mounika
-
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
కరీంనగర్: అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించి మంచి మనసు చాటుకున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదన్‌కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని ఆదివారం కళాభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూసుకున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. మౌనికకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండీ పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి.. వధూవరులకు నూతన వ్రస్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. వివాహానికి జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు, వివిధ శాఖల అధికారులందరూ ఆర్థిక సహాయం అందించారు. కాగా మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. Officials Became Parents: Grand Wedding of an Orphaned Young Woman was performed Karimnagar @Collector_KNR @PamelaSatpathy Satpathy and Manakondur MLA Kavvampalli Satyanarayana Organized a Wedding at KalabharatiA grand wedding ceremony was held at Kalabharati Auditorium in… pic.twitter.com/UMzBkniH0Z— Jacob Ross (@JacobBhoompag) March 9, 2025 -
నీ రెండేళ్ల ప్రేమ.. నా జీవితకాలం సరిపోదు: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. గతేడాది ఈ జంటకు ఓ కుమార్తె కూడా జన్మించింది. మార్చి 3వ తేదీ 2023లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఆశీర్వదించారు.మౌనికతో పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. రెండో వివాహా వార్షికోత్సవం వేళ మౌనికలో ఉన్న సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మౌనికను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్)మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నా. నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నా. మౌనిక నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించావు. నేను విధిని నమ్మడానికి కారణం నువ్వు నా కష్టాల్లో నా వాయిస్‌గా, గందరగోళంలో నా ప్రశాంతతగా నిలిచావు. కేవలం రెండేళ్లలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్న పిల్లలతో ఇంటిని తీర్చిదిద్దావు. మన పిల్లల పట్ల ఒక తల్లిగా నీ అనంతమైన ప్రేమను చూసి.. ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నా. ఈ రెండేళ్లలోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నాం. కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది. అదే మనం. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అతిపెద్ద సపోర్టర్. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ. మన కలలు, సాహసాలు, ప్రేమ, సమయంతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. ఇట్లు నీ మను' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అంతకుముందే మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్త మంచు మనోజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
అయ్యో.. మౌనిక!
హైదరాబాద్, సాక్షి: నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఝామ్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మారలేదు.. ఇక మారడని..!
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.అవమానంతో అసాధారణ నిర్ణయం.. ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది. ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
మంచు ఫ్యామిలీలో మంటలు!
సాక్షి, హైదరాబాద్/పహాడీ షరీఫ్: సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం ‘మంచు టౌన్’వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలు.. దూషణలు.. మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విష్ణు ఇన్... మనోజ్ ఔట్... దుబాయ్ నుంచి ‘మంచు టౌన్’కు తిరిగి వచి్చన మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్‌తో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని అ«దీనంలోకి తీసుకొని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది, బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్‌బాబు పేరిట ఉండటంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మనోజ్..తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పహాడీషరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయట్లేదని.. ఆత్మగౌరవం, భార్యాపిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్‌తోపాటు ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్‌రెడ్డిని సతీసమేతంగా వెళ్లి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని.. రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్‌బాబు ఇచి్చన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం ‘మంచు టౌన్’కు వెళ్లారు. మోహన్‌బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రానికి హీటెక్కిన వాతావరణం... మోహన్‌బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామగ్రిని బయటకు తరలించడానికి రెండు వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి ‘మంచు టౌన్’కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన ఏడు నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపారు. ఈలోగా మోహన్‌బాబు తన చిన్నకుమారుడి తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం గేటు బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. దాడిని ఖండించిన జర్నలిస్టులు.. మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలంటూ అక్కడే ధర్నా చేశారు. మరోవైపు మోహన్‌బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయన్ను గచి్చ»ౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంలో గాయపడ్డ జర్నలిస్టును పోలీసులు శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, టీవీ9 విలేకరి రంజిత్ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు పోలీసుల ఎదుటకు.. మోహన్‌బాబు, ఆయన కుమారులను బుధవారం ఉదయం 10:30 గంటలకు స్వయంగా తన ఎదుటహాజరుకావాలని రాచకొండ సీపీ సు«దీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే ముగ్గురి తుపాకులతోపాటు రూ. లక్ష చొప్పున పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు.గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావుమనోజ్ను ఉద్దేశించి ఆడియో సందేశంలో మోహన్ బాబు సాక్షి, హైదరాబాద్: కుటుంబ తగాదాను రచ్చకీడ్చావంటూ చిన్న కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు మండిపడ్డారు. మనోజ్ ప్రవర్తన మొదలు, ఆస్తుల పంపకం వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆడియో సందేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావు. ఆస్తులు ముగ్గురికీ సమపాళ్లు ఇస్తానా.. గంగపాలు చేస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా వ్యక్తిగతం. అది నా కష్టార్జితం. ఇంట్లో పనిచేసే వాళ్లను ఎందుకు కొడుతున్నావ్? పొట్టకూటి కోసం వచ్చిన వారిని కొట్టడం మహాపాపం. సినీ పరిశ్రమలో మోహన్‌బాబు పరుషంగా ఉంటాడేమో కానీ ఇంట్లో అలా కాదు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. బయటకు వెళ్లావు.. మళ్లీ చేయనని వచ్చావు. నీ భార్య, నువ్వు, మీ అమ్మ... ఇలాంటి పొరపాట్లు చేయమని చెబితే ఇంట్లోకి ఆహ్వానించా. కానీ ఈ విషయం ప్రజలు నమ్ముతారో లేదో. విద్యాసంస్థల బ్యాంకు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగితే అందుకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది లేదా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. మన విద్యాసంస్థలను ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్లడానికి విష్ణు తీవ్రంగా కృషి చేశాడు. విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికి వినయ్ అనే వ్యక్తి వస్తే నువ్వు అతనిపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబు? మీ నాన్నకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్లను అడ్డుకుంటున్నావ్. ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా? వినయ్, నీకు మధ్య జరిగిన గొడవలో మీ అన్న విష్ణు అడ్డుపడితే అతన్ని కూడా కొట్టడానికి సిద్ధపడ్డావ్’అని మోహన్‌బాబు ఆరోపించారు. -
మౌనిక నుంచి ప్రాణహాని ? సాక్షి చేతిలో FIR కాపీ..
-
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
నా జీవితంలో నువ్వే ఇన్స్పిరేషన్: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదిలో తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు కూడా. హీరో మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.(ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)తాజాగా తన భార్య మౌనిక పుట్టిన రోజు కావడంతో మంచు మనోజ్ విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తన భాగస్వామికి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో సూపర్ వుమెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాకు ప్రేరణగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్ గేమింగ్ యాప్ లాంఛ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మంచు మనోజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మౌనికకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సంతోషాలు నింపావ్: మంచు లక్ష్మిమంచు మనోజ్ భార్య భూమా మౌనికకు నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హ్యపీ బర్త్ డే మౌనిక.. మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మౌనికతో పాటు దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. కాగా.. మనోజ్- మౌనికల వివాహా వేడుక మంచు లక్ష్మి ఇంట్లోనే గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అన్నీ తానై ముందుండి వారి పెళ్లిని జరిపించింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు..
-
కోచింగ్ లేకుండా సివిల్స్ పాస్ అవ్వచ్చు
-
'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్‌ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
వారి లోటును భర్తీ చేయలేను.. కానీ మాటిస్తున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. తాజాగా తమ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోజ్ తన భార్యకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనప్పటికీ.. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నా. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మౌనిక సైతం పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. Happy Anniversary to my beloved wife @bhumamounika . Every day with you is a cherished journey, filled with love and joy. I am deeply grateful to God for you, Dhairav, and our little one on the way this May. 🙌🏽 Your presence has transformed my life into an extraordinary… pic.twitter.com/vQtos5jyTx — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2024 -
పెళ్లిలో మంచు మనోజ్ దంపతులు.. స్టార్ హీరో భార్యతో ఆసక్తికర సన్నివేశం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఏపీకి చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. త్వరలోనే మంచు మనోజ్ తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా ఈ జంట హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. అదే పెళ్లికి మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పెళ్లిలో తన భార్య మౌనికను నమ్రతకు పరిచయం చేశారు మనోజ్. నమ్రత కూడా మౌనికను దగ్గరికీ తీసుకుని మరి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. #TFNExclusive: The beautiful lady #NamrataShirodkar snapped greeting #BhumaMounika as they attend a wedding in the city!! 💜🤗#Namrata #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/82xo9Ajijz — Telugu FilmNagar (@telugufilmnagar) February 18, 2024 -
ఈవెంట్‌కు సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. అంతే కాదు ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. అయితే తాజాగా మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. టీచ్ ఫర్ ఛేంజ్ అనే సంస్థ నిర్వహించిన ఫండ్ రైజింగ్‌కు ఈవెంట్‌కు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. #TFNExclusive: Rocking Star @HeroManoj1 along with wife #BhumaMounika and son seen sharing some fun moments at "Teach for Change" annual fundraising event!! 🤗❤️@sundeepkishan @fariaabdullah2 #ManchuManoj #WhatTheFish #TeluguFilmNagar pic.twitter.com/jcV1ksu4uW — Telugu FilmNagar (@telugufilmnagar) February 13, 2024 -
మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. ఇటీవలే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు అనాధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మనోజ్ ప్రస్తుతం ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ! కత్తిపీటతో అత్తను దారుణంగా..
ఖమ్మం: చిలికి చిలికి గాలి వానలా మారిన అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ చివరకు అత్తమీద కోడలు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేలా చేసింది. శనివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డు ఇల్లెందులపాడుకు చెందిన అత్త శివారపు లలితమ్మ, కోడలు మౌనికలు శనివారం సాయంత్రం గొడవపడ్డారు. ఈక్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఆగ్రహంతో అత్తపై కోడలు కత్తిపీటతో తలమీద నరికింది. దీంతో లలితమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మానికి తరలించగా.. ఈ సంఘటన ఇల్లెందులపాడులో సంచలనంగా మారింది. ఇవి చదవండి: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం! -
మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్యే ఓ శుభవార్త చెప్పాడు. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో శుభవార్త చెప్పిందీ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇరువురూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్ పేరిట బొమ్మల షాపును ప్రారంభించారు. ఇక్కడున్న బొమ్మలన్నీ చైనా నుంచి దిగుమతి చేసినవి కాదని ఇండియాలోనే తయారైనవని చెప్పాడు. భార్య కృషి వల్లే సాధ్యమైంది మనోజ్ మాట్లాడుతూ.. 'మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశాం. రాసే క్రమంలో మొదటి లాక్డౌన్ వచ్చింది. అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అది ఇలా ఉపయోగపడింది. మౌనిక కృషి వల్లే బొమ్మలు తయారు చేశాం. దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేశాం. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా! కార్టూన్స్‌గా తీసుకొస్తాం సలార్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, రోబో.. రేపు రాబోయే హనుమాన్, ఈగల్.. ఇలా ఈ సినిమాల్లోని ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలే! ఈ క్యారెక్టర్లను వీడియో గేమ్స్‌గా, మంచి కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. ఇంటినే ఆఫీసుగా మార్చుకుని నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా కష్టపడుతున్నాం. మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే.వరల్డ్‌లో అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ బొమ్మగా చేసి మీకు పంపిస్తాం. అలాగే బెస్ట్ బొమ్మలు సెలక్ట్ చేసి దాని మీద కార్టూన్స్, సూపర్ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు మనోజ్. ఇద్దరికీ రెండో పెళ్లే కాగా మోహన్‌బాబు వారసుడిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిన మనోజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2015లో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్‌ను పెళ్లి చేసుకునే సమయానికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. View this post on Instagram A post shared by Namasthe World (@namasthe.world) చదవండి: స్టార్ హీరో హీరోయిన్లకు చెక్.. భారీ పారితోషికాలు ఉండవ్! -
వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..
కరీంనగర్: అదనపు కట్నం తేవాలనే అత్తామామల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా మన్మంతునిపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధన(25) సోమవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన రెండేళ్లకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తొమ్మిది నెలల కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధనను రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు చెందిన తీగల రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.7లక్షల నగదు, పల్సర్‌బైక్ కట్నంగా ఇచ్చినట్లు మౌనిక తల్లి గోగుల సమ్మక్క తెలిపారు. ఆ తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ తమ కూతురును భర్త రాజ్‌కుమార్, అత్త, మామ యశోద, పోచాలు వేధించేవారని కన్నీటి పర్యంతమైంది. తరచూ కొంత మొత్తాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ రూ.2లక్షలు తేవాలంటూ వేధించడంతో మౌనిక ఈనెల13న పుట్టింటికి వచ్చిందన్నారు. ఇటీవలే భర్తతో మాట్లాడించి మళ్లీ అత్తింటికి పంపించామని అన్నారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున మౌనిక ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజ్‌కుమార్, అత్త, మామలు యశోద, పోచాలుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మహేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విషయంలో..?? -
తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!
హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!) మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్‌ని పెళ్లి చేసుకునే టైమ్‌కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయటపెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ-అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్‌లో మనోజ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్‌బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) -
మంచు మనోజ్ అలాంటి కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక!
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు హాజరైన మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన భార్య మౌనిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనోజ్ మట్లాడుతూ..' ఏడేళ్ల గ్యాప్ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నా. ఆ గ్యాప్‌లో చాలా డిఫరెంట్ లైఫ్‌ను చూశా. అంతుకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. కానీ ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే వచ్చా. నాకు ధైర్యమిచ్చింది ఫ్యాన్స్ ప్రేమనే. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స్ ప్రేమ విలువ తెలిసింది. నాకు మంచి టీం దొరికింది' అని అన్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా హాజరయ్యారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే తనకు ఫ్యాన్స్ విలువ తెలిసి వచ్చిందని మనోజ్ మాట్లాడారు. దీంతో వేదికపై మంచు మనోజ్ మాట్లాతుండగానే మౌనిక ఫుల్ ఎమోషనల్ అయింది. తన భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. -
అవయవదానంతో యువతికి పునర్జన్మనిచ్చిన వీఆర్వో
శ్రీకాకుళం రూరల్/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/తిరుపతి తుడా : పుట్టెడు దుఖంలోనూ తమ కుమార్తె అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మను ప్రసాదించిందో కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనిక(23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు, అనంతరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మౌనిక మెదడు పూర్తిగా డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె అవయవాలు వేరేవారికి పునర్జన్మను ప్రసాదిస్తాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో మౌనిక శరీరం నుంచి అవయవాలు వేరుచేశారు. గుండెను తిరుపతి పద్మాలయ హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తరలించారు. ఒక మూత్ర పిండాన్ని వైజాగ్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి, మరో మూత్ర పిండాన్ని శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి పంపగా.. రెండు కళ్లను రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవి మాట్లాడుతూ తమ కూతురు చనిపోలేదని.. అవయవాలను దానం చేసి.. వారిలో బతికే ఉందని చెప్పారు. గుండె మార్పిడితో పునర్జన్మ తిరుపతిలోని శ్రీ పద్మావతి గుండె చికిత్సాలయం మరో యువతికి గుండె మార్పిడి చేసి పునర్జన్మను ప్రసాదించింది. నెల్లూరు పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువతి డైలేటెడ్ కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతోంది. ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రికి రావడంతో ఆ యువతికి వైద్య పరీక్షలు చేసి.. గుండె సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మౌనిక కుటుంబ సభ్యులు అవయవదానం చేయడంతో విషయాన్ని సీఎం కార్యాలయం చొరవ తీసుకుని సమాచారాన్ని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. విశాఖ నుంచి గుండెను తీసుకొచ్చేందుకు చాపర్ విమానాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను విడుదల చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో తెచ్చిన గుండెను యువతికి అమర్చారు సుమారు రూ.12 లక్షలకు పైగా ఖర్చయ్యే గుండె మార్పిడి చికిత్సను ఉచితంగా చేసి యువతికి పునర్జన్మను ప్రసాదించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు 5.30 గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెమార్పిడిని పూర్తిచేసింది. -
'అనుకున్నవన్ని జరగవు కొన్ని'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు జి.సందీప్ మాట్లాడుతూ..'కథ అంతా రెడీ చేసుకుని నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్ చేశారు. అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయడానికి చాలామంది సహకరించారు. అలా నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను. నా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మీ అందరికీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.' అని అన్నారు. కిరీటి దామరాజు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా కాన్సెప్ట్. దర్శకుడు సందీప్ చక్కగా తీశారు.' అని అన్నారు. మౌనిక మాట్లాడుతూ.. 'ఏ నటికైనా ఓ సినిమా హిట్ అయ్యాకే అవకాశాలు వస్తాయి. కానీ నా కెరీర్ బిగినింగ్‌లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారు. నా మొదటి దర్శకుడు రామరాజు.. ఇప్పుడు సందీప్ నాకు అవకాశాలిచ్చారు. నా మొదటి సినిమా లాక్డౌన్ వల్ల థియేటర్లో విడుదల కాలేదు. ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
మై డార్లింగ్ వైఫ్, మాటిస్తున్నా.. మంచు మనోజ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- భూమా మౌనిక ఈ ఏడాది మార్చిలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మంచు లక్ష్మి ఇంట ఈ వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా మౌనిక మెడలో మూడు ముళ్లు వేయడమే కాకుండా ఇకపై తన కుమారుడు ధైరవ్ నాగిరెడ్డి బాధ్యత కూడా తనదేనని గొప్ప మనసు చాటుకున్నాడు. నేడు(అక్టోబర్ 4) మౌనిక బర్త్‌డే.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'ప్రియమైన మున్నిలు.. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీపై నాకున్న ప్రేమను, ఇష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది నువ్వే.. మనల్ని కలిపిన కాలానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మా జీవితాల్లో వెలకట్టలేనంత సంతోషాన్ని తీసుకొచ్చావు, నవ్వుల్ని పంచావు. నీ నిస్స్వార్థ ప్రేమ, నువ్వు చూపించే కేరింగ్‌ను మాటల్లో చెప్పలేను. నువ్వు, ధైరవ్.. నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నీ మనసెంత మంచిదంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్లందరి ముఖాల్లోనూ చిరునవ్వును తీసుకొస్తావు. నీ చుట్టూ ఉన్నవారందరికీ ప్రేమను పంచుతావు. నాకున్న కోరికల్లా ఒక్కటే.. ఎల్లప్పుడూ నువ్వు సుఖసంతోషాలతో ఉండాలి. నీకంతా మంచే జరగాలి మై లవ్.. నీపై ఎప్పటికీ ప్రేమను కురిపిస్తూనే ఉంటానని మాటిస్తున్నాను. నీ ఆనందమే నాక్కావాల్సింది. దానికోసం నేనేదైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. ఈ బర్త్‌డే సందర్భంగా మనం కలిసున్న సుమధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను మున్నిలు.. నీ వ్యక్తిత్వాన్ని తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతోంది. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్ వైఫ్. నీ మనసు కోరుకున్నదంతా నీకు దక్కాలని కోరుకుంటున్నాను.. ధైరవ్, జోయాతో పాటు నా తరపునుంచి కూడా మరోసారి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) చదవండి: 2015లో పెళ్లి.. పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర నటి -
విజేత మౌనిక అక్షయ.. కుశాగ్ర మోహన్‌కు రజతం
జంషెడ్పూర్: టాటా స్టీల్ ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ విజేతగా అవతరించింది. గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల మౌనిక అక్షయ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మౌనిక అక్షయ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కే చెందిన భాగ్యశ్రీ పాటిల్, బ్రిస్టీ ముఖర్జీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కుశాగ్ర మోహన్‌కు రజతం బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన కుశాగ్ర మోహన్ రజత పతకం సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అలెక్సీ గ్రెబనోవ్ (రష్యా), కుశాగ్ర మోహన్ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... గ్రెబనోవ్కు స్వర్ణం ఖరారైంది. కుశాగ్ర మోహన్‌కు రజతం లభించింది. క్వార్టర్స్‌లో ఓడిన అభిమన్యు బెల్గ్రేడ్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు నలుగురు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. ఆకాశ్ దహియా (61 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, అభిమన్యు (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో... సందీప్ మాన్ (86 కేజీలు) రెండో రౌండ్లో... సుమిత్ మలిక్ (125 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో సందీప్, సుమిత్‌లపై నెగ్గిన రెజ్లర్లు ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు ‘రెపిచాజ్’ రౌండ్లలో ఆడే అవకాశం కూడా రాలేదు. అభిమన్యు క్వార్టర్ ఫైనల్లో 2–9తో అలెన్ రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అలెన్ ఫైనల్ చేరుకోవడంతో అభిమన్యుకు నేడు ‘రెపిచాజ్’ బౌట్లలో పోటీపడే అవకాశం లభించింది. -
మనోజ్- మౌనిక.. అదొక్కటే నిజం.. నాన్నను ఒప్పించమని వేడుకున్నా!
ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం పెద్ద టాస్కే! కానీ ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే తప్పకుండా విజయం వరించి తీరాల్సిందే! మంచు మనోజ్, భూమా మౌనికలు కూడా ప్రేమించుకున్నారు. దశాబ్దకాలానికి పైగా పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం.. ఇరు కుటుంబాలు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అని మొదట్లో అంతా టెన్షన్ పడ్డారు. అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడింది తానేనంటోంది మంచు లక్ష్మి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్లినప్పుడు.. మనోజ్- మౌనికకు పెళ్లి చేయి దేవుడా.. నా వల్ల కావడం లేదు. మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. రెండు కుటుంబాలకు ఓ చరిత్ర ఉంది. మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న సందేహం వారికుంది. కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య? కుదిరితే ఆశీర్వదించాలి. ఎలాగోలా వారికి పెళ్లయింది. సంతోషంతో వాళ్లను యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఆయన నా మాట విన్నాడనిపించింది. పెళ్లికి ముందు వరకు ఇద్దరూ నాతోపాటే ఉన్నారు. పెళ్లయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? అని మౌనిక అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా? ఎలాగైనా చేసుకుపో అని టార్చర్ పెడుతున్నాను. కానీ తనకు చాలా ఓపిక ఉంటుంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు, నలుగుర్ని కనాలనుకున్నా.. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: నిహారిక, బిందుమాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మి కామెంట్స్ -
మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొద్ది నెలల క్రితమే భూమా మౌనికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఏడాదిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన సుమలత కుమారుడి పెళ్లిలో ఈ జంట సందడి చేశారు. తాజాగా యోగా డే సందర్భంగా మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) మనోజ్ వైఫ్ భూమా మౌనిక యోగా డే సందర్భంగా అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. మై వైఫ్ భూమా మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందే యోగా డే సందర్భంగా భూమా మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు 108 సూర్యనమస్కారాలు పూర్తి చేసి.. యోగాపై నా ప్రేమకు అంకితం చేస్తున్నా. నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభానాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్.. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా) View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) -
ఆదిపురుష్ రిలీజ్.. మనోజ్ చేసిన పనికి ప్రశంసలు
ప్రభాస్ ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల రోజు ఎక్కడా చూసిన జై శ్రీరామ్ నినాదాలే వినిపించాయి. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ఆదిపురుష్ టీం కొందరికి ఉచితంగా టికెట్స్ అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇవాళ ఆదిపురుష్ విడుదల సందర్భంగా టాలీవుడ్ దంపతులు మంచు మనోజ్- భూమా మౌనిక చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఈ జంట ఏం చేశారో తెలుసుకుందాం. (ఇది చదవండి: సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్.. వీడియో వైరల్) ఇటీవలే మంచుమనోజ్ తన పుట్టిన రోజులు వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ పుస్తకాలు, బ్యాగులు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి మంచు మనోజ్- మౌనిక సినిమాను వీక్షించారు. పిల్లల కోసం టికెట్స్ మంచు మనోజ్ కొనుగోలు చేశారు. ప్రసాద్ ఐమాక్స్‌లో అనాథ పిల్లలతో కలిసి సినిమా చూస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అలాంటి వారి కోసం మనోజ్ దాదాపు 2500 టికెట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్ చేసిన పనికి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం అభినందిస్తున్నారు. Our 𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 @HeroManoj1 & @BhumaMounika spread joy today as they watched the #Prabhas' blockbuster #Adipurush with orphanage kids. ❤️ Their kind gesture brought smiles to the faces of the children,creating a memorable experience for the kids !#ManchuManoj #RSMM pic.twitter.com/hr9eLezv1k — Rocking Star ManojManchu Fan zone (@RSMMFanZone) June 16, 2023 -
హీరో పెళ్లిలో మంచు మనోజ్- మౌనిక సందడి (ఫొటోలు)
-
మౌనికది హత్యా, ఆత్మహత్యా! పురుగుల మందు తాగితే తలపై గాయం ఎక్కడిది?
వరంగల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత భూక్యా మౌనిక(28) ఆత్మహత్య చేసుకు న్న ఘటన మండలంలోని పకీరతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మంగీలాల్ కథనం ప్రకారం.. మానుకోట జిల్లా నర్సింహులపేట మండలం పకీరతండాకు చెందిన భూక్యా వెంకన్న, బుల్లిల కుమారుడు రాంబాబుతో 11 సంవత్సరాల కిత్రం బయ్యారం మండలంలోని చోక్లాతండాకు చెందిన తేజావత్ హుస్సేన్ కుమార్తె మౌనికకు వివాహం జరిగింది. ఈక్రమంలో అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, మామ వేధించడంతో ఇంట్లోనే మౌనిక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మౌనికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి తేజావత్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తలపైన బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరుగుతుందని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
అన్నీ కలిసొస్తే ఈమె గురించి దేశమే మాట్లాడుకునేది కానీ...
-
ఆ రోజు మనోజ్‌ను చూసి ఎమోషనల్ అయ్యా: భూమా మౌనిక
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్, మౌనిక ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ పరిచయం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లికి ముందు పడిన కష్టాలను మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'మా ఇరు కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. కానీ అనుకోకుండా మా ఇద్దరి లైఫ్‌లో చెరోదారిలో వెళ్లాం. ఆ తర్వాత నా కెరీర్లో చాలా ఇబ్బందులు పడ్డా. ఆ తర్వాత మేం మళ్లీ కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్లం. ఫస్ట్ నాకే ఆ ఫీలింగ్ వచ్చింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే తన వల్లే నాకు లైఫ్ దొరికింది. నా లైఫ్‌లో బాధలు చూశా. ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పాను. నాకు మళ్లీ హ్యాపీగా బతకాలనుంది. నాకు కొత్త జీవితం నీ వల్లే వస్తుంది. నా జీవితం ఇలా ఉండడం నాకు నచ్చడం లేదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది. నిన్ను, బాబును బాగా చూసుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మౌనిక బాగా ఆలోచించావా? ఈ సోసైటీ ఏమనుకుంటుంది? అని అడిగింది. ఆ తర్వాత తను ఒప్పుకుంది. ఆమెతో పాటు నాకు బాబు దొరకడం ఓ మిరాకిల్. ఆ తర్వాత కట్ చేస్తే ఉప్పెన. మా ప్రేమ అలా ఈశ్వర సాంగ్‌ను తలపించింది. లైఫ్‌లో తానే నాకు ఓ ఇన్స్పిరేషన్. ' అంటూ తన ప్రేమకథను వెల్లడించారు. (ఇది చదవండి: నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే: మంచు మనోజ్) మౌనిక మాట్లాడుతూ..' మనోజ్ ఒక గ్రేట్ లర్నింగ్ సెంటర్. రాయలసీమలో పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అనే సందర్భం ఒకటి మా జీవితాన్ని మలుపు తిప్పింది. యాక్సిడెంట్లో అమ్మ చనిపోవడం, నాన్నకు బై ఎలక్షన్. మాకసలు దాన్నుంచి బయటికి రావడానికే చాలా టైం పట్టింది. ఆ సమయంలో నాన్న చాలా ఇబ్బంది పడిపోయారు. నాన్న రూముకు వెళ్లడానికే మాకు కొన్ని నెలలు పట్టింది. అమ్మా, నాన్నను కోల్పోయాం. ఇంత కన్నా బ్యాడ్‌గా లైఫ్‌లో ఎవరికీ జరగదు. మమ్మల్ని చిన్నపిల్లలుగా చూసుకోవడానికి కూడా మాకు టైం లేదు. నేను, తమ్ముడు, అక్కా జీవితంలో చాలా మొండిగా మారిపోయాం. అమ్మ చనిపోయాక.. ఆమె బర్త్ డే రోజు ఆకాశం వైపు చూస్తూ 'మామ్.. నిన్ను నేను వదిలేశా'. నీవు నాకు తెలుసు.. ఐ వ్యాంట్ లీడర్ లైఫ్. అమ్మా నువ్వు ఎక్కడున్నా నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నా. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడే ఉంచు. అయితే అమ్మ బర్త్ డే రోజు మనోజ్ వస్తున్నాడని నాకు తెలీదు. మనోజ్ రాడేమో అనుకున్నా. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను. ఆయనను చూడగానే ఫుల్ ఎమోషనల్ అయ్యాను.' అంటూ తన ప్రేమతో పాటు జీవితంలో పడిన కష్టాలను పంచుకున్నారు. -
ఈ జన్మకు బతికి వేస్ట్ అనుకున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో, మంచు వారబ్బాయి మనోజ్ ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడి ఆమెతో కొత్త జీవితం ఆరంభించాడు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం తర్వాత ప్రేమగా మారగా దాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారిద్దరూ. మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ షోలో పాల్గొని తమ ప్రేమ కహానీని బయటపెట్టింది. ముందు మనోజ్ మాట్లాడుతూ.. మా ఇద్దరిలో తానే ఎక్కువ రొమాంటిక్ అని చెప్పాడు. మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ఆమె జయంతి రోజు ఆకాశం వైపు చూస్తూ ఎక్కడున్నావమ్మా.. నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని నాలో నేను మాట్లాడుకున్నాను. అప్పుడు ఎంతో బాధలో ఉన్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు రాడేమో అనుకున్నాను... ఆరోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. పెళ్లికి ముందు మనోజ్ కోపాన్ని ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ మనోజే ఇప్పుడు నా కోపంతో డీల్ చేస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది మౌనిక. ప్రేమ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మనోజ్ మాట్లాడుతూ.. 'ప్రేమ అనేది రెండుపక్కలా ఉండాలి. ఒకానొక సమయంలో ఎక్కడున్నాను? ఎటు వైపు వెళ్తున్నాను? అనేది అర్థం కాలేదు. అప్పుడు ప్రేమ? సినిమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది. నన్ను నమ్ముకుని ఒక బిడ్డతో అమ్మాయి నిలబడి ఉంది.. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు మనోజ్. అలా మౌనికను పెళ్లాడి ఆమె కొడుకు బాధ్యతను సైతం తనే స్వీకరించాడు. -
భార్యతో క్యూట్ వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది.ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే వీరి పెళ్లయి నేటికి సరిగ్గా నెలరోజులవుతుంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి ఓ క్యూట్ వీడియోను పంచుకున్నారు మనోజ్. దీనికి 'ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు' అంటూ క్యాప్షన్ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల విషయంలోనూ జోరు పెంచారు మనోజ్. -
మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్‌డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్ అవుతున్న ఫ్యాన్స్ మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్‌డే సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
పెళ్లి అనంతరం శ్రీవారిని దర్శించుకున్న మనోజ్-మౌనికలు.. ఫొటోలు
-
మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు.. అందమైన పెళ్లి వీడియో
జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో మాత్రం కాదు అంటున్న మంచు మనోజ్ తన ప్రేమను గెలిచాడు. ప్రేమించిన మౌనిక మెడలో మూడుముళ్లు కట్టి తనతో ఏడడుగులు నడిచాడు. పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే మనోజ్ మెహందీ ఫంక్షన్, కాక్టైల్ పార్టీ వీడియోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయింది. తాజాగా మధురమైన పెళ్లి క్షణాలను ట్విటర్లో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ వీడియోలో మనోజ్‌ను పెళ్లికొడుకు చేసి తెగ మురిసిపోయింది. మరోవైపు మౌనికను పెళ్లికూతురుగా మండపంలోకి తీసుకొచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేముందు తండ్రి మోహన్‌బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనోజ్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతం కావడంతో మనోజ్, మౌనికల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మోహన్‌బాబు చేతుల మీదుగా తాళి అందించడం.. దాన్ని భార్య మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి లోనవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. -
మా ప్రేమ గెలిచింది, నాన్న ఆశీస్సులు ఉన్నంతవరకు.. : మనోజ్
నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వరుసగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది. మౌనిక కోరుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుంది. మున్ముందు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఒకరికి ఒకరు తోడు ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం. అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నాను. బాబు, నేను, మౌనిక.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాం. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు..అది ఇదేనేమో' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు మనోజ్. -
మంచు మనోజ్- మౌనికల మెహందీ ఫంక్షన్ (ఫొటోలు)
-
మనోజ్ మెహందీ ఫంక్షన్.. పానీపూరీలో వోడ్కా కలిపిన మంచు లక్ష్మి!
మంచు మనోజ్, మౌనికలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మార్చి 3న ఈ పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మనోజ్- మౌనికల మెహందీ, కాక్టైల్ సెలబ్రేషన్స్ వేడుకను మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కోసం తన ఇంటిని, ఇంటి ముందు ప్రాంగణాన్ని ఎంత అందంగా ముస్తాబు చేశారో చూపించింది. పనిలో పనిగా తనూ రెడీ అయి ఫోటోషూట్ చేసేసింది. మెహందీ ఫంక్షన్‌కు మంచు లక్ష్మి వైట్ డ్రెస్‌లో రెడీ అయింది. మెహందీ పెట్టుకుంటే అన్నం, చపాతీల్లాంటివి తినడం కష్టం కాబట్టి వేరే ఎవరైనా తినిపించడానికి వీలుగా ఉండేలా చాట్స్ ఏర్పాటు చేయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే పానీపూరీలో ఎవరికీ తెలియకుండా వోడ్కా కలిపేస్తానని, దెబ్బకు టేస్టే మారిపోతుందని తెలిపింది. పానీపూరీతో పాటు రాజస్తానీ కడీ కచోరీ, రగడ వంటి చాట్స్ ఏర్పాటు చేయగా వాటినోసారి రుచి చూసింది లక్ష్మి. అనంతరం ఫ్యామిలీ అంతా మెహందీ పెట్టుకున్న క్షణాలను కెమెరాలో బంధించింది. ఈ క్రమంలో చేతినిండా గోరింటాకు పెట్టుకున్న పెళ్లికూతురు మౌనిక చెవికమ్మలను సరిచేస్తూ కనిపించింది మంచు లక్ష్మి. తర్వాత కాక్టైల్ పార్టీలో మంచు మనోజ్, లక్ష్మి.. వారి కుటుంబం అంతా కలిసి సరదాగా చిందేశారు. ఇక అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ మౌనికను సొంత సోదరిలా చూసుకుంటూ తనకు కావాల్సినవి ఏర్పాటు చేసిన మంచు లక్ష్మి మంచితనాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. -
కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
అందరూ అనుకున్నట్టుగానే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది. ఇక తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. ఈ ఫొటో వివాహనికి ముందు బయటకు రాగా నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: భార్యతో అత్తారింటికి బయలుదేరిన మనోజ్, భారీ కాన్వాయ్, బందోబస్తుతో.. ఇక అదే ఫొటోను షేర్ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. అంతేకాదు ‘ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు’ అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ఒంటరి వాడు అయిన మనోజ్ మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. పెళ్లి అనంతరం మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకుని ఏడ్చిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు’ అంటూ రెండు హార్ట్ ఎమోజీలను జత చేసింది. వీరి పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పగా.. మొదటి నుంచి మంచు లక్ష్మి వీరికి మద్దతుగా ఉందని ఈ పెళ్లితో తెలిసిపోయింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అయితే ఎప్పటి నుంచో మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మనోజ్-మౌనికలు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరు వేరువేరుగా లైఫ్‌ను స్టార్ట్ చేశారు. ఇక ఇద్దరి జీవితాల్లో పెళ్లి పెటాకులు కావడంతో.. వీరు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న మనోజ్-మౌనికలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి కర్నూలు బయలుదేరిన సంగతి తెలిసిందే. And they lived happily ever after💞 @HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/b2GfcCSChl — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 4, 2023 -
భార్యతో అత్తారింటికి బయలుదేరిన మనోజ్, భారీ కాన్వాయ్, బందోబస్తుతో..
ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం వీరి వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. పెళ్లి అనంతరం నేడు ఈ కొత్త జంట ముందుగా కర్నూల్‌కు వెళ్లనుంది. తాజాగా మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి బయలు దేరిన ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన తన సోదరి మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా మనోజ్, మౌనికలు కర్నూలుకు పయనమయ్యారు. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు, కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను ఈ కొత్త జంట దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనుందని సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్లో ఉన్న మనోజ్, మౌనికలు మార్చి 3న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. Lovely couple @HeroManoj1 and #BhumaMounika headed to Kurnool from Hyderabad with a huge Convoy. 😍🚙 First they will meet & take blessings from Ram Subbareddy garu in Proddatur & later the couple will pay tribute to Bhooma Nagireddy and Shobha Nagireddy in Allagadda.#MMWeds pic.twitter.com/KElYvpBbM4 — Phani Kandukuri (@phanikandukuri1) March 5, 2023 -
నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు, దటీజ్ మనోజ్: వెన్నెల కిశోర్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. భూమా మౌనికను పెళ్లాడాడు. మార్చి 3న జరిగిన వీరి వివాహానికి అతి దగ్గరి బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మనోజ్ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించడం విశేషం. 'పెళ్లి.. మ్యారేజ్.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్‌గా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్! M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్, మౌనికల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వెన్నెల కిశోర్. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్ లైఫ్ స్టైల్. డిగ్రీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని ముగించాడు వెన్నెల కిశోర్. -
శివుని ఆజ్ఞ.. మౌనిక కొడుకు బాధ్యతలు తీసుకున్న మంచు మనోజ్!
అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. మంచు మనోజ్, భూమా మౌనికలు మొదట్లో కేవలం స్నేహితులు మాత్రమే! ఒకరిపై ఒకరికి ఉన్న ఆప్యాయత వారిని ఒక మెట్టు ఎక్కించి ప్రేమసాగరంలోకి తీసుకెళ్లింది. పెద్దల ఆశీర్వాదంతో ఆ ప్రేమను గెలిచి పెళ్లిపీటలెక్కారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఈ పెళ్లిని భుజాన వేసుకున్న మంచు లక్ష్మి తన స్వగృహంలోనే ఈ వేడుక జరిపించింది. మనోజ్-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న విషయం తెలిసిందే! మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి ఫోటోల్లో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తాజాగా మంచు మనోజ్ ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశాడు. ఇందులో మౌనిక చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు మనోజ్. ఈ ఇద్దరి చేతులను ఓ పిల్లవాడు తన హస్తాలతో పట్టుకున్నాడు. దీనికి శివుని ఆజ్ఞ అని క్యాప్షన్ జోడించాడు. ఆ పిల్లవాడు మరెవరో కాదు, ధైరవ్ రెడ్డి. ఇక మీదట వీరిద్దరి బాధ్యత తనదే అని మనోజ్ చెప్పకనే చెప్పాడని తెలుస్తోంది. శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023 -
అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్. అయితే మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే ఉంచారు. పెళ్లి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్ అయ్యేవరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి వేడుకలో భాగంగా ఒక్కొ ఫొటో షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మికి ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే మనోజ్ పెళ్లి బాధ్యతను తీసుకుని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఈ క్రమంలో మెహందీ, హల్దికి సంబంధించిన ఫొటోలను ఆయన సోదరి మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. హల్ది, మెహందీ నుంచి మనోజ్‌ను పెళ్లి కొడుకుగా చేసే వరకు అన్నింటిని ఆమె చూసుకుంది. ఈ క్రమంలో అక్క గురించి మనోజ్ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. తనని పెళ్లి కొడుకు చేస్తున్న అక్క మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ అక్క’ అంటూ పోస్ట్ చేశాడు. కాగా వివాహ అనంతరం మనోజ్ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక ఇతర కుటుంబ సభ్యులంతా మనోజ్‌తో ఉండి దగ్గరుండి ఈపెళ్లిని జరిపించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. Manchu Manoj Wedding Activities | Manchu Manoj Weds Bhuma Mounika Reddy #ManchuManoj #BhumaMounikaReddy #SakshiNews pic.twitter.com/2JuEgLRHc8 — Sakshi TV Official (@sakshitvdigital) March 3, 2023 చదవండి: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక 7 నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన ది లెజెంట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
పెళ్లితో ఒక్కటైన మంచు మనోజ్, భూమా మౌనిక (ఫొటోలు)
-
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మికి ఎంతో ఇష్టం. తమ్ముడి మీదున్న కొండంత ప్రేమతో అతడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఇప్పటికే మనోజ్‌ను పెళ్లికొడుకును, మౌనికను పెళ్లి కూతురును చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023 Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
మనోజ్‌ను పెళ్లి కొడుకును చేసిన మంచు లక్ష్మి, ఫోటో చూశారా?
పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు మంచు మనోజ్, భూమా మౌనిక. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారగా నేడు మూడు ముళ్లబంధంతో భార్యాభర్తలుగా మారనున్నారు. ఈ క్షణం కోసం వారిద్దరే కాదు, అభిమానులు సైతం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అటు మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపిస్తోంది. తన ఇంట్లోనే ఈ శుభాకార్యాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లికి హాజరైన డిజైనర్ శిల్పారెడ్డి తాళి కట్టే ముహూర్తానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మనోజ్‌ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వదలగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మనోజ్ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం మనోజ్ సైతం పెళ్లికూతురు అంటూ మౌనిక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు నెటిజన్లు. Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023 Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి జరగడానికి కారణమిదే!
మరికాసేపట్లో మంచు మనోజ్, భూమా మౌనిక వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ రోజు (మార్చి 3) రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి స్వగృహంలో వీరి పెళ్లి జరగనుంది. అయితే మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మి తన భుజాన వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమ్ముడి పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు లక్ష్మిని అభిమానులు కొనియాడుతున్నారు. కానీ ఏదైనా ఫంక్షన్ హాల్లోనో మరింకెక్కడోనో పెళ్లి జరిపించకుడా లక్ష్మి ఇంట్లో ఎందుకు ఈ తంతు నిర్వహిస్తున్నారన్న అనుమానాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మంచు లక్ష్మికి మనోజ్ అంటే ప్రాణం. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. మనోజ్ అంటే చాలా ఇష్టమని, తనను కొడుకులా చూసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అంతేకాదు, మనోజ్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలిచింది. మనోజ్ పెళ్లి రూమర్స్ గురించి అడిగినప్పుడు కూడా వ్యక్తిగత విషయాలను ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి ఘడియలు రావడంతో తనే పెళ్లిపెద్దగా మారింది. మనోజ్ తనకు ఎంతో క్లోజ్ కావడంతో పెళ్లి పనులు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే బీటెక్ పూర్తి చేసిన ఆమెకు విదేశాల్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. కొంతకాలంగా మనోజ్‌తో ప్రేమలో ఉన్న ఆమె ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది. -
మంచు మనోజ్- భూమా మౌనిక పెళ్లి.. ముహూర్తం ఖరారు
టాలీవుడ్ ఫ్యామిలీ మంచు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అందరూ అనుకుంటున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం మార్చి 3న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైంది. కాగా.. ఇప్పటికే మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మనోజ్- మౌనికల వివాహం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఇంటిలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇరువర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై చాలా సార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. -
మౌనిక నా జీవితంలోకి రావడం అదృష్టం!: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. మార్చి మొదటి వారంలో భూమా మౌనికను పెళ్లాడబోతున్నాడనేది ఆ కథనాల సారాంశం. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. తామిద్దరం మంచి మిత్రులమని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడట. కష్టసమయాల్లో మౌనిక తనకు అండగా నిలబడిందని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండటం అదృష్టమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా మనోజ్, మౌనిక జంటగా చాలాసార్లు కనిపించడంతో ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. పైగా త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ ఆమధ్య హింట్ కూడా ఇచ్చాడు హీరో. దీంతో వీరి పెళ్లి జరగడం ఖాయమని అంతా ఫిక్సయ్యారు. కానీ ఇప్పటివరకు వీరి వివాహం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇకపోతే మనోజ్‌కు ఇదివరకే ప్రణతితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటు మౌనికకు కూడా ఇదివరకే పెళ్లవగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. -
Mounika Reddy Marriage Pics: బీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ నటి, వరుడు ఎవరంటే..!
షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనిక రెడ్డి. షణ్ముఖ్ జశ్వంత్ ‘సూర్య’ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా చేసి రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం ఆమె లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఓ వైపు వెండితెరపై నటింగా, మరో వైఫు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తన ప్రియుడు సందీప్ అనే వ్యక్తితో ఏడడుగులు వేయబోతోంది. చదవండి: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా? ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అంతేకాదు తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. అంతేకాదు పెళ్లి తేదీ కూడా ప్రకటించింది. డిసెంబర్ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగునున్నట్లు మౌనిక తెలిపింది. కాగా మొదట స్నేహితులుగా పరిచమైన వీరద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటీనటుల నుంచి ఫాలోవర్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) -
మౌనిక రెడ్డితో రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఆదివారం హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక మండపానికి భూమా మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది.చదవండి:పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి! అంతేకాకుండా ఇద్దరూ కలిసి జంటగా పూజలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మౌనిక రెడ్డిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీరు ఏమంటారు అని మంచు మనోజ్‌ని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... అది వ్యక్తిగత విషయమని, మంచిరోజున తానే అన్ని విషయాలు తప్పకుండా చెబుతాను అంటూ మనోజ్ సమాధానమిచ్చాడు. ఇక భూమా మౌనిక రెడ్డితో పెళ్లి తర్వాత మనోజ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్ -
పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమోకానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. -
ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వివాహిత పోగుల మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.కిశోర్ కథనం ప్రకారం.. మౌనికకు 10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. పర్వతగిరిలో కంగన్‌హాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యభర్తలు తరచు మనస్తాపానికి గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత బలి.. సంగెం: వరకట్న వేధింపులు తాళలేక విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉమామహేశ్వరి(20)ని హైదరాబాద్ బొల్లారానికి చెందిన కొప్పుల కమలాకర్ అలియాస్ కిరణ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగష్టు 18న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంచనాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భర్త కమలాకర్, అత్త పద్మ, మామ పాండు రూ.6 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. రెండు నెలల క్రితం కొట్టి తల్లిగారింటికి పంపించారు. అప్పటి నుంచి లోహితలోనే ఉంటున్న ఉమామహేశ్వరి.. అదనపు కట్నం ఇవ్వలేక, కాపురానికి వెళ్లలేక మనస్తాపం చెంది ఈ నెల 11న విష గుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తల్లి బొల్లేపల్లి సుమలత ఫిర్యాదు మేరకు కమలాకర్, పద్మ, పాండులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్దోజు కిరణ్మయి తెలిపారు. చదవండి: (ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య) -
మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..
సాక్షి, కొత్తవలస (విజయనగరం): కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్(7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలు మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు. చదవండి: (తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి) సినీఫక్కీలో హత్యకు పథకం భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు పథకం రచించి జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపైనుంచి భార్య దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా అభంశుభం తెలియని భార్య లక్ష్మిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా హత్యచేసిన నాగరాజును ఉరితీయాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. జోడిమెరక గ్రామ నుంచి గిరిజనులు నినాదాలు చేస్తూ కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు. -
ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఆపై..
సాక్షి, సోమల (చిత్తూరు): మండలంలోని కందూరు పంచాయతీలో శనివారం భర్త, అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తుడుంవారిపల్లి కి చెందిన ఓబులేశు, మౌనిక(22) ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు ఓమ్సాత్విక్(2), కుమార్తె(6నెలలు) ఉన్నారు. మౌనికను భర్త, అత్త, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అమ్మమ్మ లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు. తల్లి కోసం పిల్లలు ఏడ్వడాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. చదవండి: (పాము రాసిన విషాద గీతం) -
బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి..
మంచిర్యాలక్రైం: పెళ్లయిన చాలాకాలం తర్వాత పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ హాయిగా జీవనం సాగిస్తోంది ఆ కుటుంబం. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా పడిన పిడుగు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీవ్రగాయాల పాలయ్యారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో అందె వెంకటేశ్, మౌనిక దంపతు లు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శ్రీయాన్(18 నెలలు)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఫ్లై ఓవర్‌బ్రిడ్జిపైకి రాగానే పిడుగుపడింది. ముగ్గురూ కిందపడిపోగా, మౌనిక(28), శ్రీయాన్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన వెంకటేశ్(32)ను కరీంనగర్‌కు తరలించారు. గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు సీసీసీ నాగార్జున కాలనీకి చెందిన మౌనికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మౌనిక, శ్రీయాన్ మృతిచెందడం, వెంకటేశ్ ప్రాణాపాయస్థితిలో ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, కలెక్టర్ భారతి హోళికేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌనిక, శ్రీయాన్ మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, తహసీల్దార్ రాజేశ్వర్‌ను భారతి ఆదేశించారు. అవే కారణమై ఉండొచ్చు.. నడుస్తున్న వాహనంపై పిడుగుపడటమనేది అనూహ్యమైన ఘటన అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారిణి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సెల్ఫోన్లు, ఇనుప వస్తువులు వాహకాలుగా పనిచేసి ఎక్కువగా విద్యుత్ తరంగాలను ఆకర్షిస్తాయని తెలిపారు. మేఘాల రాపిడి సమయంలో వీటిలో ఏదైనా విద్యుత్‌ను ఆకర్షించి ఉంటుందని, అదే ఘటనకు కారణమై ఉండొచ్చని ఆమె వివరించారు. -
రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక
సాక్షి, అడ్డగూడూరు: రాజును పోలీసులే చంపారని, ఆత్మహత్య అని కట్టుకథ అల్లి ప్రచారం చేస్తున్నారని అతడి భార్య మౌనిక, తల్లి ఈరమ్మ ఆరోపించారు. రాజును పట్టుకున్న పోలీసులు.. కోర్టుకు అప్పజెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందని అంటున్నారని.. మరి తమ కుటుంబం పరిస్థితి ఏమిటని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంపేసి పట్టాలపై వేశారు: ఈరమ్మ తన కొడుకు రాజును పోలీసులు పథకం ప్రకారమే చంపేశారని అతడి తల్లి ఈరమ్మ ఆరోపించింది. ‘‘నేను హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడే.. నా కొడుకు రాజును పట్టుకున్నారని పోలీసులు అనుకుంటుంటే విన్నాను. కానీ చంపేసి రైలు పట్టాలపై వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లారు. హైదరాబాద్‌లోని మా కొడుకు ఇంటిని చిన్నారి బంధువులు కూలగొట్టారు. మాకు తలదాచుకోవడానికి ఏ దిక్కూ లేకుండా పోయింది.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డకు న్యాయం చేయాలె.. తిరుమలగిరి (తుంగతుర్తి): రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారని, తన బిడ్డ బతుకు మాత్రం ఆగమైపోయిందని మౌనిక తల్లి యాదమ్మ వాపోయింది. సూర్యాపేట జిల్లా తిరు మలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన ఆమె గురువారం మీడియాతో మాట్లాడింది. ‘‘రాజు నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పోయిన శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి నా భర్తను, ఇద్దరు కొడుకులను, బిడ్డను తీసుకొనిపోయారు. ఈ బుధవారం రాత్రి పంపించారు. తెల్లారే సరికి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. నా బిడ్డ బతుకు ఆగమైపోయింది. ఆమెకు ఓ ఆడపిల్ల ఉంది. వారి భవిష్యత్తు ఏమైపోవాలి. ప్రభుత్వమే న్యాయం చేయాలి..’’ అని విజ్ఞప్తి చేసింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక కొద్దిరోజులుగా తాను తల్లిగారి ఇంట్లో ఉంటున్నానని రాజు భార్య మౌనిక తెలిపింది. ‘‘గత శుక్రవారం హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి.. నన్ను, మా అత్తమ్మ, ఆమె బిడ్డ, బిడ్డ భర్తను తీసుకెళ్లారు. రాజు గురించి అడిగారు. వెతకడానికి మమ్మల్ని వెంట తీసుకెళ్లారు. మాతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని.. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ చౌరస్తాలో వదిలివెళ్లారు. అక్కడి నుంచి మేం భువనగిరికి బస్సులో వచ్చి.. ఓ బండి మాట్లాడుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అడ్డగూడూరుకు చేరుకున్నాం. కొద్దిగంటల్లోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. నా భర్తను పోలీసులే పొట్టన పెట్టుకున్నారు. కోర్టుకు అప్పగిస్తే శిక్ష అనుభవించేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే.. మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. నాకు 11 నెలల కూతురు ఉంది. ఇప్పుడు మా ఇద్దరికి దిక్కెవరు?’’ అంటూ రోదించింది. -
పెళ్లింట విషాదం..
నిర్మల్/కడెం: పెళ్లిపందిరి ఇంకా పచ్చగానే ఉంది. పెళ్లికూతురు కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లి సంబురం తీరనేలేదు. ఇంతలోనే.. ఆ పచ్చటిపందిరి కింద పెళ్లికూతురు, ఆమె తండ్రి విగతజీవులై ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో చోటుచేసుకుంది. పాత మద్దిపడగకు చెందిన కొండ రాజన్న(50), వసంత దంపతులు. వీరి ఏకైక సంతానం మౌనిక(22). రాజన్న ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఏడాది క్రితమే తిరిగివచ్చారు. భార్య వసంత ఊళ్లోనే కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేది. మౌనిక హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా సమీపంలోని రాజూరాకు చెందిన సింగరేణి ఉద్యోగి జనార్దన్‌తో మౌనికకు ఈ నెల 25న పెళ్లి జరిగింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. 27న రాజూరాలో జనార్దన్ కుటుంబం ఏర్పాటు చేసిన రిసెప్షన్లో రాజన్న కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా పాల్గొన్నారు. అనంతరం నవదంపతులతోపాటు అదేరోజు రాత్రి పాతమద్దిపడగకు బయల్దేరారు. సరిగ్గా పదినిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా అనుకోని ఘోరం జరిగింది. కడెం ప్రాజెక్టు దిగువన పాండ్వాపూర్ బ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఎర్టిగ వాహనం రాంగ్రూట్లో వెళ్లి కల్వర్టు మూలను బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు దిగువన పడిపోయింది. అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తులోనే ఉన్నారు. తేరుకునేలోపే భర్త భుజంపై తలవాల్చి పడుకున్న కొత్త పెళ్లికూతురును మృత్యువు మింగేసింది. తన బిడ్డను విడిచి ఉండలేనన్నట్లు రాజన్న కూడా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. వసంత, జనార్దన్‌కు స్వల్పగాయాలయ్యాయి. బంధువుల అమ్మాయికి, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అమ్మాయి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. అతివేగం, నిద్రమత్తు.. వాహనం అతివేగంగా వెళ్తుండటంతోపాటు డ్రైవర్‌ను నిద్రమత్తు ఆవరించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడెం ప్రాజెక్టు కిందకు పల్టీ కొట్టిన వాహనం నదికి కొంతదూరంలోనే ఆగింది. అది నది నీళ్లలో పడి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్పారు. -
హెచ్సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ!
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(కరీంనగర్): హైదరాబాద్‌లో ఎంటెక్ విద్యార్థి రగుసాల మౌనిక ఆత్మహత్య చేసుకోవడంతో స్వగ్రామం తారుపల్లి శోకసంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన రగుసాల లచ్చయ్య రజితకు మమత, మౌనిక ఇద్దరు కూతుళ్లు, మమతకు డిగ్రీ తర్వాత వివాహం చేశారు. మౌనిక స్థానిక ప్రభుత్వపాఠశాలలో పదోతరగతి చదివి స్కూల్ టాపర్‌గా నిలిచి బాసర ట్రీపుల్ ఐటీలో చదువు పూర్తిచేసింది. హైదరాబాద్‌లో ఎంటెక్ నానోసైన్స్ టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాల పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరింది. సోమవారం హాస్టల్ గదిలో తమ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఆ తల్లి దండ్రులను షాక్‌కు గురిచేసింది. కూతురు మరణవార్తతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన సమాచారంతో.. తండ్రి లచ్చయ్య గ్రామస్తుల సాయంతో కూతురు మృతదేహన్ని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు. తమ కూతురు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం ఒత్తిడి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మౌనిక మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తనతో ఫొన్లో మాట్లాడిందని తల్లి రజిత విలపిస్తూ చెప్పింది. చిన్నబిడ్డకు ఇంత గతి పట్టించావా దేవుడా అంటూ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదువులో ముందు.. మౌనిక చిన్నప్పటినుంచి చదువులో ముందజలో ఉండేదని అత్యంత ప్రతిష్టాత్మకమైన నానోసైన్స్ టెక్నాలజీలో సీటు పొందిందన్న సంతోషం తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎంతోకాలం నిలవలేదు. జెడ్పీహైస్కూల్లో మౌనికకు చదువుచెప్పిన గురువులు ఆత్మహత్య చేసుకుందన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ కీలకం.. మౌనిక ఆత్మహత్యకు కారణలేమిటన్నది పోలీసులకు సవాలుగా మారింది. మౌనికది ముమ్మాటికీ ఆత్మహత్యే అంటున్న పోలీసులు ఆమె వినియోగించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కీలక ఆధారం కావొచ్చని పేర్కొంటున్నారు. హాస్టల్లో సహావిద్యార్థిని, క్లాస్మెంట్స్ను విచారిస్తున్నామని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటామని తల్లిదండ్రులకు గచ్చిబౌలి డీఎస్పీ తెలిపారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చదవండి: మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది -
మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది
గచ్చిబౌలి: ‘నా చిన్న బిడ్డను కొడుకే అనుకున్నం.. కొండంత ధైర్యంగ ఉన్నం.. కానీ.. ఇలా మధ్యలోనే వదిలి వెళ్తదనుకోలే. మూణ్నెళ్లు అయితే నా చదువు పూర్తయితది.. మిమ్ముల్ని సాదేది నేనే అన్నది. మౌనికకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఆమె చావుకు కారణాలేమిటో పోలీసులే తేల్చాలి’ అని హెచ్‌సీయూ ఎంటెక్ విద్యార్థిని ఆర్.మౌనిక తండ్రి లచ్చయ్య గచ్చిబౌలి పీఎస్‌లో కన్నీరు మున్నీరుగా విలపించారు. రోజంతా గది నుంచి బయటకు రాకున్నా యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని, కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం గచ్చిబౌలి పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం తల్లితో మంచిగానే మాట్లాడిందని, ఆదివారం నుంచి ఫోన్ ఎత్తలేదని లచ్చయ్య తెలిపారు. తన కూతురు చనిపోయేంత పిరికి కాదని, తమకే ధైర్యం చెప్పేదని అన్నారు. యూనివర్సిటీలోనే ఏమో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లి విషయంలో ఎప్పుడూ ఒత్తిడి చేయలేదన్నారు. హెచ్‌సీయూలో నానో సైన్స్‌లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక (27) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని పోలీసులు చెబుతున్నారు. షన్నూ.. ఐ మిస్ యూ.. ‘ఐ యామ్ ద రీజన్ ఫర్ ఎవ్రీ థింగ్, ఐయామ్ నాట్ ఎ గుడ్ డాటర్, వెరీ వెరీ సారీ అమ్మ, నాన్న. ఐ లవ్ యూ ఆల్, షన్ను మిస్‌యూ అంటూ బాసర ట్రిపుల్ ఐటీ సెమిస్టరీ మార్కుల మెమోపై మౌనిక సూసైడ్ నోట్ రాసింది. తన అక్క కూతురు షన్నును మిస్ అవుతున్నానని పేర్కొంది. క్యాట్‌కు సెల్‌ఫోన్.. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలను గచ్చిబౌలి పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ ఓపెన్ కాకపోవడంతో క్యాట్‌కు పంపారు. చాటింగ్, మెసేజ్ ద్వారా ఏదైనా క్లూ లభించే అవకాశం ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
అండగా నేనుంటా: పొంగులేటి
ములకలపల్లి: కాలికి స్టీల్ రాడ్లతో ఏడాదిగా ఇబ్బందిపడుతున్న మౌనికకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె ఎడమ కాలికి స్టీల్ రాడ్లు వేశారు. వీటిని 15 రోజుల్లో రాడ్లు తొలగించాల్సి ఉన్నా భర్త, కుటుంబం పట్టించుకోకపోవడంతో నడవలేక పాకుతూ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై ‘ఏడాదిగా.. కాళ్లకు స్టీల్ రాడ్లతోనే’శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మౌనిక చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు తాను భరించి, ఖమ్మంలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, ఎస్సై బాల్దె సురేశ్ గ్రామానికి వెళ్లి మౌనిక భర్త మహేశ్‌ను శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. వాహనం ఏర్పాటు చేసి, ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి మౌనికను తరలించారు. ఎస్సై సురేశ్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. -
సూర్యాపేట జిల్లాలో విషాదం, క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను చంపి..
సాక్షి, నడిగూడెం (కోదాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చిదిమేసి ఆపై తనూ బలవన్మరణానికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నకేశవాపురం గ్రామానికి చెందిన చింతలపాటి రాములు, పద్మల చిన్న కూతురు మౌనిక (28)కు చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు నడిగూడెం మండలం రామాపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దంపతులకు మూడేళ్ల చిన్నారి లాక్షిత (3), తొమ్మిది నెలల బాలుడు సంతానం. ఊరికి వెళ్లొద్దని..: కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, శ్రీనాథ్ ఆదివారం సమీప బంధువు ఊరైన రత్నవరం వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. దీంతో మౌనిక అక్కడికి వెళ్లొద్దని భర్తను వారించింది. ఒకవేళ వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంలో దంపతుల మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత వినకుండా శ్రీనాథ్ రత్నవరం గ్రామానికి బయలుదేరాడు. భర్త తన మాట వినకుండా రత్నవరం గ్రామానికి వెళ్లడంతో మౌనిక విచక్షణ కోల్పోయింది. క్షణికావేశంలో తన ఇద్దరు చిన్నారులను తలుపు బేడానికి ఉరివేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ గది మధ్యలో ఉన్న ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనాథ్ ఎంత పిలిచినా భార్య తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులను తొలగించి చూడగా మౌనిక, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్ఐ ఎం.ఏడుకొండలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. (చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య) -
బాలకార్మికులు బడికి వెళ్లాలంటే.
ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది కంటే ఎక్కువమందిని కోవిడ్–19 మహమ్మారి దారి ద్య్రంలోకి నెట్టివేసిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ప్రభావిత కమ్యూనిటీకు చెందిన పిల్లలకు కరోనా వైరస్ తాజా వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని నిర్ధారిస్తున్నారు. భారత్ విషయానికి వస్తే అంతర్గతంగా ఆర్థిక కారణాలతో వలస వెళుతున్న కోట్ల మంది ప్రజల దుస్థితి విషయం ఏమిటి? దేశ జనాభాలో వీరు 37 శాతం వరకు ఉన్నారు. జూన్ 10న అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్ వెలువరించిన నివేదిక ప్రకారం 16 కోట్లమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో మొదటిసారిగా 2020లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన ప్రగతి స్తంభించిపోయిందని ‘బాలకార్మికులు: 2020లో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు, ధోరణులు.. పురోగామి పథం’ అనే పేరిట వెలువడిన నివేదిక పేర్కొంది. భారత్‌లో ఐదేళ్ల నుండి 14 ఏళ్లలోపు వయసున్న కోటిమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారు. కాగా 2020 నుంచి అంటే కరోనా మహమ్మారి ప్రభావం చూపిన సంవత్సరం నుంచి దేశంలో బాలకార్మికుల సంఖ్య అపారంగా పెరిగిపోతోంది. దేశంలో బాలకార్మికుల పెరుగుదలకు వలసపోవడం అతి ముఖ్యమైన కారణంగా కనిపిస్తుంది. గత ఏడాది నుంచి కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ తమ ఊళ్లకు తిరుగు వలస పోవడంతో పత్తి క్షేత్రాల్లో, మిరప పొలాల్లో, ఇంటి పనిలో, బట్టీల్లో, ఉత్పత్తి కంపెనీల సరఫరా చైన్లలో, ఇతర పనిస్థలాల్లో బాలకార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యూనిసెఫ్ అభిప్రాయం ప్రకారం దేశంలోని రెండున్నర కోట్లమంది పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోవడమే కాదు.. పాఠశాలల మూసివేతతో పెనునష్టం బారిన పడిపోయారు. కానీ మనం కోటి మంది పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం తప్ప, పాఠశాల విద్యకు దూరమైన ఎంతో మంది బాల కార్మికుల గురించి మాట్లాడేది ఎన్నడు? తాజా నిర్ధారణ ప్రకారం, పాఠశాలకు వెళ్లని ఏ పిల్లలైనా సరే బాలకార్మికులుగా మారిపోయే అవకాశం ప్రబలంగా ఉంది. ఏ కారణం వల్లనైనా బడికి వెళ్లలేకపోయిన ప్రతి బాలికా, బాలుడూ తల్లిదండ్రులకు సాయపడే పనుల్లోకి దిగిపోతారు, కుటుంబానికి చెందిన వృత్తుల్లో భాగమవుతుంటారు. బిహార్‌లో అయితే స్కూల్‌కి దూరమైన పిల్లలు అక్రమ సారా బట్టీల నుంచి ఇటుక బట్టీల వరకు వివిధ రకాల పనుల్లో మునిగి తేలుతుంటారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే క్వారీల్లో పనిచేస్తుంటారు. రాజస్తాన్‌లో అయితే గనుల్లో పనిచేయడం, ఇంటి పెరడుల్లో పనులను చక్కబెట్టడంలో నిమగ్నమై ఉంటారు. కాగా ఢిల్లీలో అయితే మురికివాడల్లో కూర్చుని దుస్తుల పరి శ్రమల్లో గుండీలు కుడుతూ కనిపిస్తారు. దీంతోపాటు 2020 నుంచి భారతదేశంలో బాల్యవివాహాలు పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. ఆడపిల్లల పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారైంది. వీరికి చిన్నవయసులోనే పెళ్లి చేస్తున్నారు. ఈ బాలవధువులు వెంటనే బాలకార్మికులుగా మారిపోతున్నారు. మూడున్నర కోట్లమంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని ఎన్ఎస్ఎస్ఓ 2017 డేటా పేర్కొంది. ఇక 2021లో, 2 కోట్ల 40 లక్షల మంది పిల్లలు మహమ్మారి తర్వాత పాఠశాలలకు తిరిగి వెళ్లని స్థితికి చేరుకున్నారని యునెస్కో పేర్కొంది. మరి వీరంతా ఎక్కడికి పోయారు? గతసంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో లాక్ డౌన్ నిబంధనలను తీవ్రంగా అమలు చేయడంతో లక్షలాదిమంది వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు సొంత ఊళ్లకు చేరుకోవడం, ఉపాధికి దూరం కావడం, ఆదాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కారణంగా వారి పిల్లలు కూడా దాని ప్రభావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఆగిపోయాయి. 2017లో 6–10 సంవత్సరాల లోపు పిల్లల్లో 1.5 శాతం మంది బళ్లకు దూరమయ్యారని విద్యా నివేదిక వార్థిక స్థితి పేర్కొనగా 2020లో ఇది 5.3 శాతానికి పెరిగపోయిందని పోల్చి చెప్పింది. గత సంవత్సరంలో 15 లక్షల పాఠశాలలు మూతపడగా, లెక్కకు మించిన సంఖ్యలో పిల్లలు బాలకార్మికులుగా మారిపోయారు. ప్రత్యేకించి బాలికలను వేధించడం, బాలికలను అక్రమ రవాణాకు గురిచేయడం, బాల్యవివాహాలను అధికం చేయడం షరామామూలుగా మారిపోయింది. గత కొద్దినెలల్లో బాలబాలికలకు ఆపన్నహస్తం అందించే చైల్డ్ హెల్ప్ లైన్లు 17 శాతం అధికంగా కాల్స్ అందుకున్నాయి. ప్రభుత్వ అధికారులు దాదాపు 5 వేలకు పైగా బాలికా వివాహాలను అడ్డుకున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా బాలికలు బాల్య వివాహాల బారిన పడ్డారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ పేర్కొంది. కానీ, కేంద్ర బడ్జెట్ ఈ సంవత్సరం బాలబాలికల విద్యపై 5 వేల కోట్ల రూపాయల కోత విధించింది. జీడీపీలో కనీసం 6 శాతం మేరకు విద్యకు కేటాయించాలని ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ కేంపెయిన్లు చేస్తున్న తరుణంలోనే కేంద్రం విద్యా కేటాయింపులను కుదించివేయడం గమనార్హం. ఇక ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా చేర్చాలనే ప్రతిపాదన గాల్లో కలిసిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి కావలిసిందేమిటంటే, సంస్థాగతంగా సమస్యను పరిష్కరించడమే. దీనికోసం ఒక సమాజంగా, ఒక జాతిగా మనలను చాలా క్లిష్టమైన ప్రశ్నలు సవాల్ చేస్తాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే, మన జాతీయ విద్యావిధానం బాలకార్మిక వ్యవస్థకు తగిన ప్రాధాన్యమిచ్చి పిల్లలందరినీ పాఠశాలలకు తీసుకువచ్చే మార్గాలను నిజంగా అన్వేషిస్తోందా? పాఠశాలలకు ఆవల బహిరంగ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టకపోతే సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, పేదరికంలో కూరుపోయిన కమ్యూనిటీల పిల్లలకు మరిన్ని ప్రమాదాలు ఎదురుకాక తప్పదు. ఈ పరిస్థితిని పట్టించుకోనంతవరకు బాలబాలికలు మరింతగా చదువుకు దూరం కాక తప్పదు. కోవిడ్ మహమ్మారి ముగిసిపోయిన అనంతరం బాలబాలికల పరిరక్షణ, క్రమబద్దీకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే బాలకార్మిక వ్యవస్థ కోరల్లో మరింత మంది పిల్లలు పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనా సంవత్సరంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, దేశ దేశాల ప్రభుత్వాలు, యంత్రాంగాలు బాలకార్మిక వ్యవస్థ మూలాలను పరిష్కరించేందుకు సమన్వయంతో కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్ మరింత గట్టిగా కృషి చేయవలసి ఉంది. దీనికోసం దేశంలో బాలకార్మిక వ్యవస్థ బలంగా ఉనికిలో ఉందని మొదటగా గుర్తించాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, వ్యాపార వర్గాలు, మీడియాతోపాటుగా అన్ని రంగాలూ సమస్య పరిష్కారానికి సామూహికంగా, వ్యూహాత్మకంగా కృషి చేయడానికి ఆస్కారముంటుంది. బహముఖ రంగాలనుంచి, బహుముఖ వర్గాలనుంచి సామూహిక కృషి జరపాలన్న వైఖరి ద్వారానే పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయంగా సురక్షిత జీవన మార్గాలను కల్పించలేకపోవడం, పిల్లలకు తగిన రక్షణ యంత్రాంగాల లేమి, నాణ్యమైన విద్యా లేమి వంటి సమస్యలను పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. బాలకార్మిక వ్యవస్థ మూలాలకు అవతల ఎన్నో పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. దేశంలో పదిలక్షల మందికి పైగా పిల్లలను పాఠశాలలకు తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ విధానాలు, ఆచరణలనంచి భారత్ నేర్చుకుని తీరాలి. ఎంవీ ఫౌండేషన్ వంటి సంస్థలు చేపడుతున్న బాలకార్మిక విముక్తి మండలి వంటి నమూనాలను అధ్యయనం చేసి వాటిని అమలు చేయవచ్చు కూడా. 2025 నాటికి భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంకితమవుదాం. మౌనిక బెనర్జీ వ్యాసకర్త కంట్రీ లీడ్ ఫర్ వర్క్, యూనిసెఫ్ -
మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు
సాక్షి, వర్ధన్నపేట: తమ కలల పంటను చూసుకోవాలని ఆ గర్భిణి కలలుకన్నది. ఇంతలోనే కరోనా ఆమెపై పంజా విసిరింది. మహమ్మారిపై ధైర్యంగా పోరాడి బిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన బిడ్డను చూసుకునేలోపే మృత్యుఒడికి చేరుకుంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగల శ్రీనివాస్–సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ, మౌనిక (21). గత ఏడాది చిన్న కుమార్తె మౌనికను వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన పాముల సురేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మౌనిక ఇటీవలే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈనెల 8న మౌనికకు జ్వరం రావడంతో రెండు రోజులు స్థానిక వైద్యులు ఇచ్చిన మందులు వాడగా జ్వరం తగ్గింది. తిరిగి రెండు రోజులకే మళ్లీ జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందింది. ఈ క్రమంలో ఈనెల 22న మౌనికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి, ఆపై 23న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. దీంతో 24వ తేదీన తిరిగి సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అదే రోజు రాత్రి మళ్లీ మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనలతో అంబులెన్సులో తరలించారు. ఎంజీఎంలో వైద్యులు ఆక్సిజన్ ఫ్లో మీటర్ లేదని, కొనుగోలు చేసి తీసుకురావాలని చెప్పారు. మౌనిక తండ్రి ఆ ప్రయత్నాల్లో ఉండగానే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ఆ తల్లి ఊపిరి వదిలేసింది. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు ఓ పక్క మౌనిక మృతదేహం.. మరో పక్క ఆమెకు పుట్టిన ఆడ శిశువును ఎత్తుకుని మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మౌనికకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినా బంధువులెవరూ దగ్గరకు రాలేదు. మౌనిక భర్తకు సమాచారం ఇచ్చినా ఆయన సైతం మృతదేహాన్ని చూసేందుకు సుముఖత చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ స్వగ్రామం కట్య్రాలకు తీసుకెళ్లి మౌనిక అంత్యక్రియలు పూర్తిచేశారు. -
'సూర్య' వెబ్ సిరీస్ బ్యూటీ మౌనికా రెడ్డి
-
ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్ట్.. లైవ్‌లోకి మరో యువతి
టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మైనర్ బాలిక అత్యాచార కేసులో భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని రిమాండ్‌కు తరలించిన తర్వాత చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చాలా మంది యువతులను భార్గవ్ ఇలాగే అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు మాత్రం ఒక్క యువతి కూడా భార్గవ్ తమను మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భార్గవ్ అరెస్ట్ కాగానే.. అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన యువతుల పేర్లు, ఫోటోలను వాడేస్తున్నారు. ఇప్పటికే భార్గవ్‌తో టిక్‌టాక్ వీడియోలు తీసిన OMG నిత్య అలియాస్ నిత్యశ్రీ లైవ్ లోకి వచ్చి తనకు భార్గవ్ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇవ్వగా, తాజాగా మౌనిక అనే మరో యువతి కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.ఈ మేరకు మౌనిక ఓ వీడియోని విడుదల చేసింది. తాము ఇద్దరం కలిసి రెండున్నరేళ్లు అవుతుంది అని తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన ఫోటోలు వాడవద్దని కోరింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్ అరెస్టయిన విషయం మీఅందరికి ఎలా తెలుసో.. నాకు కూడా ఈ సోషల్ మీడియా ద్వారాలే తెలిసింది. ‘అమ్మాయి-అబ్బాయి’ వీడియోలు ఆపేసి రెండున్నరేళ్లు అయింది. ఆ తర్వాత మాకు ఎటువంటి కమ్యునికేషన్ లేదు. కానీ అప్పుడు చేసిన వీడియోలను, ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి ఈ కేసు విషయంలో వాడేస్తున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసి అవన్ని డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’అని మౌనిక చెప్పుకొచ్చింది.గతంలో భార్గవ్ - మౌనికలు అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు రిలీజ్ చేసి టిక్ టాక్ వేదికగా విడుదల చేసేవారు. వాటికి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చేవి. చదవండి : భార్గవ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్ నిత్య చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
బందరులో జబర్దస్త్ నటుల హంగామా
మచిలీపట్నం: యంగ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహ బంధంతో ఒకటయ్యారు. మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ జరిగింది. ప్రసన్న కుమార్, మౌనికల వివాహానికి సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు త్రినాద్రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్, మాస్ అవినాష్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు నూతన వధూవరులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ అందజేస్తున్నారు.(హ్యాపీ బర్త్‌డే డియర్ సోనూసూద్) కాగా, నేను లోకల్, సినిమా చూపిస్త మావ, హాలో గురు ప్రేమ కోసమే సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే ఆయన.. రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రమణరావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు. (సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు) -
తెల్లారిన బతుకులు..
కోరుట్ల: ఇంట్లో వెలుగులు నింపే విద్యుత్ తీగలు ఆ కుటుంబానికి శాపంగా మారాయి. తెల్లవారకముందే ఆ తాతామనుమరాళ్ల జీవితాలు తెల్లారిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ నుంచి తెగిపడిన విద్యుత్తీగ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎఖీన్‌పూర్‌కు చెందిన తాతమనుమరాళ్లు అందుగుల మల్లయ్య(65), మౌనిక(17) మృతి ఆ గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎఖీన్‌పూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్తీగ గురువారం తెల్లవారు జామున తెగి అందుగుల మల్లయ్య ఇంటి ఆవరణలో పడిపోయింది. ఆ తీగ గేదెకు తగిలి షాక్‌కొట్టడంతో అరుపులు వినిపించిన మల్లయ్య భార్య మల్లవ్వ గేదె వద్దకు వెళ్తున్న క్రమంలో చేతికి వైరు తగిలి షాక్‌కు గురైంది. గమనించిన మల్లయ్య తన భార్యను ప్రమాదం నుంచి తప్పించాడు. ఈక్రమంలో అతడి కాలుకు విద్యుత్తీగ తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లయ్యను ప్రమాదం నుంచి తప్పించబోయిన మనుమరాలు మౌనిక కాలుకు విద్యుత్తీగ తగలడంతో షాక్‌తో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మౌనిక కోరుట్లలోని మాస్ట్రో జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఒకే కుటుంబంలోని ఇద్దరి మృతి గ్రామంలో విషాదం నింపింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరమ్మతులు చేయాలని ఏళ్లుగా.. ఎఖీన్‌పూర్ పరిధిలో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని ఏళ్లుగా ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మరమ్మతుల గురించి అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చేవారని వారు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే మల్లయ్య, మౌనిక మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌తీగలు మరమ్మతు చేసే వరకు బిల్లులు చెల్లించబోమని నిర్ణయించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పరామర్శించిన ఎమ్మెల్యే ఎఖీన్‌పూర్‌లో విద్యుత్‌ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తాతమనుమరాళ్లు మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చారు. -
పోరాడి ఓటేసిన మహిళకు ప్రజాస్వామ్య పురస్కారం
సాక్షి, గుడిహత్నూర్ (బోథ్): తన పేరున పోలైన ఓటు తనది కాదని అధికారులను నిలదీసి ‘టెండర్ ఓటు’వేసి మరీ తన హక్కును వినియోగించుకున్న మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం తండాకు చెందిన రాథోడ్ మౌనిక.. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమె ఓటును మరో మహిళ వేసి వెళ్లిపోయింది. దీనిపై మౌనిక అధికారులను నిలదీయడంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది ఆమెకు టెండర్ ఓటు కేటాయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలుసుకొని పోరాడి ఓటు వేసినందుకు గాను ప్రభుత్వం ఆమెను గౌరవించింది. శనివారం హైదరాబాద్‌లోని తారామతి–బారదరిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా మౌనిక ప్రజాస్వామ్య పురస్కారం అందుకుంది. -
బావల వేధింపులే కారణం..
అడ్డగుట్ట: తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన మౌనిక(రాణి) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారం రోజుల పాటు పలు కోణాల్లో విచారించారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీలను పరిశీలించగా మౌనిక ఆత్మహత్యకు ఆమె కుటుంబసభ్యుల్లో ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలే కారణమని తేలింది. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బుద్ధానగర్ ప్రాంతానికి చెందిన మాచర్ల అంజయ్య కుమార్తె మౌనిక మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత నెల 21న ఉదయం కాలేజీకి వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరుడు సాయికుమార్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా 23న రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలోని హుస్సేన్ సాగర్‌లో మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లేక్‌పోలీసులు మృతదేహాన్ని ‘గాంధీ’ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో తుకారాంగేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కోరుతూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలు మౌనిక చనిపోయే ముందు తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి మాట్లాడినట్లు గుర్తించారు. సదరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే ఈ కేసుతో వారికి సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేశారు. కాగా మౌనిక ఆత్మహత్యకు కొద్ది సేపటి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి బావలు, అన్నలు తనను వేధిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు గుర్తించారు.. దీంతో ఆమె బావలు వడ్డె సోమశేఖర్, ఆంథోనితో పాటు అన్నలు శివకుమార్, సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బావల శారీరకంగా వేధిస్తుండగా, అన్నల మానసిక వేధింపుల కారణంగానే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సేవలోనే అందం ఆనందం..
అందాల పోటీల్లో గెలుపొందిన తర్వాత దాదాపు ప్రతి బ్యూటీక్వీన్ చెప్పేమాట సేవాబాట పడతామనే. అయితే ఆ మాటను నిలబెట్టుకునేవారు అరుదే. దీనికి తాను భిన్నం అంటున్నారు నగరానికి చెందిన మౌనిక. ఐదేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ... సేవలోనే అందం ఆనందం అంటున్నారు. సాక్షి, రంగారెడ్డి: ‘కేన్సర్‌పై ఎంతగా అవగాహన పెరుగుతున్నా.. ఇంకా కేన్సర్ మరణాలు ఆగడం లేదు’ అంటున్న మౌనిక తంగల్లపల్లి.. ఐదేళ్ల క్రితం తన ప్రాచుర్యానికి బాట వేసిన మిస్ హైదరాబాద్ టైటిల్‌ని కేన్సర్ బాధితుల సేవకు ఒక మార్గంగా మలుచుకున్నారు.2014లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన అనంతరం మిస్ ఇండియా టూరిజం ఇంటర్నేషనల్ కూడా గెలుచుకున్న మౌనిక ఉత్సవి ఫౌండేషన్ ప్రారంభించారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల అంశాలను ఎంచుకుని నిధుల సమీకరణ చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న కేన్సర్ మరణాలు, ఆ వ్యాధి బాధితుల కోసం జుంబా, యోగా తదితర ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అక్షర్ బ్యాండ్‌తో గత నెల 14న నగరంలోని స్కైలాంజ్లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రానున్న ఫిబ్రవరి వరకూ ఈ ఈవెంట్స్ కొనసాగిస్తామని వచ్చే నిధులను కేన్సర్ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న సంస్థలకు అందిస్తామని అంటున్నారు మౌనిక. ర్యాప్ సింగర్ ‘షేర్ ఎ మీల్’ అన్నదానం రోజూ ఆకలితో అలమటించే వారెందరో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసే అచేతన హృదయాలేనో.. ఉరుకుల పరుగుల నగర జీవితంలో మనసుతో వినగలిగితే వినిపించే ఆకలి కేకలెన్నో... అవి వినే తీరిక కొందరికి ఉండదు. విన్నా వాటి కోసం చేయగలిగే స్తోమత మనకి లేదనుకుంటారు మరికొందరు. అయితే ఆ యువకుడు మాత్రం తనతో పాటు మరొకరి ఆకలి తీర్చలేనా? అనుకున్నాడు. రోజూ ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. అంతులేని తృప్తిని మనసులో నింపుకొంటున్నాడు. ‘ఇప్పటికీ ఓ మనిషి ఆకలితో బాధపడడం అది సాటి మనుషులుగా మన అందరికీ అవమానం’ అంటాడు మేఘ్రాజ్ రవీంద్ర. అలాంటి ఆలోచనలో నుంచే ఆయన షేర్ ఎ మీల్ పేరిట వ్యక్తిగతంగా ఒక కార్యక్రమం రూపొందించుకున్నాడు. తనవంతుగా రోజుకి ఒకరికైనా ఆకలి తీర్చాలనే ఆలోచనతో తన సంపాదనలో రోజూ ఒక్కరికి అన్నదానం చేస్తున్నాడు. ఒక సంవత్సరం గడిచాక రెట్టింపైన ఆనందంతో తదుపరి ఏడాది నుంచి నిత్యం కనీసం ఇద్దరికి అన్నం పెడుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన అన్నసేవ నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికి దాదాపు 1600 మందికి పైగా ఆకలి కడుపులకు వ్యక్తిగతంగా సాంత్వన చేకూర్చాడు. నిత్యం తను గాంధీ హాస్పిటల్, కేన్సర్ హాస్పిటల్, పద్మారావునగర్ తదితర ప్రాంతాలలో ఉన్న అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. పాటే ఉపాధి బాట.. వ్యక్తిగతంగా మేఘరాజ్ ర్యాప్ సింగర్. తాజాగా విడుదలైన జార్జిరెడ్డి సినిమాలోనూ ఓ పాత్ర పోషించాడు. గొప్ప ఆదాయం లేకపోయినా మరొకరి ఆకలి తీర్చడంలోని ఆనందం ఎంత ఖర్చు పెట్టినా రాదంటాడు మేఘరాజ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చూసిన ఎంతో మంది యువత తనని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఇలా అన్నదానం చేయడం ఇంకెంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఆకలి తీర్చే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలు, ఆవేదనలు, ఆకలి అవస్థలు ఏన్నో ఎన్నెన్నో.. ‘ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఆకలి తీర్చాలి’ అనేదే తన ధ్యేయం అంటున్నాడు మేఘరాజ్. -
మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు
గాంధీఆస్పత్రి: మౌనిక కుటుంబాన్ని ఆదుకోవడానికి మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ అంగీకరించింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్లో పిల్లర్ పెచ్చులూడి తలపై పడటంతో కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(24) మృతి చెందిన విషయం విదితమే. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అంతకుముందు అఖిలపక్ష నేతలు ప్రొఫెసర్ కోదండరాం, సుధాకర్, ఇందిర తదితరులు సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి వచ్చి మౌనిక కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన జరిగి రోజున్నర గడిచినా మెట్రో అధికారుల నుంచి స్పందన లేకపోవడం, ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. వారు నిరసనకు దిగుతున్నట్లు సమాచారం తెలుసుకొని మధ్యాహ్నం ముగ్గురు ఎల్ అండ్ టీ అధికారులు ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్ ఎల్ అండ్‌టీ కార్యాలయంలో మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులతో ఎల్ అండ్ టీ అధికారులు చర్చలు జరిపారు. గాంధీ ఆస్పత్రిలో విషాదం మౌనిక బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో గాంధీ ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం గోపరపల్లి నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, మంచిర్యాల నుంచి అత్తింటివారు, బంధువులు పెద్దసంఖ్యలో సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు.విగతజీవిగా పడి ఉన్న మౌనికను చూసి బోరున విలపించారు. తన భార్య మృతికి మెట్రో అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని మౌనిక భర్త హరికాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాను, మౌనిక అమీర్‌పేట మెట్రోస్టేషన్లో దిగి కిందికి వచ్చి వర్షం కారణంగా కాసేపు నిల్చున్నామని, అంతలోనే సిమెంట్ పెచ్చులు పడి మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయని, మెట్రోసిబ్బంది నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని నిఖిత వివరించింది. ఎల్ అండ్ టీపై కేసు నమోదు అమీర్‌పేట: ఎల్ అండ్‌టీ సంస్థపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మౌనిక దుర్మరణం చెందినట్లు నిర్ధారించారు. కాగా అమీర్‌పేట మెట్రోస్టేషన్లో పిల్లర్ పెచ్చులూడి పడిన ప్రాంతాన్ని మెట్రో ఉన్నతాధికారులు పరిశీలించారు. -
మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్ అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు. అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్‌ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్‌సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్‌తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్‌సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోస్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్.ఆర్.హోమ్స్‌లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సందర్శించారు. నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... స్టేషన్లను సైతం ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్ కాస్టింగ్ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు. ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వివాహమైన 34 రోజులకే..
ధారూరు: ఉద్యోగమొచ్చి ఏడాదైంది.. పెళ్లయి నెల దాటింది.. అంత సంతోషంగా ఉన్నామనుకున్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో చేతికొచ్చిన కొడుకును బలి తీసుకోగా, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవ వధువు పుట్టెడు దుఃఖంలో మునిగింది. దీంతో ధారూరు మండలం లక్ష్మీనగర్‌తండాలో తీవ్ర విషాదం అలుముకుంది. లక్ష్మీనగర్‌తండాకు చెందిన వాల్యానాయక్, హేమ్లీబాయి దంపతులకు దేవీబాయి, తులసీరామ్ (29), గోపాల్, శ్రీనివాస్ సంతానం. డిగ్రీ పూర్తి చేసిన రెండో కుమారుడు తులసీరామ్ 2018లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవరంపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తుండేవాడు. తులసీరామ్‌కు మే 8వ తేదీ, 2019లో పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయమై నిందితుడిని పట్టుకోవడానికి బీహార్‌కు అధికారులు, సిబ్బందితో తులసీరామ్ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో లక్ష్మీనగర్ తండాలో తీవ్ర విషాదం ఏర్పడింది. కుటుంబసభ్యుల రోదనలతో తండా తల్లడిల్లింది. రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు మిన్నంటిన రోదనలు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌కు గత మే 8వ తేదీన వివాహమైంది. వివాహమైన 34 రోజులకే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో నవ వధువు దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కొత్తగా పెళ్లవడంతో మైలార్దేవరంపల్లిలో ఈ దంపతులు కొత్త కాపురం పెట్టారు. కాపురం పెట్టిన కొన్నాళ్లకే ఆయన మృతిచెందడంతో అతడి భార్య దు:ఖసాగరంలో మునిగింది. ఎదిగిన కుమారుడు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు పుత్రశోకంలో మునిగారు. -
యూఎస్‌లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్‌కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్‌ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్‌ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు. -
భార్య మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని..
సాక్షి, కోల్ సిటీ (రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను ఆమె భర్త శ్రావణ్ హత్యచేశాడు. మౌనిక తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మౌనిక, శ్రావణ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్ ఇటీవల లాసెట్ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఎలాంటి పనిచేయని శ్రావణ్ తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్ అనుమానం పెంచుకున్నాడు. మొబైల్లో మరో వ్యక్తితో చాటింగ్ చేస్తోందని భార్యతో గొడవపడ్డ శ్రావణ్ ఆమెను హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ముసుగుల వెనుక రహస్యం
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా నటించారు. ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. బి.బాపిరాజు మాట్లాడుతూ–‘‘ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ చిత్రాల్ని మించిన వినోదంతో పాటు చక్కటి మెసేజ్ ఉంటుంది’’ అన్నారు పి.సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారియో, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
ముసుగుల రహస్యం ఏంటి?
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక ముఖ్య తారలుగా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్లపై ఎక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బి.బాపిరాజు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్స్‌లో గతంలో విడుదలైన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘రొమాంటిక్ క్రిమినల్స్’ తెరకెక్కించాం. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రాలను మించిన వినోదంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఈ చిత్రంలో ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేసి, మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సుధాకర్ మారోయో, కెమెరా: ఎస్.వి. శివరామ్, సహనిర్మాతలు: వైద్యశ్రీ డాక్టర్ ఎల్ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్. -
హత్య చేసిందెవరు?
జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా ప్రాచి అధికారి, మౌనిక హీరోయిన్లుగా ఎస్ఎంఎం ఖాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నైజాం పిల్లోడు’. రెహాన బేగం నిర్మిస్తున్న ఈ సినిమా ఒక్కపాట మినహా పూర్తి అయింది. మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎస్ఎంఎం ఖాజా మాట్లాడుతూ– ‘‘45 సినిమాల్లో సోలో ఫైటర్‌గా చేసిన బల్వాన్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘మా సినిమా ద్వారా సంగీత దర్శకుడు మజ్నుని పరిచయం చేస్తున్నాం. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని రెహాన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, సంగీతం: ఎస్ కే. మజ్ను. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
మలక్‌పేట: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సలీంనగర్ ఆఫ్జల్నగర్లో ఉంటున్న సిల్వర్ మణి కుమార్తె మౌనిక (33) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు 2007లో అభిషేకం అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఆర్యన్ (10) కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత 18 నెలలుగా వారు వేరుగా ఉంటున్నారు. కాగా ఆదివారం మౌనిక తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సిల్వర్మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మౌనికకు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఎస్. మౌనిక రాణించింది. తిరువనంతపురంలోని వట్టియూరుక్కవు షూటింగ్ రేంజ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రజత పతకాన్ని గెలుచుకుంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో మౌనిక 610.5 పాయింట్లు స్కోరు చేసి రన్నరప్‌గా నిలిచింది. -
పెళ్లి పేరుతో సంపన్నులను బుట్టలో వేసుకొని..
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట/గిద్దలూరు: పవిత్రమైన వివాహ బంధాన్ని ఎగ‘తాళి’ చేసేలా వ్యవహరించి వరుసగా ఆరుగురిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురును వైఎస్సార్ జిల్లా ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు రూరల్ సీఐ కంభగిరి రాముడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మూడు నెలల క్రితం ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 25న ఆమె తండ్రి వచ్చి కూతురిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. ఆమె వెళ్లేటప్పుడు అత్తింటిలో నుంచి బంగారు నగలను తీసుకెళ్లింది. ఆమె తిరిగి రాకపోగా, ఆమె పుట్టింట్లో కూడా లేకపోవడంతో అన్నిచోట్లా గాలించి ఈనెల 10న ఆమె భర్త రామకృష్ణారెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మౌనికతో పాటు, ఆమె తండ్రి అనంతరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వీరిని మైదుకూరు పట్టణంలో గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. మౌనిక, ఆమె తండ్రి అనంతరెడ్డి తోపాటు రత్నావల్ చంటినాయక్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు ముగ్గురూ జల్సాలు చేసేవారు. ముగ్గురిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిలాడీ లేడీది ప్రకాశం జిల్లా మొహిద్దీన్‌పురం.. ఆరు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను మోసం చేస్తూ బంగారు నగలు, నగదుతో ఉడాయిస్తున్న మౌనికది ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం. మొహిద్దీన్‌పురానికి చెందిన చేగిరెడ్డి అనంతరెడ్డిది పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అనంతరెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం వ్యసనానికి బానిసైన అనంతరెడ్డి అందంగా ఉన్న తన కుమార్తెను పావుగా చేసుకుని సంపాదించాలనుకున్నాడు. పెళ్లి మీద పెళ్లి చేస్తూ నగలు, డబ్బుతో ఉడాయిస్తున్నాడు. మార్కాపురంలో మొదటి పెళ్లి చేశాడు. నెలకే ఇంటికి వచ్చింది. రెండో వివాహం గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామంలో చేసుకుంది. రెండు నెలలకే నగలు, డబ్బుతో పుట్టింటికి చేరింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆమె.. తిరిగి మూడో పెళ్లి బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెలో యువకుడిని చేసుకుంది. రెండు నెలలకే భర్తకు చెందిన బంగారు, నగదు తీసుకెళ్లడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. నాలుగో వివాహం తెనాలిలో, ఐదో పెళ్లి ఖాజీపేటలో చేసుకుని నగలు, డబ్బుతో పరారు కావడంతో అక్కడ కేసు నమోదయింది. ఆ కేసు ఉండగానే హైదరాబాద్‌కు చెందిన యువకుడిని ఆరో వివాహం చేసుకుంది. -
బాక్సింగ్‌లో రాణిస్తున్న నిరుపేద క్రిడాకారిణి..మౌనిక
-
కులాంతర వివాహం చేసుకుందని..
బెజ్జంకి(సిద్దిపేట): కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం పెల్లి మౌనిక 12 రోజుల క్రితం మండలంలోని తోటపల్లికి చెందిన తన డిగ్రీ క్లాస్మేట్ సొల్లు సాయిని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆపై తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం శనివారం బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు ఘర్షణ పడ్డాడు. పరువు తీస్తున్నావంటూ కత్తితో దాడికి పాల్పడటంతో ఆమె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నాగరాజు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మౌనికను తాతయ్య, స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముగ్గురి ఉసురు తీసిన క్షణికావేశం
త్రిపురాంతకం: క్షణికావేశం ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తొలుత తన కుమార్తె, కుమారుడికి ఉరేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మేడపిలో బుధవారం జరిగింది. ఈ సంఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుమ్మా రజని (26)ని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మక్కెళ్లపాడుకు చెందిన గుమ్మా అంజికి ఇచ్చి వివాహం చేశారు. భర్త అంజి వ్యవసాయం పనులు చేస్తుండేవాడు. ఆమెకు కుమార్తె మౌనిక (5), కుమారుడు సతీష్ (3) ఉన్నారు. కుటుంబం కలహాల నేపథ్యంలో రజని మేడపిలోని పుట్టింట్లో 20 రోజులుగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు రామతీర్థం వద్ద కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద రజని నాయనమ్మ, తాత మాత్రమే ఉన్నారు. చీకటి పడే సమయంలో తొలుత కుమార్తెకు, కుమారుడిని ఫ్యాన్ కొక్కీకి ఉరేసి చంపి ఆ తర్వాత తల్లి రజని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు నిర్జీవంగా వేలాడుతుండటాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో పొద్దుపోయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తల్లి, పిల్లల ఆత్మహత్యతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మౌనిక మృతికి కారకులను శిక్షించాలి
చింతలపూడి: అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన స్థానిక ఎన్వీఎన్ కాలనీకి చెందిన మానేపల్లి మౌనిక మృతికి కారణమైన భర్త రామును కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. పెళ్లి జరిగి ఏడాది గడవక ముందే మౌనిక (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్తే మౌనికను హత్య చేశాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతదేహం కుళ్ళిపోతున్నా పోస్టుమార్టం నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. చింతలపూడి మార్చురీ వద్ద మౌనిక బ«ంధువులు పెద్ద ఎత్తున చేరడంతో సీఐ పి.రాజేష్, ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావులు మార్చురీ వద్దకు చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతోను, మృతురాలి కుటుంబ సభ్యులతోను మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎలీజా డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.‡ సీఐ రాజేష్ మాట్లాడుతూ నిందితునికి తప్పకుండా శిక్ష పడుతుందని, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ప్రత్యేకంగా కేసును çపర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మౌనిక మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. -
మూఢనమ్మకాలు హాంఫట్!
చేతుల్లో వస్తువులు మాయం చేసి మస్కా కొడుతూ తాను భగవత్ స్వరూపునిగా అభివర్ణించుకుంటుంటారు కొందరు. నిమ్మకాయ కోసి రక్తం చూపి తమను తాము దైవాంశ సంభూతులమనుకొమ్మంటారు మరికొందరు. చేతబడులకు తిరుగుబడి చేస్తే జ్వరాలు తగ్గుతాయంటూ కోళ్లు, కానుకలు దండుకుంటుంటారు ఇంకొందరు. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత అడ్డం పెట్టుకుని కొందరు స్వాములు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంద్రజాలాన్ని అస్త్రంగా వాడుతున్నారా ముగ్గురు. వారే మ్యాజిక్ సిస్టర్స్ అయిన మౌనిక, సుస్మిత. వారి తండ్రి జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). మ్యాజిక్ సహోదరీమణుల ఆ ద్వయం... తమ తండ్రితో కలిసి త్రయంగా ఏర్పడి... మూఢనమ్మకాలు తొలగించాలని పడుతున్న తాపత్రయం వారిది. వాళ్ల జీవిత‘ఆదర్శం’ ఆ అక్కాచెల్లెళ్ల మాటల్లోనే... ఇంద్రజాలంతో ఎందరో మోసగాళ్లు అమాయకులను మోసం చేస్తుంటారు. అదే ఇంద్రజాలంతో మోసాన్ని మాయం చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు... మా నాన్న పేరు జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). విజయనగరం పట్టణంలోని గంటస్థంభం దగ్గర కానుకుర్తివారివీధిలో నివాసం. నాన్న న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్. బీవీ పట్టాభిరామ్ వంటి ప్రముఖుల షోలు చూసి తానూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు నాన్న. తన పదహారేళ్ల వయసులో తొలి ప్రదర్శనను తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎమ్మార్ కళాశాలో ఇచ్చారు. అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా ఆయన దాదాపు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మా అమ్మ పేరు రమణి. పెళ్లి తర్వాత ఆమె సహకారంతో తన ప్రవృత్తికి మరింత పదును పెట్టి మూఢనమ్మకాలపై కత్తి దూశారు. కొరడా ఝుళిపించారు. మేమింకా మ్యాజిక్ యవనికపైకి అడుగుపెట్టకముందే ఒక ఇంద్రజాలికునిగా పది వేలకు పైగా ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డు అందుకున్నారు మా తండ్రి. మాది సమాజం హర్షించే మాయ అవును... మేమూ మాయ చేస్తున్నాం. కాకపోతే మాది సమాజం హర్షించే మాయ. నిజం చెప్పాలంటే మా మాయతో మేము మూఢనమ్మకాలను మాయం చేస్తున్నాం. అంధ విశ్వాసాలను అంతం చేస్తున్నాం. మాయలతో మోసపుచ్చే మాయగాళ్ల గారడీ చేతబడికి తిరుగుబడి చేస్తున్నాం. ఇందుకు తగిన కారణమూ, నేపథ్యమూ ఉంది. మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమూ, అక్కడ అమాయక గిరిజనులు ఎక్కువ. అప్పట్లో క్యాన్సర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మరణిస్తే ప్రజలకు వాటి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల చేతబడి, చిల్లంగి, బాణామతి వంటి క్షుద్ర ప్రయోగం వల్ల చనిపోయి ఉంటారని అపోహ పడేవారు. అవన్నీ కేవలం మూఢనమ్మకాలంటూ మేము మ్యాజిక్ సాయంతో నిరూపిస్తున్నాం. విజయనగరం జిల్లాలోని సాలూరు, పి కోనవలస, నీలకంఠాపురం, మొండెంకళ్లు, చినమేరంగి, కురుపాం, మక్కువ, కూనేరు, పార్వతీపురం, పెదబొండపల్లి, పాచిపెంట, మామిడిపల్లి, గుమ్మలక్ష్మీపురం, ఇంగిలాపల్లి, బొద్దాం, అలమండ, కొత్తవలస, కొట్యాడ, ఎస్‌కోట ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రదర్శనలిచ్చాం. మాయను మాయతోనే ఎలా ఛేదిస్తామంటే... మా ప్రాంతంలోని మాయలోళ్లు అమాయకులను బుట్టలో వేసుకోడానికి రకరకాల ప్రదర్శలను ఇస్తుంటారు. వాటి సాయంతో తమకు మహిమలున్నాయని చెప్పుకుంటుంటారు. మహిమల పేరు చెప్పి వారు చేసేవన్నీ మేమూ చేస్తాం. నిమ్మకాయ నుంచి రక్తం రావడం, కొబ్బరి కాయలో నుంచి పువ్వులు, రక్తం రావడం, నాలుకపై త్రిశూలం గుచ్చుకోవడం, నోట్లో బ్లేడులు వేసుకుని నమిలి, మింగిన తర్వాత తోరణంగా వాటిని బయటకు తీయడం, విభూది సృష్టించడం, మెడలో కత్తి గుచ్చుకోవడం, తాడుమీద కొబ్బరికాయను అటూ ఇటూ నడిపించడం, దయ్యాలు, భూతాలపై భయాన్ని పోగొట్టేందుకు మనిషిని హిప్నటైజ్ చేసి తలపై మంటపెట్టి పాలు, నీరు మరిగించడం వంటి విద్యలను ప్రదర్శిస్తాం. అవి కేవలం సైంటిఫిక్‌గా ప్రదర్శించే విద్యలే తప్ప మహిమలు కాదని చాటి చెబుతాం. ఊరూరా కేవలం ఈ ప్రదర్శనలే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని రోడ్లపై మోటార్ సైకిల్ నడిపి ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలే ప్రయత్నాలూ మా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. మాది సఫల ప్రయత్నం.. అందుకు ఇదీ ఉదాహరణ! మా ప్రదర్శనలు ఎంతో విజ్ఞానవంతమైనవి. మరింత చైతన్యపరిచేవి. మా ప్రయత్నం ఎంత సఫలమో చెప్పేందుకు ఉదాహరణ ఒకటుంది. మా నాన్నగారు మ్యాజిక్ చేస్తుండగా విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు. తాను చిల్లంగి చేస్తున్నాననే నెపంతో కొందరు తన భార్యను పొట్టనబెట్టుకున్నారట. తననూ చంపేస్తామంటున్నారంటూ బోరున విలపించాడు. ఇవే ప్రదర్శనలు తమ గ్రామంలో ఇచ్చి తన ప్రాణాలు నిలపమంటూ నాన్నను ప్రాధేయపడ్డాడు. నాన్న కారణంగా తన ప్రాణం దక్కుతుందంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇలా మా ప్రదర్శనలతో ప్రజలు చైతన్యవంతం కావడమే కాదు... చాలామంది ప్రాణాలూ నిలిచాయి. కొన్ని జీవితాల్లో మార్పులూ వచ్చాయి. వినోదంతో పాటు సామాజిక బాధ్యత మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాలు ఎక్కువ. గర్భిణీ ఆరోగ్యం విషయంలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మందులు, వైద్యం కూడా అందదు. ఇక పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం కూడా ఉండదు. ఈ కారణంగా బిడ్డలు పౌష్టికాహార లోపంతో చిన్న వయసులోనే మృత్యువాత పడుతుంటారు. కనీసం వారికి తల్లిపాలైనా సరిగ్గా ఇస్తే కొంతమందినైనా బతికించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టత, శిశువులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గిరిజనులు తమ పిల్లలను బడికి పంపకుండా, కూలీ పనులకు పంపిస్తుంటారు. అలా చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు ఎన్నటికీ రావంటూ, విద్య ఆవశ్యకతపైనా ప్రదర్శనలిస్తుంటాం. ఆడపిల్లను చంపుకుంటే ఇంటి లక్ష్మిని చంపుకున్నట్టేనంటూ మా ఇద్దరినీ ఉదాహరణగా చూపిస్తూ.. భ్రూణహత్యలు, స్త్రీ శిశు హత్యలకు వ్యతిరేకంగా చైతన్యం తెస్తుంటారు నాన్న. చిన్నారి పొన్నారి చిరు వయసు నుంచే... మా ఇద్దరిలో మూడున్నర ఏళ్ల వయసప్పుడు నాచేత ప్రదర్శన ఇప్పించారు నాన్న. నన్ను చూసి చెల్లెలు రెండున్నర ఏళ్లున్నప్పుడే వేదిక ఎక్కడానికి ఉత్సాహం చూపింది. తాను అంత చిన్న వయసు నుంచే మ్యాజిక్ మొదలుపెట్టింది. అలా నాన్నతో పాటు మేమిద్దరమూ 28కి పైగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాం. మాది ఒక్కటే కోరిక. సమాజంలోని మూఢనమ్మకాలు అంతమైపోవాలి. అందుకు మా మ్యాజిక్ ఉపయోగపడి... అది మూఢనమ్మకాలను మాయం చేసేస్తే మాకు అంతకంటే ఏం కావాలి? జాతీయ స్థాయి గుర్తింపు ఇంద్రజాల ప్రదర్శనలో ప్రతిభకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి 2006లో మా అక్కాచెల్లెళ్లమిద్దరమూ ఢిల్లీకి వెళ్లాం. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ నుంచి అవార్డు తీసుకుంటుండగా మా విజిటింగ్ కార్డును ప్రధానికి ఇచ్చి ‘హమారా ఐడెంటిటీ కార్డ్’ అన్నాం. వెంటనే స్పందించిన మన్మోహన్సింగ్ ‘తుమ్హారా ఐడెంటిటీకార్డ్!’ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు ముఖం పెట్టి ఆయన ఫక్కున నవ్వేశారు. విజిటింగ్ కార్డుకి ఐడెంటిటీ కార్డుకీ తేడా తెలియని వయసులో ఇంద్రజాలంలో జాతీయ అవార్డు అందుకున్నాం మేం. బహుశా ఇలా అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంద్రజాలం ప్రదర్శించే మ్యాజిక్ సిస్టర్స్ మేమే కాబోలు. లాయర్ని అవుతా నాన్న కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావడంతో తరచుగా అక్కడికి తీసుకువెళ్లేవారు. దాంతో న్యాయవాద వృత్తిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మరి కొద్ది నెలల్లో ఎల్ఎల్బి పట్టా అందుకోబోతున్నాను. ఆటబొమ్మల బదులు మ్యాజిక్ వస్తువులు ఇచ్చి నాన్న ఆడుకోమనేవారు. ఆలా ఇంద్రజాలాన్ని ఉగ్గుపాలతోనే అలవాటు చేశారు. చెల్లి కూడా నాతో జతకలిసిన తర్వాత ఏ ప్రదర్శన చేసినా ఇద్దరం కలిసే చేస్తున్నాం. – మౌనిక, ఇంద్రజాలికురాలు, విజయనగరం షార్ట్ ఫిల్మ్స్‌కు ఎడిటర్‌గా చేస్తున్నా మానవ వనరులను సబ్జెక్ట్‌గా తీసుకుని డిగ్రీ చదువుతున్నాను. యానిమేషన్‌పై ఇష్టంతో అదీ నేర్చుకుని ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్నేహితులతో కలిసి తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటర్‌గా కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు అక్క మ్యాజిక్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం చూసి నాకూ మ్యాజిక్ చేయాలనిపించింది. నాన్న అక్కకూ, నాకూ దానిలో మెళకువలు నేర్చించారు. ఒకప్పుడు మేం చేస్తుంటే విమర్శించిన వారు ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. – సుష్మిత, ఇంద్రజాలికురాలు, విజయనగరం చాలా విమర్శలు ఎదుర్కొన్నా ఆడపిల్లల ముఖానికి రంగేసి తిప్పుతున్నానని, పెళ్లి చేయకుండా ఈ గారడీ ప్రదర్శనలేంటని బంధువర్గంలో సూటిపోటి మాటలు బాధించేవి. మ్యాజిక్‌ను చాలా చులకనగా చూసేవారు. ఒకానొక దశలో క్షుద్ర విద్యలు నేర్పుతున్నాననేవారు. ఇది క్షుద్రవిద్య కాదని, ఇంద్రజాలం అనేది ఓ కళ అని నమ్మిన నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిరుత్సాహ పరిచినా వెనుదిరిగి చూడలేదు. వాళ్లన్న క్షుద్ర విద్యలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రదర్శనలిస్తున్నాం. – జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి, తండ్రి, ఇంద్రజాలికుడు, విజయనగరం – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
సత్యభామ వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై/డక్కిలి (నెల్లూరు): చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో విద్యార్థిని దువ్వూరి రాగమౌనికారెడ్డి (18) ఆత్మహత్యతో వర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వర్సిటీ జనవరి 2 వరకు సెలవులు ప్రకటించి, సెమిస్టర్ పరీక్షల్ని రద్దు చేసింది. సెమిస్టర్ పరీక్షలో కాపీ కొట్టిందనే అభియోగంతో ప్రొఫెసర్లు అందరి ముందు అవమానించడంతో మౌనిక హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మౌనిక ఆత్మహత్యతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులంతా హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని తొలుత యాజమాన్యం ప్రకటించింది. దీనిపై విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగడంతో జనవరి 2 వరకు సెలవులు ప్రకటించింది. యాజమాన్యమే బాధ్యత వహించాలి రాగమౌనిక ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె తండ్రి రాజారెడ్డి డిమాండ్ చేశారు. తన కుమార్తె తప్పు చేసి ఉంటే పరీక్షల అనంతరం కౌన్సెలింగ్ లేదా చర్యలు తీసుకోవాలని, అంతేగానీ అందరిముందు మానసికం గా కుంగదీయడం మంచి పద్ధతేనా అని ప్రశ్నించారు. రాజారెడ్డి స్వస్థలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని మాటుమడుగు గ్రామం. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. రాగమౌనిక మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి, సోదరుడు కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. తాను, తన సోదరి సత్యభామ వర్సిటీలోనే బీటెక్ చదువుతున్నామని, తనకు మౌనిక ఎస్ఎంఎస్లు చేసినా, పరీక్ష హాల్లో ఉండటంతో ఫోన్ చూడలేదని, బయటకు వచ్చిన తర్వాత చూసి హాస్టల్‌కు పరుగులు తీసినట్లు సోదరుడు రాకేష్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ తనను లోపలికి పంపలేదని, పంపి ఉంటే తన సోదరిని రక్షించుకునే వాడినని ఆవేదన వ్యక్తంచేశాడు. ఫోన్లో మాట్లాడిన కాసేపటికే.. మౌనికకు ఆమె తల్లిదండ్రులు రాజారెడ్డి, వాణిశ్రీ బుధవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత కొన్ని గంటల్లోనే మౌనిక మరణించిందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మౌనిక ఆత్మహత్యకు ముందు స్నేహితులకు ‘మిస్ యూ ఆల్.. లవ్ యూ ఆల్’ అంటూ ఫోన్లో మెసేజ్‌లు పంపించింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఆమె మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. -
‘సత్యభామ’లో భారీగా బలగాల మోహరింపు
చెన్నై : తెలుగు విద్యార్థిని మౌనిక(18) ఆత్మహత్యతో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు జనవరి 2 వరకూ సెలవులు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామునే విద్యార్థులతో యూనివర్సిటీ హాస్టళ్లను ఖాళీ చేయించి ఇళ్లకు పంపేసింది. యూనివర్సిటీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. కాగా, ఈ మధ్యాహ్నం మౌనిక మృతదేహానికి రాయపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మౌనిక కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని సొంత ఊరు నెల్లూరు తీసుకెళ్లారు. తన కూతురి ఆత్మహత్యకు యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని మౌనిక తండ్రి రాజారెడ్డి ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మౌనిక తప్పు చేస్తే అందరి ముందూ కాకుండా పక్కకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసుంటే తాను బ్రతికుండేదని అన్నారు. అవమాన భారంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అసలేం జరిగింది.. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని మౌనిక(ఫస్టియర్ బీటెక్ సీఎస్ఈ)ను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కౌన్సిలింగ్ ఇచ్చినట్లైతే బ్రతికివుండేది.. కాపీ కొట్టిందని మౌనికను పరీక్ష హాల్ నుంచి ఇన్విజిలేటర్ బయటకు పంపించినట్లు మౌనిక సోదరుడు రాకేష్ తెలిపారు. రాకేష్ కూడా సత్యభామ విశ్వవిద్యాలయంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఆ తర్వాత మౌనికను తాను బయటకు తీసుకెళ్లానని, మౌనిక ఎవరినో కలిసి వచ్చినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ అధికారుల పర్మిషన్ లేకుండా హాస్టల్ గదికి వెళ్లకూడదని, అయితే మౌనిక హాస్టల్‌కు వెళ్లిందని ఎలా వెళ్లిందో తనకు తెలియదని వివరించారు. హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే, ఆ సమయంలో తాను పరీక్ష హాల్లో ఉన్నట్లు చెప్పారు. పరీక్ష ముగిసిన తర్వాత విషయం తెలియడం పరిగెత్తకుంటూ మౌనిక హాస్టల్ గదికి వెళ్లినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది తనను తొలుత లోపలికి వెళ్లనివ్వలేదని, పది నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి మౌనికను చూసినట్లు చెప్పారు. అప్పటికే మౌనిక ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. కాపీ కొడితే అందరిలో అవమానించకుండా, కౌన్సిలింగ్ ఇచ్చినట్లు అయితే మౌనిక బ్రతికేవుండేదని అన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య: వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు
సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడంతో, తోటి విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ఈ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోన్న హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక అనే విద్యార్థిని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. వర్సిటీలో రాధా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధుల విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్, తరగతి గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. తమ స్నేహితురాలి మృతికి యాజమాన్యమే కారణమంటూ వారు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ప్రాంగణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. వర్సిటీకి చేరుకున్న పైర్ ఇంజన్లను విద్యార్దులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని లోనికి వెళ్లనిచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాగా, రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని మౌనికను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. (చదవండి : 'సత్యభామ'లో హైదరాబాద్ యువతి ఆత్మహత్య) -
విద్యార్థిని సూసైడ్.. వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు
-
చెన్నైలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్రు చేస్తున్నారు. మౌనిక ఆత్మహత్య చెన్నైలో విద్యాబ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థుల్లో బయాందోళనకు గురి చేసింది. -
పెళ్లి చేసుకోవాలన్నందుకు హత్య
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. పెళ్లి చేసు కోవాలని ఒత్తిడి తెచ్చినందుకు దారు ణంగా హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరి కాడు. కరీంనగర్ జిల్లా శంకరప ట్నం మండలం లింగాపూర్‌కు చెందిన మోరె మౌనిక (21) తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్‌కు వలస వచ్చింది. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1లోని గ్రావిటీ మెడికల్ అకాడ మీలో వార్డెన్‌గా పనిచేస్తోంది. ఈమె గతంలో పనిచేసిన చోట రాజశేఖర్ అనే వ్యక్తి తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజశేఖర్ మోసం చేయడంతో మౌనిక ఏప్రిల్‌లో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. జైల్లో ఉన్నపుడు రాజశేఖర్‌ను కలసి పెళ్లి చేసుకోవాలని మౌనిక వేడుకుంది. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాజశేఖర్.. మౌనికను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఆమెను నమ్మించి కూకట్పల్లి సమీపంలోని ఐడీఎల్ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఆమెను హత్య చేసి చెట్టుకు ఉరేశాడు. మరుసటి రోజు ఉదయం మౌనిక అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. మౌనిక మృతదేహం చెట్టుకు 20 అడుగుల ఎత్తులో ఉరేసుకున్నట్లుగా వేలాడుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరం అంగీకరించినట్లు తెలిసింది. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులు దీనిని హత్యగా నిర్ధారించినట్లు సమాచారం. -
దుండిగల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీ.టెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. సురారం కాలనీలో నివసిస్తున్న చంద్రం, రేణుక దంపతుల కుమార్తె మౌనిక స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీ.టెక్ ఫైనలియర్ చదువుతోంది. బుధవారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ అప్లోడ్ చేసిన మౌనిక.. తన జీవితం దుర్భరంగా తయారైందని పేర్కొంది. తాను సంతోషంగా ఉండటం చుట్టుపక్కల వారు చూడలేకపోతున్నారని చెప్పింది. అనంతరం ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, బుధవారం మౌనికకు తన తమ్ముడితో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు మౌనిక తల్లి రేణుక తెలిపారు. తమ్ముడితో గొడవ అనంతరం మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. చంద్రం, రేణుకల స్వస్థలం పశ్చిమ గోదావరి. ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు సురారం కాలనీలో నివాసముంటున్నారు. అయితే చంద్రం, రేణుకల మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. కాగా, మౌనిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అగ్ని సాక్షిగా ఒక్కటై..
24 గంటల్లోపే రైలు కిందపడి యువతి, యువకుడి ఆత్మహత్య ♦ పెద్దలను ఎదిరించలేక.. కలిసి జీవించలేక బలవన్మరణం ♦ కులాలు వేరు కావడమే ఆ జంటకు ప్రధాన అడ్డంకి ♦ ఆత్మహత్యకు ముందు స్నేహితుడికి సమాచారం ♦ అవయవాలు ఇతరులకు ఇవ్వాలని విజ్ఞప్తి ♦ వేటపాలెం రైల్వేస్టేషన్లో ఘటన.. చీరాల: వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డొచ్చాయి. పెద్దలను ఎదిరించలేక.. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. ఆత్మహత్య అనంతరం పనికి వచ్చే తమ అవయవాలు దానం చేయాలని ఆ జంట తమ స్నేహితులకు విజ్ఞప్తి చేసింది. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్లో జరిగింది. వివరాలు.. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజి నీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని యువతి, యువకుడిని హెచ్చరించారు. కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తమ కారణంగా తల్లిదండ్రులకు ఆపద రాకూడదని భావించారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవి ంచాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. స్నేహితుడికి ఫోన్ చేసి.. పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు బనికొస్తే ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలనీ ప్రాథేయపడ్డాడు. ఈ సమాచారాన్ని 108కు అందించాలని సూచించాడు. తలలు పట్టాలపై ఉంచి.. సందీప్, మౌనికలు తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నా రు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్న ప్రేమికుల మృతదేహాలు చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులు చదువుకొని తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడకుంటే తమ ఆశలను అడియాశలు చేశాడంటూ రోదించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం: కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. మండల కేంద్రం బ్రహ్మసముద్రంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురం గ్రామానికి చెందిన భీమరాజ్, మౌనిక ఏడాదిగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అబ్బాయి తండ్రి తిమ్మప్ప అమ్మాయి తల్లిదండ్రులు తిమ్మప్ప, పద్మావతిలను బ్రహ్మసముద్రం పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి, అమ్మాయి మేజర్లు అయినందున వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చని, ఎవ్వరూ వారిని బెదిరింపులకు గురి చేయరాదని పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులకూ చెప్పి పంపించారు. అనంతరం భీమరాజ్ బ్రహ్మసముద్రంలో ఉంటున్న తన పెదనాన్న వద్దకు అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుదామని పెదనాన్న, వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. దీంతో పెళ్లికి ఆటంకాలు ఏర్పాడుతాయని భావించిన భీమరాజ్, మౌనికలు ఇంట్లోనే పెట్రోల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి అనంతరం బాధితులను కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని బ్రహ్మసముద్రం పోలీసులకు సమాచారం అందించారు. -
ఊరెళితే.. ఉన్నదంతా ఊడ్చేశారు!
కదిరి : కదిరి పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో దొంగలుపడ్డారు. పది తులాలు బంగారు, మరో పది తులాలు వెండి ఆభరణాలతోపాటు రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఊరెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మౌనిక థియేటర్ నిర్వాహకుడు రామమూర్తి నారాయణరావు వీధిలో నివాసముంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు సపర్యలు చేయడానికి రామమూర్తి భార్య వెళ్లింది. మూడు రోజుల క్రితం ఆయన కూడా హైదరాబాద్ వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు మంగళవారం పట్టపగలే వెనుక తలుపుగుండా గుండా లోనికి ప్రవేశించారు. మూడు బీరువాలు తెరిచి ఒక బంగారు నెక్లెస్, 5 డాలర్ చైన్లు, 5 ఉంగరాలు, 8 జతల కమ్మలు, 10 తులాల వెండి ప్రమిదలు, చెంబు, తట్టతో పాటు రూ.25 వేల నగదు అపహరించుకుపోయారు. పట్టణ ఎస్ఐ గోపాలుడు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలను పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీఎస్పీ ఎన్.వి.రామాంజనేయులు తెలిపారు. -
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
జీడిమెట్ల(హైదరాబాద్): ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..గాజులరామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీకి చెందిన రాములు కుమార్తె మౌనిక(19) చింతల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. శనివారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన వెళ్లిన మౌనిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..బాలిక మృతి
కొత్తగూడెం: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలిక మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంలో మౌనిక(16) మృతిచెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్థులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. -
పుట్టింటికెళ్తే.. రెండో పెళ్లి చేసుకున్నాడు!
► మొదటి భార్య పంచాయతీ ప్రథమ పౌరురాలు ► తనకు జరిగిన అన్యాయంపై పోలీసుకు ఫిర్యాదు ► అయినా పట్టించుకోలేదంటూ ఆరోపణ ► న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తానంటున్న బాధితురాలు రాయదుర్గం రూరల్ : ఆమె పంచాయతీ ప్రథమ పౌరురాలు. అటువంటి ఆమెకే భర్త నిరాదరణ తప్పలేదు. కాన్పు కోసం వెళ్తే.. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. రాయదుర్గం రూరల్ మండలం చదం గ్రామానికి చెందిన ఊలెప్పతో రాయదుర్గానికి చెందిన మౌనిక వివాహం 2011 మే 18న అయింది. 2013లో ఆమె సర్పంచ్‌గా గెలుపొందారు. నాలుగున్నరేళ్లుగా ఆమె సంతానం కోసం ఎన్నో పరీక్షలు చేయించుకున్నారు. ఎట్టకేలకు డిసెంబర్లో గర్భం దాల్చిన ఆమె నెల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారం కిందట పెళ్లి చేసుకుని.. బిడ్డ పుట్టినా చూసేందుకు వెళ్లని ఊలెప్ప వారం కిందట రెండో పెళ్లి చేసుకున్నాడని మౌనిక ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఐదు రోజుల కిందట ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎస్పీని కలసి న్యాయం కోరుతానన్నారు. దీనిపై ఎస్ఐ మహానంది స్పందిస్తూ... మౌనిక ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. అది కుటుంబ సమస్య కావడంతో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మౌనికను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిడమనూరు : కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గురుకుల పాఠశాల విద్యార్థిని వుగ్గె మౌనిక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. నిడమనూరులో శుక్రవారం పర్వతోహకురాలు వుగ్గె మౌనిక సన్మాన సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిభ చూపిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మౌనిక అదే స్ఫూర్తితో చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపాలని కోరారు. లయన్స్కబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ –2 రామానుజాచార్యులు మాట్లాడుతూ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రాజకీయ దార్శనికుడని అన్నారు. ఎంతో గర్వంగా ఉంది : మౌనిక మహామహుల సమక్షంలో స్టేజీ ఎక్కడం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినప్పటి కంటే ఎక్కువ సంతోషంగా ఉందని వుగ్గె మౌనిక అన్నారు. శుక్రవారం తన అభినందన, సన్మాన కార్యక్రమంలో మౌనిక మాట్లాడారు. డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఎవ్వరూ గుర్తించలేదని, అప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నిడమనూరు లయన్స్‌క్లబ్ వ్యవస్థాపకుడు చేకూరి హన్మంతరావు పర్వతాన్ని అధిరోహించిన విషయం పత్రికల ద్వారా తెలుసుకుని తనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ముందడగు వేయాలని అప్పుడే విజయాలు వాటంతట అవే వస్తాయని మౌనిక అన్నారు. ఈసందర్భంగా మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 22మందిని సన్మానించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1 చిలుకల గోవర్దన్, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, ఎంఈఓ బాలు నాయక్, జెడ్పీటీసీ అంకతి రుక్మిణిసత్యం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చేకూరి వంశీచరణ్, నిడమనూరు లయన్స్‌క్లబ్ బాధ్యులు ముంగి శివమారయ్య, అంకతి సత్యం, మెరుగు మధు, ఉన్నం చిన వీరయ్య, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, కట్టెబోయిన గోవర్దన్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రెండు బైక్‌లు ఢీ: యువతి మృతి
మహేశ్వరం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో.. బైక్ పై ఉన్నమౌనిక(17) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఖమ్మం : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన సవనం మౌనిక (16) అనే విద్యార్థిని టెన్త్ పరీక్ష తప్పింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. మౌనిక అనంతారం ఐటీడీఎస్ పాఠశాలలో చదివింది. -
కేఎంసీలో మెడికో ఆత్మహత్య
♦ ఉరి వేసుకున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థిని మౌనిక ♦ ఈ నెల 22 నుంచి పరీక్షలు.. ♦ చదవడం పూర్తి కాలేదని విద్యార్థుల ముందు ఆవేదన ♦ మానసిక ఒత్తిడితో చనిపోయి ఉండొచ్చు: కుటుంబ సభ్యులు సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని ఎంఎస్ మౌనిక(23) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఆమె ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట దర్గాలో నివాసముంటున్న సుభాష్ యాదవ్, నిర్మల దంపతుల కుమార్తె మౌనిక. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి ఆమె కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 22 నుంచి జరగనున్న ఫైనలియర్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కాలేజీలోని లక్కిరెడ్డి భవనంలో 19వ నంబర్ గదిలో రెండు వారాల నుంచి ఒంటరిగా ఉంటోంది. అన్ని విభాగాలను చదవడం పూర్తి కాలేదని తరచూ ఆమె టెన్షన్ పడేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు తోటి విద్యార్థులతోనే గడిపింది. అంతకుముందు సాయంత్రం పాల ప్యాకెట్‌తో పాటు కొన్ని వస్తువులు కావాలంటూ దోబీకి రూ.100 ఇచ్చింది. ఆ డబ్బును దోబీ సూపర్వైజర్కు ఇవ్వగా.. ఆయన మౌనిక చెప్పిన వస్తువులు తెప్పించారు. మంగళవారం ఉద యం 11 గంటలకు స్నేహితులు మౌనిక గదికి వెళ్లి గది తలుపు కొట్టగా ఎంతకీ తెరవలేదు. దీంతో కిటికీలు తెరిచిన చూడగా మౌనిక ఊరి వేసుకుని కనిపించింది. వాచ్‌మన్ వచ్చి కిటికీ ధ్వంసం చేసి లోపలకు వెళ్లి గది తలుపు తెరిచారు. వెంటనే కేఎంసీ ప్రిన్సిపల్ విద్యాసాగర్‌కు సమాచారమిచ్చారు. ఆయన హాస్టల్‌కు చేరుకుని ఘటన విషయాన్ని పోలీసులకు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కాలేజీకి వచ్చి మౌనిక ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ప్రిన్సిపల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎంజీఎం మార్చురీలో మృతదేహం కూతురు ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం అందడంతో మౌనిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు కేఎంసీకి వచ్చారు. మానసిక ఒత్తిడి వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న తండ్రి సుభాష్ ఫిర్యాదుతో పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
గుండెపోటుతో టెకీ మృతి, బాల్కనీలోంచి దూకేసిన భార్య
న్యూఢిల్లీ: నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని భార్య భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వీరి అయిదేళ్ల చిన్నారి అనాధగా మారిన వైనం స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే..అనురాగ్ అగర్వాల్ (39), మోనికా (36) భార్యభర్తలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనురాగ్ కు మంగళవారం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1.30గం.లకు చనిపోయాడు. ఈ వార్త విన్న వెంటనే మోనిక నోయిడా ప్రతీక్ లారెల్ లోని తమ నివాసానికి వెళ్లింది. 8వ అంతస్తులోని తమ ఫ్లాట్ బాల్కనీలో నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. భర్త చనిపోయిన ఆసుపత్రిలోనే సుమారు 2.30 గంటలకు ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అనురాగ్, మోనిక లకు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు అయిదేళ్ల పాప కూడా ఉంది. భర్త చనిపోయిన షాక్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీస్ అధికారి పంకజ్ పంత్ తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. కాగా నోయిడా సెక్టార్ లోనే గత వారం ఎసీపీ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా , అతని భార్య బాల్కనీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఆ సంఘటనను మరువకముందే ఇదే ప్రాంతంలో మరో దంపతులు విగతజీవులుగా మారడం స్థానికంగా విషాదాన్ని నింపింది. -
వివాహం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య
పరిగి (రంగారెడ్డి జిల్లా): వివాహం ఇష్టం లేక మనస్తాపం చెందిన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లి అనుబంధ రావులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లాపూర్ సత్తయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(15) చిన్నప్పటి నుంచి దోమ మండల పరిధిలోని పాలెపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. దోమ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇటీవల బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వేసవి సెలవులు ఉండటంతో మౌనిక నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా పొలానికి వెళ్లిన బాలిక చున్నీ అంచుపై వేసి బావిలో దూకింది. పక్కపొలం రైతులు గమనించి వెంటనే బావిలోకి దూకి బాలికను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే మౌనిక మృతిచెందింది. అయితే.. మౌనికకు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారని.. మగ పెళ్లివారు ఆదివారం మౌనికను చూసేందుకు వస్తున్నారని తెలిసి.. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు తెలిపారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, బాలిక ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
బాలిక ప్రాణం తీసిన బాల్య వివాహం
14 ఏళ్ల వయస్సులో పెళ్లి 16 ఏళ్లకు గర్భిణి కాన్పు అయిన 16 రోజులకు మృతిచెందిన బాలిక దగదర్తి : బాల్య వివాహం ఓ బాలిక ప్రాణాలు తీసింది. 14 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడం ఆ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసింది. 16 ఏళ్ల వయస్సులోనే గర్భిణి వచ్చింది. కాన్పు అయిన 16 రోజుల్లో ఆ బాలిక మౌనిక (16) మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని వెలుపోడు పంచాయతీ మజరా కామినేనిపాళెంలో గురువారం చోటుచేసుకుంది. రోజుల పసికూన అమ్మ ఒడికోల్పోయాడు. కామినేనిపాళెంకు చెందిన వంకదారి మాల్యాద్రి, ధనలక్ష్మీ దంపతుల కుమార్తె మౌనికను అదే గ్రామానికి చెందిన కండే రాము, జయమ్మ దంపతుల రెండో కుమారుడు చిన హజరత్తయ్యకు ఇచ్చి ఏడాదిన్నర కిందట వివాహం చేశారు. మొదటిలో సజావుగా సాగిన కాపురం ఆరు నెలలకే అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో మౌనిక గర్భందాల్చిన మూడు నెలలకే అత్తమామలు పుట్టింటికి పంపినారన్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల సంరక్షణలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఈ నెల 13వ తేదీన నెల్లూరు జూబ్లి హాస్పటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి వైద్యులు పురుడుపోశారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మౌనిక కళ్లు తిరుగుతున్నాయి అని పడిపోవడంతో హుటాహుటిన వైద్యపరీక్షలకు తరలిస్తుండగా కొడవలూరు మండలం రాజుపాళెం సమీపంలోకి వెళ్లేటప్పటికి మృతి చెందిందన్నారు. అనంతరం తల్లిదండ్రులు మౌనిక మృతదేహాన్ని అత్తాంటికి చేర్చగా అత్తమామలు, భర్త ఇళ్లు వదిలి పరారయ్యారని చెప్పారు. ఉదయం వైద్యపరీక్షలకు భర్త చిన హజరత్తయ్య కూడ వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పదో తరగతి చదువుతుండగనే వివాహం.. టెన్త చదివే సమయంలోనే మౌనికకు వివాహం చేశారు. చిన్నతనంలోనే వివాహమైన మౌనిక మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోగ్య సిబ్బంది సరైన వైద్యం అందించకనా లేక పోషకాహార లోపమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భారతీరెడ్డిని వివరణ కోరగా మౌనిక గర్భం ధరించిన నాటి నుంచి మరణించనంత వరకు వైద్యపరీక్షలు చేపట్టిన రికార్డులను పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. -
పురుగులమందు తాగి బాలిక ఆత్మహత్య
మహబూబ్‌నగర్: ఇంట్లోంచి పారిపోయిన బాలిక శవమై తేలిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అర్కపల్లి పరిధిలోని పల్లెతండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన మౌనిక (15) అనే బాలిక శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లిదండ్రులు ఆమె కోసం గాలించగా ఆదివారం మధ్యాహ్నం పొలం వద్ద శవమై తేలింది. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా ఉండటంతో అనుమానం వచ్చిన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన బాలిక సురక్షితం
గుంటూరు సిటీ : ఇటీవల హైదరాబాద్ హైకోర్టు వద్ద కిడ్నాపైన మౌనిక ఆచూకీ బుధవారం లభ్యమైంది. జిల్లాలోని అరండాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురవయ్య హైస్కూల్ వెనక ఉన్న ఒక గుడిసెలో పాపను దాచాడు. పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా నిందితుడ్ని గుర్తించారు. అతని కదలికలను నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన హనుమంతరావుగా గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
రాజారత్నం ఐజాక్ అరెస్ట్
-
తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు!
పది మందిలో పేరు - ప్రతిష్ట - హోదా అన్నీ ఉన్నాయి. ఆ పేరుకు మచ్చ రానుంది అనుకున్నాడు. అంతే, ఇంకేమి ఆలోచించలేదు. గుడ్డిగా ముందుకెళ్లాడు. ఒకరి హత్యతో మొదలైన కథ, మరో నలుగురి ప్రాణాలు తీసేలా చేసింది. కడపలో జరిగిన అయిదు హత్యలు సస్పెన్స్, క్రైం, యాక్షన్, థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఈ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివాహేతర సంబంధం అనుమానాలు ఓ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాయి. కోడలి తీరుపై మామకు అనుమానం. ముందు కోడలి హత్య. ఆ తరువాత ఇద్దరు మనవరాళ్లు, ఓ మనవడు. చివరకు కొడుకు కూడా హత్యకు గురయ్యాడు. ఈ హత్యలకు సంబంధించి భిన్న కథనాలు వినవస్తున్నాయి. పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం రాజారత్నం ఐజాక్ కడపలో ఓ పేరున్న పెద్దమనిషి. రాష్ట్రపతి నుంచి కబీర్ పురస్కార్ అవార్డు అందుకున్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇంటి ఆవరణలో ఐదుగురి మృతదేహాల్ని పాతిపెట్టారు. ఆ మృతదేహాలు అతని కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లవి. ఈ హత్యలకు, ఆయనకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలు జరిగి ఏడాదిన్నర అవుతోంది. ఆయన మాత్రం అలాగే పెద్దమనిషిగా చలామణీ అవుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం కృపాకర్ ఐజాక్ 2004లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం రాజారత్నంకు ఇష్టంలేదు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు రేకెత్తించాడు. దాంతో కాపురంలో కలతలు చెలరేగాయి. కుటుంబం పరువు పోతుందని రాజారత్నం భావించాడు. మౌనికను అడ్డు తొలగించుకుంటే తప్ప, పరువు నిలవదనుకున్నాడు. డ్రైవర్ రామాంజనేయులికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి కోడలు మౌనికను ఖతం చేయాలని ఆదేశించాడు. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్తే విషయం బయటకు పొక్కుతుందని భయపడ్డాడు. మౌనిక శవాన్ని సొంత జియాన్ స్కూల్లోనే పూడ్పించే ఏర్పాటు చేశాడు. తల్లి హత్యను వారి ముగ్గురు పిల్లలు కళ్లారా చూశారు. తల్లి హత్య గుట్టును పిల్లలు రట్టు చేస్తారని రాజారత్నం అనుమానించాడు. పిల్లలను కూడా తల్లి దగ్గరకు పంపితే, తన పేరు మీద వున్న స్కూల్ రాసిస్తానని డ్రైవర్ రామాంజనేయులుకి ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ డ్రైవర్ ఆశపడ్డాడు. అప్పటికే ఒక హత్య చేసి ఉన్నాడు. పిల్లలను కూడా చంపేశాడు. తల్లిని పూడ్చిన ప్రాంతంలోనే ఖననం చేశాడు. రాజారత్నం కొడుకు కృపాకర్ రూపంలో కథ అడ్డంతిరుగుతుందని రామాంజనేయులు అనుకోలేదు. స్కూల్ విషయంలో కొడుకు కృపాకర్ - డ్రైవర్ రామాంజనేయులు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పటికైనా హత్యల మిస్టరీ బయటపడుతుందని రామాంజనేయులు భావించాడు. ఇంకేముంది కృపాకర్‌ను కూడా హత్య చేశాడు. అతని భార్య, పిల్లలను పూడ్చిన ప్రాంతంలోనే అతని మృతదేహాన్ని కూడా పూడ్చేశాడు. పరువు గురించి ఆలోచిస్తే, రాజారత్నంకు కన్న కొడుకు కూడా కాకుండా పోయాడు. దాంతో రాజారత్నం ఆవేదన చెందాడు. కొడుకును చంపిన డ్రైవర్ రామాంజనేయులును హత్య చేయించాలనుకున్నాడు. అందుకు కిరాయి హంతకులకు 15 లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం రామాంజనేయులుకు తెలిసింది. ఇక చేసేదేమీలేక, రామాంజనేయులు జరిగిన కథను పూస గుచ్చినట్లు పోలీసులకు వివరించాడు. పోలీసులు జియోన్ పాఠశాల ఆవరణలో తవ్వించి అయిదుగురి అస్థిపంజరాలను వెలికితీశారు. దాంతో ఈ మిస్టరీ కొంతవరకు వీడింది. ఒక తప్పును కప్పిపుచ్చేందుకు మరో తప్పు, ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూపోతే ఐదుగురి ప్రాణాలు పోయాయి. ఈ హత్యలపై ఇంకా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జియోన్ పాఠశాలకు సంబంధించిన పత్రాలను కూడా స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డాక్యుమెంట్లను వెలికితీయించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజారత్నం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రాజారత్నం ఐజాక్‌ను సంఘటనా స్థలం వద్దే పోలీసులు విచారించి అసలు నిజాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ** -
యువతి దారుణ హత్య
బోధన్ టౌన్ : బోధన్ పట్టణ శివారులోని పాండు చెరువు కట్టమీద సోమవారం రాత్రి 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హ్యత చేశారు. మంగళవారం ఉదయం కట్టమీదికి వెళ్లిన రైతులకు యువతి మృదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రామకృష్ణ, ఎస్సై గంగాధర్‌లు మృతదేహాన్ని పరిశీలించారు. చెట్ల పొదల్లో పడిఉన్న మృత దేహం ముఖం గుర్తు పట్టకుండా అయ్యింది. పోలీసులు డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించారు. పోలీసు జాగి లం అక్కడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చివరకు మృత దేహం వద్దకు వచ్చి నిలిచింది. కాగా మృతురాలిని వర్ని మండలం రుద్రూర్ గ్రామానికి చెందిన మౌని కగా గుర్తించారు. హతురాలు బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేదని, సోమవారం ఉదయం డ్యూటికి వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. హతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బంధువులు రాస్తారోకో... మౌనిక హత్య కేసులో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆమె బంధువులు ఏరియా ఆస్పత్రి ముందు రాస్తారోకో నిర్వహిం చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు. -
వీడిన కృపాకర్ కుటుంబం హత్య కేసు మిస్టరీ
కడప: కడపలో ఏడాది క్రితం జరిగిన ఓ కుటుంబం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు ఐదుగురూ హత్యకు గురైనట్టు విచారణలో తేలింది. కృపాకర్ తన భార్య మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో హత్యకు పథకం వేసినట్టు జిల్లా ఎస్పీ నవీన్ చెప్పారు. కృపాకర్ భార్య మౌనికతో పాటు ముగ్గురు పిల్లలను హత్య చేయించినట్టు తెలిపారు. అనంతరం కృపాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయాలన్నీ తెలిసినా రాజారత్నం నిజాన్ని బయటపెట్టలేదని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. జియోన్ స్కూల్ ఆవరణలోనే మృతదేహాలను పాతిపెట్టినట్టు ఎస్పీ తెలిపారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు. ........... -
కడపలో సంచలనం :ఓ ప్రముఖ కుటుంబం హత్య!
కడప: నగరంలో ఏడాది క్రితం మాయమైన ఓ ప్రముఖుడి కుటుంబానికి చెందిన అయిదుగురు హత్యకు గురయ్యారు. ఈ వార్త కడపలతో సంచలనం సృష్టించింది. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్, కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. రాజారత్నం ఐజక్కు నగరంలో మంచి పేరుంది.నగర ప్రముఖులు అందరితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సభలు, సమావేశాలలో ఆయన ఎక్కువగా పాల్గొంటుంటారు.ఈ కుటుంబం మొత్తం ఏడాది నుంచి కనిపించడంలేదని మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కుటుంబానికి చెందినవారిని తానే హత్య చేసినట్లు ఓ నిందితుడు పోలీసులకు చెప్పాడు. మృతదేహాలను జియోన్ స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు. కిరాయి హంతకులు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దృష్టిలో అయిదారుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తవ్వి బయటకు తీసిన అస్థిపంజరాలు కృపాకర్, అతని భార్య మౌనిక, ముగ్గురు పిల్లలివిగా భావిస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టం తరువాత మాత్రమే ఆ అస్థిపంజరాలు ఎవరివినేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారి అస్థిపంజరాలు దొరికనప్పటికీ అవి ఎవరివి, హత్యలు ఎలా జరిగాయి, ఎవరు హత్యలు చేశారు, ఎందుకు హత్యలు చేశారు....తదితర విషయాలు తెలియవలసి ఉంది. ** -
ఓ ప్రముఖ కుటుంబం హత్య!
-
పెళ్లి కాలేదని మోసగించి..
తనకు పెళ్లి కాలేదని చెప్పుకున్న ఓ ప్రబుద్ధుడు ఓ అమాయకురాలిని నిలువునా వంచించాడు. కట్నకానుకల కోసం యువతిని పెళ్లాడి, ఆమె కుటుంబాన్ని మోసం చేశాడు. తీరా వివాహం అనంతరం కుటుంబంతో కలిసి శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈక్రమంలో తన భర్తకు ఇంతకుముందే వివాహం అయ్యిందని, ఓ కుమారుడు కూడా ఉన్నాడని తెలిసి బాధితురాలు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. ఆర్మూర్ టౌన్ : తనకు పెళ్లి కాలేదని మోసగించి రెండో పెళ్లి చేసుకుని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీకి చెందిన కత్రాజి విజయ్‌కుమార్ ఇంటి ముందు నిత్యశ్రీ(మౌనిక) అనే వివాహిత శనివారం ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని, కట్నం కోసమే రెండో పెళ్లి చేసుకున్న భర్త విజయ్‌కుమార్, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ నిత్యశ్రీ(మౌనిక)కి ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీకి చెందిన కత్రాజి విజయ్‌కుమార్‌తో మే 21, 2014న పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు నగదు, ద్విచక్ర వాహనం, తులం బంగారంతోపాటు గృహావసర వస్తువులు ముట్టజెప్పారు. మొదలైన వేధింపులు పెళ్లి తర్వాత 15 రోజుల నుంచే భర్త, అత్త సు వర్ణ, మామ రాజేందర్, ఆడబిడ్డ శిరీష నిత్యశ్రీని శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించారు. వివాహమైన నెల రోజులకు విజయ్‌కుమార్‌కు అనిత అనే మరో అమ్మాయితో ముందే వివాహం జరిగిందని, ఒక కు మారుడు కూడా ఉన్నట్లు నిత్యశ్రీకి తెలిసింది. దీంతో ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్ప గా వారు విజయ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆరా తీస్తే నిజం బయట పడింది. కాగా శనివారం నిత్యశ్రీ కుటుంబీకులు ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న విజ య్‌కుమార్, అతని తల్లి సువర్ణ, తండ్రి రాజేందర్, చెల్లెలు శిరీష ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు, ఆమె కుటుంబీకులు కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిత్యశ్రీ మాట్లాడుతూ విజయ్‌కుమార్ మొదటి భార్య అనిత తనకు ఫోన్ చేసి విజయ్‌కుమార్ దుశ్చర్యల గురించి చెప్పినట్లు తెలిపింది. ఈ విషయమై రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. నలుగురిపై ఫిర్యాదు చేయగా విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారని, ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కట్నంగా ఇచ్చిన సొమ్ము, పెళ్లి ఖర్చులు ఇప్పించాలని నిత్యశ్రీ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో నిత్యశ్రీ తండ్రి రాములు, తల్లి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనసూయ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నూర్జహాన్, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు దరోజి భారతి, సీపీఎం నాయకులు పల్లపు వెంకటేశ్, చక్రపాణి, గోవర్ధన్, గంగాధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గుండె ల నిండా శోభమ్మ జ్ఞాపకాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుండె గది నిండా అమ్మ జ్ఞాపకాలు.. కళ్లలో కదలాడుతున్న అమ్మ స్వరూపం..జనంతోఅమ్మచేసిన కరచాలనం..పలుకరింపులు. అదే ప్రేమను.. ఆప్యాయతను.. ఆత్మీయతను గుండెల్లో నింపుకుని అమ్మ గెలుపు బాధ్యతను భుజాన మోస్తూ ఊరూ.. వాడా సాగిపోతున్నారు వారు. తల్లి జ్ఞాపకాలు తరుముకొస్తున్నా... బాధ్యతను పిడికిల్లోదాచుకుని ముందుకు సాగుతున్న ఆపిల్లల రాజకీయ స్థైర్యాన్ని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చ్యర్యం వేయకమానదు. ఆళ్లగడ్డలో అమ్మకోసం.. నంద్యాలలో నాన్నకోసం.. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా జనంతో కలసి సాగుతున్నారు. ఆమ్మా.. నాన్నలను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి మీ ముంగిట చేరుతుందంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. మరోవైపు సతీమణి వీడిపోయిన దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని.. ఆ లావాగ్నిని భరిస్తూ.. తన ముందున్న బాధ్యతను నెరవేరుస్తూ.. ధీమాతో ముందుకు కదులుతున్నారు భూమా. పత్తికొండలో అక్క నాగరత్నమ్మ ప్రచారం.... చెల్లెలు శోభమ్మను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి విజయం కోసం ఊరూ.. వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెల్లెలు ఇక పత్తికొండకు రాదని.. ఆ చిరునవ్వు లేదని తెలిసి బాధను గుండెల్లో దాచుకుని కోట్ల చక్రపాణిరెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా సోదరిని పోగొట్టుకున్న బాధను గుండెల్లో దాచుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు కూడా ఆమె లేరనే బాధను మదిలో దాచుకుని విజయమే లక్ష్యంగా సాగుతున్నారు. నంద్యాలలో మౌనిక ఆళ్లగడ్డలో ఆ ఇద్దరు అమ్మ కోసం ప్రచారం చేస్తుంటే.. నంద్యాలలో భూమా నాగిరెడ్డి, తన రెండో కుమార్తె మౌనిక ప్రచారం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభారాణి, జీవితాంతం కలిసుంటుందని బాస చేసిన ఆమె ఇక లేరని తెలిసి భర్త భూమా నాగిరెడ్డి హృదయం గాయమైంది. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగి.. మదిలో బాధను బయటకు చెప్పుకోలేక.. సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ప్రచారంలో సాగుతున్నారు. ‘జగనన్న సీఎం కావాలంటే నాన్నను గెలిపించండి..ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి’ అంటూ మౌనిక ప్రచారం చేస్తున్నారు. అమ్మను పోగొట్టుకున్న దుఃఖం, నాన్నను ఈ స్థితిలో చూస్తున్న బాధను లోలోపల దిగమింగుతూ ఆ ముగ్గురు ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి జనం కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఈ స్థితిలో మీరెందుకు వచ్చారమ్మా. పార్టీని గెలిపించటం మా బాధ్యత కాదా’ అంటూ వారికి భరోసానిచ్చి పంపుతున్నారు. ఆళ్లగడ్డలో అమ్మ కోసం ఆ ఇద్దరు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దుఃఖాన్ని దిగమింగి ఆళ్లగడ్డలో అమ్మ విజయం కోసం భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘అమ్మను గెలిపించండి.. జగనన్నను సీఎంను చేయండి. మీరు ఓటే వేసే అమ్మకు నివాళి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారంలో సాగుతున్నారు. అమ్మ కోసం ఆ పసి హృదయాలు పడే తపన నియోజకవర్గ ప్రజలను కలచివేస్తోంది. శోభమ్మను అఖిల ప్రియలో చూసుకుంటూ.. ‘అచ్చం మా శోభమ్మలా ఉన్నావమ్మా’ అంటూ కన్నీరు పెడుతున్నారు. ‘చల్లగుండాలమ్మా’ అంటూ అందరూ వారిని దీవించి పంపుతున్నారు. -
మండు వేసవిలో ఐస్‌క్రీమ్‌లా...
ఓ యువకుడు బాగా డబ్బు సంపాదించి తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్నవారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడన్నది ఇందులో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. రాజీవ్ చాలా ఎనర్జీతో నటించాడు. పాటల రికార్డింగ్ అమెరికాలో చేశాం. మండు వేసవిలో ఐస్‌క్రీమ్‌లా ఉంటుందీ సినిమా’’ అని దర్శకుడు శ్రీరామ్ వేగరాజు చెప్పారు. రాజీవ్ సాలూరి, మధురాక్షి, మౌనిక హీరోహీరోయిన్లుగా ఛేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ వేగరాజు, మాధురి వేగరాజు నిర్మించిన ‘ఓరి... దేవుడోయ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించి, తొలి ప్రతిని డి.రామానాయుడికి అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ- ‘‘సాలూరి రాజేశ్వరరావుగారు, ఆ తర్వాత కోటి నేను నటించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. అన్నీ సూపర్‌హిట్సే. కోటి కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్టు కావాలి’’ అని ఆకాంక్షించారు. కోటి మాట్లాడుతూ- ‘‘మా రాజీవ్ సోలో హీరోగా నటించిన ఈ సినిమాకు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. చక్కటి సోషియో ఫాంటసీ చిత్రమిదని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో జెమినీ కిరణ్, బి.గోపాల్, మణిశర్మ, లగడపాటి శ్రీధర్, ‘మల్టీ డైమన్షన్’ వాసు తదితరులు మాట్లాడారు. -
‘గురుకులం’లోకి గుర్తు తెలియని యువకుడు
జోగిపేట, న్యూస్‌లైన్: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువకుడు స్థానిక బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చొరబడి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివా రం అర్ధరాత్రి ఒంటి గంటల ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు పాఠశాలలోని ఒకటవ అంతస్తులో ఎనిమిదో తరగతి విద్యార్థినులు ఉండే గదిలోకి ప్రవేశించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విద్యార్థినులు పలువురు అలాగే పడుకున్నారు. అయితే సదరు యువకుడు గదిలోని లైట్లు వేయడం.. ఆర్పేయడంతో చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియ ని యువకుడు మౌనిక అనే అమ్మాయి కాళ్ల వద్ద పడకున్నాడు. దీంతో గదిలోని విద్యార్థినులు ఒక్కసారిగా అరుస్తూ బయటకు వచ్చేశారు. ఈ కేకలకు యువకుడు బయటకు పారిపోయాడు. దీంతో విషయాన్ని విద్యార్థినులు వాచ్‌మన్ నరసింహులకు తెలియజేశారు. ఆ రాత్రం తా విద్యార్థునులు జాగరణ చేశారు. పోలీసులకు ఫిర్యాదు : ప్రిన్సిపాల్ ఆదివారం అర్ధరాత్రి పాఠశాలలో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కే మాధురీ దేవి తెలిపారు. పాఠశాల అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వద్ద పనిచేసే డ్రైవర్‌గా తాము అనుమానిస్తున్నామన్నారు. పాఠశాల పరిసరాల్లో రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు. పాఠశాలను సందర్శించిన తహ శీల్దారు, ఎస్ఐ సంఘటన వివరాలను తెలుసుకునేం దుకు అందోల్ తహశీల్దారు సీహెచ్ కృష్ణ య్య, ఎస్ఐ వై రవీందర్‌లు సోమవారం పాఠశాలను సందర్శించారు. సంఘటన వివరాలను విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌ల ను అడిగి తెలుసుకున్నారు. అనుమాని తునిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఎస్ఐ తెలిపారు. -
బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ కర్నూలు
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళా విభాగంలో కర్నూలు జట్టు చాంపియన్‌గా నిలిచింది. గుంటూరు జట్టు రన్నర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో విశాఖ-కృష్ణా జిల్లాల మధ్య పోటీ రసవత్తరంగా సాగినా, వెలుతురు లేకపోవడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. స్థానిక నంద్యాల పబ్లిక్ స్కూల్లో ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగాయి. మహిళల విభాగంలో కర్నూలు జట్టు 29-20, 29-17స్కోరుతో కృష్ణా జట్టును ఓడించి ఫైనల్స్‌కు చేరింది. మరో సెమీఫైనల్స్‌లో గుంటూరు 29-22, 29-20సోర్కుతో విజయనగరంపై విజయం సాధించింది. కర్నూలు-గుంటూరు జట్ల మధ్య పోటాపోటీగా సాగింది. జట్టు కెప్టెన్ మౌనిక అద్భుతమైన ప్రతిభను కనపరిచింది. తొలి మ్యాచ్ పోటాపోటీగా సాగినా, తర్వాత మ్యాచ్‌లో సునాయసంగా సాగింది. కర్నూలుజట్టు 29-20, 29-17స్కోరుతో ఘన విజయం సాధించి, చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఈ జట్టు చాంపియన్‌షిప్‌ను సాధించడం రెండో సారి. పురుషుల విభాగంలో ఫైనల్ మ్యాచ్ విశాఖ, కృష్ణా జట్ల మధ్య మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైంది. ఈ జట్ల మధ్య బెస్టాఫ్త్రీ మ్యాచ్‌లను ఆడించారు. అనంతరం ఇరు జట్ల క్రీడాకారులు అద్భుతమైన షాట్లతో పోటీగా ఆడారు. అయితే సమయం 5.45 నిమిషాలైన 3వ మ్యాచ్ కొనసాగుతూ ఉండటం, వెలుతురు తగ్గడంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం ఇరుజట్లను విజేతలుగా ప్రకటించారు. -
నవయువం : పరదేశంలో చదువు మనదేశంలో సేవ
విద్యార్థి దశలోనే సమాజ హితం కోసం కృషి చేస్తోంది మోనికా బాడ్. పుట్టింది, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం మోనిక 12వ తరగతి చదువుతోంది. స్వదేశంలో, విదేశాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విజయవాడకు చెందిన యాన్ ఫణి బాడ్, విజయ దంపతులు గత 27 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్‌హొజేలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురే మోనికా బాడ్. చిన్న నాటి నుంచే... చిన్నతనం నుంచే మోనికలో సేవాదృక్పథం ఉండేది. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించాలనే తపన ఆమెలో కనిపించేది. ‘‘మోనిక రెండేళ్ల వయస్సులో ఇండియాకు వచ్చాం. చెన్నై రైల్వేస్టేషన్లో తనకు బిస్కెట్లు ఇస్తే తీసుకువెళ్లి ప్లాట్‌ఫామ్‌పై బిక్షం ఎత్తుకుంటున్న చిన్నారులకు ఇచ్చింది, ‘‘వారు ఆకలి అంటున్నారు అందుకే ఇచ్చా..’’ అంటూ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని మోనిక తల్లి విజయ బాడ్ చెప్పారు. దత్తత తీసుకుంది... మోనిక విద్యనభ్యసిస్తున్న వ్యాలీ క్రిస్టియన్ హైస్కూల్లో నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థ్ధీ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ నిబంధన ఆమె లోని సామాజిక సేవాకార్యకర్తకు మరింత ప్రోత్సాహం లభించేలా చేసింది. దీంతో పాఠశాల పరిసరాలు, నగరంలోని పలుప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘వరల్డ్ విజన్’ సంస్థ చిన్నారులకు సాయం అందించేందుకు పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏడేళ్ల కోబితా దాస్‌ను దత్తత తీసుకుంది మోనిక. కోబితా దాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో చదువుకుంటోంది. దాస్ చదువుకు అవసరమైన ఖర్చును మోనికానే భరిస్తోంది. ఇందుకు ప్రతినెలా 30 డాలర్లు కోబితాకు పంపుతోంది. ఉపకార వేతనంతో సేవ... సామాజిక సేవాకార్యక్రమాలకు తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకున్న డబ్బును కాకుండా, తనకు లభించిన ఉపకార వేతనాలనే వెచ్చిస్తుంది మోనిక. పాఠ్యాంశాల్లో ప్రతిభ చూపటం ద్వారా లభించిన ఉపకార వేతనాలను సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంది. మోనిక, ఆమె తల్లిదండ్రులు విజయ, ఫణి బాడ్లు విజయవాడ వచ్చిపోయే క్రమంలో నగరంలో నడుపుతున్న చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఆవాసం పొందుతున్న విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో నృత్యం మొదలు రకరకాల క్రీడలు నేర్పటంతో పాటుగా, వారికి అవసరమైన దుస్తులను అందించేవారు. ఇందుకోసం మోనిక తన పాఠశాలలోని మిత్రుల సాయంతో దుస్తులు, క్రీడాసామగ్రి, మందులు సేకరించి చిన్నారులకు అందిస్తోంది. మోనికా చేపట్టే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలోనూ ఆమె తల్లిదండ్రులు కూడా భాగస్వాములవుతూ కుమార్తెకు సహకరిస్తున్నారు. నూతన క్రియేషన్స్‌తో... తాను చేపట్టిన సామాజిక సేవాకార్యక్రమాలను విస్తరించే పనిలో భాగంగా గత ఏడాది సొంతంగా ‘నూతన క్రియేషన్స్’ను ప్రారంభించింది మోనిక. నేటితరం అభిరుచులకు అనుగుణంగా ఉన్న ఫ్యాన్సీ నగలను ప్రదర్శించి, వాటి విక్రయాలద్వారా వచ్చిన డబ్బుతో సేవాకార్యక్రమాలను విస్తరింపచేయాలనే ఆలోచనతో మోనిక ఈ వ్యాపారసంస్థను స్థ్ధాపించింది. నానో టెక్నాలజీ క్లబ్‌తో... నానో టెక్నాలజీ క్లబ్ మెంబర్ అయిన మోనిక అంతర్జాతీయ స్పేస్ టీమ్‌లో సభ్యురాలు కూడా. అతి తక్కువ ప్రదేశంలో వ్యాయామం చేసేందుకు ఉపకరించే కంప్రెషన్ కూలింగ్ టెక్నాలజీని కనుగొనేందుకు సాగే పరిశోధనా బృందంలో కూడా ఆమె ఉంది. చదువు, పరిశోధనలతో పాటుగా బాస్కెట్ బాల్ కెప్టెన్‌గా క్రీడల్లోనూ రాణిస్తోంది మోనిక. ఆంకాలజిస్ట్ కావాలని... విదేశంలో ఉన్నా స్వదేశం పట్ల ఉన్న ఆపేక్షతో అక్కడా, ఇక్కడా సేవా కార్యక్రమాలను చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోనిక ఆంకాలజిస్ట్ కావాలనేది తన లక్ష్యమని చెబుతోంది. ‘‘క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, దానిని నిరోధించకపోవటంతో అనేక ప్రాణాలు పోతున్నాయి. దీనివల్ల కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. ఈ సమస్య నుంచి మనిషిని కాపాడాలి. క్యాన్సర్‌ను నిరోధించటంతో పాటుగా, గ్రామీణపేదలకు మెరుగైన వైద్యం అందించాలనేది నా ఆకాంక్ష’’ అంటోంది మోనిక. - ఈడ శివప్రసాద్ సాక్షి, కంకిపాడు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, దానిని నిరోధించకపోవటంతో అనేక ప్రాణాలు పోతున్నాయి. దీని వల్ల కుటుంబాలు వేదనకు గురవుతున్నాయి. ఈ సమస్య నుంచి మనిషిని కాపాడాలి. క్యాన్సర్‌ను నిరోధించటంతో పాటుగా, గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనేది నా ఆకాంక్ష. - మోనిక