
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
(చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)
తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు.
అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment