
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ వేదికను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుని వినియోగదార్లు సులభంగా కారు రుణం పొందవచ్చు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ సేవలను 2020 డిసెంబరులో కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టింది. ఇప్పుడీ వేదికను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.
కస్టమర్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించేందుకు కంపెనీ 14 బ్యాంకులతో చేతులు కలిపింది. వీటిలో నచ్చిన బ్యాంకును కస్టమర్లు ఎంచుకోవచ్చు. ‘షోరూంలకు వచ్చే ముందే కార్లు, ఫైనాన్స్ వివరాల కోసం వినియోగదార్లు ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. మారుతున్న కస్టమర్ల తీరును దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చింది. ఈ సేవలు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల పైచిలుకు విజిటర్లు నమోదయ్యారు’ అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment