Bald head
-
అందంగా.. ఆకర్షణీయంగా..
వయసుతో సంబంధం లేదు.. స్త్రీ, పురుషులు అనే తేడా కనిపించడం లేదు. ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్యగా మారిపోయింది. 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు గల వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. జుట్టు ట్రాన్స్‌ప్లాంటేషన్, పీఆరీ్ప, స్కాల్ఫ్ త్రెడ్, విగ్గు వంటివి మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా విగ్గు అందరికీ అందుబాటులో కనిపిస్తోంది. గత రెండేళ్ల నుంచి విగ్గుల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయా రంగాలకు చెందినవారు చెబుతున్నారు. దీని కోసం డబ్బులు ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారట. ఫలితంగా నగరంలో ఈ కేటగిరీకి చెందిన క్లినిక్‌లు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. టీనేజ్‌లో ఉన్న వారికి జుట్టు రాలిపోవడంతో వివాహ సమయంలో తిరస్కరణకు గురవుతున్నామన్న భావన కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని మరికొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్గు పెట్టుకోవడం వల్ల మానసిక, ఆత్మ స్థైర్యం పెరుగుతుందని పలువురు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏడాది నుంచి మూడేళ్ల వరకూ.. సమాజంలో ఎత్తిపొడుపులు భరించలేక, ఎదుటి వ్యక్తుల సూటిపోటి మాటలను తట్టుకోలేక కూడా విగ్గు ధరించడానికి ఆసక్తిచూపిస్తున్నారట. హెయిర్ ప్లాంటేషన్‌కు ఇతర మార్గాలు ఉన్నప్పటికీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పట్ల మొగ్గుచూపిస్తున్నారు. కొంత మంది శుభకార్యాలకు, టూర్, కార్యాలయానికి ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన విగ్ వినియోగిస్తున్నారట. విగ్గు అందరికీ అందుబాటైన ధరలో అందుబాటులో ఉంటుంది. వివిధ రకాల కారణాలతో అందరి దృష్టినీ విగ్గులు ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాసెస్ (విగ్గు) సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తయారీలో వినియోగించే ముడిసరుకు (మెటీరియల్) నుంచి సంబంధిత సంస్థ విగ్గు అతికించే ప్రక్రియపై ధర అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా తయారైన విగ్గు ఏడాది నుంచి మూడేళ్ల వరకూ వినియోగించుకోవచ్చు.ఆ సమస్య తగ్గింది.. పదేళ్ల క్రితం నుంచి జుట్టు రాలిపోవడం మొదలైంది. తక్కువ సమయంలోనే తల మొత్తం ఖాళీ అయ్యి బట్టతల వచి్చంది. ఆఫీస్‌లో సహచర సిబ్బంది, స్నేహితులు హేళన చేసేవారు. కొన్ని సందర్భాల్లో నా మనసుకు అది నచ్చేది కాదు. పనిమీద ఏకాగ్రత కుదిరేది కాదు. స్నేహితుడి సూచన మేరకు ఆరు నెలల క్రితం విగ్గు తీసుకున్నా. పస్తుతం ఆ పరిస్థితి లేదు.. ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా.. – జి.రామ్మోహన్రావు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, మాదాపూర్ జుట్టు రాలడానికి గల కారణాలు..విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా వివిధ రంగాల్లో అన్ని వయసుల వారిపైనా ప్రధానంగా ఒత్తిడి కనిపిస్తోంది. దీనికి తోడుగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన అంశాలు, పౌష్టికాహార లోపం, అతిగా మందులు వినియోగించడం, బాలింతలు, చుండ్రు, పీసీఓఎస్ తదితర సమస్యల కారణంగా జుట్టు అధికంగా రాలిపోతోంది. ప్రధానంగా మహిళలు ఈ సమస్యపై చర్చించడానికి సిద్ధంగా లేరని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య, మహిళల విషయంలో చూస్తే 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య జుట్టు రాలుతోంది. దీంతో ఇన్స్టంట్ మేకప్ కోసం విగ్గులను వినియోగిస్తున్నారు.స్టయిల్‌కి తగ్గ మోడల్స్..వినియోగదారుడి అభిరుచి మేరకు తయారీ సంస్థలు విగ్గులు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా ఇండియన్ ప్యాచ్, హాలీవుడ్ ప్యాచ్, కొరియన్ ప్యాచ్ అనే మూడు రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో కొరియన్ ప్యాచ్‌కు ఆదరణ తక్కువ. పురుషులు, మహిళలు కోరుకున్న, అవసరమైన రంగు, అడిగినంత పొడవుతో విగ్గులు తయారుచేస్తున్నారు.యువతే ఎక్కువ.. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం సర్వసాధారణం అయిపోయింది. నాలుగేళ్ల క్రితం చాలా అరుదుగా విగ్గు కావాలని అడిగేవారు. ప్రస్తుతం నెలకు 60 నుంచి 100 మంది వరకూ కొత్త వ్యక్తులు వస్తున్నారు. వివాహం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు విగ్గుల ధరించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. విగ్గు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్కువ ఖర్చులో మంచి లుక్ వస్తుంది. – రవికాంత్, ఆర్కే హెయిర్ సొల్యూషన్స్ -
టర్కీకి క్యూ కడుతున్న పురుషులు : ఎందుకో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో అందానికి ప్రాధాన్యత పెరిగింది. వయసు పైబడినా కూడా 20 సమ్‌థింగ్ లాగా కనిపించడం సాధ్యమే. శరీరంలోని ఏ భాగాన్నైనా మన ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత ఇరవయ్యేళ్లుగా గ్లోబల్ బ్యూటీ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది.వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులను భయపెడుతున్న సమస్య బట్టతల. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు రాలుతూ ఉంటే బట్టతల వచ్చేస్తుందేమో అని టెన్షన్ వారిని స్థిమితంగా కూర్చోనీయదు దీనికి పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. మరోవిధంగా చెప్పాలంటే బట్టతల మీద కృత్రిమంగా జుట్టును మొలిపించుకోవడం. ఈ విషయంలో టర్కీ టాక్ ఆప్ ది వరల్డ్‌గా నిలుస్తోంది. టర్కీకే ఎందుకుహెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు భారీగానే ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల జుట్టు మార్పిడికి ప్రపంచ వ్యాప్తంగా టర్కీ ఒక ముఖ్యమైన డెస్టినేషన్‌గా మారిపోయింది. బట్టతలపై పుష్కలంగా జుట్టు రావాలన్నా, బట్టతల మచ్చలను కప్పిపుచ్చుకోవాలన్నా టర్కీకి క్యూ కడుతున్నారు పురుషులు.పెరుగుతున్న ప్రజాదరణఇండియా టుడే కథనం ప్రకారం "అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులైన సర్జన్లు, అధునాతన వైద్య సదుపాయాలు, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులతో సహా అనేక కారణాల వల్ల టర్కీ జుట్టు మార్పిడికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది" అని ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ విపుల్ నందా తెలిపారు.అంతేకాదు వసతి, రవాణాతో సహా మెడికల్ టూరిజం ప్యాకేజీలను కూడా అందజేస్తోందట టర్కీ ప్రభుత్వం. చికిత్స కోసం దేశాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే స్థానిక క్లినిక్‌లు అత్యాధునిక సాంకేతికతలు, సాంకేతికతలతో చక్కటి ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టర్కీలో బ్లాక్ మార్కెట్ కూడా విస్తరించిందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు విషయానికి వస్తే..క్లినిక్, సర్జన్ నైపుణ్యం లాంటి అంశాల ఆధారంగా జుట్టు మార్పిడికి అయ్యే ఖర్చు మారుతుంది. మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు 83 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేలు అవుతుంది. టర్కీలో, సగటున సుమారు రూ. 1,24,000 నుండి రూ. 2 లక్షల 90 వేల వరకు ఉంటుంది. ఇది పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ. -
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్‌లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్‌లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్‌లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్‌తో గుండు లుక్‌ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్‌లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్‌లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య బట్టతల. దీనికి అనేక కారణాలున్నాయి. తీసుకునే ఆహారం, నిద్ర, లైఫ్‌స్టైల్, జన్యపరమైన సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలడానికి కారణం కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ రోజూ ధరించడం వల్ల కూడా బట్టతల వస్తుందని చాలామంది అనుకుంటారు. మరి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? బట్టతల రాకుండా ఏం చేయాలి అన్నది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో తెలుసుకుందాం. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బైక్‌పై రయ్రయ్ మని తిరగాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. అయితే నిత్యం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇదే కారణంగా యువత హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. హెల్మెట్‌కి, బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి నుంచి జుట్టు పొడిపారకుండా ఉంటుంది. అయితే ఎక్కువసేపు ధరిస్తే మాత్రం తలలో వేడి పెరిగి దాని వల్ల జుట్టులో చెమటకి దారితీస్తుంది.నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అందుకే మంచి సౌకర్యవంతమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. బట్టతల రాకుండా ఏం చేయాలి? ►హెల్మెట్‌ను వాడిన తర్వాత గాలి తగిలే చోట ఉంచాలి. రెండు, మూడు రోజులకోసారి ఎండలో ఉంచాలి. ► హెల్మెట్ లోపల ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ► హెల్మెట్ తీసేటప్పుడు కొందరు చాలా ఫాస్ట్‌గా తీస్తుంటారు. అలా చేయరాదు. ► ఎందుకంటే అప్పటికే చాలాసేపటి వరకు హెల్మెట్ జుట్టుకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి హెల్మెట్ తీసేటప్పుడు మెల్లిగా తీయండి ► చండ్రు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వేరేవాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే మంచిది. ► హెల్మెట్ వాడటానికి ముందు లోపలిభాగంలో ఒక క్లాత్ ఉంచండి. దీనివల్ల జుట్టు దెబ్బతినదు. ► చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి ఆరకుండానే హెల్మెట్ ధరిస్తుంటారు. అలా అస్సలు చేయొద్దు. ► జుట్టు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే హెల్మెట్ ధరించాలి. లేకపోతే ఫంగల్, దురద సమస్యలు వస్తాయి. ► అంతేకాకుండా తడిజుట్టుపై హెల్మెట్ ధరిస్తే జుట్టు బలహీనంగా మారి త్వరగా ఊడిపోతుంది కూడా. ► వీటన్నింటితో పాటు తరచుగా నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ► మంచి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ►మానసిక ఒత్తిడితో బాధపడేవాళ్లలో జుట్టు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ సిస్టమ్ మీద ప్రభావితం చూపిస్తుంది. -
Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు
పీటల మీద ఆగిన పెళ్లిళ్లు ఎన్నో చూశాం. కట్నం తక్కువ ఇచ్చారని, వరుడు ఎక్కువ చదువుకోలేదని, లేదా ఏదైనా విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టాడని.. ఇలా రకరకాల కారణాలతో మండపంలోనే వివాహాలు రద్దైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బిహార్‌లో ఓ పెళ్లి అలాగే ఆగిపోయింది. వరుడికి ఇంతకుముందే పెళ్లైన విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. వరుడు మండపం వద్దకు రాగానే అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు.. అక్కడే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు అతనికి ఒరిజనల్ జుట్టు కాదని.. విగ్గు అని తేలింది. ఇంకేముంది కోపం కాస్తా కట్టలు తెంచుకు రావడంతో పీటల మీద పెళ్లాగింది. వరుడిని చితకబాదిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ తతాంగమంతా గయాలోని దోభీ ప్రాంతంలో జరిగింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్బాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఈ క్రమంలో ఇటీవల మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం వసరిగ్గా పెళ్లి రోజుధువు కుటుంబానికి తెలిసింది. ఇంతలో వరుడు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై మండపం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే కోపం మీదున్న వధువు కుటుంబ సభ్యులు, బంధువులు వరుడితో వాగ్వాదానికి దిగారు. వరుడు మాయమాటలతో, అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకోవాలని చూసినందుకు చెంపదెబ్బలు కొట్టారు. గొడవ పెరిగి పెద్దది కావడంతో వేదికపైనే వరుడిని చితకబాదారు. చెంపదెబ్బ కొట్టి అప్పుడే వరుడి విగ్గు ఊడి కింద పడటంతో అతడి బట్టతల బండారం బయడపడింది. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న వధువు కుటుంబీకులు మరింత రెచ్చిపోయారు.పెళ్లికొడుకు పలుమార్లు నచ్చజెప్పినప్పటికీ ప్రయత్నించినా వారు క్షమించకపోవడంతో గ్రామాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామపెద్దలు పంచాయతీ పెట్టి గొడవ సద్దుమణిగిన తర్వాత వరుడిని తిరిగి వెనక్కి పంపించేశారు. మరోవైపు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దోభీ, కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. गया में पोल खुलने पर गंजे दूल्हे की जमकर धुनाई, नकली बाल लगाकर दूसरी शादी रचाने पहुंचा था शख्स। डोभी थाना अंतर्गत बजौरा गांव का है मामला। वीडियो सोशल मीडिया पर वायरल।#Gaya #ViralVideo #Bihar #BiharPolice pic.twitter.com/rGgvlkah8z — Bihar Tak (@BiharTakChannel) July 11, 2023 -
పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అనడం ఏమోగానీ.. పచ్చని పెళ్లి పందిట్లోనే రద్దు అవుతున్నాయి. అయితే బలవంతంగా పెళ్లితో ఒక్కటై.. జీవితాంతం నరకం అనుభవించే బదులు.. ముందుగానే ఆపేయడం మేలని అనుకుంటున్నారు చాలామంది. అలాంటి ఘటనే ఇప్పుడు చెప్పుకోబోయేది. పెళ్లి వేడుకలో అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. కాసేపట్లో తన పెళ్లి అయిపోతుందని పెళ్లి కొడుకు సంబరపడిపోతున్నాడు. అయితే, అలసిపోయి పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయబోయాడు. అదే సమయంలో వరుడి విగ్గు ఊడిపోయింది. ఇంకేం.. పెళ్లి కూతురు సహా బంధువులు అంతా షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని తమకు ముందుగా ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిలదీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్పష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పెళ్లి వేడుక వద్దకు వచ్చారు. ఇరు కుటుంబాలను సముదాయించి, గొడవను ఆపారు. కానీ, పెళ్లిని మాత్రం జరపలేకపోయారు. చివరి నిమిషంలో పెళ్లి రద్దు కావడంతో వరుడు తీవ్ర నిరాశ చెందాడు. అంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ముందుగా తెలిసినా తమ అమ్మాయి సిద్ధమై ఉండేదేమోనని, ఇలా మోసం చేసి చేయడంతో ఆమెకు సహించడం లేదని బంధువులు చెప్తున్నారు. చదవండి: తాళి కట్టే సమయానికి కుప్పకూలిన వధువు.. భలే ట్విస్ట్ -
బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే!
లండన్: పనిచేసే చోట ఎవరినైనా బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది! టోనీ అనే వ్యక్తి కంపెనీలో సూపర్వైజర్తో వాదనకు దిగాడు. టోనీ బట్టతలను సూపర్వైజర్ ఎగతాళి చేశాడు. ఈ కేసులో భాగంగా, జుట్టు లేకపోవడంపై కామెంట్లు అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే లైంగిక వేధింపేనని తేల్చింది. చదవండి: జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు -
అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?
ఇటీవల ఆస్కార్ వేడుకలలో నటుడు విల్ స్మిత్ భార్య జాడా స్మిత్ పై వేసిన జోక్ ఎదురు తిరిగింది. స్త్రీలకు వచ్చే అరుదైన సమస్య బట్టతల. జాడా స్మిత్ ఆ సమస్యతో బాధ పడుతోంది. ఇండియాలో కూడా ఈ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్థితిని స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న వారు ఉన్నారు. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల పరోతిమ గుప్తా తమ జీవితం ఎదుటి వాళ్లకు జోక్ కాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఆమె కథ. ఆడుతూ పాడుతూ ఉండే పదేళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచే సరికి దిండంతా ఆ అమ్మాయి జుట్టుతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? పరోతిమ గుప్తాకు అలా జరిగింది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. డార్జిలింగ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. వాళ్ల నాన్న, అమ్మలది కోల్కటా. నాన్న టీ ప్లాంటేషన్లలో పని చేసేవాడు కాబట్టి ఒక్కోసారి ఒక్కోచోట ఉండాలి కాబట్టి పరోతిమను, ఆమె చెల్లెల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచి చదివించేవారు. పరోతిమ క్లాసులు బాగా చదివేది. డిబేట్లు గెలిచేది. స్టేజ్ మీద భయం లేకుండా ఉండేది. అలాంటిది ఒక ఉదయం ఇలా జరిగే సరికి బెంబేలెత్తిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు. డాక్టర్ల దగ్గరకు తిరిగారు. ‘ఇలా టైఫాయిడ్ వల్ల జరుగుతుంది’ అన్నాడో డాక్టరు. కాని అప్పటికి పరోతిమకు టైఫాయిడ్ రాలేదు. మరేంటి? చివరకు సిలిగురిలో ఒక డాక్టరు దీనిని ‘అలోపేసియా అరెటా’ (పేనుకొరుకుడు/ఆటోఇమ్యూన్ డిసీజ్) అని కనిపెట్టి వైద్యం మొదలెట్టాడు. అలా పదేళ్ల వయసు నుంచి పరోతిమ జీవితంలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది. మందే లేని జబ్బు అలోపేసియా వల్ల హఠాత్తుగా జుట్టు రాలిపోతుంది. ఇది తల మీద కొన్ని ప్రాంతాల్లో జరగొచ్చు. పూర్తిగా కూడా జరగొచ్చు. కొన్నిసార్లు కొన్నాళ్ల తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. కొందరికి రాదు. ‘పదేళ్ల వయసు నాకు. ఏమీ అర్థం కాలేదు. డాక్టరు ఎన్నో మందులు రాశాడు. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు పొడిచాడు. కొందరేమో ఆయుర్వేద తైలాలు అని, హోమియోపతి మందులు అని. ఎప్పుడూ నా తల మీద అల్లం, వెల్లుల్లి గుజ్జు రాసి ఉండేవారు. ఇంకేవో కంపు కొట్టే నూనెలు. ఎప్పుడూ వాసన కొడుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు స్కూలుకు వెళ్లాను. అది ఇంకా ఘోరమైన అనుభవం. పిల్లలు నన్ను వెక్కిరించేవారు. కొందరు నాకొచ్చింది అంటువ్యాధి ఏమోనని దగ్గరకు వచ్చేవారు కాదు. స్టేజ్ ఎక్కి నేను ఏదైనా మాట్లాడాలంటే వెళ్లలేకపోయేదాన్ని. మగపిల్లలు నాతో అసలు మాట్లాడేవాళ్లు కాదు. ఇంట్లో బాత్రూమ్లో దూరి గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్, టీచర్లు నాకు గట్టి ధైర్యం చెప్పారు. వాళ్ల వల్ల నిలబడ్డాను’ అంటుంది పరోతిమ. ఇంటర్లో వెలుగు అయితే పరోతిమ ఇంటర్‌కు వచ్చేసరికి జుట్టు మళ్లీ రావడం మొదలెట్టింది. లోపల ఒకటి రెండు పాచెస్ ఉన్నా కొంచెం కవర్ చేసుకునే విధంగా ఉండేది. పరోతిమ కోల్కటాలో డిగ్రీ, పి.జి. చేసింది అక్కడే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ వైద్యం కఠినతరంగా ఉండేది. ఇంజెక్షన్లు ఉండేవి. వాటన్నింటిని ఆమె భరించింది. ఇప్పుడు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా మారింది. కొత్త ఉద్యోగం. స్ట్రెస్. 2007లో మళ్లీ పూర్తిగా జుట్టు రాలడం మొదలయ్యింది. ‘ఇక ఈ హింస చాలు. నాకు జట్టు లేదు... రాదు అనే స్థితిని నేను స్వీకరించి మిగిలిన జీవితం సాధారణం గా గడపడానికి నిశ్చయించుకున్నాను’ అంటుంది పరోతిమ. ‘నేను నా చెల్లెల్ని తోడు పిలిచాను. పద నేను గుండు గీయించుకోవాలి అన్నాను. శిరోజాలు లేని నా ముఖాన్ని చూసి తట్టుకోవడానికే నా చెల్లెల్ని తోడు చేసుకున్నాను. కాని శిరోముండనం అయ్యాక నాకు హాయిగా అనిపించింది. ఇక మీదట ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను.’ అందామె. అయితే ఈ ఆకారాన్ని చూసి సానుభూతి, అనవసర ప్రశ్నలు రాకుండా ఉండేందుకు తాను పని చేసే చోటులో అందరికీ ఈమెయిల్ ద్వారా తన అరుదైన జబ్బు గురించి తెలిపి ఆ చర్చను ముగించింది. ‘ఇప్ప టికీ కొందరు వింతగా చూస్తారు. గాంధీలా ఉన్నావ్ అంటారు. ఇలా ఉన్నా నీ లుక్స్ బాగున్నాయి అంటారు. కొందరు నీ తల తాకి చూడమంటావా అంటారు. అందరికీ తగిన సమాధానం చెప్పి ముందుకు పోతుంటాను’ అంటుంది పరోతిమ. ఆస్కార్ అవార్డ్స్‌లో జాడా స్మిత్ మీద జోక్ వేయడాన్ని ఆమె తప్పు పట్టింది. ‘మా జీవితం ఏ మాత్రం జోక్ కాదు’ అంది. ఎదుటి వాళ్ల వెలితిని హాస్యం చేయకూడని సంస్కారం అందరం అలవర్చుకోవాలి. -
బట్టతల శాపం కాదు అదృష్టం! ఈ ఉత్సవం మీకోసమే..
న్యూయార్క్: నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతుంటే బాధపడుతుంటాం. నాలుగు వెంట్రుకలు పోతుంటే బట్టతల వస్తుందని భయాందోళన చెందుతుంటారు. ఇక చివరకు తలపై వెంట్రుకలన్నీ ఊడి ముందు భాగమంతా గుండుగా కనిపిస్తుంటే జనాల్లో వెళ్లేందుకు జంకుతుంటారు. బట్టతల అనేది ఓ వ్యాధి కాదు. వాతావరణం ప్రభావం.. నీటి కాలుష్యం.. ప్రోటీన్స్ లోపం వంటి వాటితో బట్టతల వస్తుంది. ఇక అవివాహితులకు బట్టతల వస్తే ఇక తమకు పెళ్లి కాదని తెగ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారందరిలో మార్పు కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తున్నారు. బట్టతల శాపం కాదు.. అదృష్టం అని చాటిచెప్పేలా అమెరికాలోని న్యూయార్క్‌లో అతి పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవానికి కేవలం బట్టతల ఉంటే చాలు. ఆ వివరాలు తెలుసుకోండి. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్ బట్టతల ఉన్న వారందరి కోసం అమెరికా రాపర్ రమి ఈవెన్ ఎష్ ‘బట్టతల ఉత్సవం’ న్యూయార్క్‌లో నిర్వహించడం మొదలుపెట్టాడు. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవాళ్లంతా ఈ ఉత్సవానికి అర్హులు. బ్రూక్లిన్‌లోని రుబులాడ్ క్లబ్లో జరిగే వేడుకకు 18 డాలర్లు చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. బట్టతల లేకుంటే ఉత్సవానికి అనుమతించరు. ఫ్యాషన్ వీక్ ఫెస్ట్‌కు పోటీగా బట్టతల ఫెస్ట్‌ను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవంలో బట్టతలతో బాధపడొద్దని చెబుతారు. బట్టతల ఉన్నా దర్జాగా బతకవచ్చని అవగాహన కల్పిస్తారు. పైగా బట్టతలను ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో వివరిస్తారు. అనంతరం అందరూ ఫ్యాషన్ షో చేస్తారు. అమెరికాలో 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మహిళలు బట్టతల బాధపడుతున్నట్లు ఆ దేశ ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది. చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి -
బట్టతలను అడ్డుకుందామిలా...!
పురుషులకు మాత్రమే బట్టతల సమస్య ఉంటుందని భావిస్తాం కానీ, చాలామంది మహిళల్లో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. నల్ల జుట్టు తెల్లబడడం ఎంత బాధపెడుతుందో, కళ్లముందే జుట్టరాలి బట్టతల రావడం అంతకన్నా ఎక్కువగా బాధిస్తుంది. ముఖ్యంగా యుక్తవయసులో బట్టతల రావడం మానసికంగా కుంగదీస్తుంది. అసలు మనిషిలో బట్టతల ఎందుకు వస్తుంది? మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా బట్టతల వచ్చేందుకు కారణమని సైన్సు చెబుతోంది. జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం కూడా బట్టతల విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర పలు సమయాల్లో వచ్చే హార్మోనల్ మార్పులు బట్టతలను ప్రేరేపిస్తాయి. పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ గుండెవ్యాధులు, బీపీ, షుగర్, గౌట్, ఆర్థరైటిస్ తదితరాలకు వాడే మందులు బట్టతలకు కారణమవుతుంటాయి. బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం, కానీ దాన్ని జాప్యం చేయవచ్చని నూతన పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుసంబంధిత కారణాలు, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా, చాలా సంవత్సరాలు అడ్డుకోవచ్చన్నది సైంటిస్టుల మాట. సాధారణంగా జుట్టు రాలిపోవడమనేది పురుషుల్లో, స్త్రీలల్లో ఒక ప్రత్యేక ఆకారంలో ఆరంభమవుతుంది. దీన్ని ఎంపీబీ (మేల్ పాట్రన్ బాల్డ్నెస్) లేదా ఎఫ్‌పీబీ (ఫిమేల్ పాట్రన్ బాల్డ్నెస్) అంటారు. ఎంపీబీ ఉన్నవారిలో 20–30 ఏళ్లు వచ్చేసరికి నెత్తిపై ఎం అక్షరం ఆకారంలో జుట్టు రాలడం ఆరంభమై బట్టతల స్టార్టవుతుంది. 80 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు ప్రతిఒక్క మగవారిలో ఎంపీబీ కనిపిస్తుంది. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఎఫ్‌పీబీ కనిపిస్తుంటుంది. పైన చెప్పిన ఆండ్రోజెనిటిక్ అలపీనియా వల్లనే ఈ ఎంపీబీ, ఎఫ్పీబీలు సంభవిస్తాయి. అలాగే ఇతర కారణాలు దీన్ని వేగవంతం చేస్తాయి. మగవారిలో బట్టతల తల్లితరఫు తాతను బట్టి వస్తుందని ఒక పుకారు ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పురుషుల్లోని ఎక్స్, వై క్రోమోజోముల్లో ఎక్స్ క్రోమోజోము తల్లి నుంచి వస్తుంది. బట్టతల జన్యువులు ఈ ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉంటాయి కాబట్టి తల్లి తరపు తాత నుంచి బట్టతల వస్తుందని భావించారు. అయితే బట్టతలకు కారణమయ్యే జన్యువులు దాదాపు 63కాగా, వీటిలో కేవలం కొన్ని మాత్రమే ఎక్స్ క్రోమోజోములో ఉన్నట్లు 2017లో పరిశోధన తేల్చింది. అందువల్ల అటు తండ్రి ఇటు తల్లి తరఫు ఎవరికి బట్టతల ఉన్నా, అది వారసత్వంగా సంక్రమించే అవకాశముంది. బ్రేకులు వేయడం ఎలా? ►పైన చెప్పినట్లు జెనిటికల్ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే బట్టతలను ►పూర్తిగా ఆపలేకపోయినా, దాని ప్రక్రియను మందగింపజేయవచ్చని ►పరిశోధకులు చెబుతున్నారు. మరి ఆ మార్గాలేంటో చూద్దాం... ►ప్రతి సమస్యకు ఎవరైనా ముందు చెప్పే పరిష్కారం ఒక్కటే.. ఆరోగ్యవంతమైన జీవన శైలి. అంటే బాలెన్స్ డైట్ అది కూడా ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, రోజువారీ జీవనంలో ఒత్తిడిని తగ్గించుకోవడంతో బట్టతలతో పాటే పలు జీవన సంబంధిత సమస్యలను అడ్డుకోవచ్చు. ►మైల్డ్ షాంపూను తరచూ వాడడం, బయోటిన్ ఉన్న మసాజ్ ఆయిల్స్‌తో తలపై మసాజ్ చేయడం ద్వారా హెయిర్‌లాస్‌ను మందగింపజేయవచ్చు. అలాగే స్కాల్ప్‌కు వాడే సీరమ్స్‌లో విటమిన్ ఏ, ఈ ఉండేలా చూసుకోవాలి. ఈ రెండూ జుట్టు రాలడం అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ►చాలామంది తడిజుట్టును చిక్కుతీయడానికి బలప్రయోగాలు చేస్తుంటారు. జుట్టు తడిసినప్పుడు బలహీనదశలో ఉంటుందని, ఈ సమయంలో దీన్ని బలంగా గుంజడం వల్ల కుదుళ్లు చెడిపోయి హెయిర్‌లాస్ తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిక్కుతీయాలంటే బ్రష్షులు, దువ్వెనల బదులు చేతివేళ్లను వాడడం ఉత్తమం. ►వెల్లుల్లి, ఉల్లి, అల్లం రసాలు జీర్ణకోశానికి మంచివని చాలామంది భావిస్తారు. కానీ ఇవి జుట్టుకు కూడా ఎంతో మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని రాత్రి నిద్రపోయే ముందు నెత్తికి పట్టించి పొద్దునే కడిగేయడం ద్వారా వారంరోజుల్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. గ్రీ¯Œ టీ బ్యాగ్స్‌ను నీళ్లలో వేసి గంట ఉంచిన తర్వాత ఆ నీటిని నెత్తికి రాయడం కూడా సత్ఫలితాన్నిస్తుంది. ►నెత్తిపై రాసే మైనోక్సిడిల్ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్ లాంటి మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. ►నెత్తిపై రాసే మైనోక్సిడిల్ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్ లాంటి మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. ►కొంతమంది నిపుణులు నెత్తిమీద జుట్టు సాంద్రత పెంచుకోవడానికి లేజర్ థెరపీని సూచిస్తున్నారు. దీంతోపాటు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లను వాడడం ద్వారా తలపై జట్టు పెరుగుదలను ప్రేరేపించవచ్చు. అయితే ఈ విధానాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిఉంది. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం, జుట్టుకు సంబంధించి సరైన కేర్ తీసుకోవడం, చుండ్రులాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడడంవంటివి పాటించడంతో బట్టతల రాకను వాయిదా వేయవచ్చు. – డి. శాయి ప్రమోద్ -
షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఈ వీడియో బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేశ్‌కి శ్రీనివాస్‌కి మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి గెంటేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్.. శ్రీనివాస్ ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్ ఫేస్ చూపించి షాకిచ్చాడు. సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్‌కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేశ్ బహిర్గతం చేసే వరకు ఎవరికీ తెలియదు. వీడియోలో మహేశ్ ఏమన్నారంటే.. ‘అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’ అంటూ ఫోటో షూట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేశాడు. క్యాప్ తీయడంతో శ్రీనివాస్ బట్టతల బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్.. మహేశ్‌ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా ప్రమోషన్ కోసమే చేసి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్‌కు పోటీగా! చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి -
బట్టతల దాచి పెళ్లి: భర్తకు షాకిచ్చిన భార్య!
పెళ్లికి ముందు అందరూ ఎదో ఒక తప్పు పని చేసే ఉంటారు. వేరే వ్యక్తిని ప్రేమించి ఉండటం, చెడు అలవాట్లకు దగ్గరవడం. అయితే పెళ్లి సమయం వచ్చేసరికి కాబోయే భార్య, భర్త దగ్గర ఇలాంటి విషయాలను దాచిపెట్టేస్తుంటాం. కానీ వివాహం అనంతరం ఎదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అచ్చం ఇలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పబోయే మహిళకు కేవలం అబద్దం చెప్పాడనే సంగతి తెలిసింది. ఇంకేముంది అది పెద్దదా చిన్నదా అనే విషయాన్ని పక్కనపెట్టి రచ్చకెక్కింది. పెండ్లికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నదన్న విషయం దాచినందుకు ఏకంగా అతనికి విడాకులిచ్చేందుకు సిద్ధమమైంది సదరు భార్య. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2020 జనవరిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే సరిగ్గా ఏడాడికి అతడికి బట్టతల ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో పెళ్లి సమయంలో జుట్టు ఒత్తుగానే ఉంది కదా. ఇప్పుడిలా జుట్టు ఊడిపోయిందేంటని భార్తను ప్రశ్నించింది. దీంతో అతడు తనకు ముందు నుంచే బట్టతల ఉందని అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లిలో విగ్గు పెట్టుకుని కవర్ చేశానని చెప్పాడు. ఇది విన్న మహిళకు చిరాకెత్తింది. భర్త తనను మోసం చేశాడని అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఈ విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ ముందు అవమానానికి గురయ్యానని, కాబట్టి తనకు విడాకులు కావాల్సిందేనని కోరింది. అయితే, ఆమెకు నచ్చజెప్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. కౌన్సెలింగ్ జరుగుతోంది. మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడుత కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..! ‘విగ్గు’ మొగుడు నాకొద్దు -
‘విగ్గు’ మొగుడు నాకొద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన క్రాఫ్‌తో హీరోలా ఉన్నాడని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు కాపురం చేసిన తరువాత అది విగ్ అని, భర్తది బట్టతల అని తెలుసుకుని అవాక్కైంది. తనకు అన్యాయం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విడ్డూరం చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు 27 ఏళ్ల యువతితో 2015లో వివాహమైంది. రాజశేఖర్‌కు బట్టతల కావడంతో విగ్ ధరించి పెళ్లి చూపులకు, వివాహానికి హాజరయ్యాడు. మేలైన సహజ వెంట్రుకలతో తయారుచేసిన విగ్ కావడంతో వధువు, ఆమె తరఫు బంధువులు గమనించలేదు. ఇటీవల తలపై విగ్ లేని సమయంలో భార్య గమనించి బిత్తరపోయింది. దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు చేయాలని డిమాండ్ చేయగా ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త దాడి చేశారు. విగ్ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం బాధితురాలు చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్ వివాహ వేదికలోని వివరాలు చూసి మోసపోయానని ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యను ఇంట్లోంచి నెట్టి.. బయటకు వచ్చేలోపు.. విద్యార్థులకు బంపరాఫర్.. 2జీబీ డేటా ఫ్రీ -
బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..!
మామూలుగానేమనలో చాలామందికి జుట్టుఎక్కువగా రాలిపోతుంటుంది. ఇంకొంతమందిలో అయితే జుట్టు చాలా ఎక్కువగా రాలుతూ తమకు బట్టతల వస్తుందేమోఅన్న బెంగ కలిగిస్తుంటుంది. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలూ, వివరాలూ ఇవి... జెండర్ ప్రకారం చూస్తే బట్టతలలో రెండు రకాలుంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను వైద్యపరిభాషలో ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. బట్టతల... కారణాలు గతకొద్దికాలం వరకూ పురుషుల్లో బట్టతల రావడానికి కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్లనే అనే అపోహ ఉండేది. మగపిల్లల్లో యుక్తవయసు రాగానే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించడం మొదలవుతుందనీ... ఈ టెస్టోస్టెరాన్ కారణంగా యువ దశ మొదలుకొని క్రమంగా వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో హెయిర్‌లైన్ కొద్దికొద్దిగా వెనక్కు పోతూ ఉండేదన్న అభిప్రాయం ఉండేది. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషులు... మహిళల్లో తేడాలిలా... ఇక పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. అదే మహిళల్లోనైతే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే కండిషన్ ఉంటుంది. ఇందులో తలపై ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతల... నిర్ధారణ పరీక్షలివి... బట్టతలను నిర్ధారణ చేయడానికి డెర్మోస్కోపీ లేదా ట్రైకోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. చికిత్స ప్రక్రియలు... బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలు కూడా ఉపకరిస్తాయి. -
బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..
ముంబై : బట్టతల ఉందన్న సంగతి దాచిపెట్టి, భర్త తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందో భార్య. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మీరా రోడ్‌కు చెందిన 29 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్‌కు గత నెలలో పెళ్లయింది. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత సదరు అకౌంటెంట్‌కు బట్టతల ఉందని అతడి భార్య గుర్తించింది. దీంతో తను మోసపోయానని భావించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. ( స్నేహితుని భార్యపై లైంగిక దాడి..) పెళ్లికి ముందు భర్త బట్టతల గురించి తనకు చెప్పలేదని, విగ్గు పెట్టుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని, భర్త లేనిపోని అనుమానాలతో తన ఫోన్‌ను హ్యాక్ చేసి కాల్ రికార్డులు, చాటింగ్ విషయాలు చెక్ చేస్తున్నాడని తెలిపింది. సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. -
ప్రియురాలి కోసం గుండు చేసుకున్నాడు
-
ప్రియురాలి కోసం గుండు చేసుకున్నాడు
నిజమైన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. మనం చేసే పనుల ద్వారా అవతలి వారి పట్ల ఎంత ప్రేమ ఉందో చూపిస్తాం. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రియురాలికి మద్దతుగా ఓ యువకుడు గుండు గీసుకుని ఆమె మీద ఉన్న ప్రేమను వెల్లడించాడు. ఇది చూసిన నెటిజనులు సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మాన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఓ యువతి అలోపేసియా(పేనుకొరుకుడు) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. రోగ నిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్ల మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫలితంగా ప్యాచెస్ ప్యాచెస్‌గా జుట్టు రాలిపోతుంది. ప్రాంరంభంలో చిన్నగా ఉన్న ఇది రానురాను పెద్దగా మారుతుంది. (భార్యపై అనుమానం.. గ్రామస్తులతో కలిసి) ఈ క్రమంలో సదరు యువతి కూడా ఈ వ్యాధితో బాధపడుతుంది. దాంతో ఆమె ప్రేమికుడు ట్రిమ్మర్‌తో యువతికి గుండు చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న జుట్టును కోల్పోవాల్సి రావడంతో యువతి ఎంతో ఆవేదనకు గురవుతుంది. ఆమెకు గుండు చేయడం పూర్తయిన తర్వాత ఆకస్మాత్తుగా తనకు గుండు చేసుకోవడం ప్రారంభిస్తాడు సదరు యువకుడు. ఇది చూసి ఆమె షాక్ అవుతుంది. ఏడుస్తుంది. జుట్టు కోల్పోయి బాధపడుతున్న ప్రియురాలకి మద్దతు తెలపడం కోసం సదరు యువకుడు ఇలా తనకు తానే గుండు చేసుకున్నాడు. మానవత్వం మిగిలి ఉందనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ రెక్స్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నెటిజన్లు సదరు యువకుడిని తెగ ప్రశంసిస్తున్నారు. -
స్త్రీల కంటే మగవారికే కరోనా ముప్పు!
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ వీరికి సోకుంది వారికి సోకదు అనేది మనం చెప్పలేం. పిల్లల నుంచి పండు ముదసలి వరకు కరోనా సోకిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బట్టతల ఉన్న మగవారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్లోస్. కరోనాతో మరణించిన వారిపై బ్రౌన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ కార్లోస్ పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో చనిపోయిన వారి డేటాను పరిశీలించగా కరోనా మరణాలు బట్టతల ఎక్కువగా ఉన్న వారివేనని తేలింది. బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందనే అంశంపై ప్రొఫెసర్ కార్లోస్ మాట్లాడుతూ, బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో హార్మోన్ల ప్రభావమేనని తెలిపారు. లైఫ్ స్టైల్, స్మోకింగ్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, శృంగార సమస్యల వల్ల మగవారిలో టెస్టో స్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉందని, ఆ హార్మోనే కరోనా వైరస్, కణాలతో పోరాడే శక్తిని ఇస్తుందని తెలిపారు. మరోవైపు కార్లోస్ బృందం స్పెయిన్ దేశంలో జరిపిన పరిశోధనల్లో కూడా బట్టతల ఉన్నవారికే ఎక్కువగా కరోనా సోకినట్లు తెలింది. (పాక్‌లో లక్షకు చేరువలో కరోనా కేసులు) ఇదిలా ఉండగా స్త్రీల కంటే మగవారే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి అసలు కారణం ఏంటంటే... 1. కరోనా వైరస్ మన శరీరంలో వ్యాపించడానికి ఎసీఈ2 అనే హార్మోన్ అవసరం. అయితే ఈ ప్రోటీన్ మగవారిలో ఎక్కువగా ఉంటుందని, అందుకే వారి శరీరంలో ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇక మగవారితో పోలిస్తే ఎసీఈ2 ప్రొటీన్ ఆడవారిలో తక్కువ ఉంటుంది. 2. కరోనా మగవారికే ఎక్కువగా సోకడానికి కారణం సిగరెట్లు తాగే అలవాటు ఉండటం. ఆడవారితో పోలిస్తే సిగరెట్లు తాగే అలవాటు మగవారిలో ఎక్కువగా ఉంటుంది. సిగరెట్లు పొగ ఊపిరితిత్తులలో ఏసీఈ2ను ఎక్కువగా చేస్తోంది. 3. మగవారి క్రోమోజోమ్లలలో ఎక్స్ కారకం ఒకటే ఉంటుంది. ఈ క్రోమోజోమ్ కణాలలో కరోనాను ఎదుర్కొనే రోగనిరోథకత ఉంటుంది. ఆడవారిలో రెండు ఎక్స్ కారకాలు ఉండటం వలన వారికి రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. 4. ఇక మగవారికే కరోనా ఎక్కువగా సోకడానికి కారణం వారిలో పరిశుభ్రత తక్కువగా ఉండటమే కరోనా వ్యాపించకుండా ఉండటానికి చేతులను కడుక్కోవడం, శానిటైజర్లను వాడటం, పరిశుభ్రతను పాటించడం అత్యవసరం. ఇవన్నీ పాటించడంలో మగవారు వెనుకబడి ఉండటం కూడా వారిలో కరోనా వ్యాప్తికి కారణం. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) -
బట్టతలకు మూలకారణం తెలిసింది
ప్రతీరోజూ మనం సుమారు 50 నుంచి 100 వెంట్రుకలను కోల్పోతూ ఉంటాము. తిరిగి అదే స్థాయిలో వెంట్రుకలు పెరగడం షరా మామూలే. మానవ శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియ ఇది. అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు ఊడిపోయాక తిరిగి రాకపోతే క్రమంగా అది బట్టతలకు దారితీస్తుంది. దీని బారిన పడకుండా ఉండడానికి పలు రకాల ఖరీదైన షాంపూలు, హెయిర్ క్రీములు వాడుతూ ఉంటారు. అయితే జుట్టు రాలడం అనే సమస్య కేవలం వాడే షాంపూల మీదనే కాక తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడానికి ఐరన్ లోపం ప్రధాన కారణమని, మాంసాహారం తినకపోవడం వల్ల తగినంత ఐరన్ శరీరానికి అందడం లేదని పరిశోధనలో తేలింది. శాకాహారంలో కూడా ఐరన్ ఉన్నప్పటికీ శరీరానికి కావలసిన స్థాయిలో లేదని తెలిపారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజీకి చెందిన లియోనిడ్ బెంజమిన్ ట్రోస్ట్ 40 సంవత్సరాల నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించిన తర్వాతే జుట్టు రాలే సమస్యకు చికిత్స ప్రారంభించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలం’ అన్నారు. అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాములు, పురుషులకు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. ఈ శాతం కంటే తక్కువ తీసుకుంటే జుట్టు రాలడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఐరన్ ప్రధానంగా హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని రెండు రకాలుగా ఉంటుందని.. ఆ రెండు రూపాలూ శరీరానికి అవసరమని తమ పరిశోధనలో వెల్లడైందని ట్రోస్ట్ తెలిపారు. శాకాహారంలో కేవలం నాన్ హీమ్ ఐరన్ మాత్రమే ఉంటుందని, హీమ్ ఐరన్ చాలా కొద్ది మొత్తంలో ఉంటుందని తెలిపారు. శాకాహారం స్వీకరించేవారు పుల్లటి పళ్లతో కలిపి తీసుకుంటే ఐరన్ శరీరానికి వంటబడుతుందని అన్నారు. ఐరన్ కోసం టాబ్లెట్స్ వాడాల్సి వస్తే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు. -
పుకార్లపై స్పందించిన అక్షయ్ కుమార్
సాక్షి, సినిమా : పాడ్‌మన్ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లుక్కు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బట్టతల అవతారంలోనే ఈ స్టార్ హీరో కనిపిస్తున్నాడు. దీంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కృత్రిమ జుట్టు కోసం చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని.. అందులో ఇలా బట్టతలతోనే కొనసాగాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడని... కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం వెలువరించింది. అయితే అదంతా రూమర్ అని అక్కీ ఖండించాడు. తాజాగా ఓ టీవీషోలో ఆయన మాట్లాడుతూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ‘‘కేసరి చ్రితంలో పాత్ర కోసం తలపై పెద్ద పాగా ధరించాల్సిన అవసరం ఉంది. అది ఇబ్బందికరంగా ఉండటంతోనే ఇలాంటి హెయిర్ స్టైల్ కొనసాగిస్తున్నా.. అంతేతప్ప వేరే కారణం ఏదీ లేదు’’ అని అక్షయ్ స్పష్టత ఇచ్చేశాడు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 హోలీకి కేసరి విడుదల కానుంది. -
తెల్లజుట్టు, బట్టతలకు కారణమేంటో తెలిసింది!
న్యూయార్క్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం, బట్టతల రావడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే ఈ రెండు సమస్యలకు కారణమేంటో శాస్త్రవేత్తలు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్20 అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదల కారకంగా పనిచేస్తే, మూల కణకారకం (ఎస్సీఎఫ్) జుట్టుకి మంచి రంగును ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ఇవి రెండూ ఉంటేనే జుట్టు మంచి రంగుతో, ఒత్తుగా పెరుగుతుంది. దీనిని నిర్ధారించుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు. మొదట వారు కేఆర్‌ఓఎక్స్20 ప్రోటీన్‌ను ఓ చిట్టెలుక కణాలనుంచి తొలగించారు. వెంటనే దాని జుట్టుపెరుగుదల ఆగిపోయింది. తరువాత వారు మూలకణ కారకాన్ని తొలగించడంతో చిట్టెలుక జుట్టు రంగు తెల్లగా మారింది. దీన్ని బట్టి ఈ రెండు కారకాలపైనే జుట్టుపెరుగుదల, రంగు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. -
బట్టతల గుట్టుపై ముందడుగు
లండన్: పురుషుల్లో బట్టతల వచ్చేందుకు అవకాశమున్న 200కు పైగా జన్యుపరమైన అంశాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల జుట్టు రాలే సమస్యను ముందుగానే అంచనా వేయొచ్చన్నారు. బ్రిటన్‌లోని యూని వర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధనలు చేసింది. దీనికోసం యూకే బయోబ్యాంక్ నుంచి సుమారు 52 వేల మంది పురుషులకు సంబంధించిన జన్యుపరమైన, ఆరోగ్య పరమైన సమాచారాన్ని సేకరించారు. వీరిలో జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉన్న వారిలో 287 జన్యువులు ఒకేలా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక ఫార్ములాను రూపొందించిన శాస్త్రవేత్తలు ఈ జన్యువులు ఉన్నప్పుడు లేదా లేనప్పుడు ఒక వ్యక్తికి బట్టతల వచ్చే అవకాశాలపై అధ్యయనం చేశారు. -
కీళ్ల వ్యాధి మందుతో బట్టతలపై జుట్టు
వాషింగ్టన్: ఒక వ్యాధి మందుతో మరొక ప్రయోజనం కూడా ఉంటే.. ఆ మందు అమృతమే కదా! అమెరికాలో అలాంటి ప్రయోగమే చేసిన శాస్త్రజ్ఞులు విజయవంతంగా బట్టతలపై జుట్టు మొలిపించారు. వైద్యానికి అందని జబ్బుతో బాధపడుతూ వంటిపై వెంట్రుకలన్నీ కోల్పోయిన 25 ఏళ్ల యువకుడికి.. కీళ్లవ్యాధి (ఆర్థరైటిస్)కి వాడే మందుతో జుట్టు పెరిగేలా చేశారు. ప్రస్తుతం అలోపేసియా యునివర్సిలిస్ (జుట్టు రాలిపోవడం) వ్యాధికి శాశ్వతంగా కానీ, దీర్ఘకాలంలో కానీ నివారణకు మందులు లేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలాంటి వ్యాధిగ్రస్థుడికి మొట్టమొదటగా వెంట్రుకలు తిరిగి వచ్చిన ఘటన ఇదేనని వారు తెలిపారు. తాము ట్రీట్మెంట్ చేసిన యువకుడికి అలోపేసియాతో పాటు సొరియాసిస్ వ్యాధి కూడా ఉందని, సొరియాసిస్‌కు వైద్యం కోసం తమ వర్సిటీకి వచ్చాడని యలే వర్సిటీ మెడిసిన్ స్కూల్లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రెట్ కింగ్ చెప్పారు. కీళ్లవ్యాధికి వాడే టోఫాసిటినిబ్ సిట్రేట్ అనే మందుతో సొరియాసిస్‌కు వైద్యం ప్రారంభించామని, అలోపేసియాకు కూడా అదే మందు మోతాదులో మార్పులు చేసి వినియోగించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రెండు నెలల పాటు ఆ మందును 10 మిల్లీ గ్రాముల చొప్పున ఇవ్వగా జుట్టు పెరుగుదల కనబడిందని, తర్వాత మూడు నెలల పాటు 15 మిల్లీగ్రాముల ఇవ్వగా పూర్తి స్థాయిలో జుట్టు మొలకెత్తిందని చెప్పారు. -
‘పట్ట’లేని ఆనందం..
బట్ట తల వచ్చేస్తుందని దిగులు చెం దేవారు.. జపాన్‌లోని అకాసకా డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘ఒటాసుకే’ రెస్టారెంట్‌కు వెళ్తే.. ‘పట్ట’లేని ఆనందం వారి సొంతమవుతుంది. ఎందుకంటే.. ఈ పబ్ కమ్ రెస్టారెంట్లో పట్ట బుర్ర ఉన్నవారికి బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు. ఎంత ఎక్కువ మంది గ్రూప్‌గా వస్తే.. డిస్కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు.. ఈ రెస్టారెంట్లో ‘‘బట్ట తలను చూసి గర్విం చండి’’ అని రాసి కూడా ఉంటుంది. ఈ నెల్లోనే ప్రారంభమైన ‘ఒటాసుకే’ అప్పు డే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పని ఒత్తిడితో జుట్టు రాలిపోతూ.. బట్ట తల వచ్చేవారి సంఖ్య జపాన్‌లో పెరిగిపోతోందట. కుటుంబం కోసం విపరీతంగా శ్రమిస్తూ.. ఒత్తిడితో బట్ట తల తెచ్చేసుకుంటున్న ఇలాంటివారి కోసం.. వారికి మద్దతుగా ఈ రెస్టారెంట్ యజమాని యోషికా ఈ వినూత్న డిస్కౌంట్ పథకం పెట్టారట. అంతేకాదు.. ఈ రెస్టారెంట్ లాభాల్లో కొంత మొత్తాన్ని సునామీ పీడిత ప్రాంతాల పున ర్ నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.