జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్‌ఎఫ్ సంస్థ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. నానక్‌రామ్‌గూడలో ఉన్న జెడ్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ 2022 జూన్ 1న ప్రారంభం కాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సుమారు రూ. 322 కోట్ల వ్యయంతో ఈ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్మించారు. దాదాపు 3000ల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ అయిన జెడ్‌ఎఫ్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 100 ఫెసిటీ సెంటర్లు ఉండగా 18 డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పింది. జెడ్‌ఎఫ్ రాక తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి ఊపునిస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
#HappeningHyderabad
— KTR (@KTRTRS) May 27, 2022
A testimony for Hyderabad in the growing Mobility space. ZF, a German automotive major, announces it's expansion plan in Hyderabad with 3,000 employees and will be a big part of the Telangana Mobility Valley!! pic.twitter.com/sgnuc5KqiE
Comments
Please login to add a commentAdd a comment