
దగ్గరుండి పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించి మంచి మనసు చాటుకున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదన్‌కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని ఆదివారం కళాభారతిలో నిర్వహించారు.
కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూసుకున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. మౌనికకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండీ పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి.. వధూవరులకు నూతన వ్రస్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. వివాహానికి జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు, వివిధ శాఖల అధికారులందరూ ఆర్థిక సహాయం అందించారు. కాగా మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.
Officials Became Parents: Grand Wedding of an Orphaned Young Woman was performed
Karimnagar @Collector_KNR @PamelaSatpathy Satpathy and Manakondur MLA Kavvampalli Satyanarayana Organized a Wedding at Kalabharati
A grand wedding ceremony was held at Kalabharati Auditorium in… pic.twitter.com/UMzBkniH0Z
— Jacob Ross (@JacobBhoompag) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment