డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందు కోసం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నియమకాలు చేపట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.
గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లియోనార్డో లివ్‌షిట్జ్ ఈరోజు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. సంస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇరువరు చర్చించారు. త్వరలోనే ఆఫీసు ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి మంది వర్క్‌ఫోర్స్‌తో పనులు నిర్వహిస్తామని గ్రిడ్ డైనమిక్స్ తెలిపింది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో గ్రిడ్ డైనమిక్స్ సంస్థ డిజటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో పని చేస్తోంది.
Hyderabad continues to be the hotbed for Multinational Companies!! Met with Leonard Livschitz, CEO @GridDynamics a digital transformation company with offices across the US & Europe
— KTR (@KTRTRS) May 9, 2022
GRID DYNAMICS opens its first presence in India with headcount to reach 1,000 by end of the year pic.twitter.com/UdopmoLf0X
చదవండి: Cryptocurrency: క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్..
Comments
Please login to add a commentAdd a comment