Retail Sales
-
భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) అమ్మకాలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏడు నెలల కాలంలో ఒక మిలియన్ యూనిట్ల విక్రయాల మార్కును చేరుకోవడం విశేషం. 2024 జనవరి–జూలైలో దేశవ్యాప్తంగా 10,75,060 ఈవీలు రోడ్డెక్కాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైతో ముగిసిన ఏడు నెలల్లో ఈ–టూ వీలర్స్ 29 శాతం దూసుకెళ్లి 6,34,770 యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్స్ 26 శాతం ఎగసి 3,77,439 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ (కార్, ఎస్యూవీ, ఎంపీవీ) రిటైల్ అమ్మకాలు 21 శాతం అధికమై 56,207 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ–కమర్షియల్ వెహికిల్స్ ఏకంగా 190 శాతం వృద్ధి చెంది 6,308 యూనిట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 2,13,036 ఎలక్ట్రిక్ వెహికిల్స్ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. జూలైలో 1,78,948 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది 2 మిలియన్లపైనే.. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2024లో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు 20 లక్షల యూనిట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోందని పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. 2023లో ఈవీల విక్రయాలు దేశవ్యాప్తంగా 50 శాతం వృద్ధితో 15.3 లక్షల యూనిట్లను నమోదు చేశాయి. 2022లో ఈ సంఖ్య 10.2 లక్షల యూనిట్లు మాత్రమే. మొత్తం వాహన రంగంలో ఎలక్ట్రిక్ విభాగం 2023లో 6.38 శాతానికి చేరింది. 2021లో ఇది 1.75 శాతమే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఈ– టూ వీలర్స్, ఈ– త్రీ వీలర్స్ వాటా ఏకంగా 95 శాతంపైమాటే. ఇక ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (ఈఎంపీఎస్) 2024 సెపె్టంబర్ వరకు పొడిగించింది. వాస్తవానికి ఈఎంపీఎస్ సబ్సిడీ పథకం జూలై 31న ముగియాల్సి ఉంది. మౌలిక వసతులు ‘చార్జింగ్’.. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల మార్కెట్ దేశంలో ఊహించనంతగా వృద్ధి చెందుతోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2022 ఫిబ్రవరిలో 1,800 ఉంది. 2024 మార్చి నాటికి ఈ సంఖ్య ఏకంగా 16,347కు చేరిందని ప్రొఫెషనల్ సరీ్వసుల్లో ఉన్న ఫోరి్వస్ మజర్స్ నివేదిక వెల్లడించింది. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, అధికం అవుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఈవీల డిమాండ్ దేశంలో దూసుకెళుతోంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లోని మొత్తం ప్రయాణికుల వాహనాల మార్కెట్లో దాదాపు మూడింట ఒక వంతు ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బలమైన మౌలిక సదుపాయాల విస్తరణ కీలకం. 2030 నాటికి భారత రోడ్లపై 5 కోట్ల ఈవీలు పరుగెడతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. 40 వాహనాలకు ఒక కేంద్రం చొప్పున లెక్కిస్తే ఏటా భారత్‌లో 4,00,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఫోరి్వస్ మజర్స్ తెలిపింది. -
టాప్‌గేర్‌లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్‌లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్‌తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్‌యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్‌లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
ఆటో పరిశ్రమకు టూవీలర్ల బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రిటైల్‌లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్‌లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి. అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది. త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం. నవరాత్రి కొత్త రికార్డు.. 2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్‌లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్‌యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. విభిన్న పరిస్థితులు.. స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్‌ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్‌ని పెంచుతున్నాయని ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్‌లను పెంచవచ్చు. అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
సేల్స్ పెరిగాయ్..ఏ వాహనాలు ఎన్ని అమ్ముడు పోయాయంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా జూన్ నెలలో అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్ విక్రయాలు 18,63,868 యూనిట్లు నమోదయ్యాయి. 2022 జూన్‌తో పోలిస్తే ఇది 10 శాతం అధికం అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2023 మే నెలతో పోలిస్తే జూన్ అమ్మకాలు 8 శాతం క్షీణించడం గమనార్హం. ‘జూన్ మాసంలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 5 శాతం ఎగసి 2,95,299 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 7 శాతం పెరిగి 13,10,186 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 75 శాతం దూసుకెళ్లి 86,511 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 45 శాతం అధికమై 98,660 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. మే నెలతో పోలిస్తే జూన్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు 12 శాతం క్షీణించాయి. అలాగే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 56 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గించడమే ఈ క్షీణతకు కారణం. -
జోరు తగ్గిన వెహికల్ సేల్స్ - కారణం ఇదే అంటున్న ఫాడా..!
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌లో నాలుగు శాతం తగ్గినట్లు భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో మొత్తం 17,24,935 వాహనాలు విక్రయంగా.., గతేడాదిలో ఇదే నెలలో 17,97,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన, ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌లో నీరసించాయి. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 7%, ప్యాసింజర్ వాహనాలు ఒకశాతం పడిపోయినట్లు ఫాడా తెలిపింది. ‘‘ఉద్గార ప్రమాణ నిబంధనలతో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగనన్న వాహనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు మార్చిలోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టారు. అలాగే అధిక బేస్ ఎఫెక్ట్ ఒక కారణంగా నిలిచింది. వెరసి గడిచిన ఎనిమిది నెలల్లో తొలిసారి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి క్షీణత నమోదైంది’’ ఫాడా తెలిపింది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీ పెరిగాయి. మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే త్రీ–వీలర్స్, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. త్రీ–వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్ విక్రయాలు ఒక శాతం, వాణిజ్య వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ‘‘ గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించింది. ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉంది. ఈ విభాగంపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుంది’’ అని సింఘానియా అన్నారు. -
రిటైల్ విక్రయాల్లోకి సుగ్న స్టీల్స్
హైదరాబాద్: చిన్న నిర్మాణాలకు కూడా ఫ్యాక్టరీ ధరలకే స్టీల్‌ను అందించే ఉద్దేశంతో సుగ్న మెటల్స్ సంస్థ రిటైల్ విక్రయాల్లోకి ప్రవేశించింది. రోహిత్ స్టీల్స్‌తో కలిసి హైదరాబాద్‌లో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 8 ఎం.ఎం. మొదలుకుని 32 ఎంఎం వరకు వివిధ ఉక్కు ఉత్పత్తులను ఎన్ని టన్నులైనా ఈ స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చని సుగ్నా చైర్మన్ భరత్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సహా దక్షిణాదిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు టీఎంటీ స్టీల్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పరిగిలోని తమ సొంత ప్లాంటులో రోజుకు 1,300 టన్నుల ఉక్కును ఉత్పత్తి కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ నితిన్ జైన్ తెలిపారు. తమ ఉత్పత్తుల రిటైల్, హోల్‌సేల్ పంపిణీ కోసం ఎక్స్‌క్లూజివ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా రోహిత్ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
నవంబర్‌లో ఊపందుకున్న రిటైల్ విక్రయాలు
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో మెరుగైన వృద్ధిని చూపించాయి. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 నవంబర్ నెలలోని గణంకాలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఒకవేళ 2020 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే వృద్ధి 16 శాతంగా ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ భారతంలో 11 శాతంగా ఉంటే, తూర్పు, దక్షిణాదిన 9 శాతం చొప్పున, ఉత్తరాదిన 6 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదైనట్టు వివరించింది. వ్యాపార వాతావరణం మెరుగైందని.. ఇది నిలదొక్కుకుంటుందని భావిస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్, కరోనా మూడో దశకు సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు నవంబర్‌లో 32 శాతం వృద్ధిని చూపించినట్టు రాయ్ తెలిపింది. క్రీడా ఉత్పత్తులు 18 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అలాగే, ఆహారం, గ్రోసరీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగంలోనూ వృద్ధి నమోదు కాగా.. పాదరక్షలు, సౌందర్య, విలాస ఉత్పత్తులు, ఫర్నిచర్ విభాగాలు కోలుకుంట్నుట్టు వివరించింది. -
వాహన రిటైల్ అమ్మకాలు డౌన్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత నెలలో వాహన రిటైల్ అమ్మకాలు 18,17,600 యూనిట్లు నమోదయ్యాయి. 2020 నవంబర్‌తో పోలిస్తే ఇది 2.7 శాతం తగ్గుదల అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 19.44 శాతం పడిపోయి 2,40,234 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 14.44 లక్షల నుంచి 14.33 లక్షల యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 50,180 నుంచి 45,629 యూనిట్లకు దిగొచ్చాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు పెరిగాయి’ అని పేర్కొంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కొనసాగినప్పటికీ నెగెటివ్ జోన్లోనే ఆటో రిటైల్ రంగం కొనసాగిందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారీ వర్షాలు దక్షిణ రాష్ట్రాల్లో తగ్గుదల కారణాలని పేర్కొన్నారాయన. -
గాడిలో పడ్డ వ్యాపారం
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగ్గా ఉన్నట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. కరోనా ముందు నాటి విక్రయాల్లో 96 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. 2020 సెపె్టంబర్లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 2021 సెపె్టంబర్లో 26 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దక్షిణాది 33 శాతం వృద్ధితో ముందుండగా.. తూర్పు భారత్‌లో 30 శాతం, పశి్చమ భారత్‌లో 26 శాతం చొప్పున అమ్మకాలు పుంజుకున్నాయి. ఉత్తరాదిలోనూ 16 శాతం అధికంగా అమ్మకాలు జరిటినట్టు తెలిపింది. వినియోగదారు సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని రాయ్ పేర్కొంది. ‘‘కన్జ్యూమర్ డ్యురబుల్స్, ఎల్రక్టానిక్స్, ఆహారం, గ్రోసరీ, క్విక్ సరీ్వస్ రెస్టారెంట్లు కరోనా ముందు నాటి స్థాయికి పూర్తిగా కోలుకున్నాయి. క్రీడా ఉత్పత్తులు, వ్రస్తాలు కూడా గణనీయంగా పుంజుకున్నాయి. సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు (సెలూన్, పాదరక్షలు, ఆభరణాలు) ఇంకా కరోనా ముందస్తు నాటికి చేరుకోవాల్సి ఉంది’’అని రాయ్ తెలిపింది. -
రిటైల్ అమ్మకాలు పుంజుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్ అమ్మకాలు మరింత బలంగా ఉన్నట్టు వివరించింది. కరోనా ముందు నాటితో పోలిస్తే 82 శాతానికి పుంజుకున్నాయని తెలిపింది. పశ్చిమభారతావనిలో విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందంటూ.. జూలైలో 57 శాతానికి చేరినట్టు వివరించింది. మహారాష్ట్రలో లాక్డౌన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. వేగంగా సేవలు అందించే రెస్టారెంట్ల వ్యాపారం (క్యూఎస్ఆర్) ఈ ఏడాది జూలైలో కరోనా ముందు నాటితో పోలిస్తే 97 శాతానికి చేరుకున్నట్టు రాయ్ తెలిపింది. ఆధునిక రిటైల్ వ్యాపారంపై ఆంక్షలను తొలగించి, సాఫీ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నందున రానున్న పండుగల సీజన్లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ వివరించారు. -
యూఎస్- రిటైల్ సేల్స్ జోష్
గత నెల(మే)లో రిటైల్ అమ్మకాలు దుమ్ము రేపడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. డోజోన్స్ 527 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 26,290 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 58 పాయింట్లు(2 శాతం) ఎగసి 3125 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 170 పాయింట్లు(1.8 శాతం) పురోగమించి 9,896 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. మే నెలలో రిటైల్ సేల్స్ దాదాపు 18 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిపుణులు 8 శాతం వృద్ధిని అంచనా వేశారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల ప్యాకేజీకితోడు.. కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అదనపు నిధుల ద్వారా కార్పొరేట్లకు అండగా నిలవనుండటంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశారు. జర్మన్ పుష్ ఆస్త్మా, ఆర్ధరైటిస్ తదితరాల చికిత్సకు వినియోగించే ఔషధం కోవిడ్-19 కట్టడికి కొంతమేర పనిచేస్తున్నట్ల యూకేలో వెల్లడికావడంతో మంగళవారం యూరోపియన్ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. అంతేకాకుండా జర్మన్ ఎకానమీ త్వరలో పుంజుకోనున్నట్లు ఒక సర్వే పేర్కొనడంతో ఫ్రాన్స్, యూకే, జర్మనీ 3-3.5 శాతం మధ్య ఎగశాయి. అయితే భారత్, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. సహాయక ప్యాకేజీని తాజాగా బ్యాంక్ ఆఫ్ జపాన్ 700 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు నిర్ణయించింది.. ఎలీ లిల్లీ జోరు రిటైల్ అమ్మకాలు ఊపందుకోవడంతో రిటైల్ దిగ్గజాలు నార్డ్‌స్ట్రామ్ ఇంక్ 13 శాతం, కోల్స్ కార్ప్ 9 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో హోమ్ డిపో ఇంక్ సైతం 3.6 శాతం ఎగసింది. దీంతో డోజోన్స్‌కు బలమొచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో పురోభివృద్ధి సాధించినట్లు వెల్లడికావడంతో ఫార్మా దిగ్గజం ఎలీ లిల్టీ షేరు 16 శాతం దూసుకెళ్లింది. ఐటీ బ్లూచిప్ కంపెనీ ఒరాకిల్ కార్ప్ 2.5 శాతం పుంజుకుంది. వెల్స్‌ఫార్గో ఈ కౌంటర్ టార్గెట్ ధరను పెంచడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. స్ట్రీమింగ్ సంస్థ రోకు ఇంక్ 12.4 శాతం జంప్‌చేసింది. -
ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 2% క్షీణత
న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ విక్రయాలు 2,42,457 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన పీవీ అమ్మకాలతో పోల్చితే 2 శాతం క్షీణత ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 9% తగ్గి 12,85,470 యూనిట్లుగా నమోదుకాగా.. వాణిజ్య వాహనాల సేల్స్ 16 శాతం క్షీణించి 63,360 యూనిట్లుగా నిలిచాయి. గతనెల్లో త్రిచక్ర వాహనాల విక్రయాలు 13% తగ్గి 47,183 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,38,470 యూనిట్లుగా తెలిపింది. గతేడాదిలో నమోదైన 17,86,994 యూనిట్లతో పోల్చితే 8% తగ్గుదల చోటుచేసుకుంది. ఈ అంశంపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘గతేడాది ఏప్రిల్‌లో హైబేస్ కారణంగా ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేశాయి. సమీపకాలంలో సానుకూల అంశాలు లేనందున.. వచ్చే 8–12 వారాల్లో ప్రతికూలతకే అవకాశం ఉంది. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, ఆశాజ నకంగా వర్షాలు పడే అవకాశాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఆదుకోవచ్చు. పేరుకుపోయిన నిల్వలు మాత్రం డీలర్లకు భారమనే చెప్పాలి’ అని అన్నారు. -
11% తగ్గిన పండుగ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ–వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్ అశీష్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల కొరత తీవ్రంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం.. వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు. వాహన విక్రయాలకు ఎన్బీఎఫ్సీలు కీలకమని, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం.., ∙రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా గణిస్తారు. టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఈ సెగ్మెంట్లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన నిల్వలు డీలర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది పండుగల సీజన్లో 23,01,986గా ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది పండుగల సీజన్లో 20,49,391కు పడిపోయాయి. ఇక ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 3,33,456 నుంచి 2,87, 717కు తగ్గాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 18,11,703 నుంచి 13 % తగ్గి 15,83,276కు పడిపోయాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వాహన రిటైల్ అమ్మకాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకూ 1,12,54,305గా ఉన్న వాహన రిటైల్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 7 శాతం పెరిగి 1,19,89,705కు పెరిగాయి. -
గృహోపకరణాలకు ‘ఈజీ’ దారి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందుగా టెలివిజన్. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్. కొన్నాళ్లకు వాషింగ్ మెషీన్. ఒక్కో ఇంట్లో గృహోపకరణాల కొనుగోలు తీరిది. ఇదంతా గతమని చెబుతున్నాయి తయారీ కంపెనీలు. నేటి యువతరం వీటికోసం వేచిచూడడం లేదట. ఇంట్లో అన్ని రకాల ఉపకరణాలూ ఉండాలన్న భావనతో ఒకేసారి కొనేస్తున్నారట. ఇందుకు సులభవాయిదాలు దోహదం చేస్తున్నాయని కంపెనీలు అంటున్నాయి. 24 నెలల వరకు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండడంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికితోడు కస్టమర్లు అప్‌గ్రేడ్ అవడం కలిసొచ్చే అంశమని విక్రేతలు చెబుతున్నారు. సులభంగా కొంటున్నారు.. ఐదేళ్ల కిందటి వరకూ కొనుగోళ్లలో వాయిదాలపై కొనేవాటి వాటా కేవలం 20 శాతమే. ఇప్పుడిది ఏకంగా రెట్టింపయి 40 శాతానికి చేరింది. వడ్డీ లేని సులభ వాయిదాలను సైతం విక్రేతలు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఉపకరణాల ఫీచర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఫీచర్లలో సైతం కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో కస్టమర్లు సహజంగానే అప్లయన్సెస్‌కు ఆకర్షితులవుతారు. ‘‘వినియోగదార్లు గతంలో 25 ఏళ్ల వరకు ఒక వస్తువును అట్టిపెట్టుకునేవారు. ఇప్పుడలా కాదు. 8–9 ఏళ్లు కాగానే మార్చేస్తున్నారు’’ అని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ప్రతి ఉత్పాదనలో ప్రీమియం కోరుకుంటున్నారని చెప్పారు. ఆదాయాలు పెరగటం, కొత్త టెక్నాలజీ కోరుకోవడం కారణంగా కొన్ని సంవత్సరాలు వినియోగించగానే నూతన మోడళ్లకు మారిపోతున్నారని తెలియజేశారు. డిస్కౌంట్లంటే గంతేస్తారు.. జీఎస్టీ తర్వాత ఉపకరణాల ధర 2.5% వరకు మాత్రమే పెరిగింది. ధరలు బాగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో జూన్ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో అమ్మకాలు నమోదయ్యాయి. విక్రేతలు పాత స్టాక్ మీద ఎప్పుడూ ఇచ్చే డిస్కౌంట్ కంటే 30% అధికంగా ఇవ్వడం వల్లే జూన్‌లో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. డిస్కౌంట్లు అనగానే ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల తీరు ఒకేలా ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ డిస్కౌంట్లే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్‌ను నడిపిస్తున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. దీపావళికి తమ స్టోర్లలో ల్యాప్‌టాప్‌లపై 25 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. పండుగల సీజన్లో మూడు రెట్ల అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేశారాయన. దీపావళికి మెరుపులే.. గత నెలలో చివరివారంలో దసరా రావడంతో చాలా మంది గృహోపకరణాల కొనుగోళ్లకు పెద్దగా మొగ్గు చూపలేదు. అయితే ఈ దీపావళికి మాత్రం అమ్మకాల జోరు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా సాగే అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 35 శాతం మేర ఉంటోంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత పండుగల సీజన్లో 30 శాతం వృద్ధి ఉంటుందని కమల్ నంది చెప్పారు. సానుకూల రుతు పవనాలకుతోడు ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులు పెరిగాయి. ఈ కారణాలతో దీపావళి అమ్మకాలు బాగుంటాయని కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. విస్త్రుతి పరంగా చూస్తే భారత్‌లో 22 శాతం ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు 10 శాతం, ఏసీలు 4 శాతం గృహాల్లో ఉన్నాయి. 2017లో దేశవ్యాప్తంగా 1.6 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతాయని ప్యానాసోనిక్ అంచనా వేస్తోంది. ఆఫ్లైన్దే మార్కెట్.. భారత కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ విపణి సుమారు రూ.55,000 కోట్లుంది. ఇందులో ఆన్లైన్ వాటా ప్రస్తుతం 8–10% ఉన్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఇది 5 శాతమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆన్లైన్ వాటా 20% వరకూ ఉన్నట్లు చెబుతున్న పరిశ్రమ వర్గాలు... రానున్న రోజుల్లో భారత్‌లో ఇది 15%కి చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా మైక్రోవేవ్ ఓవెన్ల వంటి చిన్న ఉపకరణాలు ఎక్కువగా ఈ–కామర్స్ వేదికపై అమ్ముడవుతున్నాయి. పెద్ద ఉపకరణాల విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇప్పటికీ కస్టమర్లు స్వయంగా ఉత్పాదనలను స్టోర్లలో పరీక్షించాకే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఆఫ్‌లైన్ విపణిలో ఆధునిక, జాతీయ స్థాయి కంపెనీలు 20 శాతం, ప్రాంతీయ విక్రేతలు 15 శాతం బిజినెస్ చేస్తున్నారు. మిగిలినది వ్యక్తిగత విక్రేతలది. -
అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు... - ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు. - ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది. - షాప్‌కు వెళ్లడం కంటే ఆన్లైన్లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు. - వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు. -
ఆన్లైన్లో వస్తువులకు వారెంటీ ఉండదు
సాక్షి,బెంగళూరు : ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాలా వస్తువులకు వారెంటీ ఉండదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టి సారిస్తే తదుపరి ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చని అన్నారు. ఇక్కడి మల్లేశ్వరంలోని వెస్ట్‌ఎండ్‌జూస్ షాప్‌లో శుక్రవారం ప్రారంభించిన ‘ఆన్లైన్ ధరలోనే రిటైల్ అమ్మకాలు’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధర తక్కువ కావడంతో ఇటీవల చాలా మంది ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే రీటైల్ అమ్మకందారులు ఇచ్చినట్టు వారెంటీ సేవలను ఈ-కామర్స్ కంపెనీలు అం దించడంలో విఫలమవుతున్నాయన్నా రు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టిసారించాలన్నారు. ఈ-కామర్స్ కం పెనీలు వస్తువుల విక్రయం కోసం అనుసరిస్తున్న విధానాలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విక్రయాలకు సంబంధించి మరింత కఠిన నియంత్ర ణ, నిఘాలను ఏర్పాటు చేయడం సబబ ుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. వ్యక్తిగతంగా తాను రీటైల్ దుకాణాల్లోనే వస్తువులను గొనుగోలు చేయడానికి ఇష్టపడుతానని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సావేజ్ అహ్మద్, పలువురు సా ్థనిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆషాఢం జోష్
టోకు ధరకే రిటైల్ అమ్మకాలు ఆసక్తి చూపుతున్న నగర ప్రజలు కిటకిటలాడుతున్న షాపింగ్‌మాల్స్ విశాఖపట్నం : నగరంలో ఆషాఢం సందడి కనిపిస్తోంది. షాపింగ్ మాళ్లు ఆషాఢం సేల్ పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొనుగోలుదారులతో షోరూమ్స్ కళకళలాడుతున్నాయి. కొన్ని షోరూమ్‌లు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. మరికొన్ని ప్లాట్ 50 శాతం రాయితీ ఇస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆశీల్‌మెట్ట, వీఐపీ రోడ్డు, ద్వారకానగర్, దొండపర్తి, అక్కయ్యపాలెం, కంచరపాలెం ప్రాంతంలోని పలు షోరూమ్‌లు పరిమిత రోజులు రాయితీ ప్రకటించగా, జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్, గాజువాక, ఎన్ఏడీ, గోపాలపట్నంలోని షోరూమ్‌లు ఆషాఢమాసం అంతా రాయితీలు ప్రకటించాయి. శ్రావణ మాసంలో సరికొత్త స్టాక్ కోసం క్లియరెన్స్ సేల్పేరుతో మరికొన్ని షాపులు రాయితీల వర్షం కురిపిస్తున్నాయి. టోక్ ధరకే రిటైల్‌గా విక్రయాలు జరుపుతుండటంతో ఇదే మంచి తరుణంగా భావించిన నగరవాసులు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రావణ మాసంలో శుభకార్యాల కోసం ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన వ్యాపారం : ఆషాఢమాసంలో శుభకార్యాలు జరగకపోవడంతో వస్త్ర దుకాణదారులు ఆన్‌సీజన్‌గా భావించేవారు. ఆ సమయంలో వ్యాపారాలు పెంచుకునేందుకు రాయితీ ప్రకటించేవారు. ప్రస్తుతం వస్త్ర దుకాణాలతోపాటు జ్యూయలరీ, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, సెల్ పాయింట్స్ వంటి అన్ని షోరూమ్‌లు ఆషాఢం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుకు డౌన్ పేమెంట్ లేకుండా రుణసదుపాయం కల్పిస్తూ ఆకర్షిస్తున్నారు. జ్యూయలరీ వ్యాపారులు తరుగు, మజూరీలపై రాయితీ ఇస్తున్నారు. దీంతో సాధారణ రోజుల కన్నా 30 శాతం వ్యాపారం పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. జాగ్రత్తలు అవసరం రాయితీలు ఇస్తున్న షాపుల్లో కొనుగోలు చేసే సమయంలో పరిశీలన ఎంతో అవసరం గత ఏడాది అదే షాపుల్లో కొనుగోలు చేసినప్పుడు నాణ్యతలో ఏమైనా తేడా ఉందా.. వేరే షాపుల్లో మనం కొనుగోలు చేసే వస్తువు ధర, రాయితీ ఇస్తున్న షాపులో ఉన్న ధరలతో పోల్చి చూసుకోవాలి ఒకటి కొంటే మరొకటి ఉచితమని ప్రకటించే చోట వాటి నాణ్యతా ప్రమాణాలు బేరీజు వేసుకుని కొనుగోలు చేయాలి. -
నైపుణ్యాలే ఉపాధికి ఊతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత పోటీ యుగంలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు నైపుణ్యాలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా యువతకు వివిధ అంశాల్లో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణనివ్వడంపై దృష్టి సారించినట్లు నాస్డాక్ లిస్టెడ్ సంస్థ హీలియోస్ అండ్ మాథెసన్ నేషనల్ హెడ్ (గవర్నమెంట్ వర్టికల్ విభాగం) మండల రవి తెలిపారు. గత ఏడేళ్లుగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపామని ఆయన వివరించారు. వివరాలు రవి మాటల్లోనే...ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణ.. పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగం), ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణనిస్తున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ వంటి సంస్థలకు కావాల్సిన సిబ్బంది కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టుల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి మరికొన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న పరిశ్రమల జాతీయ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ)తో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అటు, జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ)తోనూ చేతులు కలుపుతున్నాం. అటు ఈగవర్నెన్స్ ప్రాజెక్టులను కూడా దక్కించుకోవడంపై దృష్టి పెట్టాం. మూడేళ్లలో 4 లక్షల మంది టార్గెట్.. 2013-14లో వివిధ రాష్ట్రాల్లో సుమారు 25-30 వేల మందికి శిక్షణ కల్పించాలని భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మొత్తం మీద 3-4 లక్షల మందికి శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నాం. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా కొన్ని యూనివర్సిటీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి ఉన్న వారు మమ్మల్ని సంప్రతించిన పక్షంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఏది వారికి అనువైనదిగా ఉంటుందో పరిశీలించి, శిక్షణ కల్పించే ప్రయత్నం చేస్తాం.