Viral Video: Bald Groom Beaten Up For Trying To Marry With Fake Hair In Bihar - Sakshi
Sakshi News home page

Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు

Published Wed, Jul 12 2023 12:38 PM | Last Updated on Wed, Jul 12 2023 2:27 PM

Video: Bald Groom Beaten Up For Trying To Marry With Fake Hair Bihar - Sakshi

పీటల మీద ఆగిన పెళ్లిళ్లు ఎన్నో చూశాం. కట్నం తక్కువ ఇచ్చారని, వరుడు ఎక్కువ చదువుకోలేదని, లేదా ఏదైనా విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టాడని.. ఇలా రకరకాల కారణాలతో మండపంలోనే వివాహాలు రద్దైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బిహార్‌లో ఓ పెళ్లి అలాగే ఆగిపోయింది. వరుడికి ఇంతకుముందే పెళ్లైన విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు.

వరుడు మండపం వద్దకు రాగానే అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు.. అక్కడే మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అసలు అతనికి ఒరిజనల్‌ జుట్టు కాదని.. విగ్గు అని తేలింది. ఇంకేముంది కోపం కాస్తా కట్టలు తెంచుకు రావడంతో పీటల మీద పెళ్లాగింది. వరుడిని చితకబాదిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  ఈ తతాంగమంతా గయాలోని దోభీ ప్రాంతంలో జరిగింది.

కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇక్బాల్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఈ క్రమంలో ఇటీవల మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు.  ఈ విషయం వసరిగ్గా పెళ్లి రోజుధువు కుటుంబానికి తెలిసింది. ఇంతలో వరుడు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై మండపం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే కోపం మీదున్న వధువు కుటుంబ సభ్యులు, బంధువులు వరుడితో వాగ్వాదానికి దిగారు. వరుడు మాయమాటలతో, అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకోవాలని చూసినందుకు చెంపదెబ్బలు కొట్టారు.

గొడవ పెరిగి పెద్దది కావడంతో వేదికపైనే వరుడిని చితకబాదారు. చెంపదెబ్బ కొట్టి అప్పుడే వరుడి విగ్గు ఊడి కింద పడటంతో అతడి బట్టతల బండారం బయడపడింది. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న వధువు కుటుంబీకులు మరింత రెచ్చిపోయారు.పెళ్లికొడుకు పలుమార్లు నచ్చజెప్పినప్పటికీ ప్రయత్నించినా వారు క్షమించకపోవడంతో గ్రామాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామపెద్దలు పంచాయతీ పెట్టి గొడవ సద్దుమణిగిన తర్వాత వరుడిని తిరిగి వెనక్కి పంపించేశారు. మరోవైపు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దోభీ, కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement