Manchu Lakshi
-
‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు
ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన "ఆదిపర్వం" అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు! -
నా కూతురు పుట్టక నేను చాలా మారాను: మంచు లక్ష్మి
-
సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పనికి కోపం తెప్పించింది. తాను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాలకు అడ్డు రావడంతో అగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా 'నీ యవ్వా' వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా(SIIMA) అవార్డ్స్- 2023 ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాలకు అతను అడ్డుకోవడంతో కోపంతో కొట్టేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు. కాగా.. మంచు లక్ష్మి టాలీవుడ్లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసింది. అంతే కాకుండా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు, మాన్స్టర్, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు లాస్ వెగాస్ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆమె డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ ఈఆర్ లాంటి హాలీవుడ్ సిరీస్‌ల్లో నటించింది. ఎవడ్రా మా లచ్చక్క మాట్లాడే అప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నారు ని అవ్వ 😁 హాల్లో డుర్ go behind the camera dude🤣@LakshmiManchu pic.twitter.com/Ry5FBNyN3A — 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) September 21, 2023 -
అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్. అయితే మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే ఉంచారు. పెళ్లి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్ అయ్యేవరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి వేడుకలో భాగంగా ఒక్కొ ఫొటో షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మికి ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే మనోజ్ పెళ్లి బాధ్యతను తీసుకుని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఈ క్రమంలో మెహందీ, హల్దికి సంబంధించిన ఫొటోలను ఆయన సోదరి మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. హల్ది, మెహందీ నుంచి మనోజ్‌ను పెళ్లి కొడుకుగా చేసే వరకు అన్నింటిని ఆమె చూసుకుంది. ఈ క్రమంలో అక్క గురించి మనోజ్ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. తనని పెళ్లి కొడుకు చేస్తున్న అక్క మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ అక్క’ అంటూ పోస్ట్ చేశాడు. కాగా వివాహ అనంతరం మనోజ్ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక ఇతర కుటుంబ సభ్యులంతా మనోజ్‌తో ఉండి దగ్గరుండి ఈపెళ్లిని జరిపించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. Manchu Manoj Wedding Activities | Manchu Manoj Weds Bhuma Mounika Reddy #ManchuManoj #BhumaMounikaReddy #SakshiNews pic.twitter.com/2JuEgLRHc8 — Sakshi TV Official (@sakshitvdigital) March 3, 2023 చదవండి: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక 7 నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన ది లెజెంట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
మంచు లక్ష్మీ హోస్ట్‌గా ‘చెఫ్ మంత్రా ’సీజన్ 2
సెలబ్రిటీస్ జీవితం ఎలా ఉంటుంది? వారు ఖాలీ టైమ్‌లో ఏం చేస్తారు? ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. వారు అభిమానించే స్టార్సే గరిట పట్టి వంట చేస్తే..చూడ ముచ్చటగా ఉంటుంది కదా? అందుకే అలాంటి కాన్సెప్ట్‌తోనే ‘చెఫ్ మంత్రా’ షోని తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ. మంచు లక్ష్మీ హోస్ట్ ‘చెఫ్ మంత్రా’సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రానుంది.8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో ను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మి రానుంది.ఈ షో ద్వారా సెలబ్రిటీస్ వంట చేయడమే కాదు, వారు ఎలాంటి ఆహరం ఇష్టపడతారు? ఎలాంటి ఆహారం తీసుకుంటారు? వీటితో పాటు ఎంతో ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ అందిచబోతున్నారు. ఈ షో లాంచ్ గురించి లక్ష్మి మంచు మాట్లాడుతూ, "మంచు ఫ్యామిలీలో అందరం కూడా భోజనప్రియులమే. ఎన్నో విషయాలు లంచ్ లేదా డిన్నర్ టేబుల్ మీద అందరు కలిసి ఉన్నపుడు మాట్లాడుతారు. మంచి ఫుడ్ ఉంటే ఆరోజు చాల బాగా గడిచిపోతుంది. అలాంటి ఒక ఫుడ్ షో ని నేను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ షోను ఇష్టపడతారని ఆశిస్తున్నాను. -
ఆనందంలో సునీత.. ప్రతి స్త్రీలో అది కామన్ అంటున్న మంచు లక్ష్మీ
హ్యాపీ టైమ్స్ అంటూ అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది సింగర్ సునీత బైక్‌పై స్టైల్‌గా నడుపుతు దర్శనం ఇచ్చాడు అభిజిత్ కండలు పెంచేందుకు తెగ కష్టపడుతున్నాడు సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణ ఈ ప్రపంచంలోని ప్రతి స్త్రీ కొద్దిగా మెరుపును ధరిస్తుంది. అది కొంతమంది చీరల్లో ఉంటే.. మరికొంతమంది కళ్లలో ఉంటుందని చెబుతోంది మంచులక్ష్మీ హాట్ లుక్‌లో అదరగొడుతోంది రాశిఖన్నా View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) -
కేటీఆర్‌కు మంచు లక్ష్మీ లేఖ..
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు లేఖ రాశారు. నగరానికి వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న నష్టం గురించి ఆమె తెలిపారు. మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్ నగర్ రోడ్డు నంబరు 1లో తాను ఆ దృశ్యాన్ని చూశానన్నారు. అంతేకాక ఎత్తైన వినాయక విగ్రహాలను తరలించేందుకు అడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు. వీటన్నింటిని తిరిగి బాగు చేసే బాధ్యతా ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్ గా తెలుసుకోవాలని ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం వినాయక చవితి మతపరంగా కాకుండా ఓ పోటీగా భావిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగను ఇతరుల కన్నా వైభవంగా జరపాలని కష్టపడుతున్నారు. ఆ విధంగా కాకుండా ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. అలా చేయడం వల్ల వ్యక్తులో ఐక్యమత్యం పెరుగుందన్నారు. అంతేకాక అందరూ కలిసి పండుగను జరుపుకుని, కలిసి మెలసి ఉండాలనే ఆలోచన వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా తెలుపుతున్నానని కేటీఆర్‌కు చెప్పారు. ఆయన వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటారని తెలుసని ఆమె అన్నారు. రానున్న రోజులో గణపతి విగ్రహాల ఎత్తుపై పరిమితులు పెట్టాలని మంచు లక్ష్మీ కేటీఆర్‌ను కోరారు. మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరగడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో గణపతి వేడుక కోసం రోడ్డును తవ్వి, కట్టెలు కడుతున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. Here's my heartfelt letter on the eve of #GaneshChaturthi. Guys, do share & support if you feel the same. @KTRTRS looking forward to best! pic.twitter.com/n8CVBtA86N — Lakshmi Manchu (@LakshmiManchu) August 25, 2017