Manchu Manoj pens emotional post on Manchu Lakshmi, goes viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj Emotional Post: అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..

Published Sat, Mar 4 2023 8:55 AM | Last Updated on Sat, Mar 4 2023 10:43 AM

Manchu Manoj Shares Emotional Post on Manchu Lakshmi Goes Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డిలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.  ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌. అయితే మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే ఉంచారు. పెళ్లి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్‌ అయ్యేవరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

పెళ్లి వేడుకలో భాగంగా ఒక్కొ ఫొటో షేర్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా మనోజ్‌ అంటే మంచు లక్ష్మికి ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే మనోజ్‌ పెళ్లి బాధ్యతను తీసుకుని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఈ క్రమంలో మెహందీ, హల్దికి సంబంధించిన ఫొటోలను ఆయన సోదరి మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. హల్ది, మెహందీ నుంచి మనోజ్‌ను పెళ్లి కొడుకుగా చేసే వరకు అన్నింటిని ఆమె చూసుకుంది. ఈ క్రమంలో అక్క గురించి మనోజ్‌ ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు.

తనని పెళ్లి కొడుకు చేస్తున్న అక్క మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌. లవ్‌ యూ అక్క’ అంటూ పోస్ట్‌ చేశాడు. కాగా వివాహ అనంతరం మనోజ్‌ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్‌ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక ఇతర కుటుంబ సభ్యులంతా మనోజ్‌తో ఉండి దగ్గరుండి ఈపెళ్లిని జరిపించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ గారు,  టి జి వెంకటేష్,  కోదండరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. 

చదవండి: 
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన మంచు మనోజ్‌, మౌనిక
7 నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన ది లెజెంట్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement