
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల కారణంగా నిశ్చితార్ధం వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్ పోలీసుల వివరాల మేరకు.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ప్రకాష్ మాల్ చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఎంబీబీఎస్ డాక్టర్‌గా అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కిషోర్‌కు కొన్ని రోజుల కిందట నిశ్చితార్ధం జరిగింది. బట్టతలతో పాటు ఇతర కారణాల వల్ల నిశ్చితార్ధం ఆగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు కిషోర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కానీ సంబంధాలు కుదరడం లేదు.
బట్టతల ఉండడం, వయస్సు పెరిగిపోతుండడంతో డాక్టర్ కిషోర్ మనోవేధనకు గురయ్యారు. ఈ క్రమంలో గురువారం జామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డాక్టర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.