జర్నీలకే రూ. 50 లక్షలు, 22 లక్షల కారు : ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్
ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..
ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక రీల్‌ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది.
ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
శరణ్య అయ్యర్ ఖర్చులు
శరణ్య అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్‌లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది.
నెటిజన్లు ఏమన్నారంటే
" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్‌ల్యాండ్‌ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య.
Comments
Please login to add a commentAdd a comment