
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. పెళ్లి చేసు కోవాలని ఒత్తిడి తెచ్చినందుకు దారు ణంగా హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరి కాడు. కరీంనగర్ జిల్లా శంకరప ట్నం మండలం లింగాపూర్‌కు చెందిన మోరె మౌనిక (21) తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్‌కు వలస వచ్చింది. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1లోని గ్రావిటీ మెడికల్ అకాడ మీలో వార్డెన్‌గా పనిచేస్తోంది. ఈమె గతంలో పనిచేసిన చోట రాజశేఖర్ అనే వ్యక్తి తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజశేఖర్ మోసం చేయడంతో మౌనిక ఏప్రిల్‌లో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. జైల్లో ఉన్నపుడు రాజశేఖర్‌ను కలసి పెళ్లి చేసుకోవాలని మౌనిక వేడుకుంది. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాజశేఖర్.. మౌనికను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఆమెను నమ్మించి కూకట్‌పల్లి సమీపంలోని ఐడీఎల్ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఆమెను హత్య చేసి చెట్టుకు ఉరేశాడు.
మరుసటి రోజు ఉదయం మౌనిక అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. మౌనిక మృతదేహం చెట్టుకు 20 అడుగుల ఎత్తులో ఉరేసుకున్నట్లుగా వేలాడుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరం అంగీకరించినట్లు తెలిసింది. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులు దీనిని హత్యగా నిర్ధారించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment