Finance
-
కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే వృద్ధి
రాజ్యాంగం ప్రవచించిన భారత సమాఖ్య విధానం కాల పరీక్షకు తట్టుకుని దృఢంగా నిలిచింది. అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థవంటివి సమాఖ్య లక్షణాలు. వీటిని బల మైన కేంద్ర ప్రభుత్వం, అత్యవసర సంద ర్భాలకు అనువైన నిబంధనలు, కేంద్ర నియమిత గవర్నర్ల వ్యవస్థలతో అనుసంధానం చేశారు. ఎంతో నేర్పుగా జరిగిన ఈ మేళవింపు ఒక అద్భుతం. కాబట్టే... పలు ప్రాంతీయ అస్తిత్వాలు, మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద దేశ పరిపాలన సుసాధ్యమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించగలిగాం. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ...కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఏ సమాఖ్య దేశంలో ఇవి లేవు? కెనడాలో సుదీర్ఘకాలంనుంచీ క్యుబెక్ వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. క్యాటలన్ స్వాతంత్య్ర ఉద్యమంతో స్పెయిన్ సతమతమవుతోంది. అమెజాన్ అడవుల నరికివేత సమస్య బ్రెజిల్ కేంద్ర–రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇక నైజీరియా, ఇథియోపియాలు అక్కడి జాతుల ఘర్షణతో అట్టుడికి పోతున్నాయి. వనరుల పంపకంలో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు చివరకు ఇండోనేషియా నుంచి ఈస్ట్ తిమోర్ వేరుపడేందుకు దారి తీశాయి. వీటితో పోల్చి చూసుకుంటే, మన ఉద్రిక్తతలు అదుపు తప్ప కుండా మనం సర్దుకుపోగలుగుతున్నాం. మన రాజ్యాంగం ఏర్పర చిన ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ ఇందుకు కారణం. మన సమాఖ్య విధానం కాలానుగుణ మార్పులను తనలో ఇముడ్చుకుంటూ సాగిపోతోంది. అయితే, మన సహకార సమాఖ్య విధానం... పోరాట సమాఖ్య విధానం దిశగా జరిగిపోయింది. ఇదొక అపశ్రుతి. తమ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ప్రాంతీయ పార్టీలు, జాతీయ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు భావిస్తు న్నాయి. కేంద్ర వైఖరి పట్ల అక్కడ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇది రాజకీయ కోణం. ఆర్థిక కోణం నుంచి చూస్తే, ఈ చీలిక మరీ తీవ్రంగా ఉంది.కేంద్ర నిధుల బదలాయింపులు తగినంతగా ఉండటం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తమ సొంత ఆదాయాలకు తమ వ్యయ బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరుతున్నాయి. అంతేకాదు, కేంద్రం ఇచ్చే నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశంలో వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండటం లేదు. దీనికి తోడు, అవి ఎంత అప్పు చేయాలో, ఎవరి నుంచి తీసుకోవాలో కూడా కేంద్రం నిర్ణయిస్తోంది. రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు!ఈ వాదన చర్చనీయం. ఆర్థిక సమాఖ్య విధానం అత్యుత్తమ మైంది కాదనుకున్నా, నిధుల బదిలీ ఏర్పాట్లు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయనడం సరికాదు. ఎలానో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాజ్యాంగం ఒరిజినల్‌గా నిర్దేశించిన ప్రకారం, రాష్ట్రాలకు రెండే రెండు కేంద్ర పన్నుల్లో వాటా లభించాల్సి ఉంటుంది.. ఒకటి వ్యక్తిగత ఆదాయ పన్ను, రెండు కేంద్ర ఎక్సయిజ్ సుంకాలు. 2000 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏర్పాటును రాష్ట్రాలకు అనుకూల రీతిలో మార్చారు. దీని ప్రకారం, కేవలంరెండు పన్నుల్లోనే కాకుండా కేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో వాటికి వాటా దక్కింది. అలాగే, ప్రణాళికా సంఘం రద్దుతో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సైతం పెరిగింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి రావడంతో మరో యుద్ధానికి తెరలేచింది. తమ ప్రయోజనాలను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ దీన్ని తీసుకు వచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. కొత్త పన్నులు వేయడంలో వాటికి ఉన్న స్వేచ్ఛను కొంత కోల్పోయిఉండొచ్చు. కేంద్రం కూడా అలాగే కోల్పోయిందని గుర్తుంచుకోవాలి. క్రమేణా, జీఎస్టీ వల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. ఎగవేతలకు బ్రేక్ పడుతుంది. తద్వారా కేంద్రం, రాష్ట్రాలు రెండూ ప్రయోజనంపొందుతాయి. ఆర్థిక సమాఖ్య విధానం నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్న రాష్ట్రాల భావన వాస్తవం కాదు. అదే సమయంలో, రాష్ట్రాల ఆర్థిక సవాళ్ల పట్ల కూడా కేంద్రం ఎంతో సానుభూతి కనబరచాలి, వాటితో సంప్రదింపులకు ఎఫ్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే ఇలా జరుగుతోందా? ఉదాహరణకు, కేంద్రం పన్నులుపెంచడానికి బదులు సెస్సులు, సర్‌ఛార్జ్‌లు పెంచుకుంటూపోతోంది. కేంద్రం విధించే అన్ని పన్నుల నుంచీ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి జాతీయ పన్ను ఆదాయంలో న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.2047 గేమ్ ప్లాన్?ఆర్థిక గురుత్వ కేంద్రం రాష్ట్రాల దిశగా జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఉజ్జాయింపు అంచనా ప్రకారం, కేంద్రం ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు (కేంద్రం, రాష్ట్రాలవి కలిపి) 60 శాతంఉండగా, ఉమ్మడి వ్యయాల్లో కేంద్రం వాటా 40 శాతం మాత్రమే ఉంటోంది. రాష్ట్రాల విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగు తోంది. వాటన్నిటి ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు కలిసి 40 శాతం కాగా, ఖర్చు మాత్రం 60 శాతం చేస్తున్నాయి. దీని అర్ధం ఏమిటంటే, దేశ స్థూల ఆర్థిక సుస్థిరత, తద్వారా పెట్టుబడులు పెంచే సామర్థ్యం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. 2047లో మనం వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటాం. అప్పటికి ఇండియా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతున్నాం. ఆ స్థాయికి చేరడానికి మన ముందున్న ఎజెండా కూడా అంత పెద్దది, సంక్లిష్టమైంది. కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో ముందడుగు వేస్తే తప్ప మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించలేం. ఆర్థిక వ్యవస్థ ఉత్పా దకతను మెరుగు పరచుకోవడానికి అవసరమైన రెండో తరం సంస్క రణలను అమలు చేయడం మన గేమ్ ప్లాన్‌లో భాగం అయితీరాలి. 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. ఇవన్నీ తన పరిధిలోనివే కాబట్టి, వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్ర దించాల్సిన అవసరం లేకపోయింది. రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన ఈ సంస్కరణలు భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతి మాత్రమే కాదు, అమలులో చురుకైన భాగస్వామ్యం కూడా కావాలి. రాజ్యాంగం ద్వారా మన కోసం మనం చేసిన ప్రతిజ్ఞ నెర వేరాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కీలకం.» వ్యాసకర్త భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్,యేల్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)» 2000లో చేసిన రాజ్యాంగ సవరణ వల్ల, రెండు (వ్యక్తిగత ఆదాయ పన్ను, ఎక్సయిజ్ సుంకాలు) పన్నుల్లోనే కాకుండాకేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు వాటా దక్కింది.» రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అందుకు విరు ద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.» 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. వీటిని ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవ సరం లేకపోయింది. కానీ రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఇవి భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతే కాదు, వాటి చురుకైన భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంటుంది.» వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం తమ ప్రయోజనా లను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ తెచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. -
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్‌ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణ వితరణ
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు పొందడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయ రుణ వితరణ నమూనాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పట్టణాల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలు కేటాయిస్తామన్నారు.‘‘బ్యాంకు రుణాల విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పండి. అధిక తనఖాలు కోరుతున్నాయా? ఎగుమతుల రుణ హామీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ఉన్నప్పటికీ, బ్యాంక్‌లు తనఖా ఇవ్వాలని అడుగుతున్నాయా? ఎగుమతి రుణాల్లో వైఫల్యాలు ఎదురైతే 90 శాతం హామీ బాధ్యతను ఈసీజీసీ తీసుకుంటున్న తరుణంలో బ్యాంక్‌లు రుణాలపై ఎంత మేర వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి? అంశాల వారీ మరింత స్పష్టమైన సమాచారం పంచుకుంటే దాన్ని బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లగలం. ఇప్పటికీ బ్యాంక్‌లకు వెళ్లి రుణాలు తీసుకునేందుకుకే అధిక శాతం ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ రుణ నమూనా ఆలోచనల పట్ల అనుకూలంగా ఉన్నాం’’అని గోయల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. స్థలాలు కేటాయిస్తాం.. ఎంఎస్ఎంఈలు లేకుండా పెద్ద పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాణిజ్య మంత్రి గోయల్ పేర్కొన్నారు. కనుక వాటికంటూ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో షెంద్రాబిడ్కిన్ పారిశ్రామిక టౌన్షిప్లో టయోటా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సుమారు 100 ఎంఎస్ఎంఈల అవసరం ఉంటుంది’’అని వివరించారు. -
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి గుడ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రమోటర్ల షేర్ల తనఖా తగ్గడంతోపాటు.. లెవరేజ్ కనిష్టస్థాయికి చేరినట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. గత రెండేళ్ల కాలంలో గ్రూప్ లెవరేజ్, షేర్ల తనఖా, రుణ చెల్లింపులు, బిజినెస్ విలువలు తదితరాల విశ్లేషణతో నివేదికను విడుదల చేసింది. కాగా.. 2023 జనవరిలో అదానీ ఖాతాలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన కారణంగా గ్రూప్ కంపెనీలోని పలు షేర్లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. తదుపరి అదానీ గ్రూప్ వీటిని ఆధార రహితాలుగా కొట్టిపారేసింది. దీంతో తిరిగి గ్రూప్ కంపెనీలు బలపడటంతోపాటు నిధులను సైతం సమీకరించగలిగాయి.ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే రిసు్కలు తగ్గినట్లు బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది. కాగా.. గత నెల 21న యూఎస్ అధికారికవర్గాలు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సంబంధిత ఉన్నతాఅధికారులపై లంచాల ఆరోపణలు చేసింది. వీటిని సైతం అదానీ గ్రూప్ తోసిపుచి్చంది. -
వీధి వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణం
ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా డిజిటల్ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్ కోడ్ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పుఈ సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సీఈవో చందన్ ఖైతాన్ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్–కోడ్ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు. -
ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి చిలుకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? ఇలాంటి ఎన్నో అంశాలను ఆ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి., అప్పులు, ఆదాయ వనరులు, రిటైర్మెంట్ ప్లానింగ్, బేసిక్ మనీ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సవివరంగా ఈ సదస్సులో వివరించారు. నెట్లా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్ వీలునామాలు, ట్రస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారి ఆర్ధిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఆర్ధిక అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కృషి చేసిన నాట్స్ వెబ్, మార్కెటింగ్ బృందాలు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రుతో లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సభ్యులందరికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటికి నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్) -
అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్లో కొన్ని సెక్టార్లలోని స్టాక్లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్ఐఐలు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా వంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పరిమిత కాలానికి సంబంధించి ఆశావాహంగా ఉండడంలేదు.గడిచిన సెషన్లో అమ్మకాలు ఈ విభాగాల్లోనే..బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు గడిచిన సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80వేల దిగువున 79,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 79,822 – 80,436 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 24,307 వద్ద కనిష్టాన్ని, 24,498 వద్ద గరిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: స్క్రీన్కు బానిసవుతున్న బాల్యండిమాండ్ ఉన్న సెక్టార్లుసర్వీసెస్, ఇండ్రస్టియల్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, టెలికం షేర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. గోదావరి బయోరిఫైనరీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.352తో) పోలిస్తే 12% డిస్కౌంట్‌తో రూ.310 వద్ద లిస్టియ్యింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకొని 3% నష్టంతో రూ.343 వద్ద ముగిసింది. -
హెజ్బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌లోని బీరుట్లో హెజ్బొల్లా గ్రూప్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులు చేస్తోంది.Israel has launched targeted airstrikes on branches of the Hezbollah-linked Al-Qard Al-Hassan financial association in Beirut and the Beqaa Valley. These strikes, some near Beirut's airport, follow warnings from the IDF accusing the quasi-bank of financing Hezbollah's operations. pic.twitter.com/wi9sjbUYhF— TBN Israel (@TbnIsrael) October 21, 2024 బీరుట్‌లోని ఆ ప్రాంతాల్లో లెబనాన్ పౌరులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. దిక్కు తోచక బీరుట్ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లితున్నారు.హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు చోట్ల పేలుళ్లు జరిపింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.⚡️This moment, #Israel airstrikes targeted multiple areas in the suburbs of #Beirut, Lebanon. The Israel has announced plans to target businesses it claims are connected to #Hezbollah, singling out the Al Qard Al Hassan Institution.Al Qard Al Hassan operates throughout Lebanon,… pic.twitter.com/VTmnyXK2eF— Shah Faisal AfRidi (@Sfaisalafridi) October 20, 2024 అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 73 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైనిక ముట్టడి కారణంగా ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారింది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం వంటి అవసరమైన సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్బొల్లా డ్రోన్ ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది.చదవండి: మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే -
ఎన్బీఎఫ్సీ ఐపీవోల క్యూ
న్యూఢిల్లీ: అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనల కారణంగా ఇకపై పలు పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. ఈ విభాగంలో వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం కనీసం మరో మూడు కంపెనీలు ఈ జాబితాలో చేరనున్నాయి. వీటిలో టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్‌కు ప్రయత్నించనున్నాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పర్‌లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు గుర్తింపు పొందిన మూడేళ్లలోగా ఐపీవోలు చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు జోరుమీదుండటంతో నాణ్యతగల బిజినెస్‌లకు డిమాండ్ ఉన్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగ డైరెక్టర్ సచిన్ మెహతా పేర్కొన్నారు. దీంతో మంచి విలువలు లభించేందుకు వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా పలు ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. కేవలం ఆర్బీఐ నిబంధనల అమలుకోసమేకాకుండా నిధుల సమీకరణకు సైతం ఐపీవోలను వినయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒకసారి లిస్టయితే నిధుల సమీకరణ సులభమవుతుందని వివరించారు. క్యూ ఇలా ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీ నిబంధనల ప్రకారం చూస్తే దిగ్గజాలు టాటా సన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. వీటిలో పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానుంది. ఇక టాటా సన్స్ లిస్టింగ్‌ను తప్పించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ లిస్టింగ్ గేమ్‌చేంజర్‌గా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇన్వెస్టర్లు లిస్టింగ్ ద్వారా భారీ లాభాలు అందుకునేందుకు వీలుండటమే దీనికి కారణమని తెలియజేశారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అధికస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకోగలదని భావిస్తున్నారు. దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాల హోల్డింగ్ కంపెనీగా నిలుస్తున్న టాటా సన్స్‌కు భారీ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేశారు.కీలక పరిణామం ప్రయివేట్ రంగ హోల్డింగ్ దిగ్గజం టాటా సన్స్ లిస్టయితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఇది కీలక పరిణామంగా నిలుస్తుందని డీఏఎం క్యాపిటల్ సీఈవో ధర్మేష్ మెహతా పేర్కొన్నారు. భారత్‌లోనే అత్యంత ప్రముఖ గ్రూప్‌లలో ఒకటైన టాటా సన్స్‌కు దేశ, విదేశాల నుంచి గరిష్ట డిమాండ్ పుడుతుందని తెలియజేశారు.వాటాదారులకు భారీ విలువ చేకూరుతుందని మార్కెట్ నిపుణులు పలువురు అభిప్రాయపడ్డారు. వెరసి కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేస్తే రూ. 55,000 కోట్లకుపైగా నిధులు లభించవచ్చని అంచనా వేశారు. లిక్విడిటీతోపాటు.. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీఆ పెరుగుతుందని తెలియజేశారు.లిస్టింగ్‌ను తప్పించుకునే యోచనతో టాటా సన్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్బీఐకు స్వచ్చందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనూహ్య పతనానికితోడు.. డీహెచ్ఎఫ్ఎల్ సైతం విఫలంకావడంతో మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. కఠిన లిక్విడిటీ సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా 2021 అక్టోబర్‌లో ఆర్బీఐ సవరించిన ఎస్బీఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా వ్యవస్థాగత రిస్కులను అడ్డుకోవడం, పాలనను మరింత పటిష్టపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఇవీ నిబంధనలుఎస్బీఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎన్బీఎఫ్సీలను నాలుగు విభాగాలు(లేయర్లు)గా విభజించింది. ప్రాథమిక(బేసిక్), మాధ్యమిక(మిడిల్), ఎగువ(అప్పర్), అత్యున్నత(టాప్) లేయర్లుగా ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీల పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ స్థాయిల ఆధారంగా వీటికి తెరతీసింది. దీనిలో భాగంగా అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యేలా నిబంధనలను సవరించింది. ఇందుకు అనుగుణంగా 2022 సెప్టెంబర్‌లో 16 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. అయితే 2023లో జాబితా నుంచి సంఘ్వీ ఫైనాన్స్‌ను తప్పించింది.వెరసి 15 సంస్థలు అప్పర్లేయర్లో చేరాయి. వీటిలో పిరమల్ క్యాపిటల్, టాటాసన్స్లను మినహాయిస్తే 9 కంపెనీలు ఇప్పటికే లిస్టయినట్లు మెహతా వెల్లడించారు. బజాజ్ హౌసింగ్ ఐపీవో ప్రారంభంకానున్న కారణంగా మిగిలిన మూడు కంపెనీలు ఏడాదిలోగా లిస్ట్‌కావలసి ఉంటుంది. ఈ మూడు సంస్థలు 2025 సెప్టెంబర్‌లోగా పబ్లిక్ ఇష్యూలను చేపట్టవలసి ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలియజేశారు. -
అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో పరిస్థితులు వేరు. భర్త సంపాదిస్తే.. భార్య ఇంటి బాధ్యతలు చూసుకునేది. తన సంపాదనలో నుంచి ఇంటి ఖర్చులు పోను.. కొంత డబ్బును భార్యకు పాకెట్‌మనీగా ఇచ్చేవాడు భర్త. అదీగాక మన దేశంలో ఎక్కడ భర్త జీతం మొత్తం తీసుకొచ్చి భార్య చేతలో పెట్టడమనేది అస్సలు జరగని పని. కానీ జపాన్‌లో మాత్రం జీతం రాగానే రూపాయి ఖర్చు చేయకుండా డబ్బు మొత్తం భార్య చేతిలో పెట్టాల్సిందేనట!ఆపై దానిపై అధికారమంతా ఆమెదే! డబ్బు నిర్వహణ మొత్తం భార్యలే చూసుకోవడం, కొంత మొత్తాన్ని భర్తకు పాకెట్‌మనీగా ఇవ్వడం అక్కడ ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పద్ధతిని అక్కడ ‘కొజుకై’గా పిలుస్తారు. అక్కడి జనాభాలో దాదాపు 74 శాతం మంది దంపతులు ఇప్పటికీ ఈసంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదీగాక చైనా మహిళలు పొదుపు విషయంలో ఇతర దేశాల మహిళకు స్ఫూర్తిగా ఉంటారట.ఇంటి ఖర్చుల గురించి ఇల్లాలి కంటే బాగా ఎవ్వరికీ తెలియదు. ! అందుకే మహిళల్ని హోమ్ మినిస్టర్లు అని పిలుస్తుంటారు. అయితే జపాన్‌లో భార్యలు ఉద్యోగం చేసినా, చేయకపోయినా.. ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బును భార్య చేతికిస్తారు భర్తలు.ఇది అక్కడ సర్వసాధారణం.పొదుపు మదుపుల్లో నిష్ణాతులు వారే..అక్కడ చాలావరకు ప్రతి ఇంట్లో సంపాదనంతా తెచ్చి భార్య చేతిలో పెట్టే భర్తలే కనిపిస్తారట! ఇలా భర్త సంపాదనను ఖర్చులు, పొదుపులు అనే రెండు వర్గాలుగా విభజించుకుంటారట జపాన్ మహిళలు. ఇంటికి సరిపడా నిత్యావసరాలు, రేషన్, ఇతర ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. వంటి వాటికి ఖర్చుల కోసం పక్కన పెట్టుకున్న డబ్బును వినియోగిస్తుంటారట అక్కడి మహిళలు!. ఇక ఇందులో నుంచే తమ భర్తకు నెలకు సరిపడా ఖర్చుల కోసం కొంత డబ్బును పాకెట్‌మనీ రూపంలో అందిస్తుంటారు. ఇలా భర్త డబ్బును మేనేజ్ చేస్తూ.. వాళ్లకు పాకెట్‌మనీని అందించే ఈ పద్ధతిని ‘కొజుకై’ అనే పేరుతో పిలుస్తున్నారు జపనీయులు. ఇంటి అవసరాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినంతగా.. పొదుపు-మదుపులపై మహిళలకు అవగాహన ఉండదనుకుంటారు చాలామంది. ఐతే జపాన్ మహిళలు ఇందులోనూ నిష్ణాతులేనట! భర్త తెచ్చిన సంపాదనను ఇంటి అవసరాల కోసం బ్యాలన్స్డ్గా ఖర్చు చేయడంతో పాటు.. మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ వారు ముందుంటారట!.ఈ క్రమంలో లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంత డబ్బును ప్రత్యేకమైన ‘మనీ పర్సు’లో దాచుకుంటారట! అత్యవసర పరిస్థితుల్లో ఇది తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. అంతేకాదు.. ఒకవేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్ మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక విషయాల్లో జపాన్ మహిళల ముందుచూపు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదూ!!.(చదవండి: 115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!) -
Hyderabad: సెకండ్ హ్యాండ్ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ
పట్టణానికి చెందిన అంకిత్ అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాల్సి రావడంతో మోటార్ సైకిల్ అవసరం పడింది. దీంతో సెకండ్ హ్యాండ్ బైక్‌లు విక్రయించేవారి వద్ద రూ.60 వేలకు బైక్ మాట్లాడుకున్నాడు. మొదట రూ.20 వేలు చెల్లించి బైక్ తీసుకున్నాడు. మిగితా డబ్బులు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తానని నిర్వాహకుల వద్దే అధిక వడ్డీకి ఫైనాన్స్ చేసుకున్నాడు. రెండు నెలలు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలోనే కుటుంబ ఆరి్థక పరిస్థితుల కారణంగా ఫైనాన్స్ కట్టలేదు. వెంటనే ఫైనాన్స్ వారు వచ్చి బైక్ తీసుకెళ్లారు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇది కేవలం అంకిత్ పరిస్థితే కాదు. విద్యార్థులు, కారి్మకులు, చిరు వ్యాపారులందరిదీ ఇదే పరిస్థితి. తూప్రాన్: ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆరి్థక నేరం.. బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పుట్టగొడుగుల్లా షోరూమ్లుప్రతీ మండల కేంద్రంలోనూ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి వారికి యువకులు, కాలేజీ స్టూడెంట్లకు ఎటువంటి షరతులు లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్న తర్వాత అసలు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. బైక్ సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్షియర్లు చెప్పిన చోటల్లా సంతకాలు చేస్తున్నారు. నెల వాయిదా ఆలస్యం అయితే ఈ మొత్తం రోజువారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదాల వసూలుకు ఎన్ని దఫాలు వస్తే చార్జీలు అదనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తెలియదు. వాయిదాలు అన్నీ తీరాక బైక్ ఆర్సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖరులో చెబుతారు. కొనుగోలు దారులకు బైక్‌పై ఎలాంటి హక్కులు లేకపోవడంతో నోరెత్తకుండా నగదు చెల్లించి బయటపడుతున్నారు. దారి తప్పుతున్న విద్యార్థులు చాలా మంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరిస్థితి లేకున్నా ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌లో బైక్ ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలలపాటు ఫైనాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్తుల ఇళ్ల వద్ద ఫైనాన్సి యర్లు గొడవ చేస్తే పరువుపోతుండటంతో పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీరుస్తున్నారు. అంతే కాకుండా దొంగ బైక్‌లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసుల్లో పట్టుబడినప్పడు ఈ విషయం బహిర్గతమవుతున్న ఘటనలు ఉన్నాయి. సులువుగా అప్పు దొరికేసరికి ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు.పట్టించుకోని అధికారులు ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం.. తీసుకునే వాడి అవసరం అన్నట్లుగా సాగిపోతుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ తక్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులను అప్పుల ఊబిలో దించే ఈ వ్యాపారంలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వెనక్కిరాని డబ్బులు ఇదిలా ఉంటే మరికొన్ని కేసుల్లో ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నారు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్షియర్ మనుషులు స్వా«దీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బులూ వెనక్కి ఇవ్వరు. ఇలా వీరు దోపిడీకి పాల్పడినా అడ్డుకునేందుకు వీలుగా నిబంధనలు లేవు. దొంగిలించిన వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు వ్యాపారు లు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా ఎంపిక చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవలె తూప్రాన్‌లో బైక్ జోన్లపై పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.చర్యలు తీసుకుంటాం సెకండ్ హ్యాండ్ బైక్‌ల విక్రయాలు పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. సులభ వాయిదాల్లో బైక్ కొనాలనుకున్నవారు సెంకడ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. బైక్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగా చూసుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అలాగే, వ్యాపారులు ఫైనాన్స్ పేరులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రంగాకృష్ణ, సీఐ తూప్రాన్ -
ఫైనాన్స్ డిజిటలైజేషన్‌తో కొత్తతరం బ్యాంకింగ్
ముంబై: ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్, ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు. బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్‌టెక్‌లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్‌్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది. ఆర్బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్ రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
ఏపీలో మరో తప్పుడు శ్వేత పత్రం రెడీ!
అమరావతి, సాక్షి: ‘‘అవునా.. అలా కనిపించడం లేదా?. అయినాసరే రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు ఎలాగైనా లెక్కలు చూపించండి’’.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి!. శ్వేత పత్రాల పేరిట జగన్ పాలనను ఏదో ఒకరకంగా తప్పుబట్టాలని చూస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని రంగాలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వైట్ పేపర్లు విడుదల చేస్తోంది. అమరావతి, ఆ వెంటనే విద్యుత్ శాఖపై లేనిపోని లెక్కలు చెబుతూ స్వయంగా చంద్రబాబు ఆ పత్రాలు విడదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై అధికారులతో సమీకక్షించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే.. ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ఉన్న ఆయన.. ఎలాగైనా 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చూపాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశం కంటే ముందే.. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, రిజర్వ్ బ్యాంకు గణాంకాలకు విరుద్ధంగా అప్పుల లెక్క చూపలేక అధికారులు అవస్థలు పడుతోంది. ఇదీ చదవండి: శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్‌కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
200 కోట్ల భారీ స్కాంలో దొరికిపోయిన నిమ్మగడ్డ ఫ్యామిలీ
-
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్‌ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రైండ్‌లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబు భారీగా ఫైనాన్స్ చేశారని, సుమారు రూ. 60 కోట్లు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో 10 మంది టీడీపీ అభ్యర్థులకు మొండిచేయి చూపి షర్మిలకు డబ్బులిచ్చి కడప పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారని చెప్పారు. డా. చైతన్యరెడ్డితో కలిసి బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే షర్మిలకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు వైఎస్ కుటుంబంలో షర్మిల, సునీతను చంద్రబాబు పావులుగా మార్చారని చెప్పారు. ఇందులో భాగంగానే షర్మిల పీసీసీ అద్యక్షురాలయ్యారని తెలిపారు. అరుంధతి సినిమాలోలాగా వారిని పశుపతి ఆవహించారని ఎద్దేవా చేశారు. కుటుంబాలను విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని, తల్లీబిడ్డలకు కూడా తగవు పెట్టే సమర్థుడని చెప్పారు. సునీత లక్ష్యం వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నేరస్తులను వెలికితీయడమా లేక తప్పు చేయని వారిని శిక్షించడమా అని ప్రశ్నించారు. ఆమె సైకో ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. ఒక పథకం ప్రకారం కథ అల్లుతూ వారు అనుకున్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకొని ఉంటే అసలు నేరస్తులు దొరికేవారని చెప్పారు. బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంతో, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై ఉన్న కోపంతో షర్మిల, సునీత ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేసు ట్రయల్‌కు వచ్చాక నిజాలు బయటికి వస్తాయని, ఆ లోపే ఒకరిని లక్ష్యం చేసుకొని దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. వేరే సంబంధాలతోనే వివేకా హత్య వేరే సంబంధాలతోనే వివేకా హత్య జరిగిందని, రాజకీయ కోణం లేదని తెలిపారు. హత్యకు ఒక రోజు ముందు ఇంట్లో పని చేసే పందింటి రాజశేఖర్‌ను సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కాణిపాకం పంపించారని, చెవులు వినపడని వాచ్‌మేన్ రంగయ్య ఇంటి బయట ఉన్నారని చెప్పారు. అదే సమయంలో దుండగులు వివేకా ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐని ఎవరో మేనేజ్ చేశారని, అందువల్లే వీటిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. వైఎస్ వివేకాతో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరికి సాన్నిహిత్యం ఉందని, తరచూ కలిసి భోజనం చేస్తారని సీబీఐకి సాక్షులు చెప్పారని గుర్తుచేశారు. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా చేసేందుకు వివేకా కష్టపడ్డారని తొలుత చెప్పిన సునీత.. ఆ తర్వాత మాటమార్చిందన్నారు. హార్ట్ ఎటాక్ డ్రామా ఆడింది కూడా సునీతేనని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకే వివేకా రాసిన లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబితేనే లేఖను దాచిపెట్టినట్లు పీఏ కృష్ణారెడ్డి చెప్పారన్నారు. వారికి నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రక్తపు మరకలను ఎవరూ తుడవలేదని, బెడ్ వద్ద మాత్రమే తుడిచారని, ఆ వస్త్రం కూడా అక్కడే ఉందని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ వివేకా బలవంతపెట్టారని షర్మిల చెప్పడంలో అర్థం లేదన్నారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని నిర్ణయించారని, 2019లోనూ ఆయన్నే కొనసాగించారని చెప్పారు. పబ్లిక్ ఫోరం, మీడియాలో ట్రయల్స్ ఆపండి : డా. చైతన్యరెడ్డి వివేకా హత్య కేసులో పబ్లిక్ ఫోరం, మీడియా ట్రయల్స్ ఆపాలని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా. చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి హార్ట్ చెకప్ చేసి, సర్జరీ చేయాలని, బెయిలివ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, సీబీఐ వ్యతిరేకించకపోయినా సునీత మాత్రం వ్యతిరేకించిందన్నారు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌ల బెయిల్‌ను వ్యతిరేకించకుండా, తన తండ్రి శంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించారన్నారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయత లేదని, ఖచ్చితత్వం అంతకంటే లేదన్నారు. సీబీఐ పేర్కొన్నది వాట్సాప్ చాట్స్ అని, వాట్సాప్ కాల్స్ కానేకాదన్నారు. అందులో ఔట్‌గోయింగ్ చాట్స్ అసలే లేవన్నారు. -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ
ఆర్బీఐ ఇప్పటికే పసిడి రుణాల మంజూరు, పంపిణీకి సంబంధించి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా షేర్లు, డిబెంచర్లపై ఎలాంటి రుణాలనూ అందించకుండా జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధం విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. ఐపీఓ రుణాల మంజూరు, పంపిణీకీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఐపీఓ, ఎన్సీడీల కోసం రుణాలను ఇవ్వడంలో కొన్ని తీవ్ర లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి జేఎం ఫైనాన్షియల్ సమర్పించిన కొన్ని నివేదికలను పరిశీలించాక, ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా..
ఉద్యోగాల్లో మహిళలకు సరైన ప్రాతినథ్యం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతో కంపెనీల్లో అవగాహన మొదలై కొన్నేళ్లుగా వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రావడంలేదు. దాంతో కంపెనీలు కొత్త పంథా ఎంచుకుంటున్నాయి. తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హైదరాబాద్‌లో పూర్తి మహిళా సిబ్బందితో మైత్రేయి పేరిట బ్రాంచీని ఏర్పాటు చేసింది. ఇందులో గృహ, ఎస్ఎంఈ రుణాలు మొదలైనవి అందిస్తామని సంస్థ హెచ్ఆర్ హెడ్ ప్రనిత్ సోనీ తెలిపారు. ఇదీ చదవండి: సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే.. ఉద్యోగాల్లో మహిళలకు కూడా సమానమైన అవకాశాలను కల్పించాలన్న తమ లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని ఎండీ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. ప్రతి మైత్రేయి శాఖలో 7–15 మంది ఉద్యోగినులు ఉంటారని వివరించారు. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
చైనాలో ఆర్థిక మాంద్యం?.. నిజాలు వెళ్లగక్కిన జిన్‌పింగ్!
నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్‌పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్‌పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్‌పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్‌పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. చైనాలో గడచిన డిసెంబర్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది. -
ముత్తూట్ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లుల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్పొరేట్ సేవా బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు ర.50 వేల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు డిసెంబర్ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్ సీఆర్ఎస్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వితంతు తల్లులకు ఆర్థిక సాయం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్ఆర్ హెడ్ బాబు జాన్ మలయల్ తెలిపారు. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్‌కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
ఆన్లైన్లో ఆర్థిక మోసాలే ఎక్కువ..!
సాక్షి, హైదరాబాద్: అత్యాశ, అవగాహన లేమి కారణం ఏదైతే ఏంటి.. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో ఆర్థిక మోసాలు గణనీయంగా పెరిగాయి. ఏసీ గదుల్లో కూర్చుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు. జనవరి 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలపై ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సైబర్ నేరాల్లో ఆన్లైన్ ఆర్థిక మోసాలే 77.41 శాతం ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ ఆర్థిక మోసాల్లో ప్రత్యేకించి యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సంబంధిత మోసాలు 47.25 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నమోదైన సైబర్ నేరాలు కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
ఫైనాన్స్, చిట్‌ఫండ్ సంస్థలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా.. ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్‌ఫండ్స్‌లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్‌ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్‌పేట్‌లోని సన్‌షైన్ అపార్ట్మెంట్లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్‌డిస్‌్కలు, పలు ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్‌ఫండ్, ఈ–కామ్ చిట్‌ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్‌లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
చైనా గుప్పిట్లో పాక్ మీడియా? అమెరికా రిపోర్టులో ఏముంది?
అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్‌లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది. ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే? -
చైనా ముంగిట మాంద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై?
చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తేనుందా? చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? ఇటువంటి ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా తన ఉనికిని నేపాల్ నుండి శ్రీలంక వరకు విస్తరించడం, ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహ హస్తాన్ని కూడా చాచుతోంది. ఆర్థికవృద్ధికి ఇంతలా తాపత్రయ పడుతున్న చైనా విజయం సాధిస్తుందా? చైనా ప్రాపర్టీ రంగంలో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా మాజీ సీనియర్ ఎన్బిఎస్ అధికారి హె కెంగ్ తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో మూడు వందల కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అన్నారు. డాంగ్-గ్వాన్ చైనాలోని ఒక నగరం. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య చైనా జనాభా కంటే రెట్టింపులో ఉందని కెంగ్ తెలిపారు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్థితిలో ఉన్నాయి. అంటే 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ డేటా ఆగస్టు 2023 నాటిది. ఈ ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదని అన్నారు. ఇలాంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదకలు చెబుతున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 21.3 శాతం మంది యువత ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చైనాకు చాలా నష్టం వాటిల్లింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పు కూడా భారీగానే ఉంది. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నది. మరోవైపు దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీలపై నిబంధనల కఠినతరం మొదలైనవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. తాజాగా చైనా తన విధానాలలో మార్పు కోరుకుంటుంది నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఏడు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు అర్థమైవుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. అయితే చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
వృద్ధాప్యంలో సంక్షోభానికి దూరంగా.. తల్లిదండ్రుల కోసం ఏం చేయాలంటే?
ప్రతి కుటుంబానికి సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కుటుంబ లక్ష్యాలు అన్నింటికీ ఇందులో చోటు కల్పించుకోవడం ఎంతో అవసరం. స్కూల్, కాలేజీ ఫీజులు, విదేశీ విద్య, జీవిత, ఆరోగ్య బీమా పథకాలు, అత్యవసర నిధి, విహార, పర్యాటక యాత్రలు ఇలా అన్నింటికీ చోటు కల్పించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ లక్ష్యాలు అన్నింటికీ కావాల్సిన మేర సమకూర్చుకునేందుకు వీలుగా తగిన పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అందరూ కాకపోయినా కొందరు అయినా దీన్ని అనుసరిస్తుంటారు. కాకపోతే ఎక్కువ మంది ఇక్కడ విస్మరించే విషయం ఒకటి ఉంది. తమపై ఆధారపడిన వృద్ధాప్య తల్లిదండ్రుల సంరక్షణను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోరు. దీన్ని ఒక లక్ష్యంగా చూడరు. గతంతో పోలిస్తే వృద్ధాప్యంలో సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. కనుక ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో దీనికి తప్పకుండా చోటు ఉండాల్సిందే. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది.. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు అతిపెద్ద ఆర్థిక వ్యయంతో కూడుకున్న లక్ష్యాల్లో వృద్ధాప్య సంరక్షణ (జెరియాట్రిక్ కేర్) ఒకటి. అయినా, అధిక శాతం మంది ఆర్థిక ప్రణాళికల్లో దీనికి చోటు ఉండదు. వృద్ధుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు అవుతుందన్న అవగాహన కూడా ఉండడం లేదు. ఇది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమతోనే ఉంటున్నారా? లేక మరో చోట నివసిస్తున్నారా? లేక వృద్ధాశ్రమంలో చేరారా? వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదంటే వారికి సంరక్షకులను ఏర్పాటు చేయాలా? వారికి పింఛను సదుపాయం ఉందా లేక ఇతరత్రా వేరే రూపంలో ప్రతి నెలా ఆదాయం వచ్చే ఏర్పాటు ఉందా? ఇలాంటి అంశాలన్నింటి ఆధారంగా వృద్ధుల సంక్షేమం కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలనేది తేల్చుకోవచ్చు. వృద్ధాప్య సంరక్షణ ఇంత కాలం పాటు, నిర్ధిష్ట సమయం అని నిర్ణయించుకోవడం కష్టం. వృద్ధులైన తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రత్యేక సంరక్షణ అవసరం పడకపోవచ్చు. అలా అని ముందు ముందు వయసు మీద పడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. అప్పుడు ప్రత్యేక సంరక్షకుల అవసరం ఏర్పడొచ్చు. దీనికి ఎంత వ్యయం అవుతుందన్నది ముందుగా అంచనా వేయలేం. ఎన్నో నిదర్శనాలు.. నేడు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సామాజిక భద్రత ఉండడం లేదు. నేటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చూస్తే వృద్ధుల సంక్షేమం అతిపెద్ద ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ తల్లికి కిడ్నీల సమస్య ఉంది. కిడ్నీల డయాలసిస్, ఇతర చికిత్సా వ్యయాల కోసం రూ.80,000 వరకు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తోంది. గతేడాది వరకు కేవలం ఔషధాల వరకే ఖర్చు అయ్యేది. కానీ, కిడ్నీల సమస్య మరింత తీవ్రతరం కావడంతో వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్క సెషన్‌కు రూ.3,000 ఖర్చు అవుతోంది. ఇక దత్తాత్రేయ తల్లి మృణాళిని టెస్ట్‌లు, వైద్యుల కన్సల్టేషన్ కోసం ఏటా మరో రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు. నిజానికి దత్తాత్రేయకు పనిచేసే సంస్థ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పటి వరకు బీమా కంపెనీ మృణాళిని వైద్య ఖర్చుల భారం మోస్తోంది. కాకపోతే ఇటీవల డయాలసిస్, ఇతర వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కవరేజీ చాలడం లేదు. సొంతంగా తమ వంతు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక పట్టణాల్లో తల్లిదండ్రుల సంక్షేమ వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరో చోట నివసిస్తుంటే, వారికి అదనపు వ్యయాలతోపాటు ఇతరత్రా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇందుకు ముంబైకి చెందిన భట్టాచార్యే నిదర్శనం. ఆయన తల్లిదండ్రులు కోల్‌కతాలో నివసిస్తున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు ఏకైక కుమారుడైన దత్తాత్రేయపైనే ఉన్నాయి. వాటిని ఆయన నెరవేరుస్తున్నారు కూడా. కాకపోతే తాను నివస్తున్న పట్టణానికి దూరంగా తల్లిదండ్రులు ఉంటుండడం, పైగా తల్లి కేన్సర్‌తో బాధపడుతూ పూర్తి స్థాయిలో సొంతంగా నడవలేకపోతుండడం సవాలుగా మారింది. దీంతో ఆమెకు తన కుమారుడి నుండి భౌతిక సాయం కూడా అవసరమవుతోంది. దీంతో భట్టాచార్య ముంబై నుంచి కోల్‌కతాకు తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. తనతో పాటు ఆస్పత్రికి వెళ్లి రావడానికి అమ్మ సౌకర్యంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తన తల్లిదండ్రులను ముంబైకి మార్చుదామంటే ఆర్థికంగా అది సులువైన నిర్ణయం కాదని అతడికి తెలుసు. కోల్‌కతాలో అయితే వారి సంరక్షణకు నెలకు రూ.60,000–65,000 ఖర్చు అవుతోంది. ముంబైకి మారిస్తే రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తుంది. ముంబైలో జీవన వ్యయాలు ఎక్కువ. ఇప్పుడు కాకపోతే మరికొంత కాలం తర్వాత అయినా తన తల్లిదండ్రులను ముంబైకి తీసుకురావడం ఒక్కటే ఆయన ముందున్న ఆప్షన్. ఏడాది క్రితం వరకు తల్లిదండ్రుల ఔషధాలకు నెలకు రూ.30,000 ఖర్చు అయితే, ఇప్పుడు రూ.45,000కు పెరిగింది. తమపై ఆధారపడిన లేదంటే భవిష్యత్తులో తమ సంరక్షణ అవసరం పడే తల్లిదండ్రులు ఉంటే, వారి కోసం ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. అస్పష్ట సవాళ్లు ఆర్థికంగా పడే భారాన్ని అధిగమించడం ఒక్కటే కాదు, ఇతర సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. ఢిల్లీకి చెందిన మంజీత్ తండ్రికి శస్త్రచికిత్స తర్వాత ఆస్పత్రిలోనే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రాత్రి సమయాల్లో సంరక్షణ చూసేందుకు ఒక వార్డ్ బోయ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో ప్రతి రోగికి విడిగా ఒక్కో వార్డ్ బోయ్ లేదా కేర్‌టేకర్ ఏర్పాటు సదుపాయం ఉండదు. దీంతో ప్రైవేటుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం మినహా వేరే మార్గం కనిపించలేదు. అందుకు అర్హత కలిగిన వ్యక్తిని గుర్తించడం, వారి చార్జీలు చెల్లించడం కష్టమైన టాస్క్‌గా మారింది. కొన్ని పేరొందిన ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యయాలు 40–50 శాతం అధికంగా ఉంటాయి. వృద్ధాప్య సంరక్షణ కేంద్రాల్లో ఈ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్నప్పుడే వేరే కొత్త ప్రాంతానికి మారిస్తే.. వారు ఒంటరితనంతో వేదనకు గురవుతారు. పైగా తమ పిల్లలు అలక్ష్యం చేస్తున్నారనే బాధ కూడా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఈ విషయంలో అవహేళనలు కూడా ఎదురుకావచ్చు. కొన్ని ప్రముఖ పట్టణాల్లో సర్జరీల తర్వాత వృద్ధుల కోసం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ సర్జరీ అనంతరం కావాల్సిన సేవలను 3–8 వారాల పాటు అందిస్తారు. ప్రత్యేక రూమ్, నర్స్, అటెండెంట్ తదితర సేవలు పొందొచ్చు. వైద్యులు కూడా వచ్చి చూసి వెళుతుంటారు. కైట్స్ సీనియర్ కేర్‌తోపాటు కేర్ హాస్పిటల్ తదితర కొన్ని సంస్థలు ఈ తరహా సేవలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే రోజువారీ రూ.3,000–4,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వృద్ధులకు ఉన్న సమస్యల ఆధారంగా ఈ వ్యయం మారుతుంది. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారిపై ఆధారపడిన పెద్దలకు తాత్కాలికంగా ఇలాంటి కేంద్రాల్లో సేవలు అందించొచ్చు. ఒకవైపు భవిష్యత్తులో పెద్దల సంక్షేమం కోసం అయ్యే వ్యయాలకు ప్రణాళిక రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో.. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం కావడం కూడా అంతే అవసరం. ప్రణాళిక ఎలా..? తమపై తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారి కంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి. వీలైతే 45 ఏళ్లలోపు, అది వీలు పడకపోతే 60 ఏళ్లలోపు తప్పకుండా తీసుకోవాలి. దీంతో ఏదైనా ఆరోగ్య సమస్యతో వారు హాస్పిటల్లో చేరితే, అయ్యే వ్యయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక చరిత్ర గురించి ఒక్కసారి విశ్లేషించుకోవాలి. తల్లిదండ్రులను అడిగి, వారి తల్లిదండ్రులు, సోదరుల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం, ఆర్థరైటిస్, డిమెన్షియా, గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ తదితర సమస్యలు ఉన్నాయేమో విచారించాలి. క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను కూడా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాలసిస్, ఓరల్ కీమోథెరపీ తదితర చికిత్సలకు డేకేర్ కింద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అలాగే, హోమ్‌కేర్ కవర్ కూడా ఉండాలి. దీనివల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ పొందొచ్చు. అయినప్పటికీ ఇంట్లో అటెండెంట్, హోమ్ నర్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకే అయ్యే చార్జీలను కంపెనీలు చెల్లించవు. నెలకు ఒక అటెండెంట్ సేవలు పొందేందుకు మెట్రోల్లో అయితే రూ.25,000–30,000, చిన్న పట్టణాల్లో అయితే రూ.15,000–20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంటి వద్దే నర్స్ సేవల కోసం నెలవారీ వ్యయాలు 25–40 శాతం అధికంగా అవుతాయి. అందుకే ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల తర్వాత ఆర్థికంగా సతమతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం రూపంలో ఖర్చులు ఎదురైన సమయంలోనే పిల్లల ఉన్నత విద్య, ఇతర కీలక లక్ష్యాలు తారసపడతాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అత్యవసర నిధిని కూడా సమకూర్చుకోవడం అంతే అవసరమనేది ఆర్థిక నిపుణుల సూచన. నిజానికి తల్లిదండ్రుల కోసం కొంత ఫండ్‌ను సిద్ధంగా ఉంచుకునే వారు అరుదుగా కనిపిస్తారు. అవసరం అయితే జీవన వ్యయాలను కొంత తగ్గించుకుని అయినా, తమపై ఆధారపడి వారి కోసం అత్యవసర నిధిని సమకూర్చుకోవాలే కానీ, వాయిదా వేయరాదని నిపుణుల సూచన. కనుక తల్లిదండ్రులు లేదా తమపై ఆధారపడిన అత్త మామల వృద్ధాప్య సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. -
మహిళలూ.. డబ్బులు సంపాదిస్తుంటే.. పెట్టుబడులు ఎలా పెట్టాలో ఇలా తెలుసుకోండి!
పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా.. నేడు మహిళలకు సముచిత స్థానం ఏర్పడింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పురుషులతో సమానంగా మహిళలూ సొంతం చేసుకుంటున్నారు. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవడం లేదు. కెరీర్ కొనసాగిస్తూ, ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారు. ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడుతూ, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో, తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల విధానాలు, ప్రణాళికలు అవసరం అవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు, ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు, మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడక్కర్లేకుండా తమ సంపదను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం. ఈ దిశగా ఏం చేయాలన్నది చర్చించే కథనమే ఇది. మహిళలే ఎందుకు? మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలను భర్త లేదా తండ్రికే విడిచిపెడుతుంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది. కానీ, ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు, నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు..? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. కారు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి ట్రిప్లెక్స్ విల్లా సమకూర్చుకోవాలని, సెలవుల్లో ఎక్కడికైనా పర్యటించి రావాలనే కోరికలు, లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన అడుగులు పెట్టుబడుల రూపంలో వేయాలి. ఆర్థిక, పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జనా పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే ఈ విషయాలు తెలిసి ఉండడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ బాధ్యతల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం కెరీర్ మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటుంటారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కనుక మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి. నైపుణ్యాలు అవసరం.. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి? అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తేల్చుకోవాలి. పెట్టుబడుల్లో దేనికీ గ్యారంటీ ఉండదు. వివిధ సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందించే పోర్టళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడుల ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దె ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి, తప్పనిసరి కాదు అని రెండు భాగాలు చేసుకోవాలి. విచక్షణారహితం కానివి అంటే.. ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు తదితరాలు. విచక్షణారహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీ ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. లక్ష్యాలపై స్పష్టత.. పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి. అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, ఐదేళ్లు, పదేళ్లు? ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. లేదంటే 5–10 ఏళ్లలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. లేదంటే 20–30 ఏళ్లకు వచ్చే రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి నిధిని సమకూర్చుకోవడం కావచ్చు. ఇలా లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో దానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు నెలవారీగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అత్యవసర నిధి అన్నింటికంటే ముందు అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఏ కారణం వల్ల అయినా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్ట కాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సాయంతో గట్టెక్కవచ్చు. సాధారణంగా అత్యవసర నిధి మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంక్ ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే, ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేయాలి. బీమా రక్షణ మహిళలకు జీవిత బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా, కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, వారిపై ఆధారపడిన వారు ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. జీవిత బీమా అంటే జీవితంపై పెట్టుబడి పెట్టేది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేది. చాలా మంది వివాహం అయి, తమకంటూ కుటుంబం ఏర్పాటైన తర్వాతే జీవిత బీమా గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదు. యుక్త వయసులోనే జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. జీవితంలో వివిధ దశల్లో, పెరిగే తమ బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ మొత్తాన్ని సవరించుకుంటూ వెళ్లాలి. ఇది భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మహిళలకు ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యల రిస్క్ ఎక్కువ. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియో నిర్వహణ మహిళలు పెట్టుబడుల నిర్వహణలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇదంతా గతం నుంచి ఉన్న ధోరణి వల్లేనని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల నిర్వహణ ఎలా? అన్న సందేహం ఎదురైతే.. ముందు తమ బలాల గురించి తెలుసుకోవాలి. రిస్క్‌కు దూరంగా సంప్రదాయ ధోరణితో ఉంటే డివిడెండ్ చెల్లించే కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు, యుటిలిటీ సంస్థలను పరిశీలించొచ్చు. రిస్క్ తీసుకునే వారు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. అయితే మొత్తం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట కాకుండా, వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం తప్పనిసరి. తమ జీవిత లక్ష్యాల సాకారానికి, మెరుగైన విశ్రాంత జీవనానికి.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు మహిళల ముందు ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం వెంటనే పెట్టుబడులు ప్రారంభించాలి. చాలా ముందుగా ఆరంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద వేగంగా వృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించి జీవిత లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతోపాటు డెట్, బంగారం తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిపుణుల నిర్వహణలో, తగినంత వైవిధ్యం, రిస్క్ బ్యాలన్స్తో నడిచే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసేంత విషయ పరిజ్ఞానం, సమయం లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం. పరిమిత పెట్టుబడితోనే ఎన్నో రకాల కంపెనీలు, రంగాల్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు కొనుగోలు వ్యయం తగ్గి, అధిక రాబడి లభిస్తుంది. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ త్వరలో..
న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్‌ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న ప్రత్యేక తీర్మానానికి షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. -
జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరాటం..!!
వరంగల్: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు. మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు. మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున.. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్ లేదా ప్లస్ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు. వారంలో పంపిణీకి సిద్ధం జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు. రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దళారులను నమ్మొద్దు.. రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
మైనార్టీ లకూ ‘లక్ష’ణమైన పథకం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ‘లక్ష’ణమైన పథకాన్ని ప్రకటించింది. స్వయం ఉపాధి పొందుతున్న, ఉపాధికి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ఒకింత ఊతమివ్వనుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నిబంధనలకు అనుగుణంగా అర్హతలను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ నిబంధనలే అమలు: ప్రభుత్వం గత నెలలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్దిదారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కొన్ని నిబంధనలు విధించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్ధారించి లబ్దిదారులకు రూ.లక్ష చెక్కులు ఇస్తోంది. మైనార్టి లకు ఆర్థిక సాయం పథకానికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 2022–23 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ పథకం కింద పరిశీలిస్తారు. వీటినే 2023–24 ఆర్థిక సాయం కింద మార్పు చేసి అర్హతల మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టి స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయమందిస్తారు. క్రిస్టియన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హతలను నిర్ధారిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 2023 జూన్ 2 నాటికి 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీస్థాయిలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో కలెక్టర్ జాబితాను ఖరారు చేస్తారు. అర్హుల జాబితాను టీఎస్ఎంఎఫ్సీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. (బాక్స్) మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మైనార్టి ల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తూ మైనార్టి ల్లోని వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తోందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్షను ప్రభుత్వం అందిస్తోందని సీఎం చెప్పారు. -
క్వాంటమ్ ఎనర్జీ, బైక్ బజార్ టైఅప్: ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ ‘క్వాంటమ్ ఎనర్జీ’, బైక్ బజార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రీ ఓన్డ్ (అప్పటికే వేరొకరు వినియోగించి విక్రయించేవి), నూతన వాహనాలకు బైక్ బజార్ రుణ సేవలు అందిస్తుంటుంది. ఈ భాగస్వామ్యం కింద వీలైనంత అధిక సంఖ్యలో క్వాంటమ్ బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బైక్ బజార్ రుణ సదుపాయం అందించనుంది. ఒక్క చార్జ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి మూడేళ్లు లేదా 90వేల కిలోమీటర్ల వరకు కంపెనీ వారంటీ ఇస్తోంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్ -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం
దేశీయ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. ప్రైవేట్ బ్యాంక్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీప్క్ పరేక్ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ వైస్ ఛైర్మన్ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్డీఎఫ్సీ షేర్ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌గా కొనసాగుతుంది. -
మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం
మోర్తాడ్(బాల్కొండ) : సొంతంగా జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి వందశాతం రాయితీపై రూ. 3 లక్షల సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘గృహలక్ష్మి’ పథకం కింద మహిళా లబ్ధిదారులకే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కేటాయింపులను తక్కువ సంఖ్యలో కొనసాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రూ. 1.50 లక్షల వరకు సాయం అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గృహ నిర్మాణ సంస్థను ప్రభుత్వం ఎత్తివేసింది. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులను వివిధ శాఖల్లో విలీనం చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంను కొనసాగించారు. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించే పథకం తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 3 వేల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు ఉన్నాయి. అంటే జిల్లాకు గృహలక్ష్మి పథకం కింద రూ.165 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసుకునేవారు స్థానికులై ఉండటమే కాకుండా తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు ఓటరై ఉండాలనే నిబంధన విధించారు. ఓటరు కార్డును దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంది. ఓటరు కాని వారికి గృహలక్ష్మి పథకం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. వరం కాదు భారమే.. గృహలక్ష్మి పథకం కింద అందే సాయం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుకలు, ఇసుక ఇతరత్రా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం పేదలకు భారం అవుతుంది. రూ. మూడు లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం కష్టమని అందువల్ల సాయం విలువను పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెండు గదులు, బాత్రూం, టాయ్లెట్లను నిర్మించాలంటే కనీసం రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
భారత్‌లో యాపిల్ క్రెడిట్ కార్డ్.. విడుదల చేసేందుకు కసరత్తు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది యాపిల్ తన స్టోర్లను భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశాన్ని సందర్శించిన ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ శశిధర్ జగదీషన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో యాపిల్ క్రెడిట్ కార్డ్ విడుదలతో పాటు ఇతర అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. తాజాగా,యాపిల్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)తో సంప్రదింపులు జరిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, టెక్ దిగ్గజం ‘యాపిల్ పే’ పేరుతో క్రెడిట్ కార్డ్‌ను తేనుందని, ఈ కార్డ్ సాయంతో రూపే ప్లాట్ ఫామ్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. భారత్‌లోని బ్యాంక్‌లు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు ట్రాన్సాక్షన్లను మరింత వేగంగా, సులభతరం చేసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బుల్ని సెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాపిల్ఏ తరహా క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేయనుందనే ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ క్రెడిట్ కార్డ్ విడుదలపై టెక్ దిగ్గజం ఆర్బీఐని సంప్రదించగా.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్‌స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం!
ప్రముఖ పెట్టుబడుల (హెడ్జ్ ఫండ్) నిర్వహణ సంస్థ మ్యాన్ గ్రూప్ పీఎల్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. 240 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారి మహిళా సీఈవోని నియమిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ల్యూక్ ఎల్లిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మహిళా సీఈవోగా రాబిన్ గ్రూ బాధ్యతలు చేపట్టనున్నారు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. 2009లో మ్యాన్ గ్రూప్‌లో చేరిన రాబిన్ గ్రూ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ల్యూక్ ఎల్లిస్ రిటైర్డ్ కానున్న నేపథ్యంలో రాబిన్ గ్రూ సీఈవోగా కార్యకాలపాలు కొనసాగించనున్నారు. 1783లో 1783లో జేమ్స్ మ్యాన్’ మ్యాన్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థ లండన్‌లోని హార్ప్ లేన్ కేంద్రంగా బ్యారెల్ తయారీ, బ్రోకరేజీ కార్యకలాపాలు ప్రారంభించింది. 200 ఏళ్ల పాటు రాయల్ నేవీకి రమ్‌ను సరఫరా చేసింది. చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను అమ్మింది. చివరికి ఆర్థిక సేవలపై దృష్టి సారించింది. అప్పటి నుంచి ఆర్ధిక సేవల రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ముఖ్యంగా కోవిడ్-19, ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలపై బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర ఆర్ధిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులు లోనయ్యే సమయంలో మ్యాన్ గ్రూప్ మాత్రం భారీ ఎత్తున ఖాతాదారుల్ని ఆకర్షించింది. వెరసి పెట్టుబడి దారులు ఆ సంస్థలో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఏడాది మార్చి నుండి మూడు నెలల్లో ఆ సంస్థలో 1.1 బిలియన్లను ఇన్వెస్ట్ చేసి విశ్లేషకుల అంచనాల్ని తలకిందులు చేసింది. చదవండి👉 అంత జీతం ఎందుకు? సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగుల ఆగ్రహం సీఈవోగా ఎల్లిస్ రాకతో 2016లో ఎల్లిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఎల్లిస్ సారధ్యంలో గణనీయమైన వృద్దిని సాధించింది. ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టే సమయంలో సంస్థ ఆస్తులు 81 బిలియన్లు ఉండగా.. అవి కాస్త 145 బిలియన్లకు పెరిగింది. హెడ్జ్ ఫండ్ అంటే? ఉదాహరణకు మ్యాన్ గ్రూప్‌లాంటి సంస్థలు పెట్టుబడి దారుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తాయి. ఆ నిధుల్ని స్టాక్‌మార్కెట్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, డిబెచర్లతో పాటు ఆదాయాన్ని గడించే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయించి.. లాభాలు పొందేలా సలహాలు ఇస్తాయి. ఆ లాభాలకు ప్రతిఫలంగా మ్యాన్ గ్రూప్‌లాంటి సంస్థలు కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేస్తాయి. చదవండి👉 ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం! -
భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్‌లో గ్రీన్ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ.. కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఫైనాన్స్, విద్యుత్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు మూడోరోజూ నష్టాలను చవిచూశాయి. ఇప్పటివరకు వెల్లడైన కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. అలాగే అంతర్జాతీయ బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 59,746 వద్ద, నిఫ్టీ ఏడు పాయింట్లు నష్టపోయి 17,653 వద్ద మొదలయ్యాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 292 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 59,453 వద్ద కనిష్టాన్ని, 59,745 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 159 పాయింట్లు నష్టపోయి 59,568 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,580 – 17,666 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి 41 పాయింట్లు పతనమై 17,619 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు చెందిన మధ్య తరహా షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆయా కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధాన వైఖరిపై ఎదురుచూపుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి(గురువారం)కి ముందు హెచ్‌సీఎల్ టెక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండున్నర శాతం నష్టపోయి రూ.1,038 వద్ద స్థిరపడింది. ► రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేరు రెండున్నర శాతం లాభపడి రూ.450 వద్ద ముగిసింది. ఆర్థిక సంవత్సరం(2022–23)లో వార్షిక ప్రాతిపదికన రూ. 12,930 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. మ్యాన్‌కైండ్ @ రూ. 1,026–1,080 ఈ నెల 25–27 మధ్య ఐపీవో రూ. 4,326 కోట్ల సమీకరణకు రెడీ న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 1,026–1,080 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 4,326 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. -
ఈవీలకు సిడ్బీ ఫైనాన్సింగ్!
ముంబై: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉత్తమ ఫైనాన్సింగ్‌కు వీలుగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బీ) పైలట్ పథకానికి తెరతీసింది. తద్వారా మొత్తం ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) పరిశ్రమ పటిష్టతకు మద్దతివ్వనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు రుణ సౌకర్యాలు కల్పించనుంది. వెరసి ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లకు ఎంఎస్ఎంఈలు, ఈవీ లీజింగ్ కంపెనీలకు ప్రత్యక్షంగా ఆర్థిక తోడ్పాడును అందించనుంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్సహా చార్జింగ్ సదుపాయాల కల్పనకు సైతం అండగా నిలవనుంది. ఈవీ ఎకోసిస్టమ్‌లో రుణాలందించేందుకు వీలుగా చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు పోటీ రేట్లకు ఫైనాన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది. -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
అమెరికా ఫైనాన్స్‌లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా
న్యూయార్క్: అమెరికా ఆర్థికరంగంలో భారత సంతతి మహిళలు సత్తా చాటారు. అత్యంత ప్రభావవంత 100 మంది మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు అనుబంధమైన బారన్ నాలుగో వార్షిక జాబితాలో రూపొందించింది. ఆర్థిక సేవల రంగంలో ఉన్నత స్థాయిలకు చేరడంతో పాటు ఈ రంగభవితను మార్చడంలో కీలక పాత్రను పోషించిన అత్యుత్తమ 100 మంది మహిళలను ఇందులో చేర్చారు. ఈ లిస్ట్‌లో జేపీ మోర్గాన్‌కు అను అయ్యంగార్, ఏరియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన మీనా లక్డావాలా-ఫ్లిన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కుచెందిన రూపాల్ జె భన్సాలి, గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్‌కు చెందిన సోనాల్ దేశాయ్, బోఫా సెక్యూరిటీస్‌కు సెక్యూరిటీస్‌కి చెందిన సవితా సుబ్రమణియన్‌కు స్థానం లభించడం విశేషం. వీరితోపాటు పాకిస్థానీ అమెరికన్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నువీన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సైరా మాలిక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అను అయ్యంగార్: బారన్ వివరాల ప్రకారం జేపీ మోర్గాన్‌లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయహెడ్గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 2020 జనవరి నుంచి ఈ విభాగానికి కో-హెడ్‌గా పనిచేశారు. స్మిత్ బిజినెస్ అడ్వైజరీ నెట్‌వర్క్‌కు కో-చైర్‌గా కూడా ఉన్నారు. అయ్యంగార్ తన భర్తతో కలిసి న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. స్మిత్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బీఏ, వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఏంబీఏ చేశారు. రూపాల్ జె భన్సాలీ(55): ఏరియల్ ఇన్వెస్ట్మెంట్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 100 వుమెన్ ఇన్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. మనీ మేనేజింగ్ కోసమే తాను పుట్టానని చెప్పుకునే మహిళలను ఫైనాన్స్‌లో పనిచేసేలా ప్రోత్సహించాలనే ఆసక్తి ఎక్కువ. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్, తరువాత రోచెస్టర్ విశ్వవిద్యాలయంనుండి ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఆమె రోటరీ ఫౌండేషన్ స్కాలర్ కూడా. సోనాల్ దేశాయ్(58): 2018లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో 137 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డ్రెస్డ్నర్ క్లీన్వోర్ట్ వాసర్స్టెయిన్, థేమ్స్ రివర్ క్యాపిటల్‌లో పనిచేసిన తర్వాత 2009లో ఆమె ఈ సంస్థలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన కరియర్ ప్రారంభించారు. మీనా లక్డావాలా-ఫ్లిన్ (45): ఒలింపిక్స్‌లో పోటీపడాలనుకునే ఉత్సాహభరితమైన జిమ్నాస్ట్. కానీ మోకాలి గాయం కారణంగా ఆమె దృష్టి ఫైనాన్స్ కెరీర్ వైపు మళ్లింది. అలా ఈక్విటీ సేల్స్ డెస్క్‌లో పనిచేస్తున్న ఫ్రైడ్మాన్, బిల్లింగ్స్ రామ్సే గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. గ్లోబల్ ఇన్‌క్లూజన్, డైవర్సిటీ కమిటీకి కో-ఛైర్‌గా పనిచేశారు. గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి కో-హెడ్గాను, 1999లో జేపీ మోర్గాన్ ఛేజ్‌లో పనిచేశారు. ఆతర్వాత గోల్డ్‌మన్ శాక్స్‌కు మారారు. సవితా సుబ్రమణియన్ (50): బ్యాంక్ ఆఫ్ అమెరికాలో యూఎస్ ఈక్విటీ, క్వాంటిటేటివ్ స్ట్రాటజీ విభాగ హెడ్‌గా ఉన్నారు. ఈక్విటీలపై యూఎస్ సెక్టార్ కేటాయింపులను సిఫార్సు చేయడం, S&P 500 ఇతర ప్రధాన సూచీలకు అంచనాలను నిర్ణయించడం చేస్తారు. అలాగే సంస్థాగత వ్యక్తిగత క్లయింట్లకు సంస్థ పరిమాణాత్మక ఈక్విటీ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. -
మీరు మీమ్స్ చేస్తారా? ఈ ఉద్యోగం మీ కోసమే.. లక్షల్లో ప్యాకేజీ కూడా!
మీమ్స్!.. సీరియస్ విషయాన్ని ఎవ్వరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడమే. అలా మీమ్స్ చేసే టాలెంట్ ఉంటే మీలో ఉందా? కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. లేదంటే ఆఫీస్‌లో కూర్చొని ఐటీ ఉద్యోగుల జీతాలకు ఏమాత్రం తీసిపోకుండా మీమ్స్ చేసుకుంటూ భారీ శాలరీ ప్యాకేజీ తీసుకోవచ్చు. ఆశ్చర్య పోతున్నారా? లేదంటే నమ్మబుద్ధి కావడం లేదా? పెరిగిపోతున్న సోషల్ మీడియా వినియోగంతో మీమ్స్ ద్వారా ఎక్కువ మందిని చేరడం చిటికెలో సాధ్యం. అందుకే పలు పేరొందిన కంపెనీలు కూడా మీమ్స్‌ని తమ బ్రాండింగ్‌కి వాడుకుంటున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇప్పుడున్న ప్రధాన వేదికలు. యూజర్ల దృష్టిని ఆకట్టుకునేలా మీమ్స్‌ని క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే చాలు. అవి వైరల్ అవుతూ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ అవుతుంది. అందుకే బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే సంస్థ మీమ్స్ తయారు చేసే మీమర్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. చీఫ్ మీమ్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష శాలరీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ విభాగాల్లో మిలీనియల్స్, జెన్‌జెడ్ (జనరేషన్ జెడ్) వయసు వారే లక్ష్యంగా మీమ్స్ తయారు చేయాలంటూ లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీమ్స్ చేసే టాలెంట్ ఉంటే చీఫ్ మీమ్ ఆఫీసర్ జాబ్ కొట్టేయండి మిలీనియల్స్ అంటే..జెన్ జెడ్ అంటే? వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో..అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి..సంపాదనలోకి వస్తున్నారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక విధానాల విషయంలో అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ఆర్థిక బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్ భరత్ రామమూర్తి కీలక స్థానంలో నియ మితులయ్యారు. భరత్‌ను నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్(ఎన్ఈసీ) డెప్యూటీ డైరెక్టర్‌గా మళ్లీ నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ బుధవారం ప్రకటించింది. వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భరత్ బైడెన్‌కు సలహాదారుగానూ వ్యవహరిస్తారు. 2020 డిసెంబర్లో భరత్ ఎన్ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదవండి: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. మరోసారి క్షిపణుల వర్షం.. -
స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..
సాక్షి, బనశంకరి: అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కగ్గలిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు వాసుదేవనపురలో శివరాజ్ (33) హెయిర్‌సెలూన్ నిర్వహిస్తున్నారు. శివరాజ్ స్నేహితులకు జామీను పడి అప్పు ఇప్పించాడు. దీంతో శివరాజ్ ప్రతివారం వడ్డీ చెల్లించేవాడు. ఇటీవల అధిక వడ్డీ చెల్లించలేదని రేణుకారాధ్య, ధను, వెంకటేశ్ అనే ముగ్గురు శివరాజ్ బైక్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసిన శివరాజ్ ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
భర్తకు తెలియకుండా అప్పులు..చివరికి అదే ఆమెను..
సాక్షి, తాడిపత్రి అర్బన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని పాతకోటలో నివాసముంటున్న షేక్ గౌస్, ఖతీజా (38) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్తకు తెలియకుండా ఖతీజా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసింది. దీంతో పాటు సొంత పూచీకత్తుపై తన ఇంటి సమీపంలోని కొందరికి అప్పులు ఇప్పించింది. ఈ క్రమంలో అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తడంతో తరచూ వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు చేరుకుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని భావించిన ఆమె శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!) -
సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ జమ చేస్తాయని మీకు తెలుసా?
2022 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు .. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు మీ బ్యాంకు ఖాతాలను ముందుగా అప్డేట్ చేయించండి. అన్ని బ్యాంకుల్లో మీకున్న అన్ని అకౌంట్లు, అలాగే మీకున్న జాయింట్ బ్యాంకు ఖాతాలు, మీరు .. మీ కుటుంబ సభ్యులు.. రెసిడెంటు కావచ్చు లేదా నాన్ రెసిడెంటు కావచ్చు .. అందరివి అన్ని ఖాతాలను అప్డేట్ చేసి విశ్లేషణ మొదలుపెట్టండి. ముందు జమలను పరిశీలించండి. ప్రతి జమకి వివరాలు వేరే లాంగ్ నోట్‌బుక్‌లో రాయండి. మీ సేవింగ్స్ అకౌంటు ఖాతాలో బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకోసారి..లేదా కొన్ని బ్యాంకులు ఆరు నెలలకోసారి వడ్డీని జమ చేస్తుంటాయి. అలాంటి పద్దుల్ని గుర్తించి అవన్నీ ఒక చోట రాయండి. సాధారణంగా ఎక్కువ మంది ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ’లైట్’గా తీసుకోకండి. ఇక మిగిలినవి మీరు నిర్వహించిన జమలు. వీటిలో .. 1. నగదు జమలు: ఈ డిపాజిట్లు ఎందుకు చేశారో తెలుసుకోండి. మొదట్లో డ్రా చేయగా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవా? లేదా అద్దెనా? పారితోషికమా? ఆదాయమా? అప్పుగా వచ్చినదా? ఎవరిచ్చారు? కుటుంబ సభ్యులా? ఇతరులా? దేని నిమిత్తం ఇచ్చారు? వందలు అయితే ఫర్వాలేదు. ఏదో కథ చెప్పొచ్చు. వేలల్లో ఉంటే సంతృప్తికరమైన జవాబు ఇవ్వండి. అమ్మకాలా? ట్యూషన్ ఫీజులా? ఆదాయమే కాదా? తగిన జాగ్రత్త వహించాలి. 2. నగదు కాని జమలు: ఇవి చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఫోన్‌పే, గూగుల్‌పే, బదిలీలు కావచ్చు. మీరే ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకు బదిలీ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. విదేశాల నుండి మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. మీ నికర జీతం కావచ్చు.. ఇంటద్దె కావచ్చు .. వడ్డీ కావచ్చు.. వ్యవసాయం మీద ఆదాయం కావచ్చు .. జీవిత బీమా .. ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తం కావచ్చు. బ్యాంకు లోన్ కావచ్చు.. అప్పు ఇచ్చి ఉండవచ్చు.. లేదా గతంలో మీరు ఇచ్చిన అప్పును వారు వెనక్కి ఇచ్చి ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కావచ్చు .. ఏదైనా స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన బాపతు కావచ్చు. ఇందులో మళ్లీ అడ్వాన్సు ఉండొచ్చు.. వాయిదాలు .. ఫైనల్ సెటిల్మెంట్ ఉండొచ్చు. సేల్స్ కావచ్చు .. ఫీజులు కావచ్చు టీడీఎస్ పోనూ మిగిలిన మొత్తమే జమవుతుంది. అప్పుడు టీడీఎస్‌తో కలిపి లెక్కలోకి తీసుకోవాలి. ఇలా ప్రతి జమని విశ్లేషించండి. ప్రత్యేకంగా ఆదాయాలు ఒక పక్కన రాయండి. ఆదాయాలు కానివి మరో పక్కన వివరంగా రాయండి. ఇక చెప్పేదేముంది. మీ ముందే ఉంది చిట్టా. పరీక్షించండి. పరికించి చూడండి ప్రతీ జమని. -
తెలుగు రాష్ట్రాల్లో ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ విస్తరణ
హైదరాబాద్: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ (యెల్లో ముత్తూట్) తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఒకే రోజున 10 శాఖలను సంస్థ సీఈవో పీఈ మథాయ్ ప్రారంభించారు. కొత్త బ్రాంచీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్య 250కి, దేశవ్యాప్తంగా 900 పైచిలుకు స్థాయి కి చేరుతుందని ఆయన తెలిపారు. నూతన శాఖల్లో బంగారం రుణాలతో పాటు బీమా, మనీ ట్రాన్స్ఫర్, సూక్ష్మ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తదితర సర్వీసులు అందించను న్నట్లు వివరించారు. రెండో విడత కింద జనవరిలో మరికొన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు మథాయ్ చెప్పారు. కంపెనీ వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. చదవండి: ఇది కదా ఆఫర్ అంటే.. ఇలా చేస్తే, కేవలం రూ.1490లకే యాపిల్ ఎయిర్‌పొడ్స్! -
స్వరా ఫైనాన్స్ కస్టమర్లకు నివాబూపా కవరేజీ
న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్‌తో నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్‌ప్రెస్ హెల్త్ – సీరియస్ ఇల్నెస్ ప్లాన్ బెనిఫిట్’ను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్ రుణ గ్రహీతలు ఈ ప్లాన్ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్‌తో కలసి ఈ పాŠల్న్తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
జీ20 అభివృద్ధికి మన స్టార్టప్ మార్గదర్శనం
ఆవిష్కరణ–ఆధారిత ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, వృద్ధికి స్టార్టప్‌లు ఇంజిన్‌గా మారాయి. ప్రతి దేశంలో పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు విలువ ఆధారిత పంపిణీ నిర్మాణంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 90 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. దీనిలో స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంది. స్టార్టప్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న ఆవిష్కరణలు సహక రిస్తాయి. పరిస్థితులకు తగిన ఆవిష్కరణలను అందిం చగల సామర్థ్యం కేవలం స్టార్టప్‌లకు మాత్రమే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో స్టార్టప్‌ల ప్రాధాన్యం, సామర్థ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్‌ల పాత్ర ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాకుండా తిరిగి ఆర్థిక చైతన్యం సాధించడానికి ఉపయోగపడింది. సుస్థిర ఆర్థిక లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు స్టార్టప్‌లు సహాయం చేస్తున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా సహకారం, ఆవిష్కరణల రంగంలో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు వేదికలనూ, సాధనాలనూ అందిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, సాంకేతిక పురోగతి, దీర్ఘకాలిక వృద్ధి, సంక్షోభ నిర్వహణ పరంగా స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషించనున్నాయి. స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటుకు ‘జీ20’కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం చొరవ తీసుకుంది. స్టార్టప్‌లకు సహకారం అందించడం, స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడానికి స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ కృషి చేస్తుంది. భారతదేశ స్టార్టప్ రంగంలో నేడు 107 యునికార్న్‌లు, 83,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన ఆవిష్కరణ రంగం సమర్థంగా పనిచేస్తోంది. భారతదేశ స్టార్టప్ రంగం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ రంగంగా గుర్తింపు పొందింది. కొత్తగా ప్రారంభించిన స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ద్వారా జీ20 దేశాలలో వ్యూహాత్మక సహకారం ద్వారా వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించి ప్రపంచంలో సమగ్ర స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. జీ20లో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు స్వయంగా చర్యలు అమలు చేస్తోంది. స్టార్టప్–20 ఎంగే జ్మెంట్ గ్రూప్ అన్ని సభ్య దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సమ న్వయం సాధించి ఆర్థిక సహకారానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రారంభ సంవత్స రంలో అమలు చేయాల్సిన మూడు ప్రాధాన్యతా అంశాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది: 1. పునాదులు, కూటముల ఏర్పాటు : జీ20 ఆర్థిక వ్యవస్థల అంతటా స్టార్టప్‌లకు బహుళ నిర్వచనాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతా అంశంగా ఏకాభి ప్రాయం ద్వారా స్టార్టప్ అంటే ఏమిటి అనే అంశానికి స్పష్టత నివ్వాలనీ, దీనికి సంబంధించిన పదజాలం రూపొందించాలనీ ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌ల కోసం హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేయడానికి ఏకాభిప్రాయ ఆధారిత నిర్వచనాలు, పదజాలం అంచనా వేయబడతాయి. అంతేకాకుండా, జీ20 ఆర్థిక వ్యవస్థల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య ప్రపంచ సహకారం పెంపొందించడానికి వ్యవస్థను రూపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం తన మొదటి లక్ష్యంగా స్టార్టప్– 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పెట్టుకుంది. 2. ఆర్థిక అంశాలు: ఆర్థిక అంశాలను రెండవ ప్రాధాన్యతా రంగంగా స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ గుర్తించింది. స్టార్టప్‌లకు సులువుగా నిధులు అందేలా చేయడం, సహకారం అందించడం, నూతన అవకా శాలు గుర్తించడం లాంటి అంశాలకు రెండవ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. 3. సమగ్ర, సుస్థిర అభివృద్ధి: కీలకమైన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు) వ్యత్యాసాలను తగ్గించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే అంశాన్ని స్టార్టప్–20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ మూడవ ప్రాధాన్యతా రంగంగా గుర్తిం చింది. దీనిలో భాగంగా ఒకే విధమైన ప్రయోజనాల కోసం వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయం (మహిళా పారిశ్రామికవేత్తలు లాంటివి) సాధించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జీ20 దేశాల్లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్–20 కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. స్టార్టప్ 20 దీనిలో భాగంగా 6 కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమం 2023 జనవరి 28న (హైదరాబాద్) జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సు 2023 జూలై 3న (గురుగ్రామ్‌లో) జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అదనంగా, భారతదేశ స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడానికి భారీ స్టార్టప్ షోకేస్ నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. జీ20 సభ్య దేశాలు ఆమోదించి అంగీకరించే విధాన ప్రకటనను స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సిద్ధం చేసి అందజేస్తుంది. చర్చల ద్వారా మార్గ దర్శకాలు, ఉత్తమ విధానాలు, వ్యవస్థలు, ముఖ్యమైన తీర్మానాల లాంటి అంశాలకు సంబంధించి స్టార్టప్–20 ప్రచురణలు తీసుకు వస్తుంది. స్టార్టప్ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారతదేశ పరిశీ లనలో ఉంది. అభివృద్ధి, సమన్వయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ వేదికగా పనిచేస్తుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. అదే స్ఫూర్తితో, స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్టప్‌లకు సహకారం అందించి అన్ని దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేస్తుంది. విభిన్న భాగస్వామ్యం ద్వారా అందరి భవిష్యత్తులో స్టార్టప్‌ను ఒక భాగంగా చేయడానికి ప్రపంచ దృక్పథంతో పనిచేయాలని స్టార్టప్–20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది. (క్లిక్ చేయండి: గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?) - డాక్టర్ చింతన్ వైష్ణవ్ మిషన్ డైరెక్టర్, అటల్ ఇన్నోవేషన్ మిషన్; స్టార్టప్–20 అధ్యక్షుడు -
ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
అయ్యో.. ఎంత ఘోరం, స్నేహితులే చంపేశారు!
యశవంతపుర: డబ్బుల విషయమై యువకున్ని అతని స్నేహితులే హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో జరిగింది. ఓంకార, విజయ్, సునీల్, ధనరాజ్లు మంచి స్నేహితులు. ఫైనాన్స్ వ్యవహారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న ఓంకార (30)ను మిగతా ముగ్గురు ఎపిఎంసీ యార్డుకు పిలుపించుకున్నారు. డబ్బు గురించి చర్చిస్తూ గొడవకు దిగారు. ఓంకారను సునీల్, ధనరాజ్, విజయ్‌లు తలపై బండరాయితో బాది హత్య చేశారు. ముగ్గురు నిందితులను తరీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ జోరు
న్యూఢిల్లీ: స్థూల అడ్వాన్స్‌లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 20 శాతం పెరిగి రూ.22,802 కోట్లకు చేరుకున్నాయని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలం నాటికి ఇది రూ.18,978 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్యాంక్ ఇచ్చిన రుణాలు 22 శాతం ఎగసి రూ.3,845 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 20 శాతం అధికమై రూ.21,726 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 13 శాతం దూసుకెళ్లి రూ.7,665 కోట్లు నమోదైంది. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) రూ.8,200 కోట్ల నుంచి రూ.10,456 కోట్లకు ఎగసింది. నిధుల కోసం చెల్లిస్తున్న వడ్డీ (కాస్ట్ ఆఫ్ ఫండ్స్) 6.81 నుంచి 6.25 శాతానికి వచ్చి చేరిందని బ్యాంక్ వివరించింది. -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్‌లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్‌దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
రుణాల జోరు..పేటీఎమ్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో భారీ స్థాయిలో రుణాలను మంజూరు చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో 84.78 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి ద్వారా రుణ విడుదల దాదాపు 8 రెట్లు ఎగసి రూ. 5,554 కోట్లను తాకింది. వెరసి రూ. 24,000 కోట్ల వార్షిక రన్‌రేట్‌కు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. గతేడాది(2021–22) క్యూ1లో 14.33 లక్షల లావాదేవీల ద్వారా రూ. 632 కోట్ల రుణాలను జారీ చేసింది. అత్యుత్తమ రుణదాత సంస్థల భాగస్వామ్యాలతో రుణాల బిజినెస్ జోరును కొనసాగిస్తున్నట్లు పేటీఎమ్ పేర్కొంది. ఈ ఏడాది క్యూ1లో రుణాల సంఖ్య సైతం 492 శాతం జంప్‌చేసి 8.5 మిలియన్లకు చేరినట్లు వెల్లడించింది. విలువ 780 శాతం దూసుకెళ్లి రూ. 5,554 కోట్లకు చేరింది. -
మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!
మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్‌ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా సీక్రెట్‌గా తీసుకునే లోన్ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్‌ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది. రహస్యంగా లోన్ మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్‌గా బ్యాంక్‌ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్‌తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్లకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే. క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్‌ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే! ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్‌కు పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్! కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. చదవండి👉 ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ -
ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...
అనంతపురం క్రైం: ‘న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే.. కుంటి నాయాలా.. వడ్డీ వ్యాపారం చేస్తావా? అంటూ పామిడి సీఐ ఈరన్న కొట్టాడు’ అని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప చేపట్టిన స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన దివ్యాంగుడు సుంకిరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆపద సమయంలో కొందరికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ప్రస్తుతం వారు ఆ డబ్బు వెనక్కు ఇవ్వకుండా తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. దీనిపై పామిడి సీఐ ఈరన్నకు ఫిర్యాదు చేస్తే తన అవిటితనాన్ని వెక్కిరించి కొట్టాడని ఫిర్యాదు చేశాడు. కాగా, స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ చక్రవర్తితో కలిసి వినతులను ఎస్పీ స్వీకరించి, పరిశీలించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. 79 సెల్ఫోన్ల అందజేత పోగొట్టుకున్న సెల్ఫోన్లను సంబంధీకులకు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అందజేశారు. సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి ఆయన సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు 94407 96812 వాట్సాఫ్ నంబర్‌కు సమాచారం అందించడంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 541 సెల్ఫోన్లను రికవరీ చేసి, 450 మంది సంబంధీకులకు అందజేసినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ మిస్సింగ్ కేసుల ఛేదింపులో నిర్లక్ష్యం తగదని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. పిల్లలు, మహిళలు, యువతులు... ఇలా కనిపించకుండా పోయిన వారిపై సంబంధీకులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి సోమవారం డీపీఓలో సీఐలతో ఆయన సమీక్షించారు. వివిధ పీఎస్‌ల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. ఛేదింపులో విఫలమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య) -
ఫైనాన్స్‌పీర్ 31 మిలియన్ డాలర్ల సమీకరణ!
హైదరాబాద్: ఎడ్యు–ఫిన్‌టెక్ స్టార్టప్ ఫైనాన్స్‌పీర్ .. సిరీస్ బీ ఫండింగ్‌లో భాగంగా 31 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆవిష్కార్ క్యాపిటల్, అమెరికాకు చెందిన క్యూఈడీ ఇన్వెస్టర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించినట్లు సంస్థ తెలిపింది. కోవిడ్–19 విజృంభించిన 2020లో కూడా 3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నట్లు .. మహమ్మారి ప్రభావంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడ్పాటు అందించినట్లు ఫైనాన్స్‌పీర్ సీఈవో రోహిత్ గజ్భియె తెలిపారు. -
రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదా, అయితే ఇందులో పెట్టుబడులే సురక్షితం!
రిస్క్ పెద్దగా ఉండొద్దని కోరుకునే వారికి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలం. తక్కువ రిస్క్ తీసుకునే వారికి, స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకం భిన్నమైన పెట్టుబడుల విధానంతో, మంచి పనితీరు చూపిస్తోంది. రాబడులు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోల్చి చూడొచ్చు. ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో వచ్చిన రాబడి 4 శాతంగా ఉంది. అదే మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో చూసినప్పుడు సగటు రాబడి 7 శాతానికి పైన ఉండడాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో 7.42 శాతం, ఐదేళ్లలో 7.32 శాతం, ఏడేళ్లలో 7.65 శాతం, పదేళ్లలో 8.23 శాతం చొప్పున రాబడులను ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. 2010 జూన్ లో ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 8.31 శాతంగా ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో 0.74 శాతంగా ఉంది. మొత్తం సెక్యూరిటీలు 146 ఉన్నాయి. సగటు మెచ్యూరిటీ 2.76 సంవత్సరాలుగా ఉంది. అధిక నాణ్యతను సూచించే ఏఏఏ రేటెడ్ బాండ్లలో 50 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీల్లో 22.48 శాతం ఇన్వెస్ట్ చేసింది. కొంచెం రిస్క్ ఉంటే ఏఏ రేటెడ్ పత్రాల్లో 15.55 శాతం, ఇంకాస్త అధిక రిస్క్‌ను సూచించే ఏ1ప్లస్ పత్రాల్లో 5 శాతం చొప్పున (అధిక రాబడులు) ఇన్వెస్ట్ చేసింది. 7.22 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పెట్టుబడుల విధానం ఈ పథకానికి అనిల్ బంబోలి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రిస్క్ తక్కువగా ఉండే విధంగా పెట్టుబడులు పెట్టడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉంది. ఎక్కువ క్రెడిట్ రిస్క్ తీసుకోకుండా మంచి రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. డ్యురేషన్ బెట్స్ (కాలవ్యవధికి సంబంధించి సెక్యూరిటీలు)కాకుండా..మంచి విలువ తెచ్చిపెడతాయనుకున్న సెక్యూరిటీలను ఎంచుకుంటారు. లోతైన పరిశోధన తర్వాతే సెక్యూరిటీల ఎంపిక ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆయా డెట్ పత్రాలను ఇష్యూ చేస్తున్న కంపెనీ యాజమాన్యం, ఆర్థిక మూలాలు, వ్యాపార బలలాను విశ్లేషించిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం ఉంటుంది. ప్రధానంగా ఆయా కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయగలుగుతాయా? అన్నది చూస్తారు. కంపెనీల నగదు ప్రవాహాలు (వ్యాపార ఆరోగ్యాన్ని సూచించేది), ఇతర రేషియోలను కూడా ఈ పథకం పరిశోధన బృందం విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఈక్విటీ పథకాల పరిశోధన బృందం అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాతే కంపెనీల డెట్ పేపర్ల నాణ్యతపై నిర్ణయానికొస్తారు. భద్రత, ఆయా సెక్యూరిటీల్లో లిక్విడిటీ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. -
పెరగనున్న పెట్రోల్ రేట్లు.. గ్రీన్ ఫైనాన్సింగ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా త్వరలోనే పెట్రోలు, డీజిలు రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నయంగా గ్రీన్ ఎనర్జీపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఫైనాన్స్ వృద్ధి, భవిష్యత్ ఎకానమీ అవసరాలు నెరవేర్చడంపై మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫైనాన్సింగ్‌లో వినూత్న విధానాలను అవలంభించాలని ప్రధాని ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేలా వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. వృద్ధి చెం దుతున్న ఆర్థిక వ్యవస్థ తక్షణ, భవిష్యత్ అవసరాలు నెరవేర్చడంలో ఇవి ఎంతో కీలకాంశాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫైనాన్సింగ్‌ను ఆయన ప్రస్తావించారు. 2070 నాటికి నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి (నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్) గ్రీన్ ఫైనాన్సింగ్ తక్షణ అవసరం ఎంతో ఉందన్నారు. ఈ దిశలో పర్యావర ణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టుల విస్తరణకు రుణ సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రధాని ప్రస్తావించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. - సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విజయవంతం కావడం అనే అంశం ఈ రంగాలకు ఫైనాన్సింగ్‌ను బలోపేతం చేయడంపై ఆధారపడి ఉంటుంది. - ఫిన్‌టెక్, అగ్రిటెక్, మెడిటెక్, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలలో దేశం ముందుకు సాగే వరకు దేశంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం సాధ్యం కాదు. - నిర్మాణం, స్టార్టప్‌లు, డ్రోన్లు, అంతరిక్షం, జియో–స్పేసియల్ డేటా వంటి 8 నుంచి 10 రంగాలకు ప్రత్యేక గుర్తింపు అవసరం. ఆయా రంగాల్లో పురోగతి ద్వారానే భారత్ టాప్–3లో ఉండగలుగుతుంది. ఈ రంగాల పురోగతికి ఆర్థిక సంస్థల రుణ మద్దతు ఎంతో అవసరం. - స్టార్టప్‌లకు రుణ దాతలకు ఆయా అంశాలకు సంబంధించి భవిష్యత్తు గురించిన లోతైన అవగాహన అవసరం. అలాంటప్పుడే స్టార్టప్‌ల కార్యకలాపాల విస్తరణ, ఆవిష్కరణలు, కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ జరుగుతుంది. - ఆరోగ్య రంగంలో కృషి, పెట్టుబడి అంశాలను పరిశీలిస్తే, వైద్య విద్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి మరిన్ని వైద్య సంస్థలను కలిగి ఉండటం చాలా కీలకం. - బ్యాంకులు ఎగుమతిదారులకు ప్రాధాన్యతా ప్రాతిపదికన నిధులు అందజేస్తే ఈ రంగం మరింత బలోపేతం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం విజవంతానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. - సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఎవరైనా సహజ వ్యవసాయంలో కొత్త పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారంటే, అతనికి ఏ విధంగా సహకరించాలో ఆర్థిక సంస్థలు ఆలోచించాలి. - 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేయడానికి బ్యూరోక్రాట్స్ ’క్రియాశీల కార్యాచరణ’తో ముందుకు రావాలి. చదవండి: ప్రైవేటీకరణపై ప్రధాని కీలక సమావేశం -
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
వివాహేతర సంబంధం: సుపారీ ఇచ్చి ప్రియుడి కిడ్నాప్, పెళ్లి.. సినీ ఫక్కీలో ఘటన
సాక్షి, వరంగల్: మూడ్రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని కమలాపురంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసును నర్సంపేట పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విచారణను మమ్మురం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ను శుక్రవారం పోలీసులు ఓ కొలిక్కి తీసుకువచ్చారు. నర్సంపేట మున్సిపాలిటి పరిధి 2వ వార్డు కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు మద్యం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు పైనాన్స్ (రోజువారీ చిట్టి) ఇచ్చాడు. రోజూ ఆమె ఇంటికి వెళ్తూ చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. చదవండి: వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని.. ఈ క్రమంలో వారిద్దరూ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో గతేడాది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఇచ్చిన అప్పు పోను కొంత నగదు ఆమెకు చెల్లించాలని తీర్మానం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ విషయం బయటకు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళా శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే సుపారీ గ్యాంగ్‌ను కలిసి కొంత నగదును అడ్వాన్స్‌గా అప్పగించింది. చదవండి: పెగాసస్‌పై న్యూయార్క్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం దీంతో సుపారీ గ్యాంగ్ ఈనెల 26న శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసింది. శ్రీనివాస్‌ను కొట్టి ఆమెతో దండలు మార్పించినట్లు సమాచారం. శ్రీనివాస్ కుమారుడు భరత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్ ట్రాక్ చేసి నర్సంపేట సీఐ పులి రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సుపారి గ్యాంగ్ పరారయ్యింది. పోలీసులు శ్రీనివాస్ ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. దీనిపై స్థానిక సీఐ పులి రమేశ్‌ను వివరణ కోరగా.. ముత్యం శ్రీనివాస్ కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చూపిస్తామని తెలిపారు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు