
భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవూ ఉండదు. అలాగే వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలాకామన్. ట్రెండింగ్‌లో ఉండే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్‌మీడియాను షేక్ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా వధువు వార్తల్లో నిలిచింది. ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టోరీ ఏమిటంటే..
డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తోంది. జరీ వర్క్‌చేసిన ఎరుపు రంగు లెహంగా, దుప్పట్టా, హారాలు, సరిపోయే చెవిపోగులు, చూడమణితో చూడముచ్చటగా ఉన్న ఆమెను అందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నృత్యం చేయడం ఆపి, గౌరవంగా తల వంచుకుని, నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. ఇది చాలాచోట్ల సాధారణమైనప్పటికీ, ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు, "చాలా అందంగా.. తన సంతోషంగా నృత్యం చేస్తోంది....ఆమె ఇతరులను సంతోష పెట్టడం కోసం కాదు, తనకోసం ఆనందంగా నృత్యం చేస్తోంది. వాళ్ కానీ డబ్బులు విసరడం ఎందుకు, అందుకే ఆమె ఆపేసింది అని మరొకరు రాశారు. 'అత్యంత అందమైన వధువు' అని మరికొందరు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా? ప్రశ్నించారు.మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాల చుట్టూ చర్చకు దారితీసిందీ ఘటన.
చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!