రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్ | Tollywood Hero Rana Daggubati Team Responds On Betting App Case | Sakshi
Sakshi News home page

Rana Daggubati: 'అలాంటి యాప్‌లనే ప్రమోట్ చేశారు.. రానా టీమ్ క్లారిటీ'

Published Thu, Mar 20 2025 7:39 PM | Last Updated on Thu, Mar 20 2025 7:47 PM

Tollywood Hero Rana Daggubati Team Responds On Betting App Case

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్‌ చేసిన ప్రకటనలో పేర్కొంది

ఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు.  చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే  రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి  ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే  ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్‌లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్‌లో ప్రస్తావించారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్‌తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్‌ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులకు వివరణ ఇ‍చ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement