
ఇక బుల్లితెరపై రాణా సందడి
బంజారాహిల్స్: బుల్లితెరపై ప్రముఖ సినీనటుడు రాణా దగ్గుబాటి సందడి చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమయ్యే సరికొత్త నూతన టాక్ షో ‘నెం.1 యారి విత్ రాణా’లో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వాస్తవ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన వ్యక్తుల మధ్య ఉన్న స్నేహబంధాలను ఈ టాక్‌షోలో ఆయన ప్రస్తావించనున్నారు. నంబర్ వన్ యారి అనేది విలక్షణతో కూడిన మనోరంజన కార్యక్రమమని, ఇందులో సోదర బంధం, స్నేహబంధాల స్ఫూర్తి ఉంటుందని రాణా తెలిపారు.