ప్రముఖ పెట్టుబడుల (హెడ్జ్ ఫండ్) నిర్వహణ సంస్థ మ్యాన్ గ్రూప్ పీఎల్‌సీ సంచలన నిర్ణయం తీసుకుంది. 240 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారి మహిళా సీఈవోని నియమిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ల్యూక్ ఎల్లిస్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మహిళా సీఈవోగా రాబిన్ గ్రూ బాధ్యతలు చేపట్టనున్నారు.
వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. 2009లో మ్యాన్ గ్రూప్‌లో చేరిన రాబిన్ గ్రూ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ల్యూక్ ఎల్లిస్ రిటైర్డ్ కానున్న నేపథ్యంలో రాబిన్ గ్రూ సీఈవోగా కార్యకాలపాలు కొనసాగించనున్నారు.
1783లో
1783లో జేమ్స్ మ్యాన్’ మ్యాన్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థ లండన్‌లోని హార్ప్ లేన్ కేంద్రంగా బ్యారెల్ తయారీ, బ్రోకరేజీ కార్యకలాపాలు ప్రారంభించింది. 200 ఏళ్ల పాటు రాయల్ నేవీకి రమ్‌ను సరఫరా చేసింది. చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను అమ్మింది. చివరికి ఆర్థిక సేవలపై దృష్టి సారించింది. అప్పటి నుంచి ఆర్ధిక సేవల రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.
ముఖ్యంగా కోవిడ్-19, ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలపై బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర ఆర్ధిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులు లోనయ్యే సమయంలో మ్యాన్ గ్రూప్ మాత్రం భారీ ఎత్తున ఖాతాదారుల్ని ఆకర్షించింది. వెరసి పెట్టుబడి దారులు ఆ సంస్థలో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఏడాది మార్చి నుండి మూడు నెలల్లో ఆ సంస్థలో 1.1 బిలియన్లను ఇన్వెస్ట్ చేసి విశ్లేషకుల అంచనాల్ని తలకిందులు చేసింది.
చదవండి👉 అంత జీతం ఎందుకు? సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగుల ఆగ్రహం
సీఈవోగా ఎల్లిస్ రాకతో
2016లో ఎల్లిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఎల్లిస్ సారధ్యంలో గణనీయమైన వృద్దిని సాధించింది. ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టే సమయంలో సంస్థ ఆస్తులు 81 బిలియన్లు ఉండగా.. అవి కాస్త 145 బిలియన్లకు పెరిగింది.
హెడ్జ్ ఫండ్ అంటే?
ఉదాహరణకు మ్యాన్ గ్రూప్‌లాంటి సంస్థలు పెట్టుబడి దారుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తాయి. ఆ నిధుల్ని స్టాక్‌మార్కెట్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, డిబెచర్లతో పాటు ఆదాయాన్ని గడించే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయించి.. లాభాలు పొందేలా సలహాలు ఇస్తాయి. ఆ లాభాలకు ప్రతిఫలంగా మ్యాన్ గ్రూప్‌లాంటి సంస్థలు కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేస్తాయి.
చదవండి👉 ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం!
Comments
Please login to add a commentAdd a comment