న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత నెలలో వాహన రిటైల్ అమ్మకాలు 18,17,600 యూనిట్లు నమోదయ్యాయి. 2020 నవంబర్‌తో పోలిస్తే ఇది 2.7 శాతం తగ్గుదల అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది.
‘ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 19.44 శాతం పడిపోయి 2,40,234 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 14.44 లక్షల నుంచి 14.33 లక్షల యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 50,180 నుంచి 45,629 యూనిట్లకు దిగొచ్చాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు పెరిగాయి’ అని పేర్కొంది.
దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కొనసాగినప్పటికీ నెగెటివ్ జోన్‌లోనే ఆటో రిటైల్ రంగం కొనసాగిందని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారీ వర్షాలు దక్షిణ రాష్ట్రాల్లో తగ్గుదల కారణాలని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment