Auto mobile sector
-
అయిదేళ్లలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో విడిభాగాల పరిశ్రమ తదనుగుణంగా సామరŠాధ్యలను పెంచుకోవడంపై, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో 6.5 –7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదీ ఇదే ధోరణి కొనసాగవచ్చని, రెండంకెల స్థాయిలో అమ్మకాలు ఉండగలవని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పండుగ సీజన్లో వివిధ సెగ్మెంట్లలో గణనీయంగా అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మెరుగ్గా రాణించగలదని ఆశాభావంతో ఉన్నాము‘ అని ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. దేశ, విదేశ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా సామర్ధ్యాలను పెంచుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గత అయిదేళ్లలో సుమారు 3.5–4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేయగా.. రాబోయే అయిదేళ్లలో 6.5–7 బిలియన్ డాలర్లు వెచి్చంచనున్నట్లు వివరించారు. 875 పైచిలుకు సంస్థలకు ఏసీఎంఏలో సభ్యత్వం ఉంది. సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో వీటికి 90 శాతం పైగా వాటా ఉంటుంది. స్థిరంగా ఎగుమతులు.. వాహన విక్రయాలు, ఎగుమతులు స్థిరమైన పనితీరు కనపరుస్తున్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా తెలిపారు. వాహన పరిశ్రమలోని అన్ని సెగ్మెంట్లకు ఆటో విడిభాగాల సరఫరా నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 3.6 శాతం పెరిగి 10.6 బిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉండగా, యూరప్ (27 శాతం), ఉత్తర అమెరికా (9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ తోడ్పాటుతో దేశీయంగా తయారీని పెంచేందుకు పరిశ్రమ గట్టిగా కృషి చేస్తోందని మెహతా వివరించారు. మార్వా, మెహతా చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఎగుమతులకు సంబంధించి చెరి 33 శాతం వాటాతో ఉత్తర అమెరికా, యూరప్ అతి పెద్ద మార్కెట్లుగా కొనసాగాయి. ► ఇదే వ్యవధిలో దేశీయంగా ఉత్పాదనల తయారీ సంస్థలకు (ఓఈఎం) విడిభాగాల అమ్మకాలు 13.9 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరాయి. ► భారీ, శక్తిమంతమైన వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం .. ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరు వృద్ధికి దోహదపడుతోంది. ఆఫ్టర్‌మార్కెట్ సెగ్మెంట్ 7.5 శాతం పెరిగి రూ. 45,158 కోట్లకు చేరింది. ► ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్ వృద్ధి కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి ఈవీల విడిభాగాల విక్రయాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పెరిగింది. -
ఫిబ్రవరిలో 3.35 లక్షల వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు బలమైన డిమాండ్ కొనసాగడంతో ఫిబ్రవరిలో 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆటో మొబైల్ రంగంలో ఇప్పటి వరకు ఫిబ్రవరిలో నమోదైన అత్యధిక టోకు అమ్మకాలు రికార్డు ఇవే కావడం విశేషం. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ ఎంఅండ్ఎం, కియా మోటార్స్, టయోటో కిర్లోస్కర్ కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు పెరిగాయి. బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) టీవీఎస్ మోటార్ అమ్మకాలు నిరాశపరిచాయి. వాణిజ్య వాహనాలకు గిరాకీ లభించింది. -
ఆటోమొబైల్ రంగంపై పన్ను తగ్గించాలి
ఆటోమొబైల్ రంగంపై పన్నులను వచ్చే పదేళ్ల కాలంలో దశలవారీగా సగానికి తగ్గించాలని ఈ రంగంలో నిపుణులు కోరుతున్నారు.. అప్పుడు భారత ఆటోమొబైల్ రంగం అంతర్జాతీయంగా మరింత పోటీ పడగలదని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నది వారి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పన్ను రేటును ఒకేసారి గణనీయంగా తగ్గించడాన్ని సర్దుబాటు చేసుకోలేదన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ నిపుణులు ఈ సూచన చేశారు. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటాను పరిగణనలోకి తీసుకుని, దశలవారీగా సెస్సును తగ్గించే కార్యాచరణ ప్రణాళిక అవసరమని వారు పేర్కొంటున్నారు. ‘‘ఆటో పరిశ్రమపై పన్నుల భారం అధికంగా ఉంది. కారు తయారీ నుంచి విక్రయించే ధర మధ్య చూస్తే.. చాలా సందర్భాల్లో ఇది ఎక్స్‌షోరూమ్ ధరపై 30–50 శాతం మధ్య (జీఎస్టీ, ఇతర పన్నులు కూడా కలుపుకుని) అధికంగా ఉంటోంది. తయారీ వ్యయం, నాణ్యత పరంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ పోటీనిచ్చే సత్తా కలిగి ఉంది. అందుకునే నిర్ణీత కాలంలో పన్నులు తగ్గించే ప్రణాళిక అవసరం’’అని ఒక పారిశ్రామిక వేత్త పేర్కొన్నారు. కార్ల తయారీలో భాగంగా ఉండే.. స్టీల్, క్యాస్ట్ ఐరన్ తయారీ నుంచి ముడి సరుకులు, డీలర్‌షిప్‌ల వరకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ రేటు అమలవుతోంది. వాహనాన్ని బట్టి 1–22 శాతం మధ్య అదనంగా సెస్సు కూడా పడుతోంది. ఇక పూర్తిగా విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లపై 60–100 శాతం మేర సుంకం అమల్లో ఉంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
కొత్త వెర్షన్లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన 'ఐ10' మోడల్ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్‌లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అప్డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
ఆటోమొబైల్ హబ్‌గానూ ఎదుగుతాం
మణికొండ: ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలోనూ హబ్‌గా మారుతుందనే నమ్మకం తనకు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి్ద శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా నిలుస్తోందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో ఉందని చెప్పారు. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందిన అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సోమవారం నార్సింగి మున్సిపాలిటీ కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోపార్ట్స్కు సాఫ్ట్‌వేర్‌ను అందించే అతిపెద్ద సంస్థ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు రావడం గర్వకారణమన్నారు. నేటి ఆధునిక యుగంలో ఆటోమొబైల్ అంటే నాలుగు చక్రాలపై కదిలే కంప్యూటరేనని... ప్రస్తుతం తయారవుతున్న వాహనాల్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్వేర్లు ఉంటున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగానికి సం బంధించిన అన్ని అవసరాలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రతిపాదిత ‘మొబిలిటీ వ్యాలీ’ కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకన్నా భిన్నంగా అనేక రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుండటంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇలాంటి సంస్థలు వస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. గత కొంతకాలంగా కరోనా వ్యాప్తి సంస్థలను కుంగదీసినా ప్రస్తుతం కంపెనీలన్నీ కుదుటపడి తిరిగి వ్యాపార విస్తరణ బాట పడుతున్నాయన్నారు. త్వరలోనే పెట్టుబడిదారులను ఆకర్షించేలా పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తామన్నారు. దేశంలో జీసీసీ ఏర్పాటు వ్యూహాత్మకం... దేశంలో నైపుణ్య శక్తిని అందిపుచ్చుకుంటూ సంక్లిష్ట ప్రక్రియలు, వినూత్న కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు జీసీసీ ఏర్పాటు ఓ వ్యూహాత్మక చర్య అని అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ టామ్ గ్రీకో పేర్కొన్నారు. కోకాపేటలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో మొదటి విడతగా 430 మంది ఉద్యోగులు, 150 భాగస్వామ్య వనరుల సామర్ద్యం, 65 వేల చదరపు గజాల కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామన్నారు. స్థానికంగా ఉత్తమ ప్రతిభను ఆకర్షించాలని తమ సంస్థ చూస్తుందని, తమ కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని సంస్థ ఎండీ మహేందర్ దుబ్బా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
Hyderabad Mobility Valley: ప్రారంభానికి సిద్ధంగా జెడ్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్
జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. నానక్‌రామ్‌గూడలో ఉన్న జెడ్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ 2022 జూన్ 1న ప్రారంభం కాబోతున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సుమారు రూ. 322 కోట్ల వ్యయంతో ఈ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్మించారు. దాదాపు 3000ల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ అయిన జెడ్ఎఫ్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 100 ఫెసిటీ సెంటర్లు ఉండగా 18 డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పింది. జెడ్ఎఫ్ రాక తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి ఊపునిస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. #HappeningHyderabad A testimony for Hyderabad in the growing Mobility space. ZF, a German automotive major, announces it's expansion plan in Hyderabad with 3,000 employees and will be a big part of the Telangana Mobility Valley!! pic.twitter.com/sgnuc5KqiE — KTR (@KTRTRS) May 27, 2022 చదవండి: Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు -
ఆర్డర్లు ఉన్నాయి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్సెట్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు తమ దగ్గరున్న ఆఖరి కార్లను కూడా అమ్మేశాయి. చిప్ సెట్ల కొరత కారణంగా కొత్త కార్లు తయారు చేయడం గగనంగా మారింది. దేశీయంగా మహీంద్రా మొదలు ఇంటర్నేషనల్ లెవల్లో మెర్సిడెజ్ బెంజ్ వరకు అన్ని సంస్థలు ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని తాజా ట్వీట్ ద్వారా తెలిపారు ఆనంద్ మహీంద్రా. మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ హెడ్ మార్టిన్ ష్వెంక్ ఇటీవల మాట్లాడుతూ.. తమ దగ్గరున్న చివరి కారును కూడా అమ్మేశామని, ఇప్పటికిప్పుడు తమకు ఐదు వేల కార్లకు ఆర్డర్ రెడీగా ఉందని తెలిపారు. అయితే ఈ కార్లు తయారు చేసేందుకు అవసరమైన చిప్సెట్లు మాత్రం సరిపడా అందుబాటులో లేవన్నారు. దీంతో మెర్సిడెజ్ బెంజ్‌లో కొత్త కారు కావాలంటే కనీసం రెండు నెలల నుంచి రెండేళ వరకు ఎదురు చూడక తప్పడం లేదంటూ స్పష్టం చేశారు. This is what I was referring to in my last tweet… It’s a problem for all car manufacturers.. https://t.co/8bd29HnrbB — anand mahindra (@anandmahindra) May 17, 2022 చదవండి: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్ -
మహీంద్రా సంచలన నిర్ణయం.. ఆటోమొబైల్ సెక్టార్లో తొలిసారిగా..
సంప్రదాయేతర రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్లో అతివల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇప్పటికే ఓలా స్కూటర్ల తయారీలో మహిళల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూపు సేల్స్ విభాగంలో మహిళలకు ప్రోత్సహిస్తోంది. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో ఇటీవల నేషనల్ క్యాపిటర్ రీజియన్ ఢిల్లీలో కొత్తగా వాహనాల అమ్మకం షోరూం ఏర్పాటు చేశారు. అయితే గతానికి భిన్నంగా స్వీపర్ మొదలు మేనేజర్ వరకు ప్రతీ ఒక్క పోస్టులో మహిళలనే నియమించారు. దేశంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తొలిసారిగా మొత్తం మహిళా సిబ్బందితో నడుస్తున్న షోరూమ్‌గా ఇది నిలిచింది. ఈ విషయాన్ని ఆ గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకున్నారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా మొత్తం సమాజమే అభివృద్ధి బాట పడుతుందంటూ మహీంద్రా రైజ్ స్లోగన్‌ను జత చేశారు. Thank you @KonceptautoLN for giving me the required dose of #MondayMotivation ! https://t.co/pWoAyffj2n — anand mahindra (@anandmahindra) May 16, 2022 చదవండి: మహీంద్రా ఆన్ ది మూవ్ -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్..కేంద్రం సంచలన నిర్ణయం!
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఉండే బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. “మేం సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తాం. నిర్దిష్ట టెంపరేచర్ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి (ఉదాహరణకు లిథియం అయాన్ బ్యాటరీలోని ఎలక్ట్రోలేడ్ ద్రావణం) ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారంటూ వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక పేర్కొంది. మరోవైపు కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..ప్రస్తుతం ఆయా ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్లో ఈవీ వెహికల్స్ ఉన్న డిమాండ్‌ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. ఒకవేళ కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తే..కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి..ఉత్పత్తి అనుకున్నంతగా చేయలేవని నిపుణులు అంటున్నారు. 30 రోజుల్లో ఆరు వెహికల్స్ దగ్ధం దేశ వ్యాప్తంగా గత ముప్పై రోజుల్లో దాదాపు అర డజను ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతైనట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్‌లో కంటైనర్‌లో లోడ్ చేసిన జితేంద్ర న్యూ ఈవీ టెక్కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. నో రీకాల్..కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్ధమవ్వడంపై..ప్రభుత్వం ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించడంపై కేంద్రం ఆలోచించడం లేదని, బదులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలపై నిజ నిర్ధారణ పరిశోధనల రిపోర్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గిరిధర్ అరమనే ఏం చెప్పారు అంతకుముందు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలపై..కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు. చదవండి: టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా! -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, 'ఆడీ' కి షాక్!
కోల్‌కతా: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా గతేడాది దేశవ్యాప్తంగా 3,293 యూనిట్లను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 101 శాతం వృద్ధి అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ‘లగ్జరీ కార్ల విపణిలో తొలి స్థానంపై గురి పెట్టడం లేదు. సుస్థిర వ్యాపార విధానం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అయిదు ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో పరిచయం చేశాం. 2025 నాటికి అంతర్జాతీయంగా మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఈవీ విభాగం ఉండాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం నాలుగు ఇంటర్నల్ కంబషన్ (ఐసీ) కార్ల తయారీని భారత్‌లో చేపడుతున్నాం. 2033 నాటికి ఐసీ కార్ల విక్రయాలు నిలిపివేస్తాం. 2026 నుంచి నూతన తరం మోడళ్లన్నీ ఎలక్ట్రిక్ మాత్రమే ఉంటాయి. ఉక్రెయిన్ నుంచి చాలా విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నందున సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది’ అని వివరించారు. డీజిల్ కార్ల అమ్మకాలను 2020 ఏప్రిల్ నుంచి కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం పెట్రోల్, ఈవీ మోడళ్లు మాత్రమే విక్రయిస్తోంది. లగ్జరీ కార్ల రంగంలో దేశంలో మూడవ స్థానంలో కంపెనీ నిలిచింది. -
దుమ్ము లేపిన అమ్మకాలు.. పదిహేనేళ్ల రికార్డు బద్ధలయ్యేనా?
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ ఎంతగా పెరుగుతుందో దేశం మొత్తం చూస్తోంది. గత రెండేళ్లలో అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ అదీ టూ వీలర్స్ అమ్మకాలు 1,00,736 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే డబుల్ అయ్యిందన్నమాట. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?.. ఈవీ మార్కెట్ అంచనా వేస్తున్నట్లు పదిహేనేళ్ల రికార్డు.. ఈ ఒక్క ఏడాదిలోనే బద్ధలు కానుందా? సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022)లో ఏకంగా 10 లక్షలకు యూనిట్ల మేర అమ్ముడు పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అంటే గత 15 ఏళ్లలో అమ్ముడైన వాటికి ఇది సమానమన్నమాట. ఇది సాధమ్యేనా? అవుననే అంటోంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఎంఈవీ). ఈ మేరకు పలు అంచనాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కొద్ది నెలలుగా ఈవీలకు మంచి రోజులు చూస్తున్నాం. గత 15 ఏళ్లలో మేము మొత్తం 10 లక్షల ఈ2డబ్ల్యూలు, ఈ–త్రీ వీలర్లు, ఈ–కార్లు, ఈ–బస్సులు విక్రయించాం. అయితే, 2022 జనవరితో మొదలుపెట్టి ఈ ఒక్క ఏడాదే దాదాపు అదే స్థాయిలో 10 లక్షల వాహనాలను విక్రయించే అవకాశాలు ఉన్నాయి‘ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెబుతున్నారు. సానుకూలంగా ఈవీ విధానం.. ఎలక్ట్రిక్ వాహన విధానంలో ప్రభుత్వం ఇటీవల సానుకూల మార్పులు చేసిందని గిల్ పేర్కొన్నారు. ఖరీదైన ద్రవ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన రవాణా విధానాల అమలుకు కేంద్రం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరలు, తక్కువ ఇంధన వ్యయాలు, చౌకగా నిర్వహణ తదితర అంశాల కారణంగా కస్టమర్లు పెద్ద సంఖ్యలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడం ప్రారంభమైందని గిల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఎంచుకోవడంలో పర్యావరణపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. ఇటీవలి నెలవారీ ధోరణులు చూస్తుంటే .. గడిచిన పన్నెండు నెలలతో పోల్చి చూస్తే వచ్చే 12 నెలల్లో విక్రయాల వృద్ధి అయిదు నుంచి ఆరు రెట్లు అధికంగా ఉండొచ్చని గిల్ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు–మూడేళ్లలో దేశీయంగా ఈ–స్కూటర్లు, ఈ–మోటర్‌సైకిళ్లు, ఈ–సైకిళ్లు వంటి అన్ని విభాగాల్లో.. పెద్ద కంపెనీల నుంచి కూడా ఉత్పత్తులు ఉండగలవని ఆయన తెలిపారు. ‘వచ్చే నాలుగైదు ఏళ్లలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో 30 శాతం దాకా వాటా ఎలక్ట్రిక్ వాహనాలది ఉంటుందని ధీమాగా చెప్పవచ్చు‘ అని గిల్ వివరించారు. హై–స్పీడ్ వాహనాలకే ఓటు.. ఎస్ఎంఈవీ గణాంకాల ప్రకారం.. గంటకు 25 కి.మీ.కు మించిన వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరమయ్యే హై–స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) అమ్మకాలు 2021లో 425% వృద్ధితో 1,42,829 యూనిట్లకు చేరాయి. 2020లో వీటి సంఖ్య 27,206 యూనిట్లే. ఇక గంటకు 25 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరం ఉండని లో–స్పీడ్ ఈ2డబ్ల్యూల అమ్మకాలు కేవలం 24% వృద్ధి చెంది 73,529 యూనిట్ల నుంచి 91,142 యూనిట్లకు పెరిగాయి. వాస్తవానికి వీటి అమ్మకాలు 2021 ఆఖరు రెండు త్రైమాసికాల్లో గణనీయంగా తగ్గాయి. జే సంగ్ టెక్‌తో ఒమెగా సైకి మొబిలిటీ జట్టు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒమెగా సైకి మొబిలిటీ (ఓఎస్ఎం) తాజాగా కొరియాకు చెందిన విద్యుత్ వాహనాల పవర్‌ట్రెయిన్ దిగ్గజం జే సంగ్ టెక్‌తో చేతులు కలిపింది. భారత్‌లో ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లు తయారు చేయనుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఓఎస్ఎం జే సంగ్ టెక్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి. స్థానిక అవసరాలకు తగినట్లుగా పవర్ట్రెయిన్లను తయారు చేయడంలో జే సంగ్ సాంకేతికతను, ఒమేగా తయారీ సామర్థ్యాలను ఈ సంస్థ వినియోగించుకుంటుంది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఓఎస్ఎంకి చెందిన కార్గో ఈ–త్రీ–వీలర్ రేజ్ప్లస్కు అవసరమయ్యే ఆర్ఏ314 పవర్‌ట్రెయిన్‌ను మొదటి ఉత్పత్తిగా జాయింట్ వెంచర్ సంస్థ ఆవిష్కరిస్తుంది. హరియా ణాలోని ఫరీదాబాద్ ప్లాంటులోనూ, పుణెలోని గ్రూప్ కంపెనీ ఒమేగా బ్రైట్ స్టీల్ అండ్ కాంపొనెట్స్ ప్లాంటులోను కొత్త ఆర్ఏ314ని ఓఎస్ఎం తయారు చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌ను దేశీ డ్రైవింగ్ పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం వల్ల చిన్న స్థాయి నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల కోసం కూడా ఆర్ఏ314లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని ఓఎస్ఎం ఎండీ దేవ్ ముఖర్జీ తెలిపారు. -
షాకిచ్చిన టాటా మోటార్స్.. కార్ల ధరల పెంపు
TATA Motors Increase Prices On All Vehicles: కొత్త సంవత్సరంలో కొత్తకారు కొనాలనుకుంటున్న వాళ్లకు టాటా మోటార్స్ షాకిచ్చింది. ఈ వాహన తయారీ సంస్థ అన్ని ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను జనవరి 1వ తేదీ నుంచి పెంచుతోంది. దీంతో టాటా మోటార్స్ కార్లు ఖరీదు కానున్నాయి. అయితే ఎంత శాతం సవరిస్తున్నదనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర తెలిపారు. మరోవైపు కమర్షియల్ వెహికల్స్ ధరలను సైతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఈమధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ, మధ్య, తేలిక వాహనాలతో పాటు చిన్నస్థాయి వాణిజ్య వాహనాలు, బస్సులకు ఈ పెంపు వర్తించనుందని తెలిపింది. ఇక ఈ కమర్షియల్ వాహనాలపై 2.5 శాతం పెంపు జనవరి 1, 2022 నుంచి అమలుకానుంది. డుకాటీ సైతం కాగా, లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటీ సైతం వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ‘ఇక్కడి మార్కెట్లో అత్యంత పోటీతత్వంతో వాహనాల ధరలను ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. ముడి సరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ధరలను మార్చవలసి వస్తోంది’ అని వివరించింది. ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకి కార్ల ధరలను పెంచుతున్నట్టు హఠాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హోండా, రెనాల్ట్ కంపెనీలు కూడా ధరలను ధరల పెంపును సమీక్షించే యోచనలో ఉండగా.. అడీ కంపెనీ ఏకంగా 3 శాతం పెంచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది,. కానీ, కార్ల తయారీలో కీలకమైన స్టీలు, రోడియం మెటీరియల్‌ల ధరలు బాగా పెరగడం, దీనికి తోడు సెమికండర్ల కొరత సైతం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఈ కారణాలతో ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెప్తున్నాయి. కార్ల రేట్లు రయ్.. రయ్! -
వాహన రిటైల్ అమ్మకాలు డౌన్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత నెలలో వాహన రిటైల్ అమ్మకాలు 18,17,600 యూనిట్లు నమోదయ్యాయి. 2020 నవంబర్‌తో పోలిస్తే ఇది 2.7 శాతం తగ్గుదల అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 19.44 శాతం పడిపోయి 2,40,234 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 14.44 లక్షల నుంచి 14.33 లక్షల యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 50,180 నుంచి 45,629 యూనిట్లకు దిగొచ్చాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు పెరిగాయి’ అని పేర్కొంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కొనసాగినప్పటికీ నెగెటివ్ జోన్లోనే ఆటో రిటైల్ రంగం కొనసాగిందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారీ వర్షాలు దక్షిణ రాష్ట్రాల్లో తగ్గుదల కారణాలని పేర్కొన్నారాయన. -
అంచనాలకు దిగువన వాహన అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహన రంగంలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–18 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. పరిశ్రమ 18–22 శాతం వృద్ధి సాధిస్తుందని గతంలో అంచనా వేసినట్టు వివరించింది. ‘సెమికండక్టర్ల కొరత తాజా అంచనాల సవరణకు కారణం. వీటి కొరత వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ఆగస్ట్, సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరు ఉత్పత్తిలో మెరుగుదల ఉంటుందని కొన్ని భారతీయ తయారీదార్లు భావించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చిప్స్‌కు డిమాండ్ పెరగడం, కొత్త సామర్థ్యాలను ఏర్పాటు చేయడానికి ఆలస్యం అవుతున్నందున సరఫరా పరిమితం అవుతుంది. క్రిసిల్ సైతం.. ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి అంచనాలను 16–17 నుంచి 11–13 శాతానికి సవరిస్తున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. ఉత్పత్తి అడ్డంకుల కారణంగా వాహనం కోసం వేచి ఉండే కాలం పెరుగుతున్నందున పరిశ్రమ పునరుద్ధరణను ఆలస్యం చేస్తోందని వివరించింది. మొత్తం పరిశ్రమలో 71 శాతం వాటా కైవసం చేసుకున్న మూడు కంపెనీలను ఆధారంగా చేసుకుని విశ్లేషించినట్టు తెలిపింది. సెమి కండక్టర్ల కొరతతో తయారీ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయని, కొన్ని మోడళ్ల కోసం వేచి ఉండే కాలం 2–3 నెలల నుంచి ప్రస్తుతం 6–9 నెలలకు చేరిందని వివరించింది. మహమ్మారి కారణంగా వ్యక్తిగత వాహనాలకు అంచనాలను మించి డిమాండ్ ఏర్పడింది. చైనా కంపెనీలు చిప్‌లను నిల్వ చేసుకోవడం, వాహన తయారీ సంస్థలు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం సమస్యకు కారణం అని క్రిసిల్ తెలిపింది. -
బ్రేక్ ఇన్ ఇండియా
వినాయక చవితి అందరిలో ఉత్సాహం నింపి, తీపిని పంచితే, ఆ కార్ల తయారీ కర్మాగార కార్మికులకు మాత్రం చేదువార్త తెచ్చింది. చెన్నై శివార్లలో కళకళలాడుతూ కనిపించే ‘ఫోర్డ్’ కార్ల తయారీ కర్మాగారం ఇప్పుడిక మూగబోనుంది. వందల మంది వీధినపడనున్నారు. గుజరాత్లో అహ్మదాబాద్ సమీపంలోని ఫోర్డ్ కర్మాగారంలోనూ అదే పరిస్థితి. పాతికేళ్ళ పాటు భారత్‌లో కార్యకలాపాలు సాగించి, కార్ల తయారీ కర్మాగారాలు రెండు నెలకొల్పి, వందల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టిన అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్ మోటార్స్’ నష్టాలే తప్ప లాభాలు వచ్చే పరిస్థితి లేదని గ్రహించి, భారత్‌లో కార్ల తయారీకి స్వస్తి పలుకుతోంది. కొన్నేళ్ళ క్రితం జనరల్ మోటార్స్ (జీఎం), ఇటీవల హార్లే డేవిడ్సన్, ఇప్పుడు ఫోర్డ్ మోటార్స్ నష్టాల కారణంగా భారత్ నుంచి నిష్క్రమణ బాట పట్టడం గమనార్హం. ప్రపంచంలోకెల్లా అయిదో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెటైన భారత్‌లో ఇలా ప్రసిద్ధ అమెరికన్ కంపెనీలు రాణించలేక చతికిలబడడం ఒక రకంగా విచిత్రం. అనేక విధాలుగా విషాదం. ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి అనూహ్యంగా పడుతున్న బ్రేకులకు నిదర్శనం. దేశంలో నెలకొన్న వ్యాపార వాతావరణానికి నిలువుటద్దం. గత పదేళ్ళలో భారత్‌లో దాదాపు 200 కోట్ల డాలర్ల మేర ఫోర్డ్ నష్టపోయింది. నిర్వహణ కారణాల వల్లనే ఆ సంస్థ నిష్క్రమిస్తోందనీ, దేశంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్‌కు ఇదేమీ దెబ్బ కాదనీ సర్కారు ఉవాచ. కానీ, దీని వెనుక గమనించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ సాగించినా, ఫోర్డ్ మన మార్కెట్లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. మదుపు పెట్టిన ప్రపంచ శ్రేణి సంస్థలకు దేశంలోని అతి షరతులు, అధిక పన్నులతో నమ్మకమే పోతోంది. అవి విసిగిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ ఫోర్డ్ నిష్క్రమణ. ఇది ఒక వర్గం విశ్లేషకుల మాట. మరో వర్గం మాత్రం భారత్‌లో సరైన కార్లను తీసుకురాలేని ఫోర్డ్ అప్రయోజకత్వం వల్లే ఈ దుఃస్థితి దాపురించిందని వాదిస్తోంది. ఈ రెండు వాదనల్లోనూ ఎంతో కొంత నిజం ఉంది. భారత్‌లో కార్ల తయారీ, విక్రయంలోకి దిగిన ఫోర్డ్ సంస్థ అనేక పొరపాట్లు చేసింది. భారత వినియోగదారుల నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయింది. భారత మార్కెట్లో ప్రధానభాగం చిన్న కార్లదే. ఆ విభాగాల్లో ఫోర్డ్ అందిస్తున్న కార్లు పరిమితమే. మారుతి, హ్యుండయ్ల వైవిధ్యంతో ఫోర్డ్ పోటీపడలేకపోయింది. అయితే, భారతీయ మార్కెట్‌ను వదిలిపెట్టకుండా, మహీంద్రా సంస్థతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకోవాలనీ ఆ మధ్య ప్రయత్నించింది. అది ఆచరణ సాధ్యం కాలేదు. మరోపక్క అనేక ఇతర ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ సంస్థల లానే ఫోర్డ్ సైతం చిక్కుల్లో పడింది. తగినంత సరఫరాలు లేక అమెరికాలోనే గిరాకీకి తగినంత ఉత్పత్తి చేయలేని పరిస్థితి. మూడేళ్ళుగా భారత ఆర్థికవ్యవస్థ మందకొడిగా ఉంది. ఆటోమొబైల్ మార్కెట్లో మునుపటి జోరూ తగ్గింది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది. ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని బ్రెజిల్లో లాగానే ఇక్కడా ఫోర్డ్ ఇంటిదారి పడుతోంది. దేశంలో పెట్టుబడి పెట్టిన అంతర్జాతీయ సంస్థల మనుగడకు అవసరమైన కనీస ప్రయోజనాలను గద్దెనెక్కిన ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. వేసే పన్నుల్లో తేడాలతో సహా మార్కెట్ మొత్తం చిన్నకార్లకే అనుకూలంగా మార్చేశాయి. కార్ల వినియోగదారుల, ఉత్పత్తిదారుల సంగతి మన విధాననిర్ణేతలు ఎందుకనో పట్టించుకోనే లేదు. దాంతో, మార్కెట్లో 70 శాతం రెండే రెండు సంస్థల చేతిలో ఉంటే, మిగిలిన వాటా కోసం పదికి పైగా సంస్థలు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారంగా మారిన పెట్రోల్ ధరలు, ఉద్గారాలపై ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పదే పదే మార్పులు, కరోనాతో మూలిగే నక్కపై తాటిపండు పడింది. భారత్‌లో కార్ల తయారీని ఫోర్డ్ ఆపేయడం వల్ల దాని కర్మాగారాల్లో పని చేసే నాలుగన్నర వేల మంది దాకా ఉద్యోగులే కాక, ఆ తయారీపై ఆధారపడ్డ అనేక అనుబంధ వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గం వీధిన పడక తప్పదు. ఆర్థికవ్యవస్థ అస్తుబిస్తుగా ఉన్న వేళ ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల నష్టంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరూ తప్పదు. గ్యాసోలిన్ వాహనాలపై సర్కారు వారి అధిక పన్నుభారం సైతం విదేశీ సంస్థల భాగస్వామ్యానికి పెను సమస్య. ఇప్పుడిక, టెలికామ్ లానే, ఆటోమొబైల్ రంగంలో కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ తగినది కాదనే ముద్ర పడిపోతుంది. ప్రభుత్వ విధానలోపాలతో ఈ రెండు రంగాలూ ఏవో రెండు సంస్థలకే పట్టం కట్టే ‘ద్విధాధిపత్యా’నికి చోటిచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) లేకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులు – ఇలా అనేక కారణాల వల్ల కనీసం ఆటో, ఆటో అనుబంధ తయారీ కేంద్రంగానైనా భారత్ అవతరించ లేకపోయింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారిపొమ్మంటున్న కేంద్ర వైఖరి వల్ల కార్ల తయారీ సంస్థలకు మరింత సంక్షోభం తప్పదు. అయితే, రేపు ఎలక్ట్రిక్ వాహనాల శకం వచ్చినా ఇటు బ్యాటరీలు, అటు చిప్‌ల తయారీదార్లను దేశంలోకి ఆకర్షించలేకపోతే, దేశ ఆర్థికానికి ఒరిగేదేమీ లేదు. నిజానికి, 1990లు, 2000ల కాలంలో మన దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డ కొద్ది రంగాల్లో ఆటోమొబైల్ రంగం ఒకటి. అందులోనే ఇప్పుడు ఆకర్షణను పోగొట్టుకుంటే, లోపం మన విధానాల్లోనూ ఉన్నట్టేగా! -
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బిగ్ బూస్ట్ ! పీఎల్ఐకి ఒకే చెప్పిన కేంద్రం
Production-Linked Incentive scheme: కరోనా కాటుకు తోడు చిప్సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. పీఎం అధ్యక్షతన సమావేశం వివిధ రంగాలకు ఉత్పత్తి అధారిత ప్రోత్సహకాలు అందించేందుకు కేంద్ర కేబినేట్ ప్రధానీ మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెక్నాలజీలో మార్పులు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ వస్తుందని కేబినేట్ అభిప్రాయపడింది. పీఎల్ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. కేబినేట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు - డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు. - పీఎల్ఐ వల్ల భారత్‌లో తయారీ సామర్థ్యం పెరుగుతుంది. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బలపడే అవకాశం - పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీలో భారత్‌ను ముందువరుసలో నిలబెడుతుంది - ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పీఎల్ఐ బిగ్ బూస్ట్‌లా మారుతుంది - మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొత్తగా 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది - అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ వాటా కేవలం 2 శాతంగా ఉందని, తాజా నిర్ణయంతో అది పెరుగుతుంది. - టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం - ఏజీఆర్ బకాయిలకు సంబంధించి నాలుగేళ్ల పాటు టెల్కోలకు మారటోరియం విధించింది. చదవండి : ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇన్ఫోసిస్.. నేడు ఆఖరు! -
టీవీఎస్ లాజిస్టిక్స్‌లో కోటక్ పెట్టుబడి
ముంబై: ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ కుటుంబ కంపెనీలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టీవీఎస్ కుటుంబం ప్రమోట్ చేసిన థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్(3పీఎల్)లో అనుబంధ సంస్థ కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు దిగుతోంది. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా టీఎస్ రాజమ్ రబ్బర్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు రూ. 800 కోట్ల రుణ సౌకర్యాలను కలి్పంచింది. ఇందుకు మార్పిడిరహిత డిబెంచర్ల మార్గాన్ని కోటక్ స్పెషల్ ఎంచుకుంది. ఈ రుణం సహాయంతో టీవీఎస్ సప్లై చైన్‌లో కెనడియన్ పెన్షన్ ఫండ్కుగల వాటాను టీవీఎస్ ఎస్సీఎస్ ప్రమోటర్ ఆర్.దినేష్ సొంతం చేసుకోనున్నారు. తద్వారా టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ కుటుంబ వాటా బలపడనుంది. కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్.. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విభాగంలో రిజస్టరైంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు) పెట్టుబడులను నిర్వహిస్తోంది. -
ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన
చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. ప్రతికూల పరిస్థితులు కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి. తప్పనిసరి చేస్తాం చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు. అయోమయంలో కంపెనీలు ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం -
భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్‌లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
ఆన్లైన్లో ఆటోమొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో షోరూమ్‌లు మూతబడిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాల కోసం కొంగొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బాట పడుతున్నాయి. డీలర్ల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా సేల్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా సోమవారం వెల్లడించింది. ’హోండా ఫ్రమ్ హోమ్’ పేరిట ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టినట్లు వివరించింది. దీనితో దేశంలో ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని హోండా కార్స్ తెలిపింది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిలకు కూడా అనుసంధానం చేయనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ కూడా ఇటీవలే క్లిక్ టు బై పేరిట ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కూడా జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కూడా భారత్‌లో ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఇంటి నుంచే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్ ఎంపిక చేసుకుని, బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా సేల్స్, సరీ్వస్ పోర్ట్‌ఫోలియోను డిజిటలీకరణ చేసినట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం ‘కాంటాక్ట్‌లెస్ ఎక్స్పీరియన్స్’ పేరిట ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కొత్త, ప్రీ–ఓన్డ్ బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయొచ్చని, సరీ్వస్ బుక్ చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే చెల్లింపులు జరపవచ్చని సంస్థ భారత విభాగం తాత్కాలిక ప్రెసిడెంట్ అర్లిండో టెక్సీరా తెలిపారు. ఇక మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా ’మెర్క్ ఫ్రం హోమ్’ పేరిట ఆన్లైన్ సేల్స్ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు వెల్లడించింది. -
కుప్పకూలిన ఆటోమొబైల్ రంగం
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): కరోనా వైరస్ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపివేసింది. తీరని నష్టాన్ని మిగిల్సింది. ఎన్నడు లేని విధంగా దెబ్బతీసింది.ఇక కోలుకోలేని పరిస్ధితి తెచ్చిపెట్టింది. ఇక ఇక్కడకు నిత్యం వచ్చే సుమారు 80వేల మంది వివిధ రంగాల్లో పనిచేసే రోజువారి కార్మికులతో పాటు నెలవారి కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా ఏడు రోజుల నుంచి లబోదిబోమంటున్నారు. కనీసం బయటకూడా అప్పు పుట్టక నానా తంటాలు పడుతున్నారు. ఇక ప్రభుత్వమే ఆదుకోవాలంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఎలా బ్రతకాలో అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇక్కడ 300లకు పైగా చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. దిక్కుతోచని స్ధితిలో పరిశ్రమల యజమానులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పటికి కరోనా వైరస్ బారినుంచి బయట పడతామని కానరాని దేవుని వైపు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆసియా ఖండంలో నెంబర్‌వన్! ఆటోమొబైల్ రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఆటోనగర్ మొదటి స్ధానం సంపాదించుకుంది. 1966లో విజయవాడలోని అప్పటికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అప్పట్లో శంకుస్ధాపన చేశారు. అప్పటి నుంచి మొన్నటి వరకు దినదినాభివృద్ధి చెందుతోంది. ఎంతో మందికి ఉపాధిగా మారంది. ఇక్కడ సుమారుగా 500 లకు పైగా లారీ బాడీబిల్డింగ్ షెడ్లు ఉన్నాయి. స్టెయిన్లెస్స్టీల్, అల్యూమినియం కంపెనీలు 100పైగాఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలతో పాటు పుడ్ ఇండస్ట్రీలు 20కి పైగా ఉన్నాయి. కాంక్రీట్ మిక్చర్లు తయారీలు సమారుగా 50కి పైగా ఉన్నాయి. ఇవికాకుండా మెకానిక్ షెడ్లు 2000 ఉన్నాయి. అంతే కాకుండా రీబటన్ టైర్ల తయారుచేసేవి సుమారుగా 100కు పైగా ఉన్నాయి. డిస్పోజల్ లారీ విడిభాగాలు సంబంధించి సుమారు 200 పైగా ఉన్నాయి. ఎక్కడా దొరకని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి.వివిధ రాష్ట్రాల నుంచి ఆటోనగర్‌కు వస్తుంటారు. ఇవి కాకుండా లారీలు సుమారు 5000 వేలకు పైగా ఉంటాయి. కార్పెంటర్లు, పెయింటర్స్, స్టిక్కరింగ్ తో పాటు పలు రంగాలకు చెందిన అసంఘటిత కార్మికులు కూడా అధికంగానే ఉంటారు. ఇంత పెద్ద రంగం గత ఏడు రోజుల నుంచి మూతపడటంతో ఇక్కడి కార్మికులతోపాటు పరిశ్రమల యజమానులు ఇది కోలుకోని దెబ్బ అని తీవ్ర స్ధాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోలుకోలేని దెబ్బ కరోనా వైరస్ కారణంగా కోలుకోని దెబ్బ తగిలింది. చరిత్రలో ఎప్పుడు చవిచూడలేదు. ఇంకా అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్ధితి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. – ప్రసాద్, అల్యూమినియం కంపెనీ యజమాని, ఆటోనగర్ నష్టం అంచనా వేయలేం.. కరోనా వైరస్ మాజీవితాల్లో చీకటి నింపింది. అసలే నష్టాల్లో ఉంటే... కరోనా జీవితంలో కోలుకోని విధంగా ఆటోమొబైల్ రంగాన్ని దెబ్బతీసింది. దిక్కుతోచని పరిస్ధితిలో కొట్టుమిట్టులాడుతున్నాం. ఏమి చేయాలో తెలియక తలపట్టుకొని జీవిస్తున్నాం. –గంధం వెంకటేశ్వరరావు, మెకానిక్ ఆటోనగర్ -
దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తరలిపోతున్నాయంటూ కొంతమంది దురుద్దేశంతో పనిగట్టుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఆటో ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అలాగే గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ఆటోమోటార్ షో–2020ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కియా మోటార్స్ తమిళనాడుకు వెళుతోందనే వార్త అవాస్తవమని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా చెప్పారన్నారు. అంతేకాకుండా తరలింపు వార్తను ఖండిస్తూ కియా మోటార్స్ ఎండీ కూడా ప్రకటన ఇచ్చారని గుర్తు చేశారు. కియా ఫ్యాక్టరీ రెండో మోడల్‌ను కూడా మార్కెట్లోకి తెస్తోందని, జూన్ లేదా జూలైలో మూడో మోడల్‌ను కూడా అందుబాటులోకి తేనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆ సంస్థ గట్టి నమ్మకంతో ఉందని తెలిపారు. అలాగే కొన్ని ఐటీ సంస్థలకు తాము నోటీసులు ఇచ్చినట్టు, దీంతో అవి వేరే నగరాలకు వెళ్లిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. కియా మోటార్స్ తరలిపోతోందని చంద్రబాబు అంటున్నారని, ఎందుకు వెళ్లిపోతోందో, ఎక్కడికి వెళ్లిపోతోందో ఆయన వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఆటోమొబైల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్పో–2020 సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు ఏపీని ఎంచుకుంటామని హామీ ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా సీఈవో వెంకటరామ మామిలపల్లె తెలిపారు. ఫోర్స్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక సహకారమందిస్తామని అమితాబ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగం మందగమనంలో ప్రయాణిస్తోంది. ప్యాసింజర్ వాహన అమ్మకా లు నవంబర్లోనూ అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. కొత్త మోడళ్లు విడుదలైనా ఆశించిన స్థాయిలో అమ్మకాలు పుంజుకోలేకపోయాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో భారీ క్షీణత కొనసాగగా.. మారుతీ సుజుకీ అమ్మకాల్లో స్వల్పంగా 1.6% తగ్గుదల నమోదైంది. హ్యుందాయ్ మాత్రం 2% వృద్ధిని నమోదుచేసింది. ఈ సారి కూడా క్షీణత ఉన్నప్పటికీ.. అంతక్రితం నెలలతో పోల్చితే ఆటో రంగం కాస్త గాడిన పడిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు.