Digitalisation
-
పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్
వికసిత భారత్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' సిడ్నీలో పారిశ్రామిక ప్రముఖులు & ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భారత్.. ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను గురించి ప్రస్తావించారు.భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. ఇరు పక్షాల మధ్య సహకారం, భవిష్యత్ అవకాశాల గురించి చర్చించడం ఆనందంగా ఉందని గోయల్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.గోయల్ తన పర్యటనలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'రాబిన్ ఖుదా'తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో డిజిటలైజేషన్ వృద్ధి గురించి మాత్రమే కాకుండా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య డేటా మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం గణనీయమైన సంభావ్యత గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్భారత్ డిజిటలైజేషన్లో వేగంగా పురోగమిస్తోంది. కాబట్టి డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీతో నడిచే మౌలిక సదుపాయాల వంటి వాటి పెట్టుబడులకు దేశం కేంద్రంగా మారింది. ఇండియా గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మారాలంటే.. టెక్ రంగంలో జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాల సంభావ్యత చాలా అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.Excellent meeting with Australia’s leading Super Funds, where we explored significant investment opportunities within India's dynamic growth sectors.Also, discussed avenues to enhance collaboration, giving further boost to India-Australia trade and investment ties. 🇮🇳🤝🇦🇺 pic.twitter.com/Bq36vWncw1— Piyush Goyal (@PiyushGoyal) September 23, 2024 -
‘80 కోట్ల భారతీయుల జీవితాలను మార్చిన స్మార్ట్‌ఫోన్’
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది. -
డిజిలైజేషన్లో భారత పురోగతి అద్భుతం: మైక్రోసాఫ్ట్ బ్రాడ్ స్మిత్
2023 సెప్టెంబరులో జరగనున్న జీ20 సదస్సుకు సన్నాహకంగా ప్రపంచ వ్యాపార దిగ్గజాలు న్యూఢిల్లో శుక్రవారం సమావేశమైనారు. ఈ సందర్బంగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలకు కల్పనకు, వృద్ధికి దారి తీస్తుందన్నారు. ఏఐ సంభావ్య ప్రమాదాలు, చాట్ జీపీటీ వంటి ఉత్పాదక సాధనాల భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు ఇవి ఖచ్చితంగా ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి, అయితే ఏఐ మానవ నియంత్రణలో ఉండాలన్నారు. దీనికి సంబంధించిన తనిఖీలు, బ్యాలెన్సింగ్ సిస్టం అవసరమన్నారు. విప్లవాత్మక ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా ఫ్యూచర్ నాలెడ్జ్‌కు ఇవి చాలా ముఖ్యం అని చెప్పారు. ఏఐ ఉద్యోగాలకు మూలం ఏఐ అంటే మ్యాజిక్ కాదు ఏఐ అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడానికి, సమాధానాల్ని మరింత త్వరగా కనుగొనడంలో సహాయపడే ఒక సాధనం .. ఏఐ మనల్నిమరింత విజయ వంతం చేయగలదు. అలా అని మనం ఆలోచించడం మానుకోకూడదు. ఇది మరింత వృద్ధికి ఉద్యోగాల సృష్టికి మూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మైక్రోసాఫ్ట్ బాస్ వెల్లడించారు. అంతేకాదు గత ఏడాది లాంచ్ అయిన ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీపై మరింత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వ్యాధులను నిర్ధారించడంలో వైద్యులను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. వ్యాధులను నయం చేయడానికి కొత్త మందుల్ని కనుగొనడంలో సహాయపడుతుంది, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులకు ట్యూటర్‌గా ఉపయోగ పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా దాదాపు 600 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా గట్టి ప్రభావం చూపుతుందనీ, ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని స్మిత్ అన్నారు. ఏఐ అంటేమ్యాజిక్ కాదు. నాలెడ్జ్‌కి ఇండిపెండెంట్ సోర్స్. అది గణితం. ఏఐ వల్ల ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించా లనేదే తమ లక్ష్యమని, అయితే టెక్నాలజీ మన కంట్రోల్లో ఉండాలనే గుర్తుంచుకోవాలని తెలిపారు. డిజిలైజేషన్లో అద్భుతం అలాగే డిజిటలైజేషన్లో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ దశాబ్దం ఆరంభం నుండి అభివృద్ధి చెందిందని, డిజిటల్ చెల్లింపుల్లో ఇంత త్వరగా అభివృద్ది సాధించిన మరో దేశాన్ని తాను చూడలేదని చెప్పారు. -
‘లోకోస్’లో స్వయం సహాయక సంఘాల సమాచారం
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోకోస్ యాప్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని స్వయం సహయక సంఘాల పూర్తి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కలు, సంఘాల పనితీరు, సంఘాలలోని సభ్యుల సంఖ్యను బుక్ కీపింగ్ లేదా మొబైల్ బుక్ కీపింగ్, సెర్ప్ అకౌంటింగ్ యాప్, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. కాని ఈ యాప్‌ల కంటే అడ్వాన్స్డ్గా యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా సంఘాలలోని సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి బ్యాంక్ రుణాలు, పొదుపు లెక్కలు ఒక్క సంఘానికి సంబంధించినవి మాత్రమే తెలుసుకునే వెసులుబాటు ఉండేది. డిజిటలైజేషన్ ద్వారా అన్ని సంఘాలు చైతన్యవంతమయ్యాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అప్పులు, పొదుపు లెక్కలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాల సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లలో పొందుపరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తుంటే కేంద్రం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, (వీఎల్ఆర్) మంజూరు చేస్తుంది. ఈ లోకోస్ యాప్ పనితీరుపై ఇప్పటికే సెర్ప్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. రెండు నెలల క్రితమే యాప్‌లో సంఘాల సమాచారం పొందుపర్చాల్సి ఉండగా వీవోఏల సమ్మె కారణంగా నమోదు ప్రక్రియ ప్రారంభంకాలేదు. శిక్షణ కల్పిస్తున్నాం లోకోస్ యాప్ విధి విదానాలను సెర్ప్ సిబ్బందికి శిక్షణ శి?్బరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ అనంతరం సంఘాల సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తాం. – శ్రీనివాస్, అడిషనల్ డిఆర్డివో, మంచిర్యాల -
హైదరాబాద్‌కి ఓకే చెప్పిన గ్రిడ్ డైనమిక్స్
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందు కోసం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నియమకాలు చేపట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు. గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లియోనార్డో లివ్‌షిట్జ్ ఈరోజు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. సంస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇరువరు చర్చించారు. త్వరలోనే ఆఫీసు ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి మంది వర్క్‌ఫోర్స్‌తో పనులు నిర్వహిస్తామని గ్రిడ్ డైనమిక్స్ తెలిపింది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో గ్రిడ్ డైనమిక్స్ సంస్థ డిజటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో పని చేస్తోంది. Hyderabad continues to be the hotbed for Multinational Companies!! Met with Leonard Livschitz, CEO @GridDynamics a digital transformation company with offices across the US & Europe GRID DYNAMICS opens its first presence in India with headcount to reach 1,000 by end of the year pic.twitter.com/UdopmoLf0X — KTR (@KTRTRS) May 9, 2022 చదవండి: Cryptocurrency: క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్.. -
గూగుల్.. హైదరాబాద్‌లో భారీ క్యాంపస్.. తెలంగాణతో ఒప్పందం
దిగ్గజ కంపెనీ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా డిజిటలైజ్ అయ్యే క్రమంలో భాగంగా గూగుల్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తాలు పాల్గొన్నారు. గూగుల్, తెలంగాణ ప్రభుత్వంల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల డిజిటలీకరణ, మహిళలు, యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణతో పాటు అవసరమైన మద్దతును గూగుల్ అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి యువతకు కెరీర్ ఓరియెంటెండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. వీటితో పాటు పౌర సేవలు మరింత సులభతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీని గూగుల్ అందిస్తుంది. మరోవైపు అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్ నిర్మాణ పనులను గూగుల్ ప్రారంభించింది. గచ్చిబౌలిలో 2019లో గూగుల్ 7.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో 23 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇందులో 3.30 మిలియన్ చదరపు అడుగుల వర్క్‌స్పేస్ అందుబాటులోకి వచ్చేలా భవనాన్ని గూగుల్ డిజైన్ చేసింది. చదవండి: 4వేల కోట్లతో యూఎస్ కంపెనీని కొనుగోలు చేసిన విప్రో! -
ఇండియా డేటా ఆఫీస్.. ఇది అందుబాటులోకి వస్తే...
న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కసరత్తు చేస్తోంది. డేటా అందుబాటులో ఉండటం, వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వ విధానం ముసాయిదాను రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ముసాయిదా సిద్ధం ఇప్పటికే రూపొందించిన ముసాయిదా ప్రకారం వివిధ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఆధీకృత ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వం సేకరించే డేటా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి డిఫాల్టుగా వివిధ విభాగాలు, సంబంధిత వర్గాలు ఒకరికొకరు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక మోస్తరుగా ప్రాసెస్ చేసిన డేటా ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, పరిమితులు వర్తించే డేటాను పొందేందుకు కొంత రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అది ఎంత మొత్తం ఉండాలనేది.. ఆయా విభాగాలు, ఏజెన్సీలు పారదర్శకంగా నోటిఫై చేయాలి. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 18లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీస్.. ఇలా డేటా యాక్సెస్, షేరింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ‘ఇండియా డేటా ఆఫీస్’ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ ప్రతిపాదించింది. వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇది సంప్రదింపులు కూడా జరపాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీసర్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల చీఫ్ డేటా ఆఫీసర్లు ఇందులో భాగంగా ఉంటారు. ‘ప్రతి శాఖ/విభాగంలో చీఫ్ డేటా ఆఫీసర్ల నేతృత్వంలో డేటా మేనేజ్మెంట్ యూనిట్లు ఉండాలి. డేటా పాలసీ అమలు కోసం ఇండియా డేటా ఆఫీస్‌తో ఇవి కలిసి పనిచేయాలి‘ అని పేర్కొంది. డిజిటల్ ఎకానమీ భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదిగే క్రమంలో డేటాను సమర్థమంతంగా వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుందని ముసాయిదా పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే .. ప్రస్తుత, కొంగొత్త టెక్నాలజీలకు అనుగుణంగా నాణ్యమైన డేటాను అందుబాటులో ఉంచడం, వినియోగం మెరుగుపర్చాలన్నది డేటా పాలసీ లక్ష్యమని తెలిపింది. మరోవైపు, పౌరుల వివరాల గోప్యత కాపాడేందుకు ఉపయోగపడే ప్రతిపాదనలు కూడా ఇందులో ప్రస్తావించారు. -
హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్‌స్పాట్ సెంటర్లు.. ఎక్కడంటే..
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ డెటాను డిజిటలైజ్ చేస్తున్నామని.. త్వరలో బస్తీ దవాఖానాలు, మాల్స్‌లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్ స్పాట్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాక్ట్ ఫైబర్ నెట్‌వర్క్‌తో కలిసి హైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హాట్ స్పాట్ల ద్వారా ప్రతిరోజు 1 జీబీ డేటాను.. 45 నిమిషాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. -
కారు రుణం మరింత సులువు
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ వేదికను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుని వినియోగదార్లు సులభంగా కారు రుణం పొందవచ్చు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ సేవలను 2020 డిసెంబరులో కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టింది. ఇప్పుడీ వేదికను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించేందుకు కంపెనీ 14 బ్యాంకులతో చేతులు కలిపింది. వీటిలో నచ్చిన బ్యాంకును కస్టమర్లు ఎంచుకోవచ్చు. ‘షోరూంలకు వచ్చే ముందే కార్లు, ఫైనాన్స్ వివరాల కోసం వినియోగదార్లు ఆన్లైన్లో వెతుకుతున్నారు. మారుతున్న కస్టమర్ల తీరును దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చింది. ఈ సేవలు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల పైచిలుకు విజిటర్లు నమోదయ్యారు’ అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
నిర్మలమ్మ స్ఫూర్తితో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ 2021 ను కాగితం లేకుండా ప్రవేశపెట్టింది. చరిత్రలో మొదటిసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూట్‌కేసుతో కాకుండా ట్యాబ్ పట్టుకొచ్చి పార్లమెంట్లో చదివి వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్ బడ్జెట్ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ట్యాబ్స్ కొనాలని సూచించింది. ‘కాగితం లేకుండా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం.. అందరూ ట్యాబ్‌లు కొనండి’ అంటూ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఆ ట్యాబ్‌ల కోసం రూ.50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారంతా ట్యాబ్స్ కొనుగోలు చేస్తే రూ.50 వేలు చెల్లిస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అది కూడా యాపిల్ ట్యాబ్స్ కొనాలని సూచించింది. దీనికోసం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేయనుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోపు ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలో మార్చేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రులు కూడా ఈ కేబినేట్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కాగితం రహిత బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు. -
డిజిటల్ బాటలో యూనివర్సిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలను డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వర్సిటీల కార్యకలాపాలను ఆన్లైన్లోనే.. అత్యంత పారదర్శకంగా కొనసాగించనున్నారు. విద్యా శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా వర్సిటీల్లో అన్ని కార్యకలాపాలను ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(విద్యా శాఖ) సతీష్‌చంద్ర కొద్దిరోజుల క్రితం వర్సిటీలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. వర్సిటీల సమాచారం మొత్తం ప్రభుత్వ సర్వర్‌తో అనుసంధానించాలని పేర్కొన్నారు. మీట నొక్కగానే మొత్తం సమాచారం తెలిసేలా ఉండాలని సూచించారు. వర్సిటీల మధ్య ఇంటర్నల్ నెట్వర్క్ యూనివర్సిటీల్లోని అన్ని వ్యవస్థలు, కార్యకలాపాలను కంప్యూటరీకరణ చేస్తారు. సేవలను ఆన్లైన్లోనే అందిస్తారు. పేపర్ వర్కు అనేది లేకుండా అన్ని వర్సిటీల్లోనూ ఈ–ఆఫీసులను అభివృద్ధి పర్చనున్నారు. ఈ–ఆఫీసు ద్వారా అన్ని విభాగాలను అనుసంధానిస్తారు. విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ సేవలను అందించడానికి వర్సిటీలన్నింటి మధ్య ఇంటర్నల్ నెట్వర్కును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలకు సహకరించేందుకు నోడల్ ఏజెన్సీగా సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిస్టమ్స్ వ్యవహరించనుంది. ప్రవేశాలు ఆన్లైన్లోనే.. యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయనున్నారు. దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా జియో బయోమెట్రిక్‌ను అనుసరిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి తీసుకురావాలని వర్సిటీలకు విద్యాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. పరిశోధనలకు పెద్దపీట అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పరిశోధనలు మొక్కుబడిగా మాత్రమే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు అత్యధికంగా నిధులు అందిస్తోంది. పరిశోధనలు లేనందున రాష్ట్ర యూనివర్సిటీలు ఆ నిధులను పొందలేకపోతున్నాయి. పరిశోధనలపై దృష్టి పెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణల పరంగానే కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వాటి సామర్థ్యాలను బట్టి ఒక నిర్దిష్ట రంగంలో పరిశోధనల కోసం ఒక సమగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్సిటీల ఉపకులపతులు, ఆయా విభాగాధిపతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
ఇక పంచాయతీల్లోనే డిజిటల్ సేవలు
సాక్షి, అద్దంకి: గత ప్రభుత్వాలు కాగిత రహిత పాలన ఈ–పంచాయతీ అంటూ ప్రచారం చేసుకున్నా అమలుకు నోచుకోలేదు. ప్రచార ఆర్భాటం కోసం వ్యయం చేసిన కోట్లు వృథా చేయడం మినహా ఏ పథకం పంచాయతీ స్థాయిలు అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. రెండు, మూడు పంచాయతీలకు ఒక కంప్యూటరు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ–పంచాయతీ ఆశించిన మేర ఫలితాలు రాక కాగిత రహిత పాలన అటకెక్కింది. అయితే నూతన ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రామ సుపరిపాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించడంతోపాటు, నెట్ సౌకర్యం, ఆధునాత కంప్యూటరు, ఇతర పరికరాలను ఇచ్చారు. దీంతో ఈ–పంచాయతీ పటిష్టంగా అమలై తమ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. పారదర్శక సేవల కోసమే డిజిటల్ అసిస్టెంట్.. ప్రతి 50 గృహాలకు ఒక వలంటీరును నియమించిన ప్రభుత్వం, వారి ద్వారా సేకరించిన సమాచారిన్ని డిజిటలైజేషన్ చేయడానికి, ఇతర రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఆధార్ కార్డు, తదితర సేవను పారదర్శకంగా గ్రామ స్థాయిలోనే అందించడం కోసం, ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అందులో డిజిటల్ సేవలను పారదర్శకంగా చేయడం కోసం ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించింది. డిజిటల్ అసిస్టెంట్ విధులివే.. 1. గ్రామ సచివాలయంలో నియమించిన డిజిటల్ అసిస్టెంట్ గ్రామ వలంటీర్లు సేకరించిన గృహాల డేటాను కంప్యూటరీకరించాలి. 2. దరఖాస్తు రూపంలో అందిన సమస్యలను ఆయా శాఖల వారీగా విభజించి గ్రామ కార్యదర్శికి పంపాలి. 3. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అడిగిన సమాచారాన్ని స్నేహపూర్వకంగా అందించాలి. 4. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను జవాబుదారీ తనం కోసం రసీదులు ఇవ్వడం, ఉత్తర ప్రత్యుత్తరాలు, రికార్డు చేయడం, రికార్డుల్లో రాయడం చేయాలి. 5. అందిన దరఖాస్తును చెక్ లిస్ట్ సహాయంతో ప్రాధమిక పరిశీలన చేసి స్వీకరించాలి. 6. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన దరఖాస్తు ఏ విధంగా నింపాలో వివరించి చెప్పాలి. 7. గ్రామ సచివాలయంలో ఉండే మొబైల్ అప్లికేషన్స్, ట్యాబ్‌లు, కంప్యూటరు సిస్టమ్స్, వంటి వాటికి సాంకేతిక మేనేజరుగా వ్యవహరించాలి. 8. జనన, మరణాలు ఆన్లైన్ చేయడం, ఆస్తి మదింపు పన్ను, డిమాండ్ మొదలైన స్థానిక ప్రభుత్వ డేటాను యాప్స్‌లో నమోదు చేసి ఆన్లైన్ చేయాలి. ఇలాంటి సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసమో, దరఖాస్తులు నింపడం కోసమో ఎవరి దగ్గరకు వెళ్లనవసరం లేదు. మండల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సబందించిన అన్ని పనులు గ్రామ సచివాలయంలోనే అవుతాయని చెప్పవచ్చు. -
మూడు దశల్లో ‘పెట్టుబడి’ సాయం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని మూడు దశల్లో అందజేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రెవెన్యూ శాఖ చేపట్టిన భూప్రక్షాళన రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జాప్యం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిజిటలైజేషన్ అవుతున్న భూముల వివరాలను ఎప్పటికప్పుడు తీసుకుని ఆ మేరకు రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తామని పేర్కొంటున్నాయి. వచ్చే నెల 19న చెక్కుల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టి.. 45 రోజుల్లో రైతులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కో దశలో కచ్చితంగా ఇంత మందికి పంపిణీ చేయాలన్నట్టుగా కాకుండా.. వీలైనంత మంది రైతులకు ఇస్తూ, మూడు దశల్లో మొత్తం పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి, బ్యాంకులకు కూడా నిధుల సమస్య, కరెన్సీ కొరత వంటివి తలెత్తకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు అందజేయాల్సి ఉండగా.. ఆరు బ్యాంకులకు ఈ బాధ్యతను అప్పగించారు. అందులో ఒక్క ఎస్బీఐ ద్వారానే 18 లక్షల మందికి చెక్కుల పంపిణీ జరగనుంది. మిగతా ఐదు బ్యాంకులు మిగతా రైతులకు చెక్కులు పంపిణీ చేస్తాయి. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయిన భూముల వివరాలను, రైతుల సమాచారాన్ని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకులకు అందజేస్తుంది. ఆ ప్రకారం చెక్కులను ముద్రించి జిల్లాలకు పంపిస్తారు. ఖరీఫ్‌లోనే రూ.6,600 కోట్లు.. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఎకరాలకు సంబంధించి సాయం పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఖరీఫ్ సీజన్లోనే రూ.6,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రెండు సీజన్లకు కలిపి పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు బ్యాంకు ఖాతా తప్పనిసరి పెట్టుబడి పథకం కింద రైతులకు ‘ఆర్డర్ చెక్కులు’జారీ చేయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేసే ఈ ఆర్డర్ చెక్కులను ఏ బ్యాంకులోనైనా, ఏ బ్రాంచీలోనైనా నగదుగా మార్చుకోవడానికి వీలుంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే సంబంధిత రైతుకు ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా ఉండాలి. చెక్కును క్లియర్ చేసేటప్పుడు బ్యాంకులు సదరు రైతుకు ఖాతా ఉందో లేదో పరిశీలిస్తాయి. సంబంధిత రైతే ‘పెట్టుబడి’చెక్కును క్లియర్ చేసుకుంటున్నాడో లేదో గమనించడానికి.. దుర్వినియోగం కాకుండా నియంత్రించడానికి ఈ నిబంధన పెట్టినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రైతులెవరికైనా బ్యాంకు ఖాతా లేకుంటే వెంటనే తెరవాలని సూచిస్తున్నాయి. -
డిజిటల్ వెంకన్న!
సాక్షి, తిరుమల: భక్తకోటి కోర్కెలు తీర్చే కోనేటిరాయుని ఆభరణాలు, వస్తువుల విలువ అమూల్యం. ఆ దేవదేవుడికి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో కానుకల రూపంలో సమర్పించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు 4,143 ఎకరాలున్నాయి. డిజిటలైజ్ చేయటం ద్వారా ఈ ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలని టీటీడీ సంకల్పించింది. శ్రీవారికి భక్తుల నుంచి నిత్యం నగదు, కానుకలు, ఆభరణాల రూపంలో సుమారు రూ.3 కోట్లపైబడి అందుతున్నాయి. వీటితోపాటు భూములు, భవనాలు, ఇతర ఆస్తులు కూడా సమర్పిస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఇలా ప్రస్తుతం తిరుమల వెంకన్నకు 4,143 ఎకరాలు భూములు, ఆస్తులు సమకూరాయి. 2009లో హైకోర్టు ఆదేశాలతో స్వామివారి ఆస్తుల జాబితాను టీటీడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. పలుచోట్ల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం తిరుమల శ్రీవారికి ఏపీ, తెలంగాణా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలతోపాటు నేపాల్లోనూ ఆస్తులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 88% ఆస్తులు, ఉత్తరాదిన 11%, నేపాల్‌లో 1 శాతం ఆస్తులున్నాయి. ఇందులో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నట్టు విమర్శలున్నాయి. మరికొన్ని ఆస్తులు లీజు పద్ధతిలో ఉన్నా అద్దెలు సక్రమంగా వసూలు కావటం లేదు. మరికొన్ని ఆస్తులు టీటీడీ ఖాతాలో ఉన్నప్పటికీ కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక పలు చోట్ల స్వామివారి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నట్టు విమర్శలున్నాయి. డిజిటల్ ద్వారా ఆస్తులకు భద్రత డిజిటలైజ్ చేయటం ద్వారా లక్షల కోట్ల విలువైన శ్రీవారి ఆస్తులకు రక్షణ కల్పించాలని ధార్మిక సంస్థ టీటీడీ నిర్ణయించింది. స్వామి సొత్తు సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా సంపూర్ణంగా డిజిటల్ చేసి పర్యవేక్షించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. 2018 మార్చి నాటికి ఆస్తుల డేటాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. దీంతో దేవస్థానం రెవెన్యూ, ఐటీ విభాగాలు స్వామి ఆస్తులను డిజిటల్ చేయటంలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డులతోపాటు శ్రీవారికి ఉన్న స్థిర, చరాస్తుల ఫొటోల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రకియ పూర్తైతే భవిష్యత్‌లో స్వామివారి ఆస్తుల రక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. -
ఇక సర్టిఫికెట్ల డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి మొదలుకొని పీహెచ్డీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నుంచి పీహెచ్డీ వరకు మెమోలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్ టీఎస్), టీసీఎస్ వంటి సంస్థల ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 30న సంబంధిత శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల మంది పదో తరగతి, 2.5 లక్షల మంది ఇంటర్, 5 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సులు, మరో లక్ష మంది వరకు పోస్టు గ్రాడ్యుయేషన్, ఎం.ఫిల్, పీహెచ్డీ వంటి కోర్సులు పూర్తి చేస్తున్నారు. కానీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఐదారేళ్ల సమాచారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అయితే యూని వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సమాచారం డిజిటలైజ్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టడం, ఎవరికి వారు తమకు తోచిన ఫార్మాట్లో సర్టిఫికెట్ల డిజిటలైజ్ చేయడంతో ఉపయోగం ఉండదని అధికారులు పేర్కొనడంతో ఓ నిర్ణీత ఫార్మాట్లో సర్టిఫికెట్ల డిజిలైజేషన్ చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. డిజిటలైజేషన్‌తో నకిలీ సర్టిఫికెట్లను పూర్తిగా నిరోధించవచ్చని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సులభమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
చందనసీమకు డిజిటల్ సొబగులు
సాక్షి, బెంగళూరు: చందనసీమకు డిజిటల్ సొబగులను అద్దేందుకు కర్ణాటక చలనచిత్ర అకాడమీ (కేసీఏ) సన్నద్ధమైంది. శాండల్‌వుడ్‌లో ఎనభై ఏళ్లుగా విడుదలైన వాటి నుండి 1,500కు పైగా సినిమాలను డిజిటలైజ్ చేసేందుకు కేసీఏ ప్రణాళికలు రచిస్తోంది. డిజిటలైజేషన్ ద్వారా వాటిని రీస్టోర్ చేసే ప్రక్రియను కేసీఏ చేపడుతుండటం గమనార్హం. ఇక ఈ ప్రక్రియకు గాను దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేసీఏ అంచనా వేస్తోంది. అపురూప చిత్రాలను భద్రపరచాలని.... కన్నడ సినీ పరిశ్రమలో గత ఎనభై ఏళ్లలో అనేక అపురూప చిత్రాలు ప్రజల ముందుకు వచ్చాయి. వీటిలో చాలా సినిమాలకు నెగిటివ్‌లు కూడా లభించని పరిస్థితి. కన్నడ సినీ పరిశ్రమలో మొదటి టాకీ అయిన సతీ సులోచన సినిమా నెగిటివ్స్ కూడా ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. సతీ సులోచన, భక్త ధృవ వంటి సినిమాలు ఫోటోల్లో మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇక కన్నడ సినిమాకు అద్భుత చిత్రాలను అందజేసిన విఠలాచార్య, కెంపరాజ అరస్, బి.ఎస్.రంగ, హుణసూరు క్రిష్ణమూర్తి, ఆర్.నాగేంద్ర రావ్ వంటి దర్శకులు తీసిన అనేక క్లాసిక్స్ సినిమాల నెగిటివ్స్ కూడా లభించని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నడ సినీ పరిశ్రమలోని చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరచాలని కేసీఏ నిర్ణయించింది. దాదాపు ఆరు కోట్ల వ్యయంతో..... ఇక ఈ ప్రక్రియను బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) ఇచ్చే ఆర్థిక సహాయంతో కేసీఏ చేపట్టనుంది. 1,500 సినిమాలను డిజిటలైజ్ చేసేందుకు రూ.6 కోట్ల వరకు వ్యయమవుతుందని కేసీఏ అంచనా వేస్తోంది. ఇందులో రూ.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విడుదల చేయగా, బీడీఏ మరో కోటి విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియను కేసీఏ ప్రారంభించింది. ఇక ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ రెండు విడతలుగా సాగనుంది. మొదటగా ఆయా సినిమాలకు సంబంధించిన పత్రాలన్నింటిని డిజిటలైజ్ చేస్తారు. అనంతరం సినిమాకు సంబంధించిన నెగిటివ్ ను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతం చాలా వరకు సినిమాల ఫిల్మ్ సంబంధిత ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు బాదామీ హౌస్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ సాగనుంది. చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి... ఇక శాండల్‌వుడ్‌కు చెందిన క్లాసిక్స్‌ను భద్రపరిచేందుకు గాను అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని కేసీఏ చైర్మన్ ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు వెల్లడించారు. ‘ఈ కార్యక్రమానికి సహాయం అందజేసేందుకు కొన్ని ప్రముఖ ఫిల్మ్ ల్యాబొరేటరీలు ముందుకొచ్చాయి. ఇందులో ఏ ఫిల్మ్ ల్యాబొరేటరీకి ఈ బాధ్యతలు అప్పగించాలన్న విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ నిర్ణయించనుంది. ఇప్పుడు కనుక ఈ సినిమాలను భద్రపరచలేక పోతే ఆ తరువాత కన్నడ సినిమా గురించి భావితరాలకు తెలియజెప్పేందుకు ఎలాంటి ఆధారం ఉండదు’ అని రాజేంద్ర సింగ్ బాబు పేర్కొన్నారు. -
డిజిటలైజేషన్ దిశగా గ్రంథాలయాలు
అనంతపురం కల్చరల్ : రాష్ట్రంలో తొలిసారి ’అనంత’ కేంద్రంగా డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకోనుంది. తాడిపత్రి, హిందూపురం తదితర చోట్ల కూ డా డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ముమ్మురంగా పనులు సాగుతున్నాయి. అన్ని గ్రేడ్1, గ్రేడ్2 శాఖా గ్రంథాలయాలకు కూడా ఇటీవల ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ప్రాచీన గ్రంథాల నుం చి నేటి ప్రచురణల వరకూ కంప్యూటరీకరణ చేపడుతున్నారు. ఆర్డీటీ వారి సహాయ సహకారాలతో దాదాపు రూ. 90 లక్షల వ్యయంతో ఆసే్ట్రలియా దేశం తరహాలో డిజిటలైజేష¯ŒS లైబ్రరీ నిర్మిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 69 శాఖా గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 70 పుస్తక నిక్షిప్త కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో సోమవారం నుంచి 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా చరిత్ర ఘనం.. పప్పూరు రామాచార్యుల వంటి ఉద్దండులు సాగించిన గ్రంథాలయ ఉద్యమం కారణంగా జిల్లా కేంద్రంలో 1952 ఏప్రిల్ 2న గ్రంథాలయం ఏర్పాౖటెంది. 1958లో రాయదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, గుత్తి పట్టణాల్లో శాఖా గ్రం థాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ కేంద్రాల్లో దాదాపు 4 లక్షల 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. గత ఏడాది 14,875,12 మంది గ్రంథాలయాలకు హాజరయ్యారని సమాచారం. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు వచ్చినందున సుమారు 20 లక్షల మంది లైబ్రరీలను సద్వినియోగం చేసకున్నారని అధికారులు చెపుతున్నారు. సమస్యలతో సతమతం అనేక గ్రంథాలయాల్లో సౌకర్యాలు లేక పాఠ కులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు లైబ్రరీల్లో టాయ్‌లెట్స్, తారునీటి సదుపాయం లేదు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించక పోవడంతో వసతుల లేమి కనపడుతోంది. సిబ్బందికి 010 కింద జీ తా లు రావాలని, తమకు ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని చాలా కాలంగా గ్రంథాలయ ఉద్యోగ సంఘాలు పో రాటం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని మహిళా లైబ్రరీ ప్రాంగణంలో నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. 36 గ్రంథాలయాలకు సొంత భవనాలుండగా, మరో 25 ఉచిత భవనాల్లో, 9 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. స్థలాలున్నా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. -
పాలసీల డిజిటలైజ్ అవసరం
బీమా కంపెనీలను కోరిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ: ఇతర రూపాలతో నిమిత్తం లేకుండా పాలసీదారులకు సంబంధించిన అన్ని పాలసీలను, క్లెయిమ్స్‌ను ఎలక్ట్రానిక్(డిజిటలైజ్) రూపంలో నిక్షిప్తం చేయాలని ఐఆర్ డీఏ బీమా కంపెనీలకు సూచించింది. ఈ విధంగా డిజిటలైజ్ చేసిన పాలసీదారుల సమాచారానికి వైరస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు తదితర వాటి నుంచి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని తెలిపింది. డిజిటలైజ్ చేసిన పాలసీల, క్లెయిమ్స్ సమాచారాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు సులభంగా తెలుసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. ఈ నిబంధనలతో రూపొందిన నోటిఫికేషన్ విడుదలైన 90 రోజుల్లోగా పాలసీదారుల సమాచారాన్ని డిజి టలైజ్ చేసే ప్రక్రియకు బీమా కంపెనీలు వాటి బోర్డుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.