నించే కవల అన్నదమ్ములు. బాంబులతో పేల్చిన బద్ధలు కానీ అంబూజా సిమెంట్‌తో కట్టిన గోడ.. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని యాడ్లు. వాటిలో కొన్ని మాత్రం ఇవి. -
మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ
కాందహార్: అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం మొదలైంది. టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. కాగా, ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు.. రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video : సముద్ర తీరంలో అద్భుతం! -
టీవీలో అథ్లెటిక్స్ను చూసి రంగంలోకి దిగిన పిల్లి, ఫన్నీ వీడియో
ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ జాతర కొనసాగుతోంది. ఎవరు నెగ్గుతున్నారు, ఏ దేశానికి పతకాలు ఎక్కువస్తున్నాయనేదే హాట్ టాపిక్‌గా మారింది. క్రీడలు మహారంజుగానే సాగుతున్నా.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ టీవీల ముందుకు చేరి తమకు నచ్చిన ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. అయితే ఈ ఒలింపిక్స్ ఆటలు జనాలతో పాటు జంతువులను కూడా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో టీవీ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తోంది. టీవీలోని జిమాస్ట్ కదలికలకు అనుగుణంగా పిల్లి తన తలను కూడా మార్చుతుంది. అంతేగాక పిల్లి తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతుంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే ట్విటర్ పేజ్ బుధవారం షేర్ చేసింది. ‘జిమ్నాస్టిక్‌ను చూస్తున్న పిల్లి. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూవ్స్‌ను సంపాదించింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘పిల్లి జిమ్నాస్ట్ తన బ్యాలెన్స్ కోల్పోకుండా తనకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది.’ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. cats watching gymnastics is my new favorite (teenybellinitheprettypittie IG) pic.twitter.com/aZjQBoqJBB — Humor And Animals (@humorandanimals) July 28, 2021 -
తీహర్ జైల్లో రెజ్లర్ సుశీల్‌కు టీవీ కేటాయింపు
న్యూఢిల్లీ: అన్నీ కలిసొస్తే ఈపాటికి టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్ క్రీడా పోటీల్లో రెజ్లర్ సుశీల్‌కుమార్ ఉండేవాడు. కానీ ఓ హత్య కేసు విషయంలో అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైలులో కాలం వెళ్లదీస్తున్నాడు. రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ తాను ఒలంపిక్స్ క్రీడలు చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుడు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతడికి టీవీ కేటాయించారు. మే 23వ తేదీన ఓ వివాదం విషయంలో యువ రెజ్లర్ సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లు పరారీలో ఉన్న సుశీల్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
మహేష్ మేనియా.. అక్కడ ‘మహర్షి’ దూకుడు తగ్గట్లేదుగా!
సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేయడంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. ఈ తరహాలో మహేశ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కలెక్షనన్లు కొల్లగొట్టి మహేశ్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఊపు ఊపిన ‘మహర్షి’ టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు, కానీ మెల్లమెల్లగా ఊపందుకుంది. అలా ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ కాగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.80 రేటింగ్స్‌తో సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా మహేశ్ సినిమాలకు ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటమే కాకుండా మునపటి కంటే ఎక్కువ మందే ఈ సారి వీక్షించడం ఇదొక అరుదైన ఘటననే చెప్పాలి. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది వరకు మన రాకుమారుడు నటించిన ‘అతడు’ చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై, తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. 1st Time: 9.3 2nd time : 7.3 3rd Time: 6.13 4th time: 9.02 5th Time: 10.28 6th Time: 8.82 7th Time: 7.14 8th Time: 5.14 9th Time: 4.92 10th Time: 7.80** చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!
దేశంలో మరోసారి టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4 శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్
పై ఫోటోలో కనిపిస్తోన్న బుక్‌ఫైల్‌ను తెరిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక టూ ఇన్ వన్ టీవీ. టూ ఇన్ వన్ అంటే.. టీవీ ఫ్లస్ బుక్ అనుకునేరు. కాదు టీవీ ఫ్లస్ టేబుల్ ల్యాంప్. కెనాడాకు చెందిన జీన్ మైకెల్ రిచాట్ రూపొందించిన ఈ టీవీ.. ఫొల్డబుల్ ఓఎల్ఈడీ 24 ఇన్చెస్ డిస్ప్లే, ఇన్‌బిల్ట్ బ్లూటూత్ స్పీకర్‌తో ఉంటుంది. దీని పైన బుక్‌ఫైల్‌ను తలపించేలా లైట్ బ్లూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. మీకు ఎప్పుడైనా టీవీ చూడాలనిపిస్తే ఈ బుక్‌ఫైల్‌ను తెరిస్తే చాలు. అలాగే లైట్ అవసరమైతే.. అప్పుడు ఈ బుక్‌ఫైల్‌ను మూయండి. బాగుంది కదూ. అయితే..ఈ టీవీ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించి మార్కెట్లో ప్రవేశ పెట్టనున్నారు. చదవండి : క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్ -
బుల్లితెరపై ‘ఉప్పెన’ రికార్డ్.. స్టార్ హీరోలతో సమానంగా!
ఉప్పెన.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మూవీ. రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విలన్‌గా విజయ్ సేతుపతి నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. వెండితెరపై ఓ ఊపు ఊపిన ఉప్పెన.. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగించింది. థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడా మంచి వ్యూస్ సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యింది. తొలిసారి ప్రసారమైన ఉప్పెనకు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ దక్కింది. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రం ఇదే . ఇక అదే రోజున ప్రసారం అయిన విజయ్ మాస్టర్ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది. చదవండి: మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్! లాక్‌డౌన్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ Blockbuster response for #Uppena continues UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/tOPMelkR3l — BARaju (@baraju_SuperHit) April 29, 2021 -
ఇండియాలో ఎన్ని ఇళ్లలో టీవీలు ఉన్నాయో తెలుసా?
ముంబై: ఇండియాలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. 2020 ఆఖరు నాటికి టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6 శాతం పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రేటింగ్ కౌన్సిల్(బార్క్) గురువారం వెల్లడించింది. దేశంలో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలు ఉన్నాయని పేర్కొంది. 2018 సంవత్సరాంతానికి 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7 శాతం పెరిగింది, పురుషులు 6 శాతం పెరిగారు. 2018లో దేశంలో టీవీ చూసే వారి సంఖ్య 83.6 కోట్లు కాగా, 2020 నాటికి 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా, దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్ ప్రకటించింది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందుకే టీవీ వీక్షణం పెరిగిందని తెలియజేసింది. దేశంలో ఇంకా 9 కోట్ల గృహాల్లో టీవీలు లేవని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుతుండడంతో ప్రసార, వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా చెప్పారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే టీవీ వీక్షకులు పెరుగుతుండడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఇది విన్నారా.. శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్.. ఎందుకంటే? -
రికార్డులను షేక్ చేస్తున్న బాలీవుడ్ ‘లక్ష్మీ'
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘లక్ష్మీ' రికార్డులను షేక్ చేస్తోంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై బ్లాక్‌బస్టర్ రేటింగ్‌ను నమోదు చేసిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్‌తో అతిపెద్ద ప్రీమియర్ రికార్డును కొట్టేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతూ 2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్ సాధించిన మూవీగా ‘లక్ష్మీ' నిలవడంపై సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్‌కు, రాఘవేంద్రస్వామికి ధన్యవాదాలు తెలిపాడు. (టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు ప్రేక్షకుల నుంచి దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా మార్చి 21 న స్టార్ గోల్డ్‌లో రిలీజైన ఈ మూవీకి టెలివిజన్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో బాలీవుడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తొలి హిందీ మూవీ ఇది. రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. This is huge #Laxmii clocking 2.51cr impressions on first run is just outstanding, beating #Housefull4 numbers is itself a big task but Laxmii has gone way ahead of it.. congrats @akshaykumar @advani_kiara & @offl_Lawrence & lord @farhad_samji 🤗 pic.twitter.com/SqYJnHbMFD — Ajju 🎭 (@The_EvilGuy) April 2, 2021 More the Social Media negativity more will be the support by neutral audience for @akshaykumar ❤#Laxmii breaks all the previous Television records Yes!!! Highest impression any Bollywood movie has ever got🔥#AkshayKumar pic.twitter.com/3j1FSxiImt — AKSHAY KUMAR FAN B.T.💫 (@Akkians_BT) April 2, 2021 Happy to share, #Laxmii world tv premiere impression is 2.51 crore. One of the Highest World Television Premier Impression for a Bollywood Movie Thanking @akshaykumar Sir & Ragavendra Swamy at this moment.@advani_kiara @Shabinaa_Ent @tusshkapoor @foxstarhindi @ZeeMusicCompany pic.twitter.com/pITG503yuH — Raghava Lawrence (@offl_Lawrence) April 3, 2021 -
ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!
కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. వాహనాలు వ్యాపారాలు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్‌లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా భారతదేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హీరో స్కూటర్లు, బైక్‌ల ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది. టీవీ 2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. గత ఎనిమిది నెలలుగా టీవీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్ పరిశ్రమను పిఎల్ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం టీవీ ఉత్పత్తిలో వాడే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధర పెరగడమే. నేటి నుంచి టీవీ ధరలు యూనిట్‌కు కనీసం 2000-3000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఏసీ & రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉంది. తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర పెరుగుతుంది. ప్రతి ఎయిర్ కండీషనర్ ధర రూ.1500 నుంచి 2000 రూపాయలకు పెరగవచ్చు. కేవలం ఒక నెలలోనే ఓపెన్-సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. తత్పలితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల ధరలు పెరగనున్నాయి. విమాన ప్రయాణం దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ విమానయాన రక్షణ రుసుమును రూ.160 నుంచి రూ.200కు పెంచనున్నారు. అలాగే, అంతర్జాతీయ విమానాల రుసుము 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. దీనికి సంబంధించి డీజీసీఎ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం భారీగా పెరిగిన బంగారం ధరలు -
ఇక టెలివిజనూ.. వైర్లెస్
ఇప్పటికే స్మార్ట్ఫోన్ల చార్జింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్లెస్ టెక్నాలజీ... ఇప్పుడు టెలివిజన్లకు విస్తరించనుంది. రష్యాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేబుల్‌కు బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఇది పనిచేయనుంది. రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీని సీఈఎస్ 2021లో ప్రదర్శించారు. కేబుల్స్‌కు బదులు వైఫై పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని అందుకునే రిసెప్షన్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. (చదవండి: 5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!) విద్యుత్తు సాకెట్‌కు దూరంగా టీవీని ఏర్పాటు చేసుకోవడం అసాధ్యమైన ఈ నేపథ్యంలో రెజొనెన్స్ ఈ వైర్లెస్ టీవీని తీసుకొచ్చింది. వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును అందుకునే రిసీవర్. కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని కంపెనీ వివరించింది. కనీసం మీటర్ దూరం వరకూ విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. రిసీవర్ కాయిల్‌ను టెలివిజన్ఫ్రేమ్లోకే చేరవచ్చని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్ అడుగు భాగంలో కానీ.. గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఏడాది క్రితం సామ్సంగ్ కూడా ఇలాంటి వైర్లెస్ టీవీని తెచ్చే ప్రయత్నం చేసినా... తగిన టెక్నాలజీ లేదని తన ప్రయత్నాలను విరమించుకుంది. రెజొనెన్స్ తన టెక్నాలజీపై అమెరికాతో పాటు ఇండియా, యూరోపియన్ యూనియన్, కెనడా, దక్షిణ కొరియాల్లోనూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ టెక్నాలజీని టెలివిజన్లకు మాత్రమే కాకుండా... ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ ఉపకరణాలతోపాటు విద్యుత్తు వాహనాలకూ వాడొచ్చని కంపెనీ చెబుతోంది. -
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
ఇక టెలివిజన్ల ధరల మోత మోగనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇకపై అదనపు భారం తప్పదా? వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు మోత మోగనున్నాయా? తాజా అంచనాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తు్నాయి. టీవీ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో నిలిచిపోనుంది. దీంతో ఆయా కంపెనీలు టీవీల ధరలు పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. సెప్టెంబరు 30 తరువాత డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు భారం తప్పదని పలు టీవీ కంపెనీలు ప్రకటించాయి. ఎల్జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ కంపెనీలు ఈ వరుసలో ముందున్నాయి. గడువు పెంచకపోతే ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని ఎల్జీ ఇండియా సీనియర్ డైరెక్టర్ రవీందర్ అన్నారు. 32 అంగుళాల టెలివిజన్‌కు 4 శాతం లేదా కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాల టీవీలపై 1,200-1,500 రూపాయల మేర ధరలు పెరిగే అవకాశం ఉంది. (ఈజీ టు ఇన్స్టాల్ : శాంసంగ్ బిజినెస్ టీవీలు) అయితే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రాయితీని మరికొంత పెంచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. శాంసంగ్ తన ఉత్పత్తిని వియత్నాం నుండి భారతదేశానికి తరలించిన నేపథ్యంలో టీవీ తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి సుంకం రాయితీని గడువు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకోనుంది. గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ ఇచ్చింది. అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది. టెలివిజన్ ఖర్చులో దాదాపు 60 శాతంగా ఉన్న ఒపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం విధించే బదులు, ప్రభుత్వం దశలవారీగా-ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని స్థానిక తయారీదారులు అంటున్నారు. ఇండస్ట్రీ బాడీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయనెన్స్ తయారీదారుల సంఘం, బిజినెస్ ఛాంబర్ ఫిక్కీ ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు సమాచారం. (షావోమి కొత్త స్మార్ట్ టీవీ: హారిజన్ ఎడిషన్) -
కలర్ టీవీల దిగుమతులపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: కలర్ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి! ఎందుకంటే కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతోపాటు.. చైనా నుంచి వచ్చి పడుతున్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేయడమే కేంద్రం నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటి వరకు కలర్ టెలివిజన్లను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విభాగం ప్రకటన జారీ చేసింది. 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి. నియంత్రణతో ఇకపై వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొదాల్సిందే. -
ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరికీ తెలుసు: ప్రదీప్
-
‘మగాడు ఇలా చేయాలంటే కత్తిమీద సామే’
సాక్షి, యడ్లపాడు/గుంటూరు: చిన్ననాటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం.. ఆ ఇష్టమే అతని ఆశయసాధన దిశగా అడుగులు వేయించింది. ఎందరో కళాకారులను అక్కున చేర్చుకునే కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసింది. బుల్లితెర, వెండితెర నటుడిగా మారేలా చేసింది. అతడే హాస్యనటుడు హర్షిత. ఇది ఇండస్ట్రీలో పిలుచుకునే అతని ముద్దుపేరు. అసలు పేరు గౌస్‌బాష. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి మాబుసుభాని, మహబ్బీ దంపతుల పెద్ద కుమారుడు. స్త్రీ, పురుష పాత్రల్లో వేషం ఏదైనా నటన అదరహో అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌కు.. మొదటినుంచి గౌస్‌బాష సినిమాలను ఎక్కువగా చూసేవాడు. కళపై మక్కువో.. నటుడు కావాలన్న కోరిక తెలియదు కాని ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పడింది. తల్లిదండ్రులు చూపిన విద్యమార్గం కంటే తాను ఎంచుకున్న రంగంపైనే అభిలాష ఎక్కువగా పెంచుకున్నాడు. ఇంటర్, ఏసీ మెకానికల్ ఐటీఐను అతికష్టం మీద పూర్తి చేశాడు. ఆరో తరగతి నుంచే కళారంగం అంటే ఇష్టత ఏర్పడిందని తాను కళాకారుడిగానే జీవితంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నానని కుటుంబసభ్యులకు చెప్పాడు. పగటి కలలు కనకు అంటూ కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఊళ్లో ఇది విన్నవారు కామెడీ చేస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ఆ మాటలు విన్న అతనిలో తన ఆశయం సాధించాలన్న కసి మరింతగా పెరిగింది. జాబ్ నిమిత్తమంటూ ఊరు విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు. నిరాశ ఎదురైనా పట్టు వీడలేదు తనకు ఎంతటి పట్టుదల ఉన్నా, తనలో ఎంతటి ప్రతిభ ఉన్నా గుర్తించే వ్యక్తి అవకాశం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు గడిచాయి. ఒక్క అవకాశమూ తలుపు తట్టలేదు. జరిగిందేదో జరిగింది. ఇంటికి వచ్చేయమంటూ కుటుంబసభ్యులు, మిత్రులు సలహా ఇచ్చారు. అయినా లక్ష్యం సాధించే వరకు ఊరికి తన ముఖం చూపించకూడదనుకున్నాడు. 2018లో చివరిలో ఇండిపెండెంట్ పేరుతో రూపొందించే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం లభించింది. అందులో తన నటనా కౌసల్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అది బాగా వైరల్ కావడంతో ఆ ఫొటోలు చూసి బుల్లితెరలో నటించే అవకాశం లభించింది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు... జెమినీలో జూలకటక, స్టూడియోవన్లో లాఫింగ్ అడ్డా, ఈటీవీ జబర్దస్త్, 108 తెలంగాణ చానల్లో గబ్బర్‌సింగ్ టెలీ కామెడీ షోలలో నటిస్తున్నాడు. దర్శకుడు మూర్తి.. బాషాను పిలిచి ముత్యాలముగ్గులో నటించే అవకాశం ఇచ్చి సీరియల్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కాలేజీ పోరగాళ్లు, మళ్లీమళ్లీ చూశా, పుణ్యదంపతులు సినిమాల్లోనూ నటించాడు. వీటితోపాటు తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన షార్ట్ఫిల్మ్స్లో 20కు పైగా నటించాడు. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్ కవర్సాంగ్స్లోనూ నటిస్తున్నాడు. యూట్యూబ్ చానెల్స్ వారం వారం ప్రసారం చేసే యాదయ్య, యాదమ్మ ముచ్చట్లు, వారం వారం నీ కవితతో వంటి ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లోనూ రాణిస్తున్నారు. స్త్రీ వేషధారణకు మంచి గుర్తింపు స్త్రీ వేషధారణలో హర్షిత పేరుతో చేస్తున్న కామెడీ పోగ్రామ్స్ గౌస్‌బాషాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఆడవారి హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ విషయం కాదు. అందుకు ఆహార్యం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ అభినయం ఉండాలి. మాటాల్లో మృధుత్వం పలకాలి. సిగ్గు, బిడియం తొణికిసలాడాలి. అన్నింటికి మించి నడకలో వయ్యారాలు పోవాలి. వీటన్నింటి ఓ మగాడు చేయాలంటే కత్తిమీద సామువంటిదే. అదికూడా టెలీషోలో చేయడమంటే చాలా కష్టం. కళల పట్ల ఆసక్తి..కళాకారుడిగా నిరూపించుకోవాలన్న కసి ఉన్నప్పుడే అవి సాధ్యపడతాయని గౌస్‌బాషా నిరూపించాడు. పలు చానల్లో కామెడీ షోలలో హర్షిత పేరుతో స్త్రీ పాత్రలు పోషిస్తున్నాడు. -
మార్కెట్లోకి మరో సూపర్ టీవీ వచ్చేసింది
సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్లో సూపర్ టీవీ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన వూ కంపెనీ దీనికి అప్‌గ్రేడెడ్‌గా వు 100 సూపర్ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ 100 అంగుళాల 4 కె సూపర్ టీవీ ధర అక్షరాలా రూ. 8 లక్షలు. వు 100 సూపర్ టీవీ ఫీచర్లు 100 అంగుళాల 4కె డిస్ప్లే ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆధారం ఇంటెల్ కోర్ ఐ 3 , కోర్ ఐ 5 ప్రాసెసర్ ఆప్షన్స్ 4జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్ స్టోరేజ్ టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్ కాల్స్, వైర్లెస్ క్వార్ట్లీ కీబోర్డ్, ఎయిర్ మౌస్, రిమోట్ కంట్రోల్, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్ టీవీ కనెక్టివిటీ పరంగా, మూడు యుఎస్బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్డిఎంఐ,ఎవి, వైపిబిపిఆర్,ఆర్ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వు టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు. కాగా వూ టెలివిజన్ ఇటీవల తన అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సిరీస్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఇవి మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో(32 అంగుళాల మోడల్ రూ.11,499కు, 40 అంగుళాల టీవీ రూ.18,999కు లభిస్తుంది. 43 అంగుళాల టీవీ రూ .20,999) లభిస్తుంది. -
జియో యాప్స్‌తో వన్‌ప్లస్ తొలి టీవీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లసస్ తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా స్మార్ట్‌టీవీల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వన్‌ప్లస్ కంపెనీ తన బ్లాగ్ ద్వారా లోగోను రివీల్ చేసి తన తొలి టీవీ విడుదలను ధృవీకరించింది. తద్వారా గత ఏడాది కాలంగా కొనసాగుతున్న రూమర్లకు చెక్ చెప్పింది. అయితే టీవీకి ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం న్‌ప్లస్ తన మొదటి టెలివిజన్ సెట్‌ను సెప్టెంబర్ 26 న విడుదల చేయనున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ధర, ఇతర స్పెసిఫికేషన్లపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు వెలువడనప్పటికీ, 91 మొబైల్స్ సమాచారం ప్రకారం జియో స్ట్రీమింగ్ యాప్‌లతో ఇండియాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతికలను పరీక్షిస్తోందని అంచనా. 43, 55, 65, 75 అంగుళాల పరిమాణాల్లో వన్‌ప్లస్ తన మొదటి టీవీని అమెజాన్ ద్వారా లాంచ్ చేయనుందట. -
తెలివిజన్
తెనాలి రామకృష్ణ తెలివే తెలివి.. విజనే విజను. ఇంకొకళ్లకు లేవు.. అలాంటి వికటకవులిక లేరు! ఆ తెలివిని, ఆ విజన్‌ని కలిపి దూరదర్శన్ వాళ్లు ‘తెనాలి రామ’గా ప్రసారం చేశారు.పదికాలాల నవ్వుల పువ్వుల్ని పూయించారు. బతుకు బాటలో అతను హాస్య చతురత కల చమత్కారి. కష్టాన్ని తన ప్రతిభతో ఇష్టసఖిగా మార్చుకొని ఇంటి ముంగిట్లో కట్టేసుకున్న ధీశాలి. తలతీసేయాల్సిన పరిస్థితుల్లోనూ తలవంచక చమత్కారంతో మరణం చేతనే మెప్పు సాధించిన మహా మేధావి. తెలుగువారినే కాదు భారతదేశమంతా తన ప్రతిభతో ఆకట్టుకున్నవాడు. అతని పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఆ తెలివికి జోహార్ అంటుంది. అతడిని పరిచయం చేసుకోవాలంటే రాయల భువనవిజయానికి బయల్దేరాలి. ఆ కాలానికి వెళ్లాలంటే ఇప్పుడు మనకు టైమ్ మిషన్ అక్కర్లేదు. 90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘తెనాలి రామ’ సీరియల్‌ను చూస్తే చాలు. నాటి చారిత్రక సంఘటలను కథలుగా పరిచయం చేయడానికి టెలివిజన్ నాడు ఎంతగానో ఉపయోగపడింది. అందుకు ఉదాహరణ ‘తెనాలి రామ’కృష్ణ కవి కథలనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడిన సీరియల్స్ ఎన్ని వచ్చినప్పటికీ ‘తెనాలి రామ’ సీరియల్ ప్రస్తావన వస్తే మాత్రం నాటి పిల్లలు ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు టెలివిజన్ ఎన్నో ఆసక్తికర సీరియల్స్‌ను ప్రచారం చేసినప్పటికీ హాస్య సీరియల్స్‌లో తెనాలి రామ పెద్ద లెజండ్. బద్దకిస్టు రామకృష్ణుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టింది గుంటూరులో. కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో తల్లి ఎంతో కష్టమ్మీద రామకృష్ణను పెంచుతుంటుంది. రామకృష్ణ సోమరిపోతు. ఎప్పుడూ నిద్రపోవాలని చూస్తుంటాడు. తినమని పండు ఇస్తే దాని తొక్క తీయాలి కదా అని బద్ధకించి అలాగే చేతిలో పెట్టుకొని నిద్రపోతాడు. స్కూల్‌కి వెళితే గురువు చెప్పే పాఠాల మీద ఎంత మాత్రమూ ఆసక్తి ఉండదు. తల్లికి రామకృష్ణ పెంపకం చాలా తలనొప్పిగా ఉంటుంది. నదిలో స్నానం చేసి రమ్మని తల్లి పోరితే వెళ్లి అక్కడి బండరాళ్ల మీద పడుకొని నిద్రపోతుంటాడు. నది దగ్గర జపం చేసుకుంటున్న ఒక సాధువు రామకృష్ణ పడుకుని ఉండడం చూసి ఓ రోజు విసుక్కుంటాడు ‘కాళీమాత గుడికి వెళ్లి పడుకోపో.. నా జపానికి విఘాతం కలిగించకు’ అని కోప్పడతాడు. విధిలేక రామకృష్ణ అమ్మవారి గుడికి వెళతాడు. ఆకలేస్తే తనకు కావల్సిన ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. కలలో దేవత ప్రత్యక్షమై ధనం, జ్ఞానం ఉన్న రెండు గిన్నెల నిండా ప్రసాదం ఇస్తుంది తినమని. అవి తిన్న రామకృష్ణుడు నిద్రలేచి అమ్మవారి వైపుగా చూస్తాడు. ఆమె పాదాల వద్ద గిన్నెలోని ప్రసాదాన్ని సేవించి, దండం పెట్టుకొని పరుగున ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణుడు పడుకొని లేకపోవడం చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నది దగ్గరకు వెళుతుంది. కొడుకు కనిపించడు. అక్కడే ఉన్న సాధువుని అడుగుతుంది తన కొడుకు గురించి. ‘రామకృష్ణుడు బ్రహ్మముహూర్తంలోనే వచ్చి నదీ స్నానం చేసి వెళ్లాడు’ అని చెబుతాడు. తల్లి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకుంటుంది. రామకృష్ణుడు పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆకలేస్తుందని, పాఠశాలకు వెళ్లాలని ఏదైనా తినడానికి ఇమ్మని తల్లిని త్వరపెడతాడు. ఆవుకు మేత తెచ్చి వేస్తాడు. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. ఖాళీ సమయం ఉంటే పాఠాలు వల్లెవేస్తుంటాడు. గురువును మెప్పించిన శిష్యుడు అవుతాడు. తల్లి ఆనందంతో కొడుకును చూసుకొని మురిసిపోతుంది. చిన్ననాటి చమత్కారం ఇంటిలో సరుకులు మోయడానికి కష్టంగా ఉందని తెలుసుకున్న రామకృష్ణుడు ఓ ఆలోచన చేస్తాడు. ఓ రోజు బట్టలు ఉతికే అతని దగ్గరకు వెళ్లి తన మాటలతో మెప్పించి, గాడిదను తీసుకెళతాడు. కొంతదూరం వెళ్లాక గాడిదకు శక్తి లేక అడుగు వేయలేకపోతుంది. మేతకోసం చూస్తాడు. ఒకామె గడ్డిమోపును నెత్తిమీద పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్లడం చూస్తాడు. ఆమెను కొద్దిగా మేత అడిగితే డబ్బు లేనిదే ఇవ్వను అంటుంది. గాడిదను తీసుకెళ్లి ఒకచోట ఉంచి, వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. దూరంగా ఒక సంపన్నుడు గుర్రం తీసుకొని రావడం చూస్తాడు. ఆ సమయంలో రామకృష్ణుడు గాడిదను ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ సంపన్నుడు ఆశ్చర్యపోయి ‘గాడిదను వేడుకుంటున్నావేం’ అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ఈ గాడిద మహిమాన్వితమైనది. దీనికి పిడికెడు గడ్డి వేస్తే ఏం కోరుకుంటే అది అవుతుంద’ని, చెబుతాడు. గడ్డి అమ్ముడుపోక నీరసంగా ఒక దగ్గర కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్లి పిడికెడు గడ్డి కొని తీసుకొస్తే చాలంటాడు. ఆ సంపన్నుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దారిన పోయేవారంతా వచ్చి గాడిదకు గడ్డి కొని ఇస్తారు, డబ్బులూ సమర్పించుకుంటారు. ఒకరు ఇద్దరు పోయి వందల మంది గాడిదకు మేత వేయడానికి వస్తారు. సాయంకాలమయ్యాక అంతా వెళ్లిపోయి రేపు రండి అని చెబుతాడు. సాయంకాలం బట్టలు ఉతికే అతను రామకృష్ణుడు తల్లి దగ్గరకు వచ్చి నా గాడిదను ఇవ్వమని వేడుకుంటాడు. తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడే గాడిదతో వచ్చిన రామకృష్ణుడు ‘గాడిద మహారాజు సంపాదన ఇది. ఇదంతా నీదే’ అని బట్టలు ఉతికే అతనికి ఇస్తాడు. ‘నా సంపాదన ఇది’ అంటూ తల్లికి కొంత భాగాన్ని ఇస్తాడు. మాటలతో కోటలు చమత్కారానికో, లేక పిలవడానికి సులువు అనో కానీ.. కొద్ది కాలంలో రామకృష్ణుడినే ఊరివాళ్లు రామలింగా అని పిలిచేవారు. తల్లికి పనుల్లో సాయపడుతూ, విద్యను అభ్యసిస్తూ పెరిగి పెద్దవుతాడు. పెళ్లి చేసుకొని గృహస్థు అవుతాడు. ఒకరోజు ఆ ఊళ్లో ఆచారి అనే వ్యక్తి రామలింగడి కాళ్ల మీద పడతాడు కాపాడమని. విషయం ఏంటని అడుగుతాడు రామకృష్ణుడు. సేట్ తన జాతకం అడిగితే చూసి ‘నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. నీ పరివారం అంతా ముందే మరణిస్తారు’ అని చెప్పాను. తన పనివాళ్లతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. నా దోషమేమీ లేదు ఉన్నదున్నట్టు చెప్పాను’ వగరుస్తూ అన్నాడు ఆచారి. ఆచారికి ఓ రహస్యం చెప్పి సేట్ని కలుస్తాడు రామకృష్ణుడు. కోపంలో ఉన్న సేట్ ఆచారిని తెగ తిడుతుంటాడు. రామకృష్ణుడు వెళ్లగానే ‘ఇంట్లో అందరూ జబ్బు చేసి చచ్చిపోతారని వాడు చెప్పాడు. శాంతి చేయాలి..’ అని టెన్షన్ పడుతూ ఉంటాడు సేట్. ఆ ఆచారి చెప్పింది అబద్ధం. బృహస్పతి వరం పొందిన ఓ సిద్ధుడు చెట్టుకింద కొలువుదీరాడు. ఎవరితోనూ అతను మాట్లాడడు. ఈ రాత్రే వెళ్లి అతన్ని కలవండి’ అని చెబుతాడు రామకృష్ణుడు. అలాగేనని వెళతాడు సేట్. రామకృష్ణుడు చెప్పిన విధంగా చెట్టుకింద ఉన్న స్వామీజీని చూసి ‘స్వామీజీ నేను పెద్ద పరేశాన్లో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి ఇది. దయచేసి చెప్పండి’ అని వేడుకుంటాడు. జాతకం చూసిన అతను.. ‘మూడేళ్ల క్రితం మీ తండ్రి మరణించారు. వారం రోజులుగా మీ ఇంట్లో వారంతా మంచం పట్టారు. నువ్వు దీర్ఘాయుష్కుడివి. మీ ఇంట్లో వారందరికంటే నువ్వు రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతావు’ అని చెబుతాడు. అతను చెప్పిన దానికి చాలా సంతోషించిన సేట్ డబ్బు కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ వేషం కట్టింది ఆచారియేనని ఆ సేట్‌కి తెలియదు. మాట తీరుతో ఆపదల నుంచి ఎలా బయటపడవచ్చో రామకృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిరూపిస్తాడు. ఆచారి రామకృష్ణుడిని కలిసి ‘రామా.. నువ్వు చాలా చమత్కారివి. చెప్పినదాన్నే మరో విధంగా చెప్పి నన్ను కాపాడావు’ అని మెచ్చుకొని ‘ఇంత తెలివైనవాడివి ఈ ఊళ్లో ఉంటే ఎలా? నువ్వు రాజ సభలో ఉండాలి. ఎందుకు ప్రయత్నించకూడదు’ అంటాడు. ఆ ఆలోచనతో భార్య సీతతో విజయనగరం బయల్దేరుతాడు రామకృష్ణుడు. కోటలోకి దారేది కోటలోకి వెళ్లడానికి ఎవరి రికమెండేషనూ లేదు. కనీసం పరిచయస్థులెవరూ లేరు. రోజూ కోట దగ్గరకు చేరి వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. ఓ రోజు కోటలోకి వెళ్లబోతున్న రాజగురువును కలుసుకుంటాడు. ‘మీరు నాకు తెలుసు.. మీరు ఫలానా కదా! మీరు మా ఊరు వచ్చారు. అప్పుడు నేనే దగ్గరుండి భోజనం వడ్డించాను’ అంటూ.. మాటలు కలుపుతాడు. రాజగురువు సందేహంగా చూసి, అనేక ప్రశ్నలు వేసి, తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఆలోచన చేసిన రామకృష్ణుడు రాజ భటులతో ‘రాజగురువుతో మాట్లాడుతుండగా చూశారుగా. రాజు గొప్ప బహుమానం ఇస్తానని చెబితే వచ్చాను. అందులో కొంత భాగం మీకు ఇద్దామనుకున్నాను. కానీ, మీరు లోపలికి వెళ్లనివ్వడం లేదు’ అంటాడు. ఆ మాటలు భటులను ఆకట్టుకుంటాయి. బహుమానంలో తమకూ కొంత భాగం ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటారు వాళ్లు. అలా కోటలోకి వెళతాడు రామకృష్ణుడు. కోటలో మొదటి ఛాలెంజ్ రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అందరూ అతన్ని కీర్తిస్తారు. ‘నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?’ అని సవాల్ విసురుతాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు ‘మహారాజా అనుమతి ఇస్తే, నేను ఈ సవాల్‌ను ఎదుర్కొంటాను’ అని ముందుకు వస్తాడు. రాజు అనుమతితో కారం తెప్పించి, ‘ఈ కారం కళ్ల మీదుగా వేసుకొని భరించగలవా?’ అంటాడు. తన వల్ల కాదంటాడు ఇంద్రజాలికుడు. రామకృష్ణుడు రెండు గుప్పిళ్ల నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు. రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే ‘వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ’ అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఈ ఇనామ్లో భాగం ఉంది మహారాజా’ అని కోరుతాడు. ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు. రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని చేతి ఉంగరాన్ని బహుకరిస్తాడు. అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు. వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు. ఇతని జీవిత సంఘటనలన్నీ చమత్కారపు కథనాలుగానే ఆకట్టుకుంటాయి. అక్బర్–బీర్బల్ కథల మాదిరిగానే రాయలు–రామకృష్ణుడు కథలుగా, తెనాలిరామలింగడి కథలుగా చిన్నాపెద్దను ఆకట్టుకున్నాయి. ఈ కథలను దర్శించిన చిన్నా పెద్ద పెదవులపై నవ్వులను పూశాయి. ‘శభాష్ తెనాలి రామ’ అని రామకృష్ణ తెలివికి జనం చేతులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి. – ఎన్.ఆర్ దొంగల చేత నీళ్లు ఓ రాత్రి పూట తన ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు రామకృçష్ణుడు. భార్యతో గట్టిగా అరిచి చెబుతూ ‘మన ఇంట్లో దొంగలు పడి, సర్వమూ దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ‘నగలు, డబ్బు అంతా మూట గట్టి బావిలో వేద్దాం’ అని దొంగలకు వినపడేలా చెప్పి, ఓ మూటను బావిలో వేస్తాడు. రామకృష్ణుడు బావిలో వేసింది నగలు, డబ్బు ఉన్న మూటనే అని నమ్మిన దొంగలు తెల్లవార్లూ బావిలో నీటిని తోడుతూనే ఉంటారు. రామకృష్ణుడు ఆ నీటిని తన తోటకు పాదులు తీసి, మళ్లించుకుంటూ ఉంటాడు. తెల్లవారు జామున అలసిపోయిన దొంగలతో తోటకు నీళ్లు సరిపోయేలా పనిచేశారని కృతజ్ఞతలు చెబుతాడు రామకృష్ణుడు. అంతే! దొంగలు పారిపోతారు. తెనాలి రామ ►‘తెనాలి రామ’ సీరియల్‌ను తీసిన దర్శకుడు టి.ఎస్.నాగభరణ. రామకృష్ణుడిగా నాగభరణయే ఈ సీరియల్లో నటించారు. ►చిన్ననాటి రామకృష్ణుడిగా మాస్టర్ కార్తీక్ నటనలో మెప్పించాడు. ►కథా రచయిత్రి కమలా లక్ష్మణ్ (ఆర్కే లక్ష్మణ్ సతీమణి) రాసిన కథలే తెనాలి రామ సీరియల్‌కు మూలం. ►ఆర్కేలక్ష్మణ్ ఈ సీరియల్‌కి కార్టూన్ లైన్స్ ఇచ్చారు. ►రామకృష్ణుడు పెరిగింది తెనాలి అగ్రహారమైన తూములూరులో.ఇంటిపేరు గార్లపాటి కన్నా తెనాలి అనేపేరే రామకృష్ణుడి ఇంటిపేరుగా స్థిరపడింది.రామకృష్ణుడికే రామలింగడు అనే మరో పేరు ఉంది. -
అభిమానాల బజార్
అక్కడ ఆస్తులు లేవుఅంతస్తులు లేవు డిగ్రీలు లేవు కులమతాలు లేవు ఉన్నదల్లా మనుషులువారి మధ్య నెలకొన్నఅభిమానాలుఅవే, ‘నుక్కడ్’ సీరియల్‌ని సంపన్నం చేశాయి. ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచి పోయాయి. మన కాలనీలోని కార్నర్ ప్లేస్‌లో ఏమేం దుకాణాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా. ఓ చాయ్ బండి, దానిని ఆనుకొని ఫాస్ట్‌ఫుడ్ బండి, ఓ పాన్ షాప్, ఆ పక్కనే ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ షాప్, వస్తువులను తాకట్టు పెట్టుకొని పదో పరకో ఇచ్చే సేట్ షాప్, ఒకవైపు కూరగాయలు, మరోవైపు ఇస్త్రీ షాప్, షూ షాప్, సెలూన్ షాప్.. ఇలా చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి. ఆ షాపుల్లో పనిచేసేవారంతా సాయంత్రమైందంటే ఓ చోట చేరుతారు. వేడి వేడి చాయ్ చప్పరిస్తూనో, బీడీ ముక్కను నోట్లో పెట్టుకొని పొగ ఊదుతూనో పక్కవారితో బాతాఖాని వేస్తుంటారు. అంతా దిగువతరగతి. అక్కడ ఒకరి కష్టం అందరిది. ఒకరి ఆనందమూ అందరిది. ప్రపంచాన్ని దర్శించాలంటే ఇలా వీధి మూలన ఉన్న జీవితాలతో ఓ అరగంట గడిపితే చాలు. నగరాల్లో తక్కువ ఆదాయపు ప్రజల సాంఘిక, ఆర్థిక పోరాటాలను 80ల కాలంలోనే కళ్లకు కట్టింది దూరదర్శన్. వారం వారం శ్రమ జీవుల కష్టాన్ని, వారు పంచుకున్న ఆనందాన్ని హాస్యభరితంగా ఆవిష్కరించింది. నిరంతరం ఆర్థికసమస్యలతో, నెరవేరని కలలతో పోరాటం చేస్తుండే కార్నర్ జీవితాలను ‘నుక్కడ్’ సీరియల్‌గా మూడు దశాబ్దాల క్రితం 40 ఎపిసోడ్లలో పరిచయం చేసింది చిన్నతెర. గరీబుల కార్నర్ ఎలక్ట్రీషియన్ గురు నుక్కడ్ గ్యాంగ్‌కి చిన్నపాటి లీడర్. నుక్కడ్‌లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించడంలో తను ముందుంటాడు. కదేరిభాయ్ తినుబండారాల షాప్ ఓనర్. నుక్కడ్‌లో ఉన్నవారంతా ఇతని షాపు ముందే చేరుతుంటారు. మరీ తిండికి లేని వారికి ఉచితంగా టీ, స్నాక్న్ ఇచ్చే మంచి మనసు ఉన్నవాడు. హరికి చిన్న సైకిల్ రిపేర్‌షాప్ ఉంటుంది. ఇతడు గుప్తా సేత్ కూతురును ప్రేమిస్తుంటాడు. గోపాల్ అనే వ్యక్తి తాగుబోతు. కానీ అందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి. నేనేదైనా చేయగలను అని సూటు బూటులో కనిపించే వ్యక్తి రాజా పటేల్. చిన్న హెయిర్‌కటింగ్ సెలూన్‌ని నడుపుకునే బార్బర్ కరీమ్. నుక్కడ్లోని ఇళ్లలో పనిచేస్తూ, అందరికీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది రాధ. సింగిల్ ఉమెన్ మారియా టీచర్. గురు–మారియాలు ప్రేమించుకుంటారు. కానీ, తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోరు. దుఖియా షాయర్ నిరుద్యోగి. గురు దగ్గర ఉంటూ అందరినీ పదో పరకో అడుక్కుంటూ జీవితం గడుపుతుంటాడు. ఘనశ్యామ్ బిక్షగాడు. చౌరాషియా పాన్వాలా. గుప్తాసేత్ కిరణా, మానిక్లాల్సేత్ ఆభరణాల షాప్‌ను నిర్వహిస్తుంటారు. వీరితో పాటు అలా ఇలా వచ్చిపోయే మరో పది మంది మనుషులతో నుక్కడ్ సందడిగా కనిపిస్తుంది. పండగతో మొదలు పేద–ధనిక బేధం లేకుండా ఆనందాన్ని పంచుకునేవే పండగలు. మరి నగరాల్లో దీపావళి పండగ అంటే.. టపాసులకు, కొత్త బట్టలకు వేలల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. అంతంత మాత్రంగా ఉండే శ్రమజీవుల సంపాదనతో పూట గడవడమే కష్టం. అలాంటిది టపాసులు కొనుగోలు చేయాలంటే పెద్ద యుద్ధమే. అందుకే నుక్కడ్‌లో ఉండేవారంతా తలా కొంత చందా వేసుకుంటారు. గుప్తా, సేట్లు మాత్రం ఒక్కొక్క టపాసు అందరి మధ్య భయం భయంగా కాల్చడం నవ్వు తెప్పిస్తుంది. టపాస్ కాదు బాంబ్ అంటూ దబాయించే పోలీసు హడావిడి, చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. చందా డబ్బుతో మిఠాయిలు కొనుక్కొని దీపావళి పండగ జరుపుకుంటారు అంతా. ఇలాగే అన్ని పండగలు అందరూ కలిసి జరుపుకుంటారనే విషయాన్ని నుక్కడ్ జనం పరిచయం చేస్తారు. పంచుకునే ప్రేమలు పెళ్లిళ్లకు ట్రాపెంట్ వాయించే బ్యాండ్ మాస్టర్ ఎందరిచేతనో గౌరవం అందుకున్న వ్యక్తే. ముసలివాడైపోతాడు. కానీ, పూట గడవక తానెంతో ఇష్టపడే ట్రాంపెట్ను 200 రూపాయలకు సేట్‌కి అమ్మేస్తాడు. ‘వృద్దాప్యంలో చివరకు ట్రాంపెట్ కూడా లేకపోతే ఎలా బతుకుతావు’ అని అడిగితే ‘నా రెక్కల కష్టమ్మీద బతికేస్తా..’ అని దుఖిస్తాడు. గురు, మిగతా బృందమంతా కలిసి బ్యాండ్ మాస్టర్ ట్రాంపెట్ను తాకట్టు నుంచి విడిపించి, అతని చేత ట్రాంపెట్ను వాయించేలా చేయాలనుకుంటారు. కానీ, మాస్టర్ నిపించుకోడు. చివరకు ట్రాంపెట్ను అతను వాయించడం, అతని చుట్టూ చేరి నుక్కడ్ జనం అంతా గంతులేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. ఒకరి కష్టం అందరూ పంచుకుంటే జీవితం ఎంత సింపుల్‌గా గడిపేయొచ్చో దీంట్లో తెలుసుకోవచ్చు. నాయకులను నిలదీసే నైజం నుక్కడ్కి రాజకీయ నేత వస్తాడు ఈ సారీ ఓట్లు వేసి గెలిపించమని. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తారు ఒక్కొక్కరు. మారియా టీచర్ రాజకీయనాయకుడిని ‘మీ కొడుకు ఎక్కడున్నాడ’ని అడుగుతుంది. అమెరికాలో ఉన్నాడని, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడని గర్వంగా చెబుతాడు. పదవుల కోసం వచ్చే నాయకులు చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి అంటూ క్లాస్ తీసుకుంటుంది టీచర్. తనను తప్పుపడుతున్నారనే కోపంతో మండిపడుతూ అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు రాజకీయ నాయకుడు. హామీలు ఇచ్చి నెరవేర్చని నాయకుల దుమ్ము దులపాలంటే అందుకు సామాన్యులే సరైనవారని చూపుతారు. దొంగ నుంచి మంచి నుక్కడ్‌లో దొంగతనం జరుగుతుంది. అక్కడి జనానికి పట్టుబడిన వ్యక్తి తాను దొంగగా మారిన పరిస్థితుల గురించి వివరిస్తాడు. పోలీసులు దొంగను పట్టుకోవడానికి వస్తే అతను తమకు పరిచయం ఉన్న వ్యక్తే అని, దొంగ కాదని టీచర్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నుక్కడ్‌లో అతనూ ఓ మెంబర్ అవుతాడు. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదని, పరిస్థితులే వారనలా మారుస్తాయని, మంచి మనుసుల మధ్య ఉంటే దొంగలైనా మంచివారుగా మారుతారనే నిజాన్ని కళ్లకు కడతారు. ఇలా ఒక్కో వారం ఒక్కో సమస్య నుక్కడ్ జనాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఓ పరిష్కారం చూపుతుంది. కొన్ని పరిష్కారం లేని సమస్యలూ ఉంటాయి. అందరి కళ్లలోనూ భవిష్యత్తు పట్ల అందమైన కలలు. అవి నెరవేరేవి కావని తెలిసినా నిరుత్సాహపడకుండా ఆనందంగా గడిపే జీవితాలు నుక్కడ్‌లో దర్శించవచ్చు. మన జీవితానికి కావాల్సిన పాఠాలనెన్నో నుక్కడ్ బజార్లో వెతుక్కోవచ్చు. – ఎన్.ఆర్. ∙మూడు దశాబ్దాల క్రితం శ్రామిక జీవుల జీవితాలను తరచి చూసి, తెరకెక్కించారు దర్శకులు కుందన్ షా, సయీద్ అక్తర్ మిర్జా. ఈ సీరియల్‌కి ప్రబో«ద్ జోషి, అనిల్ చౌదరి తమ రచనా సహకారాన్ని అందించారు ∙దిలీప్ ధావన్, పవన్ మల్హోత్రా, సంగీతానాయక్, రమా విజ్, అవతార్గిల్లు ప్రధాన పాత్రదారుల్లో కనిపించి నుక్కడ్ని సుసంపన్నం చేశారు ∙1986–86లో 40 ఎపిసోడ్లతో ఫస్ట్ సీజన్ వచ్చిన నుక్కడ్, ఆ తర్వాత 1993లోనయానుక్కడ్ పేరుతో సీక్వెల్ సీరిస్ వచ్చింది. -
సీఐడీలకే డాడీ!
ఈ రోజుల్లో సీఐడీ సీరియల్ హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ప్రసారమవుతోంది. వేల ఎపిసోడ్లుగా వచ్చిన సీఐడి లాంటి సీరియల్స్‌కి అంకురం వేసింది మాత్రం నాటి దూరదర్శన్ సీరియల్ కరమ్‌చంద్. సిల్లీ క్వెశ్చన్స్తో కిట్టీ, ఫన్నీ మ్యానరిజంతో కరమ్‌చంద్ చిన్నచిన్న ఆధారాలతో నేరస్తులను పట్టుకుంటూ చిన్నతెరమీద చేసిన హంగామాయే డిటెక్టివ్ ‘కరమ్‌చంద్.’ డిటెక్టివ్ అంటే నోట్లో పొడవాటి సిగార్ ఉండదు. ఎదుటివారి కళ్లలో వెతికే అనుమానపు జాడలు ఉండవు. అసలు, అప్పటి వరకు నవలల్లో చదివిన కథానాయకుడిలా ఈ డిటెక్టివ్ ఉండనే ఉండడు. ఈ డిటెక్టివ్ కరమ్‌చంద్ చాలా డిఫరెంట్. కేసులను క్యారెట్లలా కరకర నమిలేస్తూ నేరస్తులను అవలీలగా చట్టానికి పట్టిస్తుంటాడు. షెల్ఫ్‌లో మిస్టరీ భర్త చనిపోవడంతో మిసెస్ లోబో లాండ్రీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చెడు వ్యసనాల బారిన పడి తల్లిని డబ్బులివ్వమని వేధిస్తూ ఉంటాడు. ఓ రోజు లాండ్రీలో పని చేసే మోహన్ ఇంటికి వెళ్లిపోతానంటే ‘ఇంకా పని మిగిలి ఉంది. షట్టర్ కిందకు దించేసి వెళ్లిపొమ్మ’ని చెబుతుంది లోబో. మరుసటిరోజు ఉదయం మోహన్ వచ్చి చూసేసరికి షట్టర్ కిందకు అలాగే దించి ఉంటుంది, తాళం ఉండదు. ఆశ్చర్యపోయిన మోహన్ ‘మేడమ్, ముందే వచ్చి, బయటకు వెళ్లి ఉంటారు’ అనుకొని పనిలో నిమగ్నమవుతాడు. లాండ్రీ బట్టలు ఇవ్వమని కస్టమర్ సంధ్య, తన కోటు ఇవ్వమని డిటెక్టివ్ కరమ్‌చంద్ అక్కడకు వస్తారు. వారి బట్టల కోసం వెతుకుతుండగా మిసెస్ లోబో షెల్ఫ్‌లో శవమై కనిపిస్తుంది. మిసెస్ లోబోను ఎవరు చంపారన్నది పెద్ద మిస్టరీగా మారుతుంది. కస్టమర్ సంధ్యకి ఆమె మాజీ ప్రియుడు రాసిన ఉత్తరం లాండ్రీ బట్టల్లో ఉండిపోతుంది. ఉత్తరం కోసమై వచ్చిన సంధ్య భర్త తనకేమీ తెలియదన్న లోబోను కొట్టడం వల్ల ఆమె చనిపోయిందన్న విషయాన్ని షోరూమ్‌లో దొరికిన మందుల డబ్బా ఆధారంగా నిరూపిస్తాడు డిటెక్టివ్ కరమ్^è ంద్. నకిలీ పెయింటింగ్ రాజేష్–అంజు భార్యాభర్తలు. వారింటి అల్మారాలో డెడ్‌బాడీ ఉన్నట్టు తెలుస్తుంది. స్క్రూడ్రైవర్ ఆయుధంగా హంతకుడు ఈ ఘాతుకం చేశాడని తెలుసుకుంటాడు కరమ్‌చంద్. అక్కడ దొరికిన స్క్రూ ఆధారంగా కేసు స్టడీ చేస్తాడు. ఆ హాల్లో ఉన్న అత్యంత ఖరీదైన పెయింటింగ్‌ను దొంగిలించి, దాని ప్లేస్‌లో నకిలీ పెయింటింగ్‌ను ఉంచడానికి కబీర్చంద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అసలు విషయాన్ని బయటపెడతాడు కరమ్‌చంద్. నేరమూ–శోధన ఇలా అన్నీ నేర కథనాలే. అనుకోకుండా జరిగిన హత్యలు కొన్ని. కావాలని చేసిన హత్యలు మరికొన్ని. మనుషులను మనుషులు చంపుకుంటూ సమాజం నుంచి తప్పించుకు తిరగాలనుకునేవారిని డిటెక్టివ్ కరమచంద్ శోధించి సాధించి ప్రేక్షకుల ముందు నిలబెడతాడు. నేరస్తులను పట్టుకునేవిధానంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపిస్తారు. ఇది చూసిన ప్రేక్షకులు డిటెక్టివ్ తెలివిని మెచ్చుకుంటూ చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘కరమ్‌చంద్’ పేరుతో 1985లో వచ్చిన ఈ డిటెక్టివ్ సీరియల్ దూరదర్శన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. నేరాలను ఎలా శోధిస్తారో, నిందితులను చిన్న చిన్న ఆధారాల ద్వారా ఎలా పట్టుకుంటారో చూపించింది. మొత్తం 50 ఎపిసోడ్లు. కరమ్చంద్ను హీరోని చేసేసింది దూరదర్శన్. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంకజ్‌కపూర్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తే, బాలీవుడ్ నటి సుస్మితా ముఖర్జీ కిట్టీ పేరుతో అతని సెక్రటరీగా నటించారు. ఈ ఇద్దరినీ ప్రేక్షకులు అమితంగా ప్రేమించారు. ఇలాంటి డిటెక్టివ్‌ను మళ్లీ ఇప్పుడు చూడలేం అంటారు అప్పటి ప్రేక్షకులను పలకరిస్తే. – ఎన్.ఆర్ కరమ్‌చంద్ సీరియల్ ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పడానికి రెండవ సీజన్నీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదటి భాగం దూరదర్శన్‌లో 1985లో వస్తే, రెండవ సీజన్ 2007లో సోనీ టీవీలో వచ్చింది. సీజన్1లో ఎపిసోడ్ సమయం 25 నిమిషాలు ఉంటే, సీజన్ 2లో సీరియల్ నిడివిని 45 నిమిషాలకు పెంచారు. రెండవ సీజన్లోనూ కరమ్చంద్గా పంకజ్ కపూర్ నటించారు. కిట్టీగా సుచేత ఖన్నా అలరించారు. ‘షటప్ కిట్టీ..!’ డిటెక్టివ్ కరమ్చంద్కి ఒక ఫన్నీ అసిస్టెంట్ ఉంటుంది. ఆమె పేరు కిట్టీ. సిల్లీ క్వెశ్వన్స్తో కరమ్చంద్ను విసిగించడమే పనిగా ఉంటుంది. లేదంటే రహస్యాన్ని ముందే బయట పెట్టేస్తుంది. వర్క్ పట్ల ఆమెకున్న డెడికేషన్ వల్ల కరమ్‌చంద్ చాలా ఓపికగా భరిస్తూ ఉంటాడు. కేసులో కిట్టీ విచిత్రప్రశ్నలను సంధించిన ప్రతీసారి ‘షట్ అప్ కిట్టీ’ అనే మాటను ఈ డిటెక్టివ్ ఉపయోగిస్తుంటాడు. క్యారెట్లు.. నల్లకళ్లద్దాలు డిటెక్టివ్‌కు ఒక మ్యానరిజం ఉండాలని, అందుకు తనదైన మార్క్ ఉండాలని ఆలోచించారు దర్శకుడు పరాశర్. ఆ బాడీలాంగ్వేజ్ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోవాలనీ అనుకున్నారు. అందుకు ఓ పద్ధతిని ఎంచుకున్నారు. కరమ్చంద్ను ‘కాఫీ తాగుతారా’ అని అడిగితే– ‘ఎసిడిటీ రావచ్చు’ అంటాడు. ‘సిగెరెట్..’ అంటూ ఆఫర్ చేస్తే ‘లంగ్స్‌కి ఎఫెక్ట్..’ అంటాడు. అదే సమయంలో నా దగ్గర గాజర్ ఉందిగా అంటూ క్యారెట్ తీసుకొని కరకర నములుతూ ఉంటాడు. కేసులను కూడా ఇలాగే నమిలేస్తా అంటూ క్యారెట్‌తో చూపుతుంటాడు. మిస్టరీ అని చెప్పడానికి సూచనగా కళ్లద్దాల పై నుంచి, పక్కగా చూపులను సారించడం నాటి టెలివిజన్‌కు కొత్త కళను తెచ్చింది. కరమ్‌చంద్ పాత్రకు పంకజ్ కపూర్ వన్నె తెచ్చారు అనేవారంతా. కరమ్‌చంద్ పుణ్యమా అని క్యారెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవట. నల్ల కళ్లద్దాల అమ్మకాలు వింటర్లోనూ విపరీతంగా ఉండేవట. పరాశర్‌కి నచ్చిన పంకజ్ కపూర్ కరమ్‌చంద్ క్యారెక్టర్‌కి ముందు ‘హమ్‌లోగ్’ పాత్రధారి అలోక్నాథ్ని, కిట్టీగా సుధీర్ మిశ్రాను అనుకున్నారట. అలోక్నాథ్కి– దర్శకుడు పంకజ్ పరాశర్‌కి ఏవో మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. ‘పంకజ్కపూర్ని చూసినప్పుడు నాకు ముందు సినీ నటుడు దిలీప్‌కుమార్ గుర్తుకు వచ్చారు. నా అభిమాన నటుడు సీరియల్లో నటించడానికి వచ్చాడనుకున్నాను. వారానికి 1500 రూపాయలు ఇచ్చే అంగీకారం మీద పంకజ్ ముంబయ్‌కి వచ్చారు’ అని పరాశర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో విచిత్రమేమంటే ఈ సీరియల్‌కి రచయితగా పంకజ్ప్రకాశ్, దర్శకుడిగా పంకజ్ పరాశర్, నటుడిగా పంకజ్ కపూర్.. ఈ ముగ్గురి పేర్లలో ముందు పంకజ్ అని ఉండడం యాదృచ్ఛికమే. -
కదిలించిన పునాది
ఇటుక పునాది మీద ఇల్లు నిలబడుతుంది. అనుబంధం పునాది మీద కుటుంబం నిలబడుతుంది.కాని పునాది కదిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? భారత్, పాక్ విభజన తర్వాత లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఒక కుటుంబ కథే బునియాద్. బునియాద్ అంటే పునాది అని అర్థం. అందరి మనసులనూ కదిలించిన పునాది ఈ సీరియల్. లైవ్ షో బిగ్‌బాస్ సీజన్స్, అతీంద్రియ శక్తులతో సాగే నాగిని వంటి సీరియల్స్‌ను ఆవిష్కరించే టీవీ గురించి ఈ రోజుల్లో ఇంతే తెలుసు మనకు. కానీ, టీవీకి స్వర్ణయుగం అనిపించే కాలం ఒకటుంది. అవి దూరదర్శన్ వచ్చిన తొలినాటి రోజులు. ఇండియన్ టెలివిజన్‌లో రెండవ సీరియల్ అడుగుపెట్టిన ‘బునియాద్’ అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపింది. అప్పుడప్పుడే దూరదర్శన్ అడ్వరై్టజింగ్ కంపెనీలకు టైమ్ స్లాట్లను అమ్ముతోంది. సంపన్న కుటుంబాలు టీవీ సెట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గం టీవీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆ రెండు వర్గాలని ఆకట్టుకునేలా రిచ్ స్టోరీస్ ప్లానింగ్ దూరదర్శన్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో ఇండియన్ ఆడియన్స్ నాడిని పట్టుకున్నారు దర్శకుడు రమేష్ సిప్పి. దేశీయ మూలాల్లోకి వెళ్లాడు. మనసు తడిని కళ్లలో చూపించే బలమైన కుటుంబాన్ని పట్టుకున్నాడు. ‘బునియాద్’ పేరుతో ఠీవిగా ముందుకొచ్చాడు. గుండె గుండెలో ఇది మేమే అనిపించాడు. ఇది మాదే అనిపించాడు. జ్యోతి స్వరూప్ తన దర్శకత్వ ప్రతిభనూ జత కలిపారు. కథలోకి వస్తే... ఇండియా – పాకిస్థాన్ విడిపోకముందు అంతా ఒకే దేశం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకే కుటుంబంగా జీవించారు. విడిపోయాక.. ఏమైంది? ఇదే కథ. అందుకే విడిపోకముందు.. (1916 నుంచి 1978 )తర్వాత పరిస్థితులను ఈ సీరియల్లో చూపించారు. అప్పటికి దేశమంతటా నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉంది. ఆ పిచ్చిని ‘బునియాద్’ తన వైపు తిప్పుకుంది. దీంతో నాటకం తెర తీయడానికే తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది. బునియాద్ ఒక స్టోరీ కాదు సీరియల్ మొదలవడమే 1915 నాటి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక అందమైన కుటుంబం... స్వాతంత్య్రానంతరం జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశవిభజన ఆ అందమైన కుటుంబాలను ఎలా ఛిద్రం చేసిందో చిత్రిస్తుంది. లాహోర్ నుంచి అనేక మలుపులు తిరుగుతూ కథ 1986లో ఢిల్లీ చేరుతుంది. అక్కడ శరణార్థ శిబిరాలలో తలదాచుకున్న వారి కష్టాలను పరామర్శిస్తుంది. నిజానికి బునియాద్ కొన్ని కుటుంబాల కథల సమాహారం. అయినా ప్రధానంగా మాస్టర్ హవేలీరామ్, లాజోజీ (అలోక్‌నాథ్, అనితా కన్వర్)ల కుటుంబం చుట్టూతా తిరుగుతుంటుంది. హవేలీరామ్, లజోజీ దంపతులకు ముగ్గురు కొడుకులు భూషణ్, రోషన్, సత్బీర్. హవేలీరామ్ భార్య లాజోజి. తల్లి, తండ్రి, అన్న–వదిన, పిల్లలతో తన పూర్వీకుల కాలం నుంచి వుంటున్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. హవేలీ రామ్‌ది ఏం జరిగినా అంతా మనమంచికే అనుకునే తత్త్వం. కుల మతాలకు అతీతంగా ఉంటాడు. రాజకీయాలంటే మాత్రం ఆసక్తి చూపుతుంటాడు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొంటాడు. ఇరుగుపొరుగుతోనూ, దేశంతోనూ వివిధ బంధాల మధ్య అల్లుకున్న అనుబంధాలెన్నో ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా జీవించే చక్కటి కుటుంబం దేశ విభజన సుడిగుండంలో చిక్కుకుని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అగచాట్ల పాలవుతుందో ఈ సీరియల్ చూపిస్తుంది. స్వతంత్రం వచ్చింది. దేశమంతటా వేడుకలు. ప్రతి మదిలో ఆనందోత్సాహాలు. స్వేచ్ఛాతరంగాలు అంతటా ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో దేశ విభజన అనివార్యమైంది. కుటుంబరక్షణ వ్యవస్థలో ఆనందంగా గడిపే హవేలీరామ్ సాదా సీదా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జీవితకాలపు బాధలకు లోనయ్యేలా చేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కుటుంబం విచ్చిన్నం అవడం, పూర్వీకులంతా నివసించిన ఇంటిని వదిలి శరణార్ధుల శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది. హవేలీరామ్ పాత్రను ఈ కథ కోసం తీర్చినట్టు అనిపించదు. మనమే ఆ పరిస్థితుల్లో ఉండి, కుటుంబాన్ని కోల్పోయి పడే బాధను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. హిందూ–ముస్లిమ్ సమానత్వం కోసం ఆరాటపడే విధానం కళ్లకు కడుతుంది. భారతీయ సగటు తల్లికి ప్రతీకగా లాజోజి అత్యంత సాధారణంగా ఉంటుంది. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకునేంత పరిస్థితికి చేరుతుంది. ఈ కథలో కంటతడిపెట్టించే మరో కథనం వీరన్వలిది. హవేలిరామ్ చెల్లెలు ఈమె. లాహోర్‌లో గడిపిన మధుర క్షణాలు, వృషభన్‌తో ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన కన్న కొడుకును అక్రమసంతానంగా భావించిన సమాజాన్ని తట్టుకోలేని విధానం, పిరికి ప్రేమికుల భావోద్వేగాలు కంటతడిపెట్టిస్తాయి. బాబ్లీజీగా పేరు మార్చుకొన్నప్పటికీ తన బిడ్డను సింగిల్ పేరెంట్‌గా పెంచే ధైర్యం ఉండదు. కష్టపడి పనిచేయడంలో వచ్చే సంపాదన కన్నా గ్లామరస్‌గా ఉంటూ, డబ్బు సులువుగా వచ్చే క్యాబరే డ్యాన్సర్‌గా వృత్తిని ఎంచుకుంటుంది. ఒక కుటుంబం నుంచి మరికొన్ని కుటుంబాలను కలుపుతూ కథలు కథలుగా బునియాద్ సాగుతుంది. ప్రతి కుటుంబానికీ అందులోని కథ చేరువయ్యేలా పక్కా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ఒకరకంగా చెప్పాలంటే మహాభారత్‌లో కౌరవులు–పాండవుల మధ్య నడిచిన కథలా అదే సమయంలో వారి చుట్టూతా ఉన్న లెక్కలేనన్ని కుటుంబకథలు వచ్చి చేరినట్టుగా బునియాద్ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సీరియల్లోని ప్రతి పాత్రా నటించినట్లు కాకుండా సజీవ చిత్రణమే అన్నంత సహజంగా అనిపిస్తుంది. కొన్ని మూలాలు బునియాద్ సీరియల్ 105 ఎపిసోడ్లుగా దూరదర్శన్‌లో 1986 నుంచి 1987 వరకు వారానికి రెండుసార్లు (మంగళ, శనివారాల్లో) ఏడాది పాటు ప్రసారమయ్యింది ∙బునియాద్ సీరియల్ ప్రసారమైన 27 ఏళ్ల తర్వాత ‘బునియాద్ రిటర్న్’పేరుతో జులై 25, 2013లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సహారా ఒన్, 8:30కు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు ∙ఈ సీరియల్లో నటించిన నటీనటులు చాలావరకు అంతకుముందు పేరొందిన డ్రామా ఆర్టిస్టులు ∙మన ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే సాధారణ వాడుక భాషను ఈ సీరియల్ ద్వారా తీసుకువచ్చారు ∙ఈ సీరియల్ దర్శకులు రమేష్ సిప్పి బిగ్ స్క్రీన్ మీద.. షోలే, షాన్, సాగర్.. వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగారు. -
హమ్ లోగ్ ఇలా మొదలైంది...
కుటుంబం అంటే ఏక ఆలోచన కాదు. ఏక వ్యక్తి కాదు. ఏక రూపం కాదు.కాని అలా ఉండాలని అనుకునేవారు.వైఫల్యాలని దాచిపెట్టాలని అనుకునేవారు.గెలుపు బయటకు చూపించాలనుకునేవారు.ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచాలనుకునేవారు.ఇది ఒత్తిడి. దాచే కొద్దీ లోలోన వచ్చే ఉడుకు.అలాంటి సమయంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ వచ్చింది.కుటుంబం అంటే అనేక ఆలోచనలూ అనేక వ్యక్తిత్వాలు అనేక రూపాలు అని చెప్పింది. వైఫల్యాలు ఉంటాయి... భంగపాట్లు ఉంటాయి... తిరిగి లేచి నిలబడటమూ ఉంటుంది... ఇదేమీ దాచిపెట్టాల్సిన రహస్యమూ కాదు.. అని ఆ సీరియల్ చెప్పింది.అప్పుడూ ఉన్నది ఆ మనమే. ఇప్పుడూ ఉన్నదీ మనమే.మన కోసం ఎప్పుడూ కావాలి ఒక ‘హమ్‌లోగ్’.దూరదర్శన్‌లో సీరియల్స్‌కు తెర తీసిన తొలి సీరియల్ ఇది.సగం దేశ జనాభా చూసిన సీరియల్. సూపర్ హిట్ సీరియల్. బసేసర్ రామ్‌ది ఓ మధ్యతరగతి కుటుంబం. మద్యానికి బానిస. భార్య చిల్లర డబ్బులు ఎక్కడ పెడుతుందో వెతుక్కుంటూ ఆ పూటకు మందు గడిస్తే చాలు అనుకునే రకం. భార్య భగవంతి ఇంటి గుట్టు బయటపెట్టుకోకూడదనే సగటు ఇల్లాలు. వీరికి ఐదుగురు పిల్లలు. పెద్ద కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కూతురు సినిమా నటి కావాలని తపిస్తూ ఉంటుంది. చిన్న కూతురికి డాక్టర్ కావాలనేది కల. మరో కొడుక్కి క్రికెట్ అంటే పిచ్చి.. ఇలా ఈ పాత్రలన్నింటినీ కుటుంబం అనే తోరణానికి గుచ్చి 35 ఏళ్ల క్రితం బుల్లితెర మీద ఆవిష్కరించారు రచయిత మనోహర్ శ్యామ్జోషి, దర్శకులు కుమార్వాస్దేవ్లు. ఆ అందమైన తోరణం పేరు ‘హమ్‌లోగ్.’ బుల్లితెర మీద మొట్ట మొదటి సీరియల్‌గా అశేష జన నీరాజనాలు అందుకుంది హమ్‌లోగ్. ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయింది. నేటికీ ఇవే సంఘర్షణలు సీరియల్ అయినా సినిమా అయినా ప్రజల మనసుల్లో బలమైన ముద్రవేయాలంటే అవి తమ మధ్య నడిచే కథలై ఉండాలి. తమ మధ్య కదలాడే పాత్రలై ఉండాలి. అలాంటి కథను పరిచయం చేసింది ‘హమ్‌లోగ్’ సీరియల్. అందుకే ఈ కథ 35 ఏళ్ళ నాటిది అయినా ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. అప్పటికే 70 ఏళ్ల సినిమాను మించిన పాపులారిటీ 154 ఎపిసోడ్లు ఉన్న ఈ ఒక్క సీరియల్ తీసుకొచ్చింది. ఓ మహిళా ఇది నీ కథ.. ‘హమ్‌లోగ్’ ప్రధానంగా స్త్రీ సాధికారత గురించే చెబుతుంది. ఈ షోలోని మహిళా పాత్రధారులు ముఖ్యంగా బసేసర్రామ్ భార్య భగవంతి పాత్రలో జయశ్రీ అరోరా నటించారు. జయశ్రీ తొమ్మిదేళ్ల వయసు నుంచే డ్రామా ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్ నటి అయ్యారు. కథక్, మణిపురి డ్యాన్సర్. ఎన్నో బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో సహపాత్రధారిగా నటించారు జయశ్రీ. హమ్‌లోగ్‌లో ఐదుగురు పిల్లల తల్లిగా ‘నీకేం తెలియదు ఊరుకో’ అని కసురుకునే కుటుంబసభ్యుల నడుమ త్యాగం చేయడమే జీవితంగా భావిస్తుంది భగవంతి పాత్ర. ఇప్పటికీ భారతీయ సగటు తల్లుల పరిస్థితి అంతా ఇలాగే ఉంటుంది. భర్తకు, పిల్లలకు జీతం, భత్యం లేని పనిమనిషిగా సేవలు చేస్తూ, కుటుంబం యోగక్షేమాలే తన బాగోగులు అనుకుంటుంది. 2019లో ఇప్పటికీ ఇలాంటి భగవంతిలను మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో చూస్తూనే ఉంటాం. ఇక కూతుళ్లు బడ్కి, మఝ్లీ, ఛుట్కీ.. వారు పడే సంఘర్షణలు, ఎదుర్కొనే సమస్యలు, గుర్తింపుకోసం తహతహలాడే గుణం ఆద్యంతం కనిపిస్తుంటుంది. ఐదుగురు పిల్లల్లో పెద్ద కూతురు బడ్కీ.స్వేచ్ఛను కోరుకుంటుంది కానీ బయటకు వ్యక్తపరచలేదు. లోలోపల తీవ్ర మానసిక వత్తిళ్లకు లోనవుతూ ఉంటుంది. గుండెమాటున కన్నీళ్లు దాచుకుంటూ కాలం గడుపుతుంటుంది. మొత్తానికి సామాజిక సేవే వృత్తిగా మార్చుకుంటుంది. బడ్కీగా సీమా భార్గవ్ నటించారు. ఈమె సినిమా, టీవీ, నాటకరంగ నటి. 2017 నాటికి 63 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు సాధించిందిన సీమ 2017లో బరేలీ కి బర్ఫీ, శుభ్ మంగల్ సావధాన్.. ఈ రెండు సినిమాల్లో ఉత్తమ సహనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌కి ఒకేసారి నామినేట్ అవడం విశేషం. ఏక్తాకపూర్ సీరియల్ ‘కసమ్స్ సె’ లో మౌసిగా సీమా టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆ తర్వాత 2014లో హిప్ హిప్ హుర్రే సీరీస్ ద్వారా సింగిల్ మదర్‌గా సీమ నటన సుప్రసిద్ధం. ఇక హమ్లోగ్లోని రెండవ కూతురు మఝ్లీ. స్వేచ్ఛను పొందడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది మఝ్లీ. తన కలలకు అడ్డుపడిన ప్రతి ఒక్కరితోనూ వాదిస్తూనే ఉంటుంది. మహిళా స్వయంశక్తిగా ఎదగాలంటే ఎన్ని ఒడిదొడుకులను దాటాలో మఝ్లీ పాత్ర చూపుతుంది. ఇలాంటి అమ్మాయిలు ఇప్పటికీ మనకి చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటారు. మఝ్లీగా దీప్తీ సేథ్ నటించారు. ఈ సీరియల్ తర్వాత దీప్తి ఏడు టీవీ సీరియళ్లు, నాలుగు సినిమాల్లో నటించారు. ఇంట్లో చిన్న కూతురు ఛుట్కీ. చదవంటే ప్రాణం. డాక్టర్ కావాలనేది తన కల. భగవంతి, బడ్కీలకు ఈ అమ్మాయి మీద ఎనలేని నమ్మకం. తండ్రి నుదుటి మీద ఏర్పడ్డ చారలకు కారణం అది అతని ముఖానికి నప్పడమా, లేక ఆడపిల్లలకు కట్నం ఇచ్చుకోవాలనా? అనే ఆలోచన చేస్తూ ఉంటుంది. భవిష్యత్తు తరాల తరుణుల ఆలోచనకు అద్దంలా ఉంటుంది ఈ పాత్ర. బసేసర్ రామ్.. వినోద్నాగ్పాల్ హమ్‌లోగ్‌లో ప్రధాన పాత్రధారి అయిన బసేసర్ రామ్. వినోద్నాగ్పాల్ ఈ సీరియల్లో బసేసర్రామ్గా నటించాడు. మధ్యతరగతి తండ్రిగా, మద్యానికి బానిస అయిన వ్యక్తిగా నాగ్‌పాల్ నటన అందరినీ ఆకట్టుకుంది. హాస్యాన్ని వ్యంగ్యధోరణిలో అస్త్రాలుగా వదిలేవాడు. ‘హమ్‌లోగ్ కథ 25–30 పేజీలు ఉంటుందేమో. రచయిత మనోహర్ శ్యామ్ జోషి బ్రెయిన్లోనే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉండేది. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ప్రతి ఎపిసోడ్లో ఏయే అంశాలు రావాలో అనర్గళంగా ఆన్ది స్పాట్లోనే చెప్పేసేవారు. ఇన్నేళ్లయినా ఖోస్లా కా ఘోస్లా, లవ్ షువ్ తె చికెన్ ఖురానా.. వంటి సీరియల్స్‌లోనూ నాకోసం పాత్రలు ఉండటం అంటే హమ్‌లోగ్ నాకు ఇచ్చిన అదృష్టమే’ అని వివరించారు ఓ ఇంటర్వ్యూలో నాగ్‌పాల్. మధ్య తరగతి కష్టం మద్యం, లింగవివక్ష, కళ్ల ముందు ఎన్నో అవకాశాలు, వాటిని అందుకోలేని పేదరికం, మసకబారిన సామాజిక విలువలు, గుడ్డి నమ్మకాలు.. ఇలాంటివెన్నో ‘హమ్‌లోగ్’ చూపుతుంది. ఇప్పటికీ హమ్‌లోగ్ (మన దేశ ప్రజలు) కనపడని ఈ దెయ్యాలతో నిత్యం పొరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇది అందరి సీరియల్ అయ్యింది. ఇప్పటి సీరియల్స్‌కి దిశా నిర్దేశం చేసే ఒక గైడ్ హమ్‌లోగ్. – ఎన్.ఆర్. ఇండియన్ టెలివిజన్ కార్యక్రమాలలో ఒక మాస్టర్ పీస్ ‘హమ్‌లోగ్.’ వాస్తవికతకు దగ్గరగా ఉండేవి అప్పటి కార్యక్రమాలు. 80, 90ల కాలంలో అదొక సామాజిక విప్లవం. దీంతో దూరదర్శన్ ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. అంజలి సెజ్వాల్ (గృహిణి) నేను ఈ సీరీస్ సీడీలు మొత్తం కొని దాచుకున్నాను. ఇప్పటికీ చూడదగింది. దిగువ మధ్యతరగతి ఎదుర్కొనే సవాళ్లను బాగా చూపించింది హమ్‌లోగ్. రవి సింఘ్ (పంజాబీ) ముప్పై ఏళ్ల క్రితం నాటి మాటి. తక్కువ ఆదాయం, ఎక్కువ సంతోషం ఉండే రోజులవి. కంప్యూటర్, మొబైల్ వంటివి లేవు అప్పట్లో. అదొక గోల్డెన్ పీరియడ్. మనుషుల మధ్య సత్సంబంధాలు, ఒకరికొకరు సాయపడే గుణం ఎక్కువ. ఆ సీరియల్‌ని తలుచుకుంటే నాటి రోజులు గుర్తుకువస్తాయి. నాటి రోజులను తలుచుకుంటే తప్పకుండా హమ్‌లోగ్ ఒక భాగమై ఉంటుంది. బ్రహ్మదత్త శర్మ అవి వేసవి సెలవులు. అప్పట్లో మా ఇంట్లో సౌకర్యం అంటే ఒక టేబుల్ ఫ్యాన్, బ్లాక్ అండ్ వైట్ టీవీ. హమ్‌లోగ్‌లో వచ్చే పాత్రల గురించి మా అమ్మతో చర్చించేదాన్ని. నాటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. – అరుణా చౌహాన్ మొట్ట మొదటి సీరియల్ యాంకర్ అశోక్‌కుమార్ ప్రతి ఎపిసోడ్ చివరలో అగ్ర సినిమా నటుడు అశోక్‌కుమార్ స్క్రీన్ మీద కనిపించేవారు. కథలో, వాస్తవంలో జరుగుతున్న పరిణామాలను, రాబోయే ఎపిసోడ్లో జరిగే విషయాన్ని చాలా క్లుప్తంగా, ఆలోచనాత్మకంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుపోయేలా చెప్పేవాడు. అందుకే అందరికీ అశోక్‌కుమార్ ఒక సలహాదారుడిలా, తమ కుటుంబ సన్నిహితుడిలా అనిపించేవారు. అశోక్‌కుమార్ 50 ఏళ్ల సినీ జీవితంలో కంటే 18 నెలల హమ్‌లోగ్ సీరియల్ తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అశోక్‌కుమార్ స్టైల్‌గా, గంభీరంగా కనిపించడానికి సన్‌గ్లాసెస్ పెట్టుకుంటున్నాడు అనుకునేవారు అంతా. కానీ, తన ముందు టెలీప్రామ్టర్లోని అక్షరాలు కనపడటానికి గ్లాసెస్ ధరించేవాడని ప్రేక్షకులెవ్వరికీ తెలియదు. మూలం... మెక్సికన్ సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ జూలై 7 1984 ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. దీనిని మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో(V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకున్నారు. నాటì ప్రసారశాఖ మంత్రి వసంత్ సాథే మైండ్‌లో రూపుదిద్దుకున్న ఆలోచనకు దృశ్య రూపం కల్పించారు రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌లు. -
కార్తీక దీప
ప్రేమి విశ్వనాథ్ అంటే మనవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ‘కార్తీకదీపం’ సీరియల్ ‘దీప’ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నల్లటి రూపంతో చిన్నితెర మీద ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ పుట్టినిల్లు కేరళలోని ఎర్నాకులం. మలయాళం టెలివిజన్‌లో ‘కరతముత్తు’ (తెలుగు కార్తీక దీపం) అనే సీరియల్ ద్వారా ప్రేమి అక్కడివాళ్లకు కార్తీకగా పరిచమయ్యింది. బ్లాక్బ్యూటీగా మనవారిచేత అభినందనలు అందుకుంటున్న దీప ఆఫ్‌స్క్రీన్‌లో ఫెయిర్‌గా ఉంటుంది. అంతే ఫెయిర్‌గా తన మనసులోని విషయాలను పంచుకుంటుంది. సీరియల్లో ఈ పాత్రను మీరెలా ఒప్పుకున్నారు? సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కూడా గ్లామర్‌నే చూపిస్తుంది. ఫెయిర్‌గా ఉండే హీరోయిన్సే ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. అయితే, ఈ సీరియల్లోని ప్రధాన పాత్ర ఒంటి రంగు నలుపుగా ఉండటం ఇందులోని కాన్సెప్ట్. దాన్నే సవాల్‌గా తీసుకున్నాను. తెలుగు సీరియల్లో డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) భార్యగా నటించాను. మీ గురించి తెలుసుకోవచ్చా? మా అమ్మనాన్నలు విశ్వనాథ్, కాంచన. భర్త డా.టి.ఎస్.వినీత్ భట్. అతను ప్రముఖ ఆస్ట్రాలజర్. నేను లా చేశాను. కొచ్చిలో ఒక ప్రైవేటు సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసేదాన్ని. మా అన్నయ్య శివప్రసాద్ ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్ కూడా. ఆ విధంగా నాకూ ఫొటోగ్రఫీ అబ్బింది. పెళ్లిళ్లకు ఫొటోలు తీసేదాన్ని. ఫొటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. నేనో ట్రావెల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. ‘కరతముత్తు’ (మలయాళం సీరియల్) లో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడింది. ‘దీప’ గురించి చెప్పండి.. ‘కరతముత్తు’ సీరియల్ 2013లో మలయాళం టెలివిజన్‌లో మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో 2017లో రీమేక్ అయ్యింది. ‘కరతముత్తు’లో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీప (కార్తీకదీపం) క్యారెక్టర్‌కి అంతే మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ కోసం మేకప్‌కి, క్యాస్టూమ్స్కి కనీసం రెండు గంటలు పడుతుంది. నా కుటుంబం, స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం సీరియల్ ద్వారానే. ఈ సీరియల్ ద్వారా ఏషియానెట్ టెలివిజన్ అవార్డ్, స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యూచర్ గురించి ఫుల్ టైమ్ యాక్టర్‌గానే ఉంటాను. ఈ సీరియల్ ఉన్నంతవరకు ఇందులోనే కొనసాగుతాను. సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్లో మార్పుల కోసం నేనూ చర్చలో పాల్గొంటుంటాను. కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటాను. ఆ తర్వాత అంటారా.. ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను. సినిమాల్లో యాక్ట్ చేయచ్చు. నేను డ్యాన్సర్‌ని కూడా. స్టేజ్ షోల మీద నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాను. -
టీవీ వచ్చిందోయ్ సీరియల్ తెచ్చిందోయ్
ఒక ఇంట్లో... ‘దీపను కార్తీక్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో సీరియల్ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా అనుకుంది వంట చేస్తున్న శ్రావణి.మరో ఇంట్లో...‘అసలా సమీర్ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్ కోకిల జోడీ మాత్రం సూపర్ కదా..’ చాటింగ్‌లో ఫ్రెండ్‌ను అడుగుతోంది కాలేజీ అమ్మాయి కోమలి.వేరే ఇంట్లో...‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలే... తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ కళ్లజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకుంటూ అంది మనవారిలితో బామ్మ అన్నపూర్ణమ్మ. టీవీ సీరియల్స్‌లో వచ్చే కథలు తమవే అయినట్టు, అందులోని పాత్రలు తమ మధ్యే తిరుగుతున్నట్టు, తమలోనే ఉన్నట్టు ఆవాహన చేసుకుంటోంది. నిన్నటి, నేటి తరం.నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్థరాత్రి వరకు వరుసపెట్టి చూస్తూ, వాటి గురించి మాట్లాడుకునే బామ్మలు, భామలు ఇటు అనకాపల్లి నుంచి అటు అమెరికా దాకా ఉన్నారు. ‘ఆ సీరియళ్ల ధ్యాసలో పడి మొగుడికి వేళకింత తిండిపెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఈ ఆడాళ్లకు’ అంటూ మగవాళ్లు కస్సుబుస్సుమన్నా ‘ప్రకటనల గ్యాప్‌లో కాపురాలను కానిచ్చేస్తున్నారు..’ అని కామెడీ మతాబులు పేల్చినా.. సీరియళ్ల ప్రవాహానికి అడ్డుగా నిలిచే శక్తి ఎవ్వరికీ లేదన్నది నేటి టీవీ సీరియళ్ల టీఆర్పి రేటింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. జీళ్లపాకం సీరియల్స్ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్ మిస్సవ్వకుండా చూస్తున్నవారే ఎక్కువ. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలయ్యింది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం. రేడియో నుంచి టీవీకి ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్ లైట్’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగుతూ ఉంటుంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్ 30, 1952 నుంచి సెప్టెంబర్ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారం అయ్యింది. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ డ్రామాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్ అమెరికా బ్రాడ్కాస్ట్ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది. అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్ ట్రెండ్ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్) తయారీదారులు స్పాన్సర్ చేసేవారు. అందుకే వీటికి సోప్ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత్తర్వాత ‘సోప్ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది. మన నట్టింట్లో మొదటి అడుగు ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. 1980ల నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబనియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం .. వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని రూపుదిద్దారు. ఈ కథను మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో (V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకొని మనవారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 1982లో నాటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి వసంత్ సాథే మెక్సికన్ పర్యటనకు వెళ్లి అక్కడ ‘వెన్ కన్‌మిగో’ చూసి ఇండియాలోనూ ఈ తరహా కార్యక్రమం ప్రసారం చేయాలనే ఆలోచన చేశారట. దీంతో రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ వచ్చిన 17 నెలల్లో నటుడు అశోక్‌కుమార్‌కు ‘మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామ’ని 4 లక్షల మంది అమ్మాయిలు ఉత్తరాలు రాశారు. దానిని బట్టి ఈ సీరియల్ ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. రెండవ అడుగు ‘ఏ జో హై జిందగీ’ పేరుతో 1984లో కేవలం 67 ఎపిసోడ్స్‌తో హాస్య ధారావాహిక రూపొందింది. భార్యాభర్తలైన రంజిత్‌వర్మ, రేణు వర్మల మధ్య చోటు చేసుకునే ఫన్నీ సందర్భాలను దీంట్లో చూపించారు. ‘హమ్‌లోగ్’ ముగిసిన ఐదు నెలలకు (మే 1986) ‘బునియాద్’ సీరియల్ ప్రారంభమైంది. 1947లో ఇండియా–పాకిస్తాన్ విభజన నాటి సామాజిక స్థితిగతుల ఆధారంగా ఈ కథను నడిపించారు రచయిత కమల్సైగల్. దానికి అందమైన దృశ్యరూపం ఇచ్చారు దర్శకులు రమేష్ సిప్పి, జ్యోతీ స్వరూప్. ఉద్యోగాలు చేసుకునే ఒంటరి మహిళలు ఒకింట్లో పెయింగ్గెస్ట్గా చేరడం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సరదా విషయాలను ‘ఇధర్ ఉధర్’ (1985) లో చూపించారు. ఇదే సీరియల్‌ను తిరిగి 1998లో రెండవ సీజన్‌గా ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్స్ ట్రెండ్‌ను ఓ ఊపు ఊపినవి.. అశేష జనాన్ని టీవీల ముందు కట్టిపడేసినవి ఇతిహాసాలైన రామాయణ్ (1987–1988), మహాభారత్ (1989–1990)లు. ఒక ఆధ్యాత్మిక భావనను ఈ రెండు సీరియళ్లు ప్రతి మదిని తట్టిలేపాయి. దేవతలే తమ నట్టింటికి వచ్చి అలనాటి కథను చూపుతున్నట్టు ఫీలయ్యారు జనం. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, హారతలు పట్టారు. 1980 నుంచి 90ల కాలంలో బుల్లితెర పై దూరదర్శన్ సీరియల్స్‌కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి వరుస క్రైమ్ థ్రిల్లర్ది. ‘కరమ్‌చంద్’, ‘బ్యోంకేశ్ బక్షీ’, జాన్కీ జాసూస్’తో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న చంద్రకాంత, చాణక్య, జనం నాడితో ఫీట్లు చేయించిన సర్కస్ .. వంటి సీరియల్స్‌తో ప్రతి ఇంటా బుల్లితెర ఓ అనివార్యమైన వస్తువయ్యింది. మూడవ అడుగు అప్పటివరకు సామాజిక పరిస్థితులు, చారిత్రకాంశాలమీద ఫోకస్‌పెట్టిన సీరియళ్ల కన్ను ఆటపాటలు, పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లల వైపు మళ్లింది. ఇది బుల్లితెర వామనుడి మూడవ అడుగుగా చెప్పవచ్చు. బామ్మలు చెప్పిన కథలకు దృశ్యరూపం బుల్లితెర ఆకాశమే హద్ధయ్యింది. మాల్గుడి డేస్, విక్రమ్ బేతాల్, తెనాలి రామకృష్ణ.. వంటి సీరియల్స్ పిల్లలు ఎక్కడున్నా సమయానికి లాక్కొచ్చి కూర్చోబెట్టేవి. పెద్దలనూ టీవీల ముందు నుంచి కదలనిచ్చేవి కావు. ఈ మూడవ అడుగుతో సీరియల్ అన్ని తరాలనూ తన వైపు తిప్పుకుంది. హిందీ సీరియల్స్‌తో నార్త్ టు సౌత్‌ను ఆకట్టుకుంటున్న మన బుల్లితెర ఆ తర్వాత మరాఠీ, గుజారాతీ, బెంగాలి, తమిళ, కన్నడ, ఒడియా, తెలుగు, మలయాళం.. ఇతర అన్ని భాషలలో సీరియళ్లని చూపించడం మొదలుపెట్టింది. (వచ్చేవారం మరికొంత) – నిర్వహణ: నిర్మలారెడ్డి -
సోషల్ మీడియాకు గట్టి పోటీ ఇస్తున్న టీవీ
ఫేస్బుక్,వాట్సాప్,యూట్యూబ్,హాట్‌స్టార్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని,అందులోనూ దక్షిణ భారతీయులు ఈ విషయంలో ముందున్నారని తాజా సర్వేలో తేలింది.అంతేకాకుండా ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలోనే ఎక్కువ టెలివిజన్లు ఉన్నాయని కూడా బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడయింది.దక్షిణ భారత దేశంలో 99.9% ఇళ్లకు విద్యుత్ సదుపాయం ఉండటం, దక్షిణ భారతీయులు మొదట కొనే గృహోపకరణం టీవీయే కావడం దీనికి కారణమని బార్క్ సీఈవో దాస్‌గుప్తా తెలిపారు. 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేసి బార్క్‘బ్రాడ్కాస్ట్ ఇండియా సర్వే(2018) పేరుతో నివేదిక విడుదల చేసింది.దాని ప్రకారం ఐదు దక్షిణ రాష్ట్రాల్లో 95శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25 కోట్ల 90 లక్షల టీవీలు ఉన్నాయి.2016తో పోలిస్తే ఇది 8శాతం ఎక్కువ. ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో22.1 కోట్లు, తూర్పు భారతంలో14.6 కోట్ల టీవీలు ఉన్నాయి.దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది. దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో19.7 కోట్లకు చేరింది.2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ.అలాగే, టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా83.6 కోట్లకు(7.2% ఎక్కువ) చేరింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది రోజులో 4 గంటల పది నిముషాలు,గ్రామీణ ప్రాంతాల్లో3 గంటల 27 నిముషాలు టీవీ చూస్తున్నారు. దక్షిణ భారతంలో టీవీ చూసే సమయం ఏటా పెరుగుతోంది.2016 నుంచి టీవీ ప్రేక్షకుల సంఖ్య 12శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 10శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 4% పెరిగింది. దేశంలో టీవీలు ఉన్న ఇళ్ల సంఖ్య పట్టణాలు గ్రామాలు 2016 8 కోట్ల 40 లక్షలు 8 కోట్ల 70 లక్షలు 2018 9 కోట్ల 90 లక్షలు 10 కోట్ల 90 లక్షలు -
టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. చావుకు దగ్గరైనట్టే
మాంచెస్టర్ : తీరిక సమయంలో చాలా మంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్ కావడానికి అయితే ఫరవాలేదు కాని అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వటమే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టీవీ తెరను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్లాండ్కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ గ్లస్గో’’ జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గ్లస్గో విశ్వవిద్యాలయం దాదాపు 4 లక్షల మందితో అతిపెద్ద సర్వేని నిర్వహించింది. శారీరికంగా దృఢంగా లేని వాళ్లు, కండరాళ్ల సత్తువ లేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఎక్కువ సేపు అలా టీవీ తెరను చూస్తూ ఉండటం వల్ల గుండె సంబంధ, ప్రేగు క్యాన్సర్, డయాబెటీస్, ఒబిసిటీ వంటి వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం టీవీ తెరకు మాత్రమే కాదు కంప్యూటర్ తెరకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం విషయానికి వస్తే అందరిపై ఒకే విధంగా ఉండదు. టీవీ, కంప్యూటర్ ను చూస్తున్నపుడు ఎంత విరామం తీసుకుంటున్నారు. శారీరకంగా వారు ఎంత బలంగా ఉన్నారు, ఆరోగ్యపు అలవాట్లు , శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. -
'ఇంతకన్నా గొప్ప ఆదివారం రాదు'
బాహుబలి 2 సినిమా వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే ఒకేసారి మూడు భాషల్లో టీవీ ప్రసారానికి రంగం సిద్ధం చేసింది. ఎలాంటి పండుగ సీజన్ కాకపోయినా.. బాహుబలి ప్రదర్శనే ఓ పండుగు అన్నట్టుగా ప్రచారం చేశారు చిత్రయూనిట్. ఆదివారం (08-10-2017) హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెండు గంటల తేడాతో సినిమాను ప్రసారం చేయనున్నారు.స ఈ ప్రీమియర్స్ షోస్ పై హీరో ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్ లో బాహుబలి 2 సినిమాను టీవీలో చూసి ఆనందించాలని కోరిన ప్రభాస్, ఇంతకంటే గొప్ప ఆదివారం రాదంటూ కామెంట్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది. -
బెడ్రూమ్లో టీవీ ఉందా? అయితే చదవండి!
వాషింగ్టన్(యూఎస్ఏ): చదువుకునే పిల్లలున్న ఇంట్లో టీవీ ఎక్కడుండాలి? బెడ్రూంలో మాత్రం కచ్చితంగా ఉండొద్దంటున్నారు పరిశోధకులు. ఒకవేళ పడక గదిలోనే టీవీ ఉంటే బోలెడన్ని అనర్థాలు జరుగుతాయని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. ఇయోవా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై విస్తృత అధ్యయనం చేసి, విస్తుగొలిపే వాస్తవాలను వెలికితీశారు. టీవీ కానీ, వీడియో గేమ్ సిస్టమ్ కానీ బెడ్రూంలో ఉంటే.. పిల్లలు వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తారని... ఫలితంగా నిద్ర సమయం, చదువుకునే సమయం తక్కువై చివరికి ఈ ప్రభావం వారి మార్కులపై పడుతుందని తేలింది. అంతేకాదు, ఇలాంటి చిన్నారులు అంతచురుగ్గా ఉండలేరని, అంతిమంగా ఊబకాయం బారినపడతారని వెల్లడయింది. ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వివిధ అంశాల్లో చిన్నారుల పనితీరును అధ్యయనంగా చేయగా ఈ విషయాలు రూఢీ అయ్యాయి. ఈ పిల్లల్లో హింసాప్రవృత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. దుందుడుకుగా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు..తమ పిల్లల్లో ఇలాంటి మార్పులను అంతగా పట్టించుకోవటం లేదు. బెడ్రూంలో టీవీలు చూసే అలవాటున్న పిల్లలు.. విద్యా సంబంధ, క్రీడా సంబంధ కార్యక్రమాలపై అంతగా ఆసక్తి చూపరు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల జోక్యం కూడా తక్కువగానే ఉంటుంది. పిల్లలే తమకు నచ్చిన కార్యక్రమాలను చూస్తుంటారు. దీనిపై తల్లిదండ్రులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఇలాంటప్పుడు వారికి చదువుకునే సమయం కూడా తక్కువగానే ఉంటుంది. వారంలో సరాసరిన 60 గంటలపాటు చిన్నారులు టీవీల ముందే గడిపేస్తున్నారు. స్మార్టుఫోన్లు కూడా ఇంతే ప్రభావాన్ని పిల్లలపై చూపుతున్నాయని వర్సిటీ ప్రొఫెసర్ డగ్లస్ జెంటిల్ తెలిపారు. దేశంలోని 4-6 ఏళ్ల గ్రూపులోని 40 శాతం మంది చిన్నారుల ఇళ్లల్లోని బెడ్రూంలలో టీవీ లేదా వీడియోగేమ్ ఉన్నట్లు తేలింది. అయితే, చాలామంది తల్లిదండ్రులు మాత్రం టీవీ బెడ్రూంలో ఉంటే ఏంటి, ఇంకే రూంలో ఉంటేనేం అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. బెడ్రూంలో టీవీలు లేని ఇళ్లలోని చిన్నారులు చదువులో ముందుండటంతోపాటు ఆటలు ఆడటం వల్ల చురుగ్గా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమని ఆయన అంటున్నారు. తాజాగా, డెవలప్మెంటల్ సైకాలజీ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. -
త్రిపుర సీఎం ప్రసంగానికి దూరదర్శన్ నో!
అగర్తలా: దూరదర్శన్, ఆలిండియా రేడియో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించాయని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. ప్రసంగ పాఠంలో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామని అవి చెప్పటం అప్రజాస్వామిక, నిరంకుశ, అసహన చర్య అని అభివర్ణించారు. త్రిపుర ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ప్రకటన ప్రకారం...డీడీ, ఆకాశవాణి ఆగస్టు 12నే సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. అయితే అందులో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామంటూ సోమవారం సీఎం కార్యాలయానికి లేఖ వచ్చింది.‘సీఎం ప్రసంగాన్ని అధికారులు పరిశీలించారు. ప్రస్తుత రూపంలో దాన్ని ప్రసారం చేయలేం. ప్రజల సెంటిమెంట్లు, సందర్భోచితంగా సీఎం తన సందేశంలో మార్పులు చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు. అయితే తన ప్రసం గంలో అక్షరం కూడా మార్చడానికి సీఎం ఒప్పుకోలేదని ఆయన కార్యాలయం చెప్పింది. -
ఇక బుల్లితెరపై రాణా సందడి
బంజారాహిల్స్: బుల్లితెరపై ప్రముఖ సినీనటుడు రాణా దగ్గుబాటి సందడి చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమయ్యే సరికొత్త నూతన టాక్ షో ‘నెం.1 యారి విత్ రాణా’లో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాస్తవ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన వ్యక్తుల మధ్య ఉన్న స్నేహబంధాలను ఈ టాక్‌షోలో ఆయన ప్రస్తావించనున్నారు. నంబర్ వన్ యారి అనేది విలక్షణతో కూడిన మనోరంజన కార్యక్రమమని, ఇందులో సోదర బంధం, స్నేహబంధాల స్ఫూర్తి ఉంటుందని రాణా తెలిపారు. -
అంధులకు టీవీ
లండన్: టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలను అంధులు, బధిరులు ఆస్వాదించేందుకుగాను శాస్త్రవేత్తలు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ‘ప్రీవాసివ్ ఎస్‌యూబీ’ అనే సాఫ్ట్వేర్ టీవీల్లో వచ్చే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన సబ్‌టైటిల్స్‌ను దీనికి అనుసంధానంగా ఉన్న సర్వర్‌కు చేరవేస్తుంది. ఈ సబ్‌టైటిల్స్‌ను బ్రెయిలీ లిపిలోకి మార్పుచేసి స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌కు పంపుతారు. బ్రెయిలీ లిపిలోని వీటిని చదివేందుకు ప్రత్యేకమైన యాప్‌ను యూజర్లు తమ డివైజ్‌ల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతం దీన్ని మాడ్రిడ్‌లోని స్పానిష్ చానల్స్‌లో వాడుతున్నారు. దీన్ని ఉపయోగించుకునేందుకు ఎటువంటి రుసుము అవసరం లేదని తెలిపారు. -
పారితోషికం తీసుకోకుండా నటించను
ఈ రంగంలో నేనుంది డబ్బుకోసమే. పారితోషికం తీసుకోకుండా నేను నటించను అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్. ఒక పక్క విశ్వరూపం–2 చిత్ర విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఆయన మరో పక్క తన తాజా చిత్రం శభాష్‌నాయుడు బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలోనూ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ విశ్వనటుడు తాజాగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ పోటీ కార్యక్రమం తమిళంలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని టీజర్ బుధవారం ఆ టీవీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్ బుల్లితెరకు పరిచయం కావడం గురించి క్లారిటీ ఇస్తూ డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారమెత్తాను అని చెప్పారు. డబ్బు కోసమే తానీరంగంలో ఉన్నానని, పారితోషికం తీసుకోకుండా తాను నటించనని అన్నారు. ఇక బుల్లితెరకు పరిచయం అవడం వల్ల డబ్బుతో పాటు సినిమాలకంటే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరవ్వొచ్చని అన్నారు. ఇలా రెండూ ఒకే చోట లభించడంతో ఎవరు మాత్రం వద్దంటారని కమలహాసన్ ప్రశ్నించారు. అందుకే బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉత్సాహంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
పారితోషికం తీసుకోకుండా నటించను
ఈ రంగంలో నేనుంది డబ్బుకోసమే. పారితోషికం తీసుకోకుండా నేను నటించను అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్. ఒక పక్క విశ్వరూపం–2 చిత్ర విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఆయన మరో పక్క తన తాజా చిత్రం శభాష్‌నాయుడు బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలోనూ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ విశ్వనటుడు తాజాగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ పోటీ కార్యక్రమం తమిళంలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని టీజర్ బుధవారం ఆ టీవీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్ బుల్లితెరకు పరిచయం కావడం గురించి క్లారిటీ ఇస్తూ డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారమెత్తాను అని చెప్పారు. డబ్బు కోసమే తానీరంగంలో ఉన్నానని, పారితోషికం తీసుకోకుండా తాను నటించనని అన్నారు. ఇక బుల్లితెరకు పరిచయం అవడం వల్ల డబ్బుతో పాటు సినిమాలకంటే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరవ్వొచ్చని అన్నారు. ఇలా రెండూ ఒకే చోట లభించడంతో ఎవరు మాత్రం వద్దంటారని కమలహాసన్ ప్రశ్నించారు. అందుకే బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉత్సాహంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
అంతులేని కథలు..
టీవీ సీరియళ్లు కొన్ని ఏళ్లకేళ్లు సాగుతుంటాయి. ఆ కథలకు అంతుండదు. ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తాయో నిర్వాహకులే చెప్పలేరు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఒకవేళ వీక్షకుల్ని ఆకట్టుకోకపోతే, ఉన్నట్టుండి సీరియల్‌ను ముగించేస్తారు. కొన్ని సీరియళ్లు, మాత్రం వీక్షకుల ఆదరణతో ఏళ్ల తరబడి సాగుతుంటాయి. మధ్యలో చిన్న విరామం తీసుకున్నప్పటికీ, అదే కాన్సెప్టుతో కూడిన కొత్త సిరీస్‌ని మళ్లీ మొదలెడతారు. దీంతో అవి దశాబ్దాలపాటు సాగుతుంటాయి. ఇలా టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. ద గైడింగ్ లైట్ (57 ఏళ్లు).. టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ ఇదే. అమెరికాకు చెందిన సీబీఎస్ చానెళ్లో ఈ సీరియల్ దాదాపు 57 ఏళ్ల పాటు ప్రసారమైంది. అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన సీరియల్ కాబట్టి, దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1952 జూన్ 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, 2009, సెప్టెంబర్ 18న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. బుల్లితెరపై ప్రసారం కాక ముందు 1937 నుంచి పదిహేనేళ్లపాటు ఇది అమెరికాలోని ఎన్బీసీ రేడియోలో టెలికాస్ట్ అయ్యింది. అటు టీవీలో, ఇటు రేడియోలో ప్రసారమైన ధారావాహికగా చూస్తే ఇది 72 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం 18,262 ఎపిసోడ్లుగా ఇది వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రారంభంలో రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే ప్రేక్షకుల ఆదరణ బావుండడంతో క్రమంగా అరగంట, గంటపాటు కూడా ప్రసారమైంది. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ సీరియల్ 2009లో ఆగిపోయింది. యాజ్ ద వరల్డ్ టర్న్స్ (54 ఏళ్లు) టీవీ ప్రేక్షకుల్ని అత్యధిక కాలం అలరించిన రెండో సీరియల్ యాజ్ ద వరల్డ్ టర్న్స్. 54 ఏళ్లపాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ 1956 ఏప్రిల్ 2న ప్రారంభమైంది. చివరి ఎపిసోడ్ 2010, సెప్టెంబర్ 17న ప్రసారమైంది. అమెరికాలోని సీబీఎస్ చానెళ్లో ఇది ప్రసారమయ్యేది. ఇర్నా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ యాజ్ ద వరల్డ్ టర్న్స్ను ‘ద గైడింగ్ లైట్’కి సిస్టర్ షోగా పిలిచేవారు. ఈ సీరియల్ ఎక్కువగా న్యూయార్క్‌లోని మన్హట్టన్లోనే షూటింగ్ జరుపుకొంది. 1956లో ఇది రోజూ మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. ఆ తర్వాత రోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మారి, అరగంట ప్రసారమయ్యేది. పన్నెండేళ్ల ప్రసారమయ్యాక వీక్షకుల ఆదరణ బావుండడంతో గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సీరియల్ పూర్తయ్యేవరకు దాదాపు 13,000 ఎపిసోడ్లు ప్రసారమైంది. జనరల్ హాస్పిటల్ (54 ఏళ్లు).. 1963 ఏప్రిల్ 1న తొలిసారిగా ప్రారంభమైన ఈ అమెరికన్ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతుండడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 54 ఏళ్లుగా జనరల్ హాస్పిటల్ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకుని, తర్వాత కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీవీ హిస్టరీలో అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్గానే కాక, అత్యధిక కాలం నిర్మాణంలో ఉన్న సీరియల్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఫ్రాంక్ అండ్ డోరిస్ హర్స్‌లీ అనే దంపతులు దీనికి రచన చేశారు. పోర్ట్ చార్లిస్ అనే ఒక కల్పిత నగరంలోని హాస్పిటల్ నేపథ్యంగా ఈ సీరియల్ సాగుతుంది. 2003లో టీవీ గైడ్ అనే ఓ సంస్థ జనరల్ హాస్పిటల్‌ను సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ (44 ఏళ్లు).. అమెరికాలోని సీబీఎస్ చానళ్లో ప్రసారమవుతున్న ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ 44 ఏళ్లుగా కొనసాగుతుండడం విశేషం. తొలి ఎపిసోడ్ 1973 మార్చి 26న ప్రసారమైంది. అప్పటినుంచి 1980 వరకు వారానికి ఐదు రోజుల చొప్పున, రోజూ అరగంటపాటు ఇది ప్రసారమయ్యేది. అనంతరం ప్రసార సమయం గంటకు పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ 11 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం స్థానిక చానళ్లలో ఇది ప్రసారమవుతోంది. విస్కన్సిన్ రాష్ట్రంలోని జినోవా అనే ఒక కల్పిత నగరంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతోంది. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ (51 ఏళ్లు).. 1965లో తొలిసారిగా ప్రసారమైన డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అమెరికాలోని ఎన్బీసీ చానళ్లో 1965, నవంబర్ 8న ఈ సీరియల్ ప్రారంభమైంది. 51 ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 13,032 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1965 నుంచి 1975 వరకు తొలుత రోజు అరగంట మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ప్రేక్షకాదరణ బావుండడంతో 1975 ఏప్రిల్ 21 నుంచి రోజూ అరగంటపాటు ప్రసారమయ్యేది. సాలెమ్ అనే ఒక కల్పిత నగరంలో ఉండే కొన్ని కుటుంబాలు, వారి మధ్య సంఘర్షణలతో ఈ సీరియల్ రూపొందింది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇది ప్రసారమైంది. 2013 వరకు ఆన్లైన్లో డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ రీ టెలికాస్ట్ అయ్యేది. వన్ లైఫ్ టు లివ్ (45 ఏళ్లు).. ఇది కూడా అమెరికన్ సీరి యలే. 1968 నుంచి 2012 వరకు దాదాపు 45 ఏళ్లపాటు ఇది ప్రసారమైంది. అమెరికాలోని ఏబీసీ చానళ్లో 1968 జూలై 15న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, చివరి ఎపిసోడ్ 2012 జనవరి 13న ప్రసారమైంది. కానీ చివరి సిరీస్‌ను 2013 ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఆన్లైన్లో ప్రసారం చేశారు. పెన్సిల్వేనియాలోని లియాన్ వ్యూ అనే ఒక కల్పిత నగరంలోని కొంత మంది వ్యక్తుల జీవితంలోని సంఘటనల ఆధారంగా వన్ లైఫ్ టు లివ్ సాగుతుంది. 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించి, అత్యధిక కాలం ప్రసారమైన ఐదో సీరియల్‌గా నిలిచింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మా ఇంట్లో టీవీ కూడా లేదు: హీరోయిన్
లండన్: తన ఇంట్లో టీవీ కూడా లేదని ‘ఐరన్ మాన్ 3’ సినిమా హీరోయిన్ రెబెకా హాల్ వెల్లడించింది. పాత ఫ్యాషన్లకే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. న్యూస్ పేపర్ల ద్వారానే సమాచారం తెలుసుకుంటానని 34 ఏళ్ల రెబెకా చెప్పింది. ‘టీవీలో న్యూస్ చూడడానికి ఇష్టపడను. అందుకే మా ఇంట్లో టీవీ లేదు. పాత తరం వారిలా దినపత్రికలు చదవడానికే ఇష్టపడతాన’ని ఆమె తెలిపింది. ప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చినందుకే ‘ఐరన్ మాన్ 3’ సినిమాలో నటించానని చెప్పింది. తాజాగా ‘క్రిస్టీన్’ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. 1974లో టీవీ ప్రత్యక్ష ప్రసారంలో తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఫ్లోరిడా న్యూస్ కాస్టర్ క్రిస్టీన్ చబ్ బక్ ప్రాత్రలో ఆమె నటించింది. ‘ఇందులో నటించడానికి ముందు ఎప్పుడు చబ్ బక్ పేరు వినలేదు. ఈ సినిమా స్క్రిప్ట్ నన్ను ఎంతోగానే కదిలించింది. వెంటనే నా అంగీకారం తెలిపాన’ని రెబెకా హాల్ వెల్లడించింది. -
బుల్లితెరకు ప్రభుత్వ ప్రోత్సాహం
-
బుల్లితెరకు ప్రభుత్వ ప్రోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో: బుల్లితెరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన బుల్లితెర పెద్ద పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మమోహన 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పద్మమోహన టీవీ అవార్డ్స్–2016 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కళలు, కళాకారులు, టీవీ, సినీ రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తోందని చెప్పారు. టీవీ రంగం అభివృద్ధికి అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం మద్దతుగా ఉంటోందన్నారు. టీఎస్ఎల్సీ డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ టీవీ రంగంలో పనిచేసేవారి కోసం ప్రభుత్వం టీవీ నగర్ ఎస్టాబ్లిష్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని రకాల సౌకర్యాలు తక్షణమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ అవార్డ్స్ బాధ్యతలను పెంచుతాయన్నారు. సినీ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పద్మమోహన సంస్థ నిర్వాహకులు సాంస్కృతిక సేవే కాకుండా ప్రజాసేవ కూడా చేయాలని సూచించారు. ప్రత్యేక సత్కారాన్ని సాక్షి టీవీ జర్నలిస్టు స్వప్న అందు కున్నారు. బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్‌ను సాక్షి టీవీ న్యూస్ రీడర్ డీవీఎన్ కిషోర్ అందుకున్నారు.అనంతరం ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్‌కి పద్మమోహన్ ప్రతిభా పురస్కా రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, స్పెషల్ జూరీ అవార్డ్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఫిల్మ్ యాక్టర్ సంపూర్ణేష్‌బాబు, టీ న్యూస్ ఎండీ జె.సంతోష్ కుమార్, కేఎంఆర్ ఎస్టేట్ ఎండీ కె.మాధవరెడ్డి, పద్మమోహన వ్యవస్థాపకుడు డి.యాదగిరిగౌడ్ పాల్గొన్నారు. -
ఏడ్చింది చాలు ఇక ఏడిపిస్తా - అస్మిత
టెలివిజన్ టాప్ ఆర్టిస్టుల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు అస్మిత. పంజరం, పద్మవ్యూహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాలక్ష్మి... ఇలా ఎన్నో సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారామె. టాలెంట్, తెగువ, తెలివితేటలు, సమయస్ఫూర్తి... అన్నీ సమపాళ్లలో ఉన్న వ్యక్తి ఆమె. తన కెరీర్ గురించి, తన అనుభవాల గురించి అస్మిత సాక్షితో ఇలా పంచుకున్నారు... ఎప్పుడూ సీరియల్స్‌లో కనిపించే మీరు... ఆ మధ్య వార్తల్లో కనిపించారు? అవును. అదో పీడకల. నేను కారులో పోతుంటే కొందరు వెంబడించి వేధించారు. వెంటనే ఫొటో తీసి, షి టీమ్‌కి వాళ్లను పట్టించాను. అప్పటికే రెండు మూడుసార్లు అలాంటివి ఫేస్ చేశాను. ఇంక ఆ రోజు తట్టుకోలేక ఆ పని చేశాను. మీకు ధైర్యం ఎక్కువే? ఆ ధైర్యం ఉండాలి. ఎవరో వచ్చి వేధిస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మన భయం... వాళ్లకు అవకాశం. అదే ధైర్యం చేసి ఎదురు తిరిగితే, వాళ్లే భయపడి పారిపోతారు. అందుకే నేను చెప్తుంటాను... ఆడపిల్లలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, ఆపద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, తెలివిగా అడుగు వేయాలి అని. చాలా డైలీ సీరియల్స్‌లో నిస్సహాయ మహిళగా, జాలిగొలిపే పాత్రలు చేశారు. కానీ స్వతహాగా మీరలా కాదన్నమాట? అవును. సీరియళ్లలో అంటే పాత్రల్ని బట్టి అలా చేయాల్సి వస్తుంది. బయట అలా ఉండను. చెప్పాలంటే సీరియళ్లలో కూడా ఏడ్చీ ఏడ్చీ విసుగొచ్చేసింది. అందుకే ఏడ్చేది కాకుండా ఏడిపించే పాత్ర చేయాలనకున్నా. ‘సీతామాలక్ష్మి’లోని మాలినీదేవి పాత్రతో ఆ కోరిక తీరింది. ఆ సీరియల్ హీరో నాగబాబుగారైతే, ‘నీలో నాకు ఒకలాంటి యారొగెన్స్ కనిపించేది, నెగటివ్ రోల్ బాగా చేయగలవని అనిపించేది, అది నిజమైంది’ అన్నారు. ఇక చూడండి, ఏడ్వను.. ఏడిపిస్తా! ఈ మధ్య పెద్ద వయసు పాత్రలు చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారా లేక అవకాశాలు లేక..? లేదు లేదు... అవకాశాలు లేకపోవడమన్నది ఎప్పుడూ లేదు. కావాలనే చేస్తున్నాను. నిజానికి అవన్నీ మొదట వయసులో ఉన్న పాత్రలు. జనరేషన్స్ మారినప్పుడు నా పాత్ర ముసలిదయ్యింది... అంతే. అసలు నటిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? మాది మార్వాడీల కుటుంబం. మా తాతగారువాళ్లు వ్యాపారరీత్యా కలకత్తాలో ఉన్నప్పుడు, నేను అక్కడే పుట్టాను. నా చిన్నతనంలోనే మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి సెటిలైపోయింది. నాకు చిన్నప్పట్నుంచీ మోడలింగ్ అంటే పిచ్చి. కానీ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఓ జీన్స్ కంపెనీ యాడ్ చేసే చాన్స్ వస్తే నో అన్నారు. అయినా వదలకుండా నేను స్థానికంగా జరిగిన ఓ మోడలింగ్ పోటీలో పాల్గొని గెలిచాను. అప్పుడు ఓకే అన్నారు. దాంతో యాడ్స్‌లో బిజీ అయిపోయాను. ఆ తర్వాత ‘మనుషులు మమతలు’ సీరియల్లో చాన్స్ వచ్చింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదింక. అప్పట్లో సినిమాలూ చేశారు. ఇప్పుడు చేయడం లేదేంటి? ‘మనుషులు మమతలు’ చేస్తున్నప్పుడే ‘మురారి’ సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత వరుసగా లవ్ టుడే, అప్పుడప్పుడు, మధుమాసం, అతిథి... ఇలా వరుసగా కొన్ని చేసుకుంటూ పోయాను. అవన్నీ తెలిసినవాళ్ల ద్వారా వచ్చిన అవకాశాలు. నాకైతే సినిమాలపై పెద్ద ఆసక్తి లేదు. అందుకే హీరోయిన్గా చేసే చాన్స్ వచ్చినా వదిలేశాను. ఈ పరిశ్రమలో మీకు నచ్చేదేంటి... నచ్చనిదేంటి? నటనంటే ఆసక్తి. నటించే అవకాశం ఇచ్చిన పరిశ్రమ అంటే ఇష్టం. ఇక నచ్చనిదంటే... టైమింగ్స్. షెడ్యూల్స్ చాలా టైట్‌గా ఉంటాయి. రోజంతా పని చేస్తూనే ఉంటాం. ఒక్కోసారి చాలా అలసట వచ్చేస్తుంది. మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా మార్పులొచ్చాయి. వాటిలో మంచివీ ఉన్నాయి, బాధ పెట్టేవీ ఉన్నాయి. ముఖ్యంగా నటీనటుల విషయంలో వచ్చిన మార్పు నాకు నచ్చదు. అప్పట్లో మేం నటనను ఎంతో సీరియస్‌గా తీసుకునేవాళ్లం. చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్లం. కానీ ఇప్పటివాళ్లు కాస్త పేరు రాగానే పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్లే వాళ్లు సంవత్సరాల పాటు కొనసాగడం లేదు. ఒకట్రెండు సీరియళ్లు చేసి మాయమైపోతున్నారు. నటనారంగంలో ఆడవాళ్లను తక్కువగా చూస్తారంటారు... నిజమేనా? అదే నిజమైతే మేమంతా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేయగలిగేవాళ్లం కాదు. ప్రతిచోటా మంచీ చెడూ ఉన్నట్టే ఇక్కడే ఉంటాయి. కేవలం చెడునే చూస్తూ మంచిని విస్మరించడం కరెక్ట్ కాదు. కానీ అక్కడ ఉండే వేధింపుల వల్ల టాలెంట్ ఉన్న అమ్మాయిలు ధైర్యంగా రాలేకపోతున్నారని అంటారు కదా? నాకెప్పుడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. అయినా వేధింపులనేవి ఎక్కడ లేవు? ఆఫీసుల్లో లేవా? బస్సుల్లో లేవా? రోడ్డుమీద నడిచి వెళ్తుంటే లేవా? మనం సరిగ్గా ఉండి, మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరన్నది నా నమ్మకం, నేను ఫాలో అయ్యే సిద్ధాంతం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నటించి నటించి బోర్ కొట్టేసింది. ఒకేలాంటి పాత్రలు చేసి విసిగిపోయాను. ఇక చాలు అనిపిస్తోంది. అందుకే యాక్టింగ్‌కి బై చెప్పి ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది. నిజానికి ఐదేళ్ల నుంచీ ఇలా అనుకుంటున్నాను. ఏదో ఒక మంచి రోల్ రావడంతో పోస్ట్‌పోన్ చేస్తున్నాను. ఈ సంవత్సరమైనా అనుకున్నది చేయాలి. కెరీర్ గురించి చెప్పారు. మరి మీ...? (నవ్వుతూ) పర్సనల్ లైఫ్ గురించే కదా! ఆ సెటిల్మెంట్ కూడా ఈ సంవత్సరమే జరుగుతుంది. ఆల్రెడీ నా లైఫ్‌లో ఓ వ్యక్తి ఉన్నారు. త్వరలో ఆయనను పెళ్లి చేసుకోబోతున్నాను. తను ఎవరు, ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్! - సమీర నేలపూడి -
మళ్లీ... శ్వేతాబసు
చిన్నితెర నుంచి వెండితెరకు వచ్చిన శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ బుల్లితెరపై పలకరించనున్నారు. బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడు బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు పాతికేళ్ల వయసులో టీవీ వైపు రావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ ఆ మధ్య ఓ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. మళ్లీ నటిగా బిజీ కావాలనుకుంటున్న శ్వేత ఒకపక్క సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయ త్నిస్తూనే, ‘డర్ సబ్కో లగ్తా హై’ అనే టీవీ సీరియల్ కాన్సెప్ట్ నచ్చి, అందులో నటించడానికి ఒప్పుకున్నారు. మొత్తానికి, 14 ఏళ్ల తర్వాత టీవీలో మళ్ళీ సందడి చేయనున్నారు. సిటీకి కొత్తగావచ్చిన అమ్మాయికి హాస్టల్లో ఎదురైన భయా నక అనుభవాలు ఈ సీరియల్ కథ. -
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
కడప: ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచుల సందర్భంగా బుకింగ్ వ్యవహారాలు నడుపుతున్న నలుగురిని వైఎస్సార్ జిల్లా కడప పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. స్థానికంగా రవీంద్రనగర్‌లో ఓ ఇంటిలో బుకింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్టు అందిన సమాచారంతో డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బుకీలు అనిల్‌కుమార్ రెడ్డి, అల్తాఫ్, అహ్మద్, ఆదిశేషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలకుపైగా నగదు, 4 సెల్ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన బుకీ మాధవరెడ్డి పరారైనట్టు పోలీసులు తెలిపారు. -
బుల్లితెరపై... ‘వేలంటైన్స్’ హంగామా
బుల్లితెరపై ప్రేమికుల రోజు సంబరాలను ప్రతిబింబించేలా జీ చానల్ ‘ప్యార్ మే పడిపోయానే’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన బుల్లితెర సెలబ్రిటీ జంటల సందడితో ఆద్యంతం హుషారుగా సాగిన ఈ ప్రోగ్రామ్‌ను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు చానల్ ప్రతినిధులు తెలిపారు. -
నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత
పింప్రి, న్యూస్‌లైన్ : సీనియర్ సినీ నటుడు ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆత్మారాం భెండే (93) శనివారం పుణే రత్నా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా కూడా ఉన్నారు. భెండే ఇండియన్ నేషనల్ థియేటర్ నుండి తన నటన జీవితాన్ని ప్రారంభించారు. దూరదర్శన్‌లో అనేక లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరాఠీ చలన చిత్రసీమతో పాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో కూడా పని చేశారు. ఆత్మారాంకు నటాచార్య ప్రభాకర్, పజాశేకర్, రంగభూమి జీవన సాఫల్య పురస్కారం, నాట్యదర్పణ, శంకర్రావు ఘుణేకర్, నాట్యభూషణ్, చింతామణరావు కోల్హాట్కర్, నట సామ్రాట్, నానాసాహెబ్ షాటక్ అలాగే 2006-2007లో మహరాష్ట్ర ప్రభుత్వం వారి రాజ్య సాంస్కృతిక పురస్కారం లభించాయి. -
తొలివిజన్
జాన్ లోగీ బైర్డ్ టెలివిజన్‌ను ఎవరు కనిపెట్టారన్న ప్రశ్న వచ్చినప్పుడు రెండు మూడు పేర్లు వినిపిస్తాయి. ఆ ఇద్దరు ముగ్గురి కన్నా ముందు.. చిత్ర ప్రతిబింబం కదలడాన్ని ప్రత్యక్ష ప్రయోగం ద్వారా ప్రదర్శించి చూపింది మాత్రం జాన్ లోగీ బైర్డ్. ఈయన స్కాటిష్ ఇంజినీరు. క్రైస్తవ మతాధికారి కుమారుడు. బైర్డ్ 1888 ఆగస్టు 14న స్కాట్లాండ్ పశ్చిమ తీర ప్రాంతమైన హెలెన్స్బర్గ్లో జన్మించాడు. బైర్డ్ నిత్య రోగి. కానీ చలాకీగా ఉండేవాడు. తెలివైనవాడు. ఆ తెలివి కొన్నిసార్లు అతడి చేత పిల్లచేష్టలు చేయిస్తుండేది. టెలిఫోన్ ఎక్స్ఛేంజి నుంచి రహస్యంగా తన పడక గదికి వైరు లాక్కుని, అక్కడి నుంచి ఆ వీధిలో ఉన్న తన స్నేహితులకు లింకు కలుపుకుని, వారితో ఫోన్లో హస్కు కొడుతుండేవాడు బైర్డ్. అతడి దృష్టిలో అదొక ప్రయోగం. అసలలాంటి ప్రయోగాల మీద ఆసక్తితోనే అతడు స్కాట్లాండ్ టెక్నికల్ కాలేజీలో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో బైర్డ్ చదువుకు అంతరాయం కలిగింది. కాలేజీ లేదు. కొలువూ లేదు. ఏం చేయాలి? సైన్యంలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడు. అవసరమైన పరీక్షలన్నీ చేసి ‘అన్‌ఫిట్’ అని తేల్చేశారు వాళ్లు. ఆ తర్వాత ఎలాగో క్లైడ్ వ్యాలీ ఎలక్ట్రికల్ పవర్ కంపెనీలో సూపరింటెండెంట్ ఇంజినీరుగా చేరాడు. అక్కడా కొన్నాళ్లే. యుద్ధం ముగిసేనాటికి ఏవో రెండు మూడు వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నాడు బైర్డ్. ఆ సమయంలోనే అతడి ధ్యాస ‘టెలివిజన్’ వైపు మళ్లింది. అలాంటి ఒక పరికరాన్ని కనిపెట్టగలిగితే! నిజాకది ఎందరో శాస్త్రవేత్తల దశాబ్దాల కల. దాన్ని బైర్డ్ నిజం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. టెలివిజన్‌ను కనిపెట్టాలన్న ఆలోచన రాగానే బైర్డ్ ఇంగ్లండ్ దక్షిణ తీర ప్రాంతానికి వెళ్లి సంబంధిత శాస్త్రావిష్కరణల విభాగంలో తన పేరు నమోదు చేయించుకున్నాడు. రకరకాల ప్రయోగాలు చేసి 1924 నాటి కల్లా కొన్ని అడుగుల పరిధి వరకు మినుకు మినుకుమనే చిత్రాన్ని ప్రసారం చేయగలిగాడు! 1926 నాటికి కదిలే చిత్రానికి స్పష్టతను, స్థిరత్వాన్ని ఇవ్వగలిగాడు. ఆ ఏడాది జనవరి 26న లండన్‌లోని ఒక పై అంతస్తు గదిలో 50 మంది శాస్త్రవేత్తల సమక్షంలో ప్రపంచంలోనే మొట్టమొదటిదైన టీవీ ప్రసారాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. ఆ తర్వాతి సంవత్సరం ప్రసారాల నిడివిని లండన్, గ్లాస్గో ప్రాంతాల మధ్య 438 మైళ్ల వరకు విస్తరించగలిగాడు! శాస్త్ర పరిజ్ఞాన రంగంలో అదొక పెద్ద విజయం. దాంతో అతడు సొంతంగా ‘బైర్డ్ టెలివిజన్ డెవలప్మెంట్ కంపెనీ’ (బి.టి.డి.సి) స్థాపించాడు. ఏడాదికల్లా ఆ కంపెనీ లండన్, న్యూయార్క్‌ల మధ్య, మధ్య అట్లాంటిక్ సముద్రంలోని ఒక నౌకలోకి టీవీ ప్రసారాలను పంపగలిగింది. బైర్డ్ ఈ ప్రయోగాలన్నీ చేసింది అప్పటికి అందుబాటు లో ఉన్న యాంత్రిక విధానాలతో. మొదట్లో శబ్దం, చిత్రం వేర్వేరుగా ప్రసారం అయ్యేవి. 1930 నాటికి గానీ రెండిటినీ ఏకకాలంలో ప్రసారం చెయ్యడానికి బైర్డ్‌కు సాధ్యపడలేదు. సరిగ్గా అప్పుడే ఎలక్ట్రానిక్ శకం ఆరంభమైంది. దాంతో బైర్డ్ యాంత్రిక విధానానికి ఆదరణ తగ్గి, మార్కోనీ నేతృత్వంలోని ఇ.ఎం.ఐ. (ఎలక్ట్రికల్ అండ్ మ్యూజికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) చేతుల్లోకి టీవీ టెక్నాలజీ వెళ్లిపోయింది. బైర్డ్ కూడా కొంతకాలం ఎలక్ట్రానిక్ విధానాలతో టెలివిజన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఇ.ఎం.ఐ. దూకుడును ైబె ర్డ్ కంపెనీ బి.టి.డి.సి. తట్టుకోలేకపోయింది. ఇవాళ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. ఈ సందర్భంగా టెలివిజన్ ఆవిష్కరణకు ఆద్యుడైన జాన్ లోగీ బైర్డ్ను స్మరించుకోవడం సముచితం. 1996 నవంబర్ 21న తొలి ప్రపంచ టెలివిజన్ ఫోరం సమావేశం జరి గింది. అందుకే ఆ రోజును ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ టెలివిజన్ దినోత్సవం’గా ప్రకటించింది. -
వినోదమొక్కటే చాలదు!
టీవీక్షణం బుల్లితెర ముందు కూర్చుని భలేగా ఎంజాయ్ చేస్తుంటారు బుజ్జిగాళ్లు. టీవీ చూడ్డానికి మించిన సంతోషం మరేమీ ఉండదు వారికి. అందుకే పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలను రూపొందిస్తుంటారు చానెళ్ల యజమానులు. అసలు పిల్లల కోసమే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రత్యేక చానెళ్లు ఉన్నాయి. కార్టూన్ నెట్వర్క్, ఖుషీ టీవీ, నికొలొడియన్, నిక్ జూనియర్, డిస్నీ జూనియర్, జెటిక్స్, పోగో, మా జూనియర్స్, టూన్ డిస్నీ, చింటూ టీవీ, బూమెరాంగ్ అంటూ వందలాది చానెళ్లు చిన్నారులను అలరించడానికే పుట్టుకొచ్చాయి. వీటిలో చిన్నారుల మనుసుల్ని అత్యధికంగా దోచుకున్న చానెల్ నికొలొడియన్. ప్రపంచంలో ఇదే నంబర్‌వన్ కిడ్స్ చానెల్ అని సర్వేలో తేలింది. తర్వాతి స్థానంలో కార్టూన్ నెట్వర్క్ నిలిచింది. ఇక ప్రోగ్రాముల విషయానికి వస్తే... పిల్లలకు మనుషులతో రూపొందించే కార్యక్రమాల కంటే, యానిమేషన్లే ఎక్కువ ఇష్టమని తేలింది. మనుషులతో రూపొందించిన వాటిలో శక్తిమాన్, మిస్టర్ బీన్ లాంటి ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందుకే పిల్లల కార్యక్రమాలను చాలావరకూ యానిమేషన్ రూపంలోనే తెరకెక్కిస్తున్నారు. టామ్ అండ్ జెర్రీ, బగ్స్ బన్నీ, డక్ టేల్స్, రిక్ అండ్ మార్టిన్, ద సింప్సన్స్, డ్రాగన్ బాల్, పవర్ రేంజర్స్, ద జంగిల్‌బుక్, శ్రీకృష్ణ, ఎక్స్‌మెన్, వాకింగ్ విత్ డైనోసార్స్, సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్మాన్ తదితర యానిమేషన్ సిరీస్‌లన్నీ సూపర్ హిట్ అయ్యాయి! పిల్లల షోలే కదా అని లైట్‌గా తీసుకుంటే కుదరదు. బుజ్జిగాళ్లకీ ఓ టేస్ట్ ఉంటుంది. దాన్ని గమనించి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలను వెలువరించాలి. లేదంటే ఫెయిలవడం ఖాయం. స్క్విరల్ బాయ్, వాట్ ఎ కార్టూన్ లాంటి కొన్నింటిని పిల్లలు తిప్పి కొట్టడానికి కారణం అదే. ఆ దెబ్బతో పిల్లలైనంత మాత్రాన ఏది పడితే అది చూడరని తెలిసొచ్చింది చానెళ్లవారికి. వెంటనే కొత్త కథల వేటలో పడ్డారు. సరికొత్త కథనాలకు తెర తీశారు. అయితే ఈ క్రమంలో షోలను కొన్నిసార్లు పక్కదారి పట్టిస్తున్నారు. కొన్ని కిడ్స్ షోలను పరిశీలిస్తే హింస హద్దు దాటినట్టుగా అనిపిస్తోంది. తుపాకులతో కాల్చేయడం, బాంబులు వేయడం, కత్తులు దూయడం, వెంటాడి చంపడం, కుట్రలు పన్నడం, కుతంత్రాలు జరపడం వంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి పిల్లల మీద దుష్ర్పభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు. టీవీ షోలను చూసి పిల్లలు తప్పుడు పనులకు పాల్పడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆమధ్య ఇద్దరు పిల్లలు ఓ టీవీ షోలో చూసి, తమ స్నేహితుడి పట్ల హింసకు పాల్పడ్డారు. మరో చిన్నారి తన ఫేవరేట్ షోలో హీరో వచ్చి కాపాడతాడని ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకున్నాడు. టీవీ ప్రోగ్రాముల ప్రభావం వారి మీద అంతగా ఉంటోందన్నమాట. కాబట్టి పిల్లల కార్యక్రమాలను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. హింసను వారి మనసుల్లో నాటకుండా, విలువలను తెలియజేసేందుకు ప్రయత్నించాలి. అలాగని నీతి పాఠాలు చెప్పమని కాదు. చెడును ప్రేరేపించవద్దని... వినోదంతో పాటు విజ్ఞానాన్నీ, విషయ పరిజ్ఞానాన్నీ కలిగించే కార్యక్రమాలను కూడా పెంచమని! -
నా జీవితమే ఓ పుస్తకం
బుల్లితెర నటి ప్రీతినిగమ్ ‘సంతోషం’, ‘స్టూడెంట్ నంబర్-1’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన ప్రీతినిగమ్‌ను గుర్తుపట్టారా? వెండితెర కంటే బుల్లితెరపై తళుక్కున మెరిసిన తార ఆమె. అద్భుతమైన పాత్రలతో మహిళాభిమానులను సంపాదించుకున్న ప్రీతి తన జీవితమే ఒక పుస్తకం అంటున్నారు. కౌతవరంలో బుధవారం జరిగిన లఘు చిత్రాల షూటింగ్‌కు వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) తెలుగులో మీకు పేరు తెచ్చిన సీరియల్స్..? కస్తూరి, రుతురాగాలు, ఆడది, కావ్యాంజలి, ఎండమావులు, చక్రవాకం, చంద్రముఖి, శ్రావణ సమీరాలు, స్వాతి చినుకులు. సాక్షి : మీ జీవితంలో సాధించిన విజయాలు? ప్రీతి : మొదట్లో నాకు ఈత రాదు. 30ఏళ్ల వయసులో నేర్చుకున్నా. గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఉంది. వంట, ఇంటి పనులు కూడా అందరి మహిళల్లా చేస్తాను. న్యూస్‌రీడర్‌గా కూడా పనిచేశాను. లండన్, మారిషస్, పారిస్, యూఎస్ఏ వంటి దేశాల్లో నృత్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. విద్యార్థి దశలో ఎన్సీసీ, ఫొటోగ్రఫీ, టీటీసీలో కూడా శిక్షణ పొందాను. సాక్షి : సీరియల్స్‌లో లేడీ విలన్‌గా నటించడంపై మీ స్పందన.. ప్రీతి : ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటేనే నేను బాగా నటించినట్లు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? ప్రీతి : మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. భర్త నగేష్‌ది అమలాపురం. ఆయన కూడా నాతో పాటు సీరియల్స్‌లో నటిస్తున్నారు. పాప అతిథిశ్రీ, బాబు ఆర్యన్. సాక్షి : బుల్లితెరలోకి ఎలా అడుగుపెట్టారు. ప్రీతి : నేను డ్యాన్సర్‌ని. సీరియల్స్‌లో నటులకు కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్సులపై శిక్షణ ఇచ్చేదాన్ని. నా కళ్లు పెద్దవిగా ఉంటాయని సీరియల్స్‌లో నటించమని అడిగారు. తొలిసారిగా 1989లో ‘అంబేద్కర్ డాక్యుమెంటరీ’లో బాల్యంలో ఉన్న అంబేద్కర్‌కు అత్తగా నటించా. సాక్షి : డ్యాన్స్‌లో మీ గురువులు ఎవరు? ప్రీతి : కూచిపూడిలో అనిల్‌కుమార్, కథక్ ఏవీ శ్రీధర్ దగ్గర నేర్చుకున్నాను. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్‌లో నటించారు? ప్రీతి : వందకుపైగానే. తొలి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’. అప్పట్లో హిందీ సీరియల్లో కూడా చేశాను. సాక్షి : తొలి సినిమా? ప్రీతి : డెరైక్టర్ శ్యామ్‌బెనగల్‌తో నటించాలని ప్రతి బాలివుడ్ నటికీ ఉంటుంది. ఆయన డెరైక్షన్‌లో 20ఏళ్ల క్రితమే హిందీ ఆర్ట్ ఫిల్మ్‌లో నటించా. హరీబలీ, వెల్డనబ్బా, సంక్రాంతి హిందీ సినిమాల్లో నటించాను. తెలుగులో నా మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబరు 1’ సాక్షి : ఇంకా ఏయే సినిమాలు చేశారు.. ప్రీతి : సంతోషం, శ్రీరామ్, ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు, సై, కబడ్డీ కబడ్డీ, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాల్లో నటించా. ఉర్దూలో ఇటీవల నటించిన ‘ఇన్కీ ఐసీకీతైసీ’ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నెల 14న స్టెప్నీ అనే మరో సినిమా విడుదల కానుంది. అలాగే, ‘ఐలమ్మ’ పేరిట తెలంగాణలో ఓ సందేశాత్మక రియల్ స్టోరీతో సినిమా విడుదలైంది. సాక్షి : కొత్తనటులకు మీరిచ్చే సందేశం? ప్రీతి : అబద్ధంలో కాకుండా నిజంలో బతకాలి. సంస్కృతీ సంప్రదాయాల్ని మట్టు పెట్టే విధంగా నాగరికత పేరిట విచ్చలవిడిగా మారకూడదు. -
డిసెంబర్ 21నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు
ఫిరంగిపురం : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగం అభివృద్ధి సంస్థ (హైదరాబాద్) సౌజన్యంతో డిక్మన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ పాల్స్ పాఠశాలలోని కళావేదికపై డిసెంబర్ 21 నుంచి 23 వరకు జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు పోలిశెట్టి రాజారావు మంగళవారం తెలిపారు. పోటీలో పాల్గొనే నాటికల వివరాలను వెల్లడించారు. 21వ తేదీ మూడు నాటికలు ప్రదర్శిస్తారు. అవి.. హైదరాబాద్ మురళీ కళానిలయం ఆధ్వర్యంలో ‘వార్నీ అదా విషయం’ నాటిక. రచన శంకరంమంచి పార్ధసారథి, దర్శకత్వం తల్లావజ్జుల సుందరం. ఒంగోలు జనచైతన్య ఆధ్వర్యంలో ‘పుత్రికాచితి’ నాటిక. రచన ఏవీ మల్వేశ్వరరావు, దర్శకత్వం ఎల్.శంకర్. చెన్నూరు శాలివాహన కళామందిర్ ఆధ్వర్యంలో ‘చిగురించని వసంతం’, రచన వలమేటి, దర్శకత్వం కె.ఎల్.నారాయణరావు. 22వ తేదీ నాలుగు నాటికలు ప్రదర్శిస్తారు. అవి.. కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘దొంగలు’ నాటిక. రచన పి.శివరామ్, దర్శకత్వం ఎం.రమేష్. నెల్లూరు క్రాంతి ఆర్ట్స్ థియేటర్స్ వారి ‘అస్తమిస్తున్న సూర్యుడు’ నాటిక. రచన పనసాల, దర్శకత్వం టి.సురేష్‌బాబు. తెనాలి డి.ఎల్.కాంతారావు ఎంప్లాయీస్ మెమోరియల్ వారి ‘సముద్రమంత సంతోషం’ నాటిక. రచన సిగ్ద, దర్శకత్వం పి.ఎస్.ఆర్.బ్రహ్మాచార్యులు. కొలకలూరి కళాలయ వారి ‘మాకంటూ ఒకరోజు’నాటిక. రచన, దర్శకత్వం ఎస్.కె.హుస్సేన్. 23వ తేదీ రెండు నాటికలు ప్రదర్శిస్తారు. అవి.. వైజాగ్ గోవాడ సుగర్స్ లిఖితసాయి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘మాకంటూ ఒక రోజు’ నాటిక. రచన, దర్శకత్వం దండు నాగేశ్వరరావు, జయంతి సుబ్రహ్మణ్యంసతీష్. గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘అమ్మకో ముద్దు’ నాటిక. రచన, దర్శకత్వం జీడిగుంట రామారావు, ఎన్.రవీంద్రరెడ్డి. అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రదర్శనకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. -
జీవితం నేర్పే పాఠాలు
ఆకాశవాణి, దూరదర్శన్లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ అనంతరం మాత్రం పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్ని రోజులు తెల్లవారుఝామునే తయారు కావాల్సి వస్తోంది. నేనైతే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నా కాని, నన్ను స్టూడియోలకు తీసుకువెళ్లడానికి వచ్చే ఛానెల్ కారుడ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి, ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. వీళ్లలో రకరకాల వయస్సు వాళ్లు ఉంటారు. పొరుగుజిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి, స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని, బతుకుబండి లాగించేవాళ్లే ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను అనుకోలేదు. వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. కొందరు ‘‘ఎందుకు సార్, మా డ్యూటీ మేం చేస్తున్నాం’’ అని మృదువుగా అనేవారు. కొంతకాలం క్రితం ఓ స్టూడియో నుంచి తిరిగొస్తూ, కూడలి వద్ద సిగ్నల్ పడ్డప్పుడు పర్స్ తీసి డ్రైవర్‌కు పది నోటు తీసిచ్చాను. అతగాడు ఆ నోటు జేబులో పెట్టుకోకుండా, ఒకచోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ముసలి బిచ్చగత్తె చేతిలో పెట్టాడు. అది చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా ‘మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచైనా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే నీకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడమే కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకో కండి’’ అన్నాడు. అనుకోవడానికి ఏముంది, ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను. - భండారు శ్రీనివాసరావు హైదరాబాద్ -
ఇప్పుడంతా వారసత్వ నటనే..
సినీ నటుడు కోట శంకర్రావు నటనలో అన్నయ్యకు సాటి.. నాటకంలో మేటి.. ఏ క్యారెక్టర్‌కైనా సరిపోయే రూపం.. క్లిష్టమైన డైలాగులను సునాయూసంగా చెప్పగలిగే వ్యాఖ్యానం నటుడు కోట శంకర్రావుకు పెట్టని ఆభరణాలు. సోదరుడు కోట శ్రీనివాసరావుకు ఏమాత్రం తీసిపోని ఆయన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. విలక్షణమైన అభినయంతో అటు వెండితెర వీక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను, నాటకరంగ అభిమానులను మెప్పిస్తున్న ఘనాపాఠి ఆయన. ఈ నేల-ఈ గాలి సీరియల్ షూటింగ్లో పాల్గొనేందుకు గుడ్లవల్లేరు మండలం కౌతవరం వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన స్వస్థలం జిల్లాలోని కంకిపాడు అని చెప్పారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) సాక్షి : నటనకు ముందు మీరేం చేసేవారు? శంకర్రావు : స్టేట్‌బ్యాంక్ మేనేజర్‌గా 30ఏళ్లు పనిచేశా. సాక్షి : నాటకాల్లో ప్రవేశం ఉందా? శంకర్రావు : 1965 నుంచి నాటకరంగంలో ఉన్నాను. ఆ అనుభవం వల్లే సినిమాల్లో అవకాశం వచ్చింది. సాక్షి : సినీరంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? శంకర్రావు : 1986లో ‘నాకూ పెళ్లాం కావాలి’ నా మొదటి సినిమా. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? శంకర్రావు : 80 సినిమాలు చేశాను. సాక్షి : మీకు పేరు తెచ్చిన సినిమాలు? శంకర్రావు : అంకురం, సూత్రధారులు, హలోబ్రదర్, చీమలదండు మంచి పేరు తెచ్చాయి. సాక్షి :: సీరియల్స్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టారు? శంకర్రావు : సినిమాల కంటే ముందే సీరియల్స్‌లోకి వచ్చాను. 1983లోనే సీరియల్స్‌లో నటించా. ఇప్పటివరకు 53 సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. సాక్షి : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? శంకర్రావు : సినిమాలేమీ చేయట్లేదు. ఐదు సీరియల్స్ చేస్తున్నాను. సాక్షి : ఏ సీరియల్స్‌లో మీకు పేరొచ్చింది? శంకర్రావు : కలిసుందాం రా, జయం, శ్రీమతి, గాయత్రి, యోగి వేమన, విశిష్ట విశ్వామిత్ర సీరియల్స్‌లో మంచి పేరొచ్చింది. సాక్షి : నటనా రంగానికి కొత్తగా వచ్చే వారికి మీరిచ్చేసలహా? శంకర్రావు : సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు కొండంత టాలెంట్ ఉంటే చాలదు. ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే ముఖ్యం. నటనలో ఏకే47లా పనిచేయాలి. అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కానీ, ఆ అవకాశం వస్తుంది. నిత్య సాధన చేస్తూ నటన అనే విద్యకు పదును పెట్టుకుంటూ ఉండాలి. సినీ సత్సంబంధాల్ని మెరుగు పరుచుకుంటూ వాటిని కొనసాగిస్తే, తప్పక లక్ష్యం సాధించవచ్చు. సాక్షి : సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి? శంకర్రావు : అవకాశాలు ఇచ్చే విషయంలో కొందరు వారసత్వానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. -
27న విజయవాడ డీడీ కేంద్రం ప్రారంభం
తొలిరోజు నుంచే 24 గంటల ప్రసారాలు విజయవాడ బ్యూరో: విజయవాడలో దూరదర్శన్(డీడీ) కేంద్రాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేంద్రంనుంచే రెండు రాష్ట్రాలకు ప్రసారాలు సాగుతున్నాయి. విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకంగా డీడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేస్తున్న కేంద్రాన్ని 27న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వెంకయ్య స్వయంగా వెల్లడించారు. విజయవాడ డీడీ కేంద్రానికి డిప్యూటీ డెరైక్టర్‌గా మల్లాది శైలజా సుమన్‌ను నియమించారు. ఆమె సోమవారమే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న డీడీ స్టూడియోను పూర్తిస్థాయి కేంద్రంగా మార్చనున్నారు. విజయవాడ డీడీని ప్రారంభించిన తొలిరోజు నుంచే 24 గంటలపాటు ప్రసారాలు సాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
ప్రేమించి పెళ్లి చేసుకున్ :పరిటాల మంజుల
పాలకొల్లు అర్బన్ : చంద్రముఖి సీరియల్లో నటించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అభిమానిగా మారడంతోపాటు తెలుగింటి కోడలినయ్యానని టీవీ సీరియల్ నటి పరిటాల మంజుల అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ షూటింగ్ నిమిత్తం పాలకొల్లు విచ్చేసిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. బుల్లితెర నటిగా ఎలా అవకాశాలొచ్చాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కన్నడంలో కొత్త నటీనటులతో సీరియల్ తీస్తున్నారని మా నాన్న మిత్రుడొకరు చెప్పారు. ఫొటో షూట్‌కి వెళ్లి తొలి ప్రయత్నంలోనే హీరోయిన్ పాత్ర దక్కించుకున్నాను. తెలుగులో బుల్లితెరకు ఎలా పరిచయమయ్యారు బెంగళూరులో ఆర్కా మీడియా సంస్థ ద్వారా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలి సీరియల్ చంద్రముఖి. కుటుంబ నేపథ్యం నాన్న శివశంకర్ పోలీస్. అమ్మ పుష్ప గృహిణి. మేం నలుగురు ఆడపిల్లలం. నేను రెండో సంతానం. నాల్గో చెల్లి కీర్తి కూడా బుల్లితెర నటి. ఎన్ని సీరియల్స్ నటించారు కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి, తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు అన్నీ హీరోయిన్ పాత్రలే చేశా. కాంచనగంగలో విలన్ పాత్ర పోషించా. పేరుతెచ్చిన సీరియల్ చంద్రముఖి, 1,850 ఎపిసోడ్లతో ఆరున్నరేళ్లు సాగింది. మీది ప్రేమ వివాహమా నా సహచర నటుడు, సినీ రచయిత ఓంకార్ కుమారుడు నిరుపమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అవార్డులు మాటే ంటి చంద్రముఖికి నాలుగు అవార్డులు అందుకున్నా. కాంచనగంగలో పాత్రకు పురస్కారం దక్కింది. డ్రీమ్ రోల్ ఒకే సీరియల్లో రెండు విభిన్న పాత్రలు (హీరోయిన్, విలన్) చేయాలని ఉంది. -
మన దూరదర్శన్ వచ్చేస్తోంది
ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం విజయవాడ నుంచే 24 గంటల ప్రసారాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు 13 జిల్లాల కార్యక్రమాలకే ప్రాధాన్యం సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా దూరదర్శన్ పూర్తిస్థాయి ప్రసారాలకు శ్రీకారం చుడుతోంది. ఇక్కడ నుంచి 24 గంటలూ దూరదర్శన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేవలం రెండు గంటల కార్యక్రమాలను మాత్రమే ఇక్కడ నుంచి ప్రసారం చేసేవారు. మిగిలిన కార్యక్రమాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రసారం చేసేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దూరదర్శన్ను కూడా ప్రత్యేకంగా కేటాయించాలని ప్రసారభారతికి పలువురు విన్నవించారు. ఈ క్రమంలో దూరదర్శన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం జూలైలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరో పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో విడిపోవడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ప్రసారాలను ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ ప్రారంభిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ కూడా ప్రకటించారు. శరవేగంగా పనులు విజయవాడ కేంద్రంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విడిపోయిన తరువాత ఇక్కడ స్వయంగా ప్రసారాలు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని స్థానిక అధికారులు భావించారు. అయితే ఢిల్లీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఇంజినీర్లు కావాల్సిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. స్క్రిప్టు రైటర్లు, కెమెరామెన్లు, యాంకర్లు వంటి వారిని తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. రోజుకు రెండుసార్లు వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న స్టూడియోను ఆధునికీకరిస్తున్నారు. వార్తలను రికార్డింగ్ చేయడానికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి వార్తలు అప్పుడు సేకరించి పంపేందుకు వీలుగా ఓబీ వ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు చానల్స్ కంటే అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు ఉపయోగించే టెక్నాలజీ మరో 30 ఏళ్ల వరకు సరిపోతుందని ఇక్కడి సిబ్బంది భావిస్తున్నారు. స్థానికతకే ప్రాధాన్యత ఇక నుంచి దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో చార్మినార్, మ్యూజియాలు చూస్తే ఇక నుంచి ప్రకాశం బ్యారేజీ అందాలు, సూర్యలంక బీచ్ సొగసులు విశాఖ, అరకు సోయగాలు ప్రసారం చేస్తారు. విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు చెందిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక, వ్యవసాయ తదితర కార్యక్రమాల ప్రసారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ 13 జిల్లాలో పండే పంటలు, వాటిల్లో రైతులు పడే ఇబ్బందులు, తీసుకోవాలని జాగ్రత్తలు తదితర కార్యక్రమాలను దూరదర్శన్ అధికారులు రూపొందిస్తారు. వాస్తవంగా దూరదర్శన్ ఏయే కార్యక్రమాలు ప్రసారం చేయాలనే అంశంపై ఢిల్లీలోనే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటికి స్థానికతను జోడించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ఇక్కడి అధికారులు యోచిస్తున్నారు. -
ఆశల అంకురం
భాగ్యనగరంతో మూడు దశాబ్దాలుగా ముడిపడిన బంధంలో వెంటాడే జ్ఞాపకాలెన్నో! నేర్చుకున్న పాఠాలు ఇంకెన్నో! ఈ నగరానికి భాషాభేదం లేదు. కులమతాల తారతమ్యం లేదు. ప్రాంతీయ వివక్ష లేదు. అపారమైన జ్ఞానాన్ని అక్కున చేర్చుకుంటుందీ నగరం. ఆత్మవిశ్వాసానికి ఆలంబనగా నిలుస్తుందీ నగరం. ఇది నిజమని చెప్పే అనుభవాలెన్నో అంటున్నారు కోట శంకరరావు. నగరంతో తన అనుబంధం, ఇక్కడ తాను పొందిన అనుభవాలు ఆయన మాటల్లోనే... - కోట శంకర రావు ప్రముఖ నటుడు చిన్నప్పటి నుంచి నాటకాలంటే మహా పిచ్చి. అందులో వేయని పాత్రలేదు. మహానటుడవుతావని చిన్నప్పుడు అందరూ అనేవాళ్లు. కానీ స్టేట్‌బ్యాంకు ఉద్యోగినయ్యాను. ఉద్యోగం చేస్తూనే నాటకాలు ఆడేవాడిని. 1987లో హైదరాబాద్‌కు బదిలీ అయింది. రామ్‌నగర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నా. బ్యాంకు నుంచి రాగానే రామ్‌నగర్ గుండు దగ్గర తోటి డ్రామా ఆర్టిస్టులతో కబుర్లు చెప్పుకోవడం దినచర్యగా ఉండేది. తనికెళ్ల భరణి, రాళ్లపల్లి వంటి వారు చర్చల్లో పాల్గొనేవాళ్లు. అప్పట్లో స్వీయ నిర్వహణలోని గౌరీశంకర్ ఆర్ట్స్ థియేటర్స్ బ్యానర్‌పై వేసిన నాటకాలు మధుర స్మృతులుగా ఉండేవి. వాటిని సిటీలో మళ్లీ మళ్లీ ప్రదర్శించాలనే కోరిక ఉండేది. అప్పటికే టీవీ సీరియల్స్‌లో బాగా నటిస్తుండే వాడిని. అన్నయ్య కోట శ్రీనివాసరావు బాగా రాణిస్తుండటంతో సినీ ప్రవేశానికి పెద్దగా ఐడెంటిటీ అవసరం లేదనిపించేది. టీవీ కనెక్షన్ ‘బాబూ... సీరియల్స్‌లో నీ వేషాలు బాగుంటున్నాయి. కానీ ఆ దుర్మార్గపు పాత్రలు ఎందుకు వేస్తున్నావ్?’ సికింద్రాబాద్‌లో ఓ వృద్ధురాలు నన్ను నిలదీయడం ఇప్పటికీ బాగా గుర్తు. బుల్లితెరకు నేను అంతగా కనెక్ట్ అయ్యానా? అన్న ఆలోచన అప్పుడే వచ్చింది. పిల్లలు పెద్దవాళ్లవ్వడంతో రాంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు మారాను. అప్పుడొస్తున్న తెలుగు సీరియల్స్‌లో నేను లేకుండా ఏ ఒక్కటీ వచ్చేది కాదు. దాంతో నేనుండే ప్రాంతంలో చిన్నా పెద్ద నన్ను అబ్జర్వ్ చేసేవాళ్లు. ‘మీ పాత్రలు అలా ఉండాలి... ఇలా ఉండాలి...’ అని సూచనలు ఇచ్చేవాళ్లు. ఫస్ట్ షాట్... కొంత ఫియర్ అనుకున్నట్టే సినిమా ఛాన్స్ వచ్చింది. ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమా. ఫస్ట్ షాట్. నాటకాల అనుభవం ఉంది కదా అనుకున్నాను. కానీ అక్కడికెళ్లాక కొత్తకొత్తగా అన్పించింది. నాటకాల్లో స్టేజీ లాంగ్వేజ్ ఉన్నట్టే సినిమాల్లో కెమెరా లాంగ్వేజ్ అవసరం. అది నాలో ఉన్న లోపమని గుర్తించాను. దాన్ని నేర్చుకోవడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. ఏడు రోజుల టెన్షన్ అప్పుడు నేను సికింద్రాబాద్ ఎస్బీఐ బ్రాంచ్‌లో హెడ్ క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. అదే సమయంలో నారాయణమూర్తి నిర్మిస్తున్న చీమల దండు సినిమా షూటింగ్ కోసం పెద్దాపురం వెళ్లాను. అప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి బ్యాంక్‌లో తనిఖీ కోసం పై అధికారులు వచ్చారు. కీలకమైన పత్రాలున్న బీరువా తాళాలు నా దగ్గరున్నాయి. బ్యాంకు నుంచి రమ్మని సమాచారం. షూటింగ్ ఆపితే లక్షల్లో నష్టం. ఏం చేయాలని నారాయణ మూర్తిగారిని అడిగాను. వెళ్లాలనుకుంటే వెళ్లమని కాస్త బాధగానే చెప్పారు. వెళ్లకుంటే ఉద్యోగం పోతుంది...? టెన్షన్. ఆ టెన్షన్ వారం రోజులు. ఉద్యోగం పోయినా నాకు సినిమా కేరీరే ముఖ్యమనుకున్నా. తర్వాత వెళ్లి పై అధికారులను కలిసి, తప్పు ఒప్పుకున్నాను. వాళ్లూ అర్థం చేసుకున్నారు. బుల్లితెర ఇచ్చినంతగా... బ్యాన్ చేసిన ‘రమీజాబీ’ నాటకాన్ని రవీంద్రభారతిలో వేయాల్సి వచ్చినప్పుడు భయపడ్డాను. అక్కడే గొప్పగొప్ప వాళ్ల మధ్య ప్రశంసలు అందుకున్నాను. సినీరంగానికి ఎంతో చేశాననే భావన నాలో ఉంది. అయితే, బుల్లితెర నాకు భవిష్యత్తు ఇచ్చినంతగా వెండితెర నన్ను ఆదుకోలేదు. గుమ్మడి, ఏఎన్ఆర్లతో అనుభవాలు... షూటింగ్లో నా తడబాటు చూసి గుమ్మడిగారు నన్ను ఆప్యాయంగా చేరదీశారు. కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్పారు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్లేవాణ్ణి. ఆయన ద్వారానే నా భయాన్ని పోగొట్టుకున్నాను. సూత్రధారులు సినిమాలో వింత అనుభవం ఎదురైంది. మహానటుడు ఏఎన్ఆర్గారిని నిలదీసి, తిట్టిపోసే సన్నివేశం అది. కాస్త మార్చమని విశ్వనాథ్‌గారిని బతిమిలాడినా, ఆయన ససేమిరా అన్నారు. చెడ్డ వ్యక్తిని చంపడం కాదు, చెడును చంపాలనే మెసేజ్ నీ పాత్ర ద్వారా వెళుతుందని అక్కినేనిగారు ధైర్యం చెప్పారు. అనుకున్నట్లే ఆ పాత్ర హైలైట్ అయింది. - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. స్వరమే అసలైన పెట్టుబడి టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి. అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే. వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది. వాయిస్, డిక్షన్‌తో రాణింపు ‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్లో ఎదిగేందుకు వీలుంటుంది’’ -రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే -
గెలిచి చూపించా..
మీ.. సుమ... మహానగరంలో మలయాళీ అమ్మాయి తెలుగు మాట్లాడితే నవ్వొస్తుంది కదా... పదాల ఉచ్ఛారణ వింటే ఈ భాషేంటిరా బాబూ! అని అనుకుంటాం కదా.. బుల్లితెరపై యాంకర్‌గా పేరుతెచ్చుకున్న సుమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కాకపోతే తెలుగుపై ఉన్న మమకారంతో ఆమె వాటిని లెక్కజేయలేదు. ఆ వెక్కిరింతల మధ్యే పట్టుదల పెంచుకుని పదసంపదను పెంచుకుంది. ‘పలుకు’బడినీ మెరుగుపరచుకుంది. తడబడ్డ భాషలోనే మాటకారిగా గుర్తింపు తెచ్చుకున్న సుమ అనుభవాలు ఆమె మాటల్లోనే... సిటీ నాకు భాష నేర్పింది ‘తెలుగులో మాట్లాడటానికి పదాల కోసం తడబడే నువ్వు... ఇప్పుడు ఎడాపెడా యాంకరింగ్ చేస్తున్నావేంటి?’ అని నా చిన్ననాటి ఫ్రెండ్స్ అంటుంటారు. వాటికి నాలో నేనే అనుకుంటుంటాను.. ‘అప్పుడు వెక్కిరించారు... ఇప్పుడు కుళ్లుకుంటున్నారు కదా’ అని! ఈ సిటీ నాకు భాష నేర్పింది. సొసైటీలో ఒక హోదాలో నిలబడేందుకు దారి చూపింది. ట్యాంక్‌బండ్‌కు అవతల... ఇవతల ట్యాంక్‌బండ్ సెంటర్ పాయింట్ అనుకుంటే... బాల్యమంతా మెట్టుగూడలో గడిచింది. వివాహం తర్వాత ట్యాంక్‌బండ్‌కు ఈ పక్క ఉంటున్నాం. మాది కేరళ. నాన్న రైల్వే ఉద్యోగి. సికింద్రాబాద్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నా. రైల్వే డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఓయూలో పీజీ పూర్తి చేశా. తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నా... మాట్లాడటం ఇబ్బందిగా ఉండేది. నా ఉచ్చారణకు అందరికీ నవ్వొచ్చేది. కొందరు గేలి చేసేవాళ్లు. అప్పుడే నాలో పట్టుదల పెరిగింది. ఓనం ఆటతో మైమరపు ఓనం పండగంటే భలే సరదాగా ఉండేది. రైల్వే క్వార్టర్స్‌లో తమిళులు, మళయాళీలు, కన్నడిగులు, మార్వాడీలు... ఇలా అందరూ ఉండేవాళ్లు. ఓనం మా ఫేవరెట్. దాన్ని మేమే స్టార్ట్ చేసేవాళ్లం. మిగతావారిని ఇన్వాల్వ్ చేసేవాళ్లం. కాలనీ మొత్తం తిరగడం, పూలు ఏరుకొచ్చి రాశులు పోయడం... దీంతో వాళ్లతోనూ మంచి అనుబంధం పెరిగేది. అనేక భాషలు నేర్చుకోవడానికి ఇది కూడా తోడ్పడింది. ఏడు రాళ్లాట భలే.. రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లినప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చే ఆటలు కొన్ని ఉన్నాయి. మారం పీటీ, ఖోఖో, పరుగు పందాలు... ఇలా ఎన్నో. కాకపోతే నాకు బాగా నచ్చిన ఆట ఏడు రాళ్లాట. రాళ్లను గిరిలో పోసి, సూటిగా రాయితో కొడితే... వావ్... కేరింతలు కొట్టేదాన్ని. గెలిచినంత ఫీలింగ్ వచ్చేది. అయ్యప్ప టెంపుల్ మరిచిపోలేని జ్ఞాపకం... మెట్టుగూడా అయ్యప్ప టెంపుల్‌కు రోజూ వెళ్లేదాన్ని. ఇక్కడే డాన్స్ క్లాస్ కూడా నేర్చుకున్నాను. కూచిపూడి డాన్స్ చేస్తుంటే మా చుట్టుపక్కల వాళ్లంతా కన్నార్పకుండా చూసేవాళ్లు. ఇప్పటికీ ఎప్పుడైనా ఒకసారి అటు వెళ్లాలన్పిస్తుంది. దీపావళి అంటే భయం దీపావళి వస్తే చాలు నాకు చచ్చేంత భయమేసేది. పెద్ద పెద్ద బాంబులు.. సౌండ్లు.. అమ్మో! చెవులకు దూదులు పెట్టుకుని ఇంట్లో దాక్కునేదాన్ని. సీమ టపాకాయ కాల్చాలన్నా భయమేసేది... రన్నింగ్ రేస్‌కు సై.. ఆగస్టు 15, నవంబర్ 14... జాతీయ పండుగలంటే నాకు భలే ఇష్టం. అప్పుడు పరేడ్ గ్రౌండ్‌ను ముస్తాబు చేస్తారే... అదింకా ఇష్టం. ఇక స్కూల్లో అయితే రన్నింగ్ రేస్‌లో మొదటి పేరు నాదే. ఎందుకంటే కప్ నాకు గ్యారెంటీ అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. ఓయ్.. ఎక్కడా.. గోల్కొండ కెళ్లడం... అక్కడ చప్పట్లు కొట్టి అరవడం భలే సరదాగా ఉండేది. మొన్నటి దాకా అక్కడికెళ్లి ఓయ్... ఎక్కడా అని అరుస్తుంటే.. ప్రతిధ్వని వస్తుంటే థ్రిల్‌గా ఫీలయ్యేదాన్ని. ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్.. సిటీలో ఉన్న ప్రతీదీ గొప్పగానే అనిపిస్తుంది. ఏడాదికోసారి నాంపల్లిలో పెట్టే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కు వెళ్లకుండా ఉండలేను. పానీపూరీ స్పెషల్ సిటీలో దొరికే పానీపూరీ భలే ఇష్టం. చిన్నప్పటి నుంచీ అంతే. ఇంకా మిర్చిబజ్జీ అన్నా అంతే ప్రాణం. సిటీలో ఎక్కడైనా ఈ రెండు ఐటమ్స్ బాగా నచ్చుతాయి. మళ్లీ వేరే సిటీలకు వెళ్తే ఇంత టేస్ట్ రాదు. ఇంకా హైదరాబాదీ బిర్యానీ అన్నా చాలా చాలా ఇష్టం. నగరం చుట్టేస్తే.. ఓల్డ్ సిటీలో బ్యాంగిల్స్ కొనడం సరదా. అప్పుడప్పుడు బిర్లామందిర్‌ను అలా చూస్తూ మెట్లెక్కడం ఇష్టం. హుస్సేన్‌సాగర్‌లో భగీరథి ఎక్కడం మరో థ్రిల్. బతుకమ్మ పండుగ ఆడుతుంటే పూల సజ్జాలు చూడటం మరీమరీ ఇష్టం. ట్రాఫిక్ జామ్ ఒక్కటే నచ్చని పాయింట్... భిన్న రాష్ట్రాల వాళ్లున్న సిటీ ఇది. విభిన్న సంస్కృతుల మేళవింపు ఉన్న నగరం మనది. ఈ సిటీ ఇమేజ్ ఇంకా పెరగాలనేది నా కోరిక. అయితే ఇక్కడ ట్రాఫిక్ కొంత నచ్చని విషయమే. దానికి కారణం మనమేనని, ఏమీ చేయలేమని కూడా తెలుసు. అయినా ఎందుకో అదొక్కటే నాకు నచ్చని పాయింట్. ఈ అందమైన నగరంలో ఇంకెన్నో అనుభూతులున్నాయి. ఏదేమైనా తెలుగు రాదని గేలిచేసిన చోటే గెలిచి చూపించా! ఇదే నాకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం. కాలేజీ నుంచే కేరీర్ స్టార్ట్ కూచిపూడి నేర్చుకున్నాను కదా. సరదాగా ప్రదర్శనలిచ్చా. అలా దూరదర్శన్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటికే తెలుగు బాగా నేర్చేసుకున్నాను. ఏ పదం మాట్లాడితే వెక్కిరించే వాళ్లో, దాన్ని ఎలా పలకాలో తెలుసుకునేదాన్ని. కాలేజీకి వచ్చే సరికే పర్ఫెక్ట్ అయ్యాననుకోండి. సిటీ గురించి, ఇక్కడి కల్చర్ గురించి పుస్తకాలు కొని చదివాను. మొత్తం మీద అలా... అలా... యాంకర్ అయ్యాను. - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
సవతిపోరుతో సెకండ్ ఇన్నింగ్స్!
టీవీక్షణం: ఒకనాడు వెండితెరపై గ్లామరస్ తారలుగా వెలుగొందిన ఇద్దరు నటీమణులు... ఇప్పుడు బుల్లితెరపై సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సవతులుగా సూపర్‌బగా నటిస్తూ సీరియల్‌కి టీఆర్పీని బాగానే తెచ్చిపెడుతున్నారు. సోనీ చానెల్లో ప్రసారమయ్యే ‘ఏక్ నయీ పెహచాన్’లో పూనమ్ థిల్లాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీరియల్లో మరో సీనియర్ నటి ఎంటరయ్యింది. ఆమే... పద్మినీ కొల్హాపురి. ఒకప్పుడు తమ గ్లామర్‌తో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ ఇద్దరూ, ఇప్పుడు తమ పెర్ఫార్మెన్స్తో ఇల్లాళ్ల మనసులు దోచేస్తున్నారు. పూనమ్ భర్త సురేష్... పద్మినిని రెండో పెళ్లి చేసుకుంటాడు. చాన్నాళ్ల తర్వాత ఆ విషయం ఇద్దరికీ తెలుస్తుంది. పూనమ్ త్యాగం చేసి తప్పుకుంటే, పద్మిని మాత్రం భర్తని అడ్డు పెట్టుకుని పూనమ్‌ని సాధిస్తూ ఉంటుంది. ఈ సవతుల పోరు సీరియల్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. ‘ప్రేమ్‌రోగ్’ లాంటి చిత్రాల్లో సాత్వికంగా కనిపించి మురిపించిన పద్మిని, ఓ నెగిటివ్ రోల్‌తో తిరిగి రావడాన్ని ప్రేక్షకులు ఇష్టంగా స్వాగతించారు. పద్మిని కూడా తన పాత్రకు నూరుశాతం న్యాయం చేస్తోంది! -
దూరదర్శన్.. మన దగ్గరకే
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ప్రభావం దూరదర్శన్పైనా పడింది. ఇప్పటికే పలు ప్రైవేటు చానల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను వేర్వేరుగా ప్రసారం చేస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రసారాలు చేసేందుకు ప్రసారభారతికి దూరదర్శన్ ప్రతిపాదనలు అందాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కార్యక్రమాలు ప్రసారంచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రసారం చేసినా, అందులో రెండు గంటలు స్థానిక కార్యక్రమాలకు అవకాశం ఇచ్చేవారు. తొలుత అర్ధగంటే కేటాయించినా ఆ తర్వాత రెండు గంటలకు పెంచారు. ఇందులోనే 15 నిమిషాల్లో ఈ 13 జిల్లాల వార్తలు ఉండేవి. ప్రధానంగా కోస్తాంధ్రలోని 10 జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించిన వార్తలను ఈ ప్రాంతం నుంచి ప్రసారం చేసేవారు. ఇవి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రం నుంచి విడిపోయి విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసాయ తదితర అన్ని కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. అయితే ఇందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని తెలిసింది. 30 ఏళ్ల అనుబంధం! 1977లో నీలం సంజీవరెడ్డి హైదరాబాద్ దూరదర్శన్ను ప్రారంభించారు. 1985 నాటికి విజయవాడలోనే ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో ఈ ప్రాంత వాసులకు హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో 1985వ దశకంలో దూరదర్శన్‌కు విపరీ తమైన ప్రాచుర్యం ఉండేది. హైదరాబాద్ దూరదర్శన్ రెండుగా విడిపోతే ఈ ప్రాంత ప్రజలకు ఉన్న 30 ఏళ్ల అనుబంధం తెగిపోతుంది. మరో ఆరు నెలల వ్యవధి.. హైదరాబాద్ దూరదర్శన్ నుంచి విడిపోయి ఇక్కడ నుంచి పూర్తిగా కార్యక్రమాలు నిర్వహించాలంటే మరో ఆరు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. వివిధ రకాల కార్యక్రమాలను రికార్డు చేసుకోవడానికి స్టూడియో, అప్లింకింగ్ సౌకర్యం, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. యాంకర్లు, న్యూస్ రీడర్లతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాల్సి ఉంది. అలాగే కార్యక్రమాలను నేరుగా ప్రసారం చేసేందుకు ఓబీ వ్యాన్ అవసరం ఉంటుంది. విస్తరణకు తగిన అవకాశాలు.. ప్రస్తుతం స్టూడియో ఎకరంన్నర స్థలంలో నిర్మించారు. రెండు గంటల కార్యక్రమాలను ఇక్కడినుంచే ప్రసారం చేస్తున్నందున ప్రోగ్రామ్ జనరేటింగ్, అప్లింకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దూరదర్శన్ విస్తరణ చేయాలంటే ప్రస్తుతం ఉన్న చోటనే మరో నాలుగు ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ నూతన నిర్మాణాలు చేసుకుంటే ఈ ప్రాంతంలోనూ హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు దీటుగా కేంద్రాన్ని నిర్మించుకోవచ్చు. -
బుల్లితెర మీద ప్రేమపావురం!
‘కబూతర్ జా జా జా కబూతర్ జా’ అంటూ వెండితెర మీద ఆమె కదులుతుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అప్పట్లో. ఆ ఒక్క సినిమా ఆమెని అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలబెట్టేసింది. ఆమె ఎవరో అర్థమైపోయింది కదూ... అవును, భాగ్యశ్రీనే. ‘మైనే ప్యార్ కియా’ని ఆమె కోసమే మళ్లీ మళ్లీ చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగువారి మనసులనూ దోచేసింది శ్రీ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఇరవై సినిమాలు కూడా చేయకుండానే సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో చేసిన ‘ఓంకారం’ చిత్రమే ఆమె చివరి సినిమా. ఆ తరువాత కాపురం, పిల్లలు అంటూ ఓ సాధారణ మహిళలా బతకసాగింది. అయితే ఆమె లోని నటీమణి అలానే ఉండిపోలేకపోయింది. హిందీ సీరియళ్లతో పునఃప్రవేశం చేసింది. ఇంతవరకూ ఓ అయిదు సీరియళ్లు చేసింది. ఇప్పుడు ఆరో సీరియల్ ‘లౌట్ ఆవో త్రిష’తో రాబోతోంది. పద్దెనిమిదేళ్ల కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన, ఆతృత ఎలా ఉంటాయన్నదే ఈ సీరియల్. త్రిష అనే అమ్మాయికి తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది. దాదాపు సీరియల్ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిష అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో విచిత్రమైన అనుభవాలు ఎదురు కావడం, వాటిని సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని ఊరిస్తున్నారు... ఈ సీరియల్‌ని ప్రసారం చేయనున్న లైఫ్ ఓకే చానెల్ వారు. ఏబీసీ చానెల్లో ప్రసారమైన ‘మిస్సింగ్’ ఆధారంగా ఈ సీరియల్‌ని రూపొందించారు. ‘మిస్సింగ్‌ను కేవలం పదే పది ఎపిసోడ్లతో ముగించారు. మరి హిందీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి! -
ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా...
విజయయాత్ర పందొమ్మిది వందల ఎనభైల కాలం... టెలివిజన్ ప్రసారాలు అప్పుడప్పుడే సామాన్యులను చేరాయి. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఏకైక తెలుగు దృశ్యశ్రవణ మాధ్యమం. టీవీలో ఏ బొమ్మ వచ్చినా ఆశ్చర్యమే. ఆ నేపథ్యంలో ఓ కుర్రాడు ఒకే ఒక కార్యక్రమాన్ని విపరీతంగా చూసేవాడు. అతడి దృష్టి టీవీలో ప్రసారమవుతున్న గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన వారి మీదనే కేంద్రీకృతం అయ్యేది. ఆ జాబితాలో తన పేరు ఉండాలనే ఆకాంక్ష మనసులో నాటుకుంది. కట్ చేస్తే... 2014 మే నెలకంతా ‘ఒక దేశంలో అత్యధిక దూరం సైకిల్ మీద పర్యటించిన వ్యక్తి’గా గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నాడా యువకుడు. అతడి పూర్తి పేరు ఆర్కాట్ నాగరాజు, వయసు 36 సంవత్సరాలు. కామర్స్‌లో పట్టభద్రుడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నాగరాజు ప్రస్తుతం దుబాయిలో ఎస్టిమేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగంలో మేనేజరు. గిన్నిస్ రికార్డులో చేరాలన్న చిన్నప్పటి కోరికకు పెద్దయ్యాక దేశమంతటినీ చూడాలనే కోరిక తోడయింది. సైకిల్ యాత్ర ద్వారా రికార్డు సాధించారు. విజయారంభం! నాగరాజు సైకిల్‌యాత్ర గడచిన ఏడాది అక్టోబర్ 14వ తేదీన విజయదశమి రోజున సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో అతడి ఇంటి నుంచి ప్రారంభమైంది. నిరంతరాయంగా 135 రోజుల పాటు కొనసాగి ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముగిసింది. ఈ మొత్తం పర్యటనలో నాగరాజు 14,197.55 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. నాగరాజు ప్రస్థానంలో 21 రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ సందర్శించారు. 2012 ఆగస్టు 25 నుంచి 2014 ఫిబ్రవరి 25 వరకు పద్దెనిమిది నెలల్లో మూడు దఫాలుగా 22.5 వేల కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీద పయనించారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఏకత్వభావమే కనిపించింది అంటారాయన. నగరాల్లో వెళ్తున్నప్పుడు చాలామంది ఆసక్తిగా చూసి వెళ్లిపోయేవారు. పట్టణాలు, గ్రామాల్లో ఎదురు వచ్చి ఆపేసి ‘సైకిల్ మీదనా, దేశమంతా పర్యటనా’ అని ఆశ్చర్యపోయేవారు. ఆతిథ్యం ఇచ్చి ప్రేమగా వీడ్కోలు చెప్పేవారు. అలాంటి అనేక సంఘటనలు నాలో ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని నింపేవి. కేరళకు చెందిన గురుప్రసాద్ గ్వాలియర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పనిచేస్తారు. ఆయన నా రాక గురించి తెలుసుకుని ఆగ్రాలో నా కోసం ఎదురు చూస్తూ నన్ను ఆనందంగా ఆహ్వానించారు. ఆ కుటుంబం నన్ను చాలా ఆత్మీయంగా చూసుకోవడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అంటారు నాగరాజు. ఫేస్బుక్లో అప్డేట్స్... సాధారణంగా రికార్డు కోసం చేసే పర్యటనల్లో ఒకరు సైకిల్ మీద వెళ్తుంటే వెనుక మరో వాహనంలో సహాయకులు అనుసరిస్తుంటారు. కానీ నాగరాజు అలాంటి సహాయాలు తీసుకోకుండా పర్యటించారు. ‘‘ఏ రోజు ఎక్కడ పర్యటించాను, ఎవరెవరిని కలిశాననే వివరాలను రోజూ ఫేస్బుక్లో అప్డేట్ చేస్తూ వచ్చాను. ‘టూర్ ఆఫ్ ఇండియా ఆన్ పెడల్ అండ్ శాడిల్’ పేరుతో నా సైకిల్ పర్యటన వివరాలుంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సాహసం చేయాలనుకునే వారికి నా ప్రయాణం గెడైన్స్ అవుతుంది’’ అన్నారు. యాత్రకు తనను తాను... రికార్డు యాత్రకు తనను తాను సిద్ధం చేసుకోవడం కీలకమైన విషయం. 2012లో మొదటిసారి హిమాలయ పర్వతప్రాంతంలో సైకిల్‌పై పర్యటించినప్పుడు నాగరాజు వేగం గంటకు పన్నెండు కిలోమీటర్లకు మించలేదు. దేశమంతా పర్యటించాలంటే కనీసం గంటకు పాతిక కిలోమీటర్ల వేగం తప్పదని నిర్ణయించుకున్న తర్వాత వేగం పెంచడం మీద దృష్టి పెట్టారు. ఏడెనిమిది నెలలపాటు శ్రమించాక వేగం పెరగడంతోపాటు ఆగకుండా యాభై కిలోమీటర్లు ప్రయాణించే శక్తి వచ్చింది. ప్రయాణంలో పదనిసలు... సాహసయాత్ర చేయాలనుకునే వారికి ‘‘వాతావరణ పరిస్థితులకు వెరవకుండా ఎవరికి వారు తమ మీద తామే విశ్వాసంతో ముందుకు సాగిపోవాల’’ని చెబుతారు నాగరాజు. సమాచారం విస్తృతంగా ఉన్న నేటి రోజుల్లో గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. గిన్నిస్ రికార్డు వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తే సమగ్రమైన సమాచారం తెలుస్తుంది. అదే దిక్సూచి అని ప్రోత్సహిస్తున్నారాయన. అందమైన నా దేశం! మన దేశంలో ప్రతి ప్రాంతం దానికంటూ ఒక అందాన్ని సొంతం చేసుకున్న అందమైన ప్రదేశమే. ఈ పర్యటనలో ప్రతి క్షణాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ సంతోషంగా ఆస్వాదించాను. నా ప్రయాణంలో బీహార్, పశ్చిమబెంగాల్ రోడ్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాయి. వాతావరణ పరంగానాకు చాలెంజ్‌గా నిలిచింది గుజరాత్ - ఒరిస్సా మధ్య నాలుగువేల కి.మీ.ల ప్రయాణం. విపరీతమైన చలి, మంచు కారణంగా ఒంట్లో నుంచి వణుకు పుట్టేది. ఉత్తర ప్రదేశ్ వాళ్ల మాట కరుకుదనంతో మనసుకు ఇబ్బంది కలిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు సైకిల్ మీద హెల్మెట్ ధరించి వెళ్లడాన్ని చూసి పెద్దగా నవ్వారు. - ఆర్కాట్ నాగరాజు -
కొత్త కోర్సులతో మెరుగైన ఉపాధి అవకాశాలు
ప్రైవేట్ సంస్థల సహకారంతో సరికొత్తగా.. జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ పద్మావతి యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ ఫెయిర్ ప్రారంభం మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కోర్సులను అభ్యసిస్తే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పేర్వారం పద్మావతి అన్నారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం ఫైన్ఆర్ట్స్ కళాశాలలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యానిమేషన్, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, టెలివిజన్, ప్రింట్ మీడియా, అడ్వర్టైజ్మెంట్స్ వంటి కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిలిం మేకింగ్ కోర్సు కూడా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆధునిక హంగులతో పలు కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తమతోపాటు కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొని సరికొత్త కోర్సులను అందిస్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మరిన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.కవితాదరియానిరావు, ప్రొఫెసర్ ఎస్.ప్రదీప్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్.కుమార్, ప్రొఫెసర్ ఎస్ఎన్ వికాస్ పాల్గొన్నారు.