ముంబై: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉత్తమ ఫైనాన్సింగ్‌కు వీలుగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బీ) పైలట్ పథకానికి తెరతీసింది. తద్వారా మొత్తం ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) పరిశ్రమ పటిష్టతకు మద్దతివ్వనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు రుణ సౌకర్యాలు కల్పించనుంది.
వెరసి ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లకు ఎంఎస్‌ఎంఈలు, ఈవీ లీజింగ్ కంపెనీలకు ప్రత్యక్షంగా ఆర్థిక తోడ్పాడును అందించనుంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్‌సహా చార్జింగ్ సదుపాయాల కల్పనకు సైతం అండగా నిలవనుంది. ఈవీ ఎకోసిస్టమ్‌లో రుణాలందించేందుకు వీలుగా చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు పోటీ రేట్లకు ఫైనాన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment